టర్నింగ్ పాయింట్...(కథ)
టర్నింగ్ పాయింట్ (కథ)
కన్నవారు ఎంత చెప్పినా, ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని ఉదాహరణలు చూపినా వినని బిడ్డలు, తమ మొండితనంతో, పట్టుదలతో, ఈగోతో తమ జీవితాలను పాడుచేసుకుంటారు. తల్లి-తండ్రులు తమ బిడ్డల మొండితనం గురించి ఎవరికీ చెప్పుకోలేక, తమ బిడ్డల భవిష్యత్తు గురించి కలత చెందుతూ మనోవ్యాధులకు లోనవుతారు. ఇల్లాంటి మనస్తత్వం ఉన్న బిడ్డలకు ఎవరు సలహాలు ఇచ్చినా ప్రయోజనం లేదు. వారికి తమ కళ్లతో తామే స్వయంగా ఎంకో జీవిత బంధుత్వాన్ని చూసి జీవితం అనేది ఒక అడ్జెస్ట్ మెంట్ తోనే ఆనందమయమవుతుందని గ్రహిస్తేనే వారి జీవితాన్ని వారు చక్కబెట్టుకుంటారు.
ఇదే ఈ కథలో జరిగింది. చదివి తెలుసుకోండి.
*********************************
“సుజాతా! కాఫీ తీసుకురామ్మా! అంకుల్ పద్మనాభం గారు వచ్చారు!”
శివరాం గొంతు
వినబడటంతో ఆయన
కూతురు సుజాతా, కాఫీ
తీసుకు వచ్చి
ఇచ్చింది. ఆమె
మెడలో తాడు
మాత్రమే కనబడింది.
నగ ఏదీ
లేదు. పద్మనాభం
గారు అది
గమనించారు.
“శివరాం!
ఇంకా ఎంతో
జీవితం గడపాల్సిన
నీ కూతురు
సుజాతా ఇలా
జీవితం ముగిసిపోయినట్టు
నీ ఇంటికి
వచ్చి నెలలు
అయిపోయిందే! ఆమెను
అత్తగారింటికి
పంపటం గురించి
ఏదైనా నడవడిక
తీసుకున్నావా?”
“నేనేం
చేయను. అత్తగారూ--కోడలు
సమస్య అందరి
ఇళ్ళల్లోనూ ఉంటూనే
ఉన్నది. ఇది
దానికోసం అత్తగారితో
గొడవపడి వచ్చేసింది.
నేనూ బుద్దిమతులు
చెబుతూనే ఉన్నాను!
ఎన్ని చెప్పినా
మార్పు రావటం
లేదు. బలవంతంగా
తీసుకువెళ్ళి దింపలేను
కదా”
“నీకు
ఎలాంటి అభ్యంతరమూ
లేకపోతే సుజాతాను
మా ఇంట్లో
కొన్ని రోజులు
ఉంచుకుంటాను.
ఆమెకూ ఒక
చేంజ్ గా
ఉంటుంది. ఏం
చెబుతావు?”
“దారాళంగా...ఆమె
ఇష్టాన్ని అడిగి
తీసుకు వెళ్ళు...నేనేమన్నా
వద్దనా చెప్పబోతాను”
సుజాతాను పిలిచి
ఆమె అంగీకారాన్ని
అడిగారు శివరాం.
అభ్యంతరమేమీ చెప్పకుండా
పద్మనాభం గారి
ఇంటికి వెళ్ళటానికి
అంగీకరించింది
సుజాతా.
పద్మనాభం గారి
ఇల్లు.
సుజాతా అక్కడకు
వచ్చి రెండు
రోజులయ్యింది.
పద్మనాభం గారికి
ఒక కొడుకు.
పెళ్ళి చేసుకుని
ఉమ్మడి కుటుంబంగానే
ఉంటున్నాడు.
ఆయన కొడుకు
చంద్రం, మరియు
కోడలు సంగీతా
ప్రేమగా ఉండటం
చూసింది సుజాతా.
వంట గదిలో
నుండి సంగీతాని
పిలిచారు ఆమె
అత్తగారు రాజం.
“సంగీతా!
వాషింగ్ మిషెన్లో
బట్టలు వేసి
ఉతకమని చెప్పానే!
బుద్ది లేదా? అది
వదిలేసి ఇంకేం
చేస్తున్నావు నువ్వు? వెంటనే
నేను చెప్పింది
చెయ్యి!” ఆర్డర్ వేసింది
రాజం.
“అత్తయ్యా!
ఇదిగో చేస్తున్నా!” చురుకుగా
ఏ విధమైన
మొహ చిట్లింపు
లేకుండా ఆ
పని మొదలు
పెట్టింది సంగీతా.
అప్పుడప్పుడు రాజం
తన కోడల్ని
తరుముతూ పనిచేయించు
కొవటం గమనిస్తూనే
ఉన్నది సుజాతాకి.
అయినా కానీ
సంగీతా ఎటువంటి
విసుగూ, కోపమూ
చూపించకుండా, అత్తగారు
చెప్పింది అట్లాగే
విని తన
పనులను చక్కగా
చేసి చూపించింది.
మధ్యాహ్న సమయం.
తన కొడుకూ, కోడలూ
ఇద్దర్నీ పిలిచి
వాళ్ళ పెళ్ళి
రోజు వస్తున్నదని
చెప్పి కొత్త
బట్టలు కొనుక్కోటానికి
వెళ్ళమని పంపించింది
రాజం.
అప్పుడు సుజాతా
పక్కగా పద్మనాభం
గారు వచ్చారు.
ఒక విధమైన
మనో భావంతో
ఆయన్ని చూసింది
సుజాతా.
“అంకుల్!
ఈ రోజు
సాయంత్రం నన్ను
మా ఇంటికి
తీసుకువెళ్ళి వదిలిపెట్టండి” అన్నది.
“సరేనమ్మా!
నీకు నచ్చినట్టే
చేస్తాను!” అన్నారు పద్మనాభం
గారు.
ఆ మరుసటి
రోజు తన
ఇంట్లో ఉన్నది
సుజాతా.
పద్మనాభం గారి
ఇంట్లో అత్తగారూ--కోడలూ
నడుచుకున్న తీరు
కళ్ల ముందు
మళ్ళీ తీసుకువచ్చి
చూపింది ఆమె
జ్ఞాపకాలు.
‘అత్తగారూ, కోడలూ
అంటే వేల
సమస్యలు వచ్చి
వెళతాయి. అయినా
కానీ సంగీతా
అత్తగారు కొడల్ని
చులకన చేయకుండా
కోడలు యొక్క
హక్కులను దారాళంగా
ఇవ్వటం అర్ధం
చేసుకుంది. నేనే
తొందరపడి నా
అత్తగారి దగ్గర
కోపగించుకుని పుట్టింటికి
వచ్చాశానే’ అనే
ఆలొచనతో మనసులోని
కన్ ఫ్యూజన్లు
క్లియర్ అవటంతో
ఆమెలో ఒక
క్లారిటీ వచ్చింది.
తన తండ్రి
దగ్గరకు వెళ్ళింది.
“నాన్నా!
రేపు నేను
నా భర్త
ఇంటికి వెళతాను.
ఈ రోజే
ఆయనకి సెల్
ఫోనులో ఈ
విషయం చెప్పేస్తాను.
రేపు నన్ను
తీసుకు వెళ్ళి
అక్కడ వదిలిపెట్టటానికి
రెడీగా ఉండండి!” అన్నది.
కూతురు చెప్పింది
విని సంతోషించాడు
శివరాం. తన
కూతురు, స్నేహితుడు
పద్మనాభం ఇంటికి
వెళ్ళి అక్కడున్న
కుటుంబ పరిస్థితులను
గమనించటం వలన, ఆమెకు
ఒక టర్నింగ్
పాయింట్ ఏర్పడిందని
తెలుసుకున్నారు.
“సరే
సుజాతా! రేపు
ప్రొద్దున మనం
బయలుదేరుతున్నాం!” సంతోషంగా
చెప్పారు.
*********************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి