సెల్ ఫోన్…(కథ)
సెల్ ఫోన్ (కథ)
ఎప్పుడూ నిజాలే చెప్పాలనీ, అబద్ధం ఆడకూడదు అని చిన్నప్పటినుంచి పెద్దవాళ్లు మనకి చెప్తారు. గొప్ప గొప్ప గురువులు మరియు అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారు అయిన ఎన్నో కథలు రామాయణ మహాభారతాలలో ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు.
అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది.రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకువస్తుంది. చివర్గ మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది.
నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. అది మన ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అది మన ఆలోచనల్లో స్పష్టత తీసుకువస్తుంది.
కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం సుఖంగా ఉంటుంది.
ఈ కథలో హీరో ఈ విషయాన్ని ఏలా చెప్పాడో చూడండి.
*****************************************************************************************************
‘మన
జీవితం ఇలా
అయిపోయిందే! సొంత
ఇల్లు, తండ్రి
తాగుడు మత్తుకు
ఖర్చు అయిపోయిందే.
చదువు సగంలో
ఆగిపోయిందే. ఏదో
అన్నయ్య మాత్రం
కాలేజీ వరకు
చదువుకున్నందువలన
ఒక ఆఫీసులో
మేనేజర్ ఉద్యోగం
దొరికింది. పదో
క్లాసు కూడా
చదవని నేను, ఏం
ఉద్యోగం ఎదురు
చూడగలను?’
నాన్న చనిపోయిన
తరువాత, అమ్మ
మోసిన పండ్ల
బుట్ట ఇప్పుడు
తోపుడు బండీగా
మారి ఉన్నది.
అదే మా
ఎదుగుదల.
పిల్లల్ని అయినా
బాగా చదివించాలని
ప్రైవేటు స్కూల్లో
చేర్చి అయ్యింది.
‘ఇప్పుడు
పిల్లలిద్దరికీ
కలిపి రెండువేల
ఐదువందల రూపాయలు
ఫీజుగా కట్టాలట.
ఏం చేయాలో
అర్ధంకావటం లేదు...’ అనే
ఆలొచనతోనే ఉన్నాడు
అతను.
‘మంచి
భార్య దొరకటం
దేవిడిచ్చిన వరం’ అని
చెప్పేటట్టే అతని
భార్య సౌమ్య, పేరుకు
తగినట్లు శాంతం
ఉట్టిపడే శాంతమైన
-- అభిమానమైన అమ్మాయి.
ఆస్తికి ఒక
కొడుకు, ఆశకు
ఒక అమ్మాయి.
మనసులో చాలా
ఆశ ఉంది.
ఆస్తికే దారిలేదు.
అయినా కానీ
నిజము, నిజాయితీ,న్యాయము
అనే వాటినే
ఆస్తిగా అనుకుంటున్నారు.
అందువలనే జీవితం
ఎటువంటి కష్టమూ
లేకుండా వెడుతున్నది
అతనికి.
సీజనుకు తగిన
పండ్ల అమ్మకం, అమ్మే
చోటు కూడా
మార్చి, మార్చే!
ఆ రోజు
అదేలాగానే బండిని
తోసుకుంటూ చాలా
దూరం వెళ్ళినందు
వలన కాలు
నొప్పి పుట్టి
ఒక వీధి
చివరిలో ఆపేసి, దాహం
వేసినందు వలన
పక్కన నిలబడున్న
ఆటో డ్రైవర్
తో “అన్నా.
బండిని కొంచం
చూసుకోండి. నీళ్ళు
పట్టుకుని వచ్చేస్తాను” అన్నాడు.
“సరే...సరే...వెళ్ళిరా”
వీధి కుళాయిలో
నీళ్ళు పట్టుకుని
నడిచి వస్తున్న
అతను, కాలుకు
ఏదో అడ్దుపడ్డట్టు
అనిపించడంతో...వంగి
చూసినప్పుడు సరికొత్త
సెల్ ఫోన్.
ఎవరో పారేసుకున్నారు.
“ఏంటయ్యా...ఏమిటది?” -- ఆటో
అతను అడిగాడు.
“ఎవరో
సెల్ ఫోను
కింద పడేసుకుని
వెళ్ళిపోయారన్నా.
“ఇక్కడికి
తీసుకురా చూద్దాం”
‘"అయ్యో, ‘కేమేరా’ ఫోను.
దీని ఖరీదు
ఇప్పుడు ఎనిమిది
వేలు ఉంటుంది” అన్నాడు ఆటో
అతను.
“అయ్యయ్యో.
పాపం ఎవరు
పారేసుకున్నారో? ఎక్కడెక్కడ
వెతుకుతున్నారో?”
“అరె, వీడెవర్రా
బ్రతక తెలియని
వాడుగా ఉన్నాడు? నువ్వేమన్నా
దొంగలించావా? తానుగా
దొరికిందే కదా!
తీసుకుని వెళ్తావా?”
“తప్పన్నా...మన
వస్తువు కనబడకుండా
పోయుంటే మనం
ఎంత కష్ట
పడతాం? మీరే
చెప్పారు. ఇది
ఎనిమిదివేల రూపాయలు
ఖరీదు ఉంటుందని!
వాళ్ళు ఇది
కొన్నప్పుడు ఎంతపెట్టి
కొన్నారో? నేను
దీన్ని పోలీసులకు
అప్పజెప్పి వస్తాను”
“నువ్వు
పెద్ద మహాత్ముడివా.
పోలీసులకు అప్పజెబితే, పారేసుకున్న
వాళ్ళను కనిబెట్టి
ఇచ్చేసి ఇంకో
పని చూస్తారు
చూడు...! వాళ్ళే
తీసేసుకుంటారు.
దానికంటే నువ్వే
ఉంచుకోవచ్చు”
“అబద్దం
చెప్పకూడదు. దొంగలించ
కూడదు అంటూ
మన పిల్లలకు
మనమే చెబుతూ...మనం
ఇలా చేస్తే
దేవుడు కూడా
మనల్ని క్షమించడు” అని మాట్లాడుకుంటూ
ఉన్నప్పుడే చేతిలో
ఉన్న సెల్
ఫోన్ మోగింది.
వెంటనే సెల్
ఫోన్ ఆన్
చేసి చెవి
దగ్గర పెట్టుకున్నాడు
అతను. “ఇది
ఎవరి సెల్
ఫోనో తెలియటం
లేదండి. కింద
పడుంది.నేను
తీసి పెట్టుకున్నాను.
ఈ ఫోను
ఎవరిదో వాళ్ళను
రమ్మని చెప్పండి...నేను
ఇచ్చేస్తాను" అన్నాడు.
ఆటో డ్రైవర్
అతన్ని వదల్లేదు.
“రేయ్...రేయ్...నీకేమన్నా
నట్లు, బోల్టులు
లూజు అయినయ్యా? నీకు
ఇష్టం లేకపోతే
నువ్వు ఉంచుకోకు.
నేను నీకు
రెండువేల రూపాయలు
ఇస్తాను...నాకిచ్చేయి”
“అయ్యా
స్వామీ...నన్ను
వదిలిపెట్టు”
“సరేరా.
సవారి వచ్చింది.
నేను వెళ్ళొస్తాను.
ఈ లోపు
నువ్వు ఒక
నిర్ణయం తీసుకో.
పిల్లలిద్దరికీ
స్కూలు చదువుకు
డబ్బులు కట్టాలే
అని సనుగుతూ
ఉన్నావే...దానికోసమే
భగవంతుడు దీన్ని
నీకిచ్చాడు. అర్ధం
చేసుకో” అని మాట్లాడిన
అతను ఆటో
తీసుకుని బయలుదేరాడు.
సమయం అవుతున్నది.
అతను తిరిగి
తిరిగి మాట్లాడి
మనసును కరిగించగా
‘పారేసుకున్న
వాళ్ళకు మనం
ఉండే చోటు
తెలిసి, ఇక్కడికి
ఎలా రాగలరు?’ అనే
భావం తలెత్తింది.
‘మాట్లాడకుండా
రెండువేల రూపాయలకు
అమ్మేద్దామా? పిల్లలకు
రేపటి లోపల
ఫీజు కట్టేయాలి’ మనసు
అలా లాగ
ఎగిసి ఎగిసి
పడుతోంది.
‘డబ్బుల్లేకుండా
మనం పడుతున్న
కష్టం చూసి
భగవంతుడే ఇది
నాకు ఇచ్చాడో? మనమే
ఉపయోగించుకోకుండా
ఉన్నామా? భగవంతుడు
తిన్నగా వచ్చి
డబ్బులా ఇవ్వగలడు? ఇలాంటి
సంధర్భం ఒకటి
ఇస్తాడు. మనమే
దాన్ని గుర్తించి
వాడుకోవాలీ’ -- అనే
భావం బలం
అందుకోగా...మెల్లగా
సెల్ ఫోనును
తీసి, దాని
ప్రాణాన్ని స్విచ్
ఆఫ్ చేసాడు.
కలత చెందిన
మొహాలతో, వదిలితే
కింద జారటానికి
రెడీగా ఉన్న
కన్నీటితో ఇద్దరు
మహిళలు వంగి
దేనికోసమో వెతుక్కుంటూ
రావటాన్ని చూసిన
వెంటనే అర్ధమయిపోయింది...వాళ్ళు
సెల్ ఫోనునే
వెతుకుతున్నారు
అనేది.
ఒక మహిళ
చేతిలో ‘సెల్
ఫోన్’. ఆమె
దాంట్లో నెంబర్లు
నొక్కి చెవి
దగ్గర పెట్టుకుని, పెట్టుకుని
తీస్తూ ఉంది.
“ఛఛ...నెంబరు
వెళ్ళటమే లేదు” అన్నది.
గుండె దఢ
ఎక్కువ అవటంతో, వాళ్ళను
చూడనట్లే ముఖాన్ని
తిప్పుకున్నాడు.
ఒళ్ళు బిగపెట్టినట్టు
వణుకుతున్నది.
భయంతో చెమటలు
ఎక్కువై, కాలువలాగా
పారింది. గొంతుక
పట్టేసినట్లు ఉండి
కళ్ళు తిరిగుతున్నట్లు
అనిపించింది. కాళ్ళు
తడబడ...బండిని
గట్టిగా పట్టుకున్నాడు.
‘దొంగలించడం, అబద్దం
చెప్పటం ఇంత
కష్టమా?’ -- ఇన్ని
రోజులు ఏర్పడని
భావనలతో అతను
చెమట తడితో
తడిసిపోయాడు!
“అయ్యా, ఇక్కడ
ఒక సెల్
ఫోన్ పడుందా? మీరు
చూసారా? మా
అబ్బాయి సంపాదించిన
డబ్బుతో మొట్టమొదట
సారిగా నాకు
ఆశగా కొనిచ్చాడు.
అందులో వాడి
ఫోటోలు చాలా
ఉన్నాయి. ఇప్పుడు
అతను బయట
ఊర్లో ఉన్నాడు.
అతని జ్ఞాపకం
వచ్చినప్పుడల్లా
ఆ ఫోటలను
చూసి సమాధానపరుచుకుంటాను.
దయచేసి చూసుంటే
చెప్పండయ్యా”
“ఇదిగోండమ్మా.
నేను నీళ్ళు
పట్టుకుని వస్తున్నప్పుడు
కింద పడుంది.
నేనే తీసిపెట్టేను.
ఇదిగోండి...” అని చెప్పి
సెల్ ఫోనును
ఇచ్చాడు.
“చాలా
థ్యాంక్స్ అండీ” అని సంతోషంతో
ఆదుర్దాగా కొడుకు
ఫోటోలను చూస్తున్న
మహిళను చూసినప్పుడు
‘దీన్ని
అమ్మి రెండు
వేల రూపాయల
డబ్బు వచ్చుంటే
కూడా ఇంత
సంతోషం మనకు
దొరికుండదు’ అని
అతనికి అర్ధమయినప్పుడు--
‘భగవంతుడా...నన్ను
చెడ్డవాడిని అవకుండా
కాపాడావు. నీకు
చాలా థ్యాంక్స్!
మరో రెండు
రోజులు రాత్రీ
పగలూ బండి
తీసుకుని తిరిగితే...పిల్లల
స్కూలు ఫీజును
కట్టేస్తాను’ అని
అనుకున్న అతను
‘నిజాన్ని
మాట్లాడుతున్నప్పుడు, మనసుకు
ఎంతో తృప్తి
దొరికింది?’ అని
ఆశ్చర్యపడ్డాడు.
**************************************************సమాప్తం*****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి