సరి భాగం...(కథ)
సరి భాగం (కథ)
ముగ్గురు కూతుర్లున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాజమౌలికి ముగ్గురు కుమార్తెలు. కష్టపడే సంసారాన్ని ఈదుకు వస్తున్నాడు.పెద్ద కూతుర్లిదరూ పెద్దగా చదువుకోలేదు. అంత కష్టంలోనూ మూడవది, చివరిది అయిన కూతుర్ను డిగ్రీ చదివిస్తున్నాడు. ఉద్యోగం లో ఉన్నప్పుడు పెద్ద కూతురికీ, రిటైర్ అయిన తరువాత రెండో కూతురికీ కష్టలు పడి, అప్పు చేసే పెళ్ళిల్లు చేసేడు. వాళ్ళిద్దరికీ తాను చేయగలిగినంత వరకు మాత్రమే కట్నకానులు ఇచ్చి పెళ్ళి చేశాడు. అప్పులు తీరెంతవరకూ, మూడో కూతురు చదువు పూర్తి అయ్యేంతవరకు, రెండూ మరో రెండేళ్ళల్లో పూర్తి అయిపోతాయి కనుక ఆ తరువాత ఆమె పెళ్ళి గురించి ఆలొచించవచ్చు అనుకున్నాడు.
ఇంతలో అనుకోకుండా మూడో కూతురుకి మంచి సంబంధం వచ్చింది. అయినా కానీ వరుడి దగ్గర, వరుడి కుటుంబీకుల దగ్గర తన ఆర్ధీక పరిస్థితిని వివరించి ఇప్పట్లో పెళ్ళి చేయలేనని చెప్పాడు.
వరుడు మరియు వరుడి కుటుంబీకులూ రాజమౌలి మూడో కూతుర్ని చూసిన తరువాత, ఆమె చదువు గురించి తెలుసుకున్న తరువాత తమకి కట్న కానుకలమీద ఆశలేదని తెలుపుతారు.
మంచి సంబంధం, తానుగా వెతుక్కుంటూ వచ్చి ఏమీ ఎదురు చూడకుండా పెళ్ళికి రెడీ అని చెప్పటం రాజమౌలిని, అతని కుటుంబీకులనూ ఆనందంలో ముంచెత్తింది.
ఆ ఆనందం ఎక్కువ సేపు వాళ్ళను తనతో ఉంచుకోలేదు. కారనం, రాజమౌలి మూడో కూతురు తనకు కాబోయే భర్త మరియు వాళ్ళ కుటుంబీకులు ఎటువంటి కట్న కానుకలూ వద్దని చెప్పినా, తన పెళ్ళికి తండ్రి అక్కయ్యలకు ఇచ్చిన అదే కట్న కానుకలు తన పెళ్ళికీ ఇవ్వాలని, లేకపోతే తాను పెళ్ళి చేసుకోనని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పటంతో రాజమౌలి ఆనందంలో నుండి సోకం లోకి వెళ్ళిపోతాడు.
మరి ఈ పెళ్ళి జరిగిందా? జరగలేదా? జరిగుంటే ఎలా జరిగింది?
తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.
*****************************************************************************************************
ప్రభుత్వ ఆఫీసు
ఉద్యోగం నుండి
రిటైర్ మెంట్
అయిన తరువాత
రాజమౌలి సార్ కు
ప్రశాంతతే పోయింది.
ముప్పై సంవత్సరాలప్పుడు
సులోచనాను పెళ్ళి
చేసుకున్న ఆయనకు
పుట్టింది ముగ్గురూ ఆడపిల్లలే.
పెద్దది పార్వతికి
ఇరవై ఏడేళ్ల
వయసు. ఆమెకు
వరుడుగా వచ్చిన
వాడు యాదగిరి.
రైతు. మూడెకరాల
మాగాణీ, రెండెకరాల
మెట్ట అతనికి
సొంతం. ఇంటికి
ఒకడే కొడుకు.
పార్వతి ఎక్కువగా
చదువుకోలేదు. కానీ
చాలా సాధువు.
రెండో కూతురు
శేషమాంబ కూడా
పదో తరగతి
కంటే ఎక్కువ
చదవటం ఇష్టం
లేకపోవటంతో. లారీ
డ్రైవరు, సొంతంగా
రెండు లారీలూ
ఉన్న పోతరాజు
కు ఆమెను
వివాహం చేసి
ఇచ్చాడు. ఆమెకు
వయసు ఇరవై
నాలుగు. పోతరాజు
తన సొంత
రెండు లారీలలో
ఒకటి తమ్ముడికిచ్చి
తోలుకోమన్నాడు.
రెండు లారీల
సంపాదనతో కుటుంబాన్ని
నడుపుతూ వచ్చాడు.
అందరికంటే చిన్నది
కామాక్షి. వయసు
ఇరవై. ఎం.ఎస్.సి.
చదువుతోంది. కోపిష్టిది.
పట్టుదల మనిషి.
కానీ చదువులో
చాలా గట్టిది.
మొదటి కూతురికి
కట్నకానుకలుగా
ఇరవై కాసుల
బంగారమూ, యాభైవేలు
డబ్బుగా ఇచ్చి
పెళ్ళి జరిపారు
రాజమౌలి. భార్య
యొక్క నగలతోనూ, ఆఫీసు
లోనుతోనూ రెండవ
అమ్మాయి శేషమాంబకు
అదేలాగా
కట్నకానుకలు ఇచ్చి
పెళ్ళి ముగించారు.
అందువలన రాజమౌలికి
అప్పు ఎక్కువ
అయ్యింది.
కామాక్షీ కాలేజీలో
చదువుతున్నా కూడా
ఒకటి, రెండు
చోట్ల నుండి
సంబంధాలు వచ్చాయి.
అమ్మాయి ఫోటోను
చూసి బాగుంది
అని చెప్పినా, కట్నకానుకల
గురించి సంభాషణ
వచ్చినప్పుడు...ఎదురు
చూసినంత దొరకదు
అని తెలిసిన
వెంటనే చెప్పేవారు.
కామాక్షీ
కూడా ఇది
మూడో సంవత్సరం
చదువే కదా...చదువు
పూర్తవని అని
దాటేసింది.
కామాక్షీ చిన్న
వయసులోనే బొమ్మల
దగ్గర నుండి
ప్రతి చిన్న
విషయానికి తన
అక్కయ్యలతో
గొడవపడుతుంది. మొండికేస్తుంది.
కానీ ఆమె
అక్కయ్యలు ఇద్దరూ
చెల్లి కోసం
తమ ఆశలను
వదిలిపెడతారు. తల్లి
సులోచనా చివరి
పిల్ల కదా
అని,
చదువులో దిట్ట
అని బాగా
గారాబం చేయటంతో
ఎప్పుడూ కామాక్షీ
వైపే సపోర్టు
చేస్తుంది. తండ్రి
దాన్ని చూసీ
చూడనట్లు వెళ్ళిపోతారు.
ఒకరోజు రాజమౌలి
ఇంటిముందు ఒక
కారు వచ్చి
నిలబడింది. కారు
శబ్ధం విని
బయటకు వచ్చి
చూసారు రాజమౌలి.
ఐదుగురు కలిగిన
ఒక కుటుంబం
గేటు తీసుకు
వచ్చారు. ముగ్గురు
మగవారూ, ఇద్దరు
ఆడవారు.
వయసులో పెద్దగా
ఉన్న ఒక
మగాయన పెళ్ళి
కొడుకు తండ్రి,
చెప్పారు.
“మీ
చిన్న కూతుర్ని, మా
వాడికి చేసుకోవటానికి
అమ్మాయిని చూసి
వెళ్దామని వచ్చాము” -- రెండు
కుటుంబాలకూ పరిచయమున్న
స్నేహితుడి పేరు
చెప్పి, అతని
ద్వార తెలుసుకున్నామని
చెప్పారు.
అది విన్న వెంటనే వాళ్ళను లోపలకు ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి “క్షమించాలి. మీరిలా సడన్ గా వచ్చినందువల్ల అమ్మాయిని చూడటానికి ఆలస్యం అవుతుంది. మీరు కొంచం కాచుకోనుండాల్సి వస్తుందే! నేను ఇప్పుడే వచ్చేస్తాను” అంటూ భార్య ఉన్న వంట గదిలోకి వేగంగా వెళ్ళారు రాజమౌలి. భార్య సులోచనా దగ్గర వివరం చెప్పి, కాఫీ-ఫలహారం తయారుచేయమని, అమ్మాయిని రెడీ చేయమని చెప్పి, పెళ్ళివారు ఉన్న చోటుకు తిరిగి రావటానికి వెనక్కి తిరిగిన భర్తను “ఏమండీ...ఒక్క నిమిషం” అని చెప్పి ఆపింది.
రాజమౌలి ఏమిటన్నట్టు భార్యను చూసాడు.
“ఏమండీ... కామాక్షీ పెళ్ళికి ఇంకో రెండు సంవత్సరాల
ఆగుదామనుకున్నాం కదా. ఇప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా పెళ్ళి వారు వస్తే మీరేంటి
ఇంత ఉత్సాహంగా ఉన్నారు. పెళ్ళి ఓకే అనుకుంటే, వాళ్ళు
అడిగే కట్నకానుకలకూ, పెళ్ళి ఖర్చులకూ డబ్బుకు ఎక్కడికెళతారు? ఎవరిస్తారు? వద్దండి, అనవసరంగా
అప్పులు చేసి పెళ్ళిచేయకండి. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్ళిచేసే ఐడియా లేదని
చెప్పేయండి. ఎందుకంటే ఇదివరకు పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. ఇప్పుడు అసలు
అప్పు దొరుకుతుందో లేదో. వాళ్ల దగ్గర మనం అవమాన పడటం కంటే, పెళ్ళికి
సిద్దంగా లేమని చెప్పేయండి”
అన్నది.
“చూడు సులోచనా, వచ్చినవాళ్లతో అలా ఒక్కమాట చెప్పి పంపించలేము. అది మర్యాద కూడా కాదూ.
కాబట్టి, అసలు వాళ్ల కోరికలు, మిగిలిన విషయాలు తెలుసుకుని ఆ తరువాత మన
నిర్ణయం వాళ్లకు చెబుదాం”
పెళ్ళికొడుకు దామోదర్
ఇరవై ఎనిమిదేళ్ల
వయసుతో అందంగా
- గంభీరంగా ఉన్నాడు.
ఏం. ఏ. చదివి
ముగించి ఒక
ప్రైవేటు కాలేజీలో
ప్రొఫసర్ గా
ఉద్యోగం చేస్తున్నట్టు, తనతో
తల్లీ, చెల్లి, ఆమె
భర్త వచ్చారని
వాళ్ళను పరిచయం
చేసాడు. అతని
తల్లి చూడటానికి
సాధువుగా, మంచివారుగా
కనబడ్డారు.
పెళ్ళి చూపుల
తతంగం ఆయిన
తరువాత, అబ్బాయికి
అమ్మాయి, అమ్మాయికి
అబ్బాయి నచ్చిపోయింది.
మగ పెళ్ళివారు
వరకట్నం ఎక్కువగా
అడుగుతారేమోననే
ఆదుర్దా రాజమౌలి
ముఖంలో నీడలాగా
కనబడుతోంది. మగపెళ్ళివారు
అది అర్ధం
చేసుకున్న వారిలాగా
“కట్న
కానుకలూ, సారె, రొక్కం
అని మేమేమీ
అడగం. మీ
శక్తికి తగినట్లు
చేస్తే చాలు.
మంచి రోజు
చూసి మీకు
కబురు పంపిస్తాం.
అప్పుడే నిశ్చయం
కూడా చేసుకుందాం” అని
చెప్పి సెలవు
తీసుకున్నారు.
“హమ్మయ్యా...” అనుకున్నాడు
రాజమౌలి.
ఈ సంభాషణను
వింటున్న కామాక్షీ
తన తండ్రితో
“వాళ్ళు
పెద్ద మనసుతో
ఏమీ వద్దని
చెప్పినా కూడా...ఇద్దరు
అక్కయ్యలకూ చేసినట్టు
నాకూ చెయ్యాల్సిందే” అని వాదించటం
మొదలుపెట్టింది.
కూతురు మాట్లాడుతున్నది
వింటూ లోపలకు
వచ్చిన రాజమౌలికి
తనకు తెలియకుండానే
కోపం వచ్చింది.
మగపెళ్ళివారే పెద్ద
మనసుపెట్టి ‘మీరు
చేయగలిగింది చేయండి’ అని
అన్నప్పుడు, తాను
కన్న కూతురే
సమస్యను ప్రారంభించిందే
అని అనుకున్నారు.
అయినా కానీ, కోపాన్ని
అనుచుకుని కూరితో --
"కామాక్షీ!
ఇప్పుడు మీ
నాన్న ఉండే
పరిస్థితికి పెళ్ళిచేసే
ఖర్చులకే అప్పు
చేయాల్సి
ఉంటుంది. అలా
ఉన్నప్పుడు అక్కయ్యలిద్దరికీ
చేసినట్లు నీకు
కూడా చేయాలంటే
ఎలా చేయగలను? వాళ్ళకు
పెళ్ళి జరిగినప్పుడు
బంగారం ధర
చాలా తక్కువ.
అందువల్ల వాళ్లకు
చేయగలిగాను. కానీ
ఇప్పుడు బంగారం
ఉన్న ధరకు
ఇరవై కాసులకు
నేనెక్కడికి పోను? తరువాత
రొక్కం ఇవ్వటానికీ, పెళ్ళి
ఖర్చులకూ కొన్ని
లక్షలు అవుతుందే.
నా దగ్గర
అంత డబ్బులేదే.
ఇదివరకు చేసిన
అప్పుకీ, నిన్ను
చదివించటానికీ
నా పెన్షన్
డబ్బు సహాయపడిందనేది
నీకు తెలియదా?” అంటూ
ఏడుస్తున్నట్టు
అడిగారు.
కూతురు వెంటనే
తిరిగి అడిగింది.
“ఇద్దరి
కూతుర్లకూ పెళ్ళి
చేసేటప్పుడే, మూడో
అమ్మాయికి పెళ్ళి
ఖర్చు వస్తుందే!
ఆమెకు కూడా
సరి సమంగా
ఇదేలాగా కట్న
కానుకలు, రొక్కం, సారె
ఇవ్వాలే! అనే
ఆలొచనను అమలు
చేసి ఇరవై
కాసులను సరి
భాగంగా మూడు
బాగాలుగా చేసి
ఖర్చుపెట్టాలి
అని అనుకోకుండా, ఇప్పుడు
మీరు మాట్లాడేది
న్యాయమే కాదు
నాన్నా!
పెళ్ళికొడుకు ఇంటివారు
కట్నకానుకలు ఏమీవద్దని
ఇప్పుడు చెప్పినా, ఆ
తరువాతి రోజుల్లో
ఇద్దరు పెద్దమ్మయలకూ
మీరు ఇచ్చిన
కట్నకానుకలు, రొక్కం
గురించి వాళ్లకు
తెలిస్తే నన్నే
కదా మా
అత్తగారూ, మిగిలినవారూ
హీనంగా మాట్లాడతారు. మీరేం
చేస్తారో నాకు
తెలియదు. అక్కయ్యలిద్దరికీ
చేసినట్టే నాకూ
చేయండి. లేకపోతే
నాకు పెళ్ళే
వద్దు”
మొహం మీద
కొట్టినట్టు మాట్లాడుతున్న
చిన్న కూతుర్ని
చూసి తండ్రికి
మాటలు రాలేదు.
నిర్ఘాంతపోయారు.
అదే సమయంలో
దామోదర్ ఇంట్లో
అతని అక్కయ్య, బావా...పెళ్ళికూతురు
తరపు వాళ్ళు
ఏం చెయ్యబోతారో, ఎంత
రొక్కం ఇవ్వబోతారో
అని వివాదం
మొదలుపెట్టారు.
వాళ్ళ దగ్గరకు
దామోదర్ వెళ్ళి
వాళ్లతో “అక్కా!
వాళ్ళు ఏం
చేయగలరో అది
చేయనీ. వాళ్లను
ఒత్తిడి చేయటం
నాకు ఇష్టం
లేదు. అమ్మాయి
నాకు
బాగా నచ్చింది.
ఎం.ఎస్.సి.
చదువుకుంది.
నాలాగానే ఆమెకూ
ప్రొఫసర్ ఉద్యోగం
దొరుకుతుంది. ఆ
సంపాదన మనకే
కదా వస్తుంది.
కాబట్టి వరకట్నం,
బంగారం అనే
పేరుతో ఒక
సమస్యను సృస్టించకండి.
దాన్ని అలాగే
వదిలేయండి” అన్నాడు.
అతని తల్లి, తోబుట్టువు
అతని ఇష్టానికే
వదిలిపెట్టారు.
ఆరోజే ఒక
జ్యోతిష్కుడ్ని
పిలిచి మంచి
రోజు చూడమన్నారు.
ఆయన, వచ్చే
బుధవారం బాగానే
ఉంది. ఆ
రోజే నిశ్చయం
చేసుకోండి. ఆ
తరువాత వచ్చే
పదిహేను రోజులలో
వచ్చే శుభ
ముహూర్త రోజు
పెళ్ళి జరుపుదాం.
అని తారీఖులు, టైమూ
రాసిచ్చారు. ఈ
విషయాన్ని ఫోను
ద్వారా కామాక్షీ
గురించి తనకు
చెప్పిన అతని
స్నేహితునికి తెలియపరచి, ఆ
స్నేహితుడు ద్వారానే
రాజమౌలికి తెలియచేయబడ్డది.
రాజమౌలి పెళ్ళైన
తన ఇద్దరి
కూతుర్లూ –
అళ్ళుల్లకూ కామాక్షీ పెళ్ళి
గురించిన వివరాలు
చెప్పి వాళ్లను
ఇంటికి రమ్మని
పిలిచారు. వాళ్ళ
దగ్గర చిన్న
కూతురి పట్టుదల
గురించీ, అక్కయ్యలకు
చేసినట్టే తనకూ
చేయాలనే ఆమె
కోరికనూ, తాను
ఇప్పుడున్న పరిస్థితిని
ఎత్తి చెప్పారు.
పార్వతికి తండ్రి
మనోవేదన బాగానే
అర్ధమయ్యింది.
“నాన్న!
నాకు చేసినట్టే, కామాక్షీకి
చేయాలి...అంతే
కదా? ఇదొక
పెద్ద సమస్య
కాదు నాన్నా!
మీరు నాకు
పెట్టిన నగలను
ఈ రోజు
వరకూ నా
భర్త దేనికోసమూ
అడిగిందే లేదు.
ఎక్కడికైనా ఫంక్షన్లకు
వెళ్ళేటప్పుడు
వేసుకు వెళతాను.
మిగతా సమయంలో
అవి నా
పెట్టెలోనే ఉంటాయి.
నా భర్త
రైతు. కష్టజీవి.
ఆయన వేసిన
పంటను ఎంతగా
కాపాడు కుంటారో, అదేలాగా
నన్ను, నా
నగలనూ జాగ్రత్తగా
ఉంచారు. అందువల్ల
నేనూ, నా
భర్త కలిసి
నా చెల్లి
కామాక్షీకి పెళ్ళికానుకగా
ఐదుకాసుల బంగారం, పదిహేనువేల
రూపాయలు రొక్కంగా
ఇస్తాను. వాటిని
చెల్లి పెళ్ళికి
సహాయంగా ఉంచుకో” అన్నది. ఆమె
భర్త యాదగిరి
సంతోషంగా తల
ఊపాడు.
ఇది విన్న
చెల్లెలు శేషమాంబ, భర్త
పోతరాజును చూసి...కళ్లతోనే
మాట్లాడుకున్న
తరువాత “అక్కయ్య
చెప్పినట్టే నేనూ
కామాక్షీకి పెళ్ళికానుకగా
ఐదుకాసుల బంగారం, పదిహేను
వేలు రొక్కం
ఇస్తాను అన్నది"
అన్నది.
పోతరాజు చెప్పాడు
"మామయ్యా! రోడ్డుమీద
నేను లారీను
జాగ్రత్తగా తోలినట్లే, జీవితం
అనే రోడ్డుమీద
కుటుంబం అనే
వాహనాన్ని జాగ్రత్తగా
తోలుకెళ్ళాలి అనేది
కరెక్టే కదా? అందువలన
శేషమాంబ యొక్క
బహుమతి, ఆమె
అక్కయ్య బహుమతి
సరిసమంగానే ఉండనివ్వండి"
అన్నాడు.
భార్య సులోచనాను
గర్వంగా చూసాడు
రాజమౌలి. ఆమె
చెప్పింది “నా
కూతుర్లు సరే, అళ్ళూల్లూ
సరే...బంగారాన్ని
పెద్దగా పట్టించుకోని
బంగారాలే. వీళ్ళు
ఇచ్చిన దానికి
కలిపి నా
దగ్గరున్న మిగిలిన
ఐదు కాసుల
బంగారం, ఇంటి
ఖర్చులకు మీరిస్తున్న
డబ్బులో మిగిల్చిన
డబ్బు ఐదువేలనూ
చేర్చి, ప్రతి
ఒక్కరికీ పదిహేను
కాసుల బంగారం.
ముప్పై ఐదువేల
రూపాయల రొక్కం
అని సరి
భాగం లెక్కవస్తుంది” అన్నది.
సరి భాగం అడిగిన
కామాక్షీ ఎక్కడ? చెల్లెలు
కొసం ఇద్దరు
అక్కయ్యలూ త్యాగం
చేసి కుటుంబ
పరువును కాపాడిన
సంస్కృతి ఎక్కడ? కన్నవాళ్ళు
కామాక్షీని ఆశీర్వదించిన
దానికంటే, దానికంటే
పెద్దవాళ్ళు అయిన, చదువుకోని
ఇద్దరు కూతుర్లనూ
మనసారా ఆశీర్వదించారు.
************************************************సమాప్తం*******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి