వైరాగ్యం...(కథ)
వైరాగ్యం (కథ)
వైరాగ్యం అంటే విరక్తి, అయిష్టత, నిరాసక్తత, విముఖత, పట్టుదల అనే వివిధ పదాలే వైరాగ్యం యొక్క అర్ధంగా భావించవచ్చు. వైరాగ్యం అనేది ఎలాంటి విషయాల్లో ఎప్పుడు ఏర్పడుతుందీ అంటే వివిధ సందర్భాల్లో నిరాశ కలిగినపుడు ఆయా విషయాలపట్ల నిరాసక్తత కలుగుతుంది.
వైరాగ్యం కలిగినందుకు బాధ, దుఃఖం ఉండవు. కానీ జీవితాంతం వైరాగ్యంతో ఉండటం కష్టం అంటారు. ఎందుకంటే వైరాగ్యంగా ఉన్నవారిని తమ తమ సలహాలతో చాలమంది నిరాశపెడతారు. అలాంటి వాళ్ళ సలహాలకు, ఒత్తిడ్లకు లొంగిపోక తాను పట్టుదలతో తాను బ్రతకడమే నిజమైన వైరాగ్యం.
ఈ కథలో పూర్ణిమ తన పెళ్ళి తరువాత వైరాగ్యంతో జీవించింది. ఆమె చివరి వరకూ అదే వైరాగ్యంతో ఉన్నదా? అనేది తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి:
*****************************************************************************************************
మోనికా కు ఇంకో గంటలొ పెళ్ళి. మోనికా తండ్రి సుబ్బారావ్ మెల్లగా కల్యాణ మండపం వైపు నడుస్తున్నాడు. అతను తన కూతురుని చివరగా చూసింది ఊయలలో పాపగా ఉన్నప్పుడు!
అతనికి పెళ్ళి పిలుపు లేదు. ఎలా పిలుస్తుంది భార్య పూర్ణిమ? పాతవన్నీ అమె ఎలా మరిచిపోగలదు?
తాగుడు మత్తులో కారణమే లేకుండా కొట్టడం, తన్నడం అతనికి ఈ టైములో జ్ఞాపకం వచ్చి గుండెను నొక్కుతున్నట్లయ్యింది.
కల్యాణ మండపంలోకి వెల్దామా, వద్దా?---అనే ఆలొచనతోనే నడుస్తున్నాడు.
"ఇదిగో చూడండి...ఊరంతా మీ గురించి తప్పుగా మాట్లాడుతోంది. పోనీ దాన్ని వదిలేయండి. ఆ సరళా సహవాసమే వద్దు. మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. మనకు ఒక ఆడపిల్ల ఉంది...అది పెరిగి పెద్దదై మీ గురించి తెలుసుకుంటే ఏమనుకుంటుంది?"
పూర్ణిమ ఏడుస్తూ బ్రతిమిలాడింది.
"పోవే! ఇది నా కూతురేనా అన్న సందేహం వస్తోంది!"
సుబ్బారావ్ అనుమానిస్తునట్లు మాట్లాడాడు.
పూర్ణిమ తన చెవులను మూసుకుంది.
"ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే...మీ నోరు పడిపోతుంది..."
"మాట్లాడతానే...నా యోగ్యత గురించి నువ్వు మాట్లడుతుంటే, నీ గురించి నేను మాట్లాడ కూడదా? నేను నీకు తెలిసే ద్రోహం చేస్తున్నాను...నువ్వు తెలియకుండా చేస్తున్నావో, ఏమో?"
కావలనే గొడవపెట్టుకుని అనవసరమైన మాటలు అంటూ అపవాదులు వేస్తుంటే తట్టుకోలేకపోయింది పూర్ణిమ.
"ఇక మీతో కాపురం చెయ్యలేను. నేను నా కూతుర్ని తీసుకుని మా అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. మీరు ఆ సరళను ఇంటికి తీసుకు వచ్చి ఆమెతోనే కాపురం చేసుకోండి!”
"నువ్వు చెప్పినా, చెప్పకపోయినా ఇక నాకు ఆమెతోనే జీవితం. నువ్వు చచ్చిపోయావనుకుంటాను!"
అంతే, పూర్ణిమ కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.
సుబ్బారావ్ కల్యాణ
మండపంలోకి అడుగుపెట్టాడు.
అతన్ని చూసిన ఒక
వయసైన ఆడది పరిగెత్తుకెళ్ళి, మోనికాకు అలంకారం చేయడం చూస్తున్న పూర్ణిమ చెవిలో
గుసగుసలాగా చెప్పింది.
"నీ భర్త వచ్చాడు!"
అది కొంచం కూడా
ఎదురు చూడలేదు పూర్ణిమ! ఒక వేల గొడవపెట్టుకోవడానికి వస్తున్నాడా? కలవరపాటుతో బయటకు వచ్చింది.
కల్యాణ మండపం లో
ఒక విధమైన ఆందోళన వాతావరణం చోటుచేసుకుంది.
"ఎవరు
మిమ్మల్ని ఆహ్వానించారు? ఎందుకు వచ్చారు? గొడవ చేయడానికా?"
"పూర్ణిమా! ఎందుకు ఇలా మాటలతో చంపుతున్నావు, ఇప్పుడు నేను పాత సుబ్బారావును కాను. ఒకే ఒకసారి
పెళ్ళికూతురు దుస్తులలో ఉన్న మన కూతురు ముఖాన్ని చూసేసి వెళ్ళిపోతాను"
ఈలోపు
పెళ్ళికొడుకు తండ్రి అక్కడకి వచ్చాడు.
"బావగారూ!
క్షమించాలి. మీ గురించి పూర్ణిమ అంతా చెప్పింది. అవన్నీ విన్న తరువాత కూడా నేను
మోనికా కోడలుగా రావడానికి అంగీకరించాను. దయచేసి బయటకు వెళ్ళిపొండి. మీరు లేకుండానే ఈ పెళ్ళి జరుగుతందని
ఆవిడ ముందే చెప్పింది. వెనుకా ముందు తెలియని నేనే పూర్ణిమ అమాయకత్వమైన మంచి
గుణాన్ని అర్ధంచేసుకున్నాను. కానీ, తాలి కట్టిన భర్తగా మీరు అమెను అర్ధంచేసుకోలేకపోవటమే నిజంగా
మూర్ఖతవం. దయచేసి వెళ్ళిపొండి!"
సుబ్బారావ్
అవమానంతో తల దించుకున్నాడు. కళ్ళ నుండి నీరు ధారగా కారుతోంది. నేను చేసిన పాపాలకు
ఇన్ని సంవత్సరాల తరువాత ఒక్క నిమిషంలో పూర్ణిమ దండన ఇచ్చేసింది!
"నేను మోనికాను చూడాలి...కొంచం పిలవండి"
మోనికా వచ్చింది.
అచ్చంగా పూర్ణిమ పోలికలతో వొలిచి పెట్టినట్లు ఉన్నది.
"నాన్నా!
ఇన్ని సంవత్సరాలుగా నన్ను చూడటానికి ఎందుకు రాలేదు! ఇప్పుడు మాత్రం ఎలా వచ్చావు?"
సుబ్బారావు కు
దుఖం పొంగుకు వచ్చింది.
"మోనికా!
లోపలకి పో...చూశారు కదా. ఇక చాలు. కపట ప్రేమను వొలకబోసింది చాలు!" అన్నది
పూర్ణిమ.
ఇంతలో పెళ్ళికొడుకు
పరిగెత్తుకొచ్చాడు.
"అత్తయా! ఆయన
తన తప్పు తెలుసుకుని తిరిగొచ్చారు. ఆయన ఏడుపులోనే తెలియటం లేదా?"
"అల్లుడు గారూ! తప్పు తెలుసుకుని తిరిగి వస్తే ఆమొదించాలా? ఒకవేల నేను అలా వెళ్ళిపోయి తిరిగొస్తే నన్ను ఆమొదిస్తారా? ఈ సమాజంలో మగవారికొక చట్టం, ఆడవాళ్లకొక చట్టం ఉన్నదా? చిన్నపాపగా ఉన్నప్పుడే మోనికాను, నన్నూ వదిలేసి ఈయన వెళ్ళిపోయిన తరువాత ఎంతో వైరాగ్యంతో ఉండి
మోనికాను పెంచాను, ఎంతో కష్టపడ్డాను.
నా మంచి నడవడిక
ద్వారా ఈరోజు తలెత్తుకుని నిలవగలిగాను. ఆ రోజు లేని ఈయన ప్రేమ, ఈరోజు నాకు అవసరం లేదు. దయచేసి వెళ్ళిపొమ్మని చెప్పండి
అల్లుడుగారు"
ఆవేశంగా
మాట్లాడింది పూర్ణిమ.
సుబ్బారావ్ మౌనంగా
వెను తిరిగాడు.
మూహూర్త మేళం వాయిద్యాలు మోత వినేటంతవరకు కాచుకుని మూహూర్త మేళతాలాలు విన్న తరువాత బయలుదేరాడు సుబ్బారావ్.
**************************************************సమాప్తం*******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి