అమెరికా అల్లుడు…(కథ)

 

                                                                     అమెరికా అల్లుడు                                                                                                                                                (కథ)

కట్నకానుకలు అనేది ఆడపిల్లకు చేయబడ్డ అవినీతి. దాన్ని ఆడపిల్లలే  నిషేదించగలరు. కానీ, ఆ ఆడపిల్లలే, పెళ్ళికొడుకు యొక్క తల్లిని-అక్కని-చెల్లిని-ఆ కృరమైన కట్నకానుకలను తీసుకోమని చెప్పటం ఎంత పెద్ద ఘోరం? దీంట్లో చాలాపెద్ద భాగం ఆడపిల్లలదే. వారి భాగం వారు చెయ్యలేకపోతే, పెళ్ళి చేసుకోబొయే పెళ్ళికొడుకు ఈ నేరాన్ని ఖచ్చితంగా ఆపగలడు.

డబ్బు జీవితానికి అవసరమే. కానీ, జీవితమే డబ్బు కాదు. ఆ డబ్బును ప్రతి మగాడూ సంపాదించగలడు. అందువల్ల కట్నకానుకలు అనేది లేకుండా పెళ్ళి చేసివ్వటానికి ఒప్పుకోవాలి. తల్లి-తండ్రులను ఒప్పించాలి. లేకపోతే...క్షమించాలి. మీరు ఒంటరిగా నిలబడి  పెళ్ళి చేసుకోగలను అనేది మీ పెద్దలకు భవ్యంగా తెలుపండి.

***************************************************************************************************

దినేష్ మీ ఇంటి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది...

స్నేహితుడు సూర్యప్రకాష్ చెప్పిన వెంటనే దినేష్ కు చెప్పలేనంత ఆనందం.

రాఘవేంద్రరావు సినిమాలలో వచ్చేటట్టు తెల్ల దుస్తులు వేసుకుని దేవ కన్యలు లాలీ పాడుకుంటూ అతని తల మీద పూవులు జల్లుతున్నట్టు, రంగు రంగుల కలలు అతని కళ్ళల్లో మెరుస్తున్నాయి. కారణం --

ఆ ఉత్తరంలో, అతను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఫోటో వచ్చుంటుంది. ఇరవై రోజుల క్రితం దినేష్ తన ఇంటికి రాసిన  ఉత్తరంలో, అమ్మాయి ఫోటోను అడిగాడు. ఇప్పుడు అది వచ్చుంటుంది.

అమ్మాయి పేరు: జయంతీ. ఈమె దినేష్ కి సొంత మేనమామ కూతురు. జయంతీ పుట్టి, పాకులాడి, తప్పటడుగులు నేర్చుకుని, బంగారు లేడిలాగా ఎగిరి గంతులేసి ఆటలాడి -- వయసుకు వచ్చి,  పువ్వులాగా వికసించి, పూలగుత్తిలాగా తిరిగేంతవరకూ అన్నిటినీ కళ్ళారా చూసినతను ఈ దినేష్.

రేయ్...తమ్ముడూ! ఇప్పుడు పుట్టిన నీ కూతురికి నా కొడుకు దినేషే పెళ్ళికొడుకు...

ఏమిటక్కా ఇది...నా కూతురు నీ కొడుక్కి కాకపోతే ఇంకెవరికి? ఖచ్చితంగా నా అల్లుడు దినేషే!

దినేష్ యొక్క తల్లి, జయంతీ తండ్రి ఇరవై ఏళ్ల క్రితమే ఇలా మాట్లాడుకున్నారు.

జయంతీకి దినేష్ అంటే చాలా ఇష్టం. చిన్న వయసులో, వీధిలో మట్టి  ఇల్లు కట్టి ఆటలాడుకున్నాదినేష్, జయంతీనే జత కలుస్తారు. ముట్టుకుని, పట్టుకుని ఆడినా, జయంతీ దినేష్ నే పట్టుకోవటానికి వెళుతుంది. దినేష్ కూడా అంతే.

దినేష్ బావా, దినేష్ బావా!అని జయంతీ అతన్ని చుట్టి చుట్టి వస్తుంది. అతను ఆమెను ఉప్పు బస్తాలాగా వీపు మీద ఎక్కించుకుని తిరుగుతాడు. 

రేయ్! ఇప్పుడే దాన్ని ఎత్తుకో. పెళ్ళి చేసుకున్న తరువాత నువ్వు దాన్ని ఎత్తుకోలేవు... అంటూ దినేష్ తల్లి అతన్ని హేళన చేస్తుంది.

దినేష్ బావ నన్నుపెళ్ళి చేసుకున్నతరువాత ఉప్పు బస్తాలాగా వీపు మీద ఎక్కించుకోరు. తల మీద ఎక్కించుకుంటారు. ఏం బావా కరెక్టేనా...?” జయంతీ పిల్లతనంగా అడిగింది. దినేష్ నవ్వాడు.

సంవత్సరాలు గడిచినై. జయంతీ వయసుకు వచ్చినట్లు వాళ్ల ఇంటికి వార్త వచ్చింది. దినేష్ ఇంట్లో అందరూ ఎంతో సంతోషపడ్డారు! పద్దతిగా చెయ్యాల్సిన అన్ని సంప్రదాయాలనూ దినేష్ తల్లి ముందుండి చేసింది. దినేష్ ఇంటి నుండి జయంతీ కి పట్టు చీర, బంగారు లోలాకులు ఇచ్చి,  దినేష్ తల్లి జయంతీ అందాన్ని మరోసారి చూసింది. జయంతీ దినేష్ కే అని అందరూ కూడి కూడి మాట్లాడుకున్నారు.

జయంతీ ఇప్పుడు మాటి మాటికీ బయటకు రావటం లేదు. అతనితో  ఆటలాడటం లేదు. ఆమెను అతను ఉప్పు బస్తాగా ఎత్తుకోవటం లేదు. ఇప్పుడంతా ఆమె మొహంలో మాటి మాటికీ సిగ్గు వస్తోంది. ముందు ముట్టుకుని ఆట్లాడుకున్నప్పుడు రాని సుఖం, ఇప్పుడు ముట్టుకోకుండానే, చూపుల్లోనే దొరుకుతోంది. ఇదొక తీపి సుఖం. అతను కూడా దానిని అనిభవించగలిగాడు.

ఇప్పుడంతా, దినేష్ పరిస్థితి అద్దం ముందు నిలబడి తన తలను సరిచేసుకోవటం, దుస్తులు సరిచేసుకోవటం లోనే ఎక్కువ శ్రద్ద ఉంచుతున్నాడు. ఇది అతనికే అర్ధమయ్యింది.

దినేష్ తన కళ్లను తానే నమ్మలేకపోతున్నాడు...ముందు చూసిన  జయంతీ, ఇప్పుడు వయసుకు వచ్చిన తరువాత చూసే జయంతీ, అబ్బబ్బ...శరీరంలో ఎంత మార్పు. గుండ్రని ముఖంలో ఎంత కళ.

ఆమె నవ్వేటప్పుడు బుగ్గల మీద పడే గుంట. వంకర్లు తిరిగి జల్లులాగా పడుతున్న జలపాతం లాంటి తెల్లటి రంగు, ఆ కల గల ముఖం దినేష్ ను కట్టి పడేస్తోంది.

ఓ...ఇదేనా ప్రేమంటే...?’ దినేష్ తనలో తానే ప్రశ్నించుకుంటాడు.

దినేష్ అమెరికావెళ్ళి, పై చదువు చదివి, అక్కడే ఉద్యోగం చేస్తూ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది అంత సులభంగా దొరుకుతుందని అతను అనుకోలేదు. అమెరికాలోని ఒక పెద్ద యూనివర్సిటీలో పై చదువుకు సీటు దొరికింది. ఇంకో పది రోజుల్లో దినేష్ అమెరికాకి బయలుదేరాలి. దానికి కావలసిన టికెట్టుకు, ఇతర ఖర్చులకు డబ్బు కావాలి. దానికోసం అతని తల్లి-తండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు జయంతీ --తన మెడలో ఉన్న గొలుసు, చేతులకు--చెవులకు వేసుకున్న నగలను తీసి దినేష్ తల్లి-తండ్రులకు ఇచ్చింది.

ఈ నగలు అమ్మి, డబ్బుకు ఏర్పాటు చేయగలరా అని చూడండి. దినేష్ బావ అమెరికాకి వెళ్ళి బాగా సంపాదించనివ్వండి. ఆ తరువాత మనమందరమూ నగలు కొనుక్కుందాం...

తల్లీ...నీ మంచి మనసుకు, గుణానికీ వాడు సంపాదించి ఖచ్చితంగా నగలు వేస్తాడు. ఇప్పుడు ఈ నగలు నీ దగ్గరే ఉండనీ తల్లీ! భవ్యంగా ఆమె దగ్గరే తిరిగి ఇచ్చేసింది.

దినేష్ కి కావలసిన డబ్బును వాళ్ల నాన్న ఏర్పాటు చేశారు. దినేష్ జయంతీ ను వదిలి వెళ్ళటానికి మనసులేక అమెరికా వచ్చి చేరాడు. వచ్చి ఐదు సంవత్సరాలు గడిచిపోయినై. చదువు పూర్తి చేసి, అక్కడే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించి బాగా సంపాదించటం మొదలుపెట్టాడు.

దినేష్ యొక్క ఆలొచనలు, జ్ఞాపకాలూ జయంతీ నే చుట్టి వచ్చినై. ఇప్పుడు జయంతీ ఎలా ఉంటుంది?’. ఫోటో అయినా చూసి తీరాలి అనే ఆతృత అతనిలో ఏర్పడింది. దాన్నే తల్లికి రాసాడు.

ఉత్తరాన్ని విప్పి ఫోటోను చూసిన దినేష్ షాకై అలాగే శిలలాగా నిలబడిపోయాడు.

ఆ ఫోటోలో ఉన్నది జయంతీ కాదు. ఇంకొక అమ్మాయి నవ్వు మొహంతో ఉన్నది.

ఉత్తరంలో అతని తల్లి యొక్క ముత్యాల్లాంటి అక్షరాలతో చేతిరాత. దాని చదవటం మొదలుపెట్టాడు.

ప్రియమైన కొడుకుకు తల్లి-తండ్రి రాస్తున్నది.

మేము నీకు పెళ్ళి చేయటానికి చూసి, మాట్లాడి ఉంచిన అమ్మాయి యొక్క ఫోటోను ఈ ఉత్తరంతో పంపించాము. అమ్మాయి నీకు చాలా బాగా నచ్చుంటుంది.

నువ్వు ఇంతకు ముందు రాసిన అన్ని ఉత్తరాలలో, నీ మావయ్య కూతురు జయంతీని నీకిచ్చి పెళ్ళి చేయటానికి అన్ని విషయాలు మాట్లాడి ఉంచమని రాశావు. మొదటగా నువ్వు మనసులో ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు గ్రామంలో ఉండే సాధారణమైన దినేష్ కాదు. అమెరికాలో బాగా సంపాదిస్తున్నదినేష్. ఇది మరిచిపోకు! మనిల్లు ఇప్పుడు అమెరికా ఇల్లు. నువ్విప్పుడు అమెరికా అల్లుడు.

మన ఊర్లో ఇల్లూ, వాకిలి లేని, ఏరోజు కారోజు బ్రతకటానికి సంపాదించుకుంటున్నవారు పెళ్ళి అనేది వచ్చిన వెంటనే, కట్నం యాభైవేలు, అరవైవేలు అని అడుగుతున్నారు. దుబాయ్ లో ఉంటున్న మన పక్కింటి అబ్బాయి -- అవతలి వీధి అబ్బాయి, వీళ్ళంతా కట్నం పలు లక్షలు, ఎన్నో కాసుల బంగారం తీసుకోనున్నారు.

నువ్వు వాళ్లందరి కంటే తక్కువ వాడివి కావు. నీకు పలు లక్షలు ఇచ్చి నీ మావయ్య జయంతీని నీకు ఇచ్చి పెళ్ళి చేసి ఇవ్వటానికి వాళ్ల దగ్గర వసతి లేదు. కానీ, ఇప్పుడు మాట్లాడి ఓ.కే. చేసిన అమ్మాయి ఇంటి వాళ్ళు మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. మేము ఏది చేసినా నీ మంచికే చేస్తాము అనేది మర్చిపోకు! కాబట్టి జయంతీని మర్చిపో!

జరిగేదంతా మనం అనుకున్నది కాదు, అనుకున్నదంతా జరగటమూ లేదు. దీన్ని మనసులో పెట్టుకుని, పాతవన్నీమర్చిపో.

ఇట్లు.

దినేష్ తల్లి-తండ్రుల సంతకం ఉంది. కోపంతో దినేష్ ఆ ఉత్తరాన్ని చించేశాడు.

ఆలోచనలో మునిగిన అతను కొంతసేపటి తరువాత పెన్ను తీసుకుని జవాబు రాయటం ప్రారంభించాడు.

నా మంచిని కోరే ప్రియమైన తల్లి--తండ్రులకు మీ అబ్బాయి రాస్తున్నది.

స్వచ్ఛమైన ఆలోచనకు తరువాత, స్పష్టమైన నిర్ణయంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను.

జయంతీ నాకే నని చిన్నవయసు నుండి చెప్పి, మా పసి హృదయాలలో ప్రేమను పెంచి, ఇప్పుడు జయంతీ ని మరిచిపొమ్మంటున్నారే, ఎలా?

ఒక అమ్మాయిని ముట్టుకోవటం మాత్రమే నేరం కాదు...ముట్టుకోకుండా మనసులో అనుకునేటట్టు చేయటం కూడా నేరమే. ఆ విధంగానే జయంతీ ని తలుచుకుని, తలుచుకుని నేనూ, నన్ను తలుచుకుని, తలుచుకుని ఆమె జీవిస్తూ ఉన్నాము. ఈ  సమయంలో కట్నకానుకల వలన మా పెళ్ళి ఆగిపోవలసి వస్తోంది అంటే ఆ నేరాన్ని చేయటానికి నేను రెడీగా లేను.

ఈ లోకం నుండి కట్నకానుకలు అనేది పోతుందో, లేదో...నన్ను వదిలి, నా వరకు ఈ కట్నకానుకలు అనేది పోయేతీరాలి. ఇలా అనుకుని యువకులందరూ నడుచుకుంటే ఖచ్చితంగా కట్నకానుకల నిషేధం అయిపోతుంది. నేనిప్పుడు చెయ్యలేనిది చెయ్యాలనుకోవటం లేదు. నేను చేయగలిగినది చెయ్యటానికి పూనుకున్నాను.

కట్నకానుకలు అనేది ఆడపిల్లకు చేయబడ్డ అవినీతి. దాన్ని ఆడపిల్లలు ఖచ్చితంగా నిషేదించగలరు. కానీ, ఆ ఆడపిల్లలే, పెళ్ళికొడుకు యొక్క తల్లిని-అక్కని-చెల్లిని-ఆ కృరమైన కట్నకానుకలను తీసుకోమని చెప్పటం ఎంతో పెద్ద ఘోరం? దీంట్లో చాలాపెద్ద భాగం ఆడపిల్లలదే. మీ భాగం మీరు చెయ్యలేకపోతే, పెళ్ళి చేసుకోబొయే పెళ్ళికొడుకుకు ఈ నేరాన్ని ఖచ్చితంగా ఆపగలడు.

డబ్బు జీవితానికి అవసరమే. కానీ, జీవితమే డబ్బు కాదు. ఆ డబ్బును నేను సంపాదించగలను. అందువల్ల కట్నకానుకలు అనేది లేకుండా జయంతీని నాకు పెళ్ళి చేసివ్వటానికి మీరు ఒప్పుకుని, ఆమె యొక్క ఫోటోను నాకు పంపండి. లేకపోతే...క్షమించాలి. నేను ఒంటరిగా నిలబడి జయంతీని పెళ్ళి చేసుకోగలను అనేది మీకి భవ్యంగా తెలుపుతున్నాను.

నన్నుఅమెరికా అల్లుడు అని పిలిపించుకోవటం కంటే, వీడురా మగాడంటే అని పిలిపించుకోవటంలోనే గర్వపడతాను. మీకూ అదే గొప్ప.

ఇట్లు.

ఎప్పుడూ మీతోనే ఉండటానికి ఇష్టపడుతున్న కొడుకు"

ఉత్తరాన్ని ముగించి, కొరియర్ చేశాడు.

సరిగ్గా రెండు వారాల తరువాత, తిరిగి ఇంటి దగ్గర నుండి కొరియర్ లో ఉత్తరం వచ్చింది.

విప్పాడు.

లోపలున్న ఫోటోను చూశాడు. సంతోషపడ్డాడు.

ఫోటోలో జయంతీ నవ్వుతూ మల్లె పువ్వులాగా ఉన్నది.

******************************************************సమాప్తం************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మంచిదొక ఐడియా...(కథ)

ఏల్నాటి శని...(కథ)

ఆడపిల్ల…(కథ)