జంట పండ్లు…(కథ)


                                                                        జంట పండ్లు                                                                                                                                                     (కథ) 

వాళ్ళిద్దరి ప్రేమనూ ఆఫీసులో ఎవరూ కనిబెట్టనే లేదు. ఇద్దరూ అందరితోనూ ఫ్రెండ్లీ గా ఉంటారు. అందరికీ వేరు వేరుగా వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం. వాళ్ళ నడవడిక అలాంటిది. కానీ, వేరు వేరు కులాలకు చెందిన వాళ్ళను సహ ఉద్యోగులు వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒకటిగా మాట్లాడింది లేదు. వాళ్ళకు అలా అనిపించలేదు. అంతే.

వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నట్టే పెళ్ళిని కూడా అందంగా ప్రేమించారు. అందువలన త్వరలోనే పెళ్ళిచేసుకోవాలనే విషయంలో కూడా ఒకే మనసుతో ఉన్నారు. వాళ్ళిద్దరికీ మొదట పెళ్ళి చేసుకోవాలనే ఆశ ఏర్పడిన తరువాతే అది ప్రేమగా కంటిన్యూ అయ్యిందని చెప్పటం అతిశయోక్తి కాదు.

వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగి మూడేళ్ళు అయినా పిల్లలు పుట్టలేదు. అందరి మాటాలకూ, ఎత్తిపొడుపులకూ సమాధానంగా అనాధ శరణాలయం నుండి బిడ్డను దత్తతు తీసుకోవాలనుకున్నారు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. ఖచ్చితంగా ఆదే సమయంలో వాళ్ళకు మంచి శుభవార్త తెలియవచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఏం జరిగిందో తెలుసుకోవటానికి కథ చదవండి.

****************************************************************************************************

చాలు ఆపరా...!

ఇంకా ప్రారంభించనేలేదే జానూ...

ఛీఛీ! కొంచం వంట చేయనిస్తావా?”

వంటంతా ఏమీ వద్దు...

అబ్బో! తినడానికి కూర్చుంటే అది తీసుకురా, ఇది తీసుకురా అంటావే...అప్పుడు ఎక్కడ్నుంచి తీసుకొచ్చేది?”

కోపగించుకోకు ఆంటీ...

ఏమిటీ...? ఆంటీనా! అవున్రా, లవ్ చేసేటప్పుడు తెలియలేదు. పెళ్ళి జరిగి మూడు సంవత్సరాలు అయ్యింది కదా. కంటికి ఆంటీలాగానే కనబడతాను...

పోవే పిచ్చిదానా...ఆంటీనే చాలా బాగుంటుందే

చెప్పు తెగుతుంది...

సరే సరేఏం చేస్తున్నావు?”

, బంకమట్టితో కుండలు చేస్తున్నా. కొంచం చెయ్యి తీస్తావా? దెబ్బలు తింటావు...లోపలకు వెళ్ళరా!

జానూ!

నడుం వదలరా! అదేమన్నా హ్యాండిల్ బారా...చెయ్యి తియ్యి!

అయ్యో! అనుకూలంగా ఉన్నదే...ఏమిటే చేయను?”

ఏమీ చెయ్యక్కర్లేదు...

గరిటను గచ్చుమీద పెట్టేసి, అతని చేతులను బలవంతంగా వదిలించుకుంది. వంటింటి గచ్చు మీదే, స్టవ్వుకు పక్కనే ఎక్కి కూర్చున్నాడు.

నువ్వు ఒంటరి చెట్టు కోతివిరా

నేను కోతినా? పోతే పోనీ. నిన్ను మాత్రం అన్యాయంగా ఒంటరి చెట్టు అని చెప్పకు!

అయ్యో చాలు. జొల్లు కార్చకు. నీకు పేరు పెట్టారు చూడు వాళ్ళను అనాలి

ఏం...నా పేరుకేమొచ్చింది? జ్ఞానం + అనందం = జ్ఞానానందం. తెలుగుపేరే అది

తెలుగంతా బాగానే ఉంది. పేరులోనే రెండు తప్పులు!

ఒక క్షణం తడబడి ఏయ్ గాడిదా...నిన్ను...

ఎప్పుడూ లాగానే ప్లాను వేసుకున్నట్టు అనుకోకుండా మంచం మీద వాలిపోయారు.

                                                                              ********************

వాళ్ళిద్దరి ప్రేమనూ ఆఫీసులో ఎవరూ కనిబెట్టనే లేదు. ఇద్దరూ అందరితోనూ ఫ్రెండ్లీ గా ఉంటారు. అందరికీ వేరు వేరుగా వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం. వాళ్ళ నడవడిక అలాంటిది. కానీ, వేరు వేరు కులాలకు చెందిన వాళ్ళను సహ ఉద్యోగులు వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒకటిగా మాట్లాడింది లేదు. వాళ్ళకు అలా అనిపించలేదు. అంతే.

వాదన మహాసభ ప్రెశిడెంట్ వందనాకి గానీ, కంపెనీ ప్రారంభించటానికి ముందు నుంచే సెక్యూరిటీ గార్డ్ గా ఉంటున్న మల్లయ్యకి కూడా తెలియకుండానే జానకీ --జ్ఞానానందం ప్రేమ జరుగుతున్నదంటే వాళ్ళిద్దరూ ఎంత పెద్ద తెలివిగలవాళ్ళో చూసుకోండి. చివరికి ఆఫీసు ప్యూను వెంకయ్యకు కూడా వీళ్ళు ప్రేమించుకుంటున్నట్టు తెలియదు.

వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నట్టే పెళ్ళిని కూడా అందంగా ప్రేమించారు. అందువలన త్వరలోనే పెళ్ళిచేసుకోవాలనే విషయంలో కూడా ఒకే మనసుతో ఉన్నారు. వాళ్ళిద్దరికీ మొదట పెళ్ళి చేసుకోవాలనే ఆశ ఏర్పడిన తరువాతే అది ప్రేమగా కంటిన్యూ అయ్యిందని చెప్పటం అతిశయోక్తి కాదు.

కానీ, చిన్న బ్రాంచీలో, అదొక ఆఫీసు సమస్యగా మొలకెత్తింది. భార్యా--భర్తలు ఇద్దరూ ఒకే ఆఫీసులో, అందులోనూ చిన్న బ్రాంచీలో పనిచేయగలరా? ఆఫీసు రూల్స్ లో చెయ్య కూడదు అని రాసిపెట్టలేదు. కానీ, అది జరగదు అనేది విరివిగా నమ్మబడింది.

ఇబ్బందికరమైన ఘట్టాన్ని ఇద్దరూ కలిసినిలబడి దాటి వెళ్ళాలని ప్లాన్ వేశారు. కానీ, మేనేజర్ పద్మనాభం ఆఫీసుకు సీనియర్. పదవిలోనూ, వయసులోనూ. కానీ, చురుకుదనంలో తనకంటే చిన్న వయసు వాళ్ళకు సవాలుగా ఉంటారు. న్యాయమైన వ్యక్తి. అందరినీ సరిసమంగానూ, అభిమానంగానూ, అదే సమయం కఠినంగానూ చూస్తారు. వీపు వెనుక నిలబడి శ్వాస వదలరు. బాధ్యతను అప్పగిస్తే, తరువాత సనగటం, గొణగటం అనేది చేయారు. ఎవరితోనూ క్లోసుగా ఉండరు. తాను తప్పు చేస్తే బహిరంగంగా క్షమాపణలు అడుగుతారు. నోరారా నవ్వుతారు. మొత్తానికి నవీన మేనేజ్మెంట్ చూపుల్లో మేనేజర్ ఉద్యోగానికి తగిన మనిషి అని అనిపించుకుని అందరి చేత గౌరవించబడి, మర్యాద పొందుతారు.

యస్ కమ్ ఇన్...

ఏదో ఒక లేఖలో సంతకం పెట్టి తల ఎత్తిన ఆయన ఇద్దరూ కలిసి రావటం చూసి కొంచం ఆశ్చర్యపడి నవ్వారు.

వాళ్ళను కూర్చోమని సైగచేసి చెప్పి ఏమిటి విషయం? అకౌంట్స్--పర్చేస్ ఇద్దరూ కలిసి కూటమిగా వచ్చారు! ఆశ్చర్యంగా ఉంది...?” అంటూ కదిలే కుర్చీలో కొంచంగా కదిలి కాఫీ?” అన్నారు.

వద్దుసార్... అన్నది జానకీ.

నాకు కావాలమ్మా! అంటూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఇంటర్ కామ్ లో, “మూడు కాఫీలమ్మా, ...కవితా కొత్త అబ్బాయిని తీసుకురమ్మని చెప్పు, సరేనా?”

ఇంటర్ కామ్  రీజీవర్ పెడుతూ ఇద్దర్నీ చూసి ఇప్పుడు చెప్పండి?”

ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకునే తరుణంలో, పద్మనాభం గారి ఆంటెనాలో ఏదో వినిపించ, ఆయన నవ్వు కొంచం మందగించింది.

మీ దగ్గర ఒక మంచి న్యూస్ చెప్పాలి సార్... అన్నాడు జ్ఞానానందం.

చెప్పచ్చు కదా? దానికెందుకు పరీక్షల్లో ఫైలైన చిన్న పిల్లాడిలా సంసయిస్తున్నారు?”

మేమిద్దరం... అంటూ లాగాడు జ్ఞానానందం.

ఇద్దరూ?”

పెళ్ళి చేసుకుందామని తీర్మానించుకున్నాం సార్... అన్నది జానకీ.

పద్మనాభం గారికి అన్నీ క్లిస్టల్ క్లియర్ గా ఉండాలి. పర్టికులర్ షిఫ్టులో పనిచేసే వాళ్ళకు మాత్రం క్యాంటీన్లో ఉచిత భోజనం ఉంది. ఎంతమంది తిన్నారో ఆయనకు కరెక్టుగా లెక్క చెప్పాలి. అర్హతలేని వాళ్ళు భొజనం చేస్తే? ఏదైనా మాటనడేమో, ఏదో ఒకటి చెయ్యటమో చెయ్యరు.

ఆయన్ని కాకా పట్టాలనుకునే వారు, ‘సార్, బాలూకి డే షిఫ్టు సార్...కానీ, రాత్రి అతనూ క్యాంటీన్లో భోజనం చేసాడు సార్...అంటే అతను మన ఆఫీసు ఉద్యోగే కదా? ఏదో అటు పక్కగా వచ్చుంటాడు, అలాగే తినుంటాడు, పెళ్ళికాని కుర్రాడు. దీన్ని పోయి పెద్ద తప్పుగా మాట్లాడుతున్నావు, వెళ్ళి పని చూసుకో... అంటారు.

కానీ, ఎవరెవరు తిన్నారు అనేది ఆయనకు సరైన లెక్కతో చూపించాలి! వార్తల పిచ్చాడు. నాయకుడికైనా అది అవసరమైనదే.

క్లియర్ గా చెప్పండి...ఇప్పుడు మీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారు

అవును సార్... అన్నది జానకీ.

అప్పుడే కొత్త కుర్రాడు తలుపు తీసుకుని కాఫీతో వచ్చాడు.

తలుపు మీద కొట్టి, లోపలకు రావాలి. తెలిసిందా?” అని మామూలుగానే చెప్పారు. కానీ, పద్మనాభం గారి యొక్క గంభీర స్వరం వలన కొత్త కుర్రాడికి జ్వరమే వచ్చేసింది.

జానకీకీ, జ్ఞానానందానికీ ఆయన అడిగిన ప్రశ్నతో, ఇదివరకే బెదిరిపోయి తెల్లమొహం పెట్టడం, మేనేజర్ కొత్త కుర్రాడికి చెప్పింది, ఇండైరెక్టుగా తమని ఉద్దేశించిందేమోనన్న ఆలొచన వాళ్ళను మరింత ఎక్కువగా బెదరగొట్టింది.

నిదానం...నిదానంగా పెట్టు. నేను పిలిచిన తరువాత వస్తే చాలు... అనడంతో, కుర్రాడు చెమటతో బయటకు వెళ్ళాడు.

తీసుకోండి, చల్లారిపోతే బాగుండదు

వాళ్ళిద్దరికీ కాఫీ కప్పు చాలా బరువనిపించింది.

సరే, అభినందనలు. ఇద్దరిలో ఎవరికి మొదటగా పెళ్ళి జరగబోతోంది?”

ఇద్దరూ ఆల్మోస్ట్ కాఫీని ఒలకబోసారు. చివరి సమయంలో జుర్రుకుని, మింగి, సర్దుకుని, గబుక్కున టేబుల్ మీద కాఫీ కప్పులను పెట్టారు.

సార్ అలా కాదు... అన్నది జానకీ హడావిడిగా.

వేరే ఎలా?”

సార్, మేము ఒకర్ని ఒకరు పెళ్ళి చేసుకోబోతున్నాం అన్నాడు జ్ఞానానందం.

పద్మనాభం గారు కూడా తన కాఫీ కప్పును కింద పెట్టారు.

దిస్ ఈస్ ఇంటరెస్టింగ్! హు ప్రపోసుడు టు హూమ్?”

పరిచయం అయ్యి, స్నేహం ప్రారంభించాటినికి ముందే మేమిద్దరం పెళ్ళి చేసుకోవటంలో తీర్మానంగా ఉన్నాం సార్ అన్నాడు జ్ఞానానందం.

ఇన్ ఫాక్ట్, తీర్మానానికి తరువాతే మేము స్నేహంగా ఉండటం ప్రారంభించాము సార్ అన్నది జానకీ.

సో ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫైర్. ఎషన్షియల్లీ ఇట్ ఈస్ ప్రపోసల్... అన్నారు పద్మనాభం గారు.

...ఆవును సార్ అన్నది జానకీ.

పద్మనాభం గారు టెలిఫోన్ రిజీవర్ తీసి టేబుల్ మీద పెట్టారు. 

మొదటగా నా హార్టీ కంగ్రాజ్యులేషన్స్

ఇద్దరూ భయపడుతూ, భయపడుతూ థ్యాంక్యూ సార్ అన్నారు.

లుక్! మన హెడ్ ఆఫీసు గురించి మీకు బాగా తెలుసు. రూల్స్ ఆర్ నాట్ మెన్ షండ్, దే ఆర్ అబ్సర్వెడు?”

తెలుసు సార్. మా ఇద్దరిలో ఎవరో ఒకరిమే ఇక్కడ కంటిన్యూ చెయ్యగలం అన్నాడు జ్ఞానానందం.

... అన్నట్టు తల ఊపారు పద్మనాభం గారు.

ఇంతవరకు ఇలాంటి ఒక విషయం ఇక్కడ జరిగింది లేదు (వాళ్ళ మొహాలు కొంచం మారటం గమనించి) ఇందులో తప్పు ఏమీ లేదు...అఫీషయల్లో దీన్నీ అనుమతిస్తారా అని చూడాలి

కొంచం ముందుకు వచ్చి సార్! మా ఇద్దరిలో ఎవరు ఉండొచ్చు అని చెబితే, జానకీ దానికి తగినట్లు రిజైన్ చేస్తాము సార్. సారీ ఫర్ ఇన్ కన్వీనియన్స్, రియల్లీ సారీ సార్ అన్న జానకీ ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోయింది.

కామ్ డౌన్! కంట్రోల్ యువర్ సెల్ఫ్!

జ్ఞానానందం ఆయన ముందు కొంచం సంసయిస్తూనే ఆమెను ముట్టుకున్నాడు. జానకీ తేరుకునేంతవరకూ కాచుకోనున్న పద్మనాభం గారు మాట్లాడారు.

నువ్వు ఎప్పుడెందుకు ఏడుస్తున్నావమ్మాయ్? నేను నిన్ను ఉద్యోగానికి చేర్చుకున్నదే నీలో ఉన్న చురుకుదనం, ఉత్సాహం చూసే. జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పానో జ్ఞాపకముందా?”

జానకీ తల ఊపుతూనే “‘నీ యొక్క ఉత్సాహం కోసమే నిన్ను అపాయింట్ చేస్తున్నానుఅని చెప్పారు...

మరి ఇంకెందుకు కళ్ళు నలుపుకుంటున్నావ్ ఇప్పుడు. ?”

సారీ సార్...

ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం పోయినా ఎలా ఉంటుందో, దాని వలన ఏర్పడే కష్ట నష్టాలు ఎలా ఉంటాయో ఒక తండ్రి వాత్సల్యముతో, మంచి స్టాఫ్ లేకపోతే ఒక మేనేజర్ ఎంత ఇబ్బంది పడతాడో ఖచ్చితంగా వాళ్ళకు వివరించాడు.

మీరిద్దరూ ఇక్కడ కంటిన్యూ చేయాలనే నా ఆశ (జ్ఞానానందానికి కన్నీరు వచ్చింది. జానకీ గురించి చెప్పక్కర్లేదు) కానీ, హెడ్ ఆఫీసు ఒప్పుకోవాలి. యూ నో విల్ డూ మై బెస్ట్?”

ఎస్ సార్... అన్నారు ఇద్దరూ.

ప్రశాంతంగా సీటుకు వెళ్ళండి. దీని గురించి ఇప్పుడే నేను ఎవరికీ చెప్పను. మీరూ చెప్పకండి. అనవసరమైన మాటలు వస్తాయి. విల్ ప్రొటెక్ట్ యువర్ సీక్రసీ, మీరు నా అఫీషియల్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలి. సరేనా?”

ఖచ్చితంగా సార్...

జ్ఞానానందమే తలుపు తెరిచి బయటకు అడుగుపెట్టాడు. అతన్ని వెంబడించటానికి జానకీ ముందుకు కదిలినప్పుడు,

జానకీ! అన్నారు పద్మనాభం గారు. అలాగే వెనక్కి తిరిగి ఏమిటన్నట్టు ఆతృతతో నిలబడింది జానకీ.

ఏడవకు...?” అని చెప్పి ఒక చిన్న విరామం తరువాత ఇకమీదట... అని నొక్కి చెప్పారు. ఆమె చేతులుజోడించింది. కుర్రాడ్ని టేబుల్ క్లీన్ చెయ్యమని చెప్పు అంటూ ఆమె చూపులను తప్పించాడు.

జ్ఞానానందం ఇంట్లో వెంటనే అంగీకరించారు. జానకీ తండ్రి మాత్రం కొంచం పూనకం వచ్చిన ఆయనలాగా ఊగి తరువాత సడన్ గా ఒప్పుకున్నారు. తాను ఆయనతో మాట్లాడిన సంగతి పద్మనాభం గారు వాళ్ళిద్దరితో చెప్పలేదు. పెళ్ళి గ్రాండుగా జరిగింది. పద్మనాభం గారిని చూసిన వెంటనే వీళ్ళిద్దరూ కళ్ళల్లో నీరుతో పెళ్ళి పీటల మీద నుండి లేచి పరిగెత్తుకు వచ్చారు. 

మీకు బహుమతిగా ఇవ్వటానికి చేతుల్లో నేనేమీ తీసుకు రాలేదు... ఇద్దరి చేతులనూ ఒకటిగా చేర్చి పట్టుకుని మీరిద్దరూ ఒకర్ని ఒకరు ఇకమీదట వదలనే కూడదు. మన ఆఫీసూ మిమ్మల్నిద్దరినీ వదలదు! ఇదే మీకు వెడ్డింగ్ గిఫ్ట్ అన్నారు.

కాళ్ళ మీద పడ్డ ఇద్దర్నీ చేతులతో పైకెత్తి హత్తుకున్నారు.

ఇల్లు చూసుకుని వేరు కాపురం మొదలు పెట్టారు. ఆనందమైన జీవితం. ఇద్దరి ఇళ్ళల్లోనూ సరే... ఆఫీసులోనూ సరే వీళ్ళ మీద అందరికీ అభిమానం ఎక్కువ అయ్యింది. ఒక  కృతజ్ఞతా భావంతో ఎక్కువగా పని చేశారు.

పెళ్ళి జరిగి ఒక సంవత్సరం అయిన తరువాత జానకీ తల్లి మొదలుపెట్టింది.

ఏమే జానకీ! సంవత్సరం గడిచిపోతోంది. ఇంకా కంటికి ఏమీ కనిపించలేదే?”

మొదలు పెట్టావా?”

లేదే...జరగవలసిన మంచిదంతా కరెక్టు సమయానికి జరగాలి. లేకపోతే...

లేకపోతే? చెప్పు లేకపోతే ఏం చేస్తావు?”

ఏమిటే ఇలా ఎదిరించి మాట్లాడుతున్నావు? శరీరం ముదిరిపోతే నడుం సహాయపడదు. అందుకే చెప్పాను

ఇప్పుడు నేనేమన్నా ముసలి అయిపోయేనా? అన్నీ ఎప్పుడు జరుగుతాయో, అదే దానికైన సమయం. ఊరికే గొణగకు

ఏమిటోనమ్మా, కన్న మనసు ఉరుకోవటంలేదు. అందుకే చెప్పాను...

ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్ధం. మనసూ మనసూ సహకరించని సమయంలో ఒక్క నిమిషం అనేది ఎంత పొడుగో? ఎంత పెద్ద భరువు? అక్కడేమో ఇద్దరూ, దగ్గరున్న వారు వెళ్ళిపోతే ఏం అని ఆలొచింపచేస్తుందే...అమ్మ అయినా, బిడ్డ అయినా!

అదికాదే...మీ ఆయన...నువ్వూ...సంతోషంగా ఉన్నారు కదా?”

చాలు ఆపమ్మా. పెళ్ళికి ముందు నాన్న ఆడిన పూనకం చాలు. ఇప్పుడు నీ ఎంక్వయరీ ఏమీ అవసరం లేదు. మీ ఆయన నీ దగ్గర ఎలా ఉండేవారో దానికంటే మర్యదగానూ, ప్రేమగానూ నా భర్త నన్ను చూసుకుంటున్నారు. చాలా?”

తల్లి కంట తడిపెట్టింది. కులాన్ని కారణంగా చూపించి ఆయన ఎక్కువగా ఆడిన పూనకం, జానకీ పట్టుదలతో నిలబడింది. వాళ్ళిద్దరి మధ్యా ఈమె నలిగిపోవటం అంతా ఆమెకు గుర్తుకు వచ్చింది.

ఆమె పడిన కష్టాలు పిల్ల తెలుసుకోలేదే నని బాధ పడింది. ఏ కూతురూ తల్లీ పడిన బాధలను, ఆమె తల్లి అయ్యేంత వరకు పూర్తిగా అర్ధం చేసుకోదు! తరువాతే తల్లీ కూతుర్లు స్నేహితులవుతారు.

సరే జానకీ! నేను వెళ్ళొస్తాను. నాన్నకు భోజనం టైము అవుతోంది... తల్లి తన బాధలను చూపించుకోదు. కూతుర్నీ ఏమీ అననివ్వదు.

జానకీకి ఏదోలాగా అనిపించింది.

ఒక్క నిమిషం ఉండు. ఒక గుక్కెడు కాఫీ అయినా తాగేసి వెళ్ళు

వద్దమ్మా. ఆయన ఆకలికి తట్టుకోలేరు. నేను ఇక్కడే ఉన్నాను. తారువాత వస్తాను అంటూ వెళ్తున్న తల్లిని చూస్తూ నిలబడింది జానకీ.

తానూ సరే, జ్ఞానానందమూ సరే -- ఆకలి తట్టుకోలేరు. అన్ని విషయాలలోనూ. ఇదెలా అమ్మతో చెప్పగలను? కులం వేరైతే, అది సరిగ్గా జరగదని అనుకునే అమాయకురాలికి ఎలా వివరించేది?

సరే, తాను కూడా అమాయకురాలి కూతుర్నే కదా అన్న ఆలొచన వచ్చింది. భార్యా--భర్తల మధ్య ఏర్పడే కామం అనేది ఎంత మృదువో అంత పవిత్రమైనది అనే జ్ఞానాన్ని నా జ్ఞానానందమే కదా నాకు నేర్పించింది అనేది ఎలా తల్లికి తెలియపరచను? ఒక బిడ్డ పుడితేనే అంతా బాగానే జరుగుతున్నదని అర్ధమా? తల్లి గనుక తనకంటే చిన్నదిగా ఉండుంటే బాగా ఉండుంటుందో అని అనుకుంది.

తరువాత చిన్న చెల్లెలు. తన కంటే పెద్దదయి ఉంటే బాగా ఉండుంటుందోమో అని కూడా అనిపించవచ్చు. చాలు పిచ్చి పట్టించే ఆలొచనలు అనుకుంటూ కాఫీ కలుపుకోవటానికి వెళ్ళింది. బయటకు వెళ్ళిన జ్ఞానానందం వచ్చే సమయం. అతనికి కాఫీ అంటే వేడి వేడిగా ఉండాలి.

ఏమోయ్ జ్ఞానం! ఏమీ చెప్పనంటున్నావే నువ్వు!

ఏం చెప్పాలి వెంకయ్య?”

! ముఖ్యమంత్రి మీ ఇంటికి ఎప్పుడు టీ తాగడానికి వస్తానన్నారు అని చెప్పాలి. ఊరుకోండి సార్...అరె, పెళ్ళంతా జరిగింది. ఇంకా ఏమీ కనబడటం లేదే?”

వెళ్ళి పని చూసుకోండి! మాటలన్నీ ఎందుకు?”

అరే, ఏంటబ్బాయ్ విసుక్కుంటున్నావు? అందరం అన్నాతమ్ముళ్ళుగా  ఉంటున్నాము. అక్కరతోనే అడుగుతున్నా. మన జానకీ ఉందే అది మంచి పిల్ల. మంచి పిల్ల అంటే ప్యూర్ గోల్డ్. కానీ, పిల్లా పాపలు లేకపోతే, అందంగా ఉన్నదని లవ్ చేసి వెళ్ళాడు. కానీ దేనికీ లాయకీ లేదని అదీ,ఇదీ మాట్లాడతారయ్యా. అదే నీతో చెప్పాను. అంతే

జ్ఞానానందానికి ముఖం కొంచం ఎర్రబడింది. ఇంతలో వెంకయ్య జరిగి వెళ్ళిపోయాడు.

ఆఫీసుకు రావటం కూడా ఎప్పుడూ ఒంటరిగానే వస్తారు. కలిసే వస్తారని చెప్పలేము. జానకీ ఆలస్యంగా వచ్చిన రోజులు ఉన్నాయి. ఆమెకు కిచెన్ సింకులో ఒక్క స్పూన్ ఉన్నా నచ్చదు. వంట గది గచ్చును తుడిచే గుడ్డను కూడా వెంటనే పిండి ఆరేయాల్సిందే. వాళ్ళ వాళ్ళ అబ్సెషణ్ వాళ్ళ వాళ్ళకు న్యాయం. వాళ్ళకు మాత్రమే అది న్యాయమని వాళ్ళకు అనిపిస్తే, తరువాత లోకంలో శుభ్రమే లేకుండా పోయి, లోకంలో నవలలూ, కథలూ ఏదీ లేకుండా రోజూ అందరూ టెలిఫోన్ డైరెక్టరీ చదువుతూ ఉంటే ఎలా ఉంటుంది జీవితం?

జానకీకి కొంచం పని ఎక్కువగా ఉంటే, జ్ఞానానందం ఆమెకోసం కాచుకోనుంటాడు. ఆమె వెళ్ళమని చెప్పినా వెళ్లడు. అతనికి కొంచం ఆలస్యం అయితే, ఆమె కాచుకోనుండదు. ఇంటికి వెళ్ళిపోతుంది. అతను వచ్చేలోపు స్నానం అదీ చేసి, వేడి భోజనం రెడిగా ఉంచుతుంది!

అతను ఆలస్యంగా ఇంటికి వచ్చే రోజుల్లో, అతన్ని వెంటనే స్నానాల గదికి తరుముతుంది. అతను స్నానం చేసి వచ్చిన వెంటనే, అతన్ని భోజనానికి కూర్చోబెడుతుంది. ఆకలి తట్టుకోలేడే! ఇద్దరూ కలిసి తింటారు అనేది పేరుకు మాత్రమే. ఎలాగైనా అతన్ని ఒప్పించి అతన్ని ముందుగా తినిపిస్తుంది ఆమె.

ఇంట్లో కిటికీలను తెరిచి పెట్టటానికి దారే లేదు. ఎప్పుడూ ప్రేమించుకునే వీళ్ళిద్దరూ ఒక్క నిమిషం కూడా విరామం తీసుకుని ఉండలేరు. ప్రతి ఒక్కసారీ శిఖరం ఎత్తులో ఇద్దరూ ఒకే లెక్కలో కలిసి మైమరచిపోవటం వాళ్ళకు ఎప్పుడూ సాధ్యమయ్యేది. అప్పుడప్పుడు అదే వాళ్ళిద్దరికీ ఆశ్చర్యంగా ఉండేది. కానీ, అది రెగులర్ గా అయిన తరువాత, దాన్ని వాళ్ళు గమనించటం తగ్గిపోయింది. మరచిపోవటమే దాని స్వారస్యాన్ని ఇంకా పెంచింది.

ఒకరోజు ఆమె అడిగింది.

ఏరా నిన్ను ఒకటి అడగనా?”

నువ్వు అడగాలా ఏమిటి?” అంటూ ఆమెను కౌగిలిలో బంధించి ఆమెను ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు.

కొంచం ఆపుతావా? నన్ను అడగనివ్వు!

సరేనే అడుగు... అన్నాడు నవ్వుతూ

నీకు విసుగే పుట్టదా?”

నీకూ?”

ప్చ్..మొదట నేనడిగినదానికి జవాబు చెప్పు

విసుగుపుట్టదు...

నా మీద విసుగే రాదారా?”

రాదు....

ఎందుకనిరా?”

జానూ! నువ్వు నాకు బయట ఉన్న ప్రాణం

జానకీ చూపులు పెద్దవై ప్రకాశవంతమైనై.

ప్రాణం విసుగు కాదూ జానూ. ప్రాణంతో ఉండటం శరీరానికి విసుగ్గా ఉంటుందా?”

గబుక్కున అతన్ని మరింత బలంగా తన మీదకు లాక్కుంది.

                                                                                       ***********************

రోజు ఆఫీసుకు కొంచం త్వరగానే వచ్చేసింది జానకీ. అంతకు ముందే వాదన  వందనా కూడా వచ్చేసింది. వందనాను చూసిన జానకీ గుడ్ మార్నింగ్! మీరేంటి రోజు ఇంత తొందరగా?”

ఏమీ లేదు ఆయనకి రోజు త్వరగా వెళ్ళాల్సి ఉంది. రోజూ ఆలస్యంగానే కదా వెళుతున్నావు. ఒక రోజు ముందే వెళితే ఏమీ అవదు అని గోలచేసి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు

జానకీ నవ్వింది. అందులో చిక్కుకోని వారే ఉండరు. కానీ, వందనా దొరికిన ఛాన్స్ ను వదిలిపెట్టదలుచుకోలేదు.

ఇదిగో చూడు జానకీ! నేను చెబుతున్నానని తప్పుగా అనుకోకుమనమంతా   ఒకటే ననేది తెలుసుకో. నువ్వూ, జ్ఞానం ఒకే ఆఫీసులో మా ముందే, మాతో పాటూ ఉంటూ ఎవరి కళ్ళకూ తెలియకుండా ప్రేమించుకున్నారు.

పెళ్ళి చేసుకుని ఒకే ఆఫీసులో ఉంటున్నారు. రెండువైపులా తల్లి-తండ్రులు సహజంగానే ఉన్నారు. ఎవరికి దొరుకుతుంది ఇలాంటి భాగ్యం? దీంతో పాటూ ఒక బిడ్డను కంటేనే...

వందనా! చాలు ఆపు. అంతా ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది

జరపాల్సింది జరిపితేనే కదా జరగాల్సింది జరుగుతుంది?”

జానకీ వందనాను కోపంగా చూసింది.

కోపగించుకోకు పిల్లా. మాటలు వస్తూనే ఉంటాయి

వస్తే రానివ్వండి. మీరే కదా మాట్లాడబోయేది?”

కులం కాని కులంలో చేతులు కలిపితే చేరాల్సింది చేరదని చెబుతారు అక్కరతో చెబితే అటుకులవటమే మిగుల్తుంది అంటూ వందనా చెప్పటానికి ముందే, ఆమెను చూడకుండానే జరిగింది జానకీ.

                                                                                      **************************

సార్! పిలిచారట?”

అవును జ్ఞానానందం, కూర్చోండి

థ్యాంక్స్ సార్

హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ?”

ఎస్ సార్...

మన వరంగల్ బ్రాంచీని కొద్దిగా ఎక్స్ పాండ్ చేయడానికి వెడతారా. దాన్ని కొంచం సెటప్ చేసి, అక్కడ ఉన్న వాళ్ళకు ఓరియంటేషన్ ఇవ్వాలి. వెళ్ళొస్తావా?”

ఖచ్చితంగా సార్. నైస్ ఆఫ్ యూ! థ్యాంక్స్ ఫర్ ఆపర్చ్యునిటీ సార్

గుడ్...మీరు బాధ్యతగా చేస్తారని తెలుసు. జానకీనూ కూడా తీసుకుని వెళ్ళండి -- అఫీషియల్ గానే. ఓకే?”

ఓకే సార్ దాచుకోవలనుకున్న అతని ఆనందం ఆయనకు క్లియర్ గా కనబడింది.

జానకీకి మన కల్చర్ బాగా తెలుసు. సో. వాళ్ళకు అందులో ఓరియంటేషన్ ఇవ్వాలి. మీరే ఆమెతో చెప్పచ్చు. నేనూ తరువాత జానకీని పిలిచి అంగీకారం తీసుకుంటాను

ఎందుకు సార్ అదంతా? మీరు నాతో చెబితేనే చాలదా...

చాలదు. నా సీటులో కూర్చుని చూస్తేనే ఎవరికైనా, దేన్నైనా యూ కాంట్ టేక్ ఫర్ గ్రాంటడ్ అనేది అర్ధమవుతుంది. గుడ్ లక్!

లేచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి బయలుదేరాడు.

అతను తలుపులు తెరుస్తున్న తరుణంలో,

తరువాత ఒన్ మోర్ తింగ్ జ్ఞానానందం. వరంగల్ వరకు వెళ్తున్నారు. మీరిద్దరూ అలాగే రామప్ప దేవాలయం వెళ్ళిరండి. మీరిద్దరూ ఉండటానికి, దర్శనానికీ ఏర్పాటు చేస్తున్నాను

అతను మాట్లాడటానికి ఛాన్సే ఇవ్వకుండా వెంటనే రిజీవర్ ఎత్తాడు. కొంచం సంశయించిన  అతనికి తంబ్స్ అప్ చూపించి సైగతో బయలుదేరమని చెప్పారు.

                                                                                   ****************************.

రేయ్... అన్నది చిన్నగా.

చెప్పు

మీ అమ్మ పిలిచింది

ఏంటిట?”

ఇంకేముంటుంది?”

! పెళ్ళి చేసుకుని మూడేళ్ళు అయిపోయింది. కడుపు పండలేదు...అదేమిటే బిడ్డను పోయి కాయి, పండూ అని చెప్పటం?”

ఇప్పుడు పరిశోధన అంత ముఖ్యమా. నిజమైన మూర్ఖుడివిరా నువ్వు

అలా సమాధానం చెప్పిన జానకీకి దాని గురించి బెంగగానే ఉంది. తానుగా దాన్ని బాగానే అర్ధం చేసుకున్నా, జ్ఞానానందం విషయాన్ని పెద్దగా పట్టించుకోక ఎప్పుడూలాగా ఆమెను వెనుక నుండి కౌగలించుకున్నాడు. నేనొక బిడ్డ, నువ్వొక బిడ్డ అని పాడటం మొదలుపెట్టాడు. వెంటనే అతని నోరు మూసి బిడ్డా! జ్ఞానం! నువ్వేమన్నాచేయి. నన్ను తిట్టు...కొట్టు...కానీ, పాట మాత్రం పాడకురా!

ఎందుకే...?” అన్నాడు జొల్లు కార్చుకుంటూ.

చుట్టు పక్కలున్న వాళ్ళు మొదలెట్టాడురా శ్మశాన కూనిరాగం అంటూ ఎగతాలి చేస్తున్నారు

వాళ్ళ సంగతి అటుంచు. నువ్వు చెప్పు. నేను పాడితే బాగుండలేదా?”

బాగానే ఉందిరా. గోడమీద రేకుతో గీస్తున్నట్టు అంటూ నవ్వింది.

మాటలు ఆమె లోతైన మనసులో ఆమెను బాధపెడుతున్నా ఒక అంతరంగ కోరికను బయటపెడుతున్నట్టు ఉన్నది. దాని కంటిన్యువేషన్ గా మౌనం ఇద్దరినీ కట్టుబాటులో పెట్టింది.

ఆఫీసులో కూడా ఇదే మాటలు వినిపిస్తున్నాయి జానూ

ఎవరు వెంకయ్యా?”

అవును. వాడు డైరెక్టుగా అడిగాడు. మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు...

నాకూ అదేగతి. వాదన వందనా ఎలా అడిగిందో తెలుసా! ఇంకొకరి విషయంలో తలదూరుస్తున్నామే నన్న సిగ్గు కూడా లేకుండా.......

మీ నాన్న చాలా నాగరీకంగా విచారించారు. ఇప్పుడు మెడికల్ సైన్స్ చాలా ఇంప్రూవ్ అయిందట. ఇద్దరూ టెస్టు చేయించుకున్నారా, అది, ఇదీ అని...

అలాగా?”

అవును. ఆయనకు మనం ఆనందంగా లేమోనని అనుమానం...

(నుదుటి మీద కొట్టుకుంటూ) ఇక్కడకొచ్చి చూడమని చెప్పాలి! (ఇద్దరూ కౌగలించుకుంటూ నవ్వుకున్నారు) మీ అమ్మగారు కూడా ఇన్ డైరెక్టుగా ఇదే అడుగుతున్నారు

ఇది పరవాలేదు, మన డిస్ బాస్ మదన్ ఉన్నాడే వాడు చెవిలో రహస్యంగా అడ్వైజ్ ఇచ్చాడు

ఏమని?”

మామా! కొన్ని రోజులు సరదాగా ఉందామని అనుకుని బిడ్డను కనడాన్ని పోస్ట్ పోన్ చేయకు. ఎందుకంటే అదే తరువాత నీకు సమస్య అవుతుంది అన్నాడు

ఎవరికి తెలుస్తుంది మన బాధ. సరే, అది పోనీ! అవునూ, నిన్ను బాస్ పిలిచారట ఎందుకు? నా దగ్గర చెప్పలేదు?”

సరైన సమయం దొరకలేదు. నిన్నూ పిలుస్తారు

ఏమిట్రా మ్యాటర్?”

వరంగల్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్. నేను వెళ్ళి అక్కడున్న వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలట. నిన్నూ పిలిచుకు వెళ్ళమన్నారు

...జాలీ! ఇదెందుకు దిలీప్ కుమార్ లాగా మొహం పెట్టుకుని చెబుతున్నావు?”

సరే సార్ అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు ఇద్దరూ అలాగే ఒకసారి రామప్ప దేవాలయం వెళ్ళిరండి అని చెప్పేసి నన్ను మాట్లాడనివ్వకుండా పంపించారు

చెయ్యాల్సిందంతా చేస్తూనే ఉన్నాం కదా. గర్భం దాల్చలేదు. దానికి మనం ఏం చేస్తాం?”

ఇద్దరి ఇంట్లో వాళ్ళూ టెస్టులు చేసుకోమంటున్నారు...నువ్వేమంటావు?”

వద్దు

నేనూ వద్దనే అనుకుంటున్నా

దేనివల్లా?”

నా దగ్గర లోటు ఉంటే నువ్వు బాధపడతావు. నీ దగ్గర లోటు ఉంటే నేను బాధపడతాను

కరెక్టురా...తరువాత ఇప్పుడే చెప్పేస్తున్నా. నాకు .వి.ఎఫ్. వద్దనే వద్దు

పెళ్ళి జరిగి ఇన్ని రోజులైనా ఒక బిడ్డ పుట్టలేదే నన్న విషయం మనకు లోటుగా అనిపించలేదు కానీ మిగిలిన వాళ్ళందరికీ అది ఎంతో పెద్ద లోటుగా కనిపిస్తోంది

అది కూడా పరవాలేదురా. ఒక బిడ్డకు తల్లీ-తండ్రీ లేరంటే అంత దౌర్భాగ్యమారా?”

ఆమె చెప్పిన మాట ఆమెనూ కాల్చింది. అతన్ని కూడా తాకింది.

ఒకర్ని ఒకరు లోతుగా చూసుకున్నారు. కౌగలించుకున్నప్పుడు ఇద్దరి కళ్ళూ తడిసున్నాయి.

జ్ఞానానందమే జానకీని లేపాడు.

జానూ! లేమ్మా. రోజు జూన్ ఏడో తారీఖు. మరిచిపొయావా?”

గబుక్కున లేచింది. మళ్ళీ పరుపు మీద వాలిపోయింది.

ఏయ్! ఏమైంది నీకు? రెండు రోజులుగా నువ్వు సరిలేవు అంటూ ఆమె నుదుటి మీద చెయ్యిపెట్టి చూసాడు. జ్వరం అంతా లేదు.

అప్పుడు కళ్ళు తెరిచింది జానకీ.

ఏమ్మాయ్! ఏం చేస్తోంది నీకు? రోజూ అన్ని పనులూ టైము ప్రకారం చేస్తావే! రోజు మనకు ఎంత ముఖ్యమైన రోజు! సరే, మొదట డాక్టర్ దగ్గరకు వెళ్ళి తరువాత గుడికి వెళ్దాం...లే

అదంతా ఏమీ వద్దు... అని సనుగుతూ మెల్లగా లేచింది. కాఫీ కలిపింది.

ఆమె కాఫీ ఆల్ వరల్డ్ ఫేమస్ అయినది. పెళ్ళి అయిన తరువాత వీళ్ళ ఇంటికి వచ్చిన ప్యూన్ వెంకయ్య గొప్పగా చెప్పాడు.

అరే ఇప్పుడు కదా అర్ధమవుతోంది! ఈవిడ పెట్టే కాఫీ కోసమే మనవాడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు!అని ఆఫీసులో చెప్పాడు.  బయలుదేరే ముందు ఆమె ఏమీ మాట్లాడలేదు.

జానూ?”

ఎందుకని ఏమీ మాట్లాడనంటున్నావు? ఏదైనా సమస్యా?”

అదేమీ లేదురా!

మరైతే ఎందుకు అలా ఉన్నావు?”

తెలియదురా, ఏదోలాగా ఉంది

ఎప్పుడూలాగా మనిద్దరం చర్చించుకునే కదా నిర్ణయం తీసుకున్నాం?”

ఇప్పుడు నేనేమీ లేదని చెప్పలేదే?”

ఇప్పుడు నిర్ణయం మార్చాలంటే కష్టం. అయినా నీకొసం...

ఏమీ చెయ్యద్దు. నిర్ణయం తీసుకున్నట్టే జరగనివ్వండి. నన్ను కొంచం అలాగే వదిలేయి

గుడి వచ్చింది. రెండు కుటుంబాల పెద్దలూ అక్కడ ఉన్నారు.

రండి రండి... ఎందుకు ఆలస్యమవుతోంది అని ఆలొచిస్తున్నా?” అన్నారు జానకీ తండ్రి. కొంతమంది ఆఫీసు స్నేహితులు కూడా వచ్చారు. అందరి మొహాలలోనూ సంతోషం.

పూజారి, జానకీ తల్లి అందించిన అర్చన బుట్ట తీసుకుని గంభీరమైన స్వరంతో వినాయకుడికి అర్చన మంత్రాలు చదివాడు.

జ్ఞానానందం తండ్రి ఆయనకు తెలిసిన మరో పూజారి చేత వినాయక పాటలు పాడిస్తున్నారు. అది వినడానికి ఎంతో హాయిగా ఉంది.

జానకీకు అంతా ఏదో కలలో జరుగుతున్నట్టు ఉన్నది. ఆమె తల వంచుకుని ఉండడాన్ని చూసిన జ్ఞానానందానికి ఆమె ఎందుకలా ఉన్నదో అర్ధం కాలేదు.

అందరూ ఏదో ఒక భక్తి పరవశంతో ఉన్నారు. ఏదో భారం దిగినట్టు తెలిసింది.

పూజారి అందించిన పూవులను భక్తితో కళ్ళకు అద్దుకుని తలలో పెట్టుకుంది జానకీ. అందరూ ప్రసాదం తీసుకున్నారు.

సరే బయలుదేరదాం అన్నారు జ్ఞానానందం తండ్రి. పూజారిని చూసి అభిమానంతో నమస్కరించారు. ఆయన కూడా సంతోషించి క్షేమంగా ఉండండి. బయలుదేరండి అని జానకీను పిలిచి శుభంఅంటూ చేతిలో వేసారు అరటిపండు ప్రసాదాన్ని. ఆమె తండ్రి వెంటనే ఏమిటిది జంట పండ్లు  వేశారు! మంచి శకునంగా లేదే! అని బాధపడ్డారు.

అదంతా ఏమీ లేదండీ! భగవంతుడి ప్రసాదం. ఎలా ఉంటే ఏం? అంతా కొంచం సెటిల్ అయిన తరువాత రండి... అన్నాడు పూజారి. ఇవన్నీ జానకీ కళ్ళల్లోనో, చెవిలోనో పడనేలేదు అన్నట్టుగా ఉన్నది జానకీ.

ఎలా తిరగాలి, ఏం కోరుకోవాలి అనేది కూడా అర్ధం కాని ఆమెలాగా ధ్యాస తగ్గిన దానిలాగా కనిపించింది. ఆమెను తన చేతులతో పట్టుకుని నడిపించాడు జ్ఞానానందం.

అన్ని సంప్రదాయాలూ ఇదివరకే పూర్తి అయినందు వలన అక్కడ ఎటువంటి ఆలస్యమూ అవలేదు.

వచ్చిన పెద్దవాళ్ళందరూ వాళ్ళకు నచ్చినట్టు ఆశీర్వచనాలు చెప్పగా, స్నేహితులు చప్పట్లు కొట్ట, తల్లులు శుభాకాంక్షలు చెప్ప, అనాధ పిల్లల శరణాలయం మేనేజర్ ఒక ఆడపిల్లను జానకీ చేతికి ఇచ్చారు.

జానకీ, జ్ఞానానందం పిల్లలు లేని అభాగ్యాన్ని అలా తీర్చుకున్నారు. అనాధ  శరణాళయంలో వాళ్ళు పిల్లలను చూసి ఎంచుకోలేదు. బిడ్డ అయినా సరే అది దేవుడిచ్చిందిఅంటూ జ్ఞానానందం చెప్పేటప్పుడు, అతన్ని ఆనుకుని నిలబడ్డది జానకీ. అందరికీ సంతోషం, తృప్తి. శరణాలయం అధికారితో చెప్పి బయలుదేరారు.

అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది జానకీ. ఒక చేత్తో క్షణంలో బిడ్డను పట్టుకుని, ఆమెను కూడా కింద పడిపోకుండా పట్టుకున్నాడు జ్ఞానానందం. అది ఆసుపత్రి హాలు. అందువలన వెంటనే తీసుకు వెళ్ళి చేర్చటం కుదిరింది.

ఎవరెక్కడున్నారో తెలియని హడావిడి. పది నిమిషాలు జ్ఞానానందం హృదయమే ఆగిపోయింది. చేతిలో ఉన్న ఆడపిల్ల బరువు అనిపించింది.

సడన్ గా తల్లుల కోలాహలం. హడలిపోయి పరిగెత్తాడు జ్ఞానానందం. తండ్రులూ పరిగెత్తారు. అతను లోపలకు వెళ్ళేటప్పుడు ఇద్దరు తల్లులూ చప్పట్లు కొట్టి, “మళ్ళీ శుభాకాంక్షలు! అన్నారు.

మంచం మీద కూర్చుని స్వారస్యంగా, నిదానంగా, జంట అరటి పండ్లను వొలుచుకుంటోంది జానకీ.

క్లక్అన్నది చేతిలో ఉన్న బిడ్డ.

***************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మంచిదొక ఐడియా...(కథ)

స్పష్టత...(కథ)

మాతృ హృదయం...(కథ)