ప్రకృతి వేసిన శిక్ష...(కథ)


                                                                            ప్రకృతి వేసిన శిక్ష                                                                                                                                                                (కథ) 

చట్టం,మీరు,నేనూ ఎవ్వరూ నమ్మక ద్రోహం చేసే వ్యక్తికి శిక్షను వేయాల్సిన పనిలేదు.ఎందుకంటే పాపికి సాధారణంగా రెండు శిక్షలు ఉంటాయని గరుడ పురాణం చెప్పింది.ఒకటి లోకంలో బతికి ఉండగానే పడేది,రెండోది వారి ఆత్మ పరలోకం లో అనుభవించేది.ఉదాహరణకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఎదగలేడు,ఒక వేళా ఎదిగినా కుటుంబం సరిగా వృద్హి లోకి రాదూ,వచ్చినా వారు ఆలపయుష్కులో,అసహజమైన చావు లేదా రోగం కలిగినవారో అవుతారు.ఇవేవి లేకుంటే వ్యసనాలు,సంతాన లేమి,జీవిత భాగస్వామితో,వ్యాపార భాగస్వామితో విరోధాలు తప్పనిసరిగా ఉంటాయి. వారు చనిపోయినపుడు చివరకు మాంసం తినే జీవి కూడా అతని శవాన్ని ముట్టుకోదు. కాకి వంటి జీవి అసలు దరిదాపులకు రాదు. మరు జన్మలో మొదటి జన్మ తేలు ,రెండోది నక్కగా పుడతారు.

ప్రకృతి విధించే శిక్ష ముందు మనం విధించే శిక్ష లెక్క లోకి రాదు. నమ్మక ద్రోహానికి ప్రకృతి అప్పటికప్పుడే శిక్ష వేస్తుంది. ఈ కథలో నమ్మక ద్రొహానికి పాల్పడిన వ్యక్తికి శిక్ష ఎలా పడిందో తెలుసుకోండి.  

*****************************************************************************************************

పద్మజా ఒక యుక్త వయసు తుఫాన -- అందమైన దేవత. సినిమా ప్రపంచంలో గొప్ప స్టారుగా జెండా ఎగరేసి ఊగుతున్న ఆమెతో జతకట్టి నటించటానికి, భారత దేశంలోని టాప్ యంగ్ హీరోలు మొదలు చివరి ర్యాంకు హీరో వరకు పోటీ పడతారు.

ఆమె తనని పెళ్ళికొడుకుగా ఎంచుకోదా?’-- రోజా పువ్వుతో తమ ప్రేమను తెలియజేయటానికి తహతహలాడుతూ ఉంటారు పలువురు. సమయంలోనే పిడుగు వచ్చి మీద పడినట్టు ప్రకటన బయటకు వచ్చింది.

పద్మజా, తన చిన్న నాటి స్నేహితుడూ, ప్రసిద్ద వ్యాపార వేత్త శ్రీనాద్ ను  ప్రేమిస్తున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. చిన్న వయసు నుండే స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రాములలో శ్రీనాద్, పద్మినీని జంటగా వేస్తారట.

ఇద్దరూ అందంలో, నటనలో ఒకరికొకరు తక్కువ అనిపించుకోరు. సూపర్ జంటఅని అందరూ వాళ్ళను పొగడటం విని స్కూల్ విధ్యార్ధులకు శ్రీనాద్ మీద ఈర్ష్య మంట అంత ఎత్తుకు ఎగిసి పడేది అంటే...విధ్యార్ధినులకో పద్మినీని చూస్తేనే  ఒళ్లంతా మంటలు రేగుతాయి.

వాళ్ళిద్దర్నీ ప్రేమ పావురాలుగా చిత్రీకరించి స్కూలు కాంపౌండ్ గోడల మీద...టాయిలెట్ లలోనూ బొమ్మలు గీసి...మనసు వెళ్ళే దొవలో ఇష్టం వచ్చినట్టు రాసి  పారేసి తమ మనో వ్యధను తీర్చుకున్న వాళ్ళకు నిజం ఎలా తెలుస్తుంది?

ఆస్తీ, అంతస్తూ ఉన్న ఇంటి పిల్లాడైన శ్రీనాద్, పువ్వులు అమ్ముకునే భవానమ్మ యొక్క కూతురు పద్మినీని కాళ్ళకు అంటుకున్న మట్టిలాగా తీసిపారేస్తాడనేది?

కానీ.......

పద్మినీ మనసులో శ్రీనాద్ పైన ఒన్ సైడ్ ప్రేమ ఉన్నా తమ అంతస్తు తేడా గురించిన ఒక క్లారిటీ, ఆమె మనసులో ఉన్న ప్రేమను శ్రీనాద్ దగ్గర చెప్పనివ్వకుండా అడ్డుకుంది. 

ఒకవేల చెప్పున్నా కూడా శ్రీనాద్, అందమూ, పొగరూ, డబ్బున్నదనే అహంకారంతో...దాన్ని ఖచ్చితంగా అంగీకరించడు అనేది మాత్రమే కాదు...చెవితో వినిపించుకోని కూడా ఉండడు.

ఒక తీవ్రమైన తుఫానలో తనకున్న ఒకే ఒక బంధువైన తల్లినీ, తలదాచుకునే గుడిసెనూ పోగొట్టుకుంది పద్మినీ. హైదరాబాదులో ఉన్న దూరపు బంధువులు, తాము చదివిస్తామని చెప్పింది నమ్మి వాళ్ళతో వెళ్ళ...వాళ్ళు పద్మినీని ఇంటి పనులకోసమే తీసుకు వెళ్ళేరనేది అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది.

ఆమె బంధువు సినిమా నటులకు మేకప్ మ్యాన్ కాబట్టి కొన్ని సమయాలలో పద్మినీ ని కూడా సహాయానికి తీసుకు వెడతాడు. అలాంటి ఒక సంధర్భంలోనే తన సినిమాకు ఒక కొత్త నటిని, ఒక కొత్త పువ్వును వెతుకుతున్న సినిమా డైరక్టర్ భూషణం కళ్ళల్లో పడింది పద్మినీ.

ఇంకేముంది? న్యాచురల్ గానే అందంగా ఉండి...నటనా అనుభవం కలిగిన పద్మినీ... పద్మజా అయ్యి తెర మీద నర్తనం ఆడ ప్రారంభించ...ఆమె పేరూ, గొప్పతనం, పలుకుబడి పైపైకి ఎదగటం మొదలయ్యింది.

అలా ఉన్నా మనసులో ఏదో ఒక చివర ఇంకా శ్రీనాద్ మీద ఆమెకున్న ప్రేమ...ఇంకెవరి ప్రేమనూ ఆమె మనసు అంగీకరించటానికి ఒప్పుకోలేదు.

స్కూలు చదువు ముగించిన శ్రీనాద్, తన ఊర్లో ఉన్న కాలేజీలోనే డిగ్రీ ముగించి, తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూ వచ్చాడు. అతనికి పద్మినీని గురించిన జ్ఞాపకమో...లేక ఆమె ఏమైందీ? అనేది కూడా తెలుసుకోవాలనే ఆతృత కొంచం కూడా లేకపోయింది.

డబ్బు సంపాదించే ఒక యంత్రంలాగా అయిపోయాడు. ఎక్కువ డబ్బు సంపాదించి కనీసం ఆంధ్ర రాష్ట్రాల ధనవంతుల లిస్టులో చోటు పట్టాలనే వెర్రి అతనికి!

ఏరోజైనా తను చూసే సినిమాలలో పద్మజాను చూస్తే...ఎక్కడో చూసినట్టుందే...?’ అని అనుకోవటంతో సరి!

                                                                              ***********************

తిన్నగా బీచ్ కు తీసుకు వెళ్ళి కారును ఆపిన పద్మజానే మొదటగా నోరు తెరిచింది.

శ్రీ...

చెప్పు పద్మినీ...?”

నీకు పెళ్ళి అయ్యిందా...?”

ఇంకా లేదు...

ఎందుకని...?”

ఏమంత తొందర...? ఇంకా కొంచం డబ్బు సంపాదించిన తరువాతే పెళ్ళి గురించి ఆలొచించాలి అనుకుంటున్నా...అది సరే...నీకు పెళ్ళి అయ్యిందా...?” --అడిగిన అదే సమయం, పెళ్ళి అయ్యుండకూడదు అని మనసులోనే వేడుకున్నాడు.

నాకు అయ్యుంటే ప్రపంచానికే తెలిసుంటుందే...నాకనే మనిషి ఇప్పుడే కదా దొరికేరు...

అయ్యో! నా తలమీద పెద్ద బండరాయి పడేసావేఅని మనసులో మదన పడుతూ, దొంగ ఉత్సాహంతో అలాగా...ఎవరు అదృష్టవంతుడు...?” అని అడిగాడు.

నా మనసును దోచుకున్న అతను ఒక అందగాడు, చాలా రోజులుగా అతన్ని నా మనసారా ప్రేమిస్తున్నాను. కానీ, అతనికి నేను నచ్చానా లేదా అనేది ఇంకా తెలియలేదు

ఏమిటి పద్మినీ...ఎందుకిలాంటి ఒక అనుమానం? ఇంత అందం, పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఉన్న నిన్ను వద్దుఅని చెప్పగలిగే అతను ప్రపంచంలోనే అత్యంత మూర్ఖుడై ఉంటాడు...చెప్పు...ఎవరా అందగాడు?” ఆందోళనతో అడిగాడు శ్రీనాద్.

అతను ఒక మేధావుడా...లేక అత్యంత మూర్ఖుడా అని తీర్మానించుకోబొయేది ఇతనే శ్రీ... అన్న ఆమె తన హ్యాండ్ బ్యాగులో నుండి మొహం చూసుకునే అద్దం తీసి అతనికి చూపించింది పద్మినీ. 

ఆనంద షాకులో ఊగిపోయాడు శ్రీనాద్!

తన స్కూలు కాలంలోనే అతనిపైన ఉన్న ప్రేమను గీతగీసి చూపిన పద్మినీ, అదే ప్రేమ ఇంకా చిగురించే ఉండటం వలన ఇంకెవరినీ తన మనసు అంగీకరించలేదనేది ప్రేమతో కలిపి, కరిగి, కన్నీటితో చెప్పగా...అదంతా పట్టించుకోని శ్రీనాద్, పద్మినీని పెట్టుకుని ఎలా డబ్బు సంపాదించాలి అని ప్లాను వేసుకోవటంలోనే శ్రద్ద పెట్టాడు.

రోజు నుండి పద్మినీ శ్రీనాద్ మీద ప్రేమలో పడి తనని తాను మరచి శ్రీనాద్ చెప్పే మాటలకు కట్టుబడే యంత్రంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా ఆమెతో పాటూ అతను ఉంటాడు. 

రోజు నుండి ఆమె యొక్క సంపాదన - ఖర్చు, ఆస్తి వివరాలు అన్నీ శ్రీనాద్ దగ్గరే. చివరికి తన ప్రేమ నెగ్గిందనే ఆనందంతో ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగిరేలాంటి ఉత్సాహం పద్మినీ దగ్గర ఉంది.

పేరు పొందిన నటి అనే ఆమె పలుకుబడిని ఉపయోగించి మత్తు పధార్ధాలు(డ్రగ్స్) అడ్డు లేకుండా అన్ని చోట్లకూ సరఫరా చేశాడు, దేశం దాటించాడు. తాను అనుకున్నంత డబ్బు సంపాదించిన తరువాత పద్మినీని వదిలేసి...మంచి కుటుంబ స్త్రీని చూసి పెళ్ళి చేసుకుని, బయటి దేశానికి వెళ్ళి సెటిల్ అయిపోవాలని పథకం వేసుకున్నాడు.

అందువల్ల పద్మినీ పెళ్ళి గురించి మాట్లాడినప్పుడల్లా, ఆమెకు అనుమానం కలగ కూడదనే కారణంతో ఏదైనా ఒక కారణం చెప్పి వాయిదా వేస్తాడు. అప్పుడంతా ఆమె దగ్గర ఏదో ఒక నీరసం. నటించటానికే ఇష్టం ఉండేది కాదు. నటనకు ఒక ముగింపు పెడతాను అని ఆమె చెబితే, ఆందోళన పడతాడు.

మన పెళ్ళి తరువాత నువ్వు నటించనే కూడదు పద్మినీ. నువ్వు, నేనూ, మన పిల్లలూ అంటూ మన ఇల్లు ఒక ఆనంద నిలయంగా ఉండాలి. ఇంకా కొన్ని రోజులు మాత్రం నటించరా బుజ్జీ... అంటూ ఆమె దగ్గర బాగానే నటించేవాడు. నటననే తన ప్రొఫెషన్ గా పెట్టుకున్న పద్మజా అతని నకిలీ నటనను అర్ధం చేసుకోలేకపోయింది!

కానీ, దేవుని దగ్గర, ప్రకృతి దగ్గర...మరియూ కాలం దగ్గర అతని నటన చెల్లుబడి కాదనేది త్వరలోనే తెలుసుకో గలిగే సందర్భం వచ్చింది.

స్కూలు పిల్లల దగ్గర, డ్రగ్స్ అమ్మటానికి ప్రయత్నించిన ఒక సమాజ ద్రోహుల ముఠాను ఒకరిచ్చిన సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ముఠా ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ పంపిణీ చేస్తున్న నెట్ వర్క్ మొత్తం పట్టుబడింది. శ్రీనాద్ తనకీ, డ్రగ్స్ వ్యవహారానికీ ఎటువంటి కనెక్షన్ లేదని, అంతా నటి పద్మజా ద్వారా జరిగి ఉండవచ్చని ఆమె మీదకు నెట్టాడు.

పద్మినీని ఖైదు చేశారు పోలీసులు. ఆమెను జామీన్ మీద కూడా బైలులో బయటకు తీసుకు రావటం కష్టం అయ్యింది. ఆమె శ్రీనాద్ చూపిన చోట్లలో సంతకాలు పెట్టి, చెయ్యని నేరానికి ఖైదు చేయబడి జైలులో ఉండబోతోందనే శోకం ఒకటైతే...అంతకంటే పెద్ద శోకం ఆమె మొత్త ఆస్తులను శ్రీనాద్ తన పేరుకు  మార్చుకున్నది కూడా ఆమె తెలుసుకోలేకపోవటమే!

శ్రీనాద్ తనకు చేసిన మొత్త ద్రోహాన్ని తన లాయర్ మరియు ఆడీటర్ ద్వారా తెలుసుకుని కృంగిపోయింది పద్మినీ. కోర్టుకు వెళ్ళే దోవలో, తన ఇంటిని చూడాలని ఆశగా ఉన్నదని పోలీసులను బ్రతిమిలాడింది...ఆమె నిరపరాధి అని తెలుసుకున్నా కూడా, సాక్ష్యాలు ఆమెకు ఎదురుగా ఉన్నందున ఆమె నేరస్తురాలిగా నిలబడ్డదే అనే జాలితో...పది నిమిషాలలో వచ్చేయాలనే కండిషన్ మీద ఆమెను ఇంటి లోపలకు అనుమతించారు. 

ఇంట్లోకి వెళ్ళిన ఆమె, తన గదిలో ఉన్న తుపాకీని తన చీరలో దాచుకుని, శ్రీనాద్ ని వెతుక్కుని వెళ్ళింది. బాగా తాగిన మత్తులో ఉన్నాడు అతను. పద్మినీని చూడంగానే తడబడ్డాడు.

ఏయ్...నువ్వెలా ఇక్కడికి వచ్చావు...నిన్ను నేను పూర్తి సాక్ష్యాలతో పోలీసులకు పట్టించేనే...! నువ్వు కరిగి, కరిగి నన్ను ప్రేమించేవే...దానికి నేనిచ్చిన ప్రేమ బహుమతే ఇది. ఎలా ఉంది నా తెలివితేటలు...?”

అలాగా? అవునూ, ఇవన్నీ నాకు తెలియకుండా నువ్వు ఎలా చేసావు...? నేను ఎలాగూ జైలుకు వెళ్ళబోతాను. దానికి ముందు ఎలా జరిగిందో నీ దగ్గర నుండి తెలుసుకుందామని. ప్లీజ్...

అదా...రోజూ నీకు తెలియకుండా నీ భోజనంలో నేను కొంచం కొంచంగా మత్తు మందు (డ్రగ్స్) ను చేర్చేస్తాను. నువ్వు మత్తులో, నేను చెప్పిన చోట అంతా, జాపిన కాగితాలపై సంతకాలు పెట్టేశావు... అని జరిగినదంతా అహంబావంతోనూ, అతి తెలివి తేటలతో చెప్పాడు.

ఒరే పాపీ...నిన్నే నమ్ముకున్న నన్ను ఇలా జైలుకు పంపించావే. నువ్వు ప్రాణాలతోనే ఉండకూడదు... అని తుపాకీతో అతని దగ్గరకు వెళ్ళింది.

మత్తులో ఊగుతున్న అతను, తుపాకీతో నిలబడున్న పద్మినీని చూసి భయపడి ప్లీజ్ పద్మినీ...నన్ను మన్నించు. నన్ను చంపకు... శ్రీనాద్ కళ్ళల్లో భయం తాండవమాడింది. మొహం చెమటతో  తడిసిపోయింది.

మన్నించటమా...? నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను వెయ్యిసార్లు చంప వచ్చురా. చచ్చిపో... కోపం నిండిన ఉగ్రరూప ముఖంతో ట్రిగర్ ను నొక్కింది పద్మజా.

కానీ బుల్లెట్టు దూసుకుపోలేదు.

పెద్ద నిట్టూర్పు విడిచాడు శ్రీనాద్. ఒక అడుగు ముందుకు వేశాడు.

ఏంటి చూస్తున్నావు...? కావాలనే ఒక బులెట్ వేయకుండా పెట్టుకున్నాను. ఇక్కడ చూడు... అంటూ దగ్గరున్న పూల కుండీ మీద కాల్చింది. అది తునాతునకలయ్యింది.

ఇప్పుడు ఖచ్చితంగా బులెట్టు నిన్ను చిల్లు చేయబోతుంది...స్టడీగా గురి చూసింది.

నో...నన్ను వదిలేయి. ప్లీజ్... భయంతో మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

ఈజీ అయిపోయింది. గబుక్కున దగ్గరకు వెళ్ళి తుపాకీని అతని నుదుటి మీద పెట్టి ట్రిగర్ నొక్కింది.

నో... కళ్ళను గట్టిగా మూసుకుని, అరిచాడు శ్రీనాద్.

క్లిక్ఈసారి కూడా తుపాకీ పేలలేదు. దిగ్భ్రాంతితో చూశాడు శ్రీనాద్.

వేసున్న ఒకే బులెట్టును పూల కుండీపై కాల్చి ఖాలీ చేసాను. ఇదిగో తుపాకీ. నువ్వే ఉంచుకో... అతని చేతికి తుపాకీ ఇచ్చి నవ్వింది పద్మజా.

లేచి నిలబడి అర్ధంకాక చూశాడు.

గది గుమ్మం వైపుకు నడుస్తున్న పద్మజా నిలబడి వెనక్కి తిరిగింది.

తుపాకీలో బుల్లెట్టు వేసి కాల్చుంటే చాలా ఈజీగా చనిపోయేవాడివి...కానీ, నేను  నిన్ను చంపిన దానికి నా మిగిలిన జీవితం వేస్టు చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు బులెట్టు లేని తుపాకీ ఉంచుకునే నిన్ను రెండుసార్లు చంపేశాను. ఇది చాలురా నాకు. ఇక ఎప్పటికీ నా ముఖాన్ని చూడకు. ఒకవేల నా కళ్ళల్లో పడితే అప్పుడు చంపకుండా వదిలిపెట్టను జాగ్రత్త... మర్చిపోయాను. నువ్వెలాగూ నాకు కనబడవునీకు మరణ శిక్ష ఖాయం. నిన్నెలాగూ ఉరి తీస్తారు. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లలకు డ్రగ్స్ అమ్మావు. దీనికి నీకు ఎటువంటి దయా దాక్షిణ్యం చూపరు.

పిచ్చి పట్టిన వాడిలాగా చూస్తూ నిలబడ్డాడు శ్రీనాద్.

పిచ్చి వాడిలాగా నిలబడున్న అతన్ని ఎవరో ముట్టుకున్నట్టు అనిపించటంతో వెనక్కి తిరిగిన అతను, తన చుట్టూ పోలీసు గుంపు నిలబడి ఉండటాన్ని చూసి తప్పించుకు పారిపోదామనుకున్నాడు.

నీ ప్లానంతా మా దగ్గర చెల్లుబడి కాదు తమ్ముడూ...ఇక్కడ జరిగినదంతా మేమూ, పద్మజా మేడం కలిపి వేసిన నాటకం. ఇక్కడ జరిగినదంతా రికార్డు అయ్యి ఉంది.

అది మాత్రమే కాదు. జూం వీడియోలో కేసును జరుపుతున్న న్యాయాధిపతి అయ్యగారు కూడా చూసాశారు. నడు. నడు...కోర్టుకు వెళదాం " అంటూ అతని చేతికి సంకెళ్ళు వేశారు.

చేసిన తప్పుకు దేవుడు అప్పటికప్పుడే శిక్ష వేస్తాడుఅనేది అర్ధం చేసుకున్న వాడిలా...పోలీసు జీపులో ఎక్కి కూర్చున్నాడు శ్రీనాద్

**************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)