ఉత్తమ భర్త...(కథ)
ఉత్తమ భర్త (కథ)
సంసారమనే బండికి భార్య, భర్త రెండు చక్రాలు. రెండు కలిసి సక్రమంగా నడిస్తేనే ఆ బండి ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సాగిపోతుంది. పెళ్లి చేసుకున్న జంటలు తమ వివాహ బంధం చిరకాలం ఉండాలనే కోరుకుంటారు. భార్యభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉంటేనే వారి దాంపత్యం సాఫీగా సాగిపోతుంది. అప్పుడే వారి జీవితంలో ఎటువంటి అపార్థాలు, సమస్యలు ఉండవు.
ఇలాంటి జంటలలో భార్యా-భర్తల మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఒకరినొకరు వదులుకోలేరు. అలాంటి భార్యా, భర్తల కథలో ఈ కథ కధానాయకుడు ఎలా ఉత్తమ భర్తగా నిలిచిపోయేడో ఈ కథ చదివి తెలుసుకోండి.
*****************************************************************************************************
తెల్లవారు జాము!
ఉరుములూ, మెరుపులతో
బలమైన వర్షం
కురుస్తూ ఉన్నది.
వీధి అంతా
వాన నీరు
వరదలాగా ప్రవహిస్తున్నది.
మనసులో కుమిలిపోతూ
కారును ఎడమ
వైపుకు తిప్పి
ఒక పెద్ద
వీధిలోకి ప్రవేశించాడు
రాజశేఖర్. వర్షం
వరదతో కారు
మెల్లగా దొర్లుతున్నది.
జన సంచారం
తగ్గిపోయి వీధి
ఖాలీగా కనబడింది.
ఒకరిద్దరు గొడుగులు
పట్టుకుని టీ
షాపులలోకి వెళ్తున్నారు.
కారు యొక్క
‘వైపర్’ వాన
చినుకులను తుడుస్తున్నది.
ఆ విరామ
సమయంలో రెండువైపులా
చూపులను తిప్పాడు
రాజశేఖర్.
అదిగో----
అతను వెతుకుతున్న
ఆ మహిళ కళ్ళకు
కనబడింది. ప్రొద్దున
వాకింగ్ చేస్తున్నప్పుడు, ఈ
దార్లో వెళుతున్నప్పుడు
ఆ మహిళను
చూశాడు, ఇప్పుడు
ఆమెను వెతుక్కుంటూ
వచ్చాడు.
ఆమేమో ఆ
ఇంటి అరుగు
మీద ఒక
మూల చలికి
వణుకుతూ నిలబడుంది.
ఆమెకు ముప్పై
ఐదు ఏళ్ళ
వయసు కంటే
ఎక్కువ వుండదు.
అంత పేదరికం
లోనూ మురికి
పట్టిన ఆమె
శరీరమంతా, అందమనే
రంగుతో,
వంపు, సొంపులతో
ముగ్గు వేసుంచాడు
దేవుడు.
ఆమె ఒదిగి
ఉన్న ఇంటి
అరుగు దగ్గర
తన కారును ఆపి
గొడుగు తెరుచుకుంటూ
కారులో నుండి
దిగి ఆమె
దగ్గరకు వెళ్ళాడు
రాజశేఖర్.
“రామ్మా...ఇలా
చలిలో వణికి
పోతున్నావే...
వచ్చి కారులో కూర్చో” -- జాలి, దయతో
భవ్యంగా పిలిచాడు.
అతని చూపులు
ఆమెకు సరి
అనిపించలేదు...“అయ్యా!
నేను రాను...ఇక్కడ్నుంచి
వెళ్ళిపొండి...”
“ఇదిగోమ్మా...భయపడకు!
వర్షం కుండపోతగా
కురుస్తోంది...మా
ఇంటికి రామ్మా...కొత్త
చీర ఇస్తాను...కడుపు
నిండుగా భోజనం
చేసి వర్షం
ఆగిన వెంటనే
నువ్వు వెళ్ళిపోవచ్చు...నేనేమీ
చెయ్యను...నన్ను
నమ్మమ్మా...”
ఒకసారి తన
శరీరాన్నంతా చూసుకుంది.
ఘోరమైన ఆకలి...భోజనం
చేసి రెండు
రోజులయ్యింది...వర్షం
తగ్గేటట్టు లేదు...‘సరి...సరి...జరిగేది
జరగనీ...చూడటానికి
పెద్ద మనిషిలాగా
ఉన్నారు’...దేవుడిపై
భారం వేసి
ఆయనతో పాటూ
కారు ఎక్కి
కూర్చుంది.
ఆ స్త్రీని
ఓరకంటితో చూసి
ఒక చిన్న
నవ్వు నవ్వి
కారు స్టార్ట్
చేశాడు రాజశేఖర్.
ఒక పెద్ద
బంగళాలోకి వెళ్ళి
ఆగింది కారు.
కారు తలుపు
తీయటానికి పనివాడు
పరిగెత్తుకు వచ్చాడు.
“కోటయ్యా!
నేను మేడపైకి
వెళుతున్నాను...ఈ
మహిళకు మామూలుగా
చేసేది చేసేసి
ఆమెను అమ్మగారి
రూముకు తీసుకురా” -- అంటూ
చెప్పి మేడపైకి
వెళ్ళిపోయాడు రాజశేఖర్.
ఆమెకో ఒకటే
అయోమయంగా ఉంది.
ఎక్కువ భయంతో
వణుకుతున్నది.
“ఇదిగోనమ్మా...బాత్
రూములో వేడి
నీళ్ళు రెడీగా
ఉన్నాయి...వెళ్ళి
స్నానం చేసి
ఈ చీర
కట్టుకుని రామ్మా...” అని చెప్పి
చీర, టవలూ
ఆమె ఎదురుగా
జాపాడు పనివాడు
కోటయ్యా.
ధైర్యం తెచ్చుకుని
తనివితీరా వేడి
నీళ్ళతో స్నానం
చేసి, కోటయ్యా
ఇచ్చిన చీరను కట్టుకుని
మేడ మీదకు
వెళ్ళింది.
అటూ, ఇటూ
చూసింది. పనివాడు
కనబడలేదు. అతని
తంత్రం అర్ధం
చేసుకుంది.
ఒక విధమైన
భయంతో ఉన్న
ఆమెను చూసి
“ఏంటమ్మా!
చీర ఎలాగుంది? నచ్చిందా...? చలి
అంతా పారిపోయిందా?” అంటూ
ఒక మొహ
నవ్వుతో ఆమె
దగ్గరకు వచ్చాడు
రాజశేఖర్.
ఆమె కృతజ్ఞతా
భావం కలిపిన
ఒక నవ్వును
నవ్వింది.
“ఓ.కే.
ఇప్పుడు నా
రూము వరకు
కొంచం వచ్చి
వెళ్ళమ్మా...” -- అని
చెప్పి ఆమె
సమాధానం కోసం
ఎదురుచూడ కుండానే
వెళ్ళిపోయాడు రాజశేఖర్.
‘వెళ్ళి
చూద్దాం’
‘నన్ను
మించి అలా
ఏం జరుగుతుంది’ అనుకున్న
ఆమె రాజశేఖర్
వెనుకే నడిచింది.
“ఇందామ్మా...!
ఈ పట్టు
చీర కట్టుకుని
నా భార్య
ఫోటోకు దీపం
వెలిగించి పూజ
చేయమ్మా” అన్నాడు రాజశేఖర్.
అమె ‘ప్చ్’ అన్నది.
ఆయన ఏం
సాధించటానికి ఈ
నాటకాన్ని అరంగేట్రం
చేస్తున్నారు అనేది
అర్ధం కాక
ఒక్క క్షణం
ఆశ్చర్యపోయి నిలబడ్డది.
“ఏంటమ్మా...!
అలా ఆశ్చర్యంగా
చూస్తున్నావు? నేను
నిన్ను తప్పు
ఆలొచనతో పిలుచుకు
వచ్చేననే కదా
అనుకున్నావు...? ఇలాగేనమ్మా
నన్ను అందరూ
తప్పుగా మాట్లాడుతున్నారు...ప్రాణానికి
ప్రాణంగా ప్రేమించిన
నా భార్య
హఠాత్తుగా కామెర్లు
వ్యాధితో చచ్చిపోయింది.
ఆమె జ్ఞాపకంతో
నేను మళ్ళీ
పెళ్ళి చేసుకోలేదు...ఆమె
ఆశపడినట్లే నెలనెలా
పౌర్ణమి రోజున
ఒక పేద
మహిళకు, కడుపు
నిండా భోజనం
పెట్టి, కొత్తగా
పట్టు చీర
కొనిస్తాను. ఈ
రోజు నా
భార్య యొక్క
తిధి రోజు...అందుకనే
నిన్ను ఇంటికి
పిలుచుకు వచ్చాను...నన్ను
తప్పుగా అర్ధం
చేసుకోకమ్మా...నన్ను
క్షమించమ్మా...” అని చెప్పి
కన్నీరు పెట్టారు
రాజశేఖర్.
“అయ్యా...మీరే
నన్ను క్షమించాలి...మీ
మంచి మనసును
అర్ధం చేసుకోక
నేను మిమ్మల్ని
తప్పుగా అర్ధం
చేసుకున్నాను...మీ
భార్య మీద
ఇంత ప్రేమ
పెట్టుకున్న మీరు
ఒక దేవుడు...మీరొక
ఉత్తమ భర్త
అయ్యా" అని
చెప్పి కన్నీరు
పెట్టుకుని ఆయన
కాళ్ళ మీద
పడ్డది ఆమె.
************************************************సమాప్తం*******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి