హక్కు...(కథ)

 

                                                                                   హక్కు                                                                                                                                                          (కథ)

రాజేశ్వరీలో ఏర్పడిన యాతన, ఇప్పుడు పెద్ద బండరాయిలాగా అవతారమెత్తి గుండెలమీద ఎక్కి కూర్చుంది. ప్రొద్దున ఏర్పడిన గుండె దడ, రెండు గంటలు అయినా ఇంకా తగ్గలేదు.

ఏ.టీ.ఎం. లో డబ్బు తీయటానికి వెళ్ళిన కోడలు పద్మ ఇంకా రాలేదు.

రెండు రోడ్ల అవతల ఉండే ఏ.టీ.ఏం. కు వెళ్ళి రావటానికి ఇంతసేపు ఎందుకు అనే ఆందోళన రాజేశ్వరీని వేధిస్తూ ఉన్నది.

రాజేశ్వరీకి ఎందుకు అంత ఆందోళన? ఎందుకు అంత వేదన?....తేలుసుకోవటానికి ఈ కథ చదవండి.

***************************************************************************************************

రాజేశ్వరీలో ఏర్పడిన యాతన, ఇప్పుడు పెద్ద బండరాయిలాగా అవతారమెత్తి గుండెలమీద ఎక్కి కూర్చుంది. ప్రొద్దున ఏర్పడిన గుండె దడ, రెండు గంటలు అయినా ఇంకా తగ్గలేదు.

ఏ.టీ.ఎం. లో డబ్బు తీయటానికి వెళ్ళిన పద్మ ఇంకా రాలేదు.

రెండు రోడ్ల అవతల ఉండే ఏ.టీ.ఏం. కు వెళ్ళి రావటానికి ఇంతసేపు ఎందుకు అనే ఆందోళన రాజేశ్వరీని వేధిస్తూ ఉన్నది. అయినా, రాగానే ఆమెను ఎదుర్కొనే ధైర్యం  లేకపోవటంతో రాకుండానే ఎక్కడైనా ఉండేసి ఆమె మెల్లగా వస్తే చాలు అని అనిపించింది.

ఎందుకు రాలేదు. తిన్నగా తల్లి ఇంటికి వెళ్ళిపోయిందా...అక్కడికి వెళ్ళి కూర్చుని నన్ను తలుచుకుంటూ చప్పట్లు కొడుతూ నవ్వుకుంటున్నదా?

ఈ పరిస్థితిలో, ఆమె ఎలా నవ్వగలదు. ఎంత పెద్ద నష్టం ఏర్పడింది ఆమెకు? నన్ను వెక్కిరించి ఆమెవల్ల నవ్వటం కుదురుతుందా?

నవ్వటం కుదరకపోయినా, నా గురించి ఎగతాలిగా మాట్లాడక పోయినా, ఎన్ని నష్టాలు ఉన్నా, దానినీ మించి ఆమె మనసు అనుకోదా?

'కొడుకు చచ్చినా పరవాలేదు! కొడలి తాళి తెంపాలి...' అంటూ, అత్తగారి కృరత్వం ఇక్కడ ఉందే...అదేలాగా మొగుడు చచ్చినా పరవాలేదు, అత్తగారు తన కాళ్ళ మీద పడాలి...' అని కోడలు మనసు మాత్రం అనుకోదా?

ఎందుకు అనుకోదు, పగతీర్చుకోవాలనుకునే మనసు, సమయం కోసం ఎదురు చూడదా. ఆ సమయాన్ని సందర్భం ఏర్పరచి ఇచ్చేసిందే...ఆమె మనసు ఎగర, 'ఇక మీదట, ఈ ముసలి నా దగ్గరే కదా చైజాపి డబ్బు తీసుకోవాలి...'అనే కదా ఉంటుంది.

ఇలా అనుకుని అనుకునే కృంగి కృషించిపోయింది రాజేశ్వరీ.

ఒక పక్క, "ఛఛ...కన్నకొడుకే పోయాడు. ఇక మీదట నాకెందుకు పెద్ద డబ్బు, అవమానానికి ఏమిటి అవసరం..." అని అనుకున్నది.

అందులోనూ, మహారాణిలాగా జీవించిన ఆమెకు...నిర్వహణ అధికారం తన చేతిలో ఉంచుకున్న ఆమెకు...ఖజానా తాళం చెవులను తన నడుములో దోపుకున్న ఆమెకు...కోడలుగా ఉన్నా సరే, ఆమె దగ్గర చై జాపాలంటే, అదెలా ఉంటుంది. అందులోనూ తనకు హక్కున్న ఒక విషయాన్ని?

ఒకే క్షణంలో అంతా తలకిందలుగా మారిపోయిందే. విధే ఇలా తలకిందలు చేసిందా?

కింద ఉన్న చెయ్యి పైకి, పై నున్న చెయ్యి కిందకి మారింది విధి వలనేనా? లేక దేవుడు నాకు వేసిన శిక్షా?

ఇప్పుడు, కోడలి యొక్క ఒకే శత్రువుగా, ఆమె ఎదురుగా నిలబడినట్టు ఉన్నది. అందులోనూ నిరాయుధపానిగా.

ఆ రోజు ఆమె కూడా అలాగే కదా నిలబడింది. అందులోనూ భర్త అనే పెద్ద బద్రత ఉండి!

ఆమె ఇష్టపడకపోయినా జ్ఞాపకాలు వచ్చి వెళుతున్నాయి. ఆమె గెలుపు నవ్వుతో నవ్విన నిమిషాలన్నీ ఇప్పుడు పండిన పుండును కెలుకుతున్నట్టు అనిపించింది.

అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న ఈశ్వర్ దగ్గర 'ఏమండీ...' అన్నది పద్మ.

'చెప్పు పద్మా...'

'నాకు, యాభై రూపాయలు కావాలి...'

'ఎందుకు?'

'బ్లౌజ్ కొనుక్కుని, కుట్టడానికి ఇవ్వాలి...'

"సరి, దానికి ఎందుకు నన్ను అడుగుతున్నావు?"

'హు...మిమ్మల్ని అడక్కపోతే, పక్కింటి ఆయననా ఆడగగలను?' అన్నది విసుగ్గా.

'నీకు చాలా కొవ్వెక్కింది. నన్నెందుకు అడుగుతావు. అమ్మ దగ్గరకు వెళ్ళి అడగొచ్చు కదా అని చెప్పాను...'

'నేనెందుకు మీ అమ్మ దగ్గరకెళ్ళి అడగాలి?'

'ఇంటి లెక్కలు, ఖర్చు, రాబడి అన్నీ అమ్మే కదా చూసుకుంటోంది...'

'అందుకని, నా ఖర్చులకు నేనెలా ఆమె దగ్గరకు వెళ్ళి చెయ్యి జాపను? నేనూ చాలాసార్లు మీ దగ్గర చెప్పేసాను. మీ అమ్మ దగ్గర మీ జీతం మొత్తాన్నీ ఎందుకు పూర్తిగా ఇస్తారు...నాకూ చాలా ఖర్చులు ఉంటాయి కదా, నాకని కొంచం డబ్బులివ్వండి...!' అన్నది.

'మొత్త జీతాన్నీ అమ్మ దగ్గర ఇచ్చే అలవాటు పడినవాడిని. ఇప్పుడు అందులోంచి కొంత డబ్బు తీసి ఇస్తే, అమ్మ ఏమనుకుంటుంది...భార్య వచ్చిన వెంటనేమారిపోయాను అనుకోదా?'

'అనుకోనివ్వండి. మరైతే అప్పుడు నా ఖర్చులకు ఏం చేసేది?'

'నువ్వు అమ్మ దగ్గర అడిగి తీసుకో...'

'నావల్ల కాదు. మీరు నా భర్త. మీ జీతం డబ్బు తీసుకుని ఖర్చు చేసే హక్కు నాకుంది. నేను ఆమె దగ్గరకు వెళ్ళి వంద, రెండువందలు ఇవ్వండని, చై జాపి నిలబడ అసహ్యంగా ఉంది...' అన్నది పద్మ.

'ఈగో అని చెప్పు...'

'అలాగే పెట్టుకోండి. నా భర్త సంపాదించిన డబ్బును ఇంకొకరి దగ్గర చెయ్యి జాపి తీసుకోవటం నాకు నేనే నా స్వీయ గౌరవానికి వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నాకని వేరుగా కొంచం డబ్బులు ఇచ్చేయండి. వాకిట్లో పూల అమ్మాయి వస్తే, ఒక మూర పువ్వులు కొనాలి అంటే కూడా, నా దగ్గర డబ్బు లేదు. అసహ్యంగా ఉంది...' అన్నది.

'సారీ పద్మా..నీకు వేరుగా డబ్బు ఇవ్వటం నావల్ల కాదు. నీకు కావలసిన డబ్బు అమ్మ దగ్గర అడిగి తీసుకో...' అన్నాడు.

చేతిలో పెట్టుకోన్న చీరను విసిరిపారేసి వెళ్ళిపోయింది పద్మ.

చిన్నగా తెరిచున్న తలుపు సందులో నుండి, అంతటినీ చూస్తూ వింటున్న రాజేశ్వరీ, పెదాలను నొక్కి వేలాకోలంగా నవ్వింది.

'ఒసేయ్...ఈ ఇంట్లో, నన్ను కాదని ఏదీ జరగదు. నా దగ్గర డబ్బులు అడగటానికి నీకు పరువు, ప్రతిష్ఠ అడ్డువస్తోందా? నా దగ్గర చెయ్యి జాపే నువ్వు జీవించాలి...' అంటూ మనసులో చెప్పుకుంది.

పద్మ నడుచుకునే విధానాన్నే గమనిస్తూ వస్తున్నది రాజేశ్వరీ.

ఆ రోజు న్యూస్ పేపర్ను తిరగేస్తున్న ఈశ్వర్ కు కాఫీ ఇస్తూ ' ఏమండీ...' అంటూ మొదలుపెట్టింది పద్మ.

'ఊ...చెప్పు!'

'నేను ఉద్యోగానికి వెళ్దామని అనుకుంటున్నా...!'

'ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?'

'ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు. డబ్బు కోసమే...'

'ఇప్పుడు, ఈ కుటుంబంలో ఎక్కువ డబ్బుకు అవసరం ఎక్కడుంది?'

'కుటుంబానికి డబ్బు అవసరం లేకపోవచ్చు. నా చేతి ఖర్చులకు డబ్బు కావాలే...'

'నీ ఖర్చుకు, ఎవరు డబ్బులు లేవని చెప్పింది?'

'ప్రతి ఒక్కసారీ మీ అమ్మ దగ్గరకు వెళ్ళి, ఐదుకూ, పదికీ నిలబడటం నాకు నచ్చలేదు. చదువుకున్నాను. పెళ్ళికి ముందు ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తూనే ఉన్నా కదా. ఇప్పుడు నేనెందుకు ఇంకొకరి దగ్గర చెయ్యి జాపాలి?'

చాటుగా దాక్కుని అన్నీ వింటున్న రాజేశ్వరీకి గుభేలు మన్నది.

'ఈమె ఉద్యోగానికి వెళ్ళి, సొంతంగా నాలుగు రూపాయలు సంపాదిస్తే, నన్ను నయాపైసాకి కూడా గౌరవించదు. జీవితాంతం నా దగ్గర చెయ్యి జాపి, డబ్బు తీసుకోవాలి ఈమె...' అని మనసులో వెర్రిగా ఆలొచించింది.

'పద్మా నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం గురించి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, అమ్మ అంగీకారంతో వెళ్ళు...!' అంటూ లేచి వెళ్ళిపోయాడు.

'బద్రకాలి లాగా అవతారం ఎత్తింది శశిరేఖా. కానీ ఎవరినీ ఏమీ అనలేకపోయింది. విషయం రాజేశ్వరీ దగ్గరకు వచ్చినప్పుడు 'ఉద్యోగానికి వెళ్ళకూడదు ' అని ఖచ్చితంగా చెప్పేసింది.

పద్మా చేతికి నాలుగు డబ్బులు రాకూడదని అనుకుంది. కానీ, ఇప్పుడు విధి మొత్త  డబ్బునూ ఆమె చేతికి తీసుకువెళ్ళి పోసింది.

మామూలు జ్వరం అంటూ పడుకున్నాడు ఈశ్వర్. కంటిన్యూగా ఆ ఇన్ ఫెక్షన్లు, ఈ ఇన్ ఫెక్షన్లు అంటూ సాగి లంగ్స్ అఫెక్ట్ అయ్యి 'క్యాన్సర్ ' అని చెప్పి, రెండు నెలలలో చికిత్స ఫలితం లేక శ్వాస ఆడక మరణించాడు.

పెద్ద పిడుగే. తేరుకోవటానికి చాలా రోజులు అయ్యింది. లేచినప్పుడే తెలిసింది, అంతా చెయ్యి దాటిపోయిందని.

కొడుకుకు రావలసిన మొత్త డబ్బు, పద్మ పేరుతో బ్యాంకులో డిపాజిట్ అయ్యింది.

నెలనెలా రావలసిన వడ్డీ డబ్బులు పద్మ అకౌంటుకే వచ్చింది. ఆమె తీసుకువచ్చి భోజనం పెడితేనే రాజేశ్వరీ  తినగలదు అనే పరిస్థితి.

కొడుకు చనిపోయింది ఒకవైపు పెద్ద పిడుగు అయితే, దానికంటే పెద్ద పిడుగు ఇది. అతనికైన డబ్బుకు నువ్వు వారసురాలివి కాదూ అనే నిజం రాజేశ్వరీ యొక్క  అహంకారాన్ని, అధికారాన్నీ వేర్లతో సహా కదిలించింది.

కొడుకు ఉన్నంతవరకు, అతను తీసుకు వచ్చి తన చేతికి ఇచ్చే డబ్బును మిక్కిలి గర్వంతో తీసుకుని ఖర్చుపెట్టటం, ఈ రోజు తన ఖర్చులకు కోడల్ని ఎదురుచూసి నిలబడే పరిస్థితి రావటం, ఆమెను చీల్చి చెండాడింది.

ఈ నెలకు కావలసిన ఖర్చుకు డబ్బు తేవటానికి వెళ్ళింది పద్మ.

నా మందూ, మాత్రలకు ఆమె దగ్గర చెయ్యి జాపాలా? ఎలా అడగను? ఇలాంటి పరిస్థితి ఎందుకు నాకు?

అవమానం పీకులాడుతున్నది. ఒక పెద్ద తాడుతో ఉరివేసుకుందాం అనేలాగా మనసు పీకింది.

డబ్బు తీసుకుని వచ్చే ఆమె, నన్నెలా చూస్తుంది?

'పిచ్చిదానా, ఆ రోజు మొత్త డబ్బునూ చేతిలో పెట్టుకుని నన్ను బిచ్చెగత్తెలాగా చూశావే...నిజానికి ఆయన సంపాదించిన డబ్బుకంతా నేనే సొంత దానిని...' అని ఎగతాలిగా చూస్తుందో?'

అవమానంతో ఆమె కుంగిపోతుంటే, గేటు తెరుచుకుని లోపలకు వచ్చింది పద్మ.

ఆమెను ఎదుర్కునే శక్తి లేక, పూజ గదిలోకి వెళ్ళి దాక్కోటానికి ప్రయత్నించింది రాజేశ్వరీ.

"అత్తయ్యా..." పద్మ స్వరం ఆమెను ఆపింది.

ఆమె తిరిగే ముందు, ఆమె పక్కకు వచ్చి నిలబడింది పద్మ.

"అత్తయ్యా... ఇదిగోండి మీ అబ్బాయి డబ్బులు" అంటూ రాజేశ్వరీ చేతిలో డబ్బులు పెట్టగానే కళ్ళు బైర్లు కమ్మింది.

"పద్మా..." రాజేశ్వరీ యొక్క స్వరం తడబడింది.

"అత్తయ్యా...ఆయన ఒక్కొక్క నెలా జీతం తీసుకువచ్చి మనస్పూర్తిగా మీ చేతికి ఇచ్చేవారు. మీరు మనసు నిండా గర్వం, సంతోషంతో తీసుకునే వారు. ఆ గర్వం, సంతోషం ఎప్పుడూ, ఆయన లేకపోయినా ఈ ఇంట్లో ఉండాలి"  అని పద్మ చెప్ప చెప్ప కోడల్ని కావలించుకుని వెక్కివెక్కి ఏడ్చింది రాజేశ్వరీ.

**********************************************సమాప్తం*************************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)