జ్ఞానోదయం...(కథ)

 

                                                                                   జ్ఞానోదయం                                                                                                                                                                    (కథ)

ఏరా చిన్న ఉద్యోగానికే నీకు కళ్ళు నెత్తికెక్కినయా? రోజూ రెండు మూడు గంటలు పనిచేయలేని వాడివి, రేపు జీవితంలో పైకెలా వస్తావురా? మాటి మాటికీ సెలవు పెట్టి కొంపలు చుట్టూ తిరుగుతున్నావు? నిన్ను కని పెంచిన పెద్ద వాళ్ళను సంతోషపరచాలనే ఉద్దేశ్యమే లేదా? జీవితంలో పైకొద్దామనే ఆలొచనే లేదా? చచ్చేంతవరకూ ఇలాగే పేదవాడిగా ఉండిపోతావా? మీకందరికీ ఎప్పుడురా జ్ఞానోదయం కలుగుతుంది? వారం రోజులూ నువ్వు టైముకు రాక నేనెంత అవస్తపడ్డానో తెలుసా?”

ఎవరినీ అనవసరంగా అనుమానించ కూడదు. నిందించకూడదు. ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. కారణం ఏమిటో తెలుసుకోకుండా ఎవరి గురించి మనసులో కూడా తప్పుగా అనుకోకూడదు. నువ్వు తప్ప మిగిలిన వారందరూ పనికిమాలిన వారు, బద్దకస్తులు అని పొరపాటున కూడా అనుకోకూడదు.

కొన్ని రోజులుగా టైముకు రాని వాడుటైముకు రాకపోవటానికి చెప్పిన కారణం విన్న తరువాత జ్ఞానోదయం, ఇతరులకు కాదు, మనకే కలగాలి అని తెలుసుకున్న వ్యక్తి ఎవరు? 

****************************************************************************************************

విసుగు ఎక్కువ అయ్యింది చలపతి కి!ఇంకా అతను రాలేదు...ఛఛ...

వాకిట్లోకి వచ్చి వాడికోసం ఎదురు చూడటం రోజు అది పదోసారి. కోపంతో ఈజీ చైర్లో కూర్చున్నాడు. ముందున్న టీపా మీద గ్లాసులో ఉంచబడ్డ కాఫీ...వేడి తగ్గిపోయి, మీగడ కట్టి చల్లగా ఉన్నది.

రోజూ ప్రొద్దున్నే మేల్కొన్న వెంటనే తప్పనిసరిగా న్యూస్ పేపర్ చేతిలో ఉండాలి.

మొహం కడుక్కుని, పళ్ళు తోముకుని, కాఫీని కొంచం కొంచంగా తాగుతూ వార్తలను వరుస క్రమంగా చదువుతాడు. ఏడున్నరకు హడావిడి పడుతూ స్నానాకి పరిగెత్తుతాడు. తొమ్మిందింటికి ఖచ్చితంగా ఆఫీసుకు బయలుదేరుతాడు.

గత కొన్ని రోజులుగా ఎందుకనో న్యూస్ పేపర్ రావటం ఆలశ్యమవుతోంది. అందులోనూ ఎప్పుడూ ప్రొద్దున్నే కరెక్ట్ టైముకు పేపర్ వేసే రెగులర్ కుర్రాడు కూడా రావటం లేదు. ఎవరో ఒక కొత్త కుర్రాడు వస్తున్నాడు. వాడేమో ఆలశ్యంగా ఏడున్నరకు పేపర్ వేస్తున్నాడు. ఏడున్నరకు వచ్చి పడే న్యూస్ పేపర్లో హెడ్ లైన్లు చదవటానికి మాత్రమే సమయం ఉంటోంది. పేపర్ చదివిన తృప్తే ఉండటం లేదు. చాలా సంవత్సరాల అలవాటు బాధించబడటంతో అతనికి విపరీతమైన కోపం వస్తోంది.

రోజు ఏడున్నరకు వచ్చిన పేపర్ బాయ్ ని పట్టుకున్నాడు చలపతి.

రేయ్...ఆగరా అంటూ ఆగున్న అబ్బయ్ దగ్గరకు వచ్చాడు.

ఏమిట్రా ఇది...ఏడున్నరకు పేపర్ వేస్తే చదవటానికి టైమేదిరా. ప్రొద్దున్నే రావాలని తెలియదా? రేపట్నుంచి ప్రొద్దున్నే రాకపోయేవో మీ ఓనరుకు చెబుతాను

సార్...ఇది నా ఏరియా కాదు. ఏదో ఓనర్ చెప్పాడని, నా మామూలు ఏరియా పని అయిన తరువాత, పోనీలే అని మీ ఏరియాకు వస్తున్నాను. రోజూ టైముకే రాగలను. ముందు రాలేను అని చెప్పేసి వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.

ఎంత పొగరుగా మాట్లాడాడు అని పళ్ళు కొరుక్కుంటూ ఇంట్లోకి వెళ్లాడు.

రోజు ఆఫీసు నుండి ఇంటికి వస్తూ పేపర్ ఏజంట్ ఆఫీసుకు వెళ్లాడు. లక్కీగా ఏజంట్ అక్కడున్నాడు.

రండి చలపతి గారు...ఏమిటిలా వచ్చారు

ఏన్నిసార్లు ఫోను చేసినా మీరు దొరకటం లేదు. రెండుసార్లు ఇక్కడికి కూడా వచ్చాను. మీరు ఇక్కడా దొరకలేదు. నా అదృష్టం రోజు దొరికేరు

ఏమిటి సార్ నాతో అంత అర్జెంటు పని?”

ఏమిటా...మీకు నిజంగానే తెలియదా? మీ కుర్రాడు పేపర్ ఎన్నింటికి వెస్తున్నాడో మీకు తెలుసా? ఏడున్నరకి.... కొన్ని రోజులుగా హెడ్ లైన్లు మాత్రమే చదువుతున్నాను

...అదా. మీ ఏరియాకు రెగులర్ గా వచ్చే కుర్రాడు మాటి మాటికీ లీవు పెడుతున్నాడు. అందుకని ఇంకో ఏరియాకు వెళ్ళే కుర్రాడ్నే మీ ఏరియాకూ పంపుతున్నాను. అందువలనే ఆలశ్యం అవుతోంది కొంచం ఓర్చుకోండి... అన్నాడు.

మాటి మాటికీ సెలవు పెట్టే పనికిమాలిన కుర్రాడ్ని ఎందుకు పనిలోకి పెట్టుకోవాలి? బద్దకస్తుడ్ని  వెంటనే తీసేసి, వేరే కుర్రాడ్ని పెట్టద్దా?”

సార్...అది చాలా కష్టం సార్. కుర్రాళ్ళు దొరకటమే చాలా కష్టంగా ఉంది. ఒక వేల దొరికినా మంచి వాళ్ళు దొరకటం లేదు. కొంచం ఓర్చుకోండి సార్. రెండు రోజుల్లో వస్తాడు

కానియ్యండి. నెల డబ్బులకు వస్తాడుగా? అప్పుడు చెబుతా?” అని చెప్పుకుంటూ కోపంగా వెళ్ళిపోయాడు చలపతికి.

ఇంటికి వెళ్ళిన చలపతి కోపం ఆవేశంగా మారింది. పదే పదే పేపార్ వేసే పాత కుర్రాడే జ్ఞాపకం వస్తున్నాడు.

పనికిమాలిన వెధవ. వీడేం బాగుపడతాడు. చదువుకోవల్సిన వయసులో చదువుకోకపోవటం. వచ్చే డబ్బులతో సిగిరెట్లు, బీడీలూ, మందు సీసాలు కొనుక్కొవడం, చెయ్యకూడిన స్నేహాలు చేయడం. రౌడీలుగా ఎదగటం, దొంగతనాలకు పాల్పడటం, కిరాయి హంతకులుగా సెటిల్ అవడం, జీవితాన్ని జైళ్ళల్లో గడపటం ...వీళ్లందరికీ ఏప్పుడు జ్ఞానోదయం కలుగుతుందోమనసులోనే తిట్టుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజు ప్రొద్దున ఆరుంబావుకే దొబ్అని న్యూస్ పేపర్ ఇంట్లోకి వచ్చి పడటంతో, ఆశ్చర్యపోయిన చలపతి నిన్న కుర్రాడికిచ్చిన తిట్ల డోస్బాగానే పనిచేసినట్లుంది. రోజు ప్రొద్దున్నే పేపర్ వేశాడు తనని తానే మెచ్చుకున్నాడు. పేపర్ తీసుకుని రోడ్డు వైపుకు చూసిన చలపతి కి ఇంతకు ముందు ఎప్పుడూ వచ్చే కుర్రాడే కనబడ్డాడు.

రేయ్ ఆగరా అని అరిచి వాడిని ఆపాడు.     

ఏరా చిన్న ఉద్యోగానికే నీకు కళ్ళు నెత్తికెక్కినయా? రోజూ రెండు మూడు గంటలు పనిచేయలేని వాడివి, రేపు జీవితంలో పైకెలా వస్తావురా? మాటి మాటికీ సెలవు పెట్టి కొంపలు చుట్టూ తిరుగుతున్నావు? నిన్ను కని పెంచిన పెద్ద వాళ్ళను సంతోషపరచాలనే ఉద్దేశ్యమే లేదా? జీవితంలో పైకొద్దామనే ఆలొచనే లేదా? చచ్చేంతవరకూ ఇలాగే పేదవాడిగా ఉండిపోతావా? మీకందరికీ ఎప్పుడురా జ్ఞానోదయం కలుగుతుంది? వారం రోజులూ పేపర్ టైముకు రాక నేనెంత అవస్తపడ్డానో తెలుసా?”

క్షమించండి సార్...ఇన్ని రోజులూ ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయటానికి వెళ్ళిపోయాను సార్. అందుకే సెలవు పెట్టేను సార్. తండ్రి లేని నన్ను, తమ్ముడ్నీ ఆమ్మే ఇంటి పనులకు వెళ్ళి  చదివిస్తోంది సార్కొంత వరకైనా తల్లికి సహాయపడదామనే పేపర్లు వేసే పని చేస్తున్నాను. పరీక్షలు అయిపోయినైసార్. ఇక మీదట త్వరగానే వచ్చి పేపర్ వేస్తాను సార్... అన్నాడు వినయంగా.

నిర్ఘాంతపోయిన చలపతి వీడ్ని నేను పనికిమాలిన వాడు, బద్దకస్తుడు అని తిట్టిపోసేమే...జ్ఞానోదయం వీడికి కలగాలా, నాకు కలగాలా...ఎందుకురా సెలవు పెట్టావు అని నిదానంగా వాడ్ని అడిగుంటే ఎంత బావుండేదీ తనలో తానే మదన పడుతూ జ్ఞానోదయం కలిగినట్లు కారణం ఏమిటో తెలుసుకోకుండా ఎవరి గురించి మనసులో కూడా తప్పుగా అనుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు చలపతి

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ప్రేమ గుంట...(కథ)