అబద్దమే నిజం!...(కథ)

 

                                                                     అబద్దమే నిజం!                                                                                                                                                   (కథ)

ప్రేమించడానికి అబద్దం చెప్పు, కానీ ప్రేమించానని అబద్దం చెప్పకు. పోయేది నమ్మకం కాదు ఒక జీవితం...ఇది ఎంత నిజమో అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను కాపాడుకోవటానికీ, బిడ్డ కడుపుకు ఇంత ముద్ద పెట్టటానికి లలితమ్మ నిజాన్ని దాచింది కానీ అబద్దం చెప్పలేదు. భగవంతుడికి తెలియదా? అన్ని రోజులు లలితమ్మను శిక్షించని భగవంతుడు, హఠాత్తుగా లలితమ్మను శిక్చిస్తాడా?......మానవులు మూఢ నమ్మకాలను ఇంకా పాటిస్తున్నారని తెలియజేయటానికి కథను రాయించాడు. లలితమ్మ చెప్పిన అబద్దం వలన తన పుణ్యాలన్నీ పాపాలు అయినాయని లలితమ్మను పనిలోంచి తీసేసి ఆమెకు దొరికిన సెక్యూరిటీని పోగొట్టింది కల్యాణీ. అందువలనే భగవంతుడు పుణ్యకార్యాలను కల్యాణీ కొడుకు ద్వారా చేయించాడు.......ఇదంతా ఎలా జరిగిందో కథను చదివి తెలుసుకోండి.

****************************************************************************************************

గోరింటాకు చెట్టు వాకిలిలో పూతపూసి ఆడుతున్నది. దాని మెడిషనల్ వాసన నాకు చాలా చాలా నచ్చుతుంది. నేను ఎవరనేది చెప్పనేలేదే. నా పేరు రత్నం. నా తల్లి కల్యాణికి ఒకడే కొడుకును. హైదరాబాద్ సిటీలోని ఒక కాలేజీలో చివరి  సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాను. చదువు ముగిసిన తరువాత, నన్ను అమెరికా పంపించి ఎం.ఎస్. చదివించాలని నా తల్లి-తండ్రులకు ఆశ.

ఈసారి గ్రామంలోని మా ఇంటికి నేను సెలవులకు వచ్చిన సమయం, మా ఇంట్లో పని చేసే లలితమ్మ ఎప్పుడూలాగా వాకిలిలో ఉన్న చెట్టు నుండి గోరింటాకు ఆకులను కోసుకు వచ్చి, శుభ్రం చేసి, రుబ్బుతోంది.

నా తల్లి ఒక గోరింటాకు పిచ్చిది. వారానికి ఒకరోజు గోరింటాకు రుబ్బి చేతుల్లో, కాళ్ళలో పూసుకోవాలి. శరీర ఉష్ణం తగ్గుతుందట. గోరింటాకు ఆకులను రుబ్బి, దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించి తీసి దాన్ని ఊరబెట్టి, తలకు రాసుకుని స్నానం చేస్తే చాలా మంచిదట.

ఆరొగ్యానికి మంచిది రత్నం. తలలొ ఒత్తుగా జుట్టు పెరుగుతుంది. తరువాత తలజుట్టు నెరవనే నెరవదు. యుక్త వయసు నెరవటం కూడా ఉండదు. నువ్వూ పెట్టుకో అంటుంది అమ్మ.

రోజు.

లలితమ్మ గోరింటాకు రుబ్బుతూ ఉంది. ఆమె చేయంతా ఎర్రగా ఉంది. గోరింటాకు పండాక ఎర్రగా అవుతుంది. ఆడవారికి ఎరుపెక్కితే భర్త బాగా ప్రేమగా ఉంటాడు అంటారు...అందువలనే గోరింటాకుకు మహాత్యం అంటూ గోరింటాకు పురాణం పాడుతుంది తల్లి.

విష్ణు పురాణం, గరుడ పురాణం లాగా ఇది గోరింటాకు పురాణం.

లలితమ్మకు యాభై ఏళ్ళే ఉంటుంది. భర్త ఇంటి నుండి పారిపోయాడు. అందువల్ల ఆమె నాలుగు ఇళ్ళల్లో పనిచేసి ఎలాగో కుటుంబాన్ని కాపాడుకుంటోంది. ఆమెకు రంగనాయకీ అని ఒక కూతురు ఉంది. ఏదో వ్యాధితో బాధించబడ్డ స్త్రీ. రంగనాయకీ అని పిలిస్తే తిరిగి చూడదు.

రంగూ అని పిలిస్తేనే తిరిగి చూస్తుంది. తనకు తానే నవ్వుకోవటం, ఏదైనా పనిచేయడం మొదలుపెడితే పనినే ఆపకుండా చేస్తూ ఉండటం, నోటి చివర్లో నుండి ఉమ్మునీరు కారుతుండగా అన్నయ్యా, అన్నయ్యాఅంటూ నా దగ్గరకు పరిగెత్తుకు వస్తుంది.

రంగూను చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. యుక్త వయసు ఆమె శరీరంలో శిలను గీసుంచుంది. తన గురించి జ్ఞాపకమే లేకుండా చుట్టూ తిరిగే పిచ్చిది.

రోజూ తన తల్లితోనే రంగూ వస్తుంది. గోరింటాకును రుబ్బి ఇస్తుంది. ఇడ్లీ పిండి రుబ్బటం, తన తల్లికీ, నా తల్లికీ చేదోడు వాదోడుగా ఏదో ఒక సహాయం చేయటం, గ్రైండర్ లో పిండి రుబ్బటం లాంటి పనులు చేస్తుంది. నేను అమ్మ దగ్గర చెప్పి రంగూను ఒక ఆటిసం ట్రైనింగ్ స్కూలుకు వెళ్లే ఏర్పాటు చేశాను.

లలితమ్మ ప్రొద్దున పనికి వచ్చేటప్పుడు స్కూల్లో రంగూను వదిలిపెట్టి, సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను తీసుకువెళుతుంది.

రోజు లలితమ్మతో గోరింటాకు రుబ్బటంలో సహాయపడింది రంగూ. లలితమ్మ రుబ్బిన గోరింటాకు పిండిలో సగం తీసి నా తల్లి లలితమ్మదగ్గర ఇచ్చింది. చాలా గోరింటాకు ఉంది. నువ్వు మీ ఇంటికి తీసుకు వెళ్ళు

నాకెందుకమ్మా? నేను గోరింటాకు పెట్టుకోను. నాకు అది నచ్చదు

నీకు నచ్చకపోతే పరవాలేదు రంగూకి పెట్టు. అది చిన్న పిల్లే కదా?" అమ్మ ఇచ్చిన గోరింటాకు పేస్టును తీసుకుని రింటాకుఅంటూ అరుస్తూ పరిగెత్తింది రంగూ. ఇంటి చుట్టూ ఒక రౌండ్ పరిగెత్తి మళ్ళీ లలితమ్మ దగ్గరకు వచ్చిన రంగూను చూసి లలితమ్మ కేకలు వేసింది.

ఇలా లంగా అంతా గోరింటాకు రాసుకున్నావేంటే...వెళ్ళి కడుక్కురా

రంగూ ఏడ్చింది.

పోవట్లేదు -- రంగూ ఏడుస్తూనే చెప్పింది.

అప్పుడు నా తల్లి అక్కడకు వచ్చింది.

లలితమ్మా, ఇది గోరింటాకు మరకలు కావు...అటు చూడు అన్నది.

లలితమ్మ చూసింది. రంగూ లంగా అంతా ఎర్ర ఎర్రగా రక్తం మరకలు.

భగవంతుడా లలితమ్మ ఆందోళన చెందింది.

భగవంతుడా ఇదొక్కటే మిగిలింది...దీన్ని నేను ఎలా ఒడ్డెక్కిస్తాను?”

రంగూకు స్నానం చేయించి, వేరే దుస్తులు మార్పించి, ఆమెకు హారతీ తీసి ఇంటికి పంపించింది నా తల్లి.

ఒక వారం రోజుల తరువాత లలితమ్మ మళ్ళీ పనికి వచ్చింది. ఆమెతో పాటూ రంగూ కూడా వచ్చింది. రంగూను స్కూలుకు పంపటం లేదట.

రంగూ నా దగ్గరకు వచ్చింది. కాలేజీ సెలవులు ముగింపుకు వస్తూ ఉండటంతో నేను ఊరికి బయలుదేరుతున్నాను.

సంవత్సరం ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఒక చీర కొనుక్కొస్తావా అన్నా...అమ్మ చెప్పింది. నేను ఇక మీదట చీరే కట్టాలట రంగూ గోరింటాకు పెట్టుకున్న చేతులను ఊపుతూనే నాకు సెండాఫ్ ఇచ్చింది.

నాలుగు నెలలు గడిచినై.

నాకు అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికింది. విషయం చెప్పి, అమెరికా వెళ్లేముందు ఒక రెండు వారాలు ఇంటిదగ్గర గడపాలని ఊరికి వచ్చాను. మర్చిపోకుండా రంగూ అడిగినట్లు ఆమెకు ఒక చీర కొనుక్కు వచ్చాను. ఇక ఎప్పుడు వస్తానో తెలియదు. ఇంటికి వచ్చాను. ఇల్లు నిశ్శబ్ధంగా ఉంది. అమ్మ వంట గదిలో ఏదో వంట చేస్తోంది.

నా కోసం స్పేషల్ వంట.

అమ్మా, లలితమ్మ ఎక్కడ?”

అమ్మ దగ్గర అడిగాను. అమ్మ మొహం తిప్పుకుంది.

దాని గురించి మాట్లాడాకు

ఏమైందమ్మా?

అమ్మ చెప్పింది.

లలితమ్మ ఒక విధవరాలు. ఆమె భర్త కలకత్తాలో ఏదో బెంగాలీ ఇంట్లో కారు  డ్రైవర్ గా పనిచేశాడు. తాగి, తాగి, చనిపోయాడుట. కలకత్తా నుండి నాన్నను చూడటానికి వచ్చిన ఒక స్నేహితుడు లలితమ్మ కథను చెప్పారు.

ఆమె నన్ను మోసం చేసింది. పెద్ద ముత్తైదువులాగా మొహానికి పెద్ద కుంకుమ బొట్టు, నుదుటి మీద సింధూరం పూసుకుని, గోరింటకు రుబ్బి సుమంగలీలకు, పూజలు చెసేటప్పుడంతా వాళ్లతో ఉంటూ, నవరాత్రుల పూజలో అమ్మవారికి నైవేద్యం పెట్టి, లక్ష్మీ పూజ చేసి, అంతా నాతో కలిసి చేసింది. ఎప్పుడు గొయ్య తీసి నిజాన్ని పూడ్చిపెట్టిందో, అప్పుడే నేను చేసిన పుణ్యాలన్నీ, పాపాలు అయిపోయినై.  విధవరాలు అయ్యండి సుమంగలిలాగా వ్రతాలలో, దేవుని పూజలలో మడికట్టుకుని పనులుచేసిందే, అది నన్ను మోసం చేయటమా? కాదు-- భగవంతుడినే మొసం చేసింది. ఇలా అబద్దం చెప్పటం వలనే ఒక పిచ్చిదాన్ని కన్నది

అమ్మ ఏడ్చింది.

లలితమ్మ దగ్గర అడిగినప్పుడు, దానికి లలితమ్మ చేతులెత్తి దన్నం పెడుతూ  చెప్పింది నిజం చెబితే పని దొరకటం  లేదమ్మా...ఎవరూ విధవరాలును అంగీకరించటం లేదు. బ్రతుకు తెరువు కొసం అబద్దం చెప్పాను. ఎవర్నీ మోసం చేయటానికి అబద్దం చెప్పలేదు. నేను చెప్పిన అబద్దం నా కడుపును నింపుకోవటానికి కాదమ్మా. ఒక పిచ్చి పట్టిన అమ్మాయిని కన్నానే. దానికోసం?” లలితమ్మ ఏడవ, అమ్మ ఆమెను పనిలోంచి తీసేసింది.

నాలుగు రోజుల తరువాత ఆ రోజు రోడ్డు మీద నడిచి వెడుతున్నప్పుడు ఒక చోట ఒకటే గుంపు. ఏదో జరిగింది. పోలీసులు పనులు చేస్తున్నారు., బోర్ల పడిపోయున్న శవాన్ని తిన్నగా తిప్పారు. నేను ఆశ్చర్యపోయాను. చేతికి పూసిన రంగు...?

చేతిలో గోరింటాకు గుర్తుతో చనిపోయి పడున్నది రంగూనే...ఎవరో చెప్పారు. ఒకమ్మాయి, ఒకతల్లి నడిచి వెళ్తున్నారట, ఏదో ఒక కారు గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిందట. నేను చూశాను.

బయటకు గోరింటాకు పూసిన చేతులు కనబడుతున్నాయి.

అయ్యింది...అంతా అయిపోయిందినా మనసు విలవిల్లాడిపోయింది.

అన్నయ్యా అని పిలిచిన పిచ్చి పిల్లకు ఏదో చెయ్యాలని అనిపించింది. ఒక తీర్మానానికి వచ్చాను.

పోలీసుల దగ్గర నుండి అనుమతి తీసుకుని రంగూకు చేయవలసిన అంతిమ కార్యాలు ఒక అన్నయ్య అనే వరుసతో నేనే చేసి ముగించాను. అంతా ముగిసింది. కన్నీటితో నేను. రెండు రోజులుగా లలితమ్మ ఆసుపత్రిలో స్ప్రుహ కోల్పోయి ఉన్నది. ఆమెను చూడలి. వెళ్లాను.

ప్రొద్దున్నే స్ప్రుహలోకి వచ్చిందని అక్కడున్న వాళ్ళు చెప్పారు. నన్ను చూసిన వెంటనే లలితమ్మ చేతులు జోడించి వెక్కి వెక్కి ఏడ్చింది.

తమ్ముడూ నేనొక విధవరాలును...అమ్మా వాళ్లను మోస...

నేను ఆమె చేతులు పట్టుకుని చెప్పాను.

అమ్మ అంతా చెప్పింది. బాధపడకండి లలితమ్మా. మీరు చెప్పింది అబద్దం  కాదు

సరి నాయనా...రంగూ...

రంగూకి చిన్న చిన్న దెబ్బలే. నేను చూసుకుంటాను. ఆమె ట్రీట్మెంటుకు నేను ఏర్పాటు చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన ఆలోచనతో మనసు పాడుచేసుకోకండి

థ్యాంక్స్ తమ్ముడూ అంటూ దన్నం పెట్టింది.

నేను వస్తున్న కన్నీటిని దాచుకుంటూ బయలుదేరుతున్నా. ఇది కూడా ఒక అబద్దమే. అబద్దం చెప్పినందుకోసమే నా తల్లి, లలితమ్మను పని నుండి తీసేసింది. నన్ను ఏం చెయ్యబోతోంది? ఒక తల్లి తపనను పోగొట్ట నేను చెప్పిన అబద్దం. ఇది లలితమ్మను ఖచ్చితంగా నయం చేస్తుంది. నేను చెప్పకుండా దాచిన ఇంకొక నిజం ఉంది. అదేంటో తెలుసా?  

పోస్టుమార్టం రిపోర్టులో పిచ్చి పిల్ల రంగూ యొక్క కడుపులో నాలుగు వారాల పిండము...డాక్టర్ చెప్పాడు.

నాకు ఒక్క నిమిషం గుండె ఆగినట్లు అనిపించింది. ఏడ్చాను. నేను చెప్పిన అబద్దం కోసం ఏడవలేదు. అంగవైకల్యంతో పెరుగుతున్న ఒక ఆడపిల్లను మరణంలోకి తోసిన కారు...ఆమెను గర్భవతిని చేసిన మొహం తెలియని రాక్షసుడు...నాలో రంగూ గోరింటాకు చేతులతో టాటాచెబుతున్న రంగూ. నేను కన్నీరును తుడుచుకున్నాను.

******************************************************సమాప్తం************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

హక్కు...(కథ)