జీవించటానికే జీవితం…(కథ)
జీవించటానికే జీవితం (కథ)
జీవితం అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? మనకున్న జీవిత సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా? జీవిత గమ్యాన్ని లక్ష్యాలుగా మార్చుకుని సాధించటం ఎలా? జీవిత విజయాలకు మూలము క్రమశిక్షణ మరియు పట్టుదల! జీవితం--గమ్యం--లక్ష్యాలు--ప్రేరణ.
మనిషి పుట్టుకకు మధ్య ఉండే సమయం జీవితం...మనం అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా ఏ ఊరిలో పుట్టాలి అనే విషయాలను మనం నిర్ణయించలేము.
అలాగే మనం ఎవర్ని పెళ్ళిచేసుకోవాలి, ఎవర్ని పెళ్ళిచేసుకోవాలి, ఎంతమందికి జననం ఇవ్వాలి అనేది కూడా మనం నిర్ణయించుకోలేము. కానీ, జీవించటానికే జీవితం అనేది గుర్తుంచుకుని, మనకిచ్చిన బాధ్యతలను నెరవేర్చాలి.
***************************************************************************************************
సముద్ర తీరంలో
ఇసుక మట్టి
మీద వాళ్ళిద్దరూ
కూర్చోనున్నారు.
సాయంత్రపు పసుపు
ఎండ మరుగవటం
మొదలుపెట్టింది.
చల్లని సముద్రపు
గాలి మల్లె
పూవు వాసనను
మొహం మీదకు
తోస్తుండగా కుటుంబరావ్
తిరిగి చూసాడు.
పువ్వులు అమ్ముకునే
కుర్రాడు, “మల్లె
పూవ్వులూ! కదంబం!” అని అరుచుకుంటూ
ఇసుకమట్టి మీద
ఇటూ అటూ
పరిగెత్తుతున్నాడు.
భార్య కవితకు
ఒక మూర
కదంబం కొనడానికి, చేతులు
కొట్టి ఆ
కుర్రాడిని పిలవాలని
మనసులో లేచిన
ఆశను అనుచుకున్నారు
కుటుంబరావ్.
రోగిస్టి లాగా
నీరసించి పోయున్న
మొహంతో ఎదురుగా
కూర్చోనున్న కొడుకు
జగదీష్ ను చూసి, ఆయన
మనసు ఎక్కువ
వేదన చెందింది.
కొద్ది రోజులుగా
జగదీష్ ఎందులోనూ
ఇష్టం చూపక, ఎప్పుడూ
ఎక్కడో చూస్తున్న
చూపులతో, పిచ్చి
పట్టినట్టు తిరుగుతూ
కష్టపడుతున్నట్టు
ఉండటం చూసి
తండ్రికి మిక్కిలి
బాధగా ఉన్నది.
“జగదీష్!” -- ప్రేమగా
పిలిచాడు తండ్రి.
“ఊ!” -- కలలో
నుండి బయటపడినట్టు
ఉలిక్కిపడ్డ కొడుకు
ఆయన్ని చూసాడు.
“మొన్న
మీ కంపెనీ
మేనేజర్ను కలిసాను.
ఆయన అన్నాడు
నువ్వు పోయిన
వారం మూడు
రోజులు ఒంట్లో
బాగుండలేదని లీవు
పెట్టావట. నిన్న
ప్రొద్దున కూడా
తలనొప్పిగా ఉన్నదని
లీవు తీసుకుని
బయలుదేరేవుట...నీ
అనారోగ్యానికి
ఏమిటి కారణం
అని నా
దగ్గర విచారించారు.
నువ్వు ఇప్పుడంతా
నీ ఉద్యోగంలో
ఎక్కువ శ్రద్ద
చూపటం లేదని
కూడా విసుకున్నారు.
అవునూ, నేను
కూడా అడుగుదామనే
అనుకున్నాను. నిన్న
తలనొప్పిగా ఉందని
ఆఫీసు నుండి
బయలుదేరిన వాడివి
-- ఇంటికి రాత్రి
చాలా లేటుగానే
వచ్చావు? మీ
అమ్మ ఎక్కువగా
బాధపడుతోంది. ప్రొద్దున
నా దగ్గర
చెప్పింది. కొద్ది
రోజులుగా నువ్వు
అలవాటుగా తాగే
రాత్రి పూట
తాగే పాలను
ముట్టుకోవటం లేదట.
బలవంతం చేసి
అడిగితే విరుచుకుపడుతున్నావట.
నిన్న రాత్రి
నేను కూడా
గమనించాను. నీ
గదిలో లైటు
వెలుగుతూనే ఉంది.
ఒక పుస్తకాన్ని
చేతిలో ఉంచుకుని, గోడవైపే
చాలాసేపు చూస్తూ
కూర్చోనున్నావు...!”
“నాన్నా!” -- కొడుకు
బాధతో నిట్టూర్పు
వదులుతూ ఇసుక
మట్టిపై వేళ్ళతో
గీతలు గీస్తూ
ఉన్నాడు.
“ఆ
అమ్మాయి మాలతీకి
పెళ్ళి జరగబోతోందని
తెలుసుకున్న రోజు
నుండి నువ్విలా
మారిపోయావు కదా?”
“నాన్నా...” -- కొడుకు
ఆశ్చర్యంతో తలెత్తాడు.
పలు రాత్రులు
నిద్ర లేకపోవటం
వలన కళ్ళు
ఎర్రగా కందిపోయి ఉన్నాయి.
“మాలతీ
గురించి మీకెలా
తెలుసు...?” మాట్లాడలేక
అతని స్వరం
విరిగింది.
“నీకొచ్చిన
ఉత్తరాలను తెరిచి
చూసేంత నీచమైన
బుద్ది నాకు
లేదని నీకు
తెలుసు కదా? నిన్ను
చిన్న వయసులో
నా భుజం
పై వేసుకుని
నీ వీపు
మీద తడుతూ, నిద్ర
పుచ్చటానికి డాబాపైనా, కిందా
నడుస్తున్నప్పుడూ, స్కూలు
నుండి వచ్చిన
వెంటనే పరిగెత్తుకు
వచ్చి నా
ఒడి మీద
ఎక్కి నా
పోట్ట మీద
కూర్చుని కథ
చెప్పు అని
నువ్వు బ్రతిమిలాడినప్పుడు -- నేను
నీకు నాన్నను
-- నువ్వు నాకు
బిడ్డవు అనే
భావనతో జీవించాము.
కాలేజీ స్టూడెంటు
అయిన తరువాత
నువ్వు నాతో
వాకిట్లో ఉన్న
వరాండాలో కూర్చోని
రాజకీయాల నుంచి, అమ్మ
వంట వరకు
సరదాగా మాట్లాడి, నవ్విన
కాలం నుండి...ఆ
బంధుత్వం మారిపోయింది...భుజాల
వరకు ఎదిగిన
నిన్ను నా
ప్రాణ స్నేహితుడిగా
భావిస్తూ...నీ
మనో భావాలకు, లక్ష్యాలకు
-- అన్నిటికీ గౌరవమిచ్చి
నడుచుకుంటూ వస్తున్నాను
కదా?”
“అవును
నాన్నా! మీ
దగ్గర మాట్లాడుతున్నప్పుడు
ఒక తండ్రితో
కొడుకు మాట్లాడుతున్న
భావం నాకు
ఏర్పడదు...ఒక
అన్నయ్య దగ్గర
సహజంగా మాట్లాడుతున్నట్టు
ఒక ధైర్యమూ, హక్కూ, మనస్పూర్తి
ఏర్పడుతుంది. ఒప్పుకుంటా...”
“అందుకునే
నీతో మనసు విప్పి
మాట్లాడటానికి
ఈ సముద్రతీరానికి
నిన్ను పిలుచుకు
వచ్చాను...”
“నేను
చెబుతా నాన్నా!
మా కంపెనీ
ఎదురుకుండా ఉన్న
ఐటీ కంపెనీలోనే
మాలతీ పనిచేస్తోంది.
వాళ్ళ ఆఫీసు
కింద ఒక
మంచి రెస్టారంట్
ఉంది. ఆ
చుట్టు పక్కలున్న
ఆఫీసులలో పనిచేసే
ఉద్యోగస్తులు చాలా
వరకు ఆ
రెస్టారంటుకు వస్తారు.
ఆ రెస్టారంట్
లోనే నేను
మాలతీను చూసాను.
చిల్లర కోసం
ఒకరోజు ఆమె
నాతో మాట్లాడింది.
ఆ రోజు
నుండి రోజూ
ఇద్దరం చూసుకోవటం, నవ్వుకోవటం, ఆ
తరువాత ఒక
రోజు మాట్లాడుకోవటం, కలుసుకోవటం
జరిగింది. దానికి
తోడుగా ప్రేమ
కూడా ఏర్పడింది.
పెళ్ళి చేసుకోవటానికి
ఇష్టపడ్డాం. మీ
దగ్గర చెబుదామనుకున్నా.
ఇంతలోపు ఆమె
తండ్రి ఆమెకు
వేరే సంబంధం
నిశ్చయం చేసాడు” అంత కంటే
మాట్లాడలేక జగదీష్
దుఃఖం ఆపుకోవటానికి
ప్రయత్నించాడు.
“ఆమెకు
తన ప్రేమ
గురించి తన
తండ్రితో చెప్పటానికి
భయం. పెళ్ళికి
ఒప్పేసుకుంది. నాకు
తెలుసు!”
జగదీష్ తన
తండ్రిని విశ్మయంతో
చూసాడు.
“మీకు
తెలుసా? నేను
మాలతీ గురించి
ఎవరి దగ్గరా
చెప్పలేదే!?”
“ఒక
నెల రోజుల
ముందు ఒక
రోజు సాయంత్రం
నువ్వు రావటానికి
ముందే నేను
ఇంటికి వచ్చాసాను.
ముందు గదిలోపలకు
వస్తుంటే టెలిఫోన్
మోగింది. ఫోన్
ఎత్తాను. నేను
హలో అన్న
వెంటనే ఆ
అమ్మాయి గబగబా
మాట్లాడేసింది.
తండ్రికీ, కొడుకుకూ
స్వరం చాలా
వరకు ఒకేలాగ
ఉండటమేమీ వింత
కాదే...నన్ను
నువ్వని అనుకుంది”
‘జగదీష్!
నేను మాలతీ
మాట్లాడుతున్నాను.
నన్ను మీరు
క్షమించాలి. ఒక
సంవత్సరంగా మనం
అన్యోన్యంగా స్నేహంగా
ఉన్నాము. ఒకర్ని
ఒకరు ఇష్టపడ్డాము.
కానీ, మన
ప్రేమ విజయవంతం
అయ్యే అవకాశం
లేదు. నా
తండ్రి నాకు
వేరే చోట
పెళ్ళి చేయటానికి
నిశ్చయం చేసేశారు.
నా వల్ల
‘నో’ అని
చెప్పటం కుదరలేదు
-- ఒప్పేసుకున్నాను.
ఇప్పుడు నాకు
కాబోయే భర్త
నా మేనమామ
కొడుకు. నా
పెళ్ళి పత్రికను
నీ ఆఫీసు
అడ్రస్సుకు పంపిస్తాను.
నేను ఎక్కడ
జీవించినా బాగా
ఉండాలని ఆశీర్వదించండి!’ అని
చెప్పి ఆపింది”
“ఒక్క
క్షణం నేను
స్టన్ అయి
నిలబడ్డాను. తరువాత
తేరుకున్నాను..‘నా
ఆశీర్వాదాలు నీకు
ఎప్పుడూ ఉంటుంది’ అని
చెప్పేసి ఫోను
పెట్టేసాను”
“ఎవరండీ
అది...?” అమ్మ
వంటింట్లో నుండి
అడిగింది.
“ఏదోలాగా
ఉన్నారే? ఏం
జరిగింది?” అమ్మ
నా భుజం
పుచ్చుకుని పలుసార్లు
కదిపిన తరువాతే
నా ఆలొచన
ఈ లోకంలోకి
వచ్చింది. నీ
మనో పోరాటం, షాకు, దుఃఖం, వేదన
అన్నిటినీ ఆ
కొద్ది నిమిషాలలోనే
నేను పూర్తిగా
అనుభవించేసాను”
“నాన్నా!
మీకు నిజం
తెలిసున్నా మీరు
మౌనంగానే ఉండిపోయేరే...?”
“ఈ
షాక్ లో
నుండి నువ్వుగా
బయటపడి ధైర్యంగా
తల ఎత్తుకుని
తిరగాలని,
నీకున్న బాధ్యతలను నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని మామూలు మనిషిగా
మారాలని నేను
నిన్ను పట్టించుకోలేదు...కానీ
నువ్వు,
నిద్రపోకుండా, బోజనం
చేయకుండా, దేని
మీద ఆశక్తి
లేకుండా ఈ
ప్రేమ ఓటమిని
తట్టుకోలేక అల్లాడిపోవటం
చూసేసి మౌనంగా
ఉండలేక -- నీతో
ఓపెన్ గా
మాట్లాడే తీరాలని
ఇక్కడికి పిలుచుకు
వచ్చాను...”
“నాన్నా!
మాలతీని నేను
ప్రాణానికి ప్రాణంగా
ప్రేమించాను. ఈ
ఓటమని నేను
తట్టుకోలేకపోతున్నాను...” కొడుకు తన
బాధను కక్కేసాడు.
“ఎవరు
చెప్పింది...? కొన్ని
రోజులలో ఇది
మరిచిపోతావు. మనసులో
ప్రశాంతత ఏర్పడుతుంది”
“మీకు
ఎలా వివరించాలో
తెలియటం లేదు.
ఆమెపై నేను
పెట్టుకున్న ప్రేమ
నా రక్తంలో
ఊరిపోయి...ఒక
వ్యాధిలాగా...” కొడుకు ముగించే
లోపు కుటుంబరావ్
అడ్డుపడ్డాడు.
“అలాగే
ఉంటుంది -- ఆకాశమే
విరిగి పడేటట్టు...కాళ్ళ
క్రింద ఉన్న
భూమి జారిపోతునట్టు, మనం
ఎక్కడో పాతాళ
లోకంలోకి పడిపోతున్నట్టు, పాలు
తాగటానికి చేదుగా
ఉన్నట్లు, పరుపు
ముళ్ళతో చేసినట్లు
ఉంటుంది”
“బాగా
అనుభవించినట్టు
మాట్లాడుతున్నారే
నాన్నా! నా
ఈ బాధ
లోతుకు వెళ్ళి
అర్ధం చేసుకుంటే...”
“నేను
బాగా అర్ధం
చేసుకున్నాను. అనుభవించాను.
అందువలనే చెబుతున్నా”
జగదీష్ ఆశ్చర్యంతోనూ, నమ్మకం
లేకుండానూ తండ్రి
మొహాన్ని చూస్తూ
“ఏమిటి
నాన్నా చెబుతున్నారు?”
“నిజమే
చెబుతున్నా. నీ
వయసులో నాకూ
ప్రేమ ఏర్పడింది.
కానీ అది
మిక్కిలి విపరీతమైన
దుఃఖ అనుభవం.
మేము అద్దె
కుంటున్న ఇంటి
ఎదిరింట్లో తండ్రీ-తల్లీ-కూతురు
అంటూ ఒక
చిన్న కుటుంబం
నివసించేది.
ఆ అమ్మాయి
పావనికి అప్పుడు
పెద్దెనిమిదేళ్ళ
వయసు. చూడటానికి
చాలా అందంగా
ఉంటుంది. నేను
చదువుతున్న కాలేజీలోనే
బి.ఏ.
మొదటి సంవత్సరం
చదువుతోంది. ఎదిరింటి
ఆవిడితో నా
తల్లి త్వరలోనే
స్నేహితురాలు అయ్యింది.
కానీ, దట్టమైన
మీసాలతో -- భయంకరమైన
చూపులతో, దృఢమైన
శరీరంతో టెర్రర్
ముఖంతో ఉన్న
ఆ అమ్మాయి
తండ్రిని చూసి
భయపడిపోయాను.
అందువల్ల ఆశపడినా
ఆ అమ్మాయితో
నేను మాట్లాడాలనే
ప్రయత్నం చేయలేదు.
ఒకరికొకరం జస్ట్
చూసుకునే వాళ్ళం.
ఒక రోజు ఆ
అమ్మాయితో మాట్లాడే
అవకాశం దొరికింది.
ఆమె బస్సు
ఎక్కి కూర్చుంది
-- కండక్టర్ డబ్బులడిగినప్పుడు
కలవరపడింది. మనీపర్స్
ను ఇంట్లోనే
మరిచిపోయి వచ్చేసింది.
అదే సంధర్భమనుకుని
నేను ధైర్యంగా
ఆమెకూ కలిపి
రెండు టికెట్లు
కొన్నాను.
బస్సులో నుండి
దిగే ముందు
ఆమె నన్ను
చూసి నవ్వుతూ
‘చాలా
థ్యాంక్స్’ అన్నది...ఆ
స్వరం, తేనెలాగా
చెవిలో తియ్యగా
ఉన్నది. ఆ
తరువాత...మెల్లగా
మాట్లాడుకోవటం
మొదలుపెట్టాము.
పలు చోట్ల
దొంగతనంగా కలుసుకున్నాం.
ఐస్
క్రీమ్ కొని
తిన్నాం -- సినిమాకు
వెళ్ళాము. బీచ్
కు వెళ్ళాము, బజారు
వీధికీ -- ఎక్జిభిషన్
కూ అంటూ
పలుచోట్లకు తిరిగాము.
మా అభిప్రాయాలు
పంచుకున్నాము...ప్రేమించుకున్నాము.
ఆమెకు అత్త
కొడుకు ఒకడు
ఉన్నాడు. ఈమె
కోసం అతను
పూలమాలతో కాచుకోనున్నాడు.
కానీ, ఆమె
నన్ను చేసుకోవటానికే
ఇష్టపడింది. నేనూ
చాలా ఇష్టపడ్డాను.
నాకు కాలేజీ
చదువుతున్న రోజులలో కవితలు
రాసే అలవాటు
ఉండేది. ఒక
పెద్ద కవి
కావాలని నా
కోరిక.
‘నువ్వే
కొత్త చందమామ, నిన్ను
ఒక కొత్త
లోకంలో చూడాలని
వెతుకుతున్నాను’ అని
ఏమిటేమిటో రాసి
ఆమెకు పంపేవాడిని.
కవి--ప్రేమికుడు--పిచ్చివాడు
ముగ్గురూ ఒకే
జాతి. ఎందుకంటే
ముగ్గురి ఆలోచనలు
తెల్లుతూ ఉంటాయి
అని షేక్
స్పియర్ చెప్పాడు.
నిజమే. నేను
అప్పుడు అలాంటి
ఒక పిచ్చివాడిలాగానే
ఉన్నాను. ఆమె
కూడా నా
కవిత్వాన్ని బాగా
ఇష్టపడింది, ఆరాధించేది.
తోటలో నుండి
ఒక రోజా
పువ్వును కోసుకొచ్చి, ఆమెకు
బహుమతిగా ఇచ్చాను.
ఆమె నాకు
ఒక రుమాల
బహుమతిగా ఇచ్చింది.
ఆ రుమాలోలోని
ఒక చివరగా
రోజా పువ్వుల
గుత్తిలాగా ఒక
డిజైన్ వేసుంది.
“అందంగా
ఎంబ్రాయ్డరీ చేస్తున్నావే...” పొగడాను నేను.
“నువ్వు
నా రాజువు...నేను
నీ రోజా
పువ్వును. అందుకే
ఈ బహుమతి” -- చెప్పేసి
ఆమె నవ్వింది...నేను
మత్తులోకి వెళ్ళిపోయాను.
నా కంటే
అదృష్టవంతుడు ఈ
భూమి మీద
ఎవరూ ఉండరని
అనుకుని సంతోషించాను.
ఆ సంవత్సరం
పరీక్షలలో మేమిద్దరం
ఫైలయ్యాము. చదివితేనే
కదా పాసయ్యేది? ఆమె
చదువును ఆమె
పేరంట్స్ అంతటితో
ఆపాసారు. నేను
మళ్ళీ పరీక్షలు
రాసి పాసయ్యాను.
ఆ తరువాత
నుండి మా
ప్రేమ ఉత్తరాల
ద్వారా కంటిన్యూ
అయ్యింది.
ఆ సమయంలో
నా తాతయ్య
వ్యాధిగ్రస్తుడై.
చాలా సీరియస్
కండిషన్ లో
ఉన్నట్టు టెలిగ్రాం
వచ్చింది. అమ్మ
నన్ను తోడు
తీసుకుని గ్రామానికి
బయలుదేరింది. ఆ
అర్జెంటులోనూ నేను
ఆమెను రహస్యంగా
కలిసి ఉరికి
వెళ్ళే విషయం
చెప్పాను!
“వెళ్ళి
రండి...మీ
రాక కోసం
వేయి కళ్ళతో
ఎదురు చూస్తూ
ఉంటాను...” అని ఆమె
హామీ ఇచ్చింది.
మేము వెళ్ళిన
మరుసటి రోజే
తాతయ్య చనిపోయారు.
అంత్యక్రియలు ముగిసి
నేను అమ్మను
ఒత్తిడి చేసి
సిటీకి తిరిగి
వచ్చేలోపు ఒక
నెల రోజులు
అయ్యుంటుంది...ఆ
చిన్న గ్యాపులో
నేను ఆమెను
తలుచుకుని పడిన
పాట్లు వివరించలేను?
రైలు దిగి
బస్సు పుచ్చుకుని
వచ్చాము. మా
వీధి వైపుకు
నడుస్తున్నప్పుడు
దారిలో ఎదురుగా
ఒక శవ
ఊరేగింపు వస్తూ
ఉన్నది. అయిష్టంగానే
ఇద్దరం ఒక
పక్కగా నిలబడ్డాం.
‘మన
వీధిలో ఎవరు
చనిపోయుంటారు...?’ తెలుసుకోవాలనే
తాపత్రయంతో పాడె
వైపు క్షుణ్ణంగా
చూసిన నాకు
ఒక పెద్ద
షాక్.
మెడలో పూలమాలతో, పెళ్ళి
మండపంలో నా
దగ్గర కూర్చోవలసిన
పావని...పూలమాలలు
వేసుకుని శవంగా
తన అంతిమయాత్ర
ఊరేగింపుగా శ్మశానం
వైపుకు వెళ్తూ
ఉన్నది.
దయ్యం పట్టిన
వాడిలాగా దిగులుతో
నేను ఇల్లు
చేరుకుని పడుకున్న
వాడ్ని...విపరీతమైన
జ్వరంతో పది
రోజులు పడుకుండిపోయాను.
ఆరొగ్యం కొంచం
బాగుపడ్డాక నన్ను
చూడటానికి వచ్చిన
నా స్నేహితుడు
చలపతి చెప్పిన
తరువాతే నాకు
పూర్తి వివరాలు
తెలిసినై.
తన చెల్లి
దగ్గర పావని
వదిలి వెళ్ళిన
ఒక ఉత్తరాన్నీ, పుస్తకాన్నీ
చలపతి నా
దగ్గర ఇచ్చాడు.
మా ప్రేమ
వ్యవహారం ఎలాగో
వాళ్ళ పెద్ద
వాళ్ళకు తెలిసిపోయింది.
నేను రాసిన
ఉత్తరం ఒకటి
వాళ్ళ చేతుల్లో
పడింది. కోపం
తట్టుకోలేక కూతుర్ని
చితక బాదారు.
వెంటనే అమెకూ, ఆమె
అత్త కొడుకుకీ
పెళ్ళి జరిపించటానికి
తన అక్కయ్య
కుటుంబాన్ని ఊరి
నుండి రప్పించాడు
ఆమె తండ్రి. తొందరగా
నిశ్చయ తాంబూలాలు
ముగించి, పెళ్ళి
ముహూర్తం పెట్టించారు.
బయటకు ఎక్కడికీ
వెళ్ళకుండా పావనిని
తీవ్ర బద్రతతో
ఉంచారు. నేనూ
ఊర్లో లేను.
పెళ్ళి రోజూ
దగ్గర పడుతోంది...తండ్రిని
ఎదిరించలేకపోయింది.
చిక్కును ఎలా
తప్పించుకోవాలో
తెలియలేదు. విషం
తాగి ఆత్మహత్య
చేసుకుంది.
నిజం తెలుసుకున్న
తరువాత నా
మనసు ఎంత
కష్టపడుంటుందని
అనుకుంటున్నావు? ఒక
స్త్రీ నా
మీదున్న ప్రేమతో
ఆత్మహత్య చేసుకుందే? అది
నాకు ఒక
అతి పెద్ద
దెబ్బలాగా ఉన్నది.
ఉత్తరాన్ని వణుకుతున్న
చేతులతో మెల్లగా
తెరిచి చదివాను.
“ప్రియతమా!
సెలవు తీసుకుంటున్నాను.
మీరొక కవి
కదా, ఈ
వాక్యాలను పూర్తి
చేస్తూ ప్రశాంతంగా
ఉండండి... ‘వెళ్ళిపోయింది
తిరిగి రాదు--వెళ్ళిపోయిన
దాని గురించి
పిచ్చివాడిలాగా తిరగకు’ ఈ రోజు
కొత్తగా పుట్టినట్టు
తలుచుకో”
మీ పావని.
‘ప్రాణానికి
తరువాత’ అన్న
పేరున్న ఆ
పుస్తకాన్ని నేను
తెరిచి కూడా
చూడలేదు. నా
ప్రాణానికి దూరంగా
వెళ్ళిపోయిన ఆమె
జ్ఞాపకంతో నేను
మగ్గిపోతున్నాను”
తండ్రి యొక్క
జరిగిపోయిన కాలం,
జీవితంలోఆయనకు
ఏర్పడ్డ శోకమైన
సంఘటనను ఆశ్చర్యంతో
వింటున్న జగదీష్
మేలుకున్న వాడిలాగా
అడిగాడు.
“తరువాత
ఏం జరిగింది
నాన్నా?”
“ఏం
జరిగింది? ఒక
సంవత్సరం తరువాత
నాకు ఉద్యోగం
దొరికింది. తల్లి-
తండ్రులు చూసిన
అమ్మాయి కవితను
నాకు పెళ్ళి
చేసారు...నువ్వు
పుట్టావు...చెళ్ళెల్లు
పుట్టారు...!”
“ఆ
పావనిని మీరు
అంత సులభంగానా
మరిచిపోయారు?”
“జగదీష్! కాలం
ఉన్నదే అది
ఒక అపూర్వమైన
ఔషధము. ఎటువంటి
దుర్భరమైన సంఘటన
వలన ఏర్పడిన
మనో గాయాన్నైనా
తొందరలోనే గుణపరిచి...సంభవాలను, సంఘటలనూ
మర్చిపోయేటట్టు
చేస్తుంది. ప్రారంభంలో
బాధ్యత కోసం
మీ అమ్మతో
భర్తగా జీవించాను...ఆ
తరువాత తానుగా
నా మనసులో
ఆమె మీద
ప్రేమ ఏర్పడింది...నిన్న
నువ్వు చూసావే.
తోటలో ఒక
రాయి తగిలి
అమ్మ కాలు
నుండి రక్తం
వచ్చిందే, అప్పుడు
నేను ఎంతో
అదుర్దా చెంది
మందు, దూది
తీసుకుని పరిగెత్తుకు
వచ్చాను!
ఆమెకు ఒక
కష్టం అంటే
నా మనసు
కొట్టుకుంటుంది...మీ
అమ్మ మీద
అంత ప్రేమ
నాకు ఏర్పడింది.
ప్రేమించి పెళ్ళి
చేసుకుంటేనే జీవితం
సుఖంగా ఉంటుందని
అనేది తప్పు...పెళ్ళి
చేసుకున్న తరువాత
కూడా దంపతుల
మధ్య ప్రేమ
ఏర్పడుతుంది. దానికి
మా జీవితమే
ఒక నిదర్శనం...అర్ధం
చేసుకో. పాత
కాల సంఘటనలను
సంవత్సరాల మధ్య
మరిచిపోవచ్చు...మగాడికీ, ఆడదానికీ
జీవితం...జీవించటానికే
ఇవ్వబడింది...దాన్ని
ముగించుకోవటం కోసం
కాదు. దానికంటే
పైన మనకు
బాధ్యతలు ఉన్నాయే.
వాటిని ఆలొచించి
చూడాలి. నీ
జీతం ఎదురు
చూసే నా
కంపనీలో నేను
అప్పు తీసుకుని
ఇల్లు కట్టాను.
చెళ్ళెల్ల పెళ్ళికి
నువ్వు సహాయం
చేయాలి...నిన్ను
నా ప్రాణ
స్నేహితుడిగా భావించి
సహాయాలకోసం ఎదురు
చూస్తున్నప్పుడు...నువ్వు
పిరికితనంతో మనసును
జార విడుచుకోవచ్చా?....సరే
చీకటి పడుతోంది...ఇంటికి
వెళ్దాం లే...!” -- కొడుకు
చెయ్యి పుచ్చుకుని
కుటుంబరావ్ అతన్ని
పట్టుకుని లేపి
నిలబెట్టాడు.
“మల్లే
పూవులూ! ఇలారా!” అంటూ పువ్వులు
అమ్ముకునే అబ్బాయిని
కేక వేసి
పిలిచి భార్యకు
ఒక మూర
పూవులు కొన్నాడు.
తండ్రీ కొడుకులు
రోడ్డు చివర
నిలబెట్టి ఉన్న
స్కూటర్ వైపుకు
నడిచారు.
‘నాకు
మాలతీ ఇచ్చింది
ఉత్త నిరాశ
-- కానీ నాన్నకు
పావని ఇచ్చింది
పెద్ద షాక్’
అంత పెద్ద
బాధ నుండి
తండ్రి బయటపడి
బాగా జీవించటానికి
నేర్చుకున్నప్పుడు
-- వాడి వల్ల
ప్రేమ నిరాశని
విధిలించుకుని
జీవించటం కుదరదా...? ఓర్పూ, కాలమూ
అతనికి సహాయం
చేస్తాయి...అతను
కూడా పెద్దలు
సెలెక్టు చేసిన
ఒక అమ్మాయిని
పెళ్ళి చేసుకుని, ఆమెతో
ప్రేమగా పిల్లల్ను
కని, వాళ్ళతో
ఆనందంగా జీవించబోతాడు.
అతను కూడా
రోజూ మర్చిపోకుండా
పువ్వులు కొనుక్కుని
వెళతాడు.
మనసు తేలికైనట్లు అనిపించిన జగదీష్ యొక్క మొహంలో సంతోషమూ, కళ్ళల్లో భవిష్యత్ కాల కలలూ తెలిసినై.
**************************************************సమాప్తం******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి