ఆశీర్వాదం...(కథ)

                                                                                                 ఆశీర్వాదం                                                                                                                                                                       (కథ)

మన జీవితంలో పెద్దల ఆశీర్వాదం వెలకట్టలేని నిధి. పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప విజయం. అవును ఇది జీవిత ప్రయాణంలో చాలా సహాయపడుతుంది.

మన తల్లిదండ్రులు మరియు పెద్దలు మనకు నీడ, ఆశ్రయం మరియు సౌకర్యాన్ని అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు.

మిలమిల మెరిసే బంగారంలాగా ప్రకాశిస్తున్న కొడుకులు, కూతుళ్లతో వంశాభివృద్ధి చెందాలి. ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూ, సిరిసంపదలను అనుభవిస్తూ దీర్ఘాయువులై చిరకాలం జీవించాలి.

దీన్ని అర్ధం చేసుకున్న కథలోని నాయకి తన ప్రేమకు తన తల్లి-తండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలని ఎలా ప్రయత్నం చేసిందో తెలుసుకోండి.

***************************************************************************************************

వైష్ణవికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం. నిదానస్తురాలు - అభిమానంగా ఉంటుంది. యుక్తవయసులో హృదయంలో ప్రేమ రావటం న్యాచురలే కదా! అవును...ఆమె హృదయంలోనూ ప్రేమ పుట్టింది. డేవిడ్ ను ఆరు సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. విషయం వాళ్ళింటకి తెలియదు. తెలిస్తే పెద్ద సమస్య వస్తుందని ఆమెకు తెలుసు.

అర్హత ఉన్నవాడిని - తెలివిగల వాడిని - మనసుకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకోవాలనుకునే ప్రేమ పుణ్యమైనదే కదా? అదేమన్నా నేరమా, అసహ్యమా, అవమానమా?’ అంటూ ఆమె మనసులో చాలా ప్రశ్నలు లేచినై.

ప్రేమకోసం ప్రాణాన్ని త్యాగం చెయొచ్చు. కానీ, అదే ప్రేమకోసం కన్నవారిని -  తోడబుట్టిన వాళ్ళనూ, కుటుంబాన్నీ త్యాగం చేయగలమా? చెయ్యలేము. ద్రోహం వద్దు. తన తల్లి-తండ్రులు ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని అంగీకరించరు. ధైర్యం చేసి ఎదిరించినా - కాదని పెళ్ళి చేసుకున్నా గొడవలూ, పగ వస్తుంది. తల్లి-తండ్రుల కడుపు మంటతో వచ్చే శాపం మెట్టింటో ప్రశాంతంగా జీవించనివ్వదు

కాబట్టి, ఎదిరించటం, వదులుకోవటం ఏదీ లేకుండా పెద్దవారి ఆదరణ, అంగీకారంతో ప్రేమ వివాహం జరగాలనేదే ఆమె ఆశ!

తండ్రి ఆరొగ్యం బాగలేని సమయంలో...హఠాత్తుగా తన పెళ్ళి చూడాలని ఆయన ఆశపడుతున్న విషయాన్ని వైష్ణవి డేవిడ్ దగ్గర తెలియ పరిచాడు డేవిడ్.

ప్రేమికురాలితో కలిసి ఆలొచించకుండానే పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ వెంటనే చేసి ముగించాడు డేవిడ్.

రేపు ప్రొద్దున వైష్ణవిని లబ్బిపేట లోని వెంకటేశ్వర స్వామి గుడికి రప్పించాలి. అక్కడ ఆమెను పెళ్ళిచేసుకోవాలి. తరువాత గుణదల చర్చ్ లో జపం చేసుకోవాలి. ఇంటికొచ్చి వైష్ణవి తల్లీ-తండ్రులు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి.  ఎన్ని అడ్డంకులు, ఎదిరింపులూ వచ్చినా ఎదుర్కోవాలి. తరువాత పెళ్ళి దుస్తులతోనే తన తండ్రి ముందు వెళ్ళి నిలబడాలి. తండ్రి యొక్క చివరి ఆశను నెరవేర్చాలని క్లియర్ గా తీసుకున్న నిర్ణయాన్ని డేవిడ్, తన ప్రేమికురాలి దగ్గర చెప్పాడు.

దాన్ని కొంచం కూడా ఎదురుచూడని ఆమెకు ఆందోళన కలిగింది. అదే సమయం, పెళ్ళి టైము కూడా కలిసొచ్చిందని ఆనందించింది.

డేవిడ్ అంటేనే ఆమెకు ప్రాణం. చాలా మంచి వాడు - క్రమశిక్షణ గల వ్యక్తి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. మంచి సంపాదన. అతన్ని పెళ్ళి చేసుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆమె ఆశ. అందుకని అతని నిర్ణయాన్ని ఆమోదించింది.

అదే సమయం, తొందరపడి ప్రేమ మత్తులో ప్రేమికుడికి వాగ్ధానం ఇచ్చేసేమే అని తలుచుకుని కొద్దిసేపట్లోనే బాధ పడింది.

అలా ఉన్నప్పుడు రేపు ప్రొద్దున జరగబోయే ప్రేమ వివాహం ఆమె మనసుకు ఎలా ఉత్సాహం ఇస్తుంది? తల్లి-తండ్రుల అనుమతితో ఆశీర్వాదంతో ప్రేమ వివాహం జరగాలి? దానికి ఏమిటి దారి? అని ఆమె మనసు పోరాటంలో ఆలోచించింది. దానికి సరైన ముగింపు, తీర్పు దొరకలేదు. తల పగిలిపోయేటట్టు అనిపించింది. అయోమయంతో కొట్టుమిట్టాడింది. తడబడింది.

మామూలుగా సాయంత్రం ఏడు గంటలకల్లా పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చే వైష్ణవి...టయర్డుగా ఉన్నా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ రోజు, ఆమె దగ్గర మార్పు ఉన్నది. దానికి కారణమేమిటో తల్లి సుందరి తెలుసుకోవటానికి ఇష్టపడింది.

వైష్ణవీ! నన్ను స్నేహితురాలిగా అనుకో. ఏదైనా సరే నేను తోడుంటాను. సంసయించకుండా, నీ సమస్య ఏమిటో నా దగ్గర ధైర్యంగా చెప్పవే?” అని ప్రేమగా అడిగింది తల్లి.

తల్లి ఇచ్చిన ధైర్యం ఆమెకు ఓదార్పును ఇచ్చింది. తల్లిని పూర్తిగా నమ్మింది. జరిగిందంతా ఒక్కటి కూడా దాచకుండా చెప్పి ముగించింది.

తల్లి నిర్ణయం ఆమెకు సంతోషాన్ని ఇస్తుందా? సంకటం ఇస్తుందా? అలలలో నిలబెడుతుందా? వేడిలో కాల్చి పారేస్తుందా? ఆమెకు తెలియదు. కానీ, ఆమెకు మనోభారం తగ్గినట్టు అనిపిస్తోంది. ఈగర్ గా అమ్మ యొక్క నిర్ణయాన్ని ఎదురు చూస్తూ కాచుకోనుంది.

ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుందామని ఆశపడ్డాను. నాకు నా తల్లీ, తండ్రీ  ఆదరణ ఇవ్వలేదు. ఏడ్చి మొండికేశాను. వాళ్ళకు ఇష్టమైనట్లే నా తల్లీ-తండ్రీ వేరొక జీవితాన్ని రెడీ చేసి ఇచ్చాసారు. నేను ఓడిపోయాను. చాలా గాయపడ్డాను.

నాకు ఏర్పడిన అదే గతి నీకు ఏర్పడటానికి నేను వదలను. నీ ఆశ అయిన నెరవేరనీ. నీ ప్రేమ వివాహాన్ని చూడటానికి నాకోక అవకాశం ఇచ్చిన నువ్వేనే నా కుల దేవత! దేవుడిలాగా అనుకుని కూతుర్ను నమస్కరించిన తల్లి, తరువాత, కూతురుగా అనుకుని కావలించుకుని ముద్దు ఒకటిచ్చి, ఆనందమూ పడింది.

మంచి తల్లి! జవాబుగా తల్లి బుగ్గమీద గట్టిగా ముద్దు ఒకటి ఇచ్చి సంతోషంగా మాటలు మొదలుపెట్టింది.

నాన్న యొక్క మూర్ఖత్వ గుణాన్ని ఎలా మార్చబోతావు? ఆయన్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉందమ్మా అని చెప్పటంలో నిజం ఉండటంతో, తల్లి కూడా ఒక్క క్షణం భయపడింది. మరు క్షణం తనలో ధైర్యం తెచ్చుకుని మామూలు స్థితికి వచ్చి కూతుర్ను చూసి నవ్వింది.

నా కడుపున పుట్టిన అమ్మాయి నా భర్త యొక్క గుణాన్ని తెలిసిపెట్టుకున్నప్పుడు, ఆయనతో ఇంత కాలం జీవించిన నాకు ఆయన గురించి బాగానే తెలుసే! ఆయన్ని నేను చూసుకుంటాను. నువ్వు ఆందోళన చెందుకు! అన్న తల్లి మాటలు ఆమెకు ధైర్యాన్ని ఇవ్వటంతో వైష్ణవి మనసుకు ఓదార్పుగా  ఉన్నది.

పని ముగించుకుని ఇంటికి వచ్చారు శ్రీనివాసరావ్.

నాకు బాగా సన్నిహితుడి కూతురికి రేపు పెళ్ళి. అందువలన ఆఫీసుకు సెలవు పెట్టాను. పెళ్ళికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాను! అని ఆయన చెప్పినందుకు సుందరి సరేనండీ... అన్నది.

మరుసటి రోజు ప్రొద్దున శ్రీనివాసరావ్ నిద్రలేచి స్నానం పూర్తి చేసుకుని  బయలుదేరి స్నేహితుడు కూతురు పెళ్ళికి వెళ్ళారు.

వైష్ణవి యొక్క చెళ్ళెల్లనూ, తముళ్ళనూ స్కూలుకు కొంచం ముందుగానే పంపింది తల్లి.

స్నానం అదీ పూర్తి చేసి వైష్ణవి, ఆమె తల్లి లబ్బిపేట లోని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చారు. అక్కడ డేవిడ్ చేతులలో పూలమాలలు, తాళి బొట్టుతో  నిలబడున్నాడు. వైష్ణవిని చూసి అతను ఆనందపడటం కంటే, ఆమె తల్లిని చూసి  ఎక్కువ సంతోషపడ్డాడు.

ఆమెకూ, అతనికీ ఈడూ జోడూ చాలా బాగుంది! అందువలన తల్లి గర్వంగా కనబడింది.

మా అమ్మ మన పెళ్ళికి పచ్చజెండా చూపించింది. ఆమె ఆశీర్వాదంతోనే మన పెళ్ళి జరగబోతోంది డేవిడ్!

చాలా సంతోషం!

తమ్ముడూ నా కూతుర్ని ముందూ వెనుకా తెలియని మిమ్మల్ని నమ్మి అప్పగిస్తున్నాను. నా కూతురితో మంచి విధంగా కాపురం చేసి, ఆమెను కాపాడవలసింది మీ బాధ్యత!

మీ నమ్మకం చెడిపోయేటట్టు నేను ఎప్పుడూ నడుచుకోను! నా గురించి వైష్ణవికి తెలుసు!

సరే బాబూ! అంటూ కూతురు చేతులు పట్టుకుని అతని దగ్గర అప్పచెప్పేటప్పుడు కళ్లల్లో నుండి ఆనంద కన్నీరు కారింది.

ఇద్దరూ మాలలు మార్చుకున్నారు. డేవిడ్ ఆమె మెడలో మూడు ముళ్ళూ వేశాడు.

కొత్త దంపతులను వాళ్ల మనసు ఆనందపడే విధంగా ఆశీర్వాదం చేసింది తల్లి.

వైష్ణవీ! నాన్న ఇంటికి వచ్చేస్తారు. నేను వెళ్తాను. చర్చ్ కు నేను రాలేను. మీరు మాత్రం వెళ్ళి ఇంటికి వచ్చేయండి! అని తల్లి చెప్పినప్పుడు వాళ్ళు కూడా సరే అన్నారు.

ప్రియమైన భర్తకు నమస్కారం!

ప్రేమలో మన కూతురు వైష్ణవి మోసపోలేదు. ఒక మంచి ఉద్యోగంలో ఉన్నతనే, ఒక మంచివాడినే, బాగా నమ్మకం ఉన్నవాడినే ఎన్నుకోనున్నది. అందువలన ఆమె జీవితం బాగా ఉంటుంది.

మనసారా సంగమమైన వాళ్ళను మనం వేరు చేయడానికి ప్రయత్నించడం పాపం! కాబట్టి, నేనే ముందు నిలబడి వాళ్ళకు పెళ్ళి చేశాను. తరువాత మీ ముందు నిలబడటానికి నాకు ధైర్యం లేదు.

మీకు చెప్పకుండా, మీకు తెలియకుండా నేను కార్యమూ చేసింది లేదు! ఇదే మొదటి సారి. నన్ను క్షమించండి. మీ మొండితనం ముందు నా నిర్ణయం ఓడిపోతుందని నాకు బాగా తెలుసు. అందువలన, నా ఓటమికి నేనే బాధ్యత వహిస్తూ లోకం వదిలి సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.

ఒక మరణం ముగింపున, ఒక మనిషి యొక్క మొండితనం గుణం ఖచ్చితంగా మారుతుంది...విరుగుతుంది. అనే నా నమ్మకం నాకు ఉంది! నా మరణం మీ మొండిపట్టుదల మనసును మారుస్తుంది. కూతురు--అల్లుడిని ఆశీర్వదించండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. నేను మీతో జీవించిన జీవితానికి ఒక అర్ధం ఉంటుంది.

మీ ప్రియమైన భార్య.

సుందరి

రాసిన ఉత్తరాన్ని రెండుసార్లు చదివిచూసింది సుందరి. తృప్తిగానూ, పూర్తి వివరాలతోనూ ఉన్నది.

తాను రాసిన ఉత్తరాన్ని టేబుల్ మీద పెట్టి అది ఎగిరిపోకుండా దాని మీద పేపర్ వైట్ పెట్టింది.

విషం సీసాను తీసుకుని వంటగదికి వెళ్ళి విషం తాగింది.

కల్యాణ మండపం.

తాలి కట్టద్దు ఆపరా! పెళ్ళి కొడుకును చూసి కోపంగా అరిచాడు ఇన్స్పెక్టర్. పెళ్ళికి వచ్చిన జనం అదిరిపడ్డారు. అయోమయంతోనూ, భయంతోనూ ఇన్స్పెక్టర్ను చూసి,

ఇన్స్పెక్టర్! పెళ్ళిని ఎందుకు ఆపమన్నారు ?” పిల్ల తండ్రి అడిగాడు.

ముద్దాయి అయిన పెళ్ళి కొడుకును అరెస్టు చేయటానికి వచ్చాము!

ముద్దాయా?” పెళ్ళి కూతురి తండ్రి షాకయ్యాడు.

తమిళనాడు, కేరళా, కర్నాటకా అని రాష్ట్రం రాష్ట్రంగా డాక్టర్, వ్యాపారవేత్త, ప్రభుత్వ అధికారి అని పలు అబద్దాలు చెప్పి ఆడపిల్లలను పెళ్ళి చేసుకుని నగలు, డబ్బూ అన్నిటినీ దోచుకుని, ఆమెను విడిచిపెట్టి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చాడు ఇతను! అన్నాడు ఇన్స్పెక్టర్.

ఆధారాలను చూపించి ఇన్స్పెక్టర్ మాట్లాడిన తరువాత పరిస్థితి అర్ధం చేసుకున్న పిల్ల తండ్రి, “మంచి సమయంలో వచ్చారు. లేకపోతే వీడి దగ్గర మేమూ  మోసపోయే వాళ్లం. నా కూతురి జీవితం నాశనమై ఉంటుంది! మీరు మాకు దైవం సార్! అంటూ ఇన్స్పెక్టర్ కు థ్యాంక్స్ చెప్పారు.

మండపంలో గోలగోల జరుగుతున్న అదే సమయం పెళ్ళి కూతురు దేవీ, తన తండ్రి యొక్క స్నేహితుడైన వైష్ణవి యొక్క తండ్రి శ్రీనివాసరావ్ గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడింది. అంతకు ముందు తాను ప్రేమించిన శ్రీధర్  ను కూడా రప్పించింది.

నా తండ్రీ, మీరూ మంచి స్నేహితులు. వైష్ణవిలాగా నన్నూ మీ కూతురిగా  అనుకోండి. ఈయన పేరు శ్రీధర్. పి.డబ్ల్యూ.డి లో జూనియర్ ఇంజనీర్ గా ఉన్నారు. నేనూ, ఈయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాము! మా ప్రేమ నా తండ్రికి తెలిసి, ‘నోఅన్నారు

అవును సార్! నేనూ దేవీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా కోసం నా  తల్లి -- తండ్రీ దేవీ వాళ్ళింటికి వెళ్ళి పిల్లనడిగారు. ఇవ్వమూ అని నిరాకరించారు. విరిగిపోయాము!

నేను కూడా విరిగిపోయాను! అన్నది దేవీ.

శ్రీధర్ కు, దేవీకీ లోతైన మనసులో ఉన్న ప్రేమ తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

నేను చూసిన అబ్బాయికే నువ్వు మెడ వంచాలి. కాదు, కూడదు అంటే చచ్చిపోతానని నాన్న నన్ను భయపెట్టారు. నేనూ వేరే దారి తెలియక భయపడి ఈయన్ని వదిలి దూరం వచ్చాశాను. ఇప్పుడు నన్నూ, ఈయన్నీ ఒకటిగా కలిపి పెళ్ళి చేయమని మా నాన్న దగ్గర చెప్పండి అంకుల్. మా నాన్న దగ్గర మీరు మాట్లాడండి అంకుల్!  అని పెళ్ళి కూతురు దుస్తులలో ఉన్న దేవీ బ్రతిమిలాడింది. ఏడ్చింది.

ఆమెను చూడటానికి పాపం అనిపించింది. దేవీ కన్నీళ్ళను తుడిచి ఆమె తండ్రితో మాట్లాడాడు శ్రీనివాసరావ్.

రేయ్...జరగాల్సింది జరిగిపోయింది. ఇక మీదట దాని గురించి తలుచుకుంటూ  బాధ పడక్కర్లేదు.

పరిస్థితుల్లో నీ మొండి పట్టుదలను విడిచిపెడితేనే మంచిది. వాళ్ల జీవితాన్ని వాళ్ళు ఎంచుకునేందుకు వాళ్ళకు హక్కు ఉంది. ప్రేమకు ఎందుకు జాతి, మతం, పేద -- ఆస్తి అనే రంగులు పూస్తున్నారు? చదువు, అర్హత, పర్మనెంట్ ఉద్యోగం అతని చేతిలో ఉంది. అది కన్నవారికీ, నమ్మి వచ్చిన దానికీ తిండిపెడుతుంది.

ఇంతకంటే వేరే ఏం కావాలి? అతనూ చూడటానికి కంటికి లక్షణంగా ఉన్నాడు. ఏం తక్కువ? పవిత్రమైన ప్రేమ ఎప్పటికీ విజయం పొందుతుంది. దాన్ని మనం స్వాగతించాలే తప్ప పూడ్చిపెట్ట కూడదు.

కాలం లాగా కాలం లేదు. సైన్స్ లోనూ, మెకానిజం లోనూ, కంప్యూటర్లలోనూ లోకం ముందుకు జరుగుతూ డెవెలప్ అవుతోంది. దానికి తగినట్టు మనం మన మనసులను మార్చుకోవటమే తెలివిగల తనం!

నిజమేరా! అన్నారు పెళ్ళి కూతురు తండ్రి.

కన్నవారు మొదట వాళ్ళ పిల్లల మనసు తెలుసుకుని నడుచుకోవాలి. వాళ్ళకు నచ్చిన జీవితాన్ని వాళ్ళకు ఏర్పాటు చేసి ఇవ్వాలి. అప్పుడే ఆడపిల్ల జీవితం బాగుంటుంది! అన్నాడు శ్రీనివాసరావ్.

ఇప్పుడు నేను అర్ధం చేసుకున్నారా. వాళ్ళను వేరు చేయాలనుకున్నది తప్పే. దానికి పరిహారంగా వాళ్ళ పెళ్ళిని నేనే దగ్గరుండి ఇక్కడే జరిపిస్తాను! అన్నారు దేవీ తండ్రీ.

ఇంట్లోకి వచ్చిన శ్రీనివాసరావ్ సుందరీ! సుందరీ అంటూ కేక వేశారు.

సమాధానం రాకపొవటంతో, అయోమయంతో బెడ్ రూములోకి వెళ్ళిన ఆయనకు టేబుల్ మీదున్న లెటర్ కనబడింది.

దాన్ని చేతుల్లోకి తీసుకుని చదివారు. హృదయం అగ్ని పర్వతంలా పేలింది. కన్నీరు వర్షంలా కురిసింది.

విషం తాగి ప్రాణానికి పోరాడుతున్న ఆయన భార్య మూలుగు శబ్ధం వంటగదిలో నుండి వచ్చింది.

వెంటనే వంట గదిలోకి పరిగెత్తుకు వెళ్ళి, భార్య సుందరీని ఎత్తుకుని బయటకు తీసుకు వచ్చారు శ్రీనివాసరావ్.

అదే సమయంలో వైష్ణవి, డేవిడ్ ఆటోలో వచ్చి ఇంటి వాకిట్లో దిగారు.

వైష్ణవీ! అమ్మ విషం తాగేసిందమ్మా. భగవంతుడే ఇక అమ్మను కాపాడాలి! బాధతో ఏడ్చారు.

అమ్మా! పెద్దగా అరిచిన వైష్ణవి యొక్క పెద్ద అరుపు ప్రతిధ్వనిలాగా వినబడింది.

ఈవిడ ప్రాణానికి ఎటువంటి ఆపద రాదు! ఆసుపత్రికి వెళితే అంతా సరైపోతుంది! డేవిడ్ వాళ్ళకు ధైర్యం చెప్పాడు.

వాళ్ళు వచ్చిన అదే ఆటోలోనే సుందరిని తీసుకు వెళ్ళారు.

సుందరి బ్రతకాలని ముగ్గురూ ప్రార్ధన చేశారు. ప్రార్ధనకు ఫలితం లభించింది.

సరైన సమయానికి తీసుకు వచ్చి చేర్చినా, భగవంతుడి దయతో ఆవిడ బ్రతికింది. సంతోషంగా వెళ్ళి చూడండి అని డాక్టర్ వాళ్ల దగ్గర చెప్ప, ముగ్గురూ సంతోషంగా సుందరిని వెళ్ళి చూశారు.

నీరసంగా ప్రత్యేక గదిలో పడుకోనుంది. ఏడుస్తున్న వాళ్లను చూసి అడిగింది. నేను బ్రతికేను కదా. ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ల ప్రేమ వివాహాన్ని ఆదరించి, మీరు వాళ్ళను మనసారా ఆశీర్వదిస్తారా? చెప్పండి!భర్త శ్రీనివాసరావ్ ను అడిగింది.

నన్ను ఎదిరించి నిలబడే ధైర్యం లేక నువ్వు విషం తాగి పిరికితనమైన చేష్ట చేసేవేనని నా మనసు వేదన పడ్డది! ఎదిరించి నిలబడితేనే దేంట్లోనైనా  జయంచవచ్చు. భర్తకు భార్య కట్టుబడి నడుచుకోవాలి. కానీ, న్యాయానికి భార్య భర్తనైనా ఎదిరించి నిలబడటంలో తప్పేలేదు!

.................................”

మిగిలిన వాళ్ళ ఆశను నా వల్ల కుదిరినంతవరకూ నెరవేర్చి పెట్టిన నేను, నా కూతురి ఆశను నెరవేర్చటంలో తప్పు చేస్తానా?’

నువ్వింకా నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు సుందరీ. ప్రేమ పెళ్ళిని ఆదరించే నా యొక్క ఆశీర్వాదం వాళ్ళకు ఎప్పుడూ ఉంటుంది! అని వాళ్లను హృదయపూర్వకంగా శ్రీనివాసరావ్ ఆనందంతో ఆశీర్వాదం చెయ్య, అక్కడ  ఆనంద పువ్వు వికసించినట్టు అందరి మొహాలలోనూ నవ్వు కనబడింది.

*******************************************************సమాప్తం************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

హక్కు...(కథ)