ఎందుకింత వేగం…(కథ)
ఎందుకింత వేగం (కథ)
“సుమిత్రా నిన్ను నువ్వు కించపరుచుకోకు. పాపం చేసిన వాళ్ళూ – పుణ్యం చేసిన వాళ్ళూ అని మనుష్యులే మనుష్యులను గణించలేరు...ఆ దేవుడి దయకు ముందు, ఆ దేవుడు చేసే తీర్మానానికి ముందు నీ గురించి తీర్మానించటానికి ఈ మనుష్యులకు హక్కు లేదు. ఆ దేవుడు నిన్ను అర్ధం చేసుకున్నాడు కాబట్టే నీకు, అంటే నువ్వు బ్రతకటనికీ, పూర్తి జీవితం జీవించటానికి, నీ సర్జరీకి మా మూలంగా డబ్బు ఏర్పాటు చేసాడు”
సుమిత్రా కి ఎందుకీ హితబోధ? అంతగా సుమిత్రా జీవితం ఎమంత కష్టంలో ఉంది? సుమిత్రా నిజంగానే పాపం చేసిందా?....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి:
***************************************************************************************************
ఒక మూట
విడిచిన బట్టలు.
నాన్న, అమ్మ, పెద్దన్నయ్య, చిన్న
అన్నయ్య, వదిన
అందరూ ప్రొద్దుటి
స్నానం తరువాత
విడిచిపెట్టిన
మాసిన గుడ్డలు
అందులో ఉన్నాయి.
సోపు పొడి
వేసి రెండు
ఇనుప బకెట్లలో
ఆ గుడ్డలు నానబెట్టి, ఇల్లు
శుబ్రం చేసి, తుడిచి, అందరికీ
మధ్యాహ్న లంచ్
తయారు చేసేసి--బావి
దగ్గర బట్టలు
ఉతకటానికి వెళ్ళినామె... ఆ బట్టలను
ఉతికిన తరువాత వాటిని
తోటలో ఉన్న
వేప చెట్లకు
మధ్య కట్టబడి
ఉంచిన హాంగర్లుపైన
ఆరేసి లోపలకు
వచ్చే లోపల
ప్రొద్దు మిట్ట
మధ్యాహ్నం అయ్యింది.
దాహంతో ఆమె నాలిక
పిడచకట్టుకు పోయింది.
బరువైన బకెట్లను
ఎత్తినందువలనో
ఏమో ఆమెకు
మామూలుగా వచ్చే
గుండె నొప్పి
ఈ రోజు
కొంచం ఎక్కువగానే
వచ్చింది. డాక్టర్
గుండె నొప్పికని
ఇచ్చిన మాత్రలలో
ఒక దాన్ని
తీసుకుంది.
మూలలో ఉంచబడ్డ
మట్టి కుండలో
నుండి చెంబుతో
మంచి నీళ్ళు
తీసుకుని...నోట్లో
పోసుకుని మొదట
మాత్రను మింగింది.
తరువాత దాహం
తీరటానికి, తీరేంత
వరకు చెంబులో
ఉన్న మిగిలిన
నీళ్ళు తాగింది.
ప్రకృతి సహాయంతో
కుండలో చల్లబడ్డ
నీటిని తాగుతున్నప్పుడు
ఆమెకు హాయిగా
ఉన్నట్టు అనిపించింది.
ఒక్క క్షణం
సుఖం...దాన్ని
ఆమె అనుభవించటాన్ని
కూడా సహించలేకపోయింది
ఆమె వదిన.
అంత వరకు
వాకిటి అరుగు
మీద కూర్చుని
ఎదురింటి అమ్మాయితో
పరమపదం ఆడుతూ
సమయాన్ని వేస్టుగా
గడుపుతున్న ఆమె
వదిన ఇప్పుడు
గట్టిగా అరిచింది.
"సుమిత్రా!
మామయ్యా, మీ
అన్నయ్యలు…అందరూ
షాపు నుండి
వస్తున్నారు--గుడికి
వెళ్ళిన అత్తయ్య
కూడా ఇంటికి వస్తున్నట్టు తెలుస్తోంది -- అందరూ ఆకలితో ఉంటారు...తొందరగా కంచాలు
కడిగి, టేబుల్ మీద పెట్టు...అలాగే కాళ్ళు
కడుక్కోటానికి బకెట్టుతో నీళ్ళు పెట్టు... ”
రాణిలాగా వాకిట్లో
కూర్చునే పదిళ్ళదూరం
వరకు వినబడేంత
శబ్ధంతో ఆర్డర్
వేసింది సుమిత్రా
వదిన.
“ప్రొద్దుట్నించి
కాసేపు కూడా
కూర్చోటానికి సమయంలేదు.
ఎక్కువ పనిచేసి
అలసిపోయున్నాను
వదినా! ఈ
రోజు గుండె
నొప్పి కూడా ఎక్కువగా
ఉంది...”-- చెబుదామని
అనుకుంది సుమిత్రా.
కానీ, ధైర్యం
రాలేదు. మనసూ, భావాలూ
విరిగి ‘ఓ’ అంటూ అరిచినై.
‘వదినా!
నువ్వూ ఒక
ఆడదానివే కదా
-- అనారోగ్యంతో బాధపడుతున్న
మరో ఆడదాన్ని
ఇలా కష్టపెట్టటం
ధర్మమా?
నేను చేసింది
తప్పే. అందుకని
ఇంట్లో వాళ్ళంతా
కలిసి నాకు
చావు రావటానికి
ముందే నాకు
మరణశిక్ష విధించారు? అది
చాలదని నా
ఖర్చులకని నెలకు
నాకు కొంచం
సహాయంగా వచ్చే
నా జీతంలో కిరోసిన్
పోసి -- ఆ
స్కూలు ఉద్యోగం
లోంచి నన్ను
ఆపి...ఇప్పుడు
ఇంట్లో బంధించి
దాచిపెట్టారే...? ఇదంతా
నేను ఎవరితో మొరపెట్టుకోగలను...?
నాన్నా...! పెద్దన్నయ్యా!
చిన్ననన్నయ్యా!…
మీ కందరికీ
నా మనసు
ఏడుస్తున్నది వినబడటం
లేదా...? దుఃఖం
కప్పున్న నా
కళ్ళను చూసి
కొంచం కూడా
మీ మనసు
కరగలేదా? నేనెవరు
నాన్నా...? మీరు
కన్న కూతుర్నే
కదా. అన్నయ్యా--నేను
మీ రక్తంలో
ఒక భాగమనేది
మరిచి పోయావా!
కొట్టుకుంటున్న
మీ హృదయం
యొక్క చిన్న
ముక్కను నేననేది
అర్ధం కాలేదా...? మీ
బంధుత్వం అనే
సంకెళ్ళలో నేనూ
ఒక భాగమనేది
మరిచి,
నేను చెప్పే
నిజాన్ని నమ్మక,ఊళ్లో వాళ్ళ
మాటలకు గౌరవమిచ్చి...నన్ను
ఇలా కష్టపెడుతున్నారే...న్యాయమా...?
పాపం అమ్మ...!
జాతకం చూసినాయన
చెప్పిన మాటలు
నమ్మేసింది.
‘త్వరగా
పెళ్ళి చేస్తే
మీ అమ్మాయి ఆరొగ్యం బాగుపడుతుంది’ అని చెప్పారు
జ్యోతిష్కుడు.
కానీ పరిశోధన చేసిన
డాక్టర్ చెప్పాడు...
“సర్జరీ
వెంటనే చేసే
కావాలి -- ఆలస్యం
చేస్తూ పోతే
మంచిది కాదు”
అమ్మ జ్యోతిష్కుడునే
నమ్మింది...సర్జరీ
ట్రీట్మెంటులో
కూతురు చనిపోతుందేమోనన్న
భయం.
అమ్మవారి గుడికి
వెళ్ళి రోజూ
ప్రార్ధన చేసుకుంటూ...విపరీతమైన
ఎండలో గుడిని
పలుసార్లు చుట్టొచ్చి
“తల్లీ
నా కూతురికి
తాళి భాగ్యం
ఇవ్వు...నీకు
బంగారంతో తాళిబొట్టు
చేసి ఇస్తాను...” అని లంచం
మాట్లాడి వస్తుంది.
తల్లి చెప్పింది
మాత్రమే తండ్రి-అన్నాయ్యలూ
వింటున్నారు’
సర్జరీ ట్రీట్మెంట్
గురించి వివరంగా
తెలుసుకోవటానికి
ఒక వారం
రోజులు అమ్మతో
కలిసి ఒక
పెద్ద డాక్టర్ను
చూడటానికి హైదరాబాదుకు
వెళ్ళింది సుమిత్రా.
నాన్న ఊర్లో
లేరు,
అన్నయ్యలిద్దరూ షాపు చూసుకోవాలని చెప్పారు....అమ్మే
తోడు రావలసి
వచ్చింది. ఇంతలో
గ్రామంలో సుమిత్రా
వాళ్ళు నివసిస్తున్న
వీధిలో ఒక
విపరీతమైన కథ
చక్కర్లు కొడుతున్నది.
“సుమిత్రా
దేనికి హైదరాబాదుకు
వెళ్ళిందో తెలుసా? ఆమె
మూడు నెలల
గర్భిణి-- దాన్ని
తీయించుకోవటానికే
తల్లి, కూతుర్ను
లాక్కుని వెళ్ళింది.
కారణం ఎవరో
తెలుసా...? ఆమె
పని చేస్తున్న
స్కూలుకు దగ్గరున్న
బజారు వీధి
చివర్లో అద్దెకుంటున్నాడే... శ్రీకాంత్...అతనే...ఆశ్చర్యంగా
ఉందా? శ్రీకాంత్
భార్య వనితానే
ఈ విషయం
చెప్పింది ...”
వదంతి విని
ఒక వయసు
అమ్మాయి మనసు
విరిగిపోవటం లాంటి
ఘోరమైన విషయం
లోకంలో ఇంకేదీ
లేదు. మొదట
ఆ వీధిలో
ప్రారంభమైన ఆ
వదంతి ఇప్పుడు
ఊరంతా పాకిపోయింది.
“పాపిష్టి
దానా! నీ
వలన మేము
బజారు వీధిలో
తలెత్తుకో లేకపోతున్నాం.
నువ్వు చచ్చిపోయున్నా
మేము ప్రశాంతంగా
ఉండేవాళ్ళం” అన్నయ్యలిద్దరూ...ఆమెను
గొడ్డును బాదినట్టు
బాదినప్పుడు కళ్ళు
తిరిగి పడిపోయింది
సుమిత్రా.
‘అబ్బబ్బా!
ఆ రోజును
తలుచుకుంటేనే...
సుమిత్రా ఒళ్ళూ, మనసూ
కలిసే వణుకుతోందే?’
పాపం సుమిత్రా
తల్లి! కన్నతల్లి
కదా? పరిగెత్తుకుంటూ
వచ్చి కూతుర్ని
లేపి పట్టుకుని
గుండెలకు హత్తుకుంది
-- అది చూసిన
తండ్రి కోపగించుకుని
-- గట్టిగా తల్లి
మొహం మీద
కొట్టిన దెబ్బకు
తల్లి పెదాలు
చిట్లి నోటి
పక్క నుండి
రక్తం కారటం
మొదలుపెట్టింది.
ఆ రోజు
ఇల్లే గందరగోళంగా
ఉండటం సుమిత్రా
ప్రాణం ఉన్నంతవరకు
మర్చిపోగలదా...?
మానవత్వమే లేకుండా
-- నిజా నిజాలు
తెలుసుకొకుండా గుండె
జబ్బుతో ఉన్న
ఆడపిల్లను గొడ్డును
బాదినట్టు బాదిన
వాళ్ళ రాక్షస
చేష్టలను సుమిత్రా
మన్నించగలదా?
నడుస్తున్న కాళ్ళ
శబ్ధం వినిపించింది.
ఆలొచనల నుండి
సుమిత్రా బయటపడింది.
హడావిడి పడుతూ
నీళ్ళ బకెట్ను
ఎత్తి పక్కగా
పెట్టింది.
కంచాలను కడిగి, తుడిచి
-- హాలులో ఉన్న
టేబుల్ మీద
పెట్టేసి-- వంటింట్లోకి
పరిగెత్తింది.
‘ప్రేమ
లేని మనుషులు’ అన్న
ఆలొచన ఆమె
మనసును మరింత
వేదనకు, నొప్పికీ
గురిచేసింది. బకెట్టును
మోసిన శ్రమ
ఆమె శ్వాశను పీల్చుకోవటానికి శ్రమ పెట్టింది.
ఎదురుగా ఉన్న
గోడమీద ఉన్న
అద్దంపై చూపు
పడినప్పుడు తన
పెదాలు లేత
నీలిరంగులో ఉండటం
గమనించింది.
“శ్వాశ
పీల్చుకోవటంలో
శ్రమ ఏర్పడి
పెదాలు నీలి
రంగులోకి మారితే
హృదయానికి కావలసిన
ప్రాణ వాయువు
దొరకక గుండె
కష్టపడుతున్నదని
అర్ధం...ఆ
పరిస్థితిని పెంచుకుంటూ
పోవటం అపాయం” -- డాక్టర్
చెప్పిన మాటలు
గుర్తుకు వచ్చినై.
డాక్టర్లు చెప్పినదంతా
తల్లి తిరిగి
వచ్చినప్పుడు ఇంట్లోని
వాళ్ళందరికీ చెప్పింది.
కానీ ఆవిడ
మాటల్ని ఎవరూ చెవిలో
వేసుకోలేదు.
‘కుటుంబ
గౌరవాన్ని గొయ్యితీసి
పూడ్చిన పాపి
చచ్చిపోనీ’ అన్ననిర్లక్ష్యం.
స్టవ్వు వెలిగించి
పులుసును వేడి
చేస్తున్నది సుమిత్రా.
బావి దగ్గర
వాళ్ళు కాళ్ళు
చేతులు కడుక్కుంటున్న
శబ్ధం వినబడింది.
పక్కింటి అమ్మాయి
తన అన్నయ్య
బహుమతిగా పంపిన
టేప్ రికార్డర్లో
సినిమా పాటలు
పెట్టుకుంది.
కిటికీ ద్వారా
ఆ పాటలు
క్లియర్ గా
వినబడ్డాయి.
“వస్తాను
నేను నీ
ఇంద్ర భవనం
వాకిటికే... తీసుకు వెడతాను నిన్ను తొందరగా
ఇంద్రలోకానికి!”
గబుక్కున సుమిత్రా
కళ్ళల్లో నీళ్ళు
పొంగి బుగ్గలపై
గీతలు గీసింది.
‘ఎంత
కరెక్ట్ అయిన
పాట. అతి
చిన్న వయసులోనే
ఆమెను పిలుచుకు
వెళ్ళటానికి ఇంద్రలోకానికి
ఎందుకంత వేగం?’
కిటికీ నుండి
కనబడుతున్న వేపచెట్టు
కొమ్మపై ఒక
పిచ్చుక కూర్చోనుంది.
గాలివలన తల
ఊపుతున్న కొమ్మల
కదలిక వలన...ఆ
పిచ్చుక రెక్కలు
విప్పుకుని దూసుకుంటూ
అది ఎంతో
వొయ్యారంగా నింగివైపుకు
ఎగురుతున్నది.
పొంగుకొచ్చి మీద
పడుతున్న కన్నీటిని
తుడుచు కుంటూ, వండిన
గిన్నెలను టేబుల్
మీద పెట్టేసి
లోపలకు వచ్చి
ఒక పక్కగా
నిలబడింది.
ఆమె వండవచ్చు
-- కానీ తినేటప్పుడు
ఆమెను చూడటానికి
ఆ ఇంటి
మగవారికి కంపరంగా
ఉన్నది. వాళ్ళ
వరకు సుమిత్రా తల ఎత్తుకోలేని భయంకరమైన తప్పు
చేసిన పాపిస్టిది...కుటుంబాన్ని
చెడపటానికి పుట్టిన
విషపురుగు.
ఆరు నెలల
క్రిందట భర్తతో ముంబై
వెళ్ళిపోయిన చెల్లి
సుష్మా గురించి
వాళ్ళు మాట్లాడుకోవటం
ఆమె చెవులకు
వినబడింది.
“వాళ్ళింట్లో
సుష్మాను చాలా
అరాధిస్తున్నారు...ఏమైనా
అది అదృష్టవంతురాలు...
ఇక్కడా ఒక్కతుందే...”
వదిన యొక్క
హేలన చేసే
మాట...
సుమిత్రాని కుంగదీసింది...గుండె
దడ ఎక్కువై
శ్వాస పీల్చుకోవటం
కష్టమయ్యింది...దుఃఖం
గొంతుకను నొక్క...ఆమె
నిలబడలేకపోయింది.
తలుపును సపోర్టుగా
పట్టుకుంది.
నాలుగు గోడలకు
మధ్య ఆమెకు
సమాది కట్టేసి
-- బంధువుల మాటల
వలన, చేష్టలవలన, చిత్రవధ
చేసినట్లు కష్టపెట్టి
-- శ్రీకాంత్ ఒక
మనిషిగా కొంచం
కూడా బాధపడకుండా
సమాజంలో ఎటువంటి
భయం లేకుండా
తిరుగుతున్నాడే...?
మగవారికొక న్యాయం.
స్త్రీలకు ఒక
న్యాయం ఇచ్చే
అక్రమమైన సమాజం
చూపుల్లో ఆమె
చెడిపోయినది, తప్పు
చేసినది –
ద్రోహి.
ఒక సంవత్సరానికి
ముందే శ్రీకాంత్
పరిచయం ఏర్పడింది
సుమిత్రాకి. అది
కూడా అనుకోని
పరిస్థితుల్లో.
అప్పుడు సుమిత్రా
ఆ ప్రైవేట్
గరల్స్ హైస్కూల్లో
టైపిస్టుగా పనిచేస్తోంది.
మాటి మాటికి
దగ్గు-జలుబు-జ్వరం-ఆ
తరువాత నీరసం
వచ్చేది.
జ్వరం కోసమని
మొదటిసారి డాక్టర్
వేదమూర్తి దగ్గరకు
వెళ్ళినప్పుడే
మొట్ట మొదటి
సారిగా ఆమెకు
ఆమె వ్యాధి
గురించి తెలిసింది.
చిన్న వయసులో
ఎటువంటి జబ్బు
లక్షణాలూ తెలియలేదు.
ఈ డాక్టర్
సలహా ప్రకారమే
గుండె జబ్బులు
స్పెషలిస్టును
కలిసి చూపించుకున్న
తరువాతే తనకున్న
జబ్బు గురించి
వివరంగా తెలుసుకుంది.
ఇది ఒక
విధమైన పుట్టుకతో
వచ్చిన వ్యాధి.
హృదయానికి సంబంధించింది.
పేటెంట్ డక్టస్
ఆర్టీరియోసస్...క్లుప్తంగా
పి.డి.ఏ
అంటారు. సర్జరీ
ద్వారా సరిచేయవచ్చు
-- చెన్నై హాస్పిటల్
కు వెళ్ళి
రావటం మంచిదని
చెప్పారు.
గుండె జబ్బు
పేషెంట్ -- సర్జరీ
చికిత్స చేయాలని
తెలిసిన వెంటనే
సుమిత్రా యొక్క
భావాలు అరిగిపోయినై.
“సర్జరీ
చికిత్స చేసుకోకపోతే?” డాక్టర్
దగ్గర ధైర్యంగానే
అడిగింది.
“వెంటనే
చేయకుండా ఆలస్యం
చేస్తే తరువాత
చికిత్సే చేయలేని
పరిస్థితి ఏర్పడుతుంది
-- హృదయం పాడైపోతుంది.
ఇలాంటి మహిళలు
పెళ్ళి చేసుకుంటే
తల్లి కాబోతున్నప్పుడు
శ్రమ పడతారు.
కరెక్టుగా చెప్పాలంటే
ఈ జబ్బుతో
ఎక్కువ కాలం
బ్రతకటం కుదరకుండా
పోతుంది"
డాక్టర్ యొక్క
వివరణతో ఉత్సాహం
పోయి... భావాలు అరిగిపోయి
మనసు నీరసించిన
దానిలాగా ఉద్యోగానికి
వెళ్తునప్పుడే...
సుమిత్రాకి శ్రీకాంత్
భార్య వనితా
యొక్క స్నేహం
దొరికింది.
డాక్టర్ ఇచ్చిన
మందులు వేసుకుంటూ
ఉద్యోగానికి బజారు
వీధిలో నుండే
వెళ్ళేది. నడుస్తున్నప్పుడు
అప్పుడప్పుడు నీరసం
అనిపించినప్పుడు
బజారు వీధి
చివర ఉన్న
వేపచెట్టు నీడన
కాసేపు సేద
తీర్చుకుని స్కూలుకు
వెళ్ళేది.
అలా ఒకరోజు
సుమిత్రా ఆ
వేప చెట్టుకింద
ఆగి చెట్టుకు
ఆనుకుని సేద
తీర్చుకుంటున్నప్పుడు
“లోపలకు
రండి...ఈ
వీధిలో నుండి
రోజూ మీరు
ఎక్కడికో వెళ్తూ, ఈ
చెట్టుకు ఆనుకుని
సేద తీర్చుకోవటం
నేను చూస్తున్నాను.
ప్లీజ్ లోపలకు
రండి. ఒక
గ్లాసుడు మంచి
నీళ్ళు తాగి, కొద్ది
సేపు రెస్టు
తీసుకుని వెళ్ళండి” బలవంత పెట్టింది
వనితా.
ఏమీ అనలేక
సుమిత్రా ఆమెతో
పాటూ ఇంట్లోకి
వెళ్ళింది.
అలా వనితాతో
పరిచియం ఏర్పడింది.
ఎక్కువ నీరసంగా
ఉందని అనిపించినప్పుడు
వనితా ఇంటికి
వెళ్ళి ఒక
గ్లాసుడు మంచి
నీళ్ళు తాగి, కాసేపు
కూర్చుని వచ్చేది.
నెల రోజుల
తరువాత ఒక
రోజు సుమిత్రా
వనితా వాళ్ళింటి
తలుపు కొడుతున్నప్పుడు, వచ్చి
తలుపులు తీసినతన్ని
చూసి కొంత
ఇబ్బంది పడింది.
అతను వనితా
యొక్క భర్త
శ్రీకాంత్! ఆ
రోజు అతను
పనికి వెళ్ళలేదు...ఇంటి
దగ్గరే ఉన్నాడు...
వనితా తన
భర్త గురించి
ఏమీ చెప్పనే
లేదే? మనసును
దోచే మగ
అందగాడుగా ఉన్నాడే...తనలోనే
ఆశ్చర్యపోయింది
సుమిత్రా.
“మీరు
సుమిత్రా? వనితా
చెప్పింది. రండి
లోపలకు!”
శ్రీకాంత్ రూపం
మాత్రమే అందం
కాదు...అతను
మాట్లాడే విధం
కూడా ఆకర్షణే
అనేది కొద్ది
రోజులలోనే తెలుసుకుంది.
ఆ ప్రైవేట్
స్కూల్లో పనిచేయటం
వలనో ఏమో
ఆమెలో ఒక
బలహీనం ఏర్పడింది.
ఆంగ్ల భాష
మీద అపారమైన
మోహం! ఎవరైనా
ఆ భాషను
అందంగా మాట్లాడితే
చాలు...వాళ్ళ
నోటినే చూస్తూ
ఉంటుంది సుమిత్రా.
శ్రీకాంత్ ఆంగ్ల
భాషను అనర్గలంగానూ, అందంగానూ
మాట్లాడాడు -- దాంట్లో
కవిత్వం కూడా
కలిపాడు -- తను
రాసిన కవిత్వాలను
ఆమెకు చదివి
వినిపించాడు. ఆమెకు
కవిత్వం రాయటం
నేర్పించాడు. అంతే!
మొదట అతను
మాట్లాడిన ఆంగ్ల
భాషకు బానిస
అయ్యింది...దాసి
అయ్యింది. తరువాత
అతని కవిత్వాన్ని
చదవటానికి ఆశపడింది
-- ఆ తరువాత
అతని మీదే
ఆశపడింది.
‘అతని
భార్య రాయిలాగా
ప్రాణంతో ఉన్నప్పుడే
నువ్వు అతన్ని
ప్రేమించి ఏమిటి
లాభం?’ మనస్సాక్షి
సుమిత్రాని హెచ్చరించింది...కానీ
మోహం మత్తు...బుద్దిని
కన్ ఫ్యూజ్
చేసింది.
‘గుండె
జబ్బు మనిషి
-- తొందరలోనే మరణించ
బోయేది...మనసుకు
నచ్చినతన్ని ప్రేమిస్తే
ఏం పాపం
వచ్చేస్తుంది’ అని
తనలో తానే
జవాబు చెప్పుకుంది.
రహస్యమైన మీటింగులు
-- మాటలూ -- మనసును
ఆకర్షించే అతని
ప్రేమ కవితలు, వీటిని
ఆమె మరిచిపోదలుచుకోలేదు.
ఆ సంవత్సరం
ప్రారంభంలోనే పుస్తకాల
షాపులో ఒక
డైరీ కొన్నది.
ఏ రోజు
జరిగిన విషయాలు
ఆ రోజు, రోజూ వాళ్ళు
మాట్లాడుకున్నదీ
అన్నిటినీ వివరంగా
అందులో ఆంగ్లంలోనే
రాయటం మొదలు
పెట్టింది.
ప్రేమ యొక్క
గుర్తు
-- పెద్ద కావ్యంగా
ఉండబోతుంది అనుకుంటున్న
ఆమెకు పెద్ద
దెబ్బ తగిలింది.
ఒక రోజు
భార్య లేని
సమయం సుమిత్రాతో
శ్రీకాంత్ అతి
సన్నిహితంగా ఉండటానికి
ప్రయత్నించినప్పుడు, ఆమె
భయపడుతూ వద్దన్నది.
‘ప్రేమ
అనేది దైవీకమైన
భావము’
దానికి అత్యుత్తమమైన
పీట వేసి
ఉంచుకుంటున్న ఆ
పేద మనసుకు
ఒక పెద్ద
షాక్.
జస్ట్ శరీర
సన్నిహితంతో పుట్టే
ఒక ఆవేశమైన
భావం అది?
మనసు చేదైపోయిన
సుమిత్రా అతని
దగ్గర నుండి
తన మనసును
మెల్లగా విడిపించుకోవాలని
తీర్మానించుకుంది.
కానీ, ఆ
కామ పిసాచి
ఆ రోజు
ఆమె దగ్గరున్న
ఆమె డైరీని
గబుక్కున లాక్కుని
తన సంచీలో
పెట్టేసుకున్నాడు.
శ్రీకాంత్ స్త్రీలను
మోసం చేసే
మోసగాడు అనేది
తరువాతే పూర్తిగా
తెలిసింది.
“నన్ను
ఒంటరిగా కలుసుకుంటేనే
డైరీ తిరిగి
ఇస్తాను. లేకపోతే
మీ నాన్న
దగ్గర ఇచ్చేస్తాను” అంటూ అతను
భయపెట్టినప్పుడు... సుమిత్రా నిజంగానే
భయపడిపోయింది.
“ఒకే
ఒక సారి
నిన్ను ఒంటరిగా
కలుసుకుంటాను -- నా
డైరీ ఇచ్చేయి” అంటూ బ్రతిమిలాడి
ఒప్పుకుంది. ఆ
కలుసుకోవటమే ఆమె
దిగజారిపోవటానికి
కారణమయ్యింది.
‘మాట్లాడుకుంటూ
వెళ్దాం’ అని
చెప్పి, బస్సులో
ఎక్కించుకుని స్నేహితుడి ఇంటికి
ఆమెను అతను
తీసుకు వెళ్ళాడు.
అతనితో ఆమె
ఒంటరిగా ఉన్నది.
జరగ కూడనిది
జరిగిపోయింది. తనని
పిలుచుకు వెళ్ళినవాడు
ప్రేమికుడు కాదు
కామకుడు -- తాగుబోతు, సైకో...నీచమైన
మనిషి...అన్నీ
అర్ధమైనై.
ఇక అర్ధమై
ఏం ప్రయోజనం?
సుమిత్రాని రెండవ
భార్యగా చేసుకోబోతున్నానని
తాగిన మత్తులో
భార్య దగ్గర
మాట్లాడాడు శ్రీకాంత్.
ఏ భార్య
ఒప్పుకుంటుంది? ఆ
డైరీని అతని
దగ్గర నుండి
లాక్కుని తన
దగ్గర పెట్టుకుని
వనితా ఇప్పుడు...తన
స్నేహితురాలు మీద
పగ తీర్చుకోవటం
మొదలుపెట్టింది.
వీధి మహిళలను
పిలిచి కూర్చోబెట్టి
ఆ డైరీని
చదివి,
అనువదించి, సుమిత్రాకీ, శ్రీకాంత్
కూ మధ్య
ఏర్పడిన ప్రేమ
వ్యవహారాన్ని...డప్పు
మోగించి చెప్పింది.
వీధి మహిళలకు
తెలిసిన ఆ
విషయం నిప్పులాగా
ఊరంతా పాకింది.
చెన్నై కు
డాక్టర్ను చూడటానికి
వెళ్ళిన కథను
-- వేరే విధంగా
చిత్రీకరించి అబార్షన్
చేయించుకోవటానికే
అని మాట్లాడేటట్టు
చేయించింది.
ఊరి వాళ్ళ
మాటలు విని
కోపం తెచ్చుకున్న
అన్నయ్యలు నిజానిజాలు
తెలుసుకోకుండా
ఆమెను కొట్టి
ధ్వంశం చేసారు.
ఉద్యోగం నుండి
మానిపించారు. ఇంట్లోనే
బంధించారు. గుండె
జబ్బు ఉన్న
మనిషే అన్న
జాలే చూపకుండా
వదిన ఆమెతో
అన్ని పనులు
చేయించింది.
అదే సమయంలో
ఇంకొక కుట్రకు
పధకం వేసింది
వనితా. సుమిత్రా
చెల్లి సుష్మా
పెళ్ళి నిశ్చయం
చేయబడింది. పెళ్ళి
కొడుకు ఇంటికి
వెళ్ళి సుమిత్రా
రాసిన డైరీని
చూపించి పెళ్ళి
ఆపటానికి ప్రయత్నించింది
వనితా అనేది
తెలుసుకున్న సుమిత్రా
వణికిపోయింది.
తన వలన
తన చెల్లెలి
జీవితం కూడా
నాశనం అవ్వాలా? దీనికి
ముగింపు అత్మహత్య
చేసుకోవటమే...? అన్నిటికీ
కలిపి ఒక
ముగింపు పెట్టేయొచ్చు? కానీ, ఆశ్చర్యకరంగా...
సుష్మా పెళ్ళి
ఎటువంటి ఆటంకం
లేకుండా బ్రహ్మాండంగా
జరిగింది.
భోజనం చేసిన
తరువాత...నాన్నా-అన్నయ్యలు
ముందు గదిలో
కూర్చుని మాట్లా డుకుంటున్నారు.
అందరూ భోజనాలు
చేసేరా అనేది
నిర్ధారణ చేసుకుని, చివరగా
సుమిత్రా భోజనం
చేసింది.
‘ఇక
ఈ శరీరానికి
భోజనం ఒకటే
తక్కువ’ అని
ఆమె మనసు
నలిగిపోయింది.
నాలుగింటికి అన్నయ్యలిద్దరూ
షాపు చూసుకోవటానికి
వెళ్ళిపోయారు.
తల్లి దగ్గరలో
ఉన్న గుడికి
ఎప్పుడూలాగానే
సాయంత్రం పూజను
చూడటానికి వెళ్ళింది.
వదిన పక్క
వీధిలో ఉన్న
స్నేహితురాలు ఇంటికి
వెళ్ళింది.
సుమిత్రా మాత్రమే
ఒంటరిగా ఇంట్లో
ఉన్నది. తలుపు
కొడుతున్న శబ్ధం
వినిపించింది. తలుపు
తెరిచినప్పుడు
ఆ ప్రైవేట్
స్కూలు ప్రధానోపాధ్యాయురాలు... కళ్యాణీ బయట
నిలబడింది.
“రండి--లోపలకు
రండి. కూర్చోండి!” హడావిడి పడుతూ
ఉపచరణ చేసింది
సుమిత్రా.
“ఎక్కువసేపు
కూర్చోటానికి టైము
లేదు. నీ
దగ్గర ఒక
ముఖ్య విషయం
చెప్పి వెళ్దామని
వచ్చాను. నేను
డాక్టర్ వేదమూర్తిని
నిన్న కలిసాను.
ఆయన చెప్పారు.
నువ్వు అనవసరంగా
ఆలస్యం చేస్తున్నావట.
హైదరాబాద్ డాక్టర్
చెప్పినట్టు వెంటనే
నువ్వు గుండె ఆపరేషన్
చేసుకోవాలట.
నువ్వు వెంటనే
చెన్నైకి వెళ్ళటం
మంచిదట. పి.డి.ఏ
అనే హృదయ
జబ్బు -- మిగతా
గుండె జబ్బులతో
పోల్చి చూస్తే
అంత భయపడాల్సిన
వ్యాధి కాదట.
సులభంగా ఆపరేషన్
చేసి నయం
చేయవచ్చుట. ఆ
తరువాత నువ్వు
ఆరొగ్యంగా, మిగిలిన
మహిళలలాగా తల్లి
అయ్యి ఎక్కువ
కాలం బ్రతక
వచ్చుట -- నీ
దగ్గర చెప్పమన్నారు”
“మేడమ్!
నేను బ్రతాకాల్సిన
అవసరం ఉందా?”
“జీవితం
జీవించటానికే -- చనిపోవటానికి
కాదు సుమిత్రా.
నీకు మన
స్కూల్ తరఫున
నీ సర్జరీకి
కావలసిన డబ్బు
సాంక్షన్ చేశాము.
ఇది వికలాంగుల
సంవత్సరం కదా? ఒకరికి
శరీరంలో ఏ
భాగంలోనైనా వికలాంగం
ఉంటే, అది
సరిచేసిచ్చి, వాళ్ళకు
మరు జీవితం
ఇవ్వటం అనేది
సమాజంలో ఉన్న
ఒక్కొక్కరి బాధ్యత
అవుతుంది”
“ధ్యాంక్స్
మ్యాడమ్...
కానీ ఈ పాపిస్టి
దాని మీద
మీకు ఎందుకింత
దయ” సుమిత్రా
తడబడింది.
“సుమిత్రా
నిన్ను నువ్వు
కించపరుచుకోకు.
పాపం చేసిన
వాళ్ళూ –
పుణ్యం చేసిన
వాళ్ళూ అని
మనుష్యులే మనుష్యులను
గణించలేరు...ఆ
దేవుడి దయకు
ముందు, ఆ
దేవుడు చేసే
తీర్మానానికి ముందు
నీ గురించి
తీర్మానించటానికి
ఈ మనుష్యులకు
హక్కు లేదు.
ఆ దేవుడు
నిన్ను అర్ధం
చేసుకున్నాడు కాబట్టే
నీకు, అంటే
నువ్వు బ్రతకటనికీ, పూర్తి జీవితం
జీవించటానికి, నీ
సర్జరీకి మా
మూలంగా డబ్బు
ఏర్పాటు చేసాడు”
“అబార్షన్
చేయించుకోవటానికి
నేను హైదరాబాద్
కు వెళ్ళినట్టు
ఊర్లో మాట్లాడుకుంటున్నది
మీరు నమ్ముతున్నారా?”
“అది
నేను నమ్ముంటే, సుష్మా
పెళ్ళికి ముందు
వియ్యపురాలు నీ
గురించిన నిజం
తెలుసుకోవటానికి
నా దగ్గరకు
వచ్చినప్పుడే చెప్పుంటాను
-- నాకు తెలిసినంత
వరకు సుమిత్రా
సున్నితమైన మనసు
గల ఒక
మంచి అమ్మాయి
అని చెప్పాను”
“మేడమ్!
అమ్మ కంటే
ఎక్కువ ప్రేమ
చూపించే మీ
దగ్గర చెబుతున్నా.
నేను అబార్షన్
చేయించుకోలేదు.
కానీ కన్యాత్వం
పోగొట్టుకున్నాను” అంటూ
ఏడవటం మొదలుపెట్టింది.
“సుమిత్రా
ఇటురా...నువ్వు
ఏడవ కూడదు.
నీ ఒంటికి
ఎక్కువ ఒత్తిడి
పడదు. మళ్ళీ
చెబుతున్నా. నువ్వు
నాశనం అయిన
దానివి కావు.
ఎమోషన్స్ ఊపువలన
-- యుక్త వయసు
ఉత్సాహంలో ఒక
తప్పు చేసావు.
అదికూడా నిన్ను
బ్లాక్ మైల్
చేసి తీసుకు
వెళ్ళాడు. అది
నీకు జరిగిన
ఒక యాక్సిడెంట్.
అంతే.
దాన్ని మర్చిపో
-- ఆపరేషన్ చికిత్స
పూర్తి అయిన
తరువాత ఆరొగ్యం
తెచ్చుకుని -- నీ
మనసుకు నచ్చినవాడిని
పెళ్ళి చేసుకుని
నువ్వు సుఖంగా
జీవించాలి.
నిన్ను నీ
కొసం పెళ్ళిచేసుకోవటానికి
ఎవరో ఒక
మంచి వాడు
వస్తాడు. పెళ్ళి
అనేది రెండు
ఆత్మల యొక్క
సంగమం. శరీరాలే
నాశనమవటానికి చెందుతాయి.
ఆత్మకు నాశనం
లేదు. ఇదంతా
నీకు తెలిసిన
విషయమే కదా
-- కలత చెందకు.
ఉత్సాహంగా ఉండు...నేను
చెప్పింది మర్చిపోకు”
ప్రధానోపాధ్యాయురాలు
కళ్యాణీ సుమిత్రాని
మళ్ళీ ఒకసారి
తన గుండెలకు
హత్తుకుని ఓదార్చి
బయలుదేరింది.
ఆమె మాటలు
అమృతం లాగానే
సుమిత్రాకి బలం
ఇచ్చింది.
పుండైన మనసుకు
మందులాగా సుఖంగా
ఉన్నది. అలమారులో
వరుసగా పెట్టున్న
పుస్తకాలలో శ్రీశ్రీ
కవిత్వాల పుస్తకాన్ని
ఏరుకుని తీసుకుంది
సుమిత్రా.
హడావిడిగా పుస్తకంలోని
పుటలను తిరగేసింది.
సుమిత్రాకి ఇప్పుడు
సమాజం గురించో
-- మరణం గురించో
భయం లేదు.
ఆమె ఆపరేషన్
చేసుకుని చాలా
కాలం ఒక
మంచి భార్యగా
జీవించబోతోంది.
సుమిత్రా! నువ్వు
నమ్మకాన్ని వదిలేయకు!
*********************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి