ఏ విత్తుకా పంట...(కథ)
ఏ విత్తుకా పంట (కథ)
ఈ పెళ్ళికి పెళ్ళిచూపుల సంప్రదాయమే ఒక నాటకం.
మరి మీరే చెప్పండి...అమ్మాయి, అబ్బాయి ఇదివరకే ఒకరినొకరు చూసుకున్నారు. పరిచయమున్నవారు. ఇకపోతే రెండు కుటుంబాల మనుష్యులు మాత్రమే ఇప్పుడు మొదటిసారిగా కలుసుకుంటున్నారు. కానీ సందర్భమేమో వాళ్ళిదర్నీ బేస్ చేసుకునే. ఈ పెళ్ళికి పెళ్ళిచూపుల సంప్రదాయమే ఒక నాటకం.
ఎంత ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నా, ప్రేమికులిద్దరూ వారివారి తల్లి-తండ్రులను ఒప్పించి పెళ్ళిచేసుకుంటున్నారు కాబట్టి ఈ పెళ్ళి సంభాషణలో కట్నకానుకల ప్రస్తావన తల ఎత్తింది.
ఇరు కుటుంబాలూ కట్నకానుకల విషయంలో రాజీ పడలేదు. మరేం జరిగింది? పెళ్ళి కుదిరిందా? ఏ కుటుంబం రాజీ పడింది? తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.
***************************************************************************************************
“ఈ
పెళ్ళిచూపుల సంప్రదాయమే
ఒక నాటకం
అని అనిపిస్తోంది
నాకు”
వేళాకోళం కలిసిన
నవ్వుతో చెప్పారు
ఏకాంబరం. ఒకలాంటి
నేర భావనతో
కలిసిన మనసుతో
వచ్చిన వాళ్ళందరూ
ఆయన్నే చూశారు.
‘ఏం
చెప్పాలనుకుంటున్నారు...? అది
నేరుగా చెప్పండి!’ అన్నది
వచ్చినవాళ్ళ చూపులు.
“మరి
మీరే చెప్పండి...అమ్మాయి, అబ్బాయి
ఇదివరకే ఒకరినొకరు
చూసుకున్నారు. పరిచయమున్నవారు.
ఇకపోతే రెండు
కుటుంబాల మనుష్యులు
మాత్రమే ఇప్పుడు
మొదటిసారిగా కలుసుకుంటున్నాం.
కానీ సందర్భమేమో
వాళ్ళిదర్నీ బేస్
చేసుకునే కదా.
దాన్నే అలా
చెప్పాను!”
“అదికూడా
నిజమే” అమోదించారు, పెళ్ళికొడుకుగా
వచ్చున్న అర్జున్
తండ్రి ఈశ్వరనాద్.
“నేను
ఇలాగే ఏ
విషయాన్నైనా ఓపన్
గా మాట్లాడతాను.
మనసులో ఏదీ
ఉంచుకోను...” మళ్ళీ నవ్వారు
ఏకాంబరం.
“నా
కూతురు కమలా
నా దగ్గరకు
వచ్చి ‘ఇలాగే
నాన్నా...నాతో
పనిచేస్తున్న ఒకర్ని
ప్రేమించాను’ అని
చెప్పినప్పుడు
నేను మిగతావారిలాగా
గంతులేయలేదు. కేకలు
వేయలేదు. ఓర్పుగా
ఉన్నాను. ఎందుకంటే
మీ అబ్బాయి
గురించి నాకు
ఏమీ తెలియదు.
కానీ, నా
కూతురు గురించి
మాత్రం నాకు
అంతా తెలుసే!
ఆమెమీద నేను
పెట్టుకున్న నమ్మకం, ఆమె
ఏ రోజూ
పాడుచేసుకోదు”
ఈశ్వరనాద్ తన
కొడుకు అర్జున్
ని అర్ధంతో
చూసారు. అతనే
ఇంకెక్కడో వేరే
దిక్కుగా చూసాడు.
“సరేనండీ...మనం
మిగిలిన విషయాల
గురించి మాట్లాడి
ముగిస్తే నిశ్చయ తాంబూలాలకు
తారీఖును ఖాయం
చేసుకోవచ్చు!”
“తప్పకుండా.
కానీ దానికి
ముందు నావల్ల
ఏం చేయగలనో
ఓపన్ గా
చెప్పేస్తాను” నిటారుగా
కూర్చున్నారు. భార్య
కౌశల్యను ఒకసారి
చూసారు. “నేనొక
మామూలు సాదారణ
మనిషిని. మార్కెట్టులో
కూరగాయల కొట్టు
పెట్టి నడుపుతూ
వస్తున్నా. గొప్పగా
చెప్పుకునేంత ఆదాయం
ఏమీ లేదు.
అందువల్ల మీరు
‘ఇంతకావాలి’, ‘అంత
కావాలి’ అని
అడగటానికి ముందే
నేను ఏం
చేయగలనో, ఎంతవరకు
చేయగలనో చెప్పేయటం
మంచిది!”
“ఖచ్చితంగా...” అన్నారు ఈశ్వరనాద్.
“నా
కూతురు కమలా
పెళ్ళి ఇంకో
రెండు, మూడు
సంవత్సరాల తరువాత
నిదానంగా చేద్దామనుకున్నాను.
కానీ, ఇలా
హడావిడిగా, ఇప్పటికిప్పుడే, ఇంకో
రకమైన పరిస్థితిలో
చేయాల్సి వస్తుందని
నేను కొంచం
కూడా ఎదురు
చూడలేదు”
ఆయన బలంగా
దేనికో పిడి
వేస్తున్నారనేది
అర్ధం చేసుకున్న
ఈశ్వరనాద్, భార్య
అనుసూయని ఓరకంటితో
చూసారు.
‘ఉండండి.
ఆయన చెప్పి
ముగించనివ్వండి’ అనే
విధంగా ఆమె
కళ్లతోనే భర్తకు
సమాధానమిచ్చింది.
ఈశ్వరనాద్ పెద్దబ్బాయి
పరమేశం, అతని
భార్య అశ్వినీ
ఏమీ మాట్లాడుకోలేదు.
పెద్దలు మాట్లాడుకోనీ
అని మౌనంగా
ఉన్నారు.
తను మాట్లాడుతున్నప్పుడు
ఎవరూ, ఏదీ
అడ్డు చెప్పకపోవటం
ఏకాంబరానికి సంతోషమూ, ఉత్సాహమూ
ఇచ్చింది. బలమైన
స్వరంతో మళ్ళీ
మొదలుపెట్టారు.
“నా
కూతురుకోసం ఇప్పటిదాకా
నేను చేర్చిపెట్టింది
పదిహేను కాసుల
బంగారం ఉంది.
పెళ్ళి ఖర్చుకు
రొక్కంగా ఒకటిన్నర
లక్ష ఉంది.
కాపురానికి కావలసిన
సామగ్రి కొంచం
ఉంది. అంతే!”
పెళ్ళికొడుకు అర్జున్
కు తప్ప
మిగిలినవారి అందరి
ముఖాలూ వాడిపోయినై.
పెళ్ళికొడుకు తల్లి
అనుసూయ తేరుకుని
ముందుగా మాట్లాడింది.
“ఏమిటి
ఇలా మాట్లాడుతున్నారు.
నా పెద్దకొడుకు
పరమేశానికి, గుంటూరు
నుండి అమ్మాయిని
తెచ్చుకున్నాం.
ఇదిగో మా
పెద్దకోడలు అశ్వినీ.
వాళ్ళకు ఎంత
చేసారో
తెలుసా!”
“క్షమించాలి.
అది నేను
తెలుసుకుని ఏం
చెయ్యబోతాను? వాళ్ళు
చేసారు కాబట్టి
పోటీ వేసుకుని
నేనూ చెయ్యాలా...? నాకు
ఇంకొక కూతురు
ఉంది. ఆమెనూ
నేను చూడాలి
కదా...! అదీకాకుండా, ఆమె
పెళ్ళికి ఇప్పుడు
అడిషనల్ గా
ఒక చిక్కు
వేరే వచ్చి
చేరింది. రాబోయే
పెళ్ళివారికి ఈ
విషయం కూడా
వాళ్ళకు అర్ధమయ్యేటట్టు
చెప్పి ఆమెను
గట్టెక్కించాలి...”
“ఏం
చెప్పదలుచుకున్నారు...నాకు
అర్ధంకాలేదు. మీ
రెండో అమ్మయి
పెళ్ళికీ, దీనికీ
ఏమిటి సంబందం...? రెండింటినీ
ఎందుకు ముడి
వేస్తున్నారు?"
అన్నాడు పరమేశం
కళ్ళు పెద్దవి
చేస్తూ.
“పెద్దదాని
యొక్క పెళ్ళి
ఇలా మామూలుకు
విరుద్దంగా కుదిరిపోయిందే!
బంధుత్వంలోనే ఇద్దరు
పెళ్ళికొడుకులు
హుషారుగా ఉన్నప్పుడు
ఇలా కులం
కాని కులంలో
పెళ్ళి చేసుకుంటే...తరువాత
చిన్నదాని పెళ్ళిని
అంత సులభంగా
చెయ్యగలమా ఏమిటి...? అందులో
చాలా చిక్కులు
ఉంటాయే!”
“ఓ...అదొక
సమస్య ఉంది
కదూ...?” అన్నాడు
పరమేశం ఒప్పుకుంటున్నట్టు.
“చూడండి...నా
కూతురు ప్రేమించటాన్ని
నేను అడ్డుకోవటంలేదు.
ఆమె ప్రేమపెళ్ళి
ఆశ విజయవంతం
చేయటానికి రెడీగా
ఉన్నాను. కానీ, నా
తాహతకు మించి
ఏదైనా మీరు
ఎదురుచూస్తే, దేనికీ
ప్రామిస్ చేయను!
ఇది నేను
మీకు క్లియర్
గా చెబుతున్నాను.
మీరు ఓకే
అంటే మిగిలిన
విషయాలు మాట్లాడదాం”
“ప్చ్...
మా బంధువుల
దగ్గర మీరు
చేసేవాటి గురించి
చెబితే ఎవరూ
గౌరవించరు. పదిహేను
కాసులకు ఏమొస్తుంది? దగ్గర
దగ్గర ఏమీ
ఇవ్వకుండానే మీ
అమ్మాయిని పంపిస్తున్నారు...” అన్నది అనుసూయ
విసుగుతో!
“ఒకటిన్నర
లక్షతో పెళ్ళా? సాధ్యం
కాదు. కల్యాణ
మండపానికే ఈ
రోజు, రోజుకు
అంత అద్దె
ఇచ్చుకోవాల్సి
వస్తోంది. మిగిలిన
ఖర్చులకు ఏం
చేయాలి...? నా
పెద్ద కొడుకు
పెళ్ళి వీడియో
పంపిస్తాను. ఒకసారి
చూసి ఆ
తరువాత మాట్లాడండి” అన్నారు ఈశ్వరనాద్.
“మీరు
ఎదురు చూస్తునట్టు
నావల్ల బ్రహ్మాండంగా
పెళ్ళి జరుపలేను.
మిగిలినవాల్ల గౌరవంకోసం
బయట అప్పుతీసుకోవటం, ఉన్న
ఆస్తిని అమ్మటం
నావల్ల అవని
కార్యం. నా
దగ్గర ఏముందో
దాన్ని పెట్టుకునే
నేను పెళ్ళి
జరిపిస్తాను. తరువాత
మీ ఇష్టం.
నా కూతురు
ఆశపడిందే అనే
ఒకేఒక కారణం
కోసమే నేనే
ఇంతవరకైనా దిగి
వచ్చాను”
“మేము
మాత్రం ఏంటిట..? మా
అబ్బాయ్ కోసమే
మీ ఇంటివరకు
వచ్చాము. మా
అంతస్తుకు మీరంతా
మా పక్కన
నిలబడలేరు! అద్దెలు
మాత్రం మాకెంత
వస్తోందో తెలుసా?”
“ఉండనీయండమ్మా.
ఏది ఎక్కడుండాలో
అది అక్కడే
ఉండాలి. అదే
ఉత్తమం. ఒకదానిచోట
ఇంకొకటి ఉండలేదు...?”
“చివరగా
ఏం చెబుతారు.
మీ అమ్మాయికి
వందకాసుల బంగారం, మేము
చెప్పే కల్యాణ
మండపంలో, మేము
చెప్పినట్లు పెళ్ళి
జరపటానికి తయారైతే
మనం ఫర్దర్
గా మాట్లాడదాం” కోపంగా చెప్పాడు
ఈశ్వరనాద్.
“కమలా
కొంచం ముందుకు
రామ్మా...జరుగుతున్న
సంభాషణ అంతా
వింటూనే ఉన్నావు
కదా. ఇది
నువ్వు ఎంచుకున్న
జీవితం. ఇక
నేను ఏం
చేయాలో చెప్పు”
“ఏమిటండీ
దాని దగ్గర
అలా...” కౌశల్య అడ్డుపడింది.
కమలా వేగంగా
ముందుకు వచ్చింది.
“నాన్నా.
వద్దు నాన్నా.
నాకోసం మీరు
ఇంత దూరం
మాట్లాడిందే చాలు.
సాధ్యంకాని విషయం
కోసం తల
ఊపొద్దు. కూతురి
ప్రేమ వివాహం
జరిపించాలని మీరు
ఇంతదూరం దిగివచ్చిందే
చాలు! ఛ...ఈరోజుల్లో
కూడా ఇంత
డబ్బు ఆశతో
మనుషులు ఉంటారని
నేను ఎదురు
చూడలేదు. ఏమిటి
అర్జున్ మీరేమీ
మాట్లాడరా...? ప్రేమించేటప్పుడు
మాత్రమే సంఘ
సంస్కర్త లాగా
మాట్లాడతారా...?” ఆయసపడుతూ
తన అక్కసునంతా కుమ్మరించింది!
“నా
నెత్తురు ఉడికిపోతోంది.
ఎంతపెద్ద అవమానం...ఛ...అబ్బాయిని
కన్న మనము
ఇంత తగ్గిపోవలసి
వస్తోందే” ఈశ్వరనాద్
తన విరక్తిని చూపించాడు.
“అంతా
వీడి వల్లే.
అర్ధంలేని వీడి
ఆశవలనే" అంటూనే అనుసూయ
తన కొడుకును
చూసింది.
“అదేమీ
అంతపెద్ద అందగత్తె
కూడా కాదు.
దీన్ని ఎలా
ప్రేమించాడో! ఇప్పుడే
ఇంత గయ్యాలి
తనంతోనూ, అణుకువ
లేకుండా మాట్లాడుతోందే.
పెళ్ళి అయితే
మనల్ని మిగేస్తుంది”
“ఆపండి
నాన్నా! కమలా
తండ్రి ఎలా
నడుచుకున్నారో
చూడు! తన
కూతురు ఎన్నుకున్న
జీవితమే తనుకు
ముఖ్యమని ఎంతలా
మాట్లాడుతున్నారో
చూడు.......మీరేమిట్రా
అంటే కొడుకు
జీవితం ఎలాపోతే
మనకేంటి అన్నట్టు డబ్బు, కానుకలూ, సారె
అంటూ అర్ధంలేకుండా
మాట్లాడి...నా
కలను నలిపేసారు.
ఎంతో నమ్మకంతో
మిమ్మల్ని పిలుచుకు
వచ్చాను. అన్నిటినీ
మీడబ్బు ఆశతో
నాశనం
చేసారే” అర్జున్ కోపగించుకున్నాడు.
“రేయ్
అర్జున్. ఈ
అమ్మాయి నీకు
వద్దు. మన
బంధువుల మధ్య
మేము తలవంచుకుని
అవమానంతో నిలబడలేము.
ఆమెను మర్చిపోయే
దారి చూడు!” పరమేశం అర్జున్
మీద అరిచాడు.
“మీకోసం
నేను నా
మనసును మార్చుకోలేను.
నా జీవితాన్ని
నేను నిర్ణయించుకోవటమే
న్యాయం. మీరు
మా పెళ్ళి
జరపటానికి ఇష్టపడకపోతే, నేనే
నాకు తగినలాగా
నా స్టైలులో
పెళ్ళి చేసుకుంటాను.
అప్పుడు మీ
బంధువుల మధ్య
మీకు మర్యాద, గౌరవం
పెరుగుతుంది కదా...మంచిది...” వేగంగా జరిగి
వెళ్ళాడు.
“ఏమండీ
వాడ్ని పిలవండి.
వాడి ఇష్టానికి
వాడేదైనా చేస్తాడు.
మన గౌరవం, మర్యాద
అంతా పోతుంది!...అశ్వినీ, నువ్వైనా
నీ మరిదికి బుద్ది
చెప్పకూడదా...? నువ్వు
చెబితే వాడు
వింటాడు!”
“నేను
దేనికి అతనికి
బుద్ది చెప్పాలి
అత్తయ్యా...?” నవ్వింది
అశ్వినీ.
“ఏమిటి
అలా మాట్లాడుతున్నావు...నువ్వు
వాడి వదినవు
కావా? నీకు
మన కుటుంబ
గౌరవ మర్యాదలతో
సంబంధం లేదా?” అందరూ
అశ్వినీను చూసారు.
“నన్ను
పెళ్ళి చూపులనాడు
చూడటానికి వచ్చినప్పుడు
కేవలం ఐదు
కాసులకోసం
అంతదూరం మా
నాన్నతో వాగ్వాదం
చేసేరే....మరిచిపోగలనా? చివరకు
మా నాన్న
ఎంత శ్రమపడి
తిరిగి, అది
రెడీ చేసారో
తెలుసా? దాన్ని
ఇప్పుడు తలచుకున్నా
నా మనసు
ఆరనంటోంది...”
“......................”
“అప్పుడు
నేను మాట్లాడలేకపోయాను.
అందరూ నన్ను
మాట్లాడనివ్వలేదు.
ఇప్పుడు నా
వంతు కూడా
కలిపి నాలాగా
ఇంకొకత్తి న్యాయాన్ని
మాట్లాడుతోంది....దాన్ని
నేనెందుకు అడ్డుకోవాలి...? మా
నాన్న యొక్క
కడుపుమంట, నా
శాపం మిమ్మల్ని
ఉరికే వదుల్తుందా...? మీరు
జల్లిన విత్తనమే
కదా...ఇప్పుడు
పంట కోత
చేస్తున్నారు...జవాబు
చెప్పండి...?”
ఎమీ మాట్లాడ
లేక బిత్తర
పోయారు అర్జున్
కన్న వారు.
****************************************************సమాప్తం*****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి