మాయల ముని...(కథ)
మాయల ముని (కథ)
రుద్రయ్య శివ భక్తుడు. పేపర్లో వచ్చిన న్యూస్ ను చదివాడు.
'శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది! అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు’ అనే వార్త ప్రచురుణ అయ్యింది.
రుద్రయ్య తన సమస్యలు కూడా పటాపంచలైపోవాలని ఆశపడ్డాడు. ఆ గుడికి బయలుదేరాడు.
*****************************************************************************************************
రుద్రయ్య శివ భక్తుడు.
ఆయనకు ప్రతి రోజూ సమస్యల పైన సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల
నుండి ఎలా విడిపడాలో అని ఆలొచిస్తున్న ఆయనకి ఆ రోజు ఒక పేపర్లో.....
'శివతాండవ పురంలో
ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ
శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం
చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ
దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది! అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో
తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ
చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి
మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే
ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు’ అనే వార్త ప్రచురుణ అయ్యింది.
అది చదివిన రుద్రయ్య 'విగ్రహాలు లేని
ఆలయంలో శివలింగం ఎక్కడ్నుంచి వచ్చుంటుంది...? పూజారులే లేని ఆ
ఆలయంలో శివపూజ చేసిన ఆ వయసైన మనిషి ఎవరై ఉంటారు? శివతాండవపురం
లోని శివాలయానికి వెళ్ళే తీరాలి...ఆ మాయల సన్యాసిని కలిసి ఆశీర్వాదం
తీసుకోవలసిందే...'అని నిర్ణయించుకున్నాడు.
భార్య దగ్గర గానీ, కూతురు దగ్గర గానీ, కొడుకు దగ్గర గానీ నోరెత్తలేదు. స్నేహితుని కొడుకు
పెళ్ళికి వెడుతున్నట్టు చెప్పి శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన
శివాలయానికి వచ్చాడు.
అక్కడ హాయిగా పీల్చుకోగలిగే
సువాసనతో కూడిన గాలి వీసింది.
ఆకాశంలో తలతలమని మెరిసిపోతున్న పూర్తి పౌర్ణమి చంద్రుడు బంగారు పల్లెంలా మెరిసిపోతున్నాడు.
భూమి మీద పడుతున్న పసుపు కాంతిని కృరమైన ఒక మేఘం ఒకటి పట్టుకోగా...ఆలయమంతా చిరు
చీకటి కమ్ముకున్నది.
ఏక్కడో కుక్క ఒకటి అరుస్తోంది.
ఒక కంకర స్థంభంపైన ఆనుకుని, కళ్ళు మెల్లగా
తెరిచి నిటారుగా కూర్చున్నాడు రుద్రయ్య.
టైము పన్నెండు అవుతోంది.
ప్రొద్దుటి నుండి ఏమీ తినకపోవటం వలన రుద్రయ్యకు ఆకలి
దహిస్తోంది.
తనతో తెచ్చుకున్న ఆహార పొట్లాన్ని గబ గబా విప్పాడు. మంచి
నీళ్ల బాటిల్ మూత తెరిచి పెట్టుకున్నాడు.
ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్ధం వినబడింది.
గబుక్కున తలెత్తి చూశాడు.
ఒక కాలును కుంటు కుంటూ నడుచుకుంటూ రుద్రయ్యను సమీపిస్తోంది
ఆ రూపం....
రుద్రయ్య చేతులు టార్చ్ లైటును వెతికేయి.
"స్వామీ...తినడానికి కొంచం ఆహారం దొరుకుతుందా? చాలా ఆకలిగా
ఉంది..." అని అడుగుతూ సమీపించింది ఆ రూపం.
"ఎవరు మీరు?"
టార్చ్ లైటును ఆ రూపం మొహంపైన వేస్తూ అడిగాడు రుద్రయ్య.
శరీరమంతా మురికితో ఉన్న ఆ పెద్దాయన కనిపించాడు. నడుం చుట్టూ
చిరిగిపోయిన ఒక తుండు కట్టుకోనున్నాడు.
లోతుకుపోయిన ఆయన కళ్లలో ఆకలి ఛాయలు కనిపించినై.
“నా పేరు వెంకటప్ప. ఈ
శివాలయానికి ప్రతి పౌర్ణమి రాత్రికీ ఎవరో ఒక మాయల ముని వస్తున్నట్టు విన్నాను.
ఆయన్ని చూడాలని వెతుక్కుంటూ వచ్చాను. ప్రొద్దుటినుండి అదిగో ఆ ప్రహారంలోనే కూర్చున్నాను..."
"మీకు ఏమిటి సమస్య?"
"ఎందుకూ పనికిరాని
ఈ ప్రాణం...ఈ శరీరం నుండి వెళ్ళిపోతే చాలు. ఇక మనిషి జన్మే వద్దు. తిన్నగా
మోక్షానికే వెళ్ళిపోవాలి...ఇది అడగటానికి మాయల మునిని కలవాలని వచ్చాను..."
పెద్దగా నిట్టూర్పు విడిచాడు.
ఆయన కంటి చూపు, ఆహార పొట్లం వైపు లోతుగా పడింది.
"ఇవ్వనూ" అని చెప్పినా, లాక్కుని తినేలాగా కనిపిస్తున్నారు.
"ఇదిగోండి...తినండి"
ఆహార పొట్లాన్ని, మంచి నీళ్ళ బాటిల్ ను...ఆయన చేతికి అందించాడు.
వొణుకుతున్న వేళ్ళతో వాటిని తీసుకున్నాడు వెంకటప్ప.
"భోజనం...మీకు లేదా...?"
"పరవాలేదు...నాకు
ఆకలిగా లేదు. మీరే తినండి..."
అంతకు మించి మాట్లాడలేక, పొట్లం విప్పి ఆవురావు మంటూ తినడం
మొదలుపెట్టాడు వెంకటప్ప. మంచి
నీళ్ళ బాటిల్లో చుక్క నీరు ఉంచకుండా అంతా తాగేశాడు.
"మీరు కూడా మాయల
మునిని చూడాలనే వచ్చేరా?"
"అవును..."
"మీకేమిటి సమస్య...?"
"నాకు చాలా
సమస్యలు ఉన్నాయి. అవన్నీ చెబితే మీరేమైనా తీర్చిపెట్టగలరా చెప్పండి...? ఆకలి తీరింది
కదా...అనవసరమైన వాగుడుతో నన్ను విసిగించకుండా వెళ్ళండి. నాకు నిద్ర
వస్తోంది...." అంటూ కఠినంగా మాట్లాడాడు రుద్రయ్య.
వెంకటప్ప మౌనంగా
నవ్వాడు...ఆయనకీ ఆవలింతా,
నిద్ర మత్తూ
వచ్చింది.
ప్రొద్దున అయ్యింది.
నిద్ర నుండి గబుక్కున లేచాడు రుద్రయ్య.
గుడి మొత్తాన్ని ఒక చుట్టు చుట్టి వచ్చాడు.
వెంకటప్ప కనబడలేదు…. శివాలయంలోకి మునులు ఎవరూ వచ్చినట్లూ అనిపించలేదు. పూజచేసినట్లూ అనిపించలేదు.
'ముసలోడు పచ్చి
స్వార్ధ పరుడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడే...'---కోపంతొ ఆలయం నుండి బయటకు
వచ్చాడు.
రెండు బస్సులు ఎక్కి తన ఇళ్ళు చేరాడు......నవ్వు మొహంతో
భార్య కమలం స్వాగతం పలికింది.
"మీరు ఊర్లో లేనప్పుడు ఇక్కడ ఏవేవో జరిగినై..."
"ఏం జరిగింది...?" నిరుశ్చాహం నిండిన
స్వరంతో అడిగాడు.
"మన మహేష్ విదేశీ ఉద్యోగానికి మూడున్నర లక్షలు 'ట్రావల్స్ ఏజెంటు’ ఒకతని దగ్గర కట్టి...అతని దగ్గర నుండి ఎటువంటి
సమాచారమూ లేకుండా రెండు సంవత్సరాలుగా వాడి చుట్టూ తిరుగుతుండే వాడు కదా...! ఆ
తిరుగుడికి ఈ రోజు ఒక ముగింపు వచ్చింది. ఆ ట్రావల్స్ ఏజంటే మన ఇంటికి వచ్చి పాస్
పోర్టు, విసా ను ఇచ్చి
వెళ్ళాడు..."
"అలాగా...!?"
"అది మాత్రమే
కాదు. మన శాంతి, కాలేజీలో తనతో
పాటు చదువుతున్న ఒక అబ్బాయితో ప్రేమ అనే పేరుతో తిరుగుతూ ఉండేది కదా...వాడు
తాగుబోతు, చాలామంది
ఆడపిల్లలతో పరిచయం ఉన్నవాడు అని మీరు కోడై కూసినా పెడ చెవిన పెట్టింది కదా.
హఠాత్తుగా ఈ రోజు నా దగ్గరకు వచ్చి 'వాడు మంచివాడు కాదని నాకు అర్ధమైయ్యింది....ఇక
వాడితో తిరగను సరికదా, వాడి ముఖమే
చూడను...నాన్న చూసే అబ్బాయినే పెళ్ళిచేసుకుంటాను’ అని చెప్పింది.
భార్య మొహంలో ఆనందం, ఉత్సాహం.
రుద్రయ్య నమ్మలేకపోయాడు.
కళ్ళు పెద్దవిగా వికసించాయి.
“అత్తగారింట్లో పెడుతున్న కోరంటికాలు
తట్టుకోలేక జీవిత లక్ష్యాలను వదులుకుని మనింట్లో ఉంటున్న మీ చివరి
చెల్లెల్ని...ఆమె భర్త, అత్తగారూ మనసు
మారి వచ్చి... క్షమించమని అడిగి వాళ్లతో తీసుకు వెళ్ళారు...”
తన సమస్యలన్నీ ఒకే రోజు పరిష్కారమై పోవటం గురించి
ఆలొచించి...ఆనందో ఆశ్చర్యంతో కరిగి పోయి ఇంటి బయటున్న వరాండాలోని స్థంబానికి
ఆనుకుని కూర్చుండిపోయాడు రుద్రయ్య.
"మీరు లేనప్పుడు మీ స్నేహితుడొకడు ఇళ్ళు వెతుక్కుంటూ
వచ్చారు...'రుద్రయ్యను బాధ
పడకుండా ఉండమని చెప్పండి. ఆయన సమస్యలన్నీ ఈ రోజుతో మాయమై పోతాయి’ అని చెప్పేసి వెళ్ళారు...ఆయన చెప్పినట్టే
జరిగింది చూశారా? ఏమిటీ వింత? అదే నాకు ఏమీ
అర్ధం కాలేదు..." అని పరవసించిపోయింది.
"స్నేహితుడా...పేరేమిటో అడిగావా?"
"అడిగాను... వెంకటప్ప
అని చెప్పారు..."
ఆమె చెప్పగా......
రుద్రయ్యకు అర్ధమయ్యింది.
కళ్ళల్లో నీరు పొంగి రాగా తనని తానే మరిచిపోయి చేతులెత్తి
దన్నం పెట్టాడు...ఆ ఆలయం ఉన్న దిక్కు వైపు చూస్తూ!
***************************************************సమాప్తం******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి