జాబిల్లీ నువ్వే కావాలి …(కథ)
జాబిల్లీ నువ్వే కావాలి (కథ)
ఇప్పటికి కూడా ప్రతి మనిషి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ మారుతున్న కాలంతో పాటు తను కూడా మారుతూ ఉండాలి ఆ విధంగా ప్రయత్నం జరగాలి ఈ మార్పును ఈ ప్రయత్నాన్ని మనం పురుష లక్షణం ఉద్యోగం అంటాం.
ఈ భౌతిక ప్రపంచం లో కనీస అవసరాలతో పాటు కొన్ని ముఖ్యమైన సామాజిక/గౌరవ అవసరాలు తీర్చుకునే ఆర్థిక అభివృద్ధి/స్థిరత్వం పొందడం
మీ కష్టాలు, సుఖాలు, మీ ఆలోచనలు, మీ పడక పంచుకునే మానసిక మరియు శారీరక అభివృద్ధి కలిగి ఉండడం. ఆర్థిక అభివృద్ధి/స్థిరత్వం లేకపోతే మిగతా ఎన్ని ఉన్నా ఈ కాలంలో పనికిరాదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న ఒక యువతి యొక్క కథే ఇది.
**************************************************************************************************
“మీరు
సెలెక్ట్ చేయబడ్డారు.
వెంటనే వచ్చి
ఉద్యోగంలో చేరండి...” ఈ మైలులో
ఆహ్వానం వచ్చినా
జగన్ హైదరాబాదుకు
బయలుదేరలేదు.
మూడు రోజుల
తరువాత జీతం
వివరాలతో అప్పాయింట్మెంట్
ఆర్డర్ అతనికి
మరో ఈ
మైలు తో
వచ్చింది. దానికి
కూడా అతను
ఆనందపడలేదు.
ఆ ఈ
మైలును ఒక
కాపీ తీసుకుని
మరోసారి చదివేసి, మడతపెట్టి, టేబుల్
మీద పడేసి విరక్తితో
బయటకు వెళ్ళాడు.
“నీ
మనసులో ఏమిట్రా
అనుకుంటున్నావు? నాన్న
తీసుకు వచ్చే
సంపాదనలో కూర్చుని
తినేసి, ఊరంతా
గాడిదలాగా తిరిగి
వద్దామని నిర్ణయించుకున్నావా...నీకు
పెళ్ళీ పెటాకులూ
జరగక్కర్లేదా. నీ
సొంత కాళ్ళ
మీద నిలబడి
నువ్వూ సంపాదిస్తేనే
కదారా పిల్లను
ఇవ్వటానికి ముందుకు
వస్తారు...”
తల్లి పెట్టిన
చివాట్లను చెవిలో
పడేసుకోలేదు జగన్.
“అంతా
నాకు తెలుసు.
మీ పని
చేసుకోండమ్మా” అని విసుగుతో
చెప్పేసి ఎక్కడికో
బయలుదేరి వెళ్లాడు.
వెళ్ళినతను, తరువాత
రెండు గంటలలో
అవసరపడుతూ తిరిగి
వచ్చాడు. వచ్చినతని
మొహంలో ఆనందం.
“అమ్మా...వెంటనే
నేను హైదరాబాద్
వెల్తున్నాను... నాన్న వస్తే చెప్పండి.
రేపే నేనక్కడ
ఉద్యోగంలో చేరాలి...” చెబుతూనే
ఉత్సాహంగా గెంతులు
వేస్తూ, బట్టలను
ఒక్కసారిగా తీసి
పెట్టెలో కుక్కుకున్నాడు.
‘ఏవిటి
వీడు...కొద్దిసేపటి
క్రితం నిర్లక్ష్యంగా
మాట్లాడేసి వెళ్ళినతను...తిరిగి
వచ్చి ఉద్యోగానికి
వెళ్తున్నా అంటున్నాడే...ఇంతలో
వీడి మనసు
మార్చింది ఎవరో.
సరే, ఎలాగో
ఉద్యోగానికి వెళ్ళాలని
నిర్ణయం తీసుకున్నాడే, అంతవరకు
ఆనందమే’ అన్న
ఆలొచనతో వాడికి
అర్జెంటుగా టిఫిన్
తీసుకువచ్చింది
తల్లి.
“టిఫిన్ నాకు
వద్దమ్మా...కాఫీ
మాత్రం త్వరగా
తీసుకురండి...అలాగే
ఐదు వందల
రూపాయలు
డబ్బు కూడా
తీసుకురండమ్మా...రేపే
నేను ఉద్యోగంలో
చేరిపోతాను...ఫోను
చేసి నేనొచ్చి
జాయిన్ అవుతున్నానని
చెప్పేస్తాను”
‘శ్రమపడి
సంపాదించాలే అనే
బుద్ది వచ్చిందే
నా కోడుక్కి...” అన్న జ్ఞాపకంతో, ఆవిరి
పొగలు కక్కుతున్న
కాఫీ తీసుకు
వచ్చి ఇచ్చింది.
తల్లి దాంతో
పాటూ కొడుకు
అడిగిన డబ్బునూ
బీరువాలో నుండి
తీసి ఇచ్చింది.
కిటికీ పక్కగా
ఉన్న సీటులో
వసతిగా ఆనుకుని
కూర్చుని, పక్కదారిలో
వేగంగా వెళ్ళే
చెట్లూ, మొక్కలూ, రెమ్మలను
పరవశంతో ఎంజాయ్
చేస్తూ బస్సులో
పయనించాడు జగన్.
ఉద్యోగానికి వెళ్ళాలనే
తన హఠాత్
నిర్ణయానికి ఇదే
కారణం.
గత నెల
రోజులుగా అతనికి
“నేనూ
మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...” అనే మాట చెప్పకుండా
అతన్ని ఏడిపిస్తూ
వచ్చింది. జాబిల్లీ
-- ఇరవై ఏళ్ల
యుక్త వయసులో
ఉన్న ఆమె.
జాబిల్లీ కూడా
జగన్ ని మనసారా
ప్రేమిస్తోంది.
కానీ, అతను
మగాడు. అందాల
రామచిలుక లాగా
ఉన్న ఈమెను
చూసిన వెంటనే
తన ప్రేమను
సులభంగా చెప్పాశాడు.
ఆమె ఆడపిల్ల
కదా...బాగా
ఆలొచించే కదా
చెప్పాలి?
జగన్ డిగ్రీ
చదువుకున్న యుక్త
వయసు కుర్రాడు.
మధ్య తరగతి
కుటుంబానికి చెందిన
మంచి వ్యక్తి
అనేది ఆమెకు
తెలుసు. కానీ, ఇంకా
సొంతంగా సంపాదించటం
మొదలుపెట్టలేదు...ఉద్యోగం
లేని యువకుడ్ని
ప్రేమించటానికి
ఆమేమన్నా అమాయకురాలా?
అందుకనే సమాధానంగా, ‘నేనూ
మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అని
చెప్పకుండా, అతనికి
ప్రేమ జెండా
చూపకుండా కాలం
గడుపుతూ వచ్చింది.
తనకు ఉద్యోగ
అపాయింట్మెంట్
లెటర్ వచ్చినట్టు, హైదరాబాదుకు
వెళ్ళి ఉద్యోగంలో
చేరబోవటాన్ని రెండే
మాటల్లో చెప్పి, ఆమె
నిర్ణయాన్ని తెలుసుకునే
విధంగా “నువ్వు
నన్ను ప్రేమిస్తున్నావా...లేదా...?” అని
అతను గట్టిగా
అడగటం ఆలశ్యం
--
తామరలాగా వికసించి, చెట్టు
నుండి పచ్చరంగు
ఆకును పీకి
చూపించి “నేనూ
మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...” అని నోరు
తెరిచి చెప్పింది
జాబిల్లీ.
స్విచ్ వేసిన
వెంటనే విద్యుత్
శక్తి పారుతున్నట్లుగా, ఆమె
సమాధానం వినగానే
ఆనందలోకంలో విహరించాడు
జగన్. ఈ
లోకమే తన
గుప్పిట్లోకి వచ్చినంత
ఆనందం...మనసంతా
ఆనందం పొంగ, వేగంగా
ఇంటికి వచ్చి, అమ్మతో
చెప్పేసి, ఇదిగో
హైదరాబాదుకు ప్రయాణం
చేస్తున్నాడు!
ఆ మరుసటి
వారం రెండు
రోజులు సెలవులు
రావటంతో ఊరికి
తిరిగి వచ్చాడు.
ఆశ ఆశగా
ప్రేమికురాలు దగ్గరకు
పరిగెత్తాడు.
ఇతన్ని చూసిన
వెంటనే ఆమెలోనూ
ఆశ వరద
జోరుగా పార...కట్టుబాటు
చేసుకోలేక, అతన్ని
కౌగలించుకుని ముద్దుల
వర్షం కురిపించింది
జాబిల్లీ.
తల్లి పెట్టే
భోజనం కంటే, -- ఉద్యోగానికి
వెళ్తున్నాననే
సంతోషం కంటే
జాబిల్లీ తనని
ప్రాణానికి ప్రాణంగా
ప్రేమిస్తోందనే
తృప్తితో ఒక
నెల రోజులలో
ఒక చుట్టు
పెరిగాడు జగన్.
మొహంలోనూ, శరీరంలోనూ
తలుక్కులు మెరిసినై
అతనికి.
రెండు నెలల
తరువాత.
సంక్రాంతి సెలవులకు
ఊరుకు వచ్చాడు
జగన్. ఎవరికీ
తెలియకుండా జాబిల్లీ.
చక్కర పొంగలి
తీసుకు వచ్చి, ప్రేమికుడ్ని
ఒంటరిగా కలిసి, అతనికి
తానే తినిపించింది.
అప్పుడు ప్రేమకానుకగా
ఆమె కాళ్లకు
ఇతను గొలుసులు
తొడిగాడు.
ఇద్దరూ అర్ధంకాని
ఆనంద సుఖంలో
తేలుతున్నారు.
“నీతో
కలిసి సినిమా
చూడాలని ఆశ...వస్తావా?” ఆశగా
పిలిచాడు.
“వస్తాను...” అంటూ అతనితో
బయలుదేరింది ఆమె.
ఇద్దరూ ఆనందంగా
సినిమా చూసేసి, స్కూటర్లో
తిరిగి వస్తుంటే
దారిలో సడన్
గా వర్షం
పట్టుకుంది.
బండిని ఒక
పక్కగా ఆపాడు.
“ఇప్పుడు
ఏం చేద్దామండీ...?” చేతులను
ఛాతికు అడ్డుగా
పెట్టుకుని భయపడుతూ
అడిగింది జాబిల్లీ.
జగన్, చూపులను
పరిగెత్తించాడు.
పని జరుగుతున్న
ఒక బిల్డింగు
పని పూర్తికాక
నిలబడుంది.
స్కూటర్ను అక్కడికి
తోసుకుంటూ వెళ్ళి
నిలబెట్టి, ఇద్దరూ
ఆ బిల్డింగ్
లోకి వెళ్ళారు.
మనుషులు ఎవరూ
లేరు. వీధి
లైటు నుండి
చిన్న వెలుతురు
వచ్చింది. ఒకరి
మొహం ఒకరు
చూసుకో గలరు.
జగన్,
జాబిల్లీనే చూశాడు.
డ్రస్సంతా శరీరంతో
అతుక్కుని, ఎత్తు
పల్లాలు స్పష్టంగా
కనబడినై.
ఎమోషనల్ స్పీడులో
ఉక్కిరిబిక్కిరి
అయ్యాడు. అతను
అమాంతం ఆమెను
కౌగలించుకుని గుండెలకు
హత్తుకున్నాడు.
ఆమె విడిపించుకొవటానికి
ప్రయత్నించి ఓడిపోయింది.
“ప్లీజ్... జాబిల్లీ, ప్రామిస్
గా నేను
నిన్నే పెళ్ళి
చేసుకుంటా...” అతను మరింత
బిగించాడు.
“ఊహూ...కుదరదు...వదలండి...” అమె పెనుగులాడింది.
అతను వదల్లేదు.
“ప్లీజ్
జాబిల్లీ…”
అతన్ని గోడ
చివరకు తొసేసి,
‘ఫట్...!’ ఆమె
చెయ్యి, అతని
చెంపమీద పడింది.
వేగమైన దెబ్బతో
అధిరిపోయి జాబిల్లీని
వదిలిపెట్టాడు
జగన్.
“నన్నే
కొట్టేవా జాబిల్లీ...ఇంకా
నాకు నువ్వు
అవసరమా...
నా ఆశను
అర్ధం చేసుకోని
నువ్వూ నాకు
అవసరంలేదు” చెంపను
రుద్దుకుంటూ కోపంగా
అరుస్తూ విసుగును
కక్కాడు.
“అక్కర్లేకపోతే
పోవయ్యా...నీ
యొక్క వాగ్దానంను
నమ్మి...కొంగుపరచి
మోసపోతే...తరువాత
పరితపించటానికి
నేనేమీ అమాయకపు
అమ్మాయిని కాదు...
పరిశుభ్రమైన అమ్మాయిని.
మీకు తొందరగా
ఉంటే పద్దతి
ప్రకారం మీ
పెద్దవాళ్ళను పంపి
మా వాళ్ళ
దగ్గర మన
పెళ్ళి గురించి
మాట్లాడమని చెప్పండి...నా
మెడలో తాళి
ఎక్కిన తరువాత
మీ ఇష్టం
వచ్చినట్టు నడుచుకోండి.
అంతకు ముందు
ఎంత వసపరచుకునే
మాటలు మాట్లాడినా
ఈ జాబిల్లీని
లొంగదీసుకోలేరు...”
ఖచ్చితమైన స్వరంతో
చెప్పేసి, వేగంగా
రోడ్డు మీదకు
వచ్చి వర్షాన్నీ, చీకటినీ
పట్టించుకోక నడిచింది
దేవయాని.
కొంతసేపు పిచ్చి
పట్టిన వాదిలాగా
నిలబడిపోయిన జగన్, నిదానానికి
వచ్చి, బయటకు
వచ్చి స్కూటర్ను
స్టార్ట్ చేసి
ఆమె దగ్గరకు
వెళ్ళాడు.
“క్షమించు
జాబిల్లీ...ఎవరూ
లేకపోవటం...చీకటి...నీ
అందం నా
బుద్దిని మరిచేటట్టు
చేసింది...కాస్త
ఎమోషనల్ అయ్యాను.
నువ్వు కొట్టిన
దెబ్బతో నిదానానికి
వచ్చాను. పద్దతి
ప్రకారం మా
అమ్మ--నాన్నా
మీ ఇంటికి
వచ్చి మన
పెళ్ళి గురించి
మాట్లాడతారు. కొత్త
సంవత్సరం పుట్టింది
కదా? మన
మధ్య ఒక
దారి పుడుతుంది!"
అన్నాడు.
ఆమె కోపం
తగ్గకుండా నడుస్తూనే
ఉన్నది.
“జాబిల్లీ నాకు
నువ్వే కావాలి. ఇది చీకటి
సమయం...నువ్వు
ఒంటరిగా వెళ్ళటం
సరిలేదు...బండిలో
ఎక్కు. ఊరి
సరిహద్దులో జాగ్రత్తగా
నిన్ను తీసుకువెళ్ళి
దింపుతాను…”
బ్రతిమిలాడే దోరణితో
అడిగిన అతను, “కావాలంటే
ఈ చెంప
మీద ఇంకొకటి
కొట్టు” అన్నాడు.
పువ్వులాగా జారి
బండిమీద ఎక్కి
కూర్చుంది జాబిల్లీ!
****************************************************సమాప్తం****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి