వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)

 

                                                                        వరం ఇచ్చిన దేవుడికి                                                                                                                                                           (కథ)

మన జీవితంలో అడుగడునా ప్రొత్సాహం, దైర్యం నింపుతూ ప్రేమను పంచేవాళ్ళు దొరకటం ఒక వరం.

చిన్నప్పుడు తల్లి-తండ్రుల ప్రేమ, గారాబం ఒక వరం.

పెళ్ళి అయినాక భర్త, అత్త-మామల, పిల్లల చూపే ప్రేమ ప్రొత్సాహం  ఆడదానికి ఒక గొప్ప వరం అనే చెప్పాలి. 

అమ్మ.......దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం అమ్మ...! అమ్మ మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది ఆప్యాయత, అనురాగం. ప్రేమ.

"నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసిన అమ్మా--నీకు శతకోటి వందనాలు" అని తన ఆనందాన్ని తల్లికి తెలియజేసిన స్వాతి జీవితకథలో కూతురుకి ఆమె తల్లి వరమా? లేక ఆ తల్లికి ఆమె కూతురు వరమా? ఎవరు ఎవరికి వరం?  

************************************************************************************************

ఇంటి దగ్గరకు వచ్చిన పత్రికా విలేఖరులు అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నది రాజ్యలక్ష్మి. అంతకంటే కూతురికి విదేశాలలో దొరికిన అరుదైన గౌరవానికి ఉబ్బితబ్బిబ్బు అవుతోంది....నిజంగానే స్వాతిని నాకు కూతురుగా ఇవ్వటం నాకు దేవుడిచ్చిన వరమే. అంతమంది ఆమె చుట్టూ ఉన్నా, ఆమె తన పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది.

                                                               ***********************************

"అమ్మా...నా పరిశోధనా వ్యాసాన్ని సెలెక్ట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆగస్టు నెల స్వీడన్ దేశంలో జరుపబోతున్న ప్రపంచ మహిళా మహాశభలో దాన్ని చదివి వినిపించటానికి ఆహ్వానం వచ్చింది. భారతదేశంలోనే అవకాశం నాకొక్క దానికే దొరికింది..."--- ఉత్సాహంతో, కళ్ళల్లో వెయ్యి మెరుపుల కాంతి ప్రవహిస్తున్నట్టు మాట్లాడుతున్న స్వాతి ని కూతురుగా కన్నదనే ఆలొచనతో ఉబ్బితబ్బిబ్బు అయ్యింది తల్లి రాజ్యలక్ష్మి.

కళాశాలలో బయాలజీ రెండవ సంవత్సరం ప్రాజెక్ట్ చేయటానికి స్వాతి ని ఎన్నుకుని ఆమెకు "శిశువధ, అబార్షన్" అనే టాపిక్ ఇచ్చారు.

విషయాన్ని ఇంతవరకు పరిశోధనలకు ఎందుకు తీసుకోలేదు? అనేది నాకు తెలుసు అమ్మ రాజ్యలక్ష్మి యొక్క ఆలొచన కొన్ని సంవత్సరాల వెనుకకు పరిగెత్తింది.

"అమ్మా...ఇప్పుడంతా నేను ఏదైనా చెబితే వెంటనే నీ ఆలొచన ఎక్కడికో వెడుతోందే...ఎందుకమ్మా?" అడిగింది కూతురు స్వాతి.

"......అదంతా ఏమీ లేదు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు"

"మనదేశంలోనూ... మరికొన్ని దేశాలలోనూ ఆడపిల్లలు పుట్టకుండా ఉండటానికి పలు విధాలుగా అబార్షన్ చేస్తున్నారు. దాని మీదే నా వ్యాసం. దీనికొసం నీ దగ్గర కూడా అప్పుడప్పుడు వివరాలు అడిగానే...."  

తల్లి తనకు చెప్పిచ్చిన పాఠాలను మళ్ళీ తల్లికి గుర్తుచేసింది స్వాతి .

చదువుకున్న కొంతమంది మూర్ఖ మహిళలు, పిల్లలను కడుపులోనే అబార్షన్ పేరుతో చంపేస్తున్నారు. గ్రామాలలో నివసిస్తున్న మహిళలకు, రెండో బిడ్డ కూడా ఆడపిల్లగా పుడితే ఆ మహిళను 'నువ్వు మీ ఆమ్మా వాళ్ళింట్లోనే ఉండు అని అత్తింటి వాళ్ళు చెబుతున్నారు. అత్తగారింట్లో మాట్లాడే సూటిపోటి మాటలకు భయపడి తల్లి పాలు ఇవ్వటానికి బదులు విషం పాలు ఇచ్చి చంపేస్తున్నారు.

దీనికి ముగింపు ఏమిటో తెలుసా?

కుటుంబాలలో ఒక మొగ పిల్లవాడిని పెంచేటప్పుడు, ఆడపిల్లల దగ్గర వాడు ఎలా నడు చుకోవాలో? అనే దాని గురించి మొదట చెప్పాలి. ఇంట్లో ఉన్న మగ వారు భర్త, నాన్న, సహోదరుడు....ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళింట్లోని ఆడవాల్ల దగ్గర ఎలా నడుచుకుంటున్నారూనే దానిని బట్టే చాలా విషయాలు తెలుసుకోవచ్చు.

తరువాత...ఆడవాల్లను తోటి మనిషిగా, స్నేహపూర్వంగానూ చూడాలి. మగవారి ఆధిక్యతను కూకుటి వేర్లతో పెరికేయాలి. ఆడది పైకెదిగితే సంతోషించటానికి బదులు ఈర్ష్య పడటం తప్పు. వాళ్ళ మీద తప్పుడు మాటలు అనడం మహా తప్పు.

ఇంకా గ్రామాలలో ఆచారంలో ఉన్న మూఢ నమ్మకాలను పూర్తిగా తుడిచి పారేయాలి. భర్తను దేవుడిలా చూడటాన్ని ఆపాలి. ఎక్కువమంది పిల్లలను కనడాన్ని అడ్డుకోవాలి. అంతే కాకుండా, అబార్షన్ చేయించుకోవటం, పుట్టిన తరువాత విషం పాలు ఇచ్చి చంపటాన్ని గిల్లి పారేయాలి. మీరితే దండించాలి. మగవాళ్ళకు కూడా దండనలో సగం ఇవ్వాలి..."

ఇవన్నీ స్వాతి చెబుతుంటే, అమ్మ రాజ్యలక్ష్మి కళ్ళల్లో కన్నీళ్ళు పొంగినై.

తన జీవితంలో జరిగింది గుర్తు చేసుకుంది రాజ్యలక్ష్మి.

ఏమే! బిడ్డను నువ్వు మోయబోతావా? నీ భర్తే నిన్ను ఇష్టం లేక పెళ్ళి చేసుకుని ఒకే నెలలో లండన్ వెళ్ళి అక్కడొక లండన్ దానితో కాపురం చేస్తున్నాడు. తాలి తాడుకున్న పసుపు వాసన పోయేలోపల నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వాడి బిడ్డను నువ్వు మోయబోతావా? అది వద్దు. అబార్షన్ చేయించుకో"-----ఇది తండ్రి.

" బిడ్డ నీ భర్తకు మల్లే నీచ గుణంతో పుడితే ఏం చేస్తావు? నువ్వున్న పరిస్థితికి ఇవన్నీ వద్దు. ఇప్పుడే అబార్షన్ చేయించుకో"---ఇది అన్నయ్య.

అప్పుడే ఆలొచించాను. శిశు సంరక్షణ కేంద్రాలు. ఒక వేల నా బిడ్డను నేను పెంచలేకపోతే శిశు  సంరక్షణ కేంద్రంలో వదిలిపెట్టేద్దాం! అనే నిర్ణయానికి వచ్చి స్వాతి ని కన్నాను.

అంతవరకు కుటుంబంలోని వాళ్ళ తిట్లు, సాధింపులకు లోనైయ్యాను. పుట్టిన తరువాత బిడ్డ మొహం చూస్తే, వాళ్ళే మారుతారులే అనుకున్నాను. అందులోనూ నాకు ఓటమే.

నా జ్ఞాపకాలను చెదరగొట్టింది నా కూతురు మాటలు.

"అమ్మా...వింటున్నావా...లేదా?"

"హూ...చెప్పు...చెప్పు"

"పాశ్చ్యాత్త దేశాలలో ప్రశవ రోజులలో భర్తలు, భార్యలతోనే ఉంటారు/ఉండాలి. బిడ్డ పుట్టిన వెంటనే తల్లికీ, బిడ్డకు ఊపిరి పొరలాగా ఉండే పేగును భర్తే కత్తిరించి తల్లినీ, బిడ్డనూ వేరు చేస్తారు. అది ఎందుకో తెలుసా? ఇంతవరకు భార్యగా ఉంటున్న ఆమె పది నెలలు ఒంటరిగా మోస్తున్న పిండాన్ని బిడ్డగా తయారుచేసి ప్రపంచానికి అందించింది. ఇక మీదట సుఖమైన భారాన్ని మోయడంలో నాకూ భాగం ఉన్నదనే ప్రమాణ స్వీకారాం అది. కట్టుకున్న భార్య పడే ప్రశవ నొప్పులను భర్త కళ్ళారా చూస్తేనే భార్య విలువ తెలుస్తుంది

ఆమె కొంచం ఆపటంతో  తల్లి రాజ్యలక్ష్మి జ్ఞాపకాలు మళ్ళీ వెనక్కి వెళ్ళాయి.

"ఎంత చెప్పినా వినకుండా దీన్ని కన్నావు. ఇప్పుడు దీన్ని ఎలా పెంచబోతావు? నువ్వే దేన్నైనా పట్టుకుని నడుస్తున్నావు. అలాంటప్పుడు దీన్ని పెంచడం కుదురుతుందనుకుంటున్నావా. వద్దునే వద్దు. నాతో వచ్చాయి. ' శిశు సంరక్షణ కేంద్రంలో కర్మాన్ని వదిలేద్దాం. త్వరగా ఒక నిర్ణయానికిరా. దీన్ని తీసుకుని నువ్వు ఇంటికి రాకూడదు"-----కన్న వారి మాటలు అగ్ని కణాలుగా మారినై.

"......................."

"ఏమిటి సమాధానమే రావటం లేదు? ఇలాగే చచ్చిపోతావా? నీ తలరాత అలా రాసుంటే ఎవరు మార్చగలరు? ఎలాగైనా పో"

అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ, నేను ఒక మంచి నిర్ణయం తీసుకోవటానికి వాళ్ళు సహాయం చేశారనే చెప్పాలి. అవును, బిడ్డతో పాటూ నేనూ ఒక ఆశ్రమంలో చేరి, నాకు చేతనైన పనులు చేస్తూ స్వాతి ని పెంచాను.

"ఏమ్మా...నేను చెప్పేది కరెక్టే కదా?"

"......అవును. ఎలాగమ్మాయ్ ఇలా ఆలొచించావు?"

"అమ్మా...నువ్వు తల్లిగా మాత్రమే నా మీద ప్రేమ చూపించలేదు. చిన్నప్పటి నుంచే ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలనూ నాజూకుగా చెప్పి పెంచావు. నిన్ను పెళ్ళి చేసుకున్న నెలలోనే పారిపోయిన దేనికీ పనికిరాని భర్త. ఇది పోనీలే అనుకుంటే నీ నాన్న, అన్నయ్య మగ అహంకార సంఘంలో ఆఫీస్ బేరర్స్. వాళ్ళ గురించి నా చిన్న వయసులోనే చెప్పావు"

"మహిళ అనేది ఉత్త భోగం వస్తువో, లేక పిల్లలు పుట్టించే మిషనో కాదు. వారసులను ఉత్పత్తి చేసే దేవత అనేది నాకు అర్ధం అయ్యేటట్టు చెప్పావు. మనకు కావలసిన గుర్తింపు మనమే తెచ్చుకోవాలి అనటానికి నువ్వే ఒక పెద్ద ఉదాహరణ...నిన్ను ఎవరితోనూ పోల్చలేము. నా ముద్దుల అమ్మా..." అని కౌగలించుకుంది.

నా తండ్రి, అన్నయ్య నన్ను 'వెళ్ళిపో' అని నోటి మాటతో మాత్రమే చెప్పలేదు. దాని కోసం విష గింజ కూడా విదజల్లారు అని తెలుసుకున్నప్పుడు నేను కష్టపడ్డ కష్టాలన్నీ ఇప్పుడు తొలగిపోయినై

"ఏంటమ్మా....నీ ఆలొచన ఎక్కడో ఉంది. నాకు బాగా ఆకలేస్తోంది. త్వరగా అన్నం తీసుకురా. ఏమిటి మెనూ!...ఉలవ చారు, బెండకాయ వేపుడు. కొబ్బరి పచ్చడి. ఊరు మెరప కాయలు... అంతేగా" అన్న కూతుర్ను ఆశ్చర్యంతో చూసింది.

"అమ్మా...ప్లీజ్. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. చైనాలో కూడా జనాభా ఎక్కువ అవుతోందని, దాన్ని కట్టుపరచటానికి కడుపులో ఉండగానే పిల్లలను చంపేస్తున్నారట. సర్వేలో ఇదంతా తేలింది. దానికీ మించి బిడ్డ బ్రతికితే....  

"చాలు స్వాతి...ఇప్పుడు మాట్లాడకుండా తిను. తరువాత మాట్లాదుకుందాం" అని చెప్పి పొంగుకు వస్తున్న ఏడుపును ఆపుకుని...వంటగదిలోకి శరణార్థిగా ఉండటానికి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి.

అరే భగవాన్...ఇదే పరిస్థితుల్లో ఇరవై ఒక్క సంవత్సరాలకు పూర్వం...

"డాక్టర్…..నా కడుపులో బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవచ్చా" అని అడిగింది రాజ్యలక్ష్మి.

"రిలాక్స్ రాజ్యలక్ష్మి.... రాజ్యలక్ష్మి రోజా పువ్వు రంగులో బొద్దుగా నీకు ఆడపిల్ల పుట్టింది. చూస్తావా?"

కళ్ళల్లోని నీరు చెంపలను తడుపుకుంటూ తల కింద ఉన్న దిండును కూడా తడిపినై.

"వెంటనే చూడాలి డాక్టర్"

"కానీ"

"కానీ ఏమిటి డాక్టర్?"

భయపడవద్దు రాజ్యలక్ష్మి. నీ బిడ్డకు రెండు కాళ్ళలోనూ అభివృద్ది లేదు. జీవితాంతం ఆమె వలన నడవటం కుదరదు"

"భగవంతుడా...ఎందుకింత పరీక్ష?"

"ఉష్...ఉష్... పరిస్థితుల్లో నువ్వు ఆవేశపడకూడదు. గట్టిగా మాట్లాడకూడదు. నేను ఏమనుకున్నానో అదే జరిగింది. కానీ, ప్రమాదం ఏమీ లేదు"

"ఏమిటి డాక్టర్? ఎందుకు పజుల్ వేస్తున్నారు. ఏమీ అర్ధం కావటం లేదు" ఆమె ముఖం వాడిపోయి కళావిహీనంగా ఉంది.

"నీకు జ్ఞాపకం ఉందా రాజ్యలక్ష్మి. నీ ఇంట్లో నువ్వు గర్భంగ ఉన్నప్పుడు నీ కడుపు తీసేయటానికి మందు ఇచ్చారని, నీకు సందేహంగా ఉన్నదని చెప్పావు____ఆ మందే నీ బిడ్డ కాళ్ళను వికళాంగం చేసింది"

విన్న వెంటనే ఆమె శరీరం మొత్తం కంపించింది. పెద్దగా ఏడ్చింది.

"అయితే నా బిడ్డ జీవితాంతం వీల్ చైర్ లో కూర్చునే ప్రపంచాన్నే చూడాలా డాక్టర్? నాకు మాత్రం ఎందుకిలా జరుగుతోంది?"

"అలా చెప్పకు రాజ్యలక్ష్మి. ఇప్పుడు నీకు ఒకే ఒక కాలులో వికలాంగం. చిన్నగా కుంటుకుంటూ నడుస్తున్నారు. అలాంటప్పుడు మీరు మీకున్న ధైర్యంతోనూ, ఆత్మ నమ్మకంతోనూ అందరూ ఎదిరించినా కూడా, వదిలేసినా కూడా ఒంటరిగా నిలబడి బిడ్డను కని పెంచుతాను అనే లక్ష్యంతో ఉన్నారు కదా? లక్ష్యాన్ని మరింత దగ్గర చేయండి. మీకు తోడుగా ఉండటానికి ఇంకొక ప్రాణం ఉన్నది. భగవంతుడి సృష్టిలో ఒక ప్రాణం పుట్టినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మీరు కావాలంటే చూడండి...మీ బిడ్డ ప్రపంచానికే దారి చూపే వ్యక్తి అవుతుంది. నన్ను నమ్మండి.

ఇంకొక విషయం చెబుతాను. భగవంతుడు నాకు మాత్రమే ఎందుకింత క్షోభ పెడుతున్నాడు? అని మీరు అనుకోవచ్చు. కానీ అందులో ఒక సూక్ష్మం దాగి ఉంది. ఇలాంటి ప్రత్యేకమైన పిల్లలను పెంచటానికి కావలసిన ఓర్పు, సహింపు స్వభావం, అభిమానం, ప్రేమ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళకు మాత్రమే ఇలాగంతా జరుగుతుంది. ఇది శాపం కాదు...వరం"

"అమ్మా...అమ్మా...ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూడు కలల ప్రపంచంలో తేలుతావు...నాకు ఆకలేస్తోంది అన్నం పెట్టు. అడిగి ఎంతసేపు అయ్యిందో తెలుసా?"

గబుక్కున కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చిన రాజ్యలక్ష్మి, అన్నం కంచంతో వచ్చింది.

అన్నం తింటూ...."అమ్మా ఒకే ఒక విషయం మాత్రం చెబుతాను. వ్యాసం ముగింపులో నేనొక సంభవాన్ని గుర్తుగా రాశాను. అది అందరినీ కలవర పరిచిందమ్మా. అది విన్న న్యాయనిర్ణేతలు, శభ్యులు, విసిటర్స్...అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు అంటే చూసుకో.

అదేమిటో తెలుసా? పంజాబ్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో, పుట్టి రెండు రోజులే అయిన తన మూడవ ఆడపిల్లను, వరుసగా భార్య ఆడపిల్లలను కనడంతో పుట్టిన ఆడపిల్లను చూడటానికి కూడా ఆమోదించలేదు.

అందువలన వణుకు పుట్టించో చలిలో, బట్టలు లేకుండా బిడ్డను ఇంటి బయట ఉంచేసి వచ్చింది తల్లి. అందులో ఆశ్చర్యం ఏమిటంటే బిడ్డ చనిపోలేదు. పుట్టి రెండు రోజులే అయిన బిడ్డ, బట్టలు లేకుండా రెండు రోజులు, కురిసే మంచులో ఉన్నందువలన బిడ్డ శరీరమంతా నీలి రంగు వచ్చేసింది.

 కానీ, బిడ్డకు ప్రాణం ఉన్నదని తెలుసుకున్న తల్లి ఒక నిర్ణయం తీసుకుంది. అవును, రెండు రోజులు వర్షంలా కురిసే మంచును,చలిని ఓర్చుకుని ప్రపంచాన్ని ఎదిరించి పోరాడటానికి నాకు ధైర్యమూ, నమ్మకమూ ఉన్నదని నా బిడ్డ నాకు చూపించింది.

కనుక, నేను బిడ్డ కోసం మగ ఆధిక్యత కలిగిన సమూహాన్ని ఎదిరించి నిలబడి నా హక్కులను, అధికారాన్నీ పోరాడుతాను" అని సపధం చేసింది.

కధను విన్న రాజ్యలక్ష్మి కళ్ళల్లో నీరు పొంగుకురాగా కూతుర్ని గర్వంగా చూసింది.

డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చినై.

ప్రత్యేకమైన పిల్లలను పెంచటానికి కావలసిన ఓర్పు, సహింపు స్వభావం, అభిమానం, ప్రేమ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళకు మాత్రమే ఇలాగంతా జరుగుతుంది. ఇది శాపం కాదు...వరం. "

అక్కడున్న గుంపులోని ఒకవ్యక్తి "అమ్మా...మీకు ఫొను అంటూ తన సెల్ ఫోనును రాజ్యలక్ష్మికి అందించటంతో ఆమె తన తన పాత జ్ఞాపకాలలో నుండి బయట పడింది.

                                                            ***********************************

"అమ్మా...నేను స్వాతిని, స్వీడన్ నుంచి మట్లాడుతున్నాను. ఇక్కడ నీ కూతుర్ని అన్ని దేశాలూ వరాలతో నింపేస్తోంది. గౌరవమంతా నీకే చెందుతుంది. ఎందుకంటే, నువ్వు లేకపోతే నేను లేను. నాకు దేవుడిచ్చిన వరం ఏమిటి తెలుసా, బహుమతులు, వరాలు కాదు...నిన్ను తల్లిగా నాకివ్వటమే దేవుడు ఇచ్చిన వరం. వారం ఆఖరిలో నేను నీ దగ్గర ఉంటాను. సంతోషంగా ఉండు" అంటూ ఫోన్ కట్ చేసింది.

చుట్టూ గుమికూడిన పత్రికల వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ రాజ్యలక్ష్మి చెవులలో కూతురు చెప్పిన మాటాలే వినబడుతున్నాయి.

 **************************************************సమాప్తం *************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)