చీకటి పోగొట్టే వెలుగు…(కథ)

 

                                                                 చీకటి పోగొట్టే వెలుగు                                                                                                                                           (కథ)

భార్య భర్తల బంధం శాశ్వతం. అయితే అది మూడుముళ్ళు పడినప్పుడే ఒకరికొకరు శాశ్వతం . ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది. భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి.

భార్య భర్తల బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు.

భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. అప్పుడే భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉంటుంది.

సంసారం అంటే కలిసి ఉండటం కాదు. కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం.

కథలో భార్య భర్తల మధ్య బంధం ఎలా గట్టిపడిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

*****************************************************************************************************

పెద్ద వర్షం తరువాత చుర్రుమని కొడుతున్న పసుపు ఎండ, రోజు పూసిన పువ్వులాగా అనిపించింది. వదిలి వదిలి కురిసే వర్షం తరువాత వచ్చే ఎండలో ఇంత అందం ఉండదు.

రెండు రోజులు ఆగకుండా కురిసిన వర్షం వలన, డ్రయర్ లో వేసున్న బట్టలను తీసుకుని మేడపైకి వెళ్ళింది వనజా. ఒక్కొక్క బట్టను విదిలించి ఆరేస్తోంది. బట్టలు కిందపడకుండా క్లిప్పులను పెట్టింది. కాలింగ్ బెల్ శబ్ధం విని వేగంగా కిందకు దిగి వాకిలి వైపుకు వెళ్ళింది.

వాకిట్లో నిలబడున్న నాన్నను చూసి సంతోషించి, “రండి నాన్నా... అంటూ గ్రిల్ గేటును తెరిచింది.

ఎలా ఉన్నావు...?”

బాగున్నా నాన్నా...అమ్మరాలేదా...?”

లేదమ్మా. రాజ్యంకు డెలివరీ టైము కదా. వదిలిపెట్టి రాగలదా చెప్పు. అల్లుడు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారా...

గొడవ పెట్టుకోకుండా ఉండటం కూడా ప్రేమే కదు నాన్నా...వంట చేసిచ్చింది తప్పు చెప్పకుండా తింటారు. ఇంటికి కావలసిన పచారి సరకులన్నీ మొత్తంగా ఒకేసారి కొనిపడేస్తారు. పాలు ఇంటి వాకిట్లోకే వచ్చేస్తుంది నాన్నా...కానీ, నాకు ఒకే ఒక బాధ నాన్నా...అదేమిటంటే, ఒంటరిగా ఉండటమే కష్టంగా ఉంది. ప్రొద్దున వెళితే రాత్రి ఎనిమిదింటికే వస్తారు. అంతసేపు ఒంటరిగా బిక్కు బిక్కుమని కూర్చోలేకపోతున్నాను

వచ్చి పదిరోజులే కదా అయ్యింది...అలవాటైపోతుందమ్మా. అత్తగారిని  పిలిపించుకుని దగ్గర పెట్టుకో. అన్ని విషయాలలోనూ ఆవిడ నీకు తోడుగా ఉంటుంది. దాంతోపాటూ మాట్లాడుకోవటానికి ఒకరు ఉన్నట్టు అనిపిస్తుందే...

ఒక నెల రోజుల తరువాత ఆవిడ వస్తుంది నాన్నా. మీరెళ్ళి స్నానం చేసిరండి.  తిందాం! అంటూ వనజా వంటగదిలోకి దూర, సాంబశివరావు స్నానానికి వెళ్ళారు.

పదే రోజులలో జరిగి ముగిసిన తన రెండో కూతురు వనజా పెళ్ళి పెద్ద ఆశ్చర్యం ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే వెతుక్కుంటూ వచ్చిన వరుడు మనసుకు తృప్తి నివ్వటంతో గబగబా పెళ్ళి పనులలో దిగారు. కొంచం టైము తీసుకుని చెయ్యచ్చే...అన్న భార్యను అణిచివేశారు.

మంచి చదువు, చేతినిండా సంపాదన, మంచి కుటుంబం. వివరాలు తెలుసుకున్నాను భవానీ. నువ్వేమీ బాధ పడకు. నేను చూసుకుంటాను. మీ తమ్ముడు మాటలు నమ్మి పెద్ద కుటుంబంతో సంబంధం కలుపుకుని రాజ్యంను ఇచ్చాము. ఏమైంది...మాట్లాడితే గొడవ! అన్న తరువాత భవానీ ఏమీ మాట్లాడలేదు.

భోజనం చేయడానికి కూర్చున్న సాంబశివరావుతో...ఇల్లు కనిబెట్టడం కష్టం అనిపించిందా నాన్నా... అని  అడిగింది.

అల్లుడు బాగా వివరంగా చెప్పినందువలన కష్టం తెలియలేదమ్మా. నిన్న ఫోను చేశాను. నువ్వు నిద్ర పోతున్నావని చెప్పారు. ఎనిమిదింటికే నిద్రపోతావామ్మా...?”

అవును నాన్నా. ఆయన రాత్రి పన్నెండింటి వరకు కంప్యూటర్ వదిలి రారు. నాకు బోరు కొడుతుంది. నిద్రపోతాను అన్న తరువాత తలెత్తి కూతుర్ను చూశారు.

మనసులో ఏదో ఒకటి నొప్పి పుట్టించింది. పెళ్ళై ఒకనెల కూడా అవలేదే. ఇంతలో కూతురు మాట్లాడినది తప్పులాగా అనిపించింది. మనసు లోపల పలు ప్రశ్నలు అలలు అలలుగా, ఒకదాని వెనుక ఒకటి వరుసకట్టి నిలబడ...మౌనంగా తిన్నారు. మూడు దోసెల కంటే ఎక్కువ దిగలేదు.

మధ్యాహ్నం అల్లుడు వస్తారామ్మా...

లేదు నాన్నా. ఆఫీసు క్యాంటీన్లోనే తింటారు

అరెరే...తప్పమ్మా. నువ్వు క్యారేజీ కట్టివ్వద్దా...

రెండు రోజులు వరుసగా చేసాను నాన్నా. శ్రమ పడద్దు అని చెప్పారు. తీసుకు వెళ్లలేదు నాన్నా

వనజా...సంతోషంగా ఉన్నావారా...?” అడిగేటప్పుడే సాంబశివరావు గొంతు బొంగురుపోయింది.

నాన్నా...ఆఆఆ...ఎందుకు నాన్నా...సంతోషంగానే ఉన్నాను నాన్నా

లేదురా...తొందరపడ్డానేమోనని కష్టంగా ఉందిరా అన్న సాంబశివరావు కన్నీటితో నిలబడ,

మీరు బాధపడేంత విషయం ఏమీ లేదు నాన్నా. ఎందుకు బాధపడుతున్నారు...?” అని తండ్రిని సమాధానపరిచింది.

మనసులో విశాల్ వచ్చి వెళ్లాడు. పెళ్ళైన మొదటి రోజే...నా తల్లి కోసమే పెళ్ళి! అర్ధమయిందా...? నన్ను విధంగానూ అదుపులో పెట్టకూడదు" అని చెప్పినప్పుడు అర్ధంకాక ఆశ్చర్యంతో నిలబడ్డది జ్ఞాపకానికి వచ్చింది. దేనినీ బయట చూపకుండా,

మీ అల్లుడు కొంచం రిజర్వ్ టైపు నాన్నా. అంతేగానీ మంచివారే నాన్నా. గలగలా మాట్లాడటం తెలియదు. ఆయన, ఆయన పని అనే ఉంటారు. అంతకు తప్ప ఆయన దగ్గర కొరతా లేదు

ఏమోనమ్మా...నువ్వు సంతోషంగా ఉంటే చాలమ్మా అన్న సాంబశివరావు తన కూతురి కళ్ళల్లో ఒక అలజడి కనిపించటం గమనించారు.

అయ్యో...నాన్నా...మీరు మాట్లాడినందువలనే నాలో అలజడి ఏర్పడిందే తప్ప...ఇంకే విషయం లేదు నాన్నా  అంటూ డైనింగ్ టేబుల్ శుభ్ర  పరిచింది.

వేరు వేరు గదులలో ఇద్దరూ వేరు వేరుగా ఉంటున్నాము అనేది తెలిస్తే...నాన్న విరిగిపోతారు. ఎందుకు...ఎందుకు...అనుకుంటూ తాను పలు ప్రశ్నలకు జవాబు తెలియక జీవిస్తున్నాను అనేది నాన్న దగ్గర చెప్పలేను. కాలం గడిచిన కొద్దీ అంతా సరిపోతుంది. అనవసరంగా ఆయన్ని ఇరకాటంలో పెట్టకూడదుఅని చాలా జాగ్రత్తగా ఉంటోంది వనజా.

రాత్రి ఏడు గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన విశాల్, మామగారిని చూసి చిన్నగా నవ్వేసి గదిలోకి వెళ్ళినతను స్నానం చేసి, డ్రస్సు మార్చుకుని, ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. వంట గదికి వెళ్ళి వనజాను వెనుక నుండి హత్తుకున్నాడు. ఆశ్చర్యపోయి నిలబడ్డ వనజా చెవిలో...మీ నాన్న నన్ను విల్లన్ లాగా చూస్తున్నారు. అందుకోసమే బంధింపు. అవసరం లేకుండా పంచయతీ పెట్టకూడదు కదా...నీ గదిని ఆయనకు ఇచ్చేయి. నువ్వు నా గదికి వచ్చేయి" అని గుసగుసలాడి, వనజాను తనవైపుకు తిప్పుకుని, ఆమె కళ్ళను చూసి, “నీ తపనను   రోజు తీరుస్తాను" అని చెప్పి బయటకు వెళ్ళ, భయం కలిసిన దఢ వనజాను అంటుకోగా, వేగంగా భర్తను వెంబడించింది.

తాగున్నారా...?” చిన్నటి స్వరంతో అడిగింది.

తెలివిగలదానివే! కనిబెట్టేసావా...?” అని గట్టిగా నవ్విన విశాల్,

అవును...! రా డిన్నర్ తిందాం. మీ నాన్న కాచుకోనున్నారు అంటూ వేగంగా డైనింగ్ హాలుకు వెళ్తున్న భర్తను లాగి పట్టుకుని ఆపింది.

అనవసరంగా మాట్లాడకండి. మా నాన్న బాధపడతారు. మీరు తాగుతారని ఆయనకు తెలియకూడదు

ఎందుకు...ఆయన తాగిందే లేదా...ఓవర్ గా బిల్డప్ చెయ్యకు... అంటూ మామగారి ఎదురుగా వెళ్ళి కూర్చున్నాడు.

ఇంట్లో అందరూ బాగున్నారా మావయ్యా...?” అనే కుశల ప్రశ్నలు అడుగుతూ, “వంట గది నుండి బెడ్ రూము వరకు మీ కూతురు పెట్టిందే చట్టం! అన్నప్పుడు, సాంబశివరావు కూతుర్ను చూడ, వనజా విశాల్ ను కోపంతో చూసింది.

మావయ్యా...ఎనిమిదింటికల్లా నిద్రపోతుంది. నిద్రలో కుంభకర్ణి. లేపనే లేము.  ఇంకా మీ అమ్మాయిగానే ఉంటోంది. నా భార్యా అనే ఫ్రేమ్ లోకే రాలేదు! అన్నప్పుడు వనజా నిర్ఘాంతపోయింది.

ఎంత అందమైన అబద్దం...! ఎలా ఇంత సరళంగా మాట్లాడ గలుగుతున్నాడు?’

ఏంటమ్మా ఇది...! అల్లుడు నీ గురించి ఫిర్యాదు చేసేటట్టు నడుచుకుంటున్నావు అన్న సాంబశివరావు అల్లుడూ చిన్న పిల్లే కదా. పోను పోనూ సరిపోతుంది అన్న ఆయన నువ్వూ కూర్చుని తినమ్మా అన్నారు ఉత్సాహ స్వరంతో. అంటే నేననుకున్నట్లు సమస్యలేమీ లేవుఅనుకుని కుతూహలపడ్డారు మనసులో.

పనులను ముగించుకుని, వేగంగా లోపలకు వచ్చిన వనజాను తలెత్తి చూశాడు విశాల్. ఏమిటీ?’ అంటూ కనుబొమ్మలు పైకెత్తి సైగతో అడిగాడు.

చురు చురుమని వచ్చిన కోపాన్ని అనుచుకుని మాట్లాడింది.

మీ చెల్లెలు మీకసలు ఎటువంటి చెడు అలవాటూ లేదని చెప్పిందే...

ఎప్పుడైనా ఆఫీసు పార్టీలలో తాగటం చెడు అలవాటా...టెన్షన్ ఎక్కువైతే ఒక సిగిరెట్టు తాగుతాను. వీటినంతా పెద్దది చేయకు

అంతేనా...ఇంకేదైనా ఉందా...?”

నో...నో...ఇది కూడా...జస్ట్ ఒన్స్. ఎప్పుడైనానే!

...జస్ట్ ఒన్స్...జస్ట్ ఒన్స్ ఇంకా ఏమేమున్నాయో చెప్పండి

ఇంకేమీ లేదు! ఇక మీదటే అలవాటు చేసుకోవాలి! అని కన్ను కొడుతూ ఆర్ యూ రెడీ... అన్నప్పుడు బలహీనపడింది.

చూపుల దిక్కును మార్చింది.

సరిసరి...వచ్చి కౌగలించుకోరా. ఎన్ని రోజులు నిన్ను ఇలా వదిలిపెట్టేది...?”

మీ మాటలూ, చేష్టలూ ఏదీ నచ్చలేదు! మనకు పెళ్ళి జరిగి నెల రోజులు అయ్యింది. మీ నీడ కూడా నా మీద పడింది లేదు. తాగిన మత్తులో మీ ఇష్టమొచ్చినట్టు వాగకుండా, మాట్లాడకుండా పోయి పడుకోండి. ప్రొద్దున్నే మాట్లాడు కుందాం

రావే అంటే... అంటూ బలవంతంగా వనజాను కౌగిలిలో బంధించ, ఆమె వదిలించుకోవటానికి పెనుగులాడింది. ఛీఛీ...తాగేసి బలవంతం చేస్తున్నారే...సిగ్గులేదూ...?” అంటూ తనని విడిపించుకున్న వనజా దిండూ, దుప్పటీ లాక్కుని గది మూలకు వెళ్ళి పడుకుంది.

శబ్ధం రాకుండా ఏడ్చింది.

విశాల్ రోజు ఎందుకు ఇలా నడుచుకుంటున్నారు. అందులోనూ నాన్న ఉన్నప్పుడు...

ప్రొద్దున్నే మత్తు పోతుందా? నాన్నకు ఇప్పటికే అర్ధమైయుంటుందా...? విశాల్ తాగిన సంగతి గురించి అడిగితే...ఏదైనా అడుగుతారో...ఏం జవాబు చెప్పను...? ప్రశ్నలను మార్చి మార్చి అడిగి నన్ను ఇరకాటంలో పెడతారో...అన్న తపనతో నిద్రపోలేకపోయింది.

వనజా తనని ఉదాసీన పరచటాన్ని తట్టుకోలేక పోయాడు విశాల్. తూలుతూ వచ్చి వనజా కళ్ళలోకి చూశాడు.

నీ భర్తనే నేను. రమ్మంటే రావాలి. లే! కాలితో కదిపాడు. పట్టుదలగా నిరాకరించిన ఆమెను వంగుని ఎత్తుకున్నాడు.

పరుపు మీద పడేసి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. సారి వనజా కదల లేక పోయింది. వనజా యొక్క ఇష్టం గురించి బాధపడకుండా, తనకు ఇష్టం  వచ్చినట్టు నడుచుకున్నాడు. మధ్యలో రమా...రమా....లవ్.యూ... అని ఉచ్చరించినప్పుడు షాక్ తో గట్టిబడిపోయింది వనజా.

నిద్ర లేచి నప్పుడు శరీరము, మనసు నీరసించిపోయున్నది. తండ్రి కాఫీ రెడీ చేస్తున్నది చూసింది. సారీ నాన్నా. అలసటతో చాలాసేపు నిద్రపోయాను అన్న కూతురు వనజాను ప్రేమగా చూశారు.

వనజా...అల్లుడి మనసు కష్టపడకుండా నడుచుకో. ఆఫీసు పార్టీ అంటే...రెండు పెగ్గులు తాగాల్సి వస్తుంది. దాన్ని పెద్దది చేయకు. అనుసరించి నడుచుకో అన్నారు సాంబశివరావు.

మనసు కష్టపెట్టకుండా నడుచుకో అని అమ్మాయలకు మాత్రమే బోధించబడుతోంది. మగవాడికి బోధనా లేదు!

అమ్మాయలను మగాడు దుస్తులలాగానూ, ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు,  అధికారం చేయచ్చు అనే రకంగా సమాజం కట్టుబాటు పెట్టుకుంది. సమాజం ఇచ్చిన అధికారం వలనే కదా విశాల్ అలా నడుచుకున్నాడు అనుకున్న వెంటనే పొంగుకు వచ్చిన కన్నీటిని నాన్నకు కనబడనివ్వకుండా తుడుచుకుంది.

విశాల్ ఎప్పుడూ లాగా లేచాడు. స్నానం చేశాడు.తిన్నాడు. ఆఫీసుకు  వెళ్లాడు.

నిన్న తాను నడుచుకున్న విధం గురించి మాట్లాడి, బాధపడి దగ్గరకు వచ్చి సారీ అడుగుతాడు అని ఎదురుచూసి మోసపోయింది వనజా.

అంటే...తన అవసరం కోసం నన్ను ఉపయోగించుకునే ఒక వస్తువులాగా చూస్తున్నాడు

ఒక నెలరోజులుగా తనని తిరిగి కూడా చూడనతను నిన్న మందు మత్తుకు ఒక  ఊరగాయలాగా ఉపయోగించుకున్నాడో...?’ అన్న ప్రశ్న విశ్వరూపం ఎత్తి నిలబడింది!

ఇలా ఒక మగాడి మత్తు వస్తువుగా ఉండటం కోసమా నేను జన్మ ఎత్తింది...?’

లోకం ప్రాణంతో ఉండటం ఆడదానివలనే కదా... ఆడదానిని గౌరవంగా చూసుకోవాలని తెలియక్కర్లేదా...?!’ అన్న ప్రశ్నను తనలో అడిగిన ఆమె, తండ్రి రాకతో కుతూహలం చెందిన మనసు భర్త నడవడికతో కుచించుకుపోయింది. తండ్రికోసం వంట చేసింది. తినడం ఇష్టం లేకుండానే తిన్నది.

వనజా...ఎందుకు ఒకలాగా ఉన్నావు...కొన్ని విషయాలను ఈజీగా తీసుకోవాలి!  అల్లుడేమన్నా తాగుబోతా...ఎప్పుడైనా ఒక పెగ్గు తీసుకోవటం తప్పులేదమ్మా. ఇలా మొహం చాటేస్తే సరిపోతుందా. సమయం, సంధర్భం, చూసి మెచ్యూర్డుగా ఎత్తి చెప్పాలి! అన్న వెంటనే, ‘...తండ్రి నన్ను లోతుగానే గమనిస్తున్నారుఅనేది గ్రహించి చిన్నగా నవ్వింది వనజా.

దానికి కాదు నాన్నా...అలవాటైపోతుందేమో నని భయంగా ఉంది

అదంతా ఏమీ జరగదు. సాయంత్రం అల్లుడితో నేను మాట్లాడతాను!

అయ్యో...వద్దు నాన్నా. ఆయనొక జిడ్డు. మిమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడితే...నేను తట్టుకోలేను నాన్నా

సరేమ్మా. అయితే నువ్వు సంతోషంగా ఉండాలి?”

సరే నాన్నా అంటూనే తండ్రి భుజాలపై వాలిపోయింది.

అమ్మను చూడాలని ఉంది నాన్నా...నేనూ మీతోటి రానా...?”

లేదు వనజా...నువ్వు అల్లుడితోనే రావాలి! అదే నాకు గొప్ప!

ఆయనకు నా ఇష్టం అని ఏదీ ఉండకూడదు నాన్నా...?”

అలా కాదమ్మా. భార్య యొక్క ప్రేమ పూర్వక వ్యక్తిత్వానికి కట్టుపడని మగాడే లోకంలో ఉండడమ్మా! అధికారం, అహంకారం ఇవన్నీ బయట చూపించి జీవితాన్ని సమస్యగా చేసుకోకూడదు

నాన్నా...

అల్లుడు మంచివాడేనమ్మా. నువ్వే అర్ధం చేసుకుని నడుచుకో!

ఆయన, ఆయనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. నాకు నచ్చలేదు

అదేనమ్మా మగాడి స్వభావం! పోను పోను సరిపోతుందమ్మా అంటూ కూతుర్ని ఉత్సాహపరిచారు. కూతురి కోసం మనసులో కరిగిపోయారు. విశాల్ ను చూస్తే మూర్ఖుడిలా తెలియటం లేదు. ముద్దుగా పెంచబడ్డ కూతురికి చిన్న మొహం చిట్లింపులే పెద్దగా తెలుస్తోంది! అల్లుడికి సపోర్టుగానే మాట్లాడారు.

ఆరుగంటలకల్లా వేగంగా ఇంటికి వచ్చిన విశాల్.

వనజా...గబుక్కున బయలుదేరు. ఒక రిసెప్షన్ కు వెళ్ళాలి అని చెప్ప,

అంత తొందరగా, హడావిడిగా నేను బయలుదేరలేను! నేను రాను! అన్న వనజా, “ప్రొద్దున్నే చెప్పటానికేం... అన్న ప్రశ్నతో అలాగే కూర్చోవటంతో...ఇప్పుడు నువ్వు వస్తావా రావా...?”

లేదు! మీ ఇష్టానికి నేను ఆడలేను

...రైట్! సంతోషం! అన్న అతను, తన మావగారు సాంబశివరావు గారిని చూసి...బాగా పెంచారు కూతుర్ని...గొప్పగా ఉంది! అంటూ విశాల్ ఒక్కడుగా  బయలుదేరి వెళ్ళాడు.

వనజా...ఏమ్మా...ఇలా ఉన్నావు...నీకేమిటి సమస్య చెప్పు. వియ్యంకులతో మాట్లాడదాం. ఒక నెల రోజులలోనే పిల్లీ--ఎలుకా లాగే ఉంటే ఎలాగమ్మా...నీకు అల్లుడు నచ్చలేదా...లేక ఆయనకు నువ్వు నచ్చలేదా...?”

తెలియదు నాన్నా. కానీ...సంతింగ్ ఈజ్ మిస్సింగ్! అన్న కూతురి కళ్ళల్లో కన్నీరు కారటం చూసి ఆవేదన చెందారు. వెంటనే వియ్యంకుడు పద్మనాభానికి ఫోన్ చేశారు.

మీ అబ్బాయిని కాస్త ఖండించి ఉంచండి బావా. తాగేసొచ్చి గెంతులేయటం విధంగా న్యాయం...?”

కోపగించుకోకుండా మాట్లాడండి బావా! కోడలు దగ్గర విచారిస్తాను. మీరు వెంటనే బయలుదేరి మీ ఇంటికి వెళ్ళండి. భార్యా--భర్తల మధ్య మీరెందుకు ముక్కు దూరుస్తారు... కాలం పిల్లలకు ఈగో ఎక్కువ! మగాడికి సమంగా గొడవ చేస్తే...కుటుంబం జరుగుతుందా...?” అన్న తరువాత...కోపం వచ్చినా...అణుచుకున్నారు.

నాన్నా...మీరు బయలుదేరండి. నాకోసం మీరు అవమానపడకండి! నా సమస్యను నేనే చూసుకుంటాను

ఒక వారం రోజుల తరువాత భర్త ఎదురుగా నిలబడి రమా ఎవరు...?” అని ప్రశ్నించిన వనజాతో,

ఖచ్చితంగా తెలుసుకోవాలా...?” అన్న ఎదురు ప్రశ్న వేశాడు.

అవును

నా సోల్ మేట్

అలాంటప్పుడు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు...ఆమెనే చేసుకోనుండచ్చు కదా...

నా విధిలో నీ పేరే రాసుందనుకుంటా...ఆమెను నేను పారేసుకున్నాను అన్న అతను తన చూపులను మార్చుకున్నాడు.

నాకు అర్ధం కాలేదు

నా కళ్ళ ముందు ప్రమాదం ఒక్క క్షణంలో జరిగి ముగిసి పోయింది. వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తున్నప్పుడు, పెద్ద వరద వచ్చి కొట్టుకుపోయిందిఅన్న విశాల్ యొక్క కళ్ళు కన్నీరు కార్చటం మొదలుపెట్టాయి.

నిర్ఘాంత పోయింది వనజా...ఐయాం సారీ అన్నది.

షాకు నుండి బయటపడటానికి నాకు ఒక సంవత్సరం పట్టింది. తల్లి ఒత్తిడితో నువ్వు నా భార్య అయ్యావు....కానీ, నా మనసు దాన్ని అంగీకరించలేదు. అందువలనే మనిద్దరి మధ్యా ఆ దూరం!

మీ నాన్న రాగానే మనిద్దరి మధ్యా ఉన్న గ్యాప్ గురించి నువ్వు ఎక్కడ చెప్పేస్తావో నన్న తడబాటుతోనే తాగాను.

నువ్వు నన్ను అసహ్యించుకున్నది నేను తట్టుకోలేకపోయాను. దాంతోపాటూ మత్తు, ఈగో చేరిపోవటంతో మూర్ఖుడ్ని అయిపోయాను. రియల్లీ ఐయాం సారీ వనజా. రెండు రోజులు దానికొసం నేను ఎంత వేదన పడ్డానో తెలుసా...?”

అది సరే...కానీ...రమా...రమా అంటూ మీరు గొణగడం నన్ను ఎంత బాధపెట్టిందో ఆలొచించారా...?”

లేదు వనజా...నన్ను మించి, నాకు తెలియకుండానే పలికిన మాటలు అవి! నావల్ల ఆమెను మర్చిపోలేకపోతున్నా.

ఎన్ని ఆశలూ, ఎన్ని కలలూ అన్నీ మాయంగా మాయమైపోయినై. నువ్వు నన్ను అర్ధం చేసుకుంటే చాలు. ఇక మీదట నేను తాగను. నా యొక్క పూర్తి ప్రేమను రమా తీసుకు వెళ్ళిపోయింది.

దాన్ని నేను మరిచిపోవటానికి నువ్వు నాతో కలిసి ప్రయత్నించాలి. నా వల్ల కావటం లేదు అన్నప్పుడు...నాలిక పొడి ఆరిపోయిన వనజా భర్త దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకుంది.

మీ మనసు నాకు అర్ధమవుతోంది! లవ్ యూ అన్న వనజా భర్త కళ్లలోకి చూస్తూ తన ప్రేమ, అభిమానం చూప...తన మనసులోని చీకటిని పోగొట్టే పెద్ద  వెలుగుగా వనజా కనబడ,

"చాలు! వనజా! నన్ను క్షమించు ప్లీజ్..." అన్న భర్త యొక్క పెదాలపై సున్నితంగా ముద్దుపెట్టింది...!

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)

ఏల్నాటి శని...(కథ)