మంచిదొక ఐడియా...(కథ)

 

                                                                  మంచిదొక ఐడియా                                                                                                                                                (కథ)

కన్న పిల్లలు ఉండి, ఆదరించే వారు లేక ఒంటరి తనంలో జీవిస్తూ వచ్చే తల్లి తండ్రులకు,మనసు ఒత్తిడి ఎక్కువై, ఆనారోగ్యం పాలవుతారు.

వయసు వచ్చిన కన్న వారు, పిల్లల దగ్గర, భర్త, భార్యల దగ్గర ఎదురుచూసే వాత్సల్యము, ఆత్మీయత, వాళ్ళ యొక్క బద్రత కోసమే. కొన్ని సమయాలలో ఆ నిజాన్ని చెప్పటానికి కూడా వాళ్ళు కాచుకోనుంటారు. అంతలోపు వాళ్ల జీవితం ముగిసుంటుంది.

'సరైన టైములో తీసుకోని నిర్ణయాలు, ముగింపులు జీవితాకాలం అంతా మనల్ని నొచ్చుకునేటట్టు చేస్తుంది.

***************************************************************************************************

సినిమా హాలులో భార్య సైలజాతో నూన్ షో చూస్తున్న మహేష్ యొక్క మొబైల్ ఫోను, కంటిన్యూగా వైబ్రేట్ అవుతోంది. వైబ్రేట్ అయినప్పుడల్లా ఫోను తీసి చూస్తున్నాడు.

తండ్రి శేఖర్ దగ్గర నుండే పిలుపు అనేది తెలిసిన వెంటనే అతనికి టెన్షన్ ఎక్కువ అయ్యింది.  సినిమాపై అతను మనసు పెట్టలేకపోయాడు. విరామం సమయం ఎప్పుడొస్తుందా అని వంకర్లు తిరుగుతున్నాడు.

"ఏమండీ, ఎవరండీ ఫోనులో. తీసి మాట్లాడండి. లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి" అంటూ విసుక్కుంది సైలజా.

పక్క సీటులో కూర్చోనున్న ఒక మహిళ, వచ్చిన దగ్గర నుండి దీన్నే గమనిస్తోంది. ఆమెకు సుమారు అరవై ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమె చూపులు ఇద్దరి దగ్గర ఏదో చెప్పాలన్నట్లే ఉన్నది.

ఒక విధంగా విరామం వచ్చింది. అర్జెంటుగా బయటకు వచ్చి, తండ్రికి ఫోను చేసాడు మహేష్.

"ఏమిటి నాన్నా విషయం?"

"ఏమిట్రా మహేష్...చాలా ముఖ్యమైన పనిలో ఉన్నావా? ఎప్పుడు ఫోను చేస్తే, ఇప్పుడు విచారిస్తున్నావు?"

"ఎందుకు టెన్షన్ గా ఉన్నారు. ఏదైనా సమస్యా?"

"అవునురా సమస్యే. ఏం చెప్పమంటావు!"

"ఏమయ్యింది నాన్నా?"

"హఠాత్తుగా, దుర్గా ఒక బాంబు విసిరి పడేసింది"

"కాస్త వివరంగా చెప్పొచ్చు కదా?" మహేష్ యొక్క స్వరం లో ఉన్న ఆందోళన శేఖరం ఊహించగలిగాడు.

"ఏం చెప్పాలో తెలియటం లేదు. ఫోనులో వద్దు; నువ్వు తిన్నగా రా మాట్లాడుకుందాం" అన్నారు.

"సరే నాన్నా...మూడు గంటల కల్లా నేను ఇంట్లో ఉంటాను" అని చెప్పి, ఫోను కట్ చేసిన మహేష్, అయోమయంతో తన సీటుకు వచ్చాడు.

"ఏమండీ, తినడానికి ఏమీ తేలేదా...మీ మొహం ఎందుకు అదొలా ఉంది?" అని అడిగింది సైలజా.

తండ్రి దగ్గర నుండి ఫోను పిలుపు వచ్చింది చెప్పాడు మహేష్.

"ఎందుకు టెన్షన్ పడతారు. ఇంకో గంట సేపట్లో సినిమా ముగియబోతుంది. ఆ తరువాత వెళ్ళి, ఏమిటో కనుక్కోండి. మొదట తినడానికి ఏదైనా తీసుకు రండి" అని ఆర్డర్ వేసింది సైలజా.

ఆ తరువాతి కొద్ది నిమిషాలలో సైలజా చేతిలో పాప్ కార్న్ ప్యాకెట్టు ఉన్నది. పక్కన కూర్చున్న మహిళ మళ్ళీ ఒకసారి సైలజాను చూసేసి, గబుక్కున తల తిప్పుకుని చిన్నగా నవ్వింది.

"ఆవిడ ఏమన్నా పిచ్చిదా అండీ? వచ్చిన దగ్గర నుండి నేనూ గమనిస్తూనే ఉన్నాను. మనం మాట్లాడుకుంటున్నదే వింటోంది. ఆవిడ చూపు వేరేలాగా ఉంది" అంటూ చేతిలో ఉంచుకున్న పాప్ కార్న్ న్ను కాలీ చేస్తూ ఉన్నది సైలజా.

సైలజా చెప్పింది చెవిలో వినబడ్డా దానికి సమాధానం చెప్పే మనో పరిస్థితిలో లేడు మహేష్. అతనికి పలు ఆలొచనలు వచ్చి వెళ్తున్నందువలన సినిమా ఎప్పుడవుతుంది అని అనిపిస్తోంది.

ఒక విధంగా సినిమా ముగిసింది. సినిమా హాలులో నుండి బయటకు రావటానికి తొందరపడిన మహేష్ అలాగే పక్క సీటువైపు చూశాడు.

ఆ మహిళ మంచి నిద్రలో ఉన్నది తెలిసింది. వెంటనే ఇంటికి వెళ్ళాలి అనేది తప్ప, అతని ఆలొచన వేరే దేనిమీదా వెళ్లలేదు.

సైలజాను ఆటోలో పంపించి, ఇంటివైపుకు వేగంగా పయనించాడు.

ఇంటి వాకిటికి చేరుకున్నప్పుడు టైము సరిగ్గా మూడు గంటల పది నిమిషాలు అయ్యింది.

హాలులోని సోఫాలో ప్రశాంతంగా కూర్చుని, టీ.వీ., చూస్తూ ఉన్నది తల్లి దుర్గాదేవి. అలా తల్లిని చూసిన వెంటనే ఆందోళనతో వచ్చిన అతనికి కొంచం రీలాక్స్ గా అనిపించింది.

తల్లి దగ్గరగా కూర్చున్న మహేష్, "ఎలా ఉన్నారమ్మా...ఎందుకని మొహం ఒకలాగా వాడిపోయుంది?" అన్నాడు.

"నేను బాగానే ఉన్నాను. నువ్వేంటి సడన్ గా ఈ టైములో వచ్చావు. నాన్న ఏదైనా చెప్పారా?"

"ప్రేమగా భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ, నువ్వు చాలా తెలివిగలదానివమ్మా. అవును, నాన్నే ఫోను చేశారు" అన్నాడు మహేష్.

"బాగా లోతుగా ఆలొచించే నా నిర్ణయాన్ని నాన్న దగ్గర చెప్పాను" అన్నది దుర్గాదేవి.

"ఏంటమ్మా చెబుతున్నావు?" అయోమయంగా అడిగాడు మహేష్.

దూరంగా నిలబడి, ఇద్దరూ మాట్లాడుతున్నది వింటున్న శేఖరం సోఫాకి ఎదురుగా ఉన్న కూర్చీలో సైలెంటుగా కూర్చున్నారు.

మెల్లగా మాట్లాడటం ప్రారంభించింది దుర్గాదేవి.

"ఉద్యోగానికి వెళ్లే వాళ్ళకి, అరవై ఏళ్ళు నిండిన వెంటనే ప్రభుత్వమే రిటైర్మెంట్ అనే పేరుతో విరామం  ఇస్తోంది. కానీ నాలాంటి ఇల్లాలుకి ఎప్పుడు, ఏ వయసులో, ఎవరు రెస్టు ఇస్తున్నారు. అందులోనూ ఒంటరి తనంతోనే ముప్పాతిక భాగం జీవిత సమయం ముగిసిపోతుంది. అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను" 

"ఏంటమ్మా చెబుతున్నావు?"

అవునురా మహేష్...ఎన్ని మాత్రలూ, మందులూ తీసుకున్నా షుగర్ లెవల్స్, బ్లడ్ ప్రషర్ తగ్గనే లేదు. మనసులో ప్రశాంతత లేకపోతే, మందులు ఎలా పనిచేస్తాయి.

అందుకని నేనే వాలింటరీ రిటైర్మెంట్ తీసుకుని ఎక్కడన్నా సీనియర్ సిటిజన్ హోములో చేరి ప్రశాంతంగా ఉండాలని లోతుగా నిర్ణయం తీసుకున్నాను.

మాట తోడుకు, పనులతోడుకూ ఒకత్తి వస్తే బాగుంటందనే అల్ప ఆశతో, నీకు పెళ్ళి చేశాము. కానీ పెళ్ళి అయిన మూడు నెలలలోనే మీరు వేరు కాపురం పెట్టేశారు.

ఇదిగో మీ నాన్న రిటైర్మెంట్ అయ్యి రెండు నెలలు అవుతోంది. ఏదైనా చిన్న, చిన్న పనులు చేసి నాకు సహాయంగా ఉంటారని ఎదురు చూశాను. కానీ, ఆయనేమో, ఇంతవరకు కష్టపడి పనిచేశాను. ఇక ప్రశాంతంగా కూర్చోమని ప్రభుత్వమే రెస్టు ఇచ్చేసింది అని ఏ పనీ చెయ్యకుండా, కూల్ గా కూర్చోనున్నారు.

ప్రొద్దున లేచిన దగ్గర నుండి, రాత్రి నిద్రపోయేంతవరకు, జీవితం ముగిసే వరకు పనిచేస్తూ ఉండటానికి నేనేమన్నా మిషనా...పనిచేయటం, ఒంటరి తనం మాత్రమే నా జీవితమంటే ఎలా, మహేష్? నేనూ మనిషినే కదా!"

అనిచిపెట్టుకున్న మనో బాధను, నాలిక ఎండిపోయేటట్టు దబదబ ఒలకబోసిన దుర్గాదేవి యొక్క కళ్ళల్లో కన్నీరు వాటర్ ఫాల్స్ లాగా పడింది.

ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు శేఖరం.

అమ్మ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మహేష్ యొక్క మనసులోని అయోమయం మెట్టుమెట్టుగా ఎక్కువ అయ్యింది.

ముఖం కూడా చూపకుండా మాటలే లేని ఇద్దరితో వేరువేరుగా మాట్లాడాడు.

ఆలోపు సైలజా దగ్గర నుండి పిలుపు. చేతి గడియారాన్ని చూసి ఆందోళన పడ్డ మహేష్, హోటల్ నుండి రాత్రి భోజనం తీసుకు వచ్చి డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి, అర్జెంటుగా బయలుదేరాడు.

ఇంటికి వచ్చిన వెంటనే "ఏమయ్యిందండీ...ఏదైనా సమస్యా?"

జరిగిందంతా ఒక్కటి కూడా వదలకుండా సైలజా దగ్గర చెప్పి ముగించిన మహేష్, బలమైన ఆలొచనతో, టీ.వీ.లో ఒక్కొక్క ఛానెల్ గా మారుస్తూ ఉన్నాడు.

అప్పుడు సినిమా హాలులో పక్క సీటులో కూర్చున్న మహిళ గురించి ముఖ్య వార్తగా, టెలికాస్ట్ అవుతున్నది.

ఛాన్నెల్ మార్చకుండా సైలజాను కేక వేసి పిలిచి, ఆందోళనతో చూశాడు మహేష్. సినిమా హాలులో సినిమా చూడటానికి వచ్చిన ఆ మహిళ, కుర్చీలోనే స్ప్రుహ కోల్పోయి పడున్న దృశ్యాలతో ఉన్నది ఆ వార్త. 

కన్న పిల్లలు ఉండి, ఆదరించే వారు లేక ఒంటరి తనంలో జీవిస్తూ వచ్చారు. మనసు ఒత్తిడి ఎక్కువై, విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని వార్త ద్వారా తెలియవచ్చింది.

వయసు వచ్చిన కన్న వారు, మన దగ్గర ఎదురుచూసే వాత్సల్యము, ఆత్మీయత, వాళ్ళ యొక్క బద్రత కోసమే. కొన్ని సమయాలలో ఆ నిజాన్ని చెప్పటం కూడా వాళ్ళు కాచుకోనుండరు. అంతలోపు వాళ్ల జీవితం ముగిసుంటుంది.

'సరైన టైములో తీసుకోని నిర్ణయాలు, ముగింపులు జీవితాకాలం అంతా మనల్ని నొచ్చుకునేటట్టు చేస్తుంది...' అని న్యూస్ రీడర్ ముగించినప్పుడు, మహేష్ యొక్క కళ్ళు సరస్సులాగా అయ్యింది.

మరుసటి రోజు తెల్లవారు జామున, ఐదు గంటల సమయం.

అలసటగా ఉండి బాగా నిద్రపోయిన దుర్గాదేవి, బెదిరిపోయి లేచింది. భర్త శేఖరం పక్కమీద కనబడలేదు. వాకిటి తలుపు గొళ్ళెం తీసి, తలుపు దగ్గరకు వేసుంది. ఆయన చెప్పులూ  కనబడలేదు.

అయోమయంతో టాయ్ లెట్ కు వెళ్ళి చూసింది. తళతళ మంటూ పరిశుభ్రంగా ఉంది. తరువాత వంట రూములోకి వెళ్ళింది. వాష్ బేసిన్ లో వేసున్న అంట్ల సామాన్లు కడిగి, బోర్లించబడి ఉన్నాయి. స్నానాల గదిలో వాషింగ్ మిషెన్ రన్ అవుతున్న శబ్ధం వినబడింది.

ఆశ్చర్యంలో దుర్గాదేవి కళ్ళు విప్పారినై.  పసుపు రాసుకుని, స్నానం చేసి ముగించింది.

చాలా రోజుల తరువాత పూజ గదిలో ఉన్న వీణను తీసి మీటిన ఆమె మనసు, ఆనంద వరదతో తుళ్ళిపడింది.

కొద్దిసేపట్లో ఇంట్లోకి వచ్చిన శేఖరం, సంగీతాన్నీ ఎంజాయ్ చేస్తూ, సొఫాలో వాలిపోయారు. గబుక్కున వీణ శబ్ధం ఆగిపోయింది.

ఆందోళనతో దుర్గాదేవి వైపుకు పరిగెత్తారు. వంట గది నుండి, చేతిలో రెండు కాఫీ కప్పులతో పెళ్ళికూతురు లాగా నడిచి వచ్చింది దుర్గాదేవి.

అప్పుడు శేఖరం సెల్ ఫోన్ మోగింది.

"ఏమండీ...ఎవరు ఫోనులో" అన్నది దుర్గాదేవి.

వెంటనే మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేశారు శేఖరం.

"ఈ నెలలో ఇల్లు ఖాలీ చేసేసి, తిరిగి మన ఇంటికే వచ్చేస్తాం. అమ్మ దగ్గర చెప్పేయండి నాన్నా" మహేష్ యొక్క స్వరం క్లియర్ గా వినబడింది.

"రేయ్ మహేష్. అవసరపడకు. మీరు ఇక్కడికి రాకండి"

"ఎందుకు నాన్నా?"

"నేను కూడా వేరు కాపురం పెడదామని నిర్ణయించుకున్నాను" అని మాట్లాడి ముగించి, ఫోను కట్ చేసిన శేఖరం కాఫీ తాగుతూనే, దుర్గాదేవిని చూశాడు.

ఇద్దరి మొహంలోనూ సంతోషం వెల్లి విరిసింది.

****************************************************సమాప్తం***************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏల్నాటి శని...(కథ)

ఆడపిల్ల…(కథ)