ప్రతిఫలం...(కథ)

 

                                                                          ప్రతిఫలం                                                                                                                                                                      (కథ)

మనం ఒకరికి సహాయం చేస్తే...దానికి ప్రతిఫలంగా మనకు సహాయం కావలసిన సమయంలో, అది పలురెట్లుగా మనకు తిరిగి దొరుకుతుంది...అనేది వివరించే అద్భుతమైన కథ ఇది. ప్రతిఫలం ఎలా దొరికిందో కథ చదివి తెలుసుకోండి.

*****************************************************************************************************

మాధవ్ ఏడుస్తూ వేపచెట్టు కింద ఒక రాయి మీద కూర్చోనున్నాడు. రాయే లేకపోతే వర్షంలో తడిసిపోయిన మట్టినేల మీద కూర్చోవలసి వచ్చేది. చినిగిపోయిన అతని నిక్కరు వలన ఒంటిమీద బురద అతుక్కునేటట్టు జరిగేది.

అతని తల్లి, తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలు దగ్గర నుండి తెచ్చిన లావైన కుర్రాడి ఒకతని పాత నిక్కరు అది. జారిపోతున్న దాన్ని అతను మాటిమాటికీ ఎత్తి పట్టుకుని నడవాల్సి ఉండేది. ఆరునెలల పైనుండే నిక్కరును వేసుకుంటున్నాడు.

నిక్కరు చినిగిపోయుండడం చూసిన పక్కవీధి కుర్రాళ్ళు, “రేయ్! ఇటు చూడండిరా. వీడి వెనుక పోస్ట్ ఆఫీసు! అని చెబుతూ గేలి చేశారు. వాళ్ళల్లో ఒకడు చిరుగులో చెయ్యిపెట్టి దాన్ని చాలా పెద్దది చేసి గలగలమని నవ్వాడు.........

నిక్కరు చాలా పెద్ద సైజులో చిరిగిపోయుండటంతో, వాడు సిగ్గుపడి అలాగే చెట్టుకిందే కూర్చుండిపోయాడు. ఏం చేసి తన మానాన్ని కాపాడుకోవాలో అతనికి  తెలియలేదు. వాడు చొక్కా కూడా వేసుకోలేదు. అది ఉండుంటే దాన్ని కిందవైపు చిరిగిన చోట ఒక విధంగా కట్టుకుని, చినిగిన నిక్కరు చోటును కప్పిపుచ్చుకుని ఇంటికి వెళ్ళుంటాడు. వాడికి ఉన్నదే ఒకే ఒక చొక్కానే. రోజు పొద్దున్నే దాన్ని ఉతికి ఆరేసింది వాడి తల్లి.

కాబట్టి, ‘బాగా చీకటి పడిన తరువాత తన గుడిసెవైపుకు ఒకే పరుగున  పరిగెత్తాల్సిందే’  అని అనుకున్నాడు.

పుల్లలు ఏరుకురావటానికి వెళ్ళిన కొడుకు ఇంకా తిరిగి రాలేదేఅని అమ్మ ఆందోళన పడుతూ ఉంటుంది అని అనుకున్నప్పుడు వాడికి ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది. సమయంలో పక్కవీధిలో ఉంటున్న అమ్మాయి ఒకత్తి అనుకోకుండా అక్కడికి వచ్చింది. వాగులో నుండి మంచినీళ్ళు తీసుకువెళ్ళటానికి బిందెతో వచ్చింది. ఆమెను వాడు చూసున్నాడే కానీ, ఆమె పేరు అదీ వాడికి తెలియదు.

వెక్కి వెక్కి ఏడుస్తున్న వాడిని చూసిన వెంటనే, నిలబడ్డ ఆమె ఏమిటి తమ్ముడూ? ఎందుకు ఏడుస్తూ కూర్చోనున్నావు? ఏం జరిగింది...ఎందుకు చెట్టు వెనుక దాక్కున్నావు...?” అని అడిగింది.

ఏం జరిగిందో వివరించటానికి అతను సిగ్గు పడ్డాడు. చెబితే మంచిదే అని అనిపించింది. ఆమె ద్వారా తన తల్లికి వార్త వెళ్ళి చేరితే, ఇంకొక నిక్కరు లేక ఏదైనా ఒక తుండు లేక గుడ్డతో ఆవిడ అక్కడకు రావచ్చు. అనే నమ్మకం వాడికి కలిగింది.

తలవంచుకుని, “అక్కా! నా నిక్కరు వెనుక ఉన్న చిరుగును పక్కవీధి కుర్రాళ్ళు పెద్దది చేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. పెద్దదిగా, ఎక్కువగా చిరిగిపోయింది కాబట్టి నాకు బయట తిరగటానికి సిగ్గుగా ఉంది. అందుకే చీకటి పడిన తరువాత బయలుదేరదామని చెట్టు కింద కూర్చున్నాను అన్నాడు.

మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంది...ఉండు, నేనొక పనిచేస్తాను... అన్న ఆమె, బిందెను కింద పెట్టేసి తిరిగి నిలబడి, తన ఓణీ పైభాగాన్ని లాగి అందులో నుండి రెండు మూరల వరకు పంటితో కరిచి చింపి అతని దగ్గర జాపింది.

ఇది చుట్టుకుని వెళ్ళు తమ్ముడూ. ఏడవకు...

మంచి ఓణీని చింపేసేవే అక్కా?”

అందులో ఏముంది? మూడు గజాలు రెండు గజాలు అయ్యింది. అది నాకు సరిపోతుంది. దొమలూ రావు. అంతే. లే. ఇదిగో. చుట్టుకుని బయలుదేరు

చాల థ్యాంక్స్ అక్కా! అని చెప్పి వాడు బయలుదేరాడు.

ఇది జరిగిన తరువాత ఎప్పుడైనా ఆమెను వీధుల్లో అనుకోకుండా ఎదుర్కొన్నప్పుడు బాగున్నారా అక్కా?” అని విచారించటం వాడు రోజూ మరిచిపోలేదు.

ఒకసారి, “మీ పేరు ఏమిటక్కా?” అని అడిగాడు.

నాపేరు సావిత్రి...నీపేరు?”

నా పేరు మాధవ్ అక్కా

రోజులు గడిచినై.

లంగా ఒణీ వేసుకుంటున్న సావిత్రి, కొన్ని రోజుల నుండి చీర కడుతోంది. బాగా  ఎత్తుగా ఎదిగింది. పక్క వీధి అమ్మాయి కాబట్టి  ఆమె గురించిన కొన్ని వివరాలు  అతనికి తెలియ వచ్చింది. అతనికిలాగానే ఆమెకు కూడా తల్లి మాత్రమే ఉంది. తండ్రి లేడు. ఆమె తల్లి కూడా ఇళ్ళల్లో పనులు చేస్తూ సంపాదిస్తూ ఉన్నది.

మాధవ్ తల్లి కొడుకును చదివించలేకపోవటంతో వాడు ఏదేదో కూలి పనులు చేసి తల్లికి సహాయపడుతూ ఉండేవాడు. వాడి తల్లికూడా రెండు, మూడు ఇళ్ళల్లో పనులుచేస్తూ సంపాదిస్తున్నది.

ఒక రోజు మాధవ్ వాగులో ఎప్పటిలాగా ఈదుకుంటూ వెళ్ళినప్పుడు గట్టువైపు నుండి ఎవరిదో ఒక ఆడ గొంతు కేకలు పెడుతోంది. అయ్యో! ఎవరైనా నన్ను  కాపాడండి! అనే అరుపులు కూడా వినబడ్డాయి.

మాధవ్ ఒకే పరుగున కేకలు వస్తున్న దిక్కు వైపుకు దూసుకు వెళ్ళాడు. అక్కడ  అతను చూసిన దృశ్యం అతన్ని భయకంపితుడ్ని చేసింది. సావిత్రిని ఎవడో బలాత్కారం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె చీరను అతడు  లాగిపారేయటం కనబడింది. సావిత్రి తన రెండు చేతులనూ తన భుజాలపై  పెట్టుకుని నిలబడుంది.

మనిషి ఆమెను లాగటానికి ప్రయత్నిస్తుండటం చూసాడు మాధవ్. ఒక్క దూకు దూకి అతని గొంతుకను వెనక నుంచి గట్టిగా పుచ్చుకున్నాడు.

సడన్ దాడిని ఎదురుచూడని మనిషి ఆశ్చర్యపడి, భయపడి కింద పడిపోయాడు. మాధవ్ అతని పొట్టమీద కాలుపెట్టి నొక్కాడు. అతను దొర్లిపడి లేచి పరుగు  పెట్టాడు.

ఏడవకండి అక్కా...మీ చీర ఎక్కడ?”

"దాన్ని దుర్మార్గుడు వాగులోకి విసిరిపారాసాడు...

వాడు ఎవరో నీకు తెలుసా అక్కా?”

ఎవడో కొత్తవాడు...పక్క గ్రామం మనిషి అయ్యుంటాడు...

ఇదిగోండి. దీన్ని చుట్టుకోండి... అన్న మాధవ్ తన పంచెను విప్పి ఆమెదగ్గర జాపాడు. సగం నిక్కరుతో నిలబడ్డ అతన్ని కృతజ్ఞతా భావంతో చూస్తూ పంచెను తీసుకుని కప్పుకుంది.

గబుక్కున వాగు వైపు చూసి అదిగో నా చీర! అని ఆమె సంతోషపడుతూ అరిచింది. అతను తిరిగి చూసాడు. ఆమె చీర వాగు అంచుల్లో ఉన్న మొక్కలపైన సగమూ, సలసలమని పారుతున్న వాగు నీళ్ళల్లో సగమూ తేలుతున్నదిఅతను పరిగెత్తుకువెళ్ళి దాన్ని తీసుకు వచ్చాడు. సగం చీర బాగా తడిసిపోయుంది. తడిసిన చోటును బాగా పిండి చీరను ఆమె దగ్గర జాపాడు. అది తీసుకుని ఆమె  కట్టుకుంది. పంచెను అతని దగ్గర ఇచ్చింది.

కిందపడిన బిందెను తీసి, నీటితో నింపింది.

రండి వెళ్దాం. మీ ఇంటివరకు వచ్చి తరువాత నేను వెడతాను...

సరే...

అవును...ఎందుకిలా సాయంకాలం తరువాత వాగుకు వచ్చారు?”

ఏం చేయను. వేసవికాలం కదా అని సాయంత్రం వచ్చాను

ఇద్దరూ మాట్లాడుకుంటూ నడిచారు. తడిచీర కాబట్టి ఆమె మెల్లగానే నడవగలిగింది. తన గుడిసె దగ్గరకు వచ్చిన తరువాత లోపలకు వచ్చి కాఫీతాగి వెళ్ళు. వాగు గట్టు మెట్ల మీదున్న పాచి వలన నేను కాలుజారి వాగులో పడిపోయాను. అక్కడికొచ్చిన నువ్వు నన్ను పట్టుకుని పైకి లేపేవని అమ్మ దగ్గర అబద్దం చెప్పాలి. లేకపోతే నాకు జరిగినదానికి ఆవిడ బాధ పడుతుంది...

నేనే మీ దగ్గర మీ అమ్మతో అలా చెప్పమని చెబుదామనుకున్నా

కూతురి అవతారం చూసిన వెంటనే ఆమె తల్లి, “ఏమిటే...ఏమిటీ అవతారం, ఏమైంది?” అన్నది ఆందోళన పడుతూ. కూతురితో వచ్చిన మాధవ్ ను చూసింది.

లోపలకు రా తమ్ముడూ... అని మాధవ్ ను లోపలకు ఆహ్వానించిన తరువాత, సావిత్రి నీటి బిందెను కిందకు దింపి వాళ్ళు మాట్లాడుకుని ఉంచుకున్నట్టే పాచి మెట్టు మీద కాలు పెట్టటం, జారి వాగులో పడిపోవటం, మాధవ్ కాపాడటం చెప్పింది.

కాఫీ ఇయ్యమ్మా ఇద్దరికీ... అని తల్లికి ఆర్డర్ వేసింది.

ఇస్తాను!  చాలా థ్యాంక్స్ బాబూ. నువ్వు పక్క వీధి కుర్రాడివే కదా?”

అవునండి...నమస్తే!

నమస్తే బాబూ. కూర్చో. ఇదిగో ఐదే నిమిషాల్లో కాఫీ తీసుకు వస్తాను

ఇద్దరూ చాపమీద కూర్చున్నారు.

అప్పుడు టీవీ పెట్టెలో ఒక పెద్దాయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతున్నారు.

సిసుపాలుడిని వధించి తిరిగి వచ్చిన చక్రాయుధం, కృష్ణుడు చూపుడు వేలులోకి దూరినప్పుడు గాయం ఏర్పడి రక్తం కారింది. అప్పుడు కృష్ణుడు దగ్గరగా నిలబడున్న ద్రౌపది వెంటనే తన చీర కొంగును సగానికి చింపి, కృష్ణుడి వేలుకి కట్టు వేసింది. కృతజ్ఞతను మరిచిపోని కృష్ణుడు...తరువాత దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగుతున్నప్పుడు, ఎంతలాగినా చీర వస్తూనే ఉండాలి అనే వరం ప్రసాదించాడు. మనం ఒకరికి సహాయం చేస్తే...దానికి ప్రతిఫలంగా సహాయం కావలసిన సమయంలో ఇంకొక సంధర్భంలో అది పలురెట్లుగా మనకు తిరిగి దొరుకుతుంది...

తమ కథతో సరిపోయే సంఘటనను విని ఆశ్చర్యపోయారు ఇద్దరూ.

నువ్వు ఒక నవీన కృష్ణ పర్మాత్ముడివే తమ్ముడూ! నీ పేరు కూడా మాధవుడే కదా...ఏం కలిసింది అని నవ్వింది సావిత్రి.

వాడు సమాధానంగా నవ్వాడు.

**************************************************సమాప్తం******************************************* 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)

వెన్నెల…కథ