ఐడియా/మీకొసమే/మార్పు...మూడు మినీ కథలు
ఐడియా/మీకొసమే/మార్పు మూడు మినీ కథలు
ఐడియా…(మినీ కథ)
“సుమిత్రా!
ఎందుకే శోకంగా
ఉన్నావు” అన్నది ఎదిరింటి
జయంతి.
“అంతా
మా అతగారి
ట్రబుల్సే” అంటూ కళ్ళు
నలుపుకుంది.
“ఏమిటే
అయ్యింది...నీకు
పెళ్ళి జరిగి
ఇంకా ఆరునెలలు
కూడా అవలేదే"
అన్నది.
“మా
ఆయనతో నవ్వుతూ
మాట్లాడితేనే అత్తగారికి
నచ్చటం లేదు.
తల్లి దగ్గర
నుండి వాళ్ళ
అబ్బాయిని వేరు
చేస్తానేమోనని
భయపడుతున్నారు.
అందువలనే ఎప్పుడు
చూడూ చిటపటలాడుతూ
ఉంటూ నన్ను
తిడుతూ ఉంటారు.
అవసరం లేకపోయినా
పనులు చేయ
మంటోంది" అన్నది.
“ఏయ్...మూర్ఖురాలి
లాగా ఏడవకు!
నేను చెప్పే
ఐడియాను యూస్
చెయ్యి. ఒకేవారంలో
అన్నీ సరిపోతాయి” అన్నది జయంతి.
ఆమె చెప్పినట్టే
చేయడంతో ఒక
వారం రోజులలోనే
పరిస్థితి తారుమారు
అయ్యింది.
సంతోషంగా జయంతిని
కలిసిన సుమిత్రా
“అక్కా
మీరు చెప్పినట్టే
మా అత్తగారికి
ముఖ్యత్వం ఇవ్వటం
మొదలుపెట్టాను.
నా భర్తకు
ఆవిడ్నే వడ్డించమన్నాను.
రాత్రిపూట అత్తగారి
పక్కనే వెళ్ళి
పడుకున్నా. అది
మాత్రమే కాదు...నా
భర్త నన్ను
బయటకు వెళ్దామని
పిలిస్తే, అత్తగారినే
ఆయనతో పంపించాను.
అది చూసిన
చుట్టు పక్కల
వాళ్ళు ‘ఏమే
ఇలా కొత్త
దంపతులను వేరు
చేస్తున్నావు’ అని
అడగటం మొదలుపెట్టారు.
ఆ తరువాత
ఆవిడ మారిపోయింది.
‘మీ
ఐడియాకు చాలా
థ్యాంక్స్ ఆక్కా!’ అన్నది.
*************************************************సమాప్తం********************************************
మీకొసమే…(మినీ
కథ)
“రామ్మా!
రోజా, అల్లుడుగారు
రాలేదా! నువొక్కదానివే
వచ్చావు...? ఎర్రగా
ఉన్న కళ్ళను
చూస్తే రాత్రంతా
నిద్రపోయినట్లు
లేదు...మొహంలో
నవ్వులేదు. ఏదో
ప్రాబ్లం...సరే, లోపలికి
రా!”
తన చెల్లెని
ప్రేమగా లోపలకు
పిలిచాడు రాఘవ్.
“అన్నయ్యా!
నాకు, ఆయనకూ
చిన్న గొడవ.
మాటల పోట్లాట
పెద్దదయ్యి...చేతులవరకు
వెళ్ళింది. ఆయన
నా మీద
చెయ్యి చేసుకున్నారు.
కోపగించుకుని వచ్చేసాను!”
చెల్లెలు రోజా
చెప్పింది విన్న
అన్నయ్య రాఘవ్
కు కోపం
వచ్చింది. “అసలు
ప్రాబ్లం ఏమిటమ్మా? అల్లుడుగారు
ఎందుకు కొట్టారు?”
“నేను
పెద్దగా ఏమీ
చెప్పలేదు అన్నయ్యా!
మా మామగారినీ, అత్తగారినీ
వృద్దాశ్రమంలో
చేర్చండి అని
చెప్పాను. దానికే
అంత కోపం
వచ్చింది. నా
తల్లి-తండ్రులనా
వృద్దాశ్రమంలో
చేర్చమని చెబుతున్నావు? అని
అంటూ నా
మీద చేయి
చేసుకున్నారు...నేను
చెప్పింది తప్పు
మాటా అన్నయ్యా?”
“అది...అది...సరే, నువ్వు
లోపలకు వెళ్ళు”
రాఘవ్ చెప్పటంతో
రోజా ఇంట్లోకి
వెళ్ళింది.
అక్కడ ఆమె
తల్లి తల్లి
రాజ్యం, రోజాను
పిలిచి తన
పక్కన కూర్చోబెట్టుకుంది.
మెల్లగా అడిగింది.
“రోజా, నిజం
చెప్పు! అల్లుడుగారు
చాలా మంచి
మనిషి. ఆయన
నీ మీద
చేయి చేసుకున్నారంటే
నేను నమ్మను...నిజం
చెప్పు. ఆయన
నీమీద నిజంగానే
చేయి చేసుకున్నారా?”
అమ్మ అడిగిన
వెంటనే, చుట్టు
పక్కల అన్నయ్య, వదిన
లేరని నిర్ధారణ
చేసుకున్న
రోజా “అమ్మా!
మా ఆయన
బంగారమే...అయనా
నామీద చేయి
చేసుకునేది?”
“మరెందుకే
ఆయన చేయి
చేసుకున్నారని
కళ్ళు నలుపుకుంటూ
వచ్చి నిలబడ్డావు?”
“అంతా
మీకొసమే నమ్మా!?”
“మాకోసమా...అర్ధం
కాలేదే”
“నిన్నూ, నాన్నని
వృద్దాశ్రమంలో
చేర్పించబోయే విషయంగా
వదినతో అన్నయ్య
మాట్లాడుతున్నాడని
చెప్పావే! దాన్ని
ఆపటానికే...ఇలా
ఒక నాటకం
ఆడాను.
ఇప్పుడు అన్నయ్యకు
బాగా బుద్ది
వచ్చుంటుంది. మిమ్మల్ని
వృద్దాశ్రమంలో
చేర్పించే ఆలొచనకు
శ్వస్తి చెప్తాడు” నవ్వుతూ చెప్పింది
రోజా.
కూతురు మాటలకు, చేష్టలకు, తమ
మీద చూపిస్తున్న
ప్రేమకు...ఆనందంతో
విస్తుపోయిన తల్లి
రాజ్యం...చెమర్చిన
కళ్లతో కూతుర్ని
అలాగే చూస్తూ
ఉండిపోయింది.
*************************************************సమాప్తం********************************************
మార్పు...( మినీ కథ)
మాధవ్ కు
పెళ్ళి అంటే
ఇష్టం లేదు.
తల్లి లక్ష్మి
ఒత్తిడి వలన
గాయిత్రీని పెళ్ళి
చేసుకున్నాడు.
తాళి కట్టటంతో
సరి!
పెళ్ళి అయ్యి
ఆరు నెలలైనా
‘మంచి
కబురు’ లేకపోవటం
మాధవ్ తల్లి
లక్ష్మిని బాధకు
గురిచేసింది.
అత్తగారు బాధ
పడటం చూడలేని
గాయిత్రీ భర్తను
ఎలాగైనా మార్చాలని
నిర్ణయించుకుంది.
ఏ విషయంలోనూ
కలుగుచేసుకోని
మాధవ్ మనసును
మార్చటానికి 48 రోజుల
వ్రతం చేయటం
ప్రారంభించింది
గాయిత్రీ.
ఎప్పుడూ ఇళ్ళంతా
కళకళ లాడేటట్టు
తిరుగుతూ ఉంటుంది
గాయిత్రీ. తాను
మాట్లాడినా మాధవ్
నుండి సరైన
సమాధానం రాకపోయినా
అతనితో మాట్లాడటం
ఆపదు. ఏదైనా
ఒక ప్రశ్నకు
అతను జవాబు
చెప్పినా చాలు...ఆనందపడిపోతుంది.
ఎప్పుడూ ఉత్సాహంగా
ఉండే గాయత్రీ, వ్రతం
ఉండటం వలన
నీరసించిపోయింది..
ఆ రోజు
వ్రతం ముగింపుకు
వచ్చిన రోజు...వ్రతం
ముగియటానికి ఇంకా
కొంత సమయమే
ఉంది.
మాధవ్ ఇంకా
ఇంటికి రాలేదు.
“ఈ
48
రోజులలో సగం
అయిపోయావు గాయిత్రీ.
నిన్ను ఎంత
కష్టపెట్టానో! నీకు
బదులు మాధవ్
ని వ్రతం
ఉండమని చెప్పుండాలి
నేను” అన్నది అత్తగారు
లక్ష్మి.
ఆ మాటలను
వింటూ లోపలకు
వచ్చాడు మాధవ్.
అత్తా-కోడళ్ళు
అది గమనించలేదు.
“లేదత్తయ్యా, అలా
చెప్పకండి. ఆయన
ఈ రోజు
వరకు పడ్డ
కష్టము, బాధ
చాలు. ఇక
మీదట ఆయన్ని
కష్టపెట్టను. నా
వల్ల ఆయనకు
సంతోషం ఉన్నదో, లేదో...కాని
బాధ మాత్రం
పడనివ్వను. నా
జీవితం ఇలా
గడిచిపోతే పరవాలేదు.
దాన్ని నేను
సంతోషం గా
భరిస్తాను” అన్నది గాయిత్రీ.
ఆమె మాట్లాడింది
మాధవ్ చెవిలో
నుండి గుండెల
వరకు చొచ్చుకుపోయింది.
అతని కళ్ళు
ఆమెను ఆరాటంగా
చూసినై.
వెనుక నీడ
ఆడుతున్నది చూసి
వెనక్కి తిరిగి
చూసింది.
ఇద్దరి చూపులూ
మొట్టమొదటి సారిగా
కలుసుకున్నాయి...చాలా
సేపు చూపులు
మారలేదు.
*************************************************సమాప్తం********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి