అక్షర భ్రమ…(కథ)

 

                                                                         అక్షర భ్రమ                                                                                                                                                      (కథ)

తల్లి-తండ్రులు ఎన్ని బాధలు పడున్నా, తమ పిల్లలు జీవితంలో మంచి హోదాగా ఉండాలని ఆశపడతారు. దాని కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు కూడా చేసుంటారు. ఇది ప్రతి కుటుంబంలోనూ జరిగే ఉంటుంది.కాబట్టి పిల్లలు(మగపిల్లలైనా/ఆడపిల్లలైనా)తాము పెద్దవాళ్ళైన తరువాత తల్లి-తండ్రులకు సంతోషం మాత్రమే అందించాలి......ఏలా?

ఆడపిల్లలు ప్రేమలూ అంటూ వారిని కష్టపెట్టకుండా ఉంటే, అదే వాళ్ళు తమ తల్లి-తండ్రులకు ఇచ్చే సంతోషం. కొంతమంది ఆడపిల్లలకు కొన్ని కుటుంబాలలో ఎక్కువ స్వాతంత్రం ఇస్తారు. ఇలాంటి ఆడపిల్లలు ఏటువంటి చెడు సావాసాలు చేయకుండా ఉంటేనే చాలు.

ఇక మగ పిల్లల సంగతికి వస్తే, వారు కూడా ప్రేమా దొమా అనకుండా, కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగాలకు వెళ్ళి తల్లి-తండ్రులను చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇంతకంటే ఏ తల్లి-తండ్రీ పిల్లల దగ్గర నుంచి ఇంకేదీ ఎదురు చూడరని ఖచ్చితంగా చెప్పగలం.

ఈ కథలో ఒక తండ్రి తన పిల్లల మీద పెట్టుకున్న న్యాయమైన ఆశను అతని పిల్లలు తీర్చేరే? లేదా?....అనేదే ఈ కథా  సారాంశం. 

***************************************************************************************************** 

రోజులాగా రోజూ ఇలా ఉన్నది లేదు పద్మనాభానికి. ఆయన ఆలొచనలకు ప్రస్తుతం రెక్కలు మొలచి ఎగురుతున్నాయి. ఆయన కలలకు రంగులు వేసే రోజు ఇది. ఎందుకంటే రోజు ఆయన కొడుకు రమేష్ ఇంటర్ ఫైనల్ ఇయర్ పరిక్షా ఫలితాలు వెలువడే రోజు.

పద్మనాభం చదువుకోని మనిషి. తండ్రి లేకుండా పెరిగిన పిల్లాడు. హస్తకళ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని కాపాడిన అతని తల్లి ఆయనకు అన్ని న్యాయాలు బోధించి పెంచింది. కుటుంబం పేదరికంలో వాడిపోతున్నా ఒక ఉద్వేగంతోనూ, నమ్మకంతోనూ పెరిగారు పద్మనాభం.

పెళ్ళి పరువానికి చేరిన పద్మనాభం, రాజ్యం  అనే ఆడపిల్లను పెళ్ళి చేసుకున్నాడు. హాయిగా గడుపుతున్న దాంపత్య జీవితానికి సాక్షిగా ముగ్గురు పిల్లల్ను కన్నారు. ఇద్దరు ఆడపిల్లలూ, ఒక మగపిల్లాడితో జీవితాన్ని ఆనందంగా గడిపారు పద్మనాభం.

చదువు అనే మెట్టును ఎక్కలేకపోయిన పద్మనాభం తన బిడ్డలకు ఆస్తి దొరకాలని ఆశపడ్డారు. వాళ్ళ ఆనందం నిండిన జీవితానికి ఆయన యొక్క  ఎనలేని శ్రమను అర్పించారు.

