కొంచం మైనస్-కొంచం ప్లస్...(కథ)
కొంచం మైనస్-కొంచం ప్లస్ (కథ)
సర్వ రోగాలను దూరం చేసేది ఆనందం...అంతేకాదు ఆనందం మనుష్యులకు ఆయుష్షు పెంచుతుంది. మనిషి జీవితాంతం ఆనందంగా గడపాలంటే ఎంతో కష్టపడాలి. చాలా మంది కావలసినంత డబ్బు సంపాదిస్తే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని బ్రమలో పడతారు. కానీ అది నిజంకాదని చివరి దశలో తెలుసుకుంటారు. మనం జీవితాంతం ఆనందంగా ఉండాలంటే మన జీవితంలో మన చుట్టూ ఉండే మనుష్యులతో మనం స్నేహంగా ఉండాలి. అది జరగాలంటే మన జీవితంలో మనం కలుసుకునే ప్రతి మనిషితోనూ మనం కలుపుగోలుగా ఉండాలి. ఇది సాధ్యపడాలంటే మనం ప్రతి మనిషిలోనూ ఉన్న ప్లస్ పాయింట్లను మాత్రమే తీసుకుంటూ వాళ్ళ పరిచయాన్నీ, స్నేహాన్నీ ఎంజాయ్ చేయలి. ఎవరినీ ఎనిమీగా చూడకూడదు. అదే ఈ కథలో చెప్పబడింది. ఎవరు ఎవరికి ఇది చెప్పారో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
****************************************************************************************************
ప్రొద్దున ఏడు
గంటలు!
హైదరాబాద్ లో
వర్కింగ్ వుమెన్స్
హాస్టల్లో ఉంటూ, ఉద్యోగం
చేస్తున్న తన
కూతురు మాధవీ, ఆ
రోజు ఊరు
వస్తున్నట్టు నిన్ననే
ఫోన్ చేసి
చెప్పింది. ఆమెను
తీసుకురావటానికి
బస్సు స్టేషన్లో
కాచుకోనున్నారు
కోటేశ్వర రావ్.
ఆమె వస్తున్న
బస్సు చాలా
సేపు అయిన
తరువాత బస్సు
స్టేషన్లోకి దూరింది.
పెద్ద పెద్ద
సూట్ కేసులనూ, రాత్రి
ప్రయాణ బడలికను
వీపు మీద
మోసుకుని ప్రయాణీకులు
ఒక్కొక్కరుగా దిగ, మాధవీని
వెతికారు కోటేశ్వర
రావ్.
“ఏమిటిది...దగ్గర
దగ్గర అందరూ
దిగిపోయారు...ఇది
కనబడదేం?” ఆందోళన
చెందారు. ఆయన
ఓర్పును పూర్తిగా
శోధించి, చివరిగా
దిగింది ఆమె.
గుంపును తోసుకుంటూ, ఆమె
దగ్గరకు చేరిన
ఆయన, “ఏమ్మా...ఇంత
ఆలస్యం అయ్యింది...దార్లో
ఏదైన సమస్యా?” అని
అడిగారు.
“అవును
నాన్నా...వచ్చే
దారిలో ఒక
యాక్సిడెంట్...ట్రాఫిక్
జామ్...అందుకే!”
“సరి...సరి...రా...బైకును
బస్సు స్టేషన్
కు బయట
నిలబెట్టి ఉంచాను...ఆలాగే
వెళ్ళిపోదాం” చెబుతూనే
ఆయన ముందు
నడవగా, ఆయన
వెనుకే నడిచింది
మాధవీ.
***********************
ప్రొద్దున పదకుండు
గంటల సమయంలో, రిలాక్స్
గా కూర్చుని
టీ.వీ
చూస్తున్న మాధవీని, ఆమె
తల్లి అనుసూయమ్మ
అడిగింది. “ఏమిటే
హఠాత్తుగా బయలుదేరి
వచ్చావు? ఆఫీసు
లీవా?”
“ప్చ...లీవంతా
ఏమీ లేదమ్మా...నేనే
లీవు పెట్టి
వచ్చాను”
“ఏం...ఏమైంది? ఒళ్ళు
గిళ్ళు సరిగ్గా
లేదా?” ఆందోళన
చెందింది అనుసూయమ్మ.
“అయ్యో...ఒళ్ళు
కేమీ లేదు...మనసుకు
నచ్చలేదు...అందుకే
వచ్చేశాను” విసుగ్గా
చెప్పింది
మాధవీ.
“ఏమన్నావు? మనసుకు
నచ్చలేదా? ఏది
నచ్చలేదు?...ఉద్యోగమా?....హాస్టలా? లేక
ఆ
ఊరే నచ్చలేదా? ఇందులో
ఏది నచ్చలేదో
చెప్పు” ఇప్పుడు తల్లి
విసుక్కుంది.
“హూ...నాతో
పాటూ స్టే
చెస్తున్న రూమ్
మేట్స్ నచ్చలేదు...నా
పక్క రూములో
ఉన్న లేడీస్
నచ్చలేదు...ఆ
హాస్టల్ వార్డన్
బండ గుమ్మడికాయ
నచ్చలేదు...చాలా?”
కొంచం దూరంగా
కూర్చుని ఇదంతా
వింటున్న తండ్రి
కోటేశ్వర రావ్
లేచి కూతురు
దగ్గరకు వచ్చాడు.
“ఏమ్మా...నీ
రూములో నీతో
పాటూ ఇద్దరే
కదా కలిసున్నారు? ఒకమ్మాయి
గుంటూరు! ఇంకో
అమ్మాయి!?”
“నెల్లూరు...” అన్నది మాధవీ.
“వాళ్ళిద్దర్నీ, ఆ
రోజు ఆ
హాస్టల్లో నిన్ను
చేర్చటానికి వచ్చినప్పుడు
నేను చూసి
మాట్లాడేనే...మంచి
వాళ్ళుగానే కనబడ్డారు”
“అయ్యో...పైకి
చూస్తే అలాగే
కనబడతారు...లోతుగా
స్నేహం చేసి
చూస్తేనే వాళ్ళ
నిజ స్వరూపం
తెలుస్తుంది”
“ఏమిటే...పెద్ద
నిజ స్వరూపం
చూశావు?” అనుసూయమ్మ
కోపగించుకుంది.
“అమ్మా...ఆ
గుంటూరు పిల్ల
సుధా ఉన్నదే...అబ్బబ్బ, అదొక్కతే
లోకంలో శుబ్రమైనది
అయినట్లు నడుచుకుంటుంది.
పది నిమిషాలకు
ఒకసారి మొహమూ, కాళ్ళూ
చేతులూ కడుగుతూనే
ఉంటుంది. రోజూ
బట్టలు ఉతుకుతుంది...రోజూ
బెడ్ షీటు, దిండు
గలీబులనూ ఉతుకుతుంది.
అదేలాగా తన
వస్తువులను తళతళమని
మెరిసేలాగా తుడిచి
మిగిలిన వాళ్ళు
ఎవరూ ముట్టుకోకూడదన్నట్టు
దూరంగా ఉంచుతుంది.
రూములో కొద్దిగా...కొంచంగా
చెత్త పడితే
చాలు ‘ధామ్...ధూమ్’ అని
గెంతులేస్తుంది.
ఇదేమో పెద్ద
రాజభవనంలో నివసిస్తున్న
మహారాణి లాగా...మిగిలిన
వాళ్ళంతా మురికివాడ
నుండి వచ్చినట్టు
అనుకుని మమ్మల్నంతా
హేళనగా చూస్తుంది.
అందులోనూ నేను
కొంచం నలుపుగా
ఉన్నానా...నన్ను
పూర్తిగా వేరు
చేసి పెట్టేసింది”
“హూస్...ఇంతే
కదా? అన్నిటిలోనూ
శుభ్రంగా ఉండాలని
ఆమె అనుకుంటోంది...అది
తప్పు కాదే?”
“అందుకని
మిగిలిన వాళ్ళను
హేళనగా చూడకూడదు
కదా?”
చిన్న నవ్వుతో
అనుసూయమ్మ మౌనంగా
ఉండగా, మాధవీ
కంటిన్యూ చేసింది.
“అది
అలాగా? ఆ
నెల్లూరు అమ్మాయి
ఉందే...అది
దీని కంటే
ఎక్కువ. ఏదో
ఒక కంపెనీలో
సీనియర్ మేనేజర్
గా ఉందట...అందుకని
ఆ అధికారాన్నంతా
తీసుకు వచ్చి
ఇక్కడ హస్టల్
లోనూ చూపిస్తారా? ఎప్పుడు
చూడు అందరినీ
అధికారం చేయటమే
ఆమె పని...అదేమిటో
అందరం ఆమె
కింద పనిచేసే
అసిస్టంటుల లాగా
‘ఇది
చెయ్యకు -- అది
చెయ్యకు’, ‘ఇది
అక్కడ పెట్టు
-- అది ఇక్కడ
పెట్టు’ అంటూ
ఆమె చేసే
గయ్యాలితనం ఉన్నదే
అది అంతా
ఇంతా కాదు”
రెండు మనసులనూ
రెండు కళ్ళుగా
పెట్టుకుని అభినయం
చేస్తూ చూపించింది
మాధవీ.
విసుగెత్తి పోయింది
అనుసూయమ్మకి. “ఇంతేనా...ఇంకా
ఉందా?” అని
అడిగింది.
“తరువాత
పక్క రూము
ఆడపిల్లలు...వాళ్ళను
అమ్మాయలూ అని
చెప్పటం కంటే, మగవాళ్ళు
అని చెప్పొచ్చు.
అంత తల
గర్వం, దర్జా, పొగరు...హాడావిడి
తనం...హూ”
“హాస్టల్
వార్డన్ని వదిలేశేవే” అనుసూయమ్మ
అందించింది.
“ఆ...కరెక్టు.
బాగా గుర్తు
చేసావు. ఆ
వార్డన్ బండ
రాములు ఉందే, అదే
బండ గుమ్మడికాయ....దానికి
అదొక పెద్ద
సినీ నటీ
అని అనుకుంటుంది.
సినీ నటీ
లాగా ఫోజు.
ఎప్పుడు చూడు
మేకప్...మేకప్...అదేలాగా
తాను బాగా
స్ట్రిక్టుగా ఉండాలని
చూపించుకోవటానికి
ఆమె చేసే
యాక్టింగ్ ఉందే, దాన్ని
గురించి చెబూతూ
వెళ్ళొచ్చు...ఒక
రోజు సరిపోదు”
“మొత్తానికి
అక్కడ ఎవరూ
సరిలేరు...అంతే
కదా?”
“అందుకే
కదా బయలుదేరి
వచ్చాశాను”
తలను అటూ, ఇటూ
ఊపుతూ అక్కడ్నుంచి
జరిగిన అనుసూయమ్మ, వాకిట్లో
నిలబడి
ఎవరో పిలుస్తున్న
కేక వినబడటంతో, వెళ్ళి
చూసింది. పక్కింటి
ఆడీటర్ భార్య
భారతి.
ఆమెను చూసిన
వెంటనే ఒళ్ళు
మండిపోయింది మాధవీకి.
పోయిన సారి
తను ఇక్కడికి
వచ్చినప్పుడు, అమ్మకూ, భారతికూ
జరిగిన పోట్లాటను
ఆ వీధిలో ఉన్న
వాళ్ళందరూ వేడుక
చూశారు.
ప్రతి విషయాన్నీ
తప్పుగా అర్ధం
చేసుకుని వెంటనే
ఉగ్ర మూర్ఖత్వంతో
గొడవపడే తొందరపాటు
గుణం కలిగినది
ఆ భారతి.
అందులోనూ గొడవపడేటప్పుడు
ఆమె మాట్లాడే
మాటలూ, ఆమె
చూపే అసహ్యకరమైన
అభినయాలూ సెన్సారు
బోర్డు అధికారులు
చూస్తే ఆలొచించకుండా
పది ‘ఏ’ సర్టిఫికేట్లు
ఇస్తారు. అంత
అశ్లీలం జల్లుతుంది.
‘ఈమె
ఎందుకు మళ్ళీ
మనింటికి వస్తోంది?’ ఆలొచించిన
మాధవీకీ, ఇంకొక
ఆశ్చర్యం కనబడింది.
ఆ భారతీనూ, తన
తల్లీ అనుసూయమ్మానూ
చాలా సాధారణంగా
మాట్లాడుకుంటున్నారు.
‘ఛ...ఇదేమీ
దరిద్రం? ఆ
రోజు అలా
ఊరంతా చూసేటట్టు
పోట్లాడుకున్నారు...ఈ
రోజు ఇలా
ఇక ఇకలు
- పకపకలు...ఛ...ఛ, ఏం
మనుషులో?’
“అరెరే..
మాధవీ వచ్చుందా?” అక్కడ్నుంచే
ఆ భారతీ
అడగ,
“అవును...ఈ
రోజు ప్రొద్దున్నే
వచ్చింది” అన్నది అనుసూయమ్మ.
“ఎందుకనో
కొంచం చిక్కినట్టు
కనబడుతోందే?”
“హాస్టల్
భోజనంలో ఏం
బలం ఉండబోతుంది?” అన్నది
అనుసూయమ్మ.
కొద్ది సమయంలో
ఆ భారతీ
వెళ్ళిన వెంటనే, మాధవీ
తల్లి దగ్గరకు
వచ్చి చిటపట
లాడింది.
దానికి సమాధానంగా
నవ్వు మాత్రమే
దొరికింది.
*************************
సాయంత్రం నాలుగు
గంటలు ఉంటుంది.
ఇంటి ముందు
ఒక ఆటో
వచ్చి నిలబడింది.
అందులో నుండి
ఇద్దరు స్త్రీలు, ఒక
మధ్య వయసు
మగాయన దిగి
వచ్చారు. అప్పుడే, భోజనం
ముగించుకుని, హాలులో, నేల
మీద, ఫ్యాను
కింద పడుకోనున్న
అనుసూయమ్మానూ - మాధవీనూ
వాళ్ళు రావటం
గమనించి, గబగబా
లేచి నిలబడ్డారు.
“ఏమ్మా
అనుసూయా...మధ్యాహ్నం
నిద్రను చెడిపేసానా?” అడుగుతూ
బయటకి “హీ...హీ” అని ఫార్మాలిటీకి
నవ్వింది ఒక స్త్రీ.
“ఇది
మాధవీ కదా? బాగా
ఎదిగిపోయింది...మా
ఇంట్లో మీరు
అద్దెకు ఉన్నప్పుడు
చిన్న పిల్లగా
ఉండేది...” ఆ వ్యక్తితో
వచ్చున్న స్త్రీ
అనుసూయమ్మని చూసి
చెప్ప,
“అయిందే...దగ్గర
దగ్గర పదిహేను
సంవత్సరాలు”
వచ్చిన వాళ్ళు
తాము తీసుకు
వచ్చిన తమ
కూతురి పెళ్ళి
పత్రికను అనుసూయమ్మ
దగ్గర ఇచ్చి
“ఖచ్చితంగా
అందరూ కుటుంబంతో
కలిసి రెండు
రోజులు ముందే
వచ్చేయాలి...” అని చెప్పి
వెళ్ళిన వెంటనే
మాధవీ అడిగింది.
“ఏమ్మా...నేను
చిన్న పిల్లగా
ఉన్నప్పుడు వీళ్ళ
ఇంట్లోనే కదా
అద్దెకు ఉన్నాము?”
“అవును...దగ్గర
దగ్గర పదమూడు...పద్నాలుగు
సంవత్సరాలు ఉన్నాము”
“తరువాత
ఏమైంది?”
“ఒక
చిన్న సమస్య
వలన గొడవ
వచ్చింది. అప్పుడు
ఈ మనిషి
ఒకే రోజులో
మనల్నిఇల్లు ఖాలీ
చేసి వెళ్ళిపొమ్మాన్నాడు”
“సరే...అప్పుడు
అలా నడుచుకున్న
మనిషి, ఇప్పుడు
ఏ మొహం
పెట్టుకుని ఇక్కడకు
వచ్చి పెళ్ళి
ఆహ్వాన పత్రిక
ఇచ్చి వెళుతున్నాడు...అందులోనూ
రెండు రోజులు
ముందే రావాలట...సిగ్గులేని
రాస్కల్” తిట్టి తీర్చింది
మాధవీ.
“మాధవీ...ఒక్క
నిమిషం...ఒక్క
నిమిషం! ఈ
లోకంలో నువ్వు
నేర్చుకోవలసింది
చాలా
ఎక్కువ ఉంది.
అందరి మనుష్యుల
దగ్గర ప్లస్
పాయింట్లూ ఉంటాయి...మైనస్
పాయింట్లూ ఉంటాయి.
మనం వాళ్ళ
దగ్గరున్న ప్లస్
పాయింట్లను ఎంజాయ్
చేయాలి...మైనస్
పాయింట్లను డైజస్ట్
చేసుకోవాలి! అదే
జీవిత సిద్ధాంతము...అర్ధమయ్యిందా?”
ఆమె అర్ధం
కాక చూసింది.
“ఇక్కడకు
వచ్చి వెళ్ళిందే
భారతీ...అదొక
గొడవ మనిషి...బజారీ...ఆలోచించకుండా
నోటికి వచ్చినట్టు
మాట్లాడుతుంది.
అది ఆమె
యొక్క మైనస్
పాయింటు. అదే
సమయం ఆమె
దగ్గర ఉన్న
ప్లస్ పాయింట్
ఏమిటో తెలుసా.
ఒకరితో స్నేహంగా
ఉంటే,
పూర్తి మనసుతో, నిజమైన
అభిమానంతో స్నేహం
చేస్తుంది. కల్లాకపటం
తెలియదు. అహంకారం
తెలియదు. ఎంత
గొడవపడ్డా కూడా
వెంటనే మర్చిపోయి
సహజంగా వచ్చి
కలిసిపోయే మనసున్నది.
మిగిలిన వాళ్ళలాగా
అదంతా ద్వేషంగా
పెట్టుకుని పగ
తీర్చుకునే మనిషి
కాదు.
ఒక్క మూడు
రోజులు కలిసినట్టుగా
నన్ను చూడకపోతే
వెంటనే ఇల్లు
వెతుక్కుంటూ వచ్చి
‘ఒళ్ళు
ఏమన్నా బాగుండలేదేమో
అని భయపడిపోయానూ
అంటూ నిజమైన
శ్రద్దతో విచారిస్తుంది...”
ఆలొచనతో తల్లినే
చూసింది మాధవీ.
“అదేలాగానే
పాత ఇంటి
ఓనర్. ఏ
సమస్య కొసం
ఆయన మనల్ని
ఇల్లు ఖాలీ
చేయమన్నారో...ఆ
సమస్య యొక్క
నిజ స్వరూపం
తెలుసుకున్న వెంటనే...అందులో
మన తప్పు
ఏమీ లేదని
తెలిసిన వెంటనే
అంత పెద్ద
మనిషి, వయసులో
చిన్నదాన్ని అయిన
నా దగ్గరకు
వచ్చి క్షమాపణలు
అడిగాడు. ఒకటి
తెలుసుకో మాధవీ...క్షమాపణలు
అడిగే మనసు
ఎవరికీ రాదే...”
“...................” మౌనంగా
ఉన్నది.
“తరువాత
ఇందులో ముఖ్యమైన
విషయం ఒకటి ఉంది.
ఒక చిన్న
సమస్య కోసం
ఆయన ఆ
రోజు మనల్ని
ఇల్లు ఖాలీ
చెయ్యమని చెప్పటమే
మీ నాన్నను
సొంత ఇల్లు కట్టుకోమని
ప్రేరేపించింది.
కట్టి ముగించారు.
లేకపోతే ఇంకా
మనం అద్దె
కొంపలలోనే ఉండే
వాళ్ళం”
మాధవీ ఏదో
చెప్పటానికి నోరు
తెరవాలనుకున్నప్పుడు, ఆమెను
మాట్లాడవద్దని చేతితో
సైగ చేసిన
అనుసూయమ్మ, “ఇదే
లాగానే నీ
రూమ్ మేట్స్
దగ్గరా, పక్క
గదిలో ఉన్న
అమ్మాయల దగ్గర, అంతెందుకు
నీ హాస్టల్
వార్డన్ దగ్గర
కూడా ఖచ్చితంగా
చాలా ప్లస్
పాయింట్లు ఉంటాయి.
నీ కళ్ళు
ఇప్పుడు వాళ్ళ
మైనస్ పాయింట్లు
మాత్రమే చూసింది.
అందువల్ల వాళ్ల
దగ్గరున్న ప్లస్
పాయింట్లు కనిబెట్టు.
పైపైన కనబడిన
మైనస్ పాయింట్లు
మాత్రం చూసి
నువ్వు బయలుదేరి
వచ్చింది నీ
తప్పు.
పో...వెళ్ళి
కనిబెట్టు! ఆ
ప్లస్ పాయింట్లు
కనిబెట్టి వాళ్ళ
పరిచయాన్ని ఎంజాయ్
చెయ్యి. నిన్ను
ఇక్కడికి రప్పించిన
మైనస్ పాయింట్లను
డైజస్ట్ చేసుకో”
ఆ రోజు
రాత్రే బస్సులో
కూర్చోనుంది మాధవీ, తిరిగి
తన హాస్టల్
కు వెళ్ళటానికి!
*************************************************సమాప్తం********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి