అనుకున్నది అనుకోకుండానే...(కథ)

 

                                                         అనుకున్నది అనుకోకుండానే                                                                                                                                                   (కథ)

నాకెందుకో భయంగా ఉన్నది మితున్. పాపం అనిపిస్తోంది. ఆయన దగ్గర నాకు ఎటువంటి లోటూ లేదు. ఆయన్ని చంపే మనిద్దరం ఒకటవ్వాలా అనేది నాకు అవసరమా అని అనిపిస్తోంది. వణుకుగానూ ఉంది

వేరే దారి? ఇలా మనం ఎన్ని రోజులని దొంగతనంగా కలుసుకునేది? రెండు, మూడు సార్లు మనిద్దరం ఒంటరిగా ఉండటాన్ని నీ భర్త వంశీ చూశాసాడే. ప్రారంభంలో మనల్ని అతను స్నేహితులని అనుకోనుంటాడు. ఇప్పడు అతను మనల్ని అనుమానిస్తునట్టు తెలుస్తోంది. అతనా, నేనా అన్న సమస్యలో అతను నన్ను చంపేసినా ఆశ్చర్యపడలేము. అలా ఏదైనా జరిగితే నన్ను నువ్వు పోగొట్టుకోవటం మాత్రమే కాదు, తరువాత అతనితో నువ్వు ప్రశాంతంగా జీవించలేవు

మొత్తం డబ్బు ఇస్తేనే పని ప్రారంబించటం జరుగుతుంది. ఇదంతా వాయుదా పద్దతిలో తీసుకోవటం  కుదరదు. మనం దాని తరువాత కలుసుకోలేము. కలుసుకోనూ కూడదు మితున్. ఇప్పుడంతా ఇది నువ్వు అనుకున్నంత ఈజీగా ముగించే పనికాదు. ఊర్లో ఎక్కడ చూడూ సిసి టీవి కెమేరాలు, వాహన చెకింగ్స్, పోలీసు రౌండ్స్, విచారణ అంటూ ఒక చిన్న క్లూ దొరికినా కూడా, దారం పట్టుకున్నట్టు అందరినీ పట్టేస్తారు. కొంచం కూడా అనుమానం రాకుండా ఉండేటట్టు నడుచుకుని, ఖచ్చితమైన స్కెచ్ వేయాలి. దీనికోసం ఎక్కువ వర్క్ అవుట్ చేయాల్సింది ఉంది. మంచిగా చేసి ముగించేలోపు నోరు తడారిపోతుంది. పదిలక్షలకు తక్కువగా చెయ్యలేము. అంతే కాదు, మొత్త డబ్బునూ మొదటే ఇచ్చేయాలి

వాళ్ళు అనుకున్నది చేయగలిగారా లేక పట్టుబడ్డారా? తెలుసుకోవటానికి కథ చదవండి.

*****************************************************************************************************

నాకెందుకో భయంగా ఉన్నది మితున్. పాపం అనిపిస్తోంది. వంశీ దగ్గర నాకు ఎటువంటి లోటూ లేదు. అతన్ని చంపే మనిద్దరం ఒకటవ్వాలా అనేది నాకు అవసరమా అని అనిపిస్తోంది. వణుకుగానూ ఉంది

వేరే దారి? ఇలా మనం ఎన్ని రోజులని దొంగతనంగా కలుసుకునేది? రెండు, మూడు సార్లు మనిద్దరం ఒంటరిగా ఉండటాన్ని నీ భర్త వంశీ చూశాసాడే. ప్రారంభంలో మనల్ని అతను స్నేహితులని అనుకోనుంటాడు. ఇప్పడు అతను మనల్ని అనుమానిస్తునట్టు తెలుస్తోంది. అతనా, నేనా అన్న సమస్యలో అతను నన్ను చంపేసినా ఆశ్చర్యపడలేము. అలా ఏదైనా జరిగితే నన్ను నువ్వు పోగొట్టుకోవటం మాత్రమే కాదు, తరువాత అతనితో నువ్వు ప్రశాంతంగా జీవించలేవు

మితున్ నువ్వు చెప్పేదంతా కరక్టే. ఆయన్ని చంపే ప్లానులో ఎవరైనా తప్పు చేస్తే అందరి జీవితాలూ నాశనమైపోతాయి

అలాగంతా ఏమీ జరగదు. పక్కాగా స్కెచ్ వేసి ఉంచాను. అన్నిటినీ కరెక్టుగా ఎగ్జిక్యూట్ చేసి ఆత్మహత్య అని కేసు ముగించవచ్చు. దానికోసం అక్కడక్కడ మనుషులను రెడీ చేసి ఉంచాను

వద్దు మితున్. భయంగా ఉంది. ఇదంతా అవసరమా అని కొంచం ఆలొచిద్దాం. మాట్లాడకుండా మనిద్దరం స్నేహితులుగానే ఉండి పోదామే!

ఏంటమ్మా నీ భర్త మీద నీకు జాలి ఏర్పడుతోందా. పాపం అతను ఎందుకు చచ్చి పోవడం అని నీకు అనిపిస్తే నన్ను మర్చిపో. అతనితోనే జీవించు. నీకోసం, నీ జ్ఞాపకంతో పెళ్ళే చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నాను చూడు. నాకు ఇది కావలసిందే. దీనికంటే ఇంకా ఎక్కువే కావాలి. కాబట్టి మనం విడిపోదాం. మనం కలిసి జీవించిన కలల జీవితం ఒక కలగానే ఉండిపోనీ. కానీ ఒక విషయం స్నేహా, నేను జీవిస్తే నీ జ్ఞాపకాలతోనే జీవిస్తానే తప్ప, ఇంకెవరినీ పెళ్ళి చేసుకోను. గుడ్ బై” 

అయ్యో మితున్! నన్ను అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మనం కలుసుకున్న ఆరేడు నెలలలో ఏరోజైతే వంశీని చంపేద్దామని ప్లాన్  వేశామో రోజు నుండే మనకు ప్రశాంతత పోయింది. మితున్! నాకు నువ్వేరా కావాలి. నన్ను నీ దగ్గర అప్పగించినట్టే అన్నిటినీ వదిలిపెడతాను. గో అహెడ్. దొరకకుండా ఉండాలి. అంతే. అన్నిటినీ ముగించి ఎక్కడికైనా గుడులూ, గోపురాలూ, నదులకు వెళ్ళి పాపాన్ని కడుక్కుని వచ్చేద్దాం

నువ్వు మాట్లాడకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపో. నేను అన్నీ చూసుకుంటాను. వంశీ వచ్చే టైమైంది. నేను బయలుదేరుతాను. బై...గుడ్ నైట్

మితున్, ఒక్క నిమిషం. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? రెండో, మూడో ఇంటర్వ్యూ లకు వెళ్ళినట్టు చెప్పావే. ఎనీ పాజిటివి న్యూస్? ఇవన్నీ జరగటానికి ముందు నువ్వు లైఫ్ లో సెటిల్ అవాలిరా. జీవితంలో ఎంత పెద్ద  రిస్క్ తీసుకున్నాము. దీన్ని విజయవంతంగా ముగించాలి. తప్పు జరగకూడదు. ఖర్చులకు ఏమైనా డబ్బులు కావాలా చెప్పు. ఏదైనా క్యాష్ గానే తీసుకో. అకౌంట్ ట్రాన్స్ ఫర్, ఫోన్ పే, జి పే చేసి దొరికిపోకూడదు

తరువాత మొత్తంగా తీసుకుంటా స్నేహా. మొదట అన్నీ మెటీరయలైజ్ అవనీ. ఎప్పుడూలాగా వంశీ దగ్గర ప్రేమగానే ఉండు. అతను ఏదడిగినా, ఎలా కావాలన్నా అలాగే చెయ్యి. పాపం అతను కొన్ని రోజులైనా అనుభవించి పోనీ. అతనితో సన్నిహితంగా ఉన్నప్పుడు నిన్ను మరచి మితున్అని మాత్రం నా పేరు చెప్పి తగలడకు

“‘ఛీనీకెప్పుడూ అదే ధ్యాస

మితున్ బయలుదేరాడు.

ఇదంతా చాలదు మితున్. ఇప్పుడంతా ఇది నువ్వు అనుకున్నంత ఈజీగా ముగించే పనికాదు. ఊర్లో ఎక్కడ చూడూ సిసి టీవి కెమేరాలు, వాహన చెకింగ్స్, పోలీసు రౌండ్స్, విచారణ అంటూ ఒక చిన్న క్లూ దొరికినా కూడా, దారం పట్టుకున్నట్టు అందరినీ పట్టేస్తారు. కొంచం కూడా అనుమానం రాకుండా ఉండేటట్టు నడుచుకుని, ఖచ్చితమైన స్కెచ్ వేయాలి. దీనికోసం ఎక్కువ వర్క్ అవుట్ చేయాల్సింది ఉంది. మంచిగా చేసి ముగించేలోపు నోరు తడారిపోతుంది. పదిలక్షలకు తక్కువగా చెయ్యలేము. అంతే కాదు, మొత్త డబ్బునూ మొదటే ఇచ్చేయాలి

ఏర్పాటు చేస్తాను అన్నా. ఇది ఎలా చెయ్యబోతారు, ఎన్ని రోజులు అవుతుంది?”

అదంతా నీ దగ్గర ఎలా చెప్పగలను? నీ తాళి స్నేహా మెడలో ఎక్కాలి. ఇప్పుడు ఆమె మెడలో వేలాడుతున్న వంశీ కట్టిన తాళిని తెంపాలి. అంతే కదా? అది మాత్రం ఆలొచించు. మిగతాది నేను చూసుకుంటాను. బెంగళూరులో నీకు ఉద్యోగం దొరుకుతుందని చెబుతూ వచ్చేవు. వంశీ దగ్గర నుండి కొట్టుకొచ్చే  డబ్బుతో అతని భార్య దయతో ఒకటి లేక ఒకటిన్నర కోటితో ఒక డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంటు కొని స్నేహా తో హాయిగా బెంగళూరులో సెటిల్ అయిపొయే దారి చూసుకో. అది సరే...మనం మాట్లాడుకున్నట్టు పది లక్షలు ఎప్పుడు  ఇవ్వబోతున్నావు?”

అన్నా, చేతిలో ఎనిమిది లక్షలు ఉన్నాయి. మిగతా రెండూ పని ముగిసిన తరువాత ఇస్తాను

కుదరదు తమ్ముడూ. మొత్తం ఇస్తేనే పని ప్రారంబించటం జరుగుతుంది. ఇదంతా వాయుదా పద్దతిలో తీసుకోవటం  కుదరదు. మనం దాని తరువాత కలుసుకోలేము. కలుసుకోనూ కూడదు. ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళింది ఎవరికీ తెలియకూడదు. అంతా వన్ టైమ్ సెటిల్ మెంటుగా ఉండాలి. ఓకే? కావాలంటే ఒక వారం రోజులు టైము తీసుకో. మనుషులు రెడీగా ఉన్నారు. వాళ్ళకు పని ఇవ్వాలి

మితున్ అక్కడ్నుండి బయలుదేరాడు.

మితున్ సమస్య ఏమీ రాదే? ఒక నెల రోజుల నుండీ నేను అయోమయంలో ఉన్నాను. నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఆయన్ని చంపే తీరాలా?”

"వేరే దారిలేదని ఇంతకు ముందే చెప్పాను కదా స్నేహా? వంశీని మనం చంపకపోతే, అతను మనల్ని చంపేస్తాడు. ఆల్ రెడీ అతనికి మన మీద ఒక అనుమానం ఉంది. కోపంగానూ ఉన్నాడు. అతను కూడా కరెక్టు సమయం కోసం చూస్తూ ఉండుంటాడు. నీకు మనిద్దరం కలిసి జీవించాలనే ఆశలేదనుకో. చెప్పు. ప్లాన్ డ్రాప్ చేసేద్దాం. నన్ను మర్చిపో. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండి తగలడు

మితున్ ఎందుకురా ఇలా కోపంగా మాట్లాడుతున్నావు? నిన్ను మాత్రం నేను  ఒంటరిగా వదిలేస్తానా? నాకు మాత్రం నీ మీద ప్రేమ లేదంటావా? ఇప్పుడు నన్ను తీసుకుని పారిపోవటానికి రెడిగా ఉన్నావా. చెప్పు. ఇప్పుడే వచ్చేస్తాను. దీన్నే రెండు సంవత్సరాలకు ముందు చేసుండకూడదా? నువ్వు ఏమీ చెప్పకుండా, ఎక్కడికో వెళ్ళిపోయినందువలనే కదా మా అమ్మా-నాన్నా మాటలు నేను వినాల్సి వచ్చింది. అందుకోసమే కదా వంశీని పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించాను.  అన్నీ ముగిసిన తరువాత ఇప్పుడొచ్చి నిలబడ్డావు. నాకు ఎవరు కావాలి? నువ్వా, వంశీనా...నిర్ణయించుకోలేక పోతున్నానే. కానీ నేను ఎక్కువగా జీవించాలని అనుకునేది నీతోనే. దానికొసమే పాపానికి నేను తయారయ్యాను. నిన్ను వదిలేసి వంశీతో నాకేమిట్రా సంతోషం?”

అంతా నాకు అర్ధమవుతోంది స్నేహా. దీర్ఘంగా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇక కన్ ఫ్యూజన్ వద్దు. అన్నిటికీ నేను ఏర్పాటు చేశేసాను. కార్యం ఖచ్చితంగా ప్లాను ప్రకారం పూర్తి అవుతుంది. తరువాత ఏమీ జరగనట్టు కొన్ని రోజులు కాచుకోనుండి, మనం మన పెళ్ళిని జరుపుకుందాం. రేపే కిరాయి గూండాలకు పది లక్షలు ఇచ్చేసి నేను బెంగళూరు వెళ్ళిపోతాను. అక్కడ నాకోక ఉద్యోగం దొరికింది. దేనికీ బాధపడకు. అంతా మంచిగానే జరుగుతుంది. ఇక మీదట నువ్వు వంశీ కోసం జాలిపడకూడదు. జాలి పడితే నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా జీవించలేవు. అతనితో నువ్వు జీవించిన జీవితాన్ని ఒక కలగా అనుకుని మర్చిపో

నా కెందుకో ఇంకా భయంగానే ఉన్నది. దేవుడే మనల్ని కాపాడాలి. మనల్ని  కలపాలి

మంచికాలం వంశీని కాపాడాలని నువ్వు వేడుకోలేదే

ఏమిటో మితున్...అన్నిటినీ నువ్వు చేసుకో. ఇదిగో నువ్వు అడిగినట్లు ఇందులో పది లక్షలు ఉన్నాయి. ఆయనకు తెలియకుండా కొన్ని నగలు అమ్మి, తీసుకుని పెట్టుకున్నాను. తీసుకు వెళ్ళు...

వెళ్ళు అని చెప్పకు స్నేహా. వెళ్ళిరాఅని చెప్పు

మితున్ అక్కడ్నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత స్నేహాకు తల తిప్పుతున్నట్టు అనిపించింది.

హాస్పిటల్ కు వెళ్ళింది.

హలో మిస్టర్ వంశీ కంగ్రాజ్యులేషన్స్. ఎప్పుడు చూడూ మీకు మీ కంపెనీ, దాని అభివ్రుద్ది, లాభం, సాధనలు వాటికి మాత్రమే టైము కేటాయించే వారు. అయినా కానీ, కొద్ది సమయం ముచ్చటించడానికి కూడా మీకు దొరికినట్లుంది...ఇక మీదట బుజ్జగించడానికి కూడా ఎక్కువ టైము కేటాయించవలసి వస్తుంది. ఎందుకంటే మీరు తండ్రి కాబోతున్నారు. మీ భార్య స్నేహా తలతిరుగుతోంది, నీరసంగా ఉంది అంటూ వచ్చింది. పరీక్షించాను. రెండు నెలల గర్భినీ అని తెలిసింది. ఆమెతో మీరు ఎక్కువ టైము ఖర్చుపెట్టాలి. మిసస్ స్నేహా ఇక్కడే నా క్లీనిక్కులోనే  ఉన్నారు. ఆమెతో మాట్లాడతారా? ఇదిగో...

ఏమండీ...నేను స్నేహా మాట్లాడుతున్నాను. బాగున్నారా? వెళ్ళిన విషయం ఏమైంది? ఢిల్లీ నుండి చండీఘర్ వెళ్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ మంత్రిని చూస్తానన్నారు. చూసారా? స్టీల్ కన్ సైన్మెంట్ గురించి మాట్లాడి ముగించారా...మీరు కోట్ చేసిన రేటు ఒప్పుకున్నారా?”

అవన్నీ ఉండనీ స్నేహా...నువ్వు తల్లి కాబోతున్నావు. కంగ్రాట్స్నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని గొడవపెడతావే, ఇక మీదట నీకు లోటు ఉండదు...ఎందుకంటే నీ కొడుకు నీతోనే ఉంటాడు...ఏయ్ స్నేహా ఎందుకు ఏడుస్తున్నావు? సంతోషమైన వార్తను చెప్పావు...సంతోషంగా ఉండాలి. నేను ఊరికి తిరిగి వచిన వెంటనే నీకు ఇంకొక సంతోషమైన వార్త చెబుతాను. ప్లషంట్ షాక్. ఇక నీకు అంతా మంచిగానే ఉండబోతోంది. నువ్వు అనుకున్నట్టే అన్నీ నీకు దొరుకుతాయి. బీ చియర్ ఫుల్”  అని చెప్పి ఫోను పెట్టేశాడు.

తియ్యటి వార్త తెలుసుకున్న వెంటనే బిజినెస్ పనులను దూరానికి తోసి తరువాతి ఫ్లైట్ పుచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చాడు.

రోజు ఇంటి దగ్గర.

స్నేహా డాక్టరమ్మ రాసిచ్చిన మందులన్నీ సరిగ్గా తీసుకుంటున్నావు కదా...భార్య గర్భంగా ఉన్నప్పుడు షాకింగ్ గా వార్తనూ...అది సంతోషమైనదైనా,  సంకటమైనదైనా సరే చెప్పకూడదు. కానీ కొన్ని విషయాలు ఆలస్యం చెయ్యకూడదు. ఆలస్యం చెయటానికి ఇష్టం లేదు. మనసును కొంచం రాయి చేసుకో స్నేహా. నాన్నగారి కంపెనీ ఆయన మరణం తరువాత పలు పరీక్షలను ఎదుర్కున్నది. ..ఆయన రాజకీయాల్లో ఉన్నందువలన ఎలాగో పరిష్కరించుకోగలిగారు. ఆయన తరువాత తమ్ముడూ, నేనూ కంపనీని టేక్ ఓవర్ చేశాము. బిజినస్ ఇప్పుడు అంత గొప్పగా లేదు...దాని కంటే నేను నీతో జీవించాల్సిన రోజులు ఎక్కువ లేవు

వంశీ...ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు?”

నాకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు డయాగ్నస్ చేసారు

వంశీ! మీరు ఏం చెబుతున్నారు?”

నేను ఎవరి దగ్గర చెప్పలేదు. అమ్మకు కూడా ఇది తెలియదు. నీ దగ్గర కూడా ఇది ఎలా చెప్పాలా అని సంకోచించాను. కానీ, దీంతో నీ జీవితమూ సంబంధించి ఉంది కాబట్టి దాచి పెట్టదలుచుకోలేదు. నువ్వు నీ యుక్త వయసులో విధవరాలు అవకూడదని అనుకుంటున్నాను. దయచేసి నేను నీ దగ్గర అడగబోయే విషయానికి నువ్వు ఒప్పుకోవాలి. కాదని చెప్పకూడదు. మొదట నీ కడుపులో ఉన్న పిండాన్ని అబార్షన్ చేయించుకోవాలి

వంశీ! మీకేమైంది రోజు?”

షాక్ అవకు స్నేహా...తరువాత రిక్వస్ట్...మనిద్దరం మ్యూచువల్ గా విడాకులు తీసుకోవాలి. నాకు ఏదైనా జరిగిన తరువాత, నువ్వు అమంగళంగా అయ్యి వేరే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, అన్నీ బాగునప్పుడే మనిద్దరం విడిపోవాలి. నీ పేరు మీద కనీసమైన ఒక మొత్తాన్ని బ్యాంకులో వేసేస్తాను. నువ్వు నీ పుట్టింటికి  వెళ్ళి ఉండిపో. ఏమిట్రా ఇలా దారి మధ్యలో అడవిలో వదిలేసి వెళుతున్నాడే అని అనుకోకు. అన్నీ బాగున్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కదా! నా వరకు నా తమ్ముడు అతని కుటుంబం, మా అమ్మా వాళ్ళే నాకు ఒక పెద్ద ప్రపంచం. తప్పుగా అనుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపో. సారీ స్నేహా.  .లవ్.యూ. ఎప్పుడూ నా మనసులో నువ్వు ఉంటావు. అందరూ సంతోషంగా ఉందాం. నాకు ఏదైనా జరగటానికి ముందే...ప్లీజ్ మనం విడిపోదాం. నువ్వు దీన్ని ఒప్పుకోకపోయినా నా మనసును, నిర్ణయాన్ని మార్చుకోను. నిర్ణయం తీసుకోవాలన్నా నేను పలుమార్లు ఆలొచిస్తాను. నిర్ణయం తీసుకున్న తరువాత ఆలొచించను. నీకే విషయం తెలుసు కదా?”  చెప్పేసి తన బెడ్ రూములోకి వెళ్ళాడు.

స్నేహా గబగబా మేడమీదకు వెళ్ళింది.

ఒసేయ్ దుర్మార్గురాలా...ప్రేమించిన వాడితో వెళ్ళిపోవాలని ఆశపడి, ఇలా కట్టుకున్న భర్తనే చంపటానికి ప్లాన్ వేస్తున్నావే? స్నేహా! నీకు నేను ఏం లోటు చేసాను? ఎందుకే నా జీవితంలోకి వచ్చి తగలడ్డావు? హత్య చేయటం అంత సులభమా పిల్లా! చేసేస్తే మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండగలవా....మూర్కమైన నీ నిర్ణయంలో ఒక చిన్న క్లూ దొరికినా మీరిద్దరూ జైలుకు వెళ్ళటం మాత్రమే కాదు...జీవితాంతం నీ మనశ్శాక్షి నిన్ను చంపుతుందే. ఇదంతా అవసరమా? అందరూ జీవించాలి. ప్రశాంతంగా  జీవించాలి. అందుకునే మీ ఇద్దరినీ విడదీసుకుని నన్ను నేను మీ ఇద్దరి దగ్గర నుండి కాపాడుకున్నాను. స్నేహా...ఎక్కడున్నా నువ్వు బాగుండాలి... మితున్ తో రోజైనా నీకు కష్టం వస్తే నువ్వు దారాళంగా తిరిగి రావచ్చు. నేను ఏలుకుంటాను. హత్యా, ఆత్మహత్యా రెండూ ఒకటే. రెండూ ప్రాణం సంబంధించినవి మాత్రమే కాదు, నేరానికి సంబంధించింది. జీవించాలనే అనుకోవాలే తప్ప ఇలా తప్పు చేయకూడదు. నువ్వు...బాగుండాలి...ఉంటావు

వంశీ, అక్కడేమిట్రా స్నేహా ఫోటోతో మాట్లాడుతూ నిలబడ్డావు? టైము అవుతోంది కదా...భోజనం చేయొద్దా...

ఇదిగో వస్తున్నానమ్మా...

హలో మితున్...నేను స్నేహాను మాట్లాడుతున్నాను. తొందరపడి కిరాయి గూండాల దగ్గర డబ్బులు ఇవ్వకు. ఇక్కడ ఇంట్లో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మనం నేరుగా కలుసుకున్నప్పుడు చెబుతా. మనిద్దరం కొన్ని రోజులు కలుసుకోకుండా ఉందాం. ఫోనులో కూడా మాట్లాడుకోవద్దు

ఏదైనా తప్పైన, బ్యాడ్ న్యూసా స్నేహా...?”

నో,నో...అంతా మంచి న్యూసే. మనం అనుకున్నది అనుకోకుండానే మంచి విధంగా జరగబోతోంది. మనం ఒకటవబోతాం. సస్పెన్స్ గా ఉండనీ. నేరుగా మాట్లాడుకుందాం! బై...

****************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)