జారిపోయిన పుస్తకం...(కథ)

 

                                                                జారిపోయిన పుస్తకం                                                                                                                                                            (కథ)

“నమస్తే సార్. నా పేరు మహేశ్వరీ. మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారా సార్? మీ దగ్గర కాసేపు మాట్లాడ వచ్చా సార్...” అన్నది. 

“విషయమేమిటో త్వరగా చెప్పండి మ్యాడం...” అన్నాను చిన్న విసుగుతో.

“మీ యొక్క కథా సంపుటి ఒకటి చదివాను...” అని ఆమె మొదలుపెట్టగానే, నాకు చాలా సంతోషంగానూ, చిన్న షాక్ గానూ ఉన్నది.

నేను ఒకే ఒక కథా సంపుటి పుస్తకాన్నే ప్రచురించాను. అది కూడా ముగిసిపోయిన బుక్ ఎక్జిబిషన్ను ఉద్దేశించి ప్రచురించిన పుస్తకం.

అందులో ఒక్క పుస్తకం కూడా అమ్ముడుపోలేదు.

“పుస్తకం మీకెలా దొరికింది మ్యాడం...?”

“హైదరాబాద్ బుక్ ఎక్జిబిషన్ లో నుండి మా ఆయన కొనుకొచ్చి ఇచ్చారు...”

“ఎక్జిబిషన్ లో నేను అమ్మకానికి ఉంచిన నా పుస్తకాలలో ఒక్క పుస్తకం కూడా ఇంతవరకు అమ్ముడు పోలేదు. అదే అదెలా నా కథా సంపుటి పుస్తకం ఒకటి మీకు దొరికింది అనేది నాకు అర్ధం కావటం లేదు...”

ఒక్క పుస్తకం కూడా అమ్ముడుపోనప్పుడు ఈమె ఎలా ఈ పుస్తకాన్ని చదివుంటుంది? అసలు ఆ పుస్తకం ప్రింటు వేయించడానికి ఆ రచయత ఎన్ని కష్టాలు పడ్డాడు? ప్రింటు వేసిన పుస్తకాలన్నీ తన దగ్గరే ఉన్నప్పుడు ఆమె ఎలా అతని కథా సంపుటిని చదివుంటుంది?.....తెలుసుకోవటానికి ఈ ఆసక్తి కరమైన కథను చదవండి. 

***************************************************************************************************

నా సెల్ ఫోన్ మోగింది. ఏదో ఒక కొత్త నెంబరు నుండి వస్తున్న ఫోను అది. ఏదైనా మార్కెటింగ్ కాలుగా ఉండొచ్చు అన్న ఆలొచనరాగానే విసుగుతో ఫోను ఆన్ చేసి హలో అన్నాను.

నా పేరుకు ముందు రచయతఅని చేర్చి చెబుతూ,

“...ఉన్నారా?” అన్నది అవతలి స్వరం.

తియ్యటి స్త్రీ స్వరం.

అది నేనే. చెప్పండి మ్యాడం... అన్నాను.

నమస్తే సార్. నా పేరు మహేశ్వరీ. మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారా సార్? మీ దగ్గర కాసేపు మాట్లాడ వచ్చా సార్... అన్నది.

విషయమేమిటో త్వరగా చెప్పండి మ్యాడం... అన్నాను చిన్న విసుగుతో.

మీ యొక్క కథా సంపుటి ఒకటి చదివాను... అని ఆమె మొదలుపెట్టగానే, నాకు చాలా సంతోషంగానూ, చిన్న షాక్ గానూ ఉన్నది.

నేను ఒకే ఒక కథా సంపుటి పుస్తకాన్నే ప్రచురించాను. అది కూడా ముగిసిపోయిన బుక్ ఎక్జిబిషన్ను ఉద్దేశించి ప్రచురించిన పుస్తకం.

అందులో ఒక్క పుస్తకం కూడా అమ్ముడుపోలేదు.

పుస్తకాన్ని గురించిన విమర్శల కోసమూ, స్నేహితుల అభిప్రాయం అడగటానికీ ఇంకా ఎవరికీ పుస్తకాన్ని పంపటం మొదలుపెట్టలేదు.

ప్రింటు చేసిన 52 పుస్తకాలూ అలాగే ఇంట్లోని సెల్ఫులో పెట్టిన చోట పెట్టినట్టే ఉండటంతో రోజూ నా భార్య దగ్గర నుండి తిట్లు తింటూనే ఉన్నాను. అలాంటప్పుడు ఈమె ఎలా పుస్తకాన్ని చదివి ఉండగలదు?

నా యొక్క చిన్న కథల సంపుటిని చదివారా? లేక ఏదైనా వార పత్రికలలో వచ్చిన ఏదైనా కథను చదివారా?”

ఏమిటి సార్ అలా అడుగుతున్నారు. మీ చిన్న కథల సంపుటి పుస్తకాన్నే చదివాను... అన్న ఆమె నీడల యొక్క ఒంటరితనంఅనే కథల సంపుటి పుస్తకం పేరును అక్షర దోషం లేకుండా చెప్పింది.

పుస్తకం మీకెలా దొరికింది మ్యాడం...?”

హైదరాబాద్ బుక్ ఎక్జిబిషన్ లో నుండి మా ఆయన కొనుకొచ్చి ఇచ్చారు...

ఎక్జిబిషన్ లో నేను అమ్మకానికి ఉంచిన నా పుస్తకాలలో ఒక్క పుస్తకం కూడా ఇంతవరకు అమ్ముడు పోలేదు. అదే అదెలా నా కథా సంపుటి పుస్తకం ఒకటి మీకు దొరికింది అనేది నాకు అర్ధం కావటం లేదు...

అలాగా? మా ఆయనా, పిల్లలూ కలిసి బుక్ ఎక్జిబిషన్ కు వెళ్ళొచ్చారు. ఆయనకు పుస్తకాలు చదవటంలో ఆరాటం లేదు. సరదాగా పిల్లలకు కొద్దిసేపైనా కాలక్షేపం అవుతుందని టైమ్ పాస్ కోసం వెళ్ళొచ్చారు.

నేను కొంచం పుస్తకాలు చదువుతాను. బుక్ ఎక్జిబిషన్లో కొనాల్సిన పుస్తకాల పేర్లను రాసిచ్చాను. ఆయన కొనుకొచ్చిన పుస్తకాలలో మీ పుస్తకం కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు. వచ్చిన తరువాత మీ పుస్తకం ఎలా దొరికిందని అడిగి చూస్తాను... అన్నది.

పుస్తకాలు చదవటంలో అంత ఇంటెరెస్టు ఉన్న మీరు, మీరే బుక్ ఎక్జిబిషన్ కు వెళ్ళి, ఇష్టమైన పుస్తకాలను వెతికి కొనుక్కోవచ్చుగా మ్యాడమ్...

మామూలుగా నేను బయటకు ఎక్కడికీ వెళ్ళను సార్...

21 శతాబ్ధంలోనూ స్త్రీలను ఇంట్లోనే ఉంచి తాళం పెట్టే మగవారు ఉంటూనే ఉన్నారు అనుకున్నాను.

అక్కడొకటీ, ఇక్కడొకటీ అంటూ రెండు కథలు చదివేసి పుస్తకాన్ని పక్కన పారేద్దామనుకుని ఇష్టం లేకుండానే చదవటం మొదలుపెట్టాను. కానీ, ఊరికే చెప్పకూడదు సార్...మీ కథలు ఒక్కొక్కటీ అలాగే సుడిగుండం లాగా నన్ను లోపలకు లాగేసుకున్నాయి.

అన్ని కథలు చదివి ముగించిన తరువాతే పుస్తకాన్ని మూశాను. రోజు నేను లంచ్ కూడా చేయలేదంటే చూడండి.

కథ నచ్చిందో, లేదో మీ రచనా సైలిలో ఒక వశీకరణ ఉంది సార్. అదే నేను పుస్తకంలోని అన్ని కథలనూ చదవటానికి నన్ను ప్రేరేపించింది

ఏం సమాధానం చెప్పాలో తెలియక నేను మౌనంగా ఉన్నాను.

మళ్ళీ ఆమే మాట్లాడింది.

మీరు సివిల్ ఇంజనీరా సార్...?”

అవును మ్యాడమ్, ఎలా కనిబెట్టారు...?”

మీ కథలలో ఒక కథలో కథా నాయకురాలిని వర్ణించేటప్పుడు ఆమె బుగ్గలు గోడలకు సిమెంటు పూత పూసి, పెయింటు కొట్టిన కొత్త గోడలా నైసుగా ఉన్నదని రాశారు

సరోజినీ ఖచ్చితంగా నా కథా సంపుటిని చదివారు. ఆమె చెప్పిన వర్ణన ఉన్న కథా పత్రికలలోనూ ప్రచురణ కాలేదు. అది తిన్నగా కథా సంపుటిలోనే చోటు చేసుకుంది.

నా మాతృ భాష హిందీ సార్. నేను అప్పుడప్పుడు చదివే కథలు నాకు నచ్చినై అంటే, వాటిని హిందీ భాషలోకి అనువదించి, హిందీ పత్రికలకు పంపిస్తాను. మీ కథలలో కొన్నిటిని హిందీలోకి అనువదించాలని అనుకుంటున్నా. నేను అలా అనువదించటానికి మీరు మీ అంగీకారాన్ని రాత పూర్వంగా నాకు ఇస్తే... అన్నది.

అంగీకరించాను.

నాకు రాసే పిచ్చి ఎప్పటి నుంచి పట్టుకుంది అని ఆలొచించినప్పుడు నేను తొమ్మిదో తరగతి నుండి విశాఖపట్నంలో హాస్టల్లో చేరి చదువుకుంటున్నాను. కొత్త ఊరు, కొత్త స్కూలు. తోటి విధ్యార్ధులు ఎవరితోనూ పరిచయం లేదు. స్కూలు అయిన తరువాత బిజీగా ఉండటానికి పనీ లేదు. టైము గడపటం కష్టంగా ఉండేది.

పాఠాలు చదువుకోవడమంతా పరీక్షలు వస్తే మాత్రమే. అంతకంటే రోజుల్లో టీచర్లు స్టూడెంట్లకు ఎక్కువ హోమ్ వర్క్ ఇచ్చి కష్టపెట్టే వారు కాదు.

మొదట్లో రోజూ, బస్సు స్టేషన్ కు వెళ్ళి ఊర్లకు వెళ్ళే బస్సులను దిగులుగా చూస్తూ ఉండి, చీకటి మొదలవుతుంటే హాస్టల్ కు తిరిగి వెళ్ళేవాడిని.

బస్సు స్టేషన్ కు వెళ్ళి ఊర్లకు వెళ్ళే బస్సులను చూసే అలవాటు విసుగెత్తిపోవటంతో, దారిలో ఉన్న గాంధీ లైబ్రరీఅనే నేమ్ బోర్డుతో ఉన్న  లైబ్రరీలోకి దూరి అక్కడున్న దిన పత్రికలను చూడటం మొదలుపెట్టాను.

మెల్లగా వార పత్రికలను కూడా చదవటం మొదలు పెట్టాను. చదవటంలో ఒక విధమైన రుచి ఏర్పడి టైము గడవటమే తెలియక లైబ్రరీలో ఉన్న అన్నిటిని చదవటం మొదలుపెట్టాను. హాస్టల్లో వార్డన్ అటెండెంట్స్ తీస్తాడే నన్న భయంతో, వార్డన్ని మనసులోనే తిట్టుకుంటూ, హాస్టల్ కు తిరిగి రావటం అలవాటైపోయింది.

మొదటి సంవత్సరం సెలవులలో గ్రామంలోని గ్రామదేవత గ్రౌండులో స్నేహితులతో బాతాకానీ కొట్టేటప్పుడు, మమ్మల్ని దాటుకుని వెడుతున్న యుక్త వయసు ఆడపిల్లలలో, సన్నగా తళతళమంటూ నల్ల వోణీ వేసుకున్న పిల్ల మీద నిమిషమే ప్రేమ పొంగింది.

ఆమె పక్క గ్రామమైన వెంకటాచలం ఆడపిల్ల. ఆమెను చూడటానికని అద్దె సైకిలు తీసుకుని, ఆమె ఉంటున్న వీధిలో చుట్టే వాడిని.

ఆమెను చూసిన వెంటనే మనసులో నుండి మాటలు ప్రవాహంలాగా పొంగివచ్చినై.

హంసనడకదీ...చిన్న నడుమున్నదీ.

మాతృ భాషాకారీ....దయచూపే కళ్ళదీ

అంటూ ప్రేమలో పిచ్చెక్కి కలలలోనూ వెర్రిగా చేసేవాడిని.

కానీ, దేనినీ అప్పుడు రాసి ఉంచుకోలేదు.

కాలేజీకి వెళ్ళిన తరువాత లైబ్రరీలో చదివిన ఆరుద్ర, వేటూరీ, శ్రీశ్రీ కవిత్వం రాసేది ఎలా? అని దారి చూపారు. సాహిత్య పత్రిక ఒక దాంట్లో నా మొదటి కవిత ప్రచురణ అయినప్పుడు పత్రిక తన కొన ఊపిరిలో ఉన్నది.

మరొక ప్రసిద్ది చెందిన పత్రికలో మొదటి కథ ప్రచురణ అయినప్పుడు నేను ఒక రచయత కూడా అనేది గ్రహించాను. అప్పుడే నేనొక గొప్ప రచయత అనే గర్వం వచ్చింది. అప్పటి నుంచి గాలిలో తేలుతూ ఉన్నాను.

నా రచనలను నేను ముద్రణలో చూసినప్పుడు నేను పడ్డ సంతోషానికి భూమి మీద ప్రత్యామ్నాయం లేదు.

నా కథ ఏదైనా పేరు పొందిన పత్రికలలో ప్రచురణ అవదా అని బెంగపడేవాడిని. అది నెరవేరటానికి నాలుగు సంవత్సరాలు కాచుకోనుండాల్సి వచ్చింది. ఒకే వారంలో ఒక ప్రసిద్ది పొందిన వార పత్రికలలో నా కథలు ప్రచురణ అయినాయి. అలా ప్రచురణ అయిన కథలలో ఒక కథకి బహుమతి కూడా వచ్చింది.

కంటిన్యూగా పలు పత్రికలలో సంవత్సరానికి రెండు, మూడు కథలు ప్రచురణ అవటంతో, నా చిన్న కథలను ఒక సంపుటిగా ప్రచురించటానికి పబ్లిషర్స్ నా ఇంటి వాకిట్లో క్యూలో నిలబడతారని నమ్మాను.

సుమారు యాభై కథలు చేరిన తరువాత కూడా, ప్రసిద్ద పత్రికలు నడిపిన కథల పోటీలలో నా కథలకు బహుమతులు వచ్చిన తరువాత కూడా పబ్లిషరూ నన్ను వెతుక్కుని రాలేదు.

ఇదేంట్రా...సాహిత్యలోకానికి వచ్చిన పరీక్ష?’ అని అనుకుని నేనే నా కథలను నాకు నచ్చిన పబ్లిషర్స్ కు పొస్టులో, కొరియర్లో, ఈమైల్ మూలంగానూ పంపించాను.

భావిలో రాయి వేసినా నీటిపైన చిన్న కదలికలు కనబడతాయి. కానీ పబ్లిషర్స్ దగ్గర నా కథలు ఎటువంటి కదలిక ఏర్పరచలేదు.

ఫేస్ బుక్ లో, తెలుగు  సాహిత్య సంఘం పేజీలో ప్రసిద్ద రచయతలు మాత్రమే కాకుండా కొతమంది పబ్లిషర్స్ కూడా మెంబర్స్ గా ఉన్నారు.  ప్రసిద్ద రచయతల మొదటి పుస్తకాన్ని పబ్లిష్ చేసిన పబ్లిషర్ ఓనర్ని అతని ఆఫీసుకు వెళ్ళి కలిసాను.

ఆయన, “మీరు రాసిన ఏడెనిమిది కథలు చదివి చూశాను. చాలా బాగానే రాసారు. కానీ పుస్తకంగా వేస్తే అమ్ముడవదు అన్నారు.

అలాగైతే నాకు నా పేరున పుస్తకం రాదా సార్?” అన్నాను, కొంచం విరక్తి కలిసిన స్వరంతో.

మీరు ఎక్కువగా ఆశపడితే మీ ఖర్చులతో ఒక వంద పుస్తకాలు ప్రింటు చేసి ఇస్తాను. అమ్ముకోండి... అన్నారు చివరగా.

నేనెక్కడికి సార్ తీసుకు వెళ్ళి అమ్మేది. మీ షాపులోనే ఉంచుకుని అమ్మి పెట్టకూడదా?” అని అడిగాను.

లేదు. మేముగా ఇష్టపడి పబ్లిష్ చేసిన పుస్తకాలను పెట్టుకోటానికే షెల్ఫ్ లో ఖాలీ లేదు. మీరు వేరే షాపులకు తీసుకు వెళ్ళి అమ్ముకోండి సార్...

సరే. ఎంత సార్ ఖర్చు అవుతుంది...?”

ఏదేదో లెక్కలు వేసి, “మీ పుస్తకం 208 పేజీలకు వస్తుంది. వంద కాపీలు ప్రింటు చేస్తే, 16,500/- రూపాయలు ఖర్చు అవుతుంది... అన్నారు.

ఒక పుస్తకానికి సుమారుగా ఎంత రేటు పెట్టవచ్చు...?”

మాక్సిమమ్ ఒక పుస్తకం రేటు 150 రూపాయల ఖరీదు పెట్టచ్చు...

వంద కాపీలు అమ్ముడు పోయినా 15,000/- రూపాయలే కదా వస్తుంది. అందులో అమ్మే వాళ్ళకు 30 శాతం ఇచ్చేస్తే, పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా రాదు కదా....

తక్కువ పుస్తకాలు ప్రింటు వేసినా అంతే ఖర్చు అవుతుంది. మీ కథలను ప్రింటు పుస్తకంలో చూసిన సంతోషమే మిగులుతుంది...

రచయత--పబ్లిషర్ సరిసగం అనే పధకంతో రచయతల పుస్తకాలను ప్రింటు చేస్తున్న ఒక పబ్లిషర్ దగ్గరకు వెళ్ళాను.

మీరు పత్రికలలో కథలు రాసింది నీళ్లపై రాసిన అక్షరాల లాగా. అది వరదలో కొట్టుకు పోతుంది. కానీ పుస్తకం అనేది రాతి మీద చెక్కిన అక్షరాల లాగా సంవత్సరాల తరబడి నిలిచిపోతుంది. మీ పేరు కలకాలం నిలబడుతుంది. అందువల్ల లాభ--నష్ట లెక్కలన్నీ చూడకండి... అన్నారు.

ఒకే ఒక పబ్లిషర్ నా పుస్తకాన్ని ప్రింటు వేయటానికి  ముందుకు వచ్చాడు. కానీ ప్రింటు చేసే 500 పుస్తకాలలో 200 పుస్తకాలు 30 శాతం డిస్కౌంటుతో నేనే కొనుక్కోవాలి అన్నారు.

అయినా కానీ 200 పుస్తకాలు కొని నేనెలా అమ్మగలను అన్న అనుమానంతోనూ, అన్ని పుస్తకాలను మా చిన్న ఇంట్లో పెట్టుకుంటే నా భార్య నాకు ఖచ్చితంగా విడాకులు ఇచ్చి తరిమేస్తుంది. అందువలన వాళ్ళు చెప్పింది నేను ఒప్పుకోలేదు.

పలు పబ్లిషర్స్ తో మాట్లాడటం వలన పబ్లిషింగ్ వ్యాపారం అనేది ఆత్మహత్యకు సమానమైనది అని నేను అర్ధం చేసుకున్నందువలన పబ్లిషర్ పైనా నాకు కోపం రాలేదు.

నా పుస్తకం ప్రింట్ అయ్యి  తెలుగు సాహిత్యంలో రెవల్యూషన్ తీసుకురాదు కాబట్టి, పుస్తకాన్ని ప్రచురించాలనే ఐడియా నుండి బయటకు వచ్చి, మామూలుగా వార పత్రికలకూ, మాస పత్రికలకూ కథలు రాస్తున్నాను.

ఒకసారి ఒక ప్రసిద్ద వార పత్రిక నిర్వహించిన కథల పోటిలో నా కథకు మొదటి బహుమతి రావటంతో, నా పూర్తి అడ్రస్సుతో నా వివరాలు కూడా ప్రచురించినందువలన నా కథను విమర్శిస్తూ ఒక ప్రసిద్ద రచయత పోస్టు కార్డు మీద రాసి పంపించారు. టెలిఫోన్, సెల్ ఫోన్, ఈమైల్ లాంటి నవీన వసతులు అందుబాటులో ఉన్నా తన విమర్శను పొస్టు కార్డు మీద రాసిన ఆశ్చర్యకరమైన వ్యక్తి.

వేరు వేరు పత్రికలలో కవితలు కూడా రాస్తాను అని తెలియటం వలన ఆయన నాకు బాగా సన్నిహితులయ్యారు.

మీ కథలన్నిటినీ కలిపి పుస్తకంగా వేయండి...అని రోజూ సనుగుతూ ఉంటారు.

పబ్లిషర్స్ ఎవరూ ముందుకు రావటం లేదని చెప్పాను.

వాళ్ళు మిమ్మల్ని చెడుపుతున్నారు. మీరే పుస్తకాన్ని పబ్లిష్ చేయండి. ఖర్చు తక్కువగానే అవుతుంది... అన్నారు.

పుస్తకం వేసినా ఎలా అమ్మాలి...?”

హైదరాబాద్ బుక్ ఎక్జిబిషన్ లో బోలెడుమంది పబ్లిషర్స్ స్టాల్స్ పెడతారు. నాలుగైదు పెద్ద పబ్లిషర్స్ స్టాల్స్ లో ఉంచితే మీ పుస్తకాలు అటుకులులాగా అమ్ముడుపోతాయి.

చాలా సాహిత్య సంఘాలు పుస్తకాలకు బహుమతులు ఇస్తున్నారు. వాళ్ళకూ పంపండి. ఏదైనా బహుమతి లభిస్తే...పెట్టుబడి డబ్బులు వచ్చేస్తాయి...ఆయన చెప్పింది నాలో ఆశను ప్రేరేపించినా నేను ధైర్యం చూపలేదు.

ప్రభలమైన రచయత ఒకరు ఫేస్ బుక్ పేజీలో ప్రింట్ ఆన్ డిమాండ్గురించి రాసి, ఇరవై పుస్తకాలు కూడా ముద్రించుకోవచ్చు అని వివరణ ఇవ్వటంతో, ధైర్యం చేసి దిగాను.

ప్రింటింగ్ ప్రెస్ ఒకదాన్ని కనిబెట్టి ఈమైలులో పుస్తక ప్రింట్ కాపీని పంపించాను.

ఒక వారం రోజులలోనే పుస్తకాన్ని ప్రింట్ చేసి ఇచ్చారు. ప్రెస్సులో ఉన్నాయన ఒక కాపీని తీసి నాకివ్వటంతో, పేగు బంధాన్ని కత్తిరించిన రక్త మరకలతో ఉన్న ఒక బిడ్డను చేతుల్లోకి తీసుకున్నట్టు నా చేతుల్లోకి తీసుకున్నాను. తిరగేస్తున్నప్పుడు ఒళ్ళు జలదరించటం అనుభవించాను.

బుక్ ఎక్జిబిషన్ మొదలుపెట్టిన మరుసటి రోజు శనివారం సాయంత్రం మొత్త పుస్తకాలనూ ఒక కర్రల సంచీలో వేసుకుని బయలుదేరాను. వీధిలో పుస్తకాల సంచీతో నడవటం సిగ్గుగా అనిపించింది. చేతులు కూడా నొప్పి పుట్టినై.

పుస్తకాలను తలమీద మోసుకుని అమ్మి సాహిత్యాన్ని పెంచిన రచయత జ్ఞాపకాలలోకి వచ్చి వెళ్లారు. ఆయన ముందు నేనెంత.

మొదటగా కంటికి కనిపించిన స్టాల్ లోపలకు వెళ్ళాను. నేను రాసిన ఒక కథ వాళ్ల పత్రికలో ప్రచురణ అయ్యిందే అనే నమ్మకంతో నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

నా పుస్తకాన్ని మీ స్టాలులో ఉంచుకుని అమ్మి పెట్టగలరా...?” అన్నాను.

ఆయన తన సీటు నుండి పైకిలేచి భవ్యంగా ఓనర్ గారినే అడగాలండీ... అన్నారు.

ఆయన ఎప్పుడు వస్తారు...?” అని అడిగాను ఉత్సాహం తగ్గ...

రోజు వచ్చి వెళ్ళి పోయారు. ఇక రేపే వస్తారు. కొన్నిసార్లు సాయంత్రం కూడా వస్తారు...

చాలా స్టాల్స్ లో నుండి ఇదేలాగానే జవాబు వచ్చింది.

కొన్ని స్టాల్స్ లో ఇప్పటికే మా దగ్గర ఉన్న పూర్తి పుస్తకాలనూ డిస్ ప్లేచేయటానికే మా స్టాల్లో చోటులేదు. అలమరాల కింద కూడా కొన్ని పుస్తకాలను పెట్టున్నాము. ఇందులో మీ పుస్తకం తీసుకుని ఎక్కడ పెడతాం సార్. సారీ సార్...

నేను బాగా నీరసించిపోయాను.

తరువాత ఎక్కువ స్టాల్స్ లో విచారించ లేదు. సాహిత్యం కోసం తనని తానే అర్పించుకున్న ఒక రచయతను చూడటం జరిగింది. పరిగెత్తుకు వెళ్ళి ఆయన దగ్గర మెరపెట్టుకున్నాను.

అధిక ప్రసంగి తనంగా ఒక కార్యం చేసాను సార్... అన్నాను.

అలాగా ఏం చేసి తగలడ్డారు... అన్నారు నవ్వుతూ.

సొంతంగా ఖర్చుపెట్టి నా కథలు సంపుటిని పుస్తక రూపంలో తీసుకు వచ్చాను... అన్నాను.

అయ్యయ్యో, అది చాలా పెద్ద తప్పు కదా! పర్సు ఖాలీ చేస్తుందే... అన్న ఆయన నా పుస్తకాన్ని తీసుకుని చూసారు.

పైపైన చూసేసి బాగానే వచ్చింది... అని గొణిగారు.

మీ స్టాల్లో నా పుస్తకాన్ని డిస్ ప్లేలో పెడతారా...

...దారాళంగా పెడతాను... అన్నాడు.

పది పుస్తకాలు ఇవ్వనా సార్... అంటూ పుస్తకాలను తీసి పెడుతుంటే ఆయన నవ్వాడు.

ఒకటి, రెండు పుస్తకాల కంటే ఎక్కువ అమ్ముడుపోవు. ఎక్కువగా ఐదు పుస్తకాలు అమ్మితే మీరు పెద్ద రచయత అని అర్ధం. సరే, మీ ఆశను ఎందుకు చెడపాలి. ఇచ్చి వెళ్ళండి...

చేతులు నొప్పి పుడుతున్నాయి సార్. కొంచం బరువైనా తగ్గనివ్వండి...

కానీ మర్చిపోకుండా ఎక్జిబిషన్ పూర్తి అయిన మరుసటి రోజు మిగిలిన పుస్తకాలను తీసుకెళ్ళాలి... అన్న ఆయన నన్ను స్టాల్లో నిలబెట్టి సెల్ ఫోనులో ఫోటో తీసారు.

తరువాత నాకు పరిచియమున్న కొన్ని స్టాల్స్ లో అడిగాను. వాళ్ళు కూడా చోటు లేదు అని చెప్పారు.

చాలనుకుని ఎక్జిబిషన్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చాను. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టినై.

ఎక్జిబిషన్ కు వెళ్ళే రోడ్డుకు ఇరువైపులా పుస్తకాలు తప్ప ఏవేవో అమ్ముతున్నారు.

ఒక చోట కారు ఒకటి నిలబెట్టి ఉన్నది. కాసేపు రెస్టు తీసుకుందామని పుస్తకాల సంచీని కారు డిక్కీ మీద పెట్టి మసాలా టీ కొనుక్కుని తాగుతున్నాను.

రోడ్డు నుండి చాలా మంది బుక్ ఎక్జిబిషన్ కు వెళుతున్నారు, వస్తున్నారు. వాళ్ళల్లో కొందరైనా నా పుస్తకాలను చూస్తారేమోననే ఆశతో సంచీలో నుండి కొన్ని పుస్తకాలు తీసి కారు డిక్కీపైన ఉంచాను. నేను ఆశపడినట్లే వెళుతున్న వారిలో కొంతమంది నా పుస్తకాలను చూసి, కారు దగ్గరకు వచ్చి, డిక్కీపైన పెట్టున్న పుస్తకాలను చేతిలోకి తీసుకుని తిరగేసి చూశారు.

ఎవరైనా కొనటానికి ఇష్టపడి అడిగితే సగం ధరకే ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఒకటో, రెండో అమ్మినా బరువు తగ్గుతుందే అనుకున్నాను. కానీ ఎవరూ ధర ఎంత అని కూడా అడగలేదు.

ఇద్దరు ముగ్గురు ఆసక్తిగా పుస్తకాన్ని తెరిచి చూస్తున్నారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు, బహుశ తండ్రీ-కొడుకులు అనుకుంటా అక్కడికి వచ్చారు.

వాళ్ళిద్దరూ ఒకే రకం దుస్తులు వేసుకోనున్నారు. వాళ్ళిద్దర్నీ విచిత్రంగా చూస్తూ నిలబడ్డాను.

కొడుకులాగా ఉండే అతను, కారుకు పక్కన ఒకడు బ్యాటరీతో పనిచేసే బొమ్మలను అమ్మటాన్ని ఆశగా చూస్తున్నాడు.

తండ్రిలాగా ఉన్న అతను తన చేతిలో ఉన్న పుస్తకాల సంచీని కారుకు ఆనించి, కారుపైన ఉన్న నా పుస్తకాలను చూస్తూ ఉన్నారు.

కొద్దిసేపట్లో ఆయన పుస్తకాల సంచీ కిందకు ఒరగటంతో ఆయన గబుక్కున వొంగి సంచీని పట్టుకోవటానికి వేగంగా కిందకు వంగినప్పుడు అతని చెతుల తాకిడికి కారుపైన ఉంచిన నా పుస్తకాలలో కొన్ని జారి కిందపడ్డాయి.

వెంటనే ఆయన సారీ సార్... అని అంటూ నేల మీద పడ్డ నా పుస్తకాలను ఏరి కారుపైన పెట్టాడు. మళ్ళీ నా దగ్గర సారీ చెప్పి, పిల్లాడ్ని పిలుచుకుని బయలుదేరి వెళ్ళాడు.

మరికొద్ది నిమిషాలలో కారుకు సొంతమైన ఒనర్ వచ్చి కారు తీయటంతో, నేనూ పుస్తకాలను అర్జెంటుగా తీసి కర్రల సంచీలో కుక్కి సంచీ తీసుకుని ఇంటికి బయలుదేరాను.

పుస్తకాల ఎక్జిబిషన్ చివరి రోజున, స్టాలులో ఉన్న పుస్తకాలను తీసి అట్ట పెట్టెల్లో సర్దుతున్నారు స్టాల్ వర్కర్స్.

నా పుస్తకాన్ని అమ్మటం కొసం పెట్టిన పుస్తకాల స్టాలు దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు కూడా స్టాలులోని అమ్ముడుపోని పుస్తకాలను ఒక లాగుడు బండీలో పెడుతున్నారు.

అప్పుడు స్టాలులో కుర్చోనున్న రచయత స్టాల్ ఓనరు మంచి టైములో వచ్చారు సార్... ఒక్క పుస్తకం కూడా అమ్ముడు పోలేదు అని చెప్పి, నేను స్టాలుకు ఇచ్చిన పుస్తకాలను తీసి ఇచ్చాడు.

మీరు ఫేస్ బుక్ లో రాసుంటే ఒకటో, రెండో అయినా అమ్ముడు పోయుంటాయి సార్... అన్నారు.

దాంట్లో కూడా రాసాను సార్. ఇద్దరు లైక్ చేసారు. అంతే...అన్నాను నవ్వుతూ.

ఇందులో లైక్ చేయటానికి ఏముంది. ఒకటి కొనాలి, లేకపోతే కాముగా ఉండాలి... అన్న ఆయన,

సరే వదలండి...నేను నా పేజీలో మీ గురించీ, మీ కథా సంపుటి గురించి రాస్తాను... అన్నారు.

ఒక పుస్తకం కూడా అమ్ముడు పోని నా కథా సంపుటి పుస్తకాన్ని మహేశ్వరీ అనే ఆవిడ చదివేనని చెప్పడమే నన్ను కన్ ఫ్యూజ్ చేసింది.

వేగంగా వెళ్ళి పుస్తకాలు పెట్టున్న అలమరా తెరిచి లెక్క పెట్టాను. ఆశ్చర్యంగా 51 పుస్తకాలే ఉన్నాయి. అలాగైతే ఒక పుస్తకం ఎక్కడ పోయుంటుంది? దాన్నే మహేశ్వరీ చదివిందనేది అర్ధమయ్యింది.

కానీ ఆమెకు ఎలా దొరికింది? ఇప్పుడది అబద్దం నుండి అన్వేషణగా మారింది.

మంచికాలం నన్ను ఒక అన్వేషణ కథ రాయనివ్వకుండా ఒకాయన వెతుక్కుంటూ వచ్చారు.

ఆయన్ని నేను ఎక్కడో చూసిన గుర్తు. ఎక్కువగా ఆలొచించే అవకాశం ఇవ్వకుండా వెంటనే జ్ఞాపకానికి వచ్చింది.

రోజు పుస్తకాల ఎక్జిబిషన్ బయట ఒక కారు మీద పుస్తకాలను తీసి పెట్టి, నేను రెస్టు తీసుకుంటున్నప్పుడు, ఒకేలాంటి డ్రస్సు వేసుకుని తండ్రీ-కొడుకులు వచ్చారే. అందులో తండ్రిలాగా ఉన్నతనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది.

వచ్చినతను కూడా నాకు పెద్దగా ఆలొచించే సమయం ఇవ్వలేదు. తనని మహేశ్వరీ భర్త అని పరిచయం చేసుకున్నాడు.

నా పుస్తకం మీకు ఎలా సార్ దొరికింది?” అన్నాను ఆతురతతో.

రోజు నా పుస్తకాల సంచీ కిందపడుతూ, మీరు కారు పైన పెట్టిన మీ పుస్తకాలలో కొన్ని నా చేయి తగలి కిద పడిపోయినై చూడండి, అప్పుడు నేను కిందపడిన మీ పుస్తకాలను తీసి కారు మీద పెట్టాను...అప్పుడు అనుకోకుండా మీ పుస్తకం ఒకటి నా సంచీలో పడింది. నేను అది చూసుకోలేదు. తప్పే సార్. నేను చూసుకోనుండాలి. సారీ సార్ అంటూ పుస్తకం ఖరీదు డబ్బును నాకు అందించాడు.

డబ్బులేమీ వద్దు సార్. మీ భార్య నా కథలను హిందీలోకి అనువాదం చేస్తానంది. అదే చాలు... అంటూ డబ్బును తీసుకొవటానికి నిరాకరించాను.

ఇప్పటికే మీ పుస్తకాన్ని దొంగలించుకు వచ్చానని చాలా ఎక్కువగా తిట్టింది. ఇప్పుడు మీకు డబ్బులివ్వకుండా వెడితే నా భార్య నన్ను ఇంట్లోకే రానివ్వదు అంటూ బలవంతంగా నా జేబులో డబ్బులు కుక్కాడు.

సారి జరగబోయే బుక్ ఎక్జిబిషన్ కైనా మీ భార్యను తీసుకు వెళ్ళండి సార్... అన్నాను.

ఆమెకు చిన్న వయసులోనే రెండు కాళ్ళకూ పోలియో అటాక్ వచ్చి ఆమె వలన మామూలుగా నడవలేకపోతోంది. అందువలన ఆమె బయటకు రావటానికి ఎక్కువ ఇష్టపడదు. నేనూ బలవంతం చేయను అని చెప్పి సెలవు తీసుకున్నాడు.

****************************************************సమాప్తం***************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)