నిజాయతీ...(కథ)
నిజాయతీ (కథ)
నిజమైన ఆయనంలో లేక అసలైన మార్గంలో నడుచుకోవడాన్ని నిజాయితీ అంటారు. నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క ఒక విభాగాన్ని సూచిస్తుంది మరియు చిత్తశుద్ధి, యదార్ధం వంటి అనుకూల మరియు సద్గుణ గుణాలనే అర్థాన్ని ఇస్తుంది, అలాగే దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం కలిగి ఉండాలి. నిజాయితి అనేది అనేక జాతి మరియు మతపరమైన సంస్కృతులలో విలువైనదిగా ఉంది.
నిజాయితీ అనేది ఉత్తమమైన విధానం.నిజాయితీ అనేది జ్ఞానం.
ఒక స్త్రీ తను ఏమనుకుంటుందో తెలియచెప్పే సిల్హౌట్ డ్రాయింగ్
నిజాయితీ (సిన్సియారిటీ) కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవననాన్ని కొనసాగిస్తూఉంటారు. తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, నిష్కల్మషంగాను వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధత తో ప్రవర్తిస్తారు.
***************************************************************************************************
ఎప్పుడూ సాయంత్రం
ఏడు గంటలకు
ఇంటికి వచ్చే
అర్చనా యొక్క
భర్త రామమూర్తీ
ఆ రోజు
ఐదింటికే ఇంటికి
వచ్చేశారు. ఆయనకు
ఒక ప్రైవేట్
కంపెనీలో మేనేజర్
ఉద్యోగం. ఇంటికి
వచ్చిన భర్తకు
కాఫీ, తినటానికి
ఫలహారం ఇచ్చి
ఎదురుకుండా కూర్చుంది
అర్చనా.
“ఏమీండీ...మీ
దగ్గర ఒక
రిక్వెస్ట్”
“చెప్పు
అర్చనా...”
“నేను
రోజూ పచారీ
సరకులు కొనే
షాపులో వెంకటేశం
అనే ఒక
కుర్రాడు ఉన్నాడండీ.
ఇరవై రెండేళ్ళు
ఉంటాయి. చాలా
తెలివిగలవాడు”
“తెలివిగలవాడంటే
ఎలా?”
“ఎంతమంది
షాపుకు వచ్చినా
అతనొక్కడే మేనేజ్
చేసి సరకులు
కరెక్టుగా లెక్కవేసి
అతను డబ్బు
తీసుకునే స్టైలు
చూడాలి”
“దానికేమిటిప్పుడు?”
“మీ
కంపెనీలో అతనికి
ఒక ఉద్యోగం
ఇప్పించగలరా అని
అడిగాడు. పదోక్లాసు
వరకు
చదువుకున్నాడు.
ఆఫీసు బాయ్
పని దొరికినా
పరవాలేదు అంటున్నాడు”
“ఆఫీసు
బాయ్ అంటే
సాదారణమైన ఈజీ
ఉద్యోగం అనుకున్నావా
ఏమిటి? ఆఫీసులో
ఉన్న ప్రతి
ఉద్యోగికీ వాళ్ళు
చెప్పే పనులు
చేసిపెట్టాలి. ఆఫీసును
శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆఫీసు డబ్బును
బ్యాంకులో కట్టటానికి
వెళ్ళాలి - బ్యాంకు
నుండి డబ్బులు
తీసుకురావాలి. దీనికంతా
ఒక నమ్మకమైన
అబ్బాయి కావాలి”
“ఆ
అబ్బాయి మంచివాడు
-- దానికి నేను
గ్యారంటీ ఇస్తాను.
ఏదో నామీద
నమ్మకం ఉంచి
ఉద్యోగం అడిగాడు.
నేనూ మీ
దగ్గర అడిగి
చెబుతానని చెప్పాను.
ఏం చెబుతారు?”
“సరే, రేపు
నన్ను ఆఫీసులో
వచ్చి చూడమను”
అర్చనాకి మనసు
చల్లబడింది.
మరుసటి రోజు
ఈ సంతోషమైన
వార్తను చెప్పి, అలాగే
ఇంటికి కావలసిన
సరకులు కొనుకొద్దామని
అనుకుని వెంకటేశం
షాపుకు వెళ్ళింది
అర్చనా.
షాపులో గుంపు
ఎక్కువగా ఉంది.
గుంపు తగ్గేంతవరకు
కాచుకోనుండి, తరువాత
తనకు కావలసిన
సరకులను కొనుక్కుంది.
“ఎంతైంది
చెల్లప్పా?”
“మేడమ్...నాలుగు
వందల యాభై
రూపాయలు అయ్యింది.
ఇదిగో చీటీ”
“ఇదిగో
నా దగ్గర
ఐదు వందల
రూపాయల కాగితం
ఉంది. నీ
లెక్క పోనూ
మిగతాది ఇవ్వు”
అతనూ క్యాష్
బాక్స్ లో
నుండి డబ్బి
తీసి ఇచ్చాడు.
“ఏమిటి
వెంకటేశం...నాలుగువందల
యాభై అంటే, బ్యాలన్స్
యాభై రూపాయలే
కదా నాకు
నువ్వు ఇవ్వాలి.
ఎందుకు మూడు
వందల రూపాయలు
ఇచ్చావు?”
“మ్యాడమ్...యజమాని
షాపులో లేరు...నాకు
ఉద్యోగం ఇప్పిస్తానని
చెప్పారు...పరవలేదు
మేడమ్ ఉంచండి” అన్నాడు వెంకటేశం.
అర్చనా అధిరిపడ్డది.
‘తన
ఆఫీసుకు నిజాయితీ
గల కుర్రాడు
కావాలని కదా
తన భర్త
అడిగారు. ఇతని
దగ్గర టాలెంటు
ఉన్నంతగా నిజాయితీ
లేదే. వీడికోసమా
ఉద్యోగానికి రెకమండేషన్
చేశాను?’ అని
ఆలొచిస్తూ నిలబడింది
అర్చనా.
“ఏమిటి
మ్యాడమ్ ఆలొచిస్తున్నారు?”
“ఇదిగో
అబ్బాయ్ నువ్విచ్చిన
మూడువందల రూపాయలు.
నాకు చేరాల్సిన
బాకీ యాభై
రూపాయలు నాకిస్తె
చాలు” అంటూ తన
నిజాయితీని నిలబెట్టుకుని
ఇంటికి తిరిగొచ్చింది
అర్చనా.
*****************************************************సమాప్తం**************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి