దిక్కు మార్చుకున్న గాలి...(కథ)

 

                                                             దిక్కు మార్చుకున్న గాలి                                                                                                                                                         (కథ)

ప్రేమ అంటే తెలియనివారు ఉండరు. అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది. కథలో అదే నిరూపించబడింది. ప్రేమించడానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం ఉండాలి. ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. జీవితం పువ్వులాంటిది.అందులోని మకరందమే ప్రేమ.

ప్రేమించుకునే జంటలకు కొదవే లేదు. కథలో వచ్చే ప్రేమజంట చాలా విచిత్రమైనది.

**************************************************************************************************

రోజు దినపత్రికలో ప్రచురించబడిన ఒక ప్రకటన, నన్ను అమితంగా ఆకర్షించింది.

ప్రకటన ఇదే: వరుడు కావలెను. హైదరాబాద్ లోని విదేశీ ఎంబసీ ఒక దాంట్లో ఉద్యోగం చేస్తున్న, ఎం.బి. చదివిన 20 సంవత్సరాల వయసున్న వధువుకు వరుడు కావలెను. వరుడు వరకట్నం ఎదురుచూడని వ్యక్తిగానూ, ఆల్కహాల్ అలవాటు లేకుండానూ, సిగిరెట్టు కాల్చని వ్యక్తిగానూ ఉండాలి---- ఇదే ప్రకటన.

చిన్న వయసులోనే తల్లి-తండ్రులను పోగొట్టుకున్నాను. నా బాబాయ్ నన్ను చదివించారు. బి..బి.ఏల్. డిగ్రీ ఉన్నా అడ్వకేట్ వ్యాపారానికి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు. ఒక సంస్థలో చట్ట సలహాదారుగా చేరాను. నా ప్రతిభనూ, నిజాయితీనూ గొప్పగా గౌరవించిన సంస్థ యజమాని, యాభై వేలలో మొదలైన నా జీతాన్ని, తరువాత సంవత్సరమే దాన్ని లక్ష రూపాయలకు పెంచాడు.

జీవితంలో ఎదిగిపోవాలి. సరిపోయే సంపాదన వచ్చేంత వరకు పెళ్ళి చేసుకోకూడదుఅని నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో, ఇప్పుడు సరిపోయేంత సంపాదన వస్తోంది. ఇక పెళ్ళి చేసుకోవటానికి ఎటువంటి నిషేధమూ లేదు.

ఇలాంటి నిర్ణయం తీసుకున్న సమయంలోనే వరుడు కావలెనుప్రకటన కళ్లకు కనిపించింది. అందులో రాసిన కండిషన్స్ వివరాలు నాకు నచ్చినై. నా క్యారెక్టర్ కు తగినట్టూ ఉన్నాయి. ప్రకటన ఇచ్చింది ఎవరనేది తెలియలేదు. పోస్టు బాక్స్ నెంబర్ మాత్రం ఇచ్చారు.

ఇలాంటి వధూవరులు కావాలిఅనే ప్రకటనలలో అవకతవకలు, మోసాలు జరుగుతూ ఉంటాయి అనేది చెప్పుకుంటుంటే విన్నాను. కానీ, ఇప్పుడు ప్రకటన వచ్చింది ప్రసిద్ది చెందిన పత్రికలో. కాబట్టి, ప్రకటన యొక్క నిజానిజాల గురించి అనుమానించక్కర్లేదు.

తీర్మానానికి వచ్చిన నేను, నా ఇష్టాన్ని తెలుపుతూ లెటర్ రాశాను.

ఇది జరిగి ఒక వారం ఉంటుంది. నా సెల్ ఫోను మోగింది. అది తీసి హరిక్రిష్ణ హియర్అన్నాను.

అవతలివైపు నుండి వినిపించింది మధురమైన ఒక స్త్రీ స్వరం. నా పేరు మేఘనా. వరుడు కావలెను ప్రకటన ఇచ్చింది నేనే. నా కూతురు వినోధిని కోసం ప్రకటన ఇచ్చాను. దానికి సమాధానం పంపారు...చాలా సంతోషం. దీని గురించి మనం నేరుగా కలుసుకుని మాట్లాడదాం. ఏదైనా పబ్లిక్ ప్లేసులో కలుసుకుందామా, లేక...

ఇలాంటి సంప్రదాయాలు వద్దు. నేనే మీ ఇంటికి వస్తాను. ఇంట్లో మీ కూతురు ఉండే టైము చెప్పండి

ఆమె విదేశీ రాయబార ఆఫీసులో పనిచేస్తున్నందువలన, ప్రొద్దున పది గంటలకు అక్కడ్నుంచి కారు పంపుతారు. అందులో వెళ్ళిపోతుంది. సాయంత్రం తిరిగి రావటానికి ఏడు గంటలు అవుతుంది

అలాగైతే రేపు ప్రొద్దున తొమ్మిది గంటలకు మీ ఇంటికి వస్తాను

చాలా సంతోషం. మా ఇంట్లోనే బ్రేక్ ఫాస్ట్ చేయచ్చు!

లేదు. బ్రేక్ ఫాస్ట్ తినేసి వస్తాను. మీ తృప్తికొసం కాఫీ మాత్రం తాగుతాను

చాలా సంతోషం. రేపు మంచి రోజు. అంతా మంచే జరుగుతుందని నమ్ముతున్నాను

నేనూ అదే ఎదురు చూస్తున్నాను అని చెప్పి సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు.

మరుసటి రోజు ప్రొద్దున ఎనిమిది గంటలు.

మౌలాలీలో ఉన్న మేఘనా ఇంటికి కారులో బయలుదేరాను.

రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది. కారును వేగంగా నడపగల యుక్తి నాదగ్గరున్నా ఏం లాభం? నాకు ముందు వెళ్ళిన నాలుగైదు కార్లు నత్త నడకన వెడుతుంటే నేనూ వాటిని ఫాలో అవాల్సి ఉంది.

మేఘనా ఆందోళన చెంద కూడదని, ఆమెకు ఫోను చేశాను. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అయినా కానీ ఎలాగైనా తొమ్మిదిన్నర కల్లా వచ్చేస్తాను

పరవాలేదు. ఓర్పుగా, నిదానంగా రండి అన్నది ఆమె.

ఒక విధంగా మేఘనా ఇంటికి నేను వెళ్ళి చేరినప్పుడు టైము తొమ్మిదీ నలభై ఐదు.

తల్లీ, కూతురూ మొహాల్లో సంతోషం పొంగ చేతులెత్తి నమస్కరించారు.

చూడటానికి అక్కా-చెల్లెలు లాగా ఉన్నారే తప్ప, తల్లీ-కూతురూ అని చెప్పలేము. కారణం మేఘనా యొక్క యంగ్ రూపమే.

మొదటిసారిగా వెళ్తున్నందువలన, ఉత్త చేతులతో వెళ్లకూడదని అనుకుని, స్వీట్ బాక్స్ ఒకటి కొనుక్కుని వెళ్ళాను. దాన్ని మేఘనా దగ్గర ఇచ్చాను.

చిరునవ్వుతో దాన్ని తీసుకున్న ఆమె, “స్వీటు ఇస్తున్నారు. అంతా స్వీటుగానే ముగిస్తుందని అనుకుంటున్నా అన్నది. దగ్గరున్న సోఫా చూపించి కూర్చో మన్నది.

నేను హాలులో తగిలించున్న ఫోటోలను ఒకసారి చూసి, సోఫాలో కూర్చున్నాను. మేఘనా తన భర్తతో ఉన్న ఫోటో ఏదైనా కనబడుతుందా అని చూశాను. మేఘనా, వినోధిని నవ్వుతూ ఒకరినొకరు కౌగలించుకుని ఉన్న ఫోటో మాత్రమే కళ్ళకు కనిపించింది. అది కాకుండా మిగిలిన ఫోటోలు న్యాచురల్ సీనరీ గల ఫోటోలే. నాలుగైదు తగిలించబడి ఉన్నాయి.

ఈలోపు రకరకాల బిస్కెట్లతో ఒక ప్లేటు తీసుకువచ్చి నా ముందు ఉంచింది వినోధిని. నేను ఒకే ఒక బిస్కెట్టు మాత్రం తీసుకుని తిన్నాను. ఫ్లాస్కులో ఉన్న  కాఫీని ఒక గ్లాసులో పోసి, పొగలు కక్కుతున్న కాఫీ గ్లాసును నా ముందు ఉంచింది మేఘనా.

సమయంలో వినోధినిని తీసుకు వెళ్లే రాయబార కార్యాలయ కారు వచ్చి వాకిలిలో నిలబడింది.

కారు వచ్చేసింది. నేను బయలుదేరతాను. మీరు అమ్మతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి బయలుదేరింది వినోధిని.

నేనూ, మేఘనా ఎదురెదురుగా  కూర్చున్నాము. నేను నా గురించిన వివరాలన్నీ చెప్పి, “ఇప్పుడు మీ గురించి చెప్పండి అన్నాను.

నా గురించి దేన్ని చెప్పను?’ అనేలాగా, నన్ను తలెత్తి చూసింది మేఘనా.

వినోధిని యొక్క నాన్నగారి గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పాను.

వినోధిని ఒక వయసు బిడ్డగా ఉన్నప్పుడే, ఆయన జాండీస్ వ్యాధి వచ్చి   చనిపోయారు అని చెప్పినప్పుడు మేఘనా కళ్ళు తడిసినై.

బాధపడ్డ నేను, “వెరీ సారీ అన్నాను.

కొద్దిసేపు మౌనం గడిచింది.

మనసులో ఒక ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. అడుగుదామా...వద్దాఅని ఆలొచిస్తూ ఉన్నాను. చివరగా అడిగాసాను.

చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నారు. మరో పెళ్ళి గురించి ఆలోచించలేదా?”

ప్రశ్నను మేఘనా ఎదురు చూసినట్లు ఉన్నది. గబుక్కున జవాబు వచ్చింది.

బిడ్డను పెంచి పెద్ద చేయాలి. బాగా చదివించి మంచి ఉద్యోగానికి పంపాలి. మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలి అనే ఆలోచనలే నా మనసులో మొదటి స్థానంలో ఉన్నాయి. అందువల్ల మరోపెళ్ళి గురించి ఆలోచించలేదు

కుటుంబం కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు

పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పకండి

ఇప్పుడు మీకు వయసెంత?”

ముప్పై ఆరు

ఇంకా పెళ్ళి వయసు దాటిపోలేదు. మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు

కూతురికి వరుడ్ని వెతుకుతున్న సమయంలోనా! అంటూ నవ్వింది మేఘనా.

వినోధినికి పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్ళిపోతే, అప్పుడు తెలుస్తుంది ఒంటరితనం ఎంత నరకమో

నేను అలా చెప్పటంతో మేఘనా కొంతసేపటి వరకు ఏదో తీవ్ర ఆలొచనలో ఉంది.

తరువాత, “ఏమిటి మీరు! నాకు మరో పెళ్ళి చెయ్యకుండా ఉరుకోరులాగుందే! అన్నది నవ్వుతూ.

మంచి కార్యం అయితే, అది చేసి ముగించేంత వరకు ఊరుకోను!

పెళ్ళి కొడుకును కూడా చూసేసారా?”

పెళ్ళి కొడుకు రెడీ!

అదెవరు?”

నేను కారులో వెళ్తున్నప్పుడు, ఫోనులో చెబుతాను

ఇప్పుడు చెప్పకూడదా ఏం!

టైము బాగాలేదు

నేను అలా చెప్పేసరికి గలగలా నవ్వింది మేఘనా.

ఎందుకు నవ్వుతున్నారు?”

మీ మాట చాతుర్యాన్ని తలుచుకునే. ప్రతి ప్రశ్నకు వెంట వెంటనే జవాబు చెబుతున్నారే. అదెలా?”

నేనా మాట్లాడుతున్నాను! దేవుడు నా మనసులో కూర్చుని అలా చెయ్యి, ఇలా చెయ్యిఅని ఆర్డర్ వేస్తున్నారు. దాని ప్రకారం తానుగా జరుగుతున్నది

అలా చెప్పేసి లేచాను.

కారులో వెళ్తున్నప్పుడు మాట్లాడతాను అన్నాను.

పెళ్ళి కొడుకు గురించి మీరు ఏం చెప్పబోతారో అనేది తెలుసుకోవటానికి ఆరాటంగా ఉంది. కారులో వెళ్ళేటప్పుడు మాట్లాడుతారు కదా?”

ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పి బయలుదేరాను.

పదిహేను నిమిషాలు అయిన తరువాత, కారును రోడ్డు పక్కగా ఆపి, మేఘనాకి ఫోను చేశాను.

మేఘనా హియర్ అన్న తియ్యటి స్వరం నా చెవిలో అమృతం పోసింది.

రవీ మాట్లాడతున్నాను... అని నేను మొదలు పెట్టిన వెంటనే మీ ఫోను కోసమే నేను కాచుకోనున్నాను. మీరు చెప్పబోయేది మంచి వార్తగా ఉంటుందని నమ్ముతున్నాను

నేను చెప్పబోయేది మీకు నచ్చుతుందో, నచ్చదో అనే సంసయంలో ఉన్నాను

మీయొక్క ఒక్కొక్క మాట, చేష్టా నా మంచికోసమే అనేది నాకూ బాగా తెలుసు. ఏదైనా సరే మీరు సంసయించకుండా మాట్లాడండి

"మేఘనా! .లవ్.యూ. నిన్ను పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను. జీవితాంతం నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను.

అలా చెప్పేసి ఆమె సమాధానం కొసం కాచుకోనున్నాను.

కొద్దిసేపు మౌనంలో ఉండిపోయిన మేఘనా, “మిమ్మల్ని చూసి కొద్దిసేపు మాట్లాడుతున్నప్పుడే, నేనూ నా హృదయాన్ని మీ దగ్గర పోగొట్టుకున్నాను. అదే సమయం, మీకు నేను కరెక్టు వ్యక్తినా, మీరు నన్ను అంగీకరిస్తారా, లేదా అనే భయం ఉన్నది. మీ ప్రేమకు నోచుకున్నానని అనుకుంటునప్పుడు నా హృదయంలో ఆనందం అలలాగా తాకుతోంది. ఎంత భాగ్యవంతమైన దానిని నేను" అన్నది ఎమోషనల్ పొంగ.

నేనే భాగ్యవంతుడ్ని మేఘనా! అన్నాను.

లేదు, లేదు. నేనే భాగ్యవంతురాలిని, చాలా పెట్టి పుట్టాను

దీని గురించి మనలో గొడవ వద్దు. ఇద్దరమూ భాగ్యవంతులమే అని చెప్పిన నేను, “రేపు ప్రొద్దున పదిగంటలకు వెంకటేశ్వర స్వామి గుడికి రా. అక్కడ నీకొక ఆశ్చర్యం కాచుకోనుంటుంది అన్నాను.

సరిగ్గా ప్రొద్దున పదింటికి నేను అక్కడ ఉంటాను అని చెప్పింది మేఘనా.

మరుసటి రోజు తొమ్మిదిన్నరకే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి, మేఘనా రాక కోసం కాచుకోనున్నాను.

సరిగ్గా పది గంటలకు ఆమె ఒక టాక్సీలో వచ్చి దిగింది. నన్ను చూసిన ఆమె మొహంలో చెప్పలేనంత ప్రకాశం!

నా దగ్గరగా వచ్చిన ఆమెతో రా! గుడి ప్రహారాన్ని మూడుసార్లు చుట్టొచ్చి, తరువాత మాట్లాడదాం అన్నాను.

ఇద్దరూ మూడుసార్లు చుట్టొచ్చి, సన్నిదికి వెళ్ళాము. పూజారి, దేవుడికి పూజ చేసి, కర్పూర ప్లేటుతో బయటకు వచ్చారు. మేము ప్రసాదం తీసుకున్నాము. ఆయన జాపిన పళ్లెంలో వంద రూపాయల నోటు ఒకటి పెట్టాను.

నేను మీకంటే పెద్ద దానినని మీకు తెలుసు కదా?” అని మేఘనా హఠాత్తుగా అడిగింది.

దాని గురించి నాకు బాధలేదు. మహాత్మా గాంధీ కంటే ఆయన భార్య పదిహేను రోజులు పెద్దది

జస్ట్ పదిహేను రోజులే కదా

పదిహేను రోజులు అనేది పట్టించుకోకపోయినా, గాంధీ తనకంటే పెద్దదాన్ని పెళ్ళి చేసుకున్నారు అనేది గమనించాలి. ఇంకొకటి తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు

ఏమిటది?”

ఇస్లాం మత స్థాపకుడు తన ఇరవై ఐదో సంవత్సరం కతీజా అనే నలభై సంవత్సరాల విధవరాలును పెళ్ళి చేసుకున్నారు అని నేను చెప్పిన వెంటనే, అలాగా అనేలాగా ఆశ్చర్యాన్ని చూపినై ఆమె చూపులు.

వయసు గురించి ఇక మాట్లాడ వద్దు. సమస్యను ఇక్కడితో గొయ్య తవ్వి పూడ్చి పెట్టేయి అని చెప్పాను.

సరి అనేటట్టు తల ఊపింది మేఘనా, “అబ్బో! చాలా విషయాలు తెలిసిపెట్టుకున్నారు! అని ఆశ్చర్యంతో చెప్పింది.

నేను నా హ్యాండు బ్యాగులో పెట్టున్న నగ పెట్టెను తీసాను. దాన్ని తెరిచిన వెంటనే, అందమైన బంగారు గొలుసు తలతల మెరిసింది.

దగ్గరకు రా అన్న వెంటనే, మేఘనా నా దగ్గరకు వచ్చి కూర్చుంది. బంగారు గొలుసును ఆమె మెడలో వేశాను.

మేఘనా! ఇది జస్ట్ బంగారు గొలుసు కాదు. తాళి! మంగలసూత్రం

నేను అలా చెప్పటంతో ఛాతి మీద ఆడుతున్న గొలుసును బయటకు తీసి చూసింది మేఘనా.

అందులో ఉన్న తాళిబొట్టును తన కళ్ళకు అద్దుకుని, ఆనందంగా నన్ను చూసింది.

మేఘనా! నువ్వూ, నేనూ కన్నవారి స్థానంలో ఉండి వినోధినీ పెళ్ళి జరిపేద్దాం. ఆమె దాంపత్య జీవితం మొదలు పెట్టినప్పుడు, మనం దాంపత్య జీవితంలోకి అడుగు పెడదాం అన్నాను..

నేనూ అదే అనుకున్నాను. మీరు చెప్పారు అంటూ నవ్వుతూ చెప్పింది మేఘనా.

మాకు ఆశీర్వచనం చేసేటట్టు, గుడిలోని గంటమోత గాలిలో తేలుతూ వచ్చింది.

************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఈ ధోరణి వద్దు...! (కథ)