కళ్ళను, రెప్పలు కాపాడుకునేలాగా తన పిల్లలను కాపాడుకుంటూ, పెంచుతూ ఒక మంచి తల్లిగా గుర్తింపు తెచ్చుకుంది రాజ్యం. పెద్దది ప్రియా, రెండోది దీపా, చివరి బిడ్డగా పుట్టిన వాడే రమేష్.

అన్ని కుటుంబాల సీరియల్ కధలాగానే ఇక్కడ కూడా చివరి బిడ్డ ముద్దుల బిడ్డ అయ్యాడు. సంవత్సరాలు గడిచినా పద్మనాభం కలలూ, లక్ష్యాలూ చెరిగిపోకుండా మనసులో తిష్ట వేసుకున్నాయి.

పెద్ద కూతురు ప్రియా, చిన్న కూతురు దీపా పదో తరగతితో తమ చదువు ముగించుకుని ఇక చదవలేమని తమ చదువుకూ, తండ్రి కలలకూ వీడ్కోలు చెప్పారు.

కూతుర్లు ఇద్దరూ చదువును కొనసాగించలేము, అని దాన్ని వదిలేయటం తండ్రికి బాధను తీసుకువచ్చింది. ఇది సంవత్సరాల తరబడి జరుగుతున్న ఒకటే కదా.

పెద్ద మనుషులైన ఆడపిల్లలను స్కూలుకు పంపడం కాలం సమూహం విమర్శనలతో ఎదిరించారు. సంప్రదాయం కన్నవారి అంగీకారంతో నెరవేరింది.

అయినా కానీ పద్మనాభం యొక్క లక్ష్యం సెగ తన ప్రియతమ కుమారుడు  రమేష్ వైపు తిరిగింది.

చదువులు ఆగిపోయినా కూతుర్లను మంచిగా పెంచారు. ఊరు మెచ్చుకునే విధంగా వినయ విధేయతలతో పెరిగింది పెద్ద కూతురు ప్రియా. చిన్న కూతురు దీపా కొంచం మార్పుతొ మాటకారిగా పిలవబడింది.

అల్లారు ముద్దుగా పెంచబడ్డాడు రమేష్. వాడు చదవాలి అనేది ఒకటే ఆయన యొక్క లక్ష్యం. అక్కయ్యలిద్దరూ తమ్ముడు డిగ్రీ తీసుకుని జీవితంలో ఒక వెలుగు వెలగాలి అని కాచుకోనున్నారు.

అడిగింది దొరికింది, అనుకున్నది జరిగింది అనే భావన కలిగున్న రమేష్ కు అన్నీ తుచ్చం అనే తెలిసింది. తల్లి రాజ్యం ఎన్నో రోజులు కొంచం కొంచంగా దాచిపెట్టిన డబ్బుకూడా రమేష్ కోసం కరిగిపోవటానికి రెడీగా ఉంది.

బృందావనంలో తల్లి యశోద కృష్ణుడ్ని పెంచిన దానికంటే, ఎక్కువ ప్రేమతో రమేష్ ను పెంచింది రాజ్యం. వాడు బాగా చదివి ఉద్యోగం చేస్తేనే తన జీవాత్మ  శాంతిస్తుందని కష్టపడ్డారు పద్మనాభం.

వాళ్ళ కుటుంబానికే మొదటి వారసురాలిగా పెంచబడ్డ పెద్ద కూతురు ప్రియా, సంసార జీవితంలోనూ విజయం సాధించింది. రాజ్యం యొక్క చుట్టాల అబ్బాయిని ఇచ్చి పెళ్ళిచేసారు. హాయిగా జీవితం కొనసాగుతోంది.

పద్మనాభానికినూ, రాజ్యానికీనూ ప్రియా వివాహం తరువాత వాళ్ళు పూర్తి ఆసక్తి రమేష్  వైపుకు తిరిగింది.

వాడు సంవత్సరమే ఇంటర్ ఫైనల్ ఇయర్ పూర్తి చేస్తున్నాడు. రాజ్యమూ, పద్మనాభమూనూ పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. రమేష్ బాగా చదువుకున్నాడనే వాళ్ళు అర్ధం చేసుకున్నారు.

తన కొడుకు రమేష్ మంచి మార్కులు తెచ్చుకుని కాలేజీ చదువు చదవటం  మొదలుపెట్టాలని రోజు సంతోషంగా కాచుకోనున్నారు.

నమ్మకంతోనూ, ధైర్యంతోనూ ఆనందం నిండిపోయుండ ప్రియమైన కొడుకు వస్తాడని ఎదురుచూస్తూ కూర్చున్నారు.

పరీక్షా ఫలితాలు తెలుసుకోవటానికి స్నేహితులతో స్కూలుకు వెళ్ళిన రమేష్ చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు. వాడితోపాటూ వెళ్ళిన అతని స్నేహితులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వచి జేరారు.

కాచుకుని, కాచుకునే టయర్డ్ అయిపోయారు పద్మనాభం దంపతులు. ఆందోళన నిండిన క్షణాలను వాళ్ళిద్దరూ అనుభవించారు.

రాజ్యం భర్తను శాంత పరిచింది.

రాత్రి సమయం అవుతున్నప్పుడు శొకమైన మొహంతో ఇంటికి తిరిగి వచ్చాడు రమేష్. వాడిపోయిన వాడి మొహాన్ని చూసిన తల్లి రాజ్యం కళ్లనీళ్ళు పెట్టుకుంది.  ఏమైందని అడుగుదామని అనుకున్న రాజ్యం కంటే ముందే ఎన్ని మార్కులు వచ్చినైఅని తండ్రి పద్మనాభం అడిగాడు.

మౌనం! మౌనం! రమేష్ దగ్గర మౌనమే జవాబైనది.

మరుసటి రోజు ఐదు గంటలకే పద్మనాభం త్వరగా లేచారు. నిన్న రాత్రి ఆయన మనసు బాధ పడుతూనే నిద్రపోయింది. ఏదో ఒక తెలియనిది పారేసుకున్నట్టు  ఆయన కనిపించారు.

తన మనసు కోటలొ దుమ్ము వచ్చి చేరినట్టు అనిపించింది. ప్రాణం యొక్క పట్టు ఊడిపోయినట్లు అనుకుని నీరసించిపోయారు. ఇక నవ్వుతూ బయట ఎలా నడవగలను అని తనకు తానే ప్రశ్నించుకున్నారు. కళ్ళల్లో సూలం గుచ్చుకున్నట్టు, రణం మయినట్టు భావించారు.

దీనికంతటికీ కారణం ఇంకేమీలేదు, నిన్న రాత్రి తెలియవచ్చిన రమేష్ ఇంటర్ ఫైనల్ ఫలితాలు. అతని దగ్గర ఎన్ని మార్కులు వచ్చినై అని అడిగినప్పుడు...మౌనం సాధించిన రమేష్ చాలాసేపటి తరువాత పరిక్షల్లో ఫైల్ అయినట్టు చెప్పిన వెంటనే పద్మనాభానికి సప్త నాడులూ విరిగిపోయినై.

తన కలలను చెదరగొట్టే కంకర రాయిని విసిరివేసిన కొడుకుని ఏం చేయాలో తెలియలేదు. ముద్దు చేసి ముద్దు చేసి పెంచిన కొడుకు ఇలా చేసాడే అని మనసు విరిగిపోయింది.

పద్మనాభానికి, రాజ్యానికీ కళ్ళుకట్టి అడవిలో వదిలేసినట్టు అయ్యింది. తాము చదువుకోని కారణంగా, తమ కొడుకు ఎలా చదువు తున్నాడో అని వాళ్ళు ఊహించుకోలేక పోయారు.

పక్కింటి యువకుడు, రమేష్ ఇంటర్ ఫైనల్ లో ఫైలు అయ్యాడని తెలుసుకుని పద్మనాభాన్ని చూడటానికి వచ్చాడు. బాధపడకండి అని చెబుతూ, ఫైల్ అయిన సబ్జెక్టులు మాత్రం వేరుగా రాసే ఛాన్స్ ఉన్నదని వాళ్ళని సమాధానపరిచాడు.

ఫైల్ అయిన సుబ్జెక్టులలో మళ్ళీ పరీక్ష రాయటానికీ, పాస్ అవటానికీ, మంచి మార్కులు తెచ్చుకోవటానికీ తాను రమేష్ కు నేర్పిస్తానని వాగ్దానం చేసాడు.

అప్పటికి సమాధానపడిన రమేష్ తండ్రి పక్కింటి యువకుడి ఆలొచనను అంగీకరించీ, అతను చెప్పినట్టు చేయమని రమేష్ కి ఆర్డర్ వేసాడు. పరీక్ష రాసి జీవితానికి దారి వెతుక్కోఅన్నారు.

త్రాసు ముల్లులాగా ప్రతిఫలించిన రాజ్యానికి ఇప్పుడు రమేష్ మీద కోపం రాలేదు. అతన్ని ఖండించాలనే అభిప్రాయం తల ఎత్త లేదు. జరగవలసింది చూడు అనే సలహా మాత్రం ఇచ్చింది.

ముద్దుగా పెంచబడ్డ కొడుకు మౌనం సాధించటంలో సామర్ధ్యం కలిగిన వాడుగా ఉండటం చూసిన పక్కింటి యువకుడు ఆశ్చర్యపడ్డాడు.

మళ్ళీ పరీక్ష రాసి పాసైన రమేష్, ఎలాగో ఈసారి మౌన వంచకుడిగా ఉన్నా పరిక్షల్లో పాసవటం చూసి ఆనందంలో మునిగిపోయారు కుటుంబీకులు.

తన ఆశలూ, ఇష్టాలూ నెరవేరే సంధర్భం ఏర్పడినట్టు మళ్ళీ నమ్మకం తెచ్చుకున్న పద్మనాభం పక్కింటి యువకుడికి తానే స్వయంగా వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వచ్చారు.

రమేష్ యొక్క కాలేజీ చదువు గురించిన ఆలొచనలనూ, సలహాలని  అతని దగ్గర  నుండి తీసుకున్నాడు. ఇంజనీరింగ్ లేకపోతే ప్రొఫషనల్ కోర్సులను సెలెక్టు చేసుకోమని సలహా ఇచ్చాడు పక్కింటి యువకుడు.

ఇంటికి తిరిగి వచ్చిన పద్మనాభానికి సంతోషం ఆగలేదు. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అది పలురెట్లు ఎక్కువ అయ్యింది. కారణం పెద్ద కూతురు ప్రియా, అల్లుడితో సహా వచ్చింది. కూతుర్నీ, అల్లుడ్నీ స్వాగతించి వాళ్ళతో రమేష్ యొక్క చదువు గురించి ఆలొచించారు.

ప్రియా భర్త కూడా ప్రొఫషనల్ కోర్స్ తీసుకుని చదివితే భవిష్యత్తులో మంచి సంపాదన, ఎదుగుదల రెండూ ఉంటాయని చెప్పారు.

అప్పుడే బయటకు వెళ్ళిన రమేష్ ఇంటికి వచ్చాడు. తండ్రి తాము అందరం అతడు ఏం చదువుకుంటే బాగుంటుందని ఆలోచించామని, ఆలొచనను  చెప్పారు.

పరిస్థితిని తనకు అనుకూలంగా చేసుకున్న రమేష్, తాను ఏరోనాటిక్స్ గానీ,  పైలట్ గానీ అవటానికి ఇష్టపడుతున్నానని తెలిపాడు.

అందరూ ఆశ్చర్యపోయారు. రమేష్ యొక్క హఠాత్తు విశ్వరూపం వాళ్ళకు  విస్మయం కలిగించింది. అతని తల్లి రాజ్యం మాత్రం గర్వంతోనూ, విశ్వాసంతోనూ కొడుకు యొక్క అభిలాషను సపోర్టు చేసింది.

ప్రొఫషనల్ ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పద్మనాభం పొదుపు చేసిన డబ్బులు ఖాలీ అవటం ప్రారంభం అయ్యింది. ఆనందంగా ఖర్చుపెట్టారు పద్మనాభం.

ఆయన నిండిన మనసుతో తన కొడుకు పేరు తెచ్చే కొడుకుగా పెరుగుతాడని కుతూహల పడ్డారు.

రమేష్ ఆనందానికి అవధుల్లేవు. కాలేజీ జీవితం అతన్ని ఉక్కిరిబిక్కిరి  చేసింది.

నెలనెలా హాస్టల్ అద్దెకూ, భోజనం, ఇతర ఖర్చుకూ డబ్బులు పంపారు.

తన కొడుకు శిఖరంలాగా పెరగాలని మనసులో మట్టికోట లేపుకున్నారు. ఆయన కళ్ళల్లో కన్నీరు ఆనందంతో ప్రవహించింది.

మనసులో కొడుకు మీద ఉన్న గొప్పతనాన్ని ఊరంతా వెలిబుచ్చారు. తన కొడుకు పైలట్ అయ్యి ఆకాశాన్ని ఏలుతాడని రోడ్డు రోడ్డూ చెప్పారు.

ఆరు నెలలు అయ్యింది. రమేష్ దగ్గర నుండి ఒక రోజు ఒక ఉత్తరం వచ్చింది. తమ కాలేజీలో రీసెర్చ్ కోసం ఒక స్టూడెంట్ గ్రూపును ఫామ్ చేసారని, వాళ్ళను రెండు నెలలు విదేశాలకు పంపుతారని, గ్రూపులో కాలేజీ మేనేజ్మెంటు నన్నూ ఒకడ్నిగా చేర్చింది అని రాసాడు. విదేశాలలో రీసెర్చ్ చేసి వస్తే తన చదువు ముగించిన తరువాత విదేశాలలోనే ఉద్యోగం దొరికి జీతం పలు లక్షల్లో వస్తుందని...కాబట్టి రీసెర్చుకు అయ్యే ఖర్చు డబ్బును రెడీ చేయండని రాసాడు.

ఉత్తరాన్ని చదివిన కుటుంబ శభ్యులు స్వర్గం స్వల్ప దూరంలోనే  ఉందని అనుకున్నారు. మేఘాలపై నుండి ఆకాశంలో ఎగురుతున్నట్టు కలలు కన్నారు.

దేవలోకంలోని అందాల దేవతలు వచ్చి రాజ్యం కళ్ల ముందు నాట్యం చేస్తున్నారు.

చేర్చిపెట్టిన డబ్బులో చాలా వరకు తీసి రమేష్ చేతిలో ఉంచారు. విమానాశ్రయం వరకు వచ్చి వీడ్కోలు ఇస్తానని ప్రేమతో చెప్పింది అక్క ప్రియా.

కాలేజీ మేనేజ్ మెంట్ దానికి ఒప్పుకోదని జవాబు చెప్పాడు. అతను చెప్పింది విని వాళ్ళు ఆశ్చర్యపడలేదు. అతని మీద వాళ్ళకున్న నమ్మకం వాళ్ళ మొహాలలో కనబడింది.

మనశ్శాంతితో అతనికి వీడ్కోలు చెప్పి ఊరికి తిరిగి వచ్చారు భవిష్యత్తు పైలట్ కుటుంబం. పద్దెనిమిదేళ్ళే నిండిన తన ముద్దుల కొడుకు రెండు నెలలు బయటి దేశంలో ఎలా కాలం గడుపుతాడు అనే బాధ తల్లి రాజ్యానికి. తల్లి ప్రేమ మనసు ఏరోజూ మారదు.

విదేశానికి వెళ్ళిన కొడుకు, వెళ్ళి చేరిన తరువాత ఫోనులో మాట్లాడతాడని  భార్యను సమాధానపరిచాడు పద్మనాభం.

రోజులు గడుస్తున్నాయి కానీ ఫోను మోగలేదు.

వారాలు గడిచినై కానీ ఫోను మోగలేదు.

ఒకరోజు ఫోను మోగింది. గంగానది ప్రవాహంలాగా ఎగసి పడుతూ లేచారు అందరూ.

ఫొనులో మాట్లాడారు పద్మనాభం.

హైదరబాద్ పోలీస్ కమీషనర్ ఆఫీసు నుండి మాట్లాడుతున్నట్టు చెప్పారు.

ఏదో రాంగ నెంబర్ అనుకునున్నా మాట్లాడటం ప్రారంభించారు.

ఆయన పేరును విచారించిన పోలీసులు, రమేష్ మీ కొడుకేనా అని అడిగారు.

హడలిపోతూనే పద్మనాభం అవునని చెప్పి, ఏమిటి విషయం?’ అన్నారు.

రమేష్ ను ఖైదుచేసి ఉంచామని, విచారణ కోసం రావాలని ఆయన్ని  పిలిచారు.

టెలిఫోనును పట్టుకున్న ఆయన చేతులు వణుకుతుండటం చూసిన ప్రియా యొక్క భర్త, మామగారి చేతిలో ఉన్న రిజీవర్ను తీసుకుని వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు వస్తున్నట్టు వాగ్ధానం చేసి ఫోను కట్ చేసారు.

వణికిపోయింది మంచి మనిషి పద్మనాభం మనసు. నమ్మలేని వార్తగా తల ఊపి, శ్వాశ గట్టిగా లాగి వదిలారు.

ఆయన హృదయం కొట్టుకునే ధ్వని ఆయనకే వినబడటాన్ని విని నిదానము, ప్రశాంతత టెలిఫోన్ రిజీవర్లో తప్పి పోయినట్లు భావించారు.

కన్నీటి చుక్కలకు స్వాగతం చెబుతున్నట్టు ఉన్నది రాజ్యం. బరువైన హృదయంతో మామగారిని పిలుచుకుని వెళ్లాడు ప్రియా భర్త.

స్టార్ హోటల్లో రూము తీసుకుని ఉన్న రమేష్, ఒక నాట్యగత్తె దగ్గర అసభ్యంగా నడుచుకున్నాడని, ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీదే ఆక్షన్ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

అది విన్న పద్మనాభం  మూర్చపోయారు.

పరిస్థితిని అర్ధం చేసుకున్న ప్రియా భర్త పోలీసుల దగ్గర క్షమాపణలు అడిగాడు. అతని చిన్న వయసును చూసి వదిలిపెట్టమని వేడుకున్నాడు. వాళ్ళతో పాటూ వెళ్ళిన లాయర్ సహాయంతో కంప్లైంట్ వాపస్ తీసుకున్నారు.

లేకపోతే రమేష్ కోర్టు కస్టడీలో ఉండేవాడు. పోలీసులు హెచ్చరించి  విడిచిపెట్టారు.

కన్నీటి ప్రవాహం రంగు మారలేదు. అక్కడ రాజ్యం దగ్గరే కాదు, ఇక్కడ పద్మనాభం దగ్గర కూడా.

తన కొడుకు దగ్గర ఒక్క మాటకూడా మాట్లాడలేదు ఆయన. ఊరికి బయలుదేరారు, రమేష్ తో కలిసి.

ఒక మహా ప్రళయం, ఒక పెద్ద భూకంపం వచ్చినట్టు ఉన్నది వాళ్ళ ఇల్లు.

ప్రతి ఒక్కరి మొహంలోనూ రమేష్ పైన విరక్తి, విసుగు చూపులు కనబడ్డాయి.  ప్రియా వాడ్ని తిట్టిపోసింది...శపించింది.

రాజ్యం మొహం చూపాలనే అవమానంతో లోపలకు వెళ్ళిపోయింది.

మంచి మనుషులు అని, మంచి కుటుంబం అని పొగడ బడ్డ పద్మనాభం  కుటుంబం వెక్కి వెక్కి ఏడుస్తున్నది. రమేష్ చేసిన అన్ని పనులూ అబద్దమైనవే  నని తెలిసినప్పుడు వాళ్ళ కలల కోట కూలిపోయింది.

ఇక ఉరి ప్రజల హీనమైన గేలికి, అవమానాలకూ తలవంచుకోవాలనేది మాత్రమే కాదు, తాను కలలుగన్న అన్నిటినీ కొడుకు ముక్కలు చేయడంతో ఒక పెద్ద ఓటమిని చవిచూసి తట్టుకోలేని తపనతో అల్లకల్లోలానికి గురి అయ్యాడు పద్మనాభం.

రమేష్ కాలేజీలో జేరిన దగ్గర నుండి అతను చేసిన వన్నీ మోసాలే. అతని  విదేశాలకు వెళ్తాడనీ, లక్షల్లో సంపాదిస్తాడనీ ఉరిలో గొప్పగా చెప్పుకున్న మాటలు గుర్తుకు తెచ్చుకుని కృంగిపోయింది కుటుంబం.

రాత్రి గుండెళ్ళో అలజడి ఎక్కువ అయ్యిందని భావించాడు పద్మనాభం.

చివరికి తీరని నష్టం జరిగిపోయింది.

గుండె నొప్పిని భరించలేని పద్మనాభం ప్రాణం ఆయన్ని వదిలి వెళ్ళిపోయింది. కుటుంబం తల్లడిల్లిపోయి ఏడుపుతో నిండిపోయింది. రమేష్ కళ్ళళ్ళో నీరు నిండి  బయటకు రావటం మొదలయ్యింది.

బంధువులూ, స్నేహితులూ, ఊర్లో వాళ్ళూ వచ్చి చివరి మర్యాదలు ఇచ్చారు. అందరూ రమేష్ ను మనసులో తిట్టుకున్నారు.

రోజు కుటుంబీకులకు ఇంత బాధ కలగటం తనవలనేనని గ్రహించాడు రమేష్.

బాధ్యతలేని తన బుద్ది, విచ్చలవిడి తనమే తన తల్లి అమంగళంగా మారడానికి కారణం అని తెలుసుకుని కుమిలిపోయాడు.

రాజ్యం పరిస్థితి చూసి ఊళ్ళో వాళ్ళందరూ జాలిపడ్డారు. ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.

దేవుడి మీద అపనమ్మకం వచ్చినట్లు శపించింది. తల్లి కాళ్ళ మీద పడి ఏడ్చాడు రమేష్. ఇక ఏడ్చి ఏం ప్రయోజనం?’ అని అడిగింది తల్లి.

పద్మనాభం దేహం ఎలెక్ట్రిక్ శ్మశానంలోకి తీసుకువెళ్ళి దహనం చేయబడింది.  కాలుతున్న ఆయన శరీరం నుండి వెలువడే పొగ, నిటారుగా నిలబడున్న గొట్టంలో నుండి బయటకు వస్తోంది.

కాలిపోతూ బయట పడుతున్న పొగ గాలిలో మాత్రమే కలవలేదు, రమేష్ హృదయంలో కూడా కలిసింది. కాలుతున్న వేడి అక్కడ మాత్రమే కాదు...రమేష్ మనసులోనూ గాయం ఏర్పరచింది. తన తండ్రి కలలను, తన కుటుంబాన్నీ ఇకమీదట బాధ్యతగా చూసుకోవలసినది తానేనని అతనికి ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.

***************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)