రైల్లో వచ్చిన అమ్మాయి…(కథ)
రైల్లో వచ్చిన అమ్మాయి (కథ)
తలమీద వులన్ టోపీ
తగిలించుకుని, వులన్ సాలూవాతో రెండు సార్లు శరీరాన్ని చుట్టుకోనున్నా,
కమాండర్ కపూర్ కి
కలకత్తా యొక్క ఆ మాఘమాస చలి కొంచం కఠినంగానే ఉన్నట్టు అనిపించింది..
కార్గిల్ యుద్దంలో
పాకిస్తాన్ సైనికులతో పోరాడుతున్నప్పుడు కురిసిన మంచు,
చలి కంటే ఇదేమంత
కఠినం కాదు అని చెప్పేంత చలిగాలి ఇక్కడ లేదని కపూర్ కి బాగా తెలుసు. అయినాకానీ ఆ
రోజు ఆయన బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఆ చలి కఠినంగా అనిపించలేదు. ఈ రోజు ఆయనకు ఏ
బాధ్యతా లేదు. రిటైర్ అయిపోయారు. తన ఇంటికి తిరిగి వెళుతున్నారు.
స్టీం ఇంజెన్ బండి
బయలుదేరటానికి గంట మోగింది. గార్డు యొక్క విజిల్ శబ్ధం వినబడిన వెంటనే బండి
బయలుదేరింది.
ఆ ఫస్ట్ క్లాస్
పెట్టెలో ఆయన తప్ప ఇంకెవరూ లేరు. చలి కాలం కాబట్టి సెకండ్ క్లాసులో కూడా
ప్రయాణీకులు తక్కువగా ఉన్నారు. అందరు ప్రయణీకులూ కాళ్ళు జాపుకుని హాయిగా
కూర్చున్నారు.
కమాండర్ కపూర్ గారు
కూర్చున్న భోగీ తలుపు హఠాత్తుగా తెరుచుకుని ఆందోళన పడుతూ ఒక అమ్మాయి లోపలకు వచ్చింది.
తలుపు మూసేసి,
కొంచం సేపు తలుపు
దగ్గరే నిలబడి, శ్వాశ మామూలు పరిస్థితికి వచ్చిన తరువాత,
ప్రశాంతంగా వచ్చి కపూర్
ఎదురుగా ఉన్న సీటులో కూర్చుంది.
ఆమె చేష్టలను
ప్రశాంతంగా చూస్తున్న కపూర్, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆమెనే కొన్ని నిమిషాలు చూశారు. ‘ఈమె ఎందుకు ఇంత ఆందోళన పడుతూ,
హడావిడిగా
పరిగెత్తుకు రావాలి? ఈ రైలు తరువాత ఇంకొక రైలు ఉన్నదే. నిదానంగా ఆ బండి ఎక్కి వెళ్ళొచ్చే?’
అని అనుకుంటూ ఆమెను
పై నుండి కింది దాకా ఒకసారి చూశారు.
యౌవనం కొలువున్న
అందమైన శరీరం. ఎర్రటి రంగు. కొలతకు ఎక్కువగా ఉన్న చెస్ట్. వెన్నపూస రాసి
ఉన్నట్లున్న నున్నని చేతులు. ప్రకాశవంతమైన మొహం. శరీరానికి అతుకున్న చుఢీదార్.
ముక్కును చేదిస్తున్న గంధం వాసన.
కవిత చెప్పే ఆమె
కళ్ళ యొక్క అయిస్కాంతం ఎవరినైనా సరే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇరవై,
ఇరవైరెండు ఏళ్ల పైన
గణించలేని ఆమెలాంటి అందమైన అమ్మాయలకు చాలావరకు న్యాచురల్ గానే ఆపదలు ఎక్కువ
వస్తాయి. ఆమె కళ్ల యొక్క చూపులతో స్థిరమైన మనసును చెదరగొట్టబడ్డ పరిస్థితిలో ఉన్నారు
కపూర్.
రైలు తన పూర్తి
వేగాన్ని చేరుకుంటోంది. ఇంతవరకు ఇద్దరి మధ్యా ఉన్న నిశ్శబ్ధాన్ని ఆమే చెరిపింది.
“మీరు
ఎక్కడికి వెళుతున్నారు?” ఆమె బెంగాలీ భాషలో అడగగా,
అంతవరకు ఆమె
అందాన్ని ఎంజాయ్ చేస్తున్న కపూర్ గబుక్కున తనని తాను సర్దుకున్నారు. ‘ధన్ బాద్ ‘ అని ఒకే మాటలో చెప్పారు.
మళ్ళీ ఇద్దరి మధ్య
నిశ్శబ్ధం. కపూర్ ఆమె అందాన్ని ఎంజాయ్ చేస్తున్న తన కళ్ళను శ్రమ పడి వేరు పక్కకు
తిప్పుకున్నారు. కిటికీ బయటకు చూపులను పెట్టాడు.
“నేనూ
అక్కడికే వెళుతున్నాను” అన్నది ఆమె.
ధీర్ఘమైన నిశ్శబ్ధం
తరువాత ఆమె అలా చెప్పటాన్ని, ఏదో ఆలోచించి చెప్పినట్టు,
నిజంగానే ఆమె కూడా ‘ధన్ బాద్’
వెడుతున్నట్టు ఉంటే,
తాను ‘ధన్ బాద్’
వెళ్తున్నానని
చెప్పిన వెంటనే కొంచం కూడా ఆలస్యం చేయకుండా నేను కూడా ‘ధన్ బాద్’
వెళుతున్నా అని
చెప్పుంటుందే అని అనుకుంటూ, “ఓహో!” అనడంతో ఆపుకున్నారు కపూర్.
“మీ
పేరు?” ఆమే అడిగింది.
కపూర్...కమాండర్ లలిత్
కపూర్” ఆయన చెప్పారు.
"నా పేరు
కుమారీ లక్ష్మీ. నన్ను అందరూ లక్కీ అనే పిలుస్తారు...మీరూ అలాగే పిలవచ్చు"
చెప్పింది.
“అలాగా?”
కపూర్ నిర్లక్ష్యంగా
అంటూ మళ్ళీ కిటీకీకు బయటే చూపులను పెట్టారు.
“మిస్టర్
కపూర్! నాకొక సహాయం చేయగలరా?”
ఆమె రిక్వెస్టులో
స్వీట్ నెస్ కనబడింది. గ్లామర్ చూపుల పానకాన్ని రెడీగా ఉంచుకున్నది ఆయన మీద వదల,
కపూర్ ప్రశాంతంగా
ఆమె వైపు చూశాడు ‘ఏం కావాలి?’ అన్నట్టు.
“నాకు
కొంచం డబ్బు కావాలి”
“డబ్బా...ఎంత?”
“మీ దగ్గర ఎంతుంది?”
“అది నీకు తెలియాల్సిన అవసరం లేదు” కపూర్ కొంచం కఠినంగా చెప్పాడు.
“ఉండచ్చు
మిస్టర్ కపూర్! మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతా నాకు కావాలి”
నెమ్మదిగా, రోజా పూవు పెదాలపై విషం కలిపిన నవ్వుతో చెప్పింది.
“ఏం...
నేనెందుకు ఇవ్వాలి?” కోపంతో బయటకు వచ్చింది కపూర్ ప్రశ్న.
కింది పెదవిని
చిన్నగా కొరుకుతూ, కళ్ళల్లో మేఘాల వల విసిరి “ఎందుకంటే?
మీరొక గౌరవమైన యుద్ద
వీరులు. మీ మనసు, మర్యాదా పదిలంగా ఉండాల...అక్కర్లేదా?”
కొంచం గట్టిగానే
అడిగింది.
“ఓ...నేను
నీకు డబ్బులు ఇవ్వకపోతే, నా పరువు, ప్రతిష్టలు తీసేస్తావని చెబుతున్నావా?
నువ్వొక అమ్మాయివి.
కాబట్టి నువ్వు అనుకున్నదంతా సాధించుకుందామని కల కంటున్నావా?”
గర్జించాడు కపూర్.
కపూర్ మాటల్లో
ఇప్పుడు కోపం తగ్గినా, ధైర్యంగా మాట్లాడుతున్నారు అనేది ఆమె అర్ధం చేసుకుంది.
“మిస్టర్
కపూర్! అనవసరంగా ఒక అమ్మాయిని శతృవుగా చేసుకోకండి. నేను ఎలాంటి దాన్నో మీకు
తెలియదనుకుంటున్నా. మర్యాదగా నేను అడిగినట్టు మీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చేయండి. నేనేమీ
మాట్లాడకుండా వచ్చే స్టేషన్లో దిగి వెళ్ళిపోతాను” అన్నది
కోపంగా.
“నా
దగ్గర ఇప్పుడు డబ్బు లేదు” కపూర్ పట్టుదలగా చెప్పాడు.
“అబద్దం
చెబుతున్నారు”
“లేదు.
నా దగ్గర నిజంగానే డబ్బు లేదు”
“చేతిలో
డబ్బులేకుండానే అక్కయ్య ఇంటికి వెడుతున్నారా?”
“ఓ! నా గురించి అంతా తెలుసుకున్నావా?
ఇప్పుడు చెబుతాను.
విను. నా అక్కయ్య కూతురు యొక్క పెళ్ళి ఖర్చులకు నేను చేర్చి పెట్టుకున్న యాభై వేల
రూపాయలు ఉన్నాయి. కానీ, ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను. నీవల్ల అయినది చేసుకో” కపూర్ ఖచ్చితంగా చెప్పారు.
“అలాగా?
తరువాత స్టేషన్లో
బండి ఆగనీ. నీకేం గతి పడుతుందో చూడు” మొహాన కొట్టినట్టు చటుక్కున చెప్పింది ఆమె.
“ఏం
చేయగలవు నువ్వు?”
స్టేషన్ ప్లాట్
ఫారంలో దిగి, నిలబడి, నువ్వు నన్ను బలవంతంగా మానభంగం చేయటానికి ప్రయత్నించినట్టు
కేకలు వేసి గుంపు చేరుస్తాను. నిన్ను అవమాన పరుస్తును. వాళ్ళు నిన్ను పిలుచుకు
వెళ్ళి దేహశుద్ది చేస్తారు" అన్నది కోపంగానూ,
ఎగతాలిగానూ.
“ఓహో!
ఇలాగంతా బెదిరిస్తే లొంగిపోయి డబ్బులు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా” నిర్లక్ష్యంగా అడిగారు ఆయన.
“నువ్వుగా
ఇచ్చేస్తే నీ పరువు, మర్యాదా మిగులుతాయి” హెచ్చరించింది.
రైలు వేగం కొంచంగా
తగ్గటం మొదలయ్యింది.
“ఏయ్ కపూర్!
చివరిసారిగా అడుగుతున్నా. స్టేషన్ దగ్గర పడుతోంది. డబ్బులిస్తావా?
ఇవ్వవా?”
ఈ సారి ఆమె ప్రశ్నలో
కఠినత్వం, ఆగ్రహం నిండున్నాయి.
కానీ,
ఆయన దగ్గర ఆమె
బెదిరింపు, హెచ్చరిక కొంచం కూడా చెల్లుబడి అయినట్లు తెలియటం లేదు.
యుద్ద భూమిలో ఎన్ని భయంకరమైన సంఘటనలు ఎదుర్కోనుంటారు. కేవలం ఈమె బెదిరింపుకా
లోంగిపోతారు?
లక్కీ లాంటి
అమ్మాయలు దేన్నేనైనా సాధించుకునే సాహస నేర్పు ఉన్నవారు అనేది ఆలొచించకుండానే
పట్టుదలతో లొంగి పోవటానికి నిరాకరించారు. ఆమెకు అంత ధైర్యం రాదు అనే కపూర్
అనుకుంటూ ఉన్నారు.
ఆయన అలా అనుకున్నది
ఎంత పెద్ద పిచ్చితనమో అనేది ఉత్తరపురా స్టేషన్లో బండి ఆగిన వెంటనే ఆయనకు
అర్ధమయ్యింది.
హఠాత్తుగా లక్కీ
లేచింది. తన తలను చిందర వందర చేసుకుంది.
జాకెట్టును గుండెల
వరకు రెండుగా చింపుకుంది.
కపూర్ మొహాన్ని
చూసింది. విషపూరిత నవ్వుతో కన్ను కొట్టింది. తన మీద ఆయన కామ ఆశను చూసి తన మీద పడి చిన్నాబిన్నం చేసి,
తన ఆశను
తీర్చుకోవాలనుకున్నారు అని ఆలోచించి కొంతసేపు అలాగే నిలబడింది.
ఆమెను ఆ అవతారంలో
చూసిన ఆయనకు భయం ఎక్కువయ్యింది. చలనం లేకుండా కూర్చున్నారు.
తరువాత చుఢీదార్
చింపుకుంది. తెల్లటి ఐస్ క్రీం రంగు తొడలు తెలిసేటట్టు నిలబడింది.
“ఏయ్
కమాండర్! ఇప్పుడైనా నేనడిగినట్టు డబ్బు ఇస్తావా,
ఇవ్వవా?”
ఆమె ముగించే లోపు కపూర్
నోటి నుండి “ఇవ్వను.
నువ్వేం చేసుకుంటావో చేసుకో” అని సమాధానం వచ్చింది.
అంతే బండీ
ఉత్తరాపూర్ స్టేషన్లో నిలబడ్డది. తలుపును దభేల్ మంటూ తెరిచుకుని “అయ్యో! నన్ను కాపాడండి! కాపాడండి! ఈ కామ
పిసాచి నన్ను చెడపాలని చూస్తున్నాడు. నన్ను కాపాడండి!” అని
కేకలేసుకుంటూ ప్లాట్ ఫారంపై దూకింది.
చుట్టుపక్కలున్న ప్రయాణీకులు,
ప్లాట్ ఫారం
సిబ్బంది, పక్క కంపార్ట్ మెంటులో ఉన్న ప్రయాణీకులు అందరూ వచ్చి ఆమె చుట్టూ
జేరారు. గుంపు ఎక్కువవటంతో ఆమెలో ఉత్సాహం పొంగుకు వచ్చింది. కొంచం ఎక్కువగానే
మొదలుపెట్టింది.
చుట్టూ పోగైన
గుంపును తోసుకుంటూ ముగ్గురు కానిస్టేబుల్స్ అక్కడకు వచ్చారు.
“ఏమిటిక్కడ
గొడవ?” అంటూ లక్కీని చేరుకున్నారు కానిస్టేబుల్ ఒకరు.
“సార్...మంచి
కాలంగా మీరు వచ్చారు. అదిగో ఏమీ తెలియనట్లు కూర్చున్నాడే,
ఆ అయోగ్యుడు నన్ను
బలవంతం చేయటానికి ప్రయత్నించాడు. హౌరా స్టేషన్ నుండి నేను నన్ను కాపాడుకోవటానికి
పోరాడుతూనే వస్తున్నాను.
ఇదిగో చూడండి సార్,
నా అవతారాన్ని.
నన్ను ఎలా చిందర వందర చేసాడో, ఆ మృగం...చూడండి సార్” అంటూ అరుస్తూ ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
పాపం అనిపించే ఆమె
అవతారం చూసి అందరూ కపూర్ పై ఆగ్రహించారు. పోలీసులు,
ఇంకా ఏమీ జరగనట్లు
బండీలో ప్రశాంతంగా కూర్చున్న కపూర్ ని చూస్తూ “ఏయ్! దిగి రారా ఇక్కడికి” అని కోపంగా అరిచారు.
కపూర్ ఏమీ జరగనట్లు
నిదానంగా కిందకు దిగి రావటం చూసి గుంపు కూడిన వారిలో ఒకతను “చూడండి. అతను అమాయకుడిలా ఎలా చూస్తున్నాడో.
ఈ పిల్లి కూడానా పాలు తాగుతుంది అన్నట్టు ప్రశాంతంగా దిగుతున్నాడు. ఇతన్ని మధ్య రోడ్డులో
నిలబడి కొరడతో కొట్టాలి” అన్నాడు.
“ఇలాంటి
కుక్కలన్నిటికి కళ్ళు మాత్రం ఉంచి, తోలు ఊడదీసి, మెరప పొడి జల్లి ఎండలో ఎండబెట్టాలి” అన్నాడు ఇంకొకతను.
“ఏరా...ఆమె
చెప్పేది నిజమే కదా?” కఠినమైన స్వరంతో అడిగాడు ఒక పోలీసు.
“అతన్ని
ఎందుకు సార్ అడుగుతారు...ఈ అమ్మాయిని చూస్తేనే తెలియటం లేదా?
మనిషా వాడు?
నాలుగు తగిలించి
లాక్కు పొండి స్టేషన్ కు” అన్నాడు గుంపులోని మరొకతను.
“ఛీ!
ఏదైనా సరే ఇలా మృగంలాగానా ఒకడు ఒక ఆడదాని దగ్గర నడుచుకుంటాడు?
నీకు అక్కా,
చెల్లెలు లేరా?”
అన్నది గుంపులో ఉన్న
ఒక స్త్రీ ఒకత్తి.
“ఈ
అయోగ్యుడ్ని పోయి విచారణ చేస్తున్నారేమిటి. నోరు తెరిచి ‘క్షమించండి’ అని అడుగుతున్నాడా చూశారా” అంటూ కొట్టటానికి కోపంగా
చేయెత్తి, అతని దగ్గరకు గుంపుగా చేరారు.
“అందరూ
కొంచం ఊరుకోండయ్యా...మేము ఉన్నాం కదా...మేము చూసుకుంటాం. అందరూ
వెళ్ళండి...ఊ...వెళ్ళండి” అని వాళ్ళను ఆపాడు ఒక పోలీసు.
ఒక్కరు కూడా
వెళ్ళిపోయేటట్టు కనబడలేదు. కోపంతో నిలబడి పోయారు.
“220,
ఇతనికి సంకెళ్ళు
వెయ్యి. ఇతను ఏమీ మాట్లాడనంటున్నాడు. స్టేషన్ కు తీసుకు వెళ్ళి మన స్టయిలులో నాలుగు తగిలిస్తే,
తానుగా ఒప్పుకుంటాడు” అని లక్కీని చూశాడు పోలీసు.
ఆమె,
ఏదో తన పరువంతా
పోయినట్టు, తన జీవితమే నాశనమైనట్టు కృంగి,
కృషించి,
తల వంచుకుని
నిలబడింది.
“సార్!
ఏది ఏమైనా ఈయన గౌరవమైన భారత వీరుడు. ఈయనకి సంకెళ్ళు వేసి తీసుకు వెళ్ళటం అంత
మంచిది కాదు సార్” అన్నాడు పోలీసు 220.
“ఏంటయ్యా...ఇతను చేసింది మాత్రం గౌరవమైన కార్యమా?
ఇలాంటి దిక్కుమాలిన
పని చేసిన వాడు ఎవరై ఉన్నా, వాడికి గౌరవ మర్యాదలు ఇవ్వక్కర్లేదు. అందరికీ చట్టం ఒకటే.
నువ్వు వెయ్యవయ్యా సంకెళ్ళు” అంటూ లక్కీని చూసి “ఇదిగోమ్మా,
నువ్వు కూడా స్టేషన్
కు వచ్చి ఒక ఫిర్యాదు రాసిచ్చి వెళ్ళు” అన్నాడు.
పెద్ద అధికారి
చెప్పింది కాదనలేక 220, సంకెళ్లతో కపూర్ దగ్గరకు వచ్చి ఆయన వేసుకున్న,
కప్పుకున్న ఉలన్
సాలువాను తొలగించాడు.
అక్కడ అతను చూసిన
దృశ్యం, అతన్ని
మాత్రమే కాదు, గుంపుగా చేరున్న అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
లక్కీకి శ్వాశే ఆగిపోయేటట్టు
అనిపించింది.
కపూర్ కి రెండు
చేతులూ లేవు.
కార్గిల్ యుద్దంలో
తన రెండు చేతులనూ కానుగా ఇచ్చాడు.
పోలీసులు ఆశ్చర్యంతో
నిలబడిపోయి, కమాండర్ కపూర్ కి సెల్యూట్ చేశారు.
జారిపోదలుచుకున్న
లక్కీని పట్టుకుని ఆపి, సంకెళ్ళు తగిలించి లాకెల్లారు.
*****************************************************సమాప్తం****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి