మహాలక్ష్మి...(కథ)

 

                                                                          మహాలక్ష్మి                                                                                                                                                                      (కథ)

ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలో జతగా స్నేహితురాలవయ్తివి...కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి...వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి...పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి...అని అన్నారు. కష్టంలో ముందుండి...సుఖంలో క్రిందుండి...విజయంలో వెనకుండి ...ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ.

కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ,  ఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది.

ఇంతమారినా ఇంకా స్త్రీని వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు....కానీ, ఇంకా ఎంతోమంది పురుషులు స్త్రీపట్ల అత్యంత గౌరవం కలిగి మహాలక్ష్మిగా చూస్తున్నారు. కథలో పేదరికంలో ఉంటున్న ఒక పురుషుడు స్త్రీని ఎలా చూసాడో చూడండి.

****************************************************************************************************

సూర్యకిరణాలు గుడిసె ఇంటిపైన ఉన్న చిల్లులో నుండి లోపలకు దూరింది. నిద్రపోతున్న ఈశ్వరమ్మను కాల్చింది. ఆమె నిద్రలో నుండి లేచింది. ఆమె యొక్క ఇద్దరుపిల్లలూ ఆదమరచి నిద్రపోతున్నారు. వాళ్ళు వేసుకోనున్న చిరిగిన బట్టలు, ఎండిపోయున్న తల కేశాలు వాళ్ల పేదరికం అబలాన్ని ప్రతిఫలింపజేస్తోంది.

ఇంటినుండి బయటకు వచ్చిన ఈశ్వరమ్మ వంద అడుగుల దూరం నడిచింది. అక్కడ వీధి పక్కగా చాలామంది జనం గుమికూడి ఉన్నారు. చోటే ఆమె భర్త ఏడుకొండలుకు జీవాధారం.

వికలాంగుడైన అతను ప్రతిరోజూ వీధికి ఒక పక్కగా, వీధిపై బ్రహ్మాండమైన దేవుడి చిత్రాలను తన చేతి ప్రతిభతో గీసి మెరుగులు దిద్దుతూ ఉంటాడు. అద్భుతంగా గీసిన కళాఖండం చిత్రాలను చూసి ఆనందించటానికి చాలామంది గుమికూడుతారు. కళాచిత్రం మీద వాళ్ళు ఎగరేసివెళ్ళే డబ్బులే వాళ్ళ కుటుంబ ఖర్చులకు చేయూతనిస్తోంది. ఈశ్వరమ్మ దగ్గర్లో ఉన్న ఒక ఇంట్లో పనిచేస్తోంది. అందులో దొరికేది కొద్ది సంపాదనే.

ఏడుకొండలు తన వారినందరిని సునామీకి అర్పణం ఇచ్చాడు. అందువల్ల ఒంటరి మనిషిగా అయ్యాడు. ఈశ్వరమ్మకు ఒకే ఒక బామ్మ. ఆవిడ కూడా చనిపోయిన తరువాత ఈశ్వరమ్మ కూడా  ఒంటరిగా నిలబడింది. 

ఈశ్వరమ్మ, ఏడుకొండలు మీద జాలిపడి, అతని చిత్రాలు గీసే ప్రతిభ మీద ఆకర్షితురాలై ప్రేమలో పడి, ఇద్దరూ భార్యా-భర్తలు అయ్యారు.

రోజు మామూలుకంటే ఎక్కువ గుంపు వీధి పక్క గీయబడిన చిత్రం చుట్టూ నిలబడి ఉండటం చూసి వేగ వేగంగా వెళ్ళిన ఈశ్వరమ్మ, గుంపును  జరుపుకుని ముందుకు వెళ్ళి చూసింది. అక్కడ ఏడుకొండలు మహాలక్ష్మి చిత్రం ను చాలా అందంగా తత్ రూపంగా గీసున్నాడు. దేవత చేతిలో ఉన్న కుండలో నుండి, బంగారు నాణాలు నేలమీద పడుతున్నట్టు స్వాభావికంగా ఉన్నది.

అటువైపుగా వెడుతున్న కొందరు కళాకండం ను చూసి ఆశ్చర్యపోయి, చాలా డబ్బును వేస్తున్నారు. ఎలాగైనా రోజు మామూలుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయని సంతోషపడ్డ ఈశ్వరమ్మ కళ్ళు భర్తను వెతికినై. రోడ్డుకు అవతలివైపు అతను ఉన్నాడు. అక్కడ కారులో కూర్చునే ఉన్న ఒకాయన ఏడుకొండలుతో మాట్లాడుతున్నారు. కొంత సమయం తరువాత కారు బయలుదేరటంతో...  ఏడుకొండలు తన భార్య ఉన్న వైపుకు చూసి నవ్వుతూ దేక్కుంట్టూ వచ్చాడు.

ఏంటయ్యా రోజు ఇంత సంతోషంగా ఉన్నావు...నువ్వు గీసిన చిత్రం సూపర్ గా ఉంది...అవును, కారులో ఉన్నది ఎవరు...ఏమడిగారు?”

"... అదా...ఆయన చాలా పెద్ద డబ్బుగల వ్యక్తి. గొప్ప వ్యాపారి. తన విసిటింగ్ కార్డు ఇచ్చి, అడ్రస్సుకు రమ్మన్నారు. కళా చిత్రాలు వేసే పని ఇస్తానని, దానికి మంచి కూలీ ఇస్తానని ప్రామిస్ చేసారు. నేను వెంటనే బయలుదేరాలి" అన్నాడు.

అది విన్న వెంటనే ఈశ్వరమ్మ కుషీ చెందింది.

అయ్యా...వెళ్ళేది పెద్దచోటు లాగా అనిపిస్తోంది. మంచి దుస్తులు వేసుకెళ్ళు అంటూ భర్తను పిలుచుకుని గుడిసెకు వెళ్ళింది. ఉన్నదాంట్లోనే మంచి దుస్తులు తీసి, వేసుకోవటానికి ఇచ్చింది. ఇష్టదైవాన్ని ప్రార్ధించుకుని సంతోషంగా భర్తను పంపించింది. తరువాత పిల్లలను స్కూలుకు పంపించి, తానూ పనికి వెళ్ళింది.

మామూలు కంటే ఎక్కువ ఉత్సాహంగా కనబడింది ఈశ్వరమ్మ. త్వరగా పనులు ముగించి ఇంటికి వెళ్ళింది. అప్పుడు వాకిట్లో తన భర్త కూర్చోనుండటం చూసింది.

ఆనందం తట్టుకోలేక పరిగెత్తుకుని వచ్చింది. ఏంటయ్యా అంత త్వరగా వచ్చాసావు?” అని గబగబా అడిగింది.

ఏడుకొండలు ఉత్సాహం కోల్పోయి, మొహాన్ని తిప్పుకున్నాడు. ఆమె తపనతో మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడిగింది.

ఏడుకొండలు సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నాడు.

ఏంటయ్యా...నేను అడుగుతూనే ఉన్నాను. నువ్వేమీ జవాబు చెప్పటం లేదు

నాకు పని నచ్చలేదు. నేను వద్దని చెప్పేసి వచ్చాసాను ఈశ్వరమ్మా... అన్నాడు.

ఏంటయ్యా చెబుతున్నావు. నీకెందుకయ్యా బాధ్యతే రావటంలేదు. పేదరికంతోనే మనం ఎన్ని రోజులయ్యా కష్టపడాలి

దాని కోసం...

నీకు అక్కడ చిత్రాలు గీసే పనే కదా ఇచ్చారు...అది నీకు బాగా నచ్చుతుందే

చిత్రాలు గీయటం నాకు చాలా ఇష్టమే... అన్నాడు.

మరైతే నీకేమిటయ్యా కష్టం...చెప్పవయ్యా?” పేదరికాన్నీ, భర్త యొక్క వికలాంగ పరిస్థితిని ఆలోచించి కోపంగా అరిచింది.

లేదమ్మాయ్...వాళ్ళు...వాళ్ళు, ఒంటి మీద ఒక చిన్న గుడ్డముక్క కూడా లేకుండా ఒక స్త్రీని నిలబెట్టి, ఆమెను చూసి చిత్రం గీయమంటున్నారు. నాకు నచ్చలేదు. అమ్మాయిని చూస్తునప్పుడు నీ జ్ఞాపకమే వచ్చింది. అందరూ అశ్లీలత చూసేటట్టు రూపాన్ని చిత్రంగా గీయటం నాకు నచ్చలేదు...స్త్రీని మహాలక్ష్మితో పోలుస్తారు.  మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. మా ఇంటి మహాలక్ష్మిని మీ ఇంటికి పంపిస్తున్నాంఅని ఎందరు తల్లి-తండ్రులు తమ ఇంటి మహిళలను మహాలక్ష్మితో పోలుస్తారు.  అలాంటి స్త్రీని నగ్నంగా గీయటం హీనమైన పని. నా గుండే ఉడికిపోతోంది...అందుకే పనీ వద్దూ, పాడూ వద్దు అని చెప్పేసి వచ్చాను

ఏమయ్యా నగ్నంగా ఉన్న స్త్రీ చిత్రాన్ని కళాపోషణ కళ్ళతో చూడాలని అదీ, ఇదీ...అంటారే...

నా చూపలకు అక్కడ కళాపోషణ ఎవరి మొహాలలోనూ కనిపించలేదు. నువ్వు నీ పేదరికాన్ని తలుచుకుని కన్నీరు విడిచి శోకంగా ఏడుస్తున్నట్టు తెలిసింది. నావల్ల అలా చిత్రాలను గీయటం కుదరదు. ఒక అబలను తీసుకు వచ్చి నగ్నంగా నిలబెట్టి బూతు చిత్రాలు గీయించుకుని, వాటిని విదేశాలకు అమ్మి డబ్బులు చేసుకునే వాళ్ళకు నా కళను నేను అమ్మలేను. మనకు మాహాలక్ష్మి వలన వస్తున్న సంపాదనే చాలు... రోడ్డు మీద చిత్రాలను గీయటానికి కావలసిన సామగ్రిని తీసుకుని రోజూ చిత్రం గీసే రోడ్డు వైపుకు దేక్కుంటూ వెళ్ళటానికి రెడీ అయ్యాడు.

భర్త మీద మర్యాద పెరిగిన చూపులతో గర్వంగా చూస్తూ స్థంభించిపోయింది ఈశ్వరమ్మ!  

*************************************************సమాప్తం************************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)