మోక్షానికే మోక్షం...(కథ)
మోక్షానికే మోక్షం (కథ)
సమస్య
వ్యక్తిగతం అయితే, ఆ సమస్యను ఆ వ్యక్తే తీర్చుకోవాలి. సమస్య
ఊరిదైతే. ఆ ఊరి ప్రజలే వారి సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ
అధికారులూ కొకొల్లలుగా ఉన్నా కొన్నిసార్లు సమస్యలు తీరవు. ఎందుకంటే అవినీతి, లంచగొండితనం
ఎక్కువగా పెరిగిపోవటం, చట్టానికి ప్రభుత్వాలు, రాజకీయనాయకులు, ప్రభుత్వ
అధికారులు భయపడకపోవటం. అందుకని ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదో అక్కడున్న ప్రజలు
పోరాటాలు చేసి వీలైనంతవరకు సమస్యలకు పరిష్కారం తెచ్చుకుంంటున్నారు.
ఈ కథలో
కూడా ఒక పెద్ద సమస్యకు కొత్తరకం పోరాటం చేస్తామని ప్రకటించటంతో సమస్యను ప్రభుత్వం
తీరుస్తానంది. అదేమిటో చదివి తెలుసుకోండి.
***************************************************************************************************
ప్రొద్దున ఎనిమిది
గంటలు.
మంచు పడే కాలం
కాబట్టి,
అప్పుడే తెల్లవారినట్లు వెలుతురు తక్కువగా ఉన్నది.
నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచి, న్యూస్ పేపర్ను తిరగేస్తున్నరామక్రిష్ణ యొక్క సెల్ ఫోనులో ‘వాట్స్ ఆప్’ మెసేజ్ వచ్చినట్లు మోత వినబడింది.
‘కాలేజీ
స్నేహితుడు జగపతి తండ్రి చలం మరణించారు...' అన్న వార్తను తెలుసుకున్న వెంటనే,
రామక్రిష్ణ మనసు మరో విషయం గురించి ఆలోచించటానికి
ఒప్పుకోలేదు.
‘చివరిగా
ఒక సారి,
ఆయన మొహం చూడాలి’ అనే ఆతురతతో, డ్రైవర్ కు ఫోను చేశాడు. కొద్దిసేపట్లో కారులో కూర్చున్న
అతను వెంకటాద్రి గ్రామానికి వెళ్ళవలసిన దూరాన్ని, సమయాన్నీ గూగుల్ ద్వార గణించి చెబుతూ ఉన్నాడు.
“రెండు వందల కిలో
మీటర్ల దూరం వెళ్ళాలి. మామూలుగా వంద కిలోమీటర్ల వేగంతో వెళితేనే కనీసం మూడు గంటలు
అవుతుంది అనుకుంటున్నా...”
రామక్రిష్ణ చెప్పిన
వెంటనే,
‘సరి’ అనేలాగా తల ఊపిన కారు డ్రైవర్, “సార్...అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇంత దూరం,
అందులోనూ అర్జెంటుగా వెళుతున్నారే. చనిపోయిన వ్యక్తి మీకు
బాగా దగ్గర బంధువా?” అన్నాడు.
“బంధుత్వం ఏమీ
లేదు. కానీ, నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి. కృతజ్ఞతకు అర్హులైన వ్యక్తి కూడా...” అని చెప్పి,
మౌనంగా ఉండిపోయారు రామక్రిష్ణ.
సర్వీస్ రోడ్డు
కాబట్టి,
ఊపులు, దూకుడులు లేక స్మూత్ గా వెళ్తూ ఉన్నది కారు. ‘టైముకు వెళ్ళిపోవాలి’
అనే ఆలొచనతో మాటి మాటికీ చేతి గడియారాన్ని,
రోడ్డునూ చూసుకుంటూ ఆందోళనతో ఉన్నారు రామక్రిష్ణ.
కలతతో ఉన్న అతని
మనసు,
శరీరాన్ని నీరసింపచేసింది. ‘కొంచం సేపు రెస్టు తీసుకుంటే సరే’ అనే ఆలొచనతో, కళ్ళు మూసుకుని పయనించిన అతనికి నిద్ర కూడా రాలేదు.
దీర్ఘ ఆలొచనతో
కొంతసేపు బయట ప్రదేశాన్ని వేడుక చూశాడు. మనసు దేంట్లోనూ ఆసక్తి చూపలేదు. తరువాత,
పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.
కాలేజీలో చదువుతున్న
రోజుల్లో సెమిస్టర్ మరియూ పరీక్షలకు ఫీజు కట్టలేక శ్రమ పడుతున్నప్పుడంతా,
డబ్బు ఇచ్చి సహాయం చేసినాయన చలంగారు. జగపతికి ఎప్పుడు
బట్టలుకొన్నా, అప్పుడంతా
రామక్రిష్ణకి కూడా బట్టలు తీసుకుంటారు.
కన్నవారిలాగా
ప్రేమాభిమానాలు చూపిన ‘ఆ మనిషి చనిపోయారు’
అని అనుకుంటున్నప్పుడు, అతని కళ్ళు అతనికి తెలియకుండానే తడుస్తున్నాయి.
చదువు ముగించి
ఉద్యోగం దొరికిన వెంటనే, ఆయన్ని వ్యక్తిగతంగా చూసి డబ్బులు తిరిగి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు “తమ్ముడూ...అదంతా లెక్క రాసి పెట్టుకున్నావా?
నువ్వూ నా కొడుకులాంటి వాడివే. ఆ డబ్బు చదువుకు అని
ఇచ్చింది. దాన్ని తిరిగి తీసుకోవడం, మంచి నాగరీకం కాదు...”
మనసారా చెప్పి
ఆశీర్వాదం చేసి, ఆనందించిన
వ్యక్తి. ఇంకా తాజాగానే ఉన్న ఆ జ్ఞాపకాలు, రామక్రిష్ణ మనసులో లోతుగా నమోదు అయినందువలన,
అతని మనో దుఃఖం ఎక్కువ అయ్యింది.
రోడ్డు మీద స్మూత్
గానూ,
వేగంగానూ పోతున్న కారు హఠాత్తుగా వేగం తగ్గింది. ఆదుర్దా,
ఆందోళనతో లో నుండి తల బయటకు పెట్టి తొంగి చూశాడు. కళ్ళకు
కనిపించే దూరం వరకు వాహనాలు వరుసక్రమంలో నిలబడున్నాయి.
మొహాన కోపం
పొంగుతుండ యువకులు, వృద్దులూ అనేకమంది వరుసక్రమంలో వెళుతున్నారు. అందులో చాలామంది చేతుల్లో ఏదో
విజ్ఞాపన రాసున్న పలకలు ఉన్నాయి. ఊరేగింపులో కొంతమంది ఘోషపెట్టుకుంటూ నడిచారు.
“ఏంటయ్యా...ఏం
ఊరేగింపు ఇది?” డ్రైవర్ దగ్గర అడిగాడు.
“తెలియదు
సార్...కానీ, ఏదో ఊరు సమస్యకు పరిష్కారం తెలుసుకోవటానికి వెళ్ళే ఊరేగింపు లాగా
తెలుస్తోంది...”
“పెద్ద తలనొప్పిగా
ఉందే. వాళ్ళ ఊరు సమస్య కోసం, మిగిలిన వాళ్లకు సమస్య ఇవ్వాలా?”
“ఏం
చేస్తారు సార్? ఇలాంటి
సమస్యలు చేస్తేనే, కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సార్...మీరు వెళ్ళాల్సిన ఊరు ఇంకా
రెండు కిలో మీటర్ల దూరమే ఉంది. పూలమాల కావాలంటే ఇక్కడే కొనుక్కోండి. ఇక్కడ
వదిలేస్తే, ఆ
తరువాత షాపులు లేవు...” అని
చెప్పి, రోడ్డు
పక్కగా ఉన్న ఒక పూలకొట్టు దగ్గర కారు ఆపాడు డ్రైవర్.
“అయ్యా...ఈ మాల
రేటెంత?” -- రామక్రిష్ణ
స్వరం విన్న వెంటనే, మాల కడుతున్న షాపతను ఆయనవైపు చూశాడు.
“విశేషం ఏమిటి...మాల
దేనికోసం సార్?”
“విశేషం
మంతా ఏమీ లేదయ్యా. నా క్లోజ్ స్నేహితుడి తండ్రి చనిపోయారు. అందుకోసమే...”
“ఓ...చావు మాలా?
సరే, ఏ ఊర్లో?”
“వెంకటాద్రి
గ్రామంలోనయ్యా”
“వెంకటాద్రా?
అయితే మనకి పని ఉండదు...?” సనుగుకుంటూ షాపులో వెలాడుతున్న ఒక మాలను తీసి ప్యాక్ చేసి ఇచ్చాడు
షాపతను.
రామక్రిష్ణ ఇచ్చిన
రెండు వందల రూపాయల డబ్బును తీసుకుని, మిగిలిన యాభై రూపాయలు అతనికి ఇచ్చి,
మళ్ళీ తల వంచి మాల అల్లటం మొదలుపెట్టాడు షాపతను.
“అయ్యా...ఏదో
చెప్పటానికి వచ్చారే?” ఆసక్తిగా అడిగిన రామక్రిష్ణ, అతనితో మాట్లాడటం కొనసాగించాడు.
“మామూలుగా పక్క
ఊర్లలో ఎవరైనా చనిపోతే ఇరవైయ్యో, ముప్పైయ్యో పూలమాలలు వ్యాపారం అవుతాయి. కానీ,
ఆ ఉర్లో ఎవరైనా చనిపోతే అదంతా ఎదురు చూడలేము...”
“ఎందుకయ్యా
అలా చెబుతున్నారు?”
“అయ్యా...టైమవుతోంది.
మీరు బయలుదేరండి. బాడీ తీసుకు వెళ్ళిపోతారేమో. ఆ ఊరి శ్మశానానికి మీరు వెళ్ళ లేరు.
ఆ తరువాత ఈ ఊరికి, ఇంతదూరం పనికట్టుకుని వచ్చింది, ఫలితం లేకుండా పోతుంది...”
అర్ధంకాక అయోమయంలో
పడిపోయిన రామక్రిష్ణ “ఏం
చెబుతున్నారయ్యా?” అన్నాడు మళ్ళీ.
“మీరు ఆ ఊరి
గురించి విన్నదే లేదా? ఆ ఊరి శ్మశానానికి వెళ్ళాలంటే,
శవాన్ని మోసుకుని, ఏరు దిగి నడవాల్సిందే. అందులోనూ అర కిలోమీటర్ దూరానికి.
వంతెన కట్టమని అడిగి, పలు సంవత్సరాలుగా ఈ ఊరి ప్రజలు పోరాడుతున్నారు. కానీ,
ఇంతవరకు ప్రభుత్వం కళ్ళు తెరవలేదు...” అన్నాడు షాపతను.
ఏదీ ఊహించుకుని
చూసుకునే సమయం లేక, అయోమయంతో కారులో ఎక్కాడు రామక్రిష్ణ. అక్కడ్నుంచి బయలుదేరిన కొద్ది
నిమిషాలలోనే సర్వీసు రోడ్డు నుండి జరిగి పాడైపోయిన మట్టి రోడ్డు మీద కారు
వెళుతున్నది.
వెళ్ళే దారి
పొడుగునా...వరుసగా ఉన్న అతిపొడవైన తాటి చెట్లు, అందంగా సిపాయులులాగా దర్శనం ఇచ్చాయి. ఇంకో రెండు నిమిషాలలో
ఊరు వచ్చేస్తుంది. హ్యాండ్ ఖర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకున్నాడు.
కారు జగపతి ఇంటి
దగ్గరకు వచ్చి ఆగింది. ఏడుపులు, పెడబొబ్బులూ వినబడ్డాయి. చలంగారి చివరి ప్రయాణానికి సిద్దం
చేయవలసిన పనులు, ఏమీ
జరిగినట్లు, జరుగుతున్నట్లో
కనబడలేదు. అది చూసి రామక్రిష్ణకు ఆశ్చర్యమూ, అనుమానమూ కలిగింది.
చేతిలో ఉన్న
పూలమాలను చలంగారి బాడీపైన పెట్టి, కొద్దిసేపు అక్కడే మౌనంగా నిలబడ్డాడు. అతనికి తెలియకుండానే
అతని కళ్ళు తడిసినై. వెక్కి వెక్కి ఏడుస్తూ దగ్గరగా నిలబడున్న జగపతికి ఓదార్పు
మాటలు చెప్పి ధైర్యం చెప్పాడు.
“ఏమిట్రా జగపతీ.
అంకుల్ చివరి యాత్రకు పనులు మొదలుపెట్టకుండా, అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు?”
“మామూలు
కంటే,
నదిలో ఎక్కువగా నీళ్ళు వెళ్తున్నాయి. సమస్య ఏమీ రాకుండా
శవాన్ని తీసుకు వెళ్ళటం చాలా శ్రమం...”
“ఏమిట్రా
చెబుతున్నావు?”
“అవునురా...నీరు
ఎక్కువగా పారుతున్న సమయంలో, గొంతు వరకు వచ్చే నీటిలో బాడీని భుజాల మీద తీసుకు వెడితే,
పలు శవాలు నదిలో జారి పడిపోయినై...”
“అయ్యో...తరువాత...”
“తరువాత
ఏముంది...దాన్ని వెతికి పట్టుకుని పూడ్చి పెట్టాలి. కొన్ని సార్లు వెతికినా బాడీ
దొరకదు. చివరి సమయ అంత్యక్రియలు కూడా చెయ్యలేక,
బాధపడుతూ ఇంటికి తిరిగొచ్చిన వాళ్ళూ ఉన్నారు. అదే
అలొచిస్తున్నాను...”
అన్నాడు జగపతి.
“అందుకని
ఎంతసేపురా శవాన్ని ఉంచుకునేది...”
“చాలా కాలంగా మేమూ
పోరాటాలు చేస్తూనే ఉన్నాం తమ్ముడూ. ఎవరూ చెవిలో వేసుకోవటం లేదు. బ్రతికేటప్పుడు
వ్యవసాయంతో పోరాడుతున్నాము. శ్మశానానికి వెళ్ళేటప్పుడు కూడా పోరాడాలని మా నుదిటి
మీద రాసుంది. అందులోనూ, ఒకే సమయంలో రెండు మూడు చావులు ఏర్పడితే మా పాట్లు కుక్క
పాట్లే...." దగ్గరున్న ఊరిపెద్ద బాధపడుతూ చెప్పారు.
టైము పోతూ ఉంది.
ఇంకా కొద్ది సేపట్లో చీకటి పడుతుంది. ఇంతలోనే ఒక నిర్ణయానికి రావాలి.
“నేను
మరణించటానికి ముందే, ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకాలి అంటూ నాన్న అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. నాకేం
చేయాలో తెలియటం లేదురా...”
చెబుతూనే కన్నీరు
కారుస్తున్న జగపతి చేతులను ఓదార్పుగా పట్టుకుని, వాడిని వేరుగా తీసుకు వెళ్లాడు రామక్రిష్ణ. ఇద్దరూ ఒక
అరగంటసేపు ఆలొచించారు.
‘సమస్యలకు
సమస్యే పరిష్కారం’ అంటూ వచ్చే దోవలో డ్రైవర్ చెప్పింది జ్ఞాపకానికి రావటంతో,
జగపతి దగ్గర ఒక ఆలొచన చెప్పాడు రామక్రిష్ణ.
బురద ప్రదేశంలో
నడిచేవాడికి, సహాయం
చేసే చేతి కర్రలాగా అనిపించింది స్నేహితుడు చెప్పిన ఆలొచన. వెంటనే ఊరి పెద్దలను
పిలిచి నిర్ణయాన్ని చెప్పాడు జగపతి.
“ఏమిటి జగపతి
చెబుతున్నావు...ఇది సక్రమంగా జరుగుతుందా? ఏదైనా సమస్యగా అయిపోతుందేమో అబ్బాయ్...”
“చట్టంలో దీనికంతా
చోటుందా? ఎమోషన్
లో తీసుకునే ఏ నిర్ణయమూ ప్రశాంతతనివ్వదు. చాలా కాలం పాటూ ఉపయోగంలో ఉండదు జగపతీ..."
“మనం ఇంతకు ముందే
పలు రకాలుగా పోరాడున్నాము. ఈ తమ్ముడు చెప్పాడు కదా అని...ఇష్టం వచ్చినట్టు కొత్తగా
ఏదైనా చేస్తే, అందరం చిక్కుల్లో ఇరుక్కోబోతాం...” భయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సనిగారు.
అప్పుడు,
లోతైనా నిట్టూర్పు విడిచిన పంచాయతీ ప్రెశిడెంటు...ఎవరూ
ఎదురు చూడని విధంగా, “ఎందుకని...ఈ తమ్ముడు చెప్పినట్టు చేసి చూద్దామే. అలాగైనా
సమస్యకు పరిష్కారం దొరికితే మంచిదే కదా...” అన్నారు.
ఆ తరువాత,
తొందర తొందరగా చలంగారి బాడీని చివరి ప్రయాణానికి రెడీ
చేయటానికి కారిక్రమం మొదలుపెట్టారు. ఏం జరుగుతోందో చాలామందికి అర్ధం కాకుండానే
ఉంది. కొందరు మనకెందుకు ‘తలనొప్పి’ అనుకుంటూ ఆ చోటును విడిచి జరిగి వెళ్ళారు.
అప్పుడు చెమటలు కక్కుకుంటూ
పరిగెత్తుకుని వచ్చిన ఒకతను “రెవెన్యూ డిపార్ట్ మెంటు అధికారులుకు ఎలాగో విషయం తెలిసిపోయింది. వాళ్ళ
జీపులో ముగ్గురు వస్తున్నారు. వాళ్ళతో పాటూ పోలీసులు కూడా వస్తున్నారు...”
ఆయసపడుతూ చెప్పి
ముగించేలోపు, జీపు
వాకిట్లో వచ్చి నిలబడింది. అందులో నుండి దిగిన ఒక పెద్ద అధికారి "ఇక్కడ జగపతి
ఎవరు?"
అన్నారు కోపంగా.
“సార్...నేనే జగపతిని...”
“మీరేం
చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా? చూస్తే చదువుకున్న వారిలాగా కనబడుతున్నారు. ఇదంతా చట్ట
విరుద్దం అని మీకు తెలియదా? మీ ఉరి నదిలో ఎప్పుడూ ఎక్కువ నీరు వెళ్ళటం మామూలే కదా. దాన్ని ఒక కారణంగా
పెట్టుకుని, ఇప్పుడు
మాత్రం ఎందుకు కొత్త కొత్తగా ఆలొచిస్తున్నారు...” ఆయన మాటల్లో అధికార ధోరణి కనబడింది.
“సార్...మాకు
ఇంతకంటే వేరే దారి తెలియటం లేదు. మా నిర్ణయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశం మాకు లేదు.
మీరు ఏం చర్య తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి...” ఖచ్చితంగా
చెప్పాడు జగపతి.
“సార్...మేమూ,
పలు మార్గాలలో పోరాడాము. పలు సంవత్సరాలుగా శ్మశానానికి
వెళ్ళటానికి నదిపైన వంతెన కట్టివ్వమని పోరాడాము. ఇప్పుడూ పోరాడుతూనే ఉన్నాము. అది
కూడా రెండు వందల మీటర్ల దూరం వరకే. కానీ ఇంతవరకు పరిష్కారం ఏదీ దొరకలేదు. ఇక మీదట
ఊర్లో చావు పడితే ఇలాగే చెయ్యబోతాం...” అన్నారు పంచాయతీ ప్రెశిడెంట్.
అలాగే ఊరి ప్రజలకూ,
అధికారులకూ వాదన జరుగుతున్నది. ముగింపు ఏదీ దొరకక సమయం
గడుస్తున్నది.
వెంకటాద్రి గ్రామం
సమస్య పెద్ద దవటంతో, టీవీ ఛానెల్స్ అన్నీ ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. వార్తను లైఫ్ టెలికాస్ట్
చేస్తున్నారు. విషయం తెలుసుకుని వెంకటాద్రి గ్రామానికి హడావిడిగా వచ్చిన కలెక్టర్,
ఊరి ప్రజలను సమాధాన పరచటానికి ప్రయత్నించాడు.
వెంటనే జగపతిని
పిలిచి “మీ ఎమోషన్ నాకు అర్ధం అవుతోంది తమ్ముడూ.
దానికోసం ఇంట్లోనే ఆయన్ని పూడ్చి పెట్టబోతున్నారని నిర్ణయం చేసుకున్నది మంచిది
కాదు. దానికి చట్టంలో చోటులేదు. ఇదేలాగా ఒక్కొక్కరూ చెయ్యటం మొదలుపెడితే,
ఆ తరువాత ఊరే శ్మశానం అయిపోతుంది...”
“మేము ఏం
చేయాలనుకుంటున్నారు? నీళ్ళు ఎక్కువగా పోతున్న నదిలోకి దిగి తండ్రి శవాన్ని నదిలోకి జారవిడిచి,
ఆయనకు చెయ్యాల్సిన చివరి మర్యాదలు అన్నీ వదిలేయమని
చెబుతున్నారా. అలాగని చట్టంలో రాసుందా.
చివరి ప్రయాణంలో ఉన్న శవానికి పూర్తి మర్యాదలు ఇవ్వాలని మీ చట్టమే
చెబుతోందే? ఇది
మీకు తెలియదా? నేను
మా నాన్నకు చేయాల్సిన చివరి మర్యాద చెయ్యక్కర్లేదా? నదిలో జార విడిచేయాలా?" కోపంగా అరిచాడు జగపతి.
“ఒక
సమస్యకు పరిష్కారం కోసం, కొత్తగా ఒక సమస్య ఇస్తున్నారు. మీరు ఇంతవరకు జరిపిన పోరాటాలకు,
ఇప్పుడు జరుపుతున్న పోరాటానికీ చాలా తేడా ఉంది. నేను
ఆల్రెడీ పై అధికారులతో జరిగినదంతా వివరంగా ఎత్తి చెప్పాను. అతి త్వరలోనే మీ
సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నన్ను నమ్మండి. ఎందుకంటే మీరు ఈసారి చేతిలోకి తీసుకున్న
పోరాటం చాలా వ్యత్యాసం...”
చేతులెత్తి నమస్కరించాడు కలెక్టర్.
ఆ తరువాత రెడీగా
ఉన్న అగ్నిమాపక దళం వ్యక్తులు రంగంలోకి దిగారు. చలంగారి బాడీని శ్రమం లేకుండా
నదిని దాటించి తీసుకువెళ్ళటానికి ఏర్పాట్లు చేయటంలో నిమగ్నులయ్యారు.
పలు సంవత్సరాలుగా
ఉంటూ వస్తున్న వెంకటాద్రి గ్రామం సమస్యకు, త్వరలో ఒక ముగింపు వస్తుందనే ఒక నమ్మకం రామక్రిష్ణ మనసులో
ఏర్పడింది.
ఆ ఊరి సమస్యకు రామక్రిష్ణ
వలన మోక్షం దొరికిందని, కన్నీరు కారుతున్న కళ్ళతో రామక్రిష్ణకు కృతజ్ఞతాలు తెలిపాడు జగపతి.
******************************************************సమాప్తం***********************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి