అభిమాన దారి/కాలం మార్పు/ఆటంబాంబు…(3 మినీ కథలు)


                                                       అభిమాన దారి/కాలం మార్పు/ఆటంబాంబు                                                                                                                               (3 మినీ కథలు) 

                                                                        అభిమాన దారి...(మినీ కథ)

భారతీ! చాలా రోజుల తరువాత మా ఇంటికి వచ్చావు! ఒక్క కాఫీ అయినా తాగి వెళ్ళాల్సిందే! స్నేహితురాలిని ప్రేమగా మందలించింది వసుంధరా.

అర్జెంటు పనిమీద ఇటువైపు వచ్చాను. అలాగే ఒక్క నిమిషం నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. .కే. నీ తృప్తికోసం కాఫీ తాగుతాను! అన్నది భారతీ.

వెంటనే ఇంట్లోని వంటగది వైపు తిరిగి, కోడలుతో కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేసింది వసుంధరా.

తరువాతి రెండు నిమిషాలలో వసుంధరా కోడలు సీతా కాఫీ తీసుకు వచ్చి ఇద్దరికీ ఇచ్చింది.

కాఫీ గ్లాసును పెదాలకు తాకించిన భారతీ మొహం చిట్లించుకుంది.

"వసుంధరా! కాఫీనా ఇది. వేడి పెట్టిన కుడితి నీళ్ళు లాగా ఉందే? నువ్వు కాఫీ పెడితే అమృతం లాగా ఉంటుంది. నీకు ఇలాంటి ఒక కోడలా? కాఫీ కూడా సరిగ్గా పెట్టటం తెలియని కోడలు వచ్చి చేరిందే నీకు?” భారతీ చటుక్కున చెప్పింది. దగ్గర నిలబడున్న వసుంధరా కోడలు సీతాకి ధర్మసంకటంగా ఉన్నది. కానీ సీతా అత్తగారు వసుంధరా ఒక నవ్వును సమాధానంగా ఇచ్చింది. ఆపైన తన స్నేహితురాలితో చెప్పింది;

భారతీ! చేప పిల్లకు ఈత నేర్పించాలా ఏమిటి అని చెబుతారు. అది పుట్టిన  వెంటనే ఈత కొట్టటం మొదలుపెడుతుంది. కానీ మానవ జాతి అలా లేదే!

ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుని, నేర్చుకుని చెయ్యాల్సి ఉంటుంది. నా కోడలు కాలేజీ చదువు ముగించి, తిన్నగా ఇక్కడ నా కోడలుగా వచ్చి చేరింది.

కాలంలో నేనూ ఇంట్లో కోడలుగా వచ్చినప్పుడు, వంట ఏదీ చెయ్యటం రాని దానిగానే వచ్చాను.

అప్పుడు నా అత్తగారు మనసులో ఏదీ  పెట్టుకోకుండా నాకు వంట చేయటం పూర్తిగా అభిమానంతో నేర్పించింది. అదేలాగానే నా కోడలుకు నేను వంట నేర్పిస్తున్నాను. అభిమాన దారి ఇది! సారి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ఇష్టపడినట్లే అద్భుతమైన కాఫీ...ఎందుకూ విందు భోజనమే నా కోడలు నీకు వడ్డిస్తుంది! వివరంగా చెప్పింది వసుంధరా.

సీతా మనసు సంతోష పడింది. మూడో మనిషి ఎదురుగా తన కోడల్ని  కించపరచకుండా మాట్లాడిన తన అత్తగారు అప్పుడు ఆమెకు  దేవతలాగా తెలిసింది.

అత్తగారి ఆశీస్సులతో  త్వరలోనే విందు భోజన వంట ఎలా చెయ్యాలో నేర్చుకోవచ్చు అనే నమ్మకం ఆమె మనసులో మొలచింది.

***********************************************సమాప్తం*****************************************

                                                                     కాలం మార్పు(మినీ కథ)

నాన్నా... గట్టిగా కేకలేస్తూనే లోపలకు వచ్చాడు రమేష్.

ఏమిటయ్యా రమేష్, ఏమిటి విషయం? బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు...! అడిగాడు తండ్రి రాఘవశర్మ.

రాఘవశర్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్. కాలేజీలో ఆయన దగ్గర చదువుకుంటున్న విధ్యార్ధులందరికీ ఆయనంటే బాగా ఇష్టం. ఎందుకంటే పాఠం చెప్పేటప్పుడు, పుస్తకంలోని పాఠంతో కలిపి జీవిత పాఠాన్నీ జరుపుతారు. విధ్యార్ధులు చదువుకు తరువాత ఎటువంటి ఉద్యోగాలకు ప్రయత్నం చెయ్యొచ్చు; ఎలా ప్రయత్నించవచ్చు అనే దారి కూడా చూపిస్తారు. విధ్యార్ధుల  దగ్గర మీ గురువు ఎవరుఅని అడిగితే అందరూ ఈయన వైపే చేయి చూపిస్తారు.

తన అభిమానంతో అందరినీ కట్టిపడేసిన ఆయన తన ఒక్కగానొక్క కొడుకు, ముద్దుల కొడుకు, ఉత్సాహంగా ఉండటం చూసి సంతోషపడ్డారు.

ఏంటయ్యా, ఏం వార్త చెబుదామని వచ్చావు...చాలా సంతోషంగా ఉన్నావు?” అని అడిగారు తండ్రి రాఘవశర్మగారు.

మీరు నన్ను మోటివేట్చెయ్యటానికి ఏమిటేమిటో చెబుతారు. కానీ, మీరు  చెప్పేది నాకు బోరు కొడుతోంది నాన్నా. కానీ, నా ఫ్రెండు అజీమ్ వాట్స్ ఆప్ లో ఫార్వోర్డ్ చేసిన వాయిస్ మెసేజీలో, ఒక ప్రొఫసర్ మాట్లాడిన స్పీచ్ ఉంది. జస్ట్ పది నిమిషాలే మాట్లాడారు. వినేటప్పుడే నా శరీరంలో ఒక వేగం. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఒక పట్టుదల ఏర్పడింది నాన్నా. ఇక నా ఆలొచనా, చేష్టా పూర్తిగా నా లక్ష్యాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది నాన్నా... అన్న కొడుకును గర్వంతోనూ, తృప్తితోనూ చూశారు తండ్రి రాఘవశర్మగారు.

కొడుకు, తన గది వదిలి బయటకు వెళ్ళిన వెంటనే రాఘవశర్మగారు అతని ఫ్రెండు అజీమ్ కు ఫోను చేశారు.

అజీమ్, నువ్వు చెప్పిన ఐడియా, మంచి రిజల్ట్స్ ఇచ్చింది బాబూ. చాలా థ్యాంక్స్ బాబూ ... అన్నారు. 

చాలా సంతోషం అంకుల్. నేను చెప్పినట్టు మీరు మీ మొబైలులో ఉన్న వాయిస్ చేంజర్ ద్వారా గొంతు మార్చి మాట్లాడి రికార్డు చేసి నాకు పంపిన దాన్ని, నేను రమేష్ కు ఫార్ వోర్డ్  చేశాను. అంతే అంకుల్. నేను మీకు ఐడియా మాత్రమే ఇచ్చాను. కానీ, మోటివేట్ స్పీచ్ మీరే కదా ఇచ్చారు. స్పీచ్ వినే కదా అంకుల్ రమేష్ మారాడు. క్రెడిట్ అంతా మీకే అంకుల్. నాకెందుకు అంకుల్ థ్యాంక్స్ అన్నాడు అజీమ్.

తండ్రిలాగా సలహా ఇచ్చినప్పుడు వినని కొడుకు, ఎవరో ఒకరి లాగా చెప్పింది విని నడిచుకోవటం గురించి ఆలోచించినప్పుడు, కాలం మార్పును తలుచుకుని పెద్ద నిట్టూర్పు విడిచారు తండ్రి మరియు ప్రొఫసర్ రాఘవశర్మ.  

***********************************************సమాప్తం*****************************************

                                                                        ఆటంబాంబు(మినీ కథ)

ఒసేయ్ కోడలు పిల్లా! నన్నెందుకే ఇంత కష్టపెడుతున్నావు!

అత్తయ్యా! ఒక రెండు నిమిషాలు కదలకుండా పడుకోండి. ఎంతసేపు నేను పోరాడను?” గిరిజా ఘాటుగా జవాబు చెప్పింది.

చాలే రాక్షసీ! నేనే చూసుకుంటాను. నాకు సహాయ పడతానని చెప్పి నువ్వుగా వచ్చి, నన్ను బాధపెడుతున్నావే. నన్ను బాధపడనివ్వకే. నీకు పుణ్యం వస్తుంది అన్నది.

శారదా గారి అరుపులు, ఇంటి వాకిలి దాటి, పక్క ఇళ్ళ వరకు వినబడ్డది.

ఎదిరింటి భారతీ తన భర్తతో ఏమండీ ఎదిరింట్లో అత్తా-కోడళ్ల మధ్య పెద్ద సమస్య, గొడవ లాగుంది! ఒక సారి వెళ్ళి ఏమిటో చూసొద్దాం! అన్నది.

భారతీ! అత్తగారు, కోడలు మధ్య ఏదో ఒకటి జరుగుతుంది. దాంట్లో మనం తల దూర్చ కూడదు. అలా దూరిస్తే మన తలకే దెబ్బ తగులుతుంది అన్నాడు సుబ్బారావు.

అయినా కానీ భారతీ ఓర్పుగా ఉండలేక పోయింది. భర్తను తీసుకుని ఎదురింటికి వెళ్ళింది.

అక్కడ అప్పటికే చుట్టుపక్కలున్న ఇళ్ళవారందరూ వాకిట్లో నిలబడి లోపల జరుగుతున్నది ఏమిటనేది అర్ధం కాక, లోపలకు వెళ్ళి చూసే ధైర్యం చాలక వాకిట్లోనే నిలబడి వినిపిస్తున్న అరుపులను వింటూ వేడుక చూస్తున్నారు. వాళ్లతో పాటూ భారతీనూ, సుబ్బారావు కలిసి నిలబడ్డారు. ఓపిక పట్టలేని భారతీ కాళ్ళెత్తి కిటికీ గుండా బెడ్ రూములోకి చూసింది.

బెడ్ రూములో మంచంపై గిరిజా యొక్క అత్తగారు శారదా గారూ పడుకోనుంది. అత్తగారి కాళ్ళను పట్టుకుని ఉంది గిరిజా.

...నొప్పి. ప్రాణం పోతోంది. సూది పెట్టి గుచ్చకే!

అత్తయ్యా! అయిపోయింది. మీ అరికాలులో గుచ్చుకుపోయిన ముళ్ళును, సూది పెట్టి కెలికి కెలికి మెళ్లగా బయటకు తోసేసాను. ఇక మీకు కాలులో ముళ్ళు గుచ్చుకున్న ఇబ్బందే ఉండదు! విజయవంతంగా ఏదో సాధించిన దానిలాగా చెప్పింది గిరిజా.

అప్పుడే తన ఇంటి వాకిలి వైపు చూసింది. చుట్టుపక్కలున్న వాళ్ళంతా వచ్చి నిలబడి వేడుక చూస్తూ ఉన్నారు. గిరిజా వాళ్ల దగ్గరకు వెళ్ళింది.

ఇక్కడ ఏం జరుగుతోందని వేడుక చూడటానికి వచ్చారు? మీరనుకున్నట్టు  ఇక్కడ ఏమీ పెద్దగా, మీకు సంతోషం ఇచ్చే పనేమీ ఇక్కడ జరగలేదు. నా అత్తగారికి కాలులో ముళ్ళు గుచ్చుకుంది. సూది ఉపయోగించి దాన్ని మెల్లగా కెలికి తీసేసాను! అన్నది.

గిరిజా చెప్పింది విని ఆటంబాంబు అనుకుని వచ్చి, అది ఉత్త చిచ్చుబుడ్డి గా అయిపోవటం తెలుసుకుని మోసపోయి వెనక్కి తిరిగారు చుట్టుపక్కల ఇళ్ల వారు. అందులో భారతీ మరియు సుబ్బారావు కూడా ఉన్నారు. 

***********************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)