ఉద్యోగం...(కథ)
ఉద్యోగం (కథ)
‘నిజాయతీ అనే పద్దతిలోనే ఉద్యోగం తెచ్చుకుంటాను’ అని తండ్రి దగ్గర శపథం చేసేసి హైదరాబాద్ వచ్చిన జగపతికి ఇంకా ఉద్యోగం దొరకలేదు.
ఊర్లో ఎక్కువ పలుకుబడి కలిగినది జగపతి కుటుంబం. అతని తండ్రి ఒక ఫోను చేస్తే చాలు, ఉద్యోగం జగపతిని వెతుక్కుంటూ వాళ్ళింటికే వస్తుంది. కానీ, జగపతి దాన్ని ఇష్టపడలేదు. తండ్రి యొక్క వారసుడు అనే రెకమండేషన్ తో కాకుండా, తన సొంత ప్రతిభతో ఉద్యోగం తెచ్చుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు.
ఆలాంటి నిజాయతీ పరుడికి చివరికి ఎలా ఉద్యోగం దొరికింది?
***************************************************************************************************
‘నిజాయతీ
అనే పద్దతిలోనే
ఉద్యోగం తెచ్చుకుంటాను’ అని
తండ్రి దగ్గర
శపథం చేసేసి
హైదరాబాద్ వచ్చిన
జగపతికి ఇంకా
ఉద్యోగం దొరకలేదు.
ఊర్లో ఎక్కువ
పలుకుబడి కలిగినది
జగపతి కుటుంబం.
అతని తండ్రి
ఒక ఫోను
చేస్తే చాలు, ఉద్యోగం
జగపతిని వెతుక్కుంటూ
వాళ్ళింటికే వస్తుంది.
కానీ, జగపతి
దాన్ని ఇష్టపడలేదు.
తండ్రి యొక్క
వారసుడు అనే
రెకమండేషన్ తో
కాకుండా, తన
సొంత ప్రతిభతో
ఉద్యోగం తెచ్చుకోవటమే
లక్ష్యంగా పెట్టుకుని
ఉద్యోగ వేటలో
ఉన్నాడు.
మాటి మాటికీ
మనికట్టును ఎత్తి
చూసుకుంటున్నాడు.
చివరగా చూసినప్పుడు
టైము తొమ్మిది
ముప్పావు. ఈ
రోజు పదిన్నరకి
ఒక కంపనీలో
‘ఇంటర్
వ్యూ’. తొమ్మిదింటికల్లా
బస్సు స్టాండుకు
వచ్చాశాడు. జగపతి
వెళ్ళాల్సిన చోటుకు
రెండు బస్సులు
వచ్చినై. కానీ, వాటిలో
నిలబడటానికి కూడా
చోటులేదు. ఆటోలో
వెళితే ముప్పై
రూపాయలు. బస్సులో
వెళితే మూడు
రూపాయలు. మితంగా
ఖర్చు పెట్టాల్సిన
పరిస్థితి. తర్వాతి
బస్సుకొసం ఎదురుచూస్తూ
ఓర్పుగా కాచుకోనున్నాడు.
కొద్ది సమయం
తరువాత తక్కువ
గుంపుతో ఒక
బస్సు రాగా, వేగంగా
ఎక్కాడు.
హైదరాబాద్ వచ్చిన
వెంటనే తండ్రి
బాల్య స్నేహితుడైన
డాక్టర్. సత్యప్రసాద్
ను కలిసి, అన్ని
వివరాలు చెప్పాడు.
“పట్టుదల
మనసులో ఉంటే
కడుపు నిండదు...” అని చెప్పినాయన
తనకు తెలిసిన
మందుల షాపులో
నెలకు ఎనిమిది
వేల రూపాయల జీతంతో
ఉద్యోగం ఇప్పించాడు.
రాత్రి తొమ్మిదింటికి
వెళ్ళి పొద్దున
ఏడుగంటలకు వస్తాడు.
రోజులు గడిచినై.
“రెండు
వారాల క్రితం
మీ ఇంటికి
వెళ్ళాను. అమ్మా--నాన్నా
నిన్ను తలుచుకుని
బాధపడుతున్నారు.
ఇక్కడ ఉండి
కష్టపడుతూ ఖర్చు
పెట్టటానికి బదులు
ఊరికి వెళ్ళి
ఖర్చేలేని ఒక
ఉద్యోగంలో చేరి, అమ్మా--నాన్నలతో
కలిసే ఉండొచ్చు
కదా?” అడిగాడు
స్నేహితుడు సురేష్.
“నేను
జీవితాన్ని ఒక
ఛాలెంజ్ గా
తీసుకోనున్నాను...”
“ఈ
ఛెలాంజ్ లో
నువ్వు విజయం
సాధించవచ్చు అనుకుంటున్నావా?”
“సాధించలేము
అని అనుకునే
వారికి మోకాళ్ళ
లోతు నీళ్ళు
కూడా లోతనే
తెలుస్తుంది. నా
వల్ల కుదురుతుంది”
“నమ్మకం
వేస్టు అవదు.
నిజమే. కానీ, ఉద్యోగ
విషయంలోనే నీ
నమ్మకం ఫలిస్తుందా
అనే అనుమానంగా
ఉంది...”
స్నేహితుడు సురేష్
పుణ్యామా అని
ఉండటానికి చోటు...తండ్రి
స్నేహితుడు డాక్టర్. సత్యప్రసాద్
దయతో చిన్న
ఉద్యోగం. రెండూ
కలిసి జగపతి
ప్రయత్నానికి సహాయంగా
ఉన్నాయి. జగపతి
తీసుకునే జీతంలో
కొత్త ఉద్యోగానికి
దరఖాస్తులు పంపటానికి
ఒక పెద్ద
మొత్తం ఖర్చు
అవుతోంది.
ప్రతిసారీ జగపతి
కొత్తగా దరఖాస్తు
చేస్తున్నప్పుడంతా,
“ఏమిటి
నువ్వు...పెద్ద
పెద్ద చదువులు
చదువుకున్నావు...కానీ, లంచమిస్తేనే
పెద్ద ఉద్యోగాలు
దొరుకుతాయని తెలుసుకోకుండానే
ఉన్నావే?” అన్నాడు
సురేష్.
“నాకు
తెలుసు సురేష్...కష్టపడి
చదువుకుని, ఉద్యోగానికి
ఎందుకు లంచం
ఇవ్వాలి...? చదువు
అనేది మనిషి
యొక్క జెనెరల్
నాలెడ్జును పెంచుతుందనేగా
చెబుతున్నారు...మరెందుకు
ఉద్యోగానికి ఈ
చదువు చదివుండాలి
అని అడుగుతారు...?
సరే...చెబుతున్నారే
నని అప్పో,సొప్పో
చేసి చదివి
ముగించి వెళ్ళి
నిలబడితే ‘ఒక
లక్ష ఇవ్వు, రెండు
లక్షలు ఇవ్వు’
అని అడుగుతున్నారు.
చదువుకున్న వాడికి
ఏరోజు లంచం
లేకుండా ఉద్యోగం
దొరుకుతుందో అప్పుడే
చదువుకు నిజమైన
మర్యాద ఉంటుంది...” ఆవేశంగా చెబుతాడు.
బస్సులో నుండి
దిగిన జగపతి
అడ్రస్సు కనుక్కుని
నడిచాడు. రెండు
వీధులు దాటిన
తరువాత కుడివైపు
నాలుగో బిల్డింగుగా
ఉన్న ఆ
బిల్డింగును తల
ఎత్తి చూశాడు.
తాను వెతుక్కుంటూ
వచ్చిన ఆఫీసు
అదేనని ఖాయపరచుకుని
లోపలకు వెళ్లాడు.
రిసెప్షన్ గదిలోకి
వచ్చి కూర్చున్న
అతను, చూపులను
మెల్లగా చుట్టాడు...గది
మొత్తం ఖరీదైన
అద్దాలు పొందుపరచబడి
ఉన్నాయి. అందంకోసం
అక్కడక్కడ చిన్న
చిన్న తొట్టేలలో
మొక్కలు పెట్టబడి
ఉన్నాయి. గది
మధ్యలో పెట్టబడున్న
అందమైన అద్దమూ, అందులో
కనబడ్డ అతని
ప్రతిబింభాన్ని
చూసి ఆశ్చర్యంతో
చూశాడు. జగపతితో
కలిసి మొత్తం
పద్దెనిమిది మంది
వచ్చున్నారు. అందులో
ఐదుగురు ఆడపిల్లలు
ఉన్నారు.
‘ఇంటర్
వ్యూ’ మొదలయ్యింది.
ఒకరి తరువాత
ఒకరు లోపలకు
వెళ్ళి తిరిగి
వచ్చారు. ‘ఈ
ఉద్యోగం ఎవరికీ?’ అని
జగపతి మనసు
కొట్టుకుంటోంది.
స్టార్టింగ్ నలభై
వేలు జీతం.
జగపతి పేరు
పిలవబడింది. కుర్చీలో
నుంచి లేచినతను
నమ్మకాన్ని ముందు
పంపి, వెనుక
తాను నడుచుకుంటూ
ఆ గదిలోకి
వెళ్ళాడు.
తెల్లటి రంగు...నుదుటి
మీద చిన్న
కుంకుమ బొట్టు, తెల్ల
రంగు దుస్తులలో
‘భాను
మూర్తి’ అనే
నేమ్ బోర్డు
వెనుక కూర్చోనున్న
ఆయన్ని చూసిన
మరు క్షణమే
జగపతి మనసులో
కొత్త నమ్మకం
పుట్టింది.
“గుడ్ మార్నింగ్
సార్...!”
జవాబుగా గుడ్
మార్నింగ్ చెప్పిన
భానుమూర్తి కుర్చీ
చూపించారు.
కూర్చున్న జగపతి, సర్టిఫికెట్లు
జాప, ఆయన
తీసుకుని తిరగేశారు.
వెంట వెంటనే
ఫోను మోగింది.
తీసి మాట్లాడారు.
జగపతి యొక్క
సర్టిఫికెట్ల ఫైలును
పూర్తిగా చూసి
ముగించేలోపు ఐదుగురు
స్నేహితులతో ఫోనులో
మాట్లాడారు భానుమూర్తి.
జగపతిని గురించి
తెలుసుకున్న ఆయన, ఫైలును
మూసేసి టేబుల్
మీద పెట్టేసి
జగపతిని డీప్
గా చూశారు.
ఏం చెప్తారో
నన్న ఆత్రుతతో
భానుమూరి గారి
మొహాన్నే కన్నార్పకుండా
చూశాడు జగపతి.
“మిస్టర్
జగపతి...ఈ
ఉద్యోగంలో చేరటానికి
కావలసిన అన్ని
అర్హతలు మీకున్నాయి...”
“కానీ...” అంటూ జగపతి
ఏదో మాట్లాడటానికి
ప్రయత్నించినప్పుడు,
“మిస్టర్
జగపతి, మీరు
ఏం చెప్పదలుచుకున్నారో
నాకు అర్ధమయ్యింది.
మేము ఎవరికి
ఉద్యోగం ఇచ్చినా
వాళ్ళ దగ్గర
నుండి మేము
ఏదీ తీసుకోము.
మీ అపాయింట్
మెంట్ ఆర్డర్
ను ఇప్పుడే
ఇమ్మని చెబుతాను...రేపే
మీరు ఉద్యోగంలో
చేరచ్చు. ఆల్
ద బెస్ట్...”
“థ్యాంక్యూ
సార్...” అర్ధంకాక
చెప్పాడు.
చిన్న వీధిలోకి
దూరి కొంచం
దూరం నడిచి
ఎడం చేతి
వైపుకు తిరిగి
చివరకు పక్షుల
బోనులాగా ఉండే
గదిలోకి దూరిన
జగపతిని, మూలలో
కూర్చుని పుస్తకం
చదువుతున్న అతని
స్నేహితుడు సురేష్
చూసి పుస్తకాన్ని
మూసేసి లేచాడు.
“ఏమిటి...ఉద్యోగం
దొరికిందా...?” ఎప్పుడూ
అడిగేలాగా అడిగాడు.
“దొరికింది
సురేష్...”
“ఏమిటీ
దొరికిందా...?” ఆశ్చర్యంగా
అడిగాడు.
“అవును
సురేష్! మనదేశంలో
ఇంకా మంచి
మనుష్యులు జీవిస్తూనే
ఉన్నారు...” చెబుతూ, సూటు
కేసులో నుండి
డబ్బు తీసుకుని
టెలిఫోన్ బూత్
కు వెళ్ళాడు.
లోపలకు వెళ్ళి
పది నిమిషాలు
మాట్లాడేసి బయటకు
తిరిగి వచ్చాడు.
ఆఫీసులోకి వెళ్ళినప్పుడు
జగపతి మనసులో
వెయ్యి సీతాకోక
చిలుకలు తిరుగుతున్నాయి.
కొండ శిఖరంపైకి
వెళ్ళి గెలుపు
జెండాను పాతిన
లాంటి సంతోషం.
‘నా
దగ్గర ఛాలెంజా?’ తండ్రిని
తలుచుకుని మనసు
అప్పుడప్పుడు అడుగుతున్నది.
‘సత్యప్రసాద్
గారూ...నేను
గెలిచాను. నమ్మకమే
జీవితం’
అక్కడ్నుంచి అందరి
దగ్గర తనని
తాను పరిచయం
చేసుకున్న జగపతి
మొదటి స్వీటును
భానుమూరి గారికి
ఇవ్వటానికి ఆయన
గదిలోకి వెళ్లబోయాడు...ఆయన
ఫోనులో ఎవరితోనో
మాట్లాడుతున్నది
విన్నాడు. మాట్లాడి
ముగించిన తరువాత
వెళ్లటమే నాగరీకం
అని అనుకుని
అక్కడే నిలబడ్డాడు.
“చూడండి
డాక్టర్ సత్యప్రసాద్
గారూ...మీరు
చెప్పినట్టే జగపతికే
ఉద్యొగం వేసి
ఇచ్చేను”
“...........................”
“డాక్టర్....నాకెందుకు
థ్యాంక్స్ అంతా...ప్రమాదంలో
చిక్కుకుని ప్రాణం
కోసం పోరాడుతున్న
నా భార్యను
జగపతి రక్తం
దానంగా ఇచ్చి
కాపాడాడు. దానికి
కృతజ్ఞతగా
నేను ఇది
కూడా చెయ్యకపోతే
ఎలా? అదొక్కటే
కాదు మీరు
చెప్పారే జగపతి
తన ప్రతిభతోనే
ఉద్యొగం సంపాదించుకోవాలని
లక్ష్యంగా పెట్టుకున్నాడని...ఆ
లక్ష్యానికి గౌరవం
ఇవ్వటానికి నాకొక
ఛాన్స్ ఇచ్చేడే
దేవుడు. అది
వదులుకోను కదా?” నవ్వుతూ
చెప్పాడు భానుమూర్తి.
తలుపు దగ్గర
నిలబడి భానుమూర్తి
గారి మాటలు
విన్న జగపతి, ఆయన్ని
కలవకుండా వెనక్కి
తిరిగి తన
ఉద్యోగ సీటుకు
వెళ్ళాడు.
సాయంత్రం పరిగెత్తుకుని
వచ్చాడు జగపతి.
“ఏమిటి
జగపతి...త్వరగా
వచ్చాశావు. మొదటి
రోజు పని
ఎక్కువగా లేదా?” అని
డాక్టర్ సత్యప్రసాద్
అడగ...ఎవరికీ
ఇవ్వకుండా తీసుకు
వచ్చిన స్వీట్స్
లో నుండి
ఒకటి తీసి
ఆయన నోటికి
అందించాడు జగపతి.
*********************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి