మాంత్రీకుడు-పడుచుపిల్ల…(కథ)

 

                                                           మాంత్రీకుడు-పడుచుపిల్ల                                                                                                                                        (కథ)

చిన్నప్పుడే తల్లి చనిపోయిన రోహిణి, గుడిలో పూజరిగా ఉంటున్న తండ్రి బద్రత, ప్రేమ, అభిమానంతోనే పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు పెళ్ళీ వయసు రావడంతో రోహిణికి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాడు తండ్రి. తనకు పేళ్ళై వెళ్ళిపోతే తన తండ్రిని ఎవరు చూసుకుంటారు అనే బాధతో రోహిణీ కుమిలిపోయింది. తండ్రినీ-నన్నూ వెరు చేయకు అని తండ్రి పూజారిగా ఉంటున్న గుడిలోని అమ్మోరి దేవతను వేడుకుంది.

అలా వేడుకున్న రోహిణి కోరిక నెరవేరిందా?.....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

****************************************************************************************************

న్యూస్ పేపర్ను విడదీసి, ఒక కంటితో చూస్తూ,  మరో కంటితో కాఫీని ఎదురుచూస్తూ, క్షణానికొకసారి వంటగది వైపు కంటి చూపును ప్రసరిస్తున్నారు డాక్టర్ వివేక్. ఈపాటికి వేడిగా కాఫీ వచ్చుంటుంది. కానీ, వాకిటివైపు భార్యను వెతుక్కుంటూ ఎవరో ఒక మహిళ వచ్చి మాట్లాడుతున్న శబ్ధం వినబడింది. , అందువలనే ఆలశ్యమా?’

ఏమండీ, విషయం తెలుసా...?” వేగంగా కాఫీను తీసుకుని వచ్చి జాపి, ఆదుర్దాగా మొదలుపెట్టింది సుప్రియా. ఆయన భార్య.

ఏమిటి సుప్రియా, పొద్దున్నే ఉరి గొడవ నిన్ను వెతుక్కుంటూ వచ్చేసిందా? వచ్చింది ఎవరు? ఏమిటి విషయం?” నవ్వుతూ అడిగి, కాఫీను చల్లర్చుకోవటం ప్రారంభించారు డాక్టర్ వివేక్.

గొడవ ఏమీ లేదండీ. ఒక ఆశ్చర్యపరిచే సమాచారం. మంగమ్మత్త వచ్చి చెప్పి వెడుతోంది. ఊరి సరిహద్దులో ఉన్న మన కనకదుర్గ అమ్మోరు గుడి పూజారి క్రిష్ణ శాస్త్రి ఉన్నారే, ఆయన కూతురు రోహిణి నిన్న మంగళగిరికి స్నేహితురాలు ఒకతిత్తో పానకాలస్వామిని దర్శనం చేసుకుందామని వెళ్ళిందట. అక్కడేదో తిరనాలుట. విపరీతమైన జనమట. గుడికి వెళ్ళే దోవలో జనసమూహంలో స్నేహితురాలిని విడిపోయిందట పిల్ల రోహిణి

అరెరె, తరువాత...?”

జనసమూహంలో స్నేహితురాలు కోసం అటూ ఇటూ రోహిణి వెతకటం చూసి,  ఆమె దగ్గరకి ఒక స్వామీజీ వచ్చాడట. ఆయన కాషాయం బట్టలు వేసుకుని ఉన్నారట. మెడలో బోలెడన్ని రుద్రాక్షమాలలు, నుదిటి మీద విబూధి గీతలు, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆకారంలో ఉన్నారట.  

ఏమిటి బిడ్డా, ఎవర్ని వెతుకుతున్నావుఅని రోహిణి దగ్గర అడిగారట.

నా స్నేహితురాలు రాధాను. ఆమె నాతోపాటూనే వస్తోంది. ఇప్పుడు గుంపులో విడిపోయింది... అని ఆమె చెప్పగా,

ఇందుకా బాధపడుతున్నావు. నువ్వు గుడికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు, ఆమె నీ కంటికి కనబడుతుంది...అని చెప్పి,

ఇందా విబూధిని, కుంకుమనూ తీసుకో...భయమంతా పారిపోతుందిఅంటూ రోహిణి చేతులో వీభూది, కుంకుమ ఇచ్చారట. తరువాత, ఆయన తన చేతిలో ఉన్న కమండలంలో  నుండి ఏదో తులసి తీర్ధం లాంటిది రోహిణి చేతిలో కొన్ని చుక్కలు పోసి తాగమన్నారట. రోహిణి ఆయన చెప్పినట్టు చేసిందట. అంతే రోహిణి కళ్ళు తిరిగి స్ప్రుహ కోల్పోయిందట.

రోహిణిను ఒకమూలకు తీసుకు వెళ్ళి కూర్చోబెట్టేరట స్వామీజీ. తరువాత కొంతసేపటి వరకు ఈమెకు ఏం జరిగిందో గుర్తులేదట. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆమె స్నేహితురాలు వచ్చి ఆమె మొహం మీద నీళ్ళు జల్లి లేపుతూ ఉందట. రోహిణి మెడలో వేసుకోనున్న బంగారు గొలుసు, చేతులకున్న బంగారు గాజులు, అన్నీ మాయమైనట!

ఏమిటే ఇది, అన్యాయంగా ఉందే? తిరనాల సమయంలో విపరీత జన సమూహం రోడ్డుమీద నడుస్తూ ఉంటారే, పొలీసు కాపలా చాలా ఉంటుందే? అక్కడా దోపిడి జరిగింది?”

అరె, అవునండి. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేసి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చిందట రోహిణి...వచ్చినతను స్వామీజీ కాదట. అతనొక మాంత్రీకుడట! ఇలా మాటి మాటికీ జరుగుతోందట...పోలీసులు మంత్రీకుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారట! అన్నది డాక్టర్ వివేక్ భార్య సుప్రియా.

పగటిపూట దోపిడీదారులు. అది ఇదేనా? దుర్గాదేవి అమ్మవారి గుడి పూజారి క్రిష్ణశాస్త్రి ఒక హార్ట్ పేషంటు. నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన గుండె షాకింగ్ న్యూసును ఎలా తట్టుకుంటుందో పాపం?”

ఆలొచనతో గొణిగారు డాక్టర్ వివేక్.

                                                                                   *********************

క్లీనిక్ లో ఒకటే గుంపు.

టోకన్ వరుసతో ఒక్కొక్క రోగి లోపలకు రాగా, డాక్టర్ వివేక్ వాళ్ళను పరిశోధించి, చికిత్స చేసి, మందులు రాసిచ్చి పంపిస్తున్నారు.

నమస్తే డాక్టర్ బాబూ! అంటూ ఎదురుగా వచ్చిన ఆయన్ని చూసి ఆశ్చర్యపడ్డారు డాక్టర్ వివేక్. వచ్చిన ఆయన దుర్గమ్మ గుడి పుజారి క్రిష్ణశాస్త్రి.

విరిగిపోయి పడిపోయేటట్టు ఉన్న ఒక సన్నని దేహం. కళ్ళల్లో శోకం. ఆయన పక్కన ఆయన కూతురు రోహిణి. 

రండి మిస్టర్ క్రిష్ణశాస్త్రిగారూ, ఏం చేస్తోంది? నేనిచ్చిన మందులు కరెక్టుగా టైము ప్రకారం తీసుకుంటున్నారా, లేదా?”

అవన్నీ మర్చిపోకుండా వేసుకుంటున్నా డాక్టర్ గారు. అయినాకానీ  అప్పుడప్పుడు గుండె దడ. ఒళ్ళంతా చెమట పడుతోంది. తల తిప్పుతోంది..

ఏమీ ఆదుర్దా పడక్కర్లేదు క్రిష్ణశాస్త్రి గారూ. ఇవన్నీ మీకు నిన్నట్నుంచే కదా వస్తున్నాయి?”

కరెక్టుగా చెబుతున్నారు డాక్టర్. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే నిన్న మధ్యాహ్నం నుండి...

ఏమ్మా రోహిణి, మంగళగిరి స్వామి దర్శనం, మాంత్రికుడూ, నీ నగల దోపిడి, అదీ ఇదీ అని ఊరంతా మాట్లాడుకుంటోందే...నిజమా?”

గబుక్కున ఆమె కళ్ళల్లో నీరు పొంగింది. క్రిష్ణశాస్త్రిగారు చెప్పారు.

విషయం మీ చెవిదాక వచ్చేసిందా? అవును డాక్టర్ గారూ, ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా నేను తిని, తినక, కడుపు కాల్చుకుని చేర్చిపెట్టి దీనికి కొన్న బంగారు గొలుసు, బంగారు గాజులూ అన్నీ  పోగొట్టుకుని వచ్చి నిలబడింది. అందులోనూ పోయిన నెల దానికి గుడివాడ తాలుకా ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్న ఒక మంచి వరుడు వచ్చి చూసి వెళ్ళిన సమయంలో, ఇలా జరగాలా చెప్పండి?”

మంగళగిరి పోలీసు అధికారి నాకు బాగా తెలిసినతను. మంచి స్నేహితుడు శాస్త్రిగారూ. నేను ఆయనకు ఫోను చేసి ప్రత్యేక శ్రద్ద తీసుకుని దోపిడీదారును త్వరగా  కనిపెట్టమని చెబుతాను. బాధ పడకండి...

క్రిష్ణశాస్త్రి పూజారి డాక్టర్ గారి చేతులు పుచ్చుకుని, తన తడిసిన కళ్ళకు  అద్దుకున్నాడు.

సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారే మీ రూపంలో నాకు కనబడుతోంది. పేద పూజారికి సహాయం చేయండి డాక్టర్ గారూ. ఈమెను పెళ్ళు చూపులు చూసి వెళ్ళిన వారు, ఎక్కువగా ఏమీ ఎదురు చూడటం లేదు. సింపుల్ గా గొలుసు, గాజులు, పోగులు, జుమికీలు, ముక్కుపొడక వేసి, పెళ్ళి ఖర్చునూ సింపుల్ గా చేస్తే చాలని చెబుతున్నారు. పెళ్ళి ఖర్చు పెద్దగా ఏమీలేదు. గుడిలో పెళ్ళి, వచ్చే బంధువులకు, ఊళ్ళోవాళ్ళకూ ఒకపూట భోజనం...వీటి ఖర్చులకు డబ్బులు సేకరించటంలో పెద్ద శ్రమ ఏమీలేదు. మీలాంటి మంచి మనుషులు కొంతమంది సహాయం చేస్తానన్నారు. సమయంలో, ఉన్న నగలు పోగొట్టుకుని వచ్చి నిలబడింది నష్టజాతకురాలు. నేనేం చేస్తాను డాక్టర్ గారూ. ఇప్పుడు బంగారు  గొలుసుకూ, బంగారు గాజులకూ నేనెక్కడి నుండి డబ్బు తేగలను. నా గుండె నొప్పి నన్ను ఒకేసారి తీసుకు వెళ్ళి పోకూడదా?” అంటూ ఏడ్చేరు క్రిష్ణశాస్త్రి పూజారి.

ఆయన్ని జాలిగా చూసిన డాక్టర్ త్వరలోనే మీ అమ్మాయి పోగొట్టుకున్న నగలు తిరిగి దొరుకుతాయి క్రిష్ణశాస్త్రిగారు. మీరు రోజూ పూజ చేస్తున్న కనకదుర్గ అమ్మవారు మిమ్మల్ని కష్టపెట్టదు 

పరిశోధించి, ఆయనకు మందులు రాసిచ్చి మిస్టర్  క్రిష్ణశాస్త్రి గారూ, మనసులో  భారాన్ని ఉంచుకుంటే హార్ట్నొప్పి పుడుతూనే ఉంటుంది...మీ భారాన్ని అమ్మవారి దగ్గర దించిపెట్టండి. అంతా మంచే జరుగుతుంది అని ఆయనకు ఓదార్పు మాటలు చెప్పాడు డాక్టర్ వివేక్.

తడిసిన కళ్ళతో నిలబడ్డ రోహిణి, డాక్టర్ను చూసి చేతులు జోడించి నమస్కరించింది.

పెళ్ళి ముఖ్యమా డాక్టర్ గారూ? మా నాన్న ప్రాణమే ముఖ్యం. అమ్మ చనిపోయిన తరువాత మా నాన్న తన ఆరొగ్యాన్ని సరిగ్గానే పట్టించుకోలేదు. మందు, మాత్రలూ సరిగ్గా వాడనే లేదు. మీరు ఆయనకు ఖండిషన్ గా చెప్పండి డాక్టర్!

డాక్టర్ ఒక్క క్షణం ఆలొచనతో ఆమెను చూసాడు.

మిస్టర్ క్రిష్ణశాస్త్రి గారూ మీరు కొంచం బయట వెయిట్ చేయండి. మీ కూతురు రోహిణితో కొంచం మాట్లాడాల్సి ఉంది...

పూజారి క్రిష్ణశాస్త్రిగారు భయంతో బయటకు వెళ్ళారు.

డాక్టర్ను చూస్తూ, భయపడుతూ ఏమిటి డాక్టర్ గారూ! నా దగ్గర ఏం చెప్పబోతారు?” అడిగింది రోహిణి.

నేను చెప్పబోయే విషయం మీ నాన్న తట్టుకోలేరనే ఆయన్ని బయటకు వెళ్ళి ఉండమన్నాను. మీ నాన్నకు హృదయ రక్త నాళాలలో ఒక బ్లాక్ఉంది. వెంటనే ఆంజియో చేయాలి. భయపడాల్సింది ఏమీలేదు. టవున్లో ఉన్న కమలా నర్సింగ్ హోమ్ లో చేద్దాం. నేనే సర్జన్ గా ఉంటాను కాబట్టి ఆంజియోని అక్కడకొచ్చి నేనే చేస్తాను.  

అయ్యో సార్! మా నాన్న ప్రాణానికి ఏమీ ఆపద లేదు కదా?” ఆందోళన పడుతూ అడిగింది రోహిణి.

ఆంజియో మాత్రం చేసేస్తే తరువాత ఎమీ భయం లేదమ్మా...కానీ దానికి ఒక యాభైవేల దాకా ఖర్చు అవుతుంది...

రోహిణి ఆశ్చర్యపోయింది. యాభైవేల రూపాయలా!?” ఆమె కళ్ళల్లో నుండి నీరు  కారింది.

పెళ్ళి ఖర్చులకే అక్కడా, ఇక్కడా డబ్బులు పోగు చేయాలని ఆయన చెబుతున్నారు. అదీ కాకుండా ఇప్పుడు నీ ఒంటిమీదున్న బంగారం కూడా దోపిడి చేయబడింది. ఇప్పుడు పోయి మీ ఆరొగ్యం పూర్తిగా బాగుపడాలంటే యాభైవేల రూపాయలు కావాలని చెబితే ఆయన గుండె ఇంకా బలహీనపడుతుందమ్మా...ఏం  చేద్దాం చెప్పు? మీ బంధువులు ఎవరైనా సహాయం చేస్తారా? ఏదైనా  దారుందా?”

రోహిణి డాక్టర్ను చూసి చేతులు జోడించింది.

డాక్టర్ గారూ, మా అమ్మ చనిపోయిన తరువాత మా నాన్న నన్ను అష్టకష్టాలు పడి పెంచారు. నేను ఆయన్ని కాపాడుకోవాలి. నేను ఎలాగైనా మీరు చెప్పిన మొత్తాన్ని ఏర్పాటు చేస్తాను. డబ్బు ఎన్ని రోజుల్లో కావాలో చెప్పండి డాక్టర్

ఒక వారం రోజుల్లో కావాలమ్మా. వచ్చే సోమవారం ఆంజియో చేసేద్దాం...ఎందుకైనా మంచిది, నువ్వు రెండు రోజుల్లో వచ్చి నాకు డబ్బు ఏర్పాటు అవుతోంది అనే వాగ్ధానం చేయాలి. చేస్తే నేను కమల నర్సింగ్ హోమ్ లో చెప్పి ఆపరేషన్ ధియేటర్ రిజర్వ్ చేసి ఉంచేస్తాను...రెండు రోజుల్లో నాకు నీ సమాధానం కావాలి

ఖచ్చితంగా చెబుతాను డాక్టర్. కానీ మా నాన్నకు ఆంజియోవిషయం గురించి మాత్రం చెప్పకండి. భయంతో ఆయన మరీ కృంగిపోతారు. నేను మా గ్రామానికి వెళ్ళి, అక్కడున్న దూరపు బంధువైన, వరుసకు అమ్మమ్మ ఒకావిడ దగ్గర విషయం చెప్పి డబ్బుకు ఏర్పాటు చేసేసి వచ్చి మీకు చెబుతాను...

మంచిది రోహిణి. ఎక్కువ డిలే చేయకు. రెండు రోజుల్లో నాకు విషయం చెప్పు. తరువాత నాలుగైదు రోజుల్లో డబ్బులు ఏర్పాటు చెయ్యి, చాలు! ఆంజియోతరువాత మీ నాన్న బ్రహ్మాండంగా అయిపోతారు!

మా నాన్నకు ఆపదా రాకూడదు డాక్టర్. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నాకున్నది ఆయన ఒకరే. ఆయన బాగుండలి. దానికి కనకదుర్గ అమ్మవారే తోడు ఉండాలి

రోహిణి భయంతో బయటకు వచ్చింది.

                                                                                  *************************

రెండు రోజుల తరువాత రోహిణి డాక్టర్ను వెతుక్కుంటూ వచ్చింది.

దూరపు సొంతమైన అమ్మమ్మ డబ్బులు ఇస్తానని చెప్పింది అనే సంతోషమైన వార్తను రోహిణి, డాక్టర్ దగ్గర చెప్పింది. తన తండ్రికి చికిత్సను  ప్రారంభించవచ్చని తెలిపింది.

డాక్టర్ వివేక్ ముఖం వికసించింది.

మధ్యలో మంగళగిరి పోలీస్ స్టేషన్ అధికారి అయిన తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడారు డాక్టర్. పొలీసు అధికారి రోహిణి దగ్గర దోపిడి చేసిన మంత్రీకుడ్ని గురించి తీవ్రమైన విచారణ చేస్తూ వస్తున్నట్టు, దాని గురించి చెప్పటానికి మరుసటి రోజు ఆయన పర్సనల్ గా వచ్చి డాక్టర్ను కలుసుకుంటానని చెప్పారు.

మరుసటి రోజు సాయంకాలం.

చీకటి కమ్ముకుంటున్న వేళ.

డాక్టర్ స్నేహితుడూ, మంగళగిరి పోలీసు అధికారి అయిన శివరామ్ తన జీపులో  వచ్చి దిగాడు. అతను చెప్పిన సమాచారం డాక్టర్ను కన్ ఫ్యూజ్ చేసింది.

ఇద్దరూ జీపులో, ఊరి సరిహద్దులో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వైపుకు వెళ్లారు.

ఆలయం వాకిట్లో నీళ్ళు జిమ్మి ముగ్గు వేస్తున్నది రోహిణి. లోపల క్రిష్ణశాస్త్రి పూజారి, పూల మొక్కల నుండి పువ్వులను సేకరించి ఒక బుట్టలో వేస్తున్నారు. క్రిష్ణశాస్త్రి పూజారి శిష్యుడైన ఒక పిల్లాడు, గర్భ గుడిలో అమ్మవారికి అలంకారం చేస్తూ ఉన్నాడు.

పోలీసు జీపు గుడి వాకిట్లోకి వచ్చి ఆగింది చూసి రోహిణి ఆశ్చర్యపోయింది. జీపు శబ్ధం విని క్రిష్ణశాస్త్రి పూజారి కూడా బయటకు వచ్చి డాక్టర్ను, పోలీసు  అధికారినీ చూసి ఆశ్చర్యపోయారు.

ఏమిటి డాక్టర్...ఏమిటి విషయం?” అని ఆందోళన పడుతూ అడిగారు.

ఏమీ లేదు పూజారి గారూ, మీతో కొంచం మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఈయనే మంగళగిరి పోలీసు అధికారి. నా స్నేహితుడు కూడా. మీ అమ్మాయి పొగుట్టుకున్న నగల విషయంగా ఒక సమాచారం దొరికినట్టు అధికారి చెప్పారు. దాన్ని ఆయనే మీ దగ్గర చెప్పాలని ఇష్టపడటంతో, ఆయనతో కలిసి నేనూ వచ్చాను

ఏమీ అర్ధంకాక క్రిష్ణశాస్త్రి ఇద్దర్నీ చూసారు.  ఆయన కూతురు రోహిణి ఒక పక్కగా నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటున్నది గమనిస్తోంది.

ఆలయానికి ఒక మూలగా, మండపంలో వాళ్ళు కూర్చున్నారు. పోలీసు అధికారి శివరామ్కు బదులు డాక్టర్ వివేకే మాట్లాడారు.

భయమూ వద్దు పూజారి గారూ. ఆరోజు మీ కూతురు రోహిణి దగ్గర మీ హృదయానికి వెళ్ళే ఒక రక్త నాళంలో బ్లాక్ఉన్నట్టు, దానికి ఆంజియోచేయాలి. దానికి యాభైవేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాను. గ్రామంలో ఉంటున్న మీ దూరపు బంధువు ద్వారా డబ్బును తీసుకోవచ్చు అంటూ మీ కూతురు నిన్న నాతో చెప్పింది.

నేను ఇంతకు ముందు మీ దగ్గర విచారించినప్పుడు మీ అమ్మాయి పెళ్ళికి బంధువుల దగ్గర డబ్బు దొరకదు, ఎందుకంటే డబ్బుగల బంధువులు ఎవరూలేరు, కాబట్టి ఊర్లో ఉన్న మంచివాళ్ళు కొందరి దగ్గర డబ్బు అడిగినట్టు చెప్పారు. కానీ, ఎవరో ఒక దూరపు బంధువు వరుసకు అమ్మమ్మ మీ ఆపరేషన్ కు యాభైవేలు ఇవ్వటానికి ఒప్పుకున్నట్టు మీ అమ్మాయి చెప్పింది అబద్దమని తెలిసింది.

విషయమేమిటంటే, అలాంటి ఒక అమ్మమ్మ లేనేలేదు. మీ కూతురి దగ్గర మాంత్రీకుడూ నగలను దొపిడీ చెయ్యలేదు అనేదే నిజం. పోలీసు అధికారి క్షుణ్ణంగా విచారించారు. మీ అమ్మాయితో పాటూ రోజు తిరనాలకు తోడుగా మంగళగిరికి వెళ్ళిన స్నేహితురాలు రాధాని విచారించారు. రోజు తిరనాల గుంపులో రాధా తప్పిపోలేదు. రాధాని వదిలి కావాలనే రోహిణి వేరుగా వెళ్ళి రాధాకు కనబడకుండా పోయిందని రాధా మాటల సంధర్భంలో చెప్పింది.

నిజమేమిటంటే, రోహిణికి తల్లి ప్రాణాలతో లేదు...తండ్రి మీరు మాత్రమే ఆమెకు ఆధారం, తోడు, అన్నీనూ. తానుకూడా పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే, తండ్రి గతి ఏమిటీ అనేదే మీ మీద అభిమానం ఎక్కువున్న మీ కూతురైన రోహిణి మనసును పొడుస్తున్న ప్రశ్న. తనకు పెళ్ళి చేసుకోవటం ఇష్టంలేదు. కాబట్టి రోహిణి తన నగలను తీసి తన బ్యాగులో దాచిపెట్టుకుని మాంత్రీకుడూ, విభూదీ, కుంకుమ, తీర్ధం అంటూ ఒక నాటకం ఆడింది. నగలు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది. నాన్నతోనే, నాన్నకు తోడుగా ఉండిపోదాం అనేది ఆమె ఆశ... 

ఇప్పుడు రోహిణి మనసు విరిగి '' అంటూ ఏడవ, భ్రమ పట్టినట్టు క్రిష్ణశాస్త్రి ఆమెను చూసారు. డాక్టర్ వివేక్ కంటిన్యూ చేసారు. 

మీ గుండె ప్రాబ్లంను మాత్ర, మందులతోనే గుణపరచ వచ్చు. నేను మీ అమ్మాయిమీద ఆరోజే అనుమానపడ్డాను. ఆమెను వేరుగా తీసుకు వెళ్ళి మీకు ఆంజియోచెయ్యాలని అబద్ధం చెప్పాను. దానికి యాభైవేల రూపాయలు అవసరమని చెప్పాను. తన దగ్గర నగలున్నాయనే ధైర్యంతో, ఆమె నేను డబ్బు పోగుచేయగలను'  అని ఖచ్చితంగా చెప్పింది. ఇది మీ కూతురు మీ మీద పెట్టుకున్న అతీత అభిమానం కారణంగా జరుపబడ్డ నాటకం అనేది నేనూ, పొలీసు అధికారి అర్ధం చేసుకున్నాం. విషయాన్నే మీతో తిన్నగా చెప్పి వెళ్దామని వచ్చాము...!

ఒసేయ్ మూర్ఖురాలా! నీకు పెళ్ళి చెయ్యాల్సింది తండ్రిగా నా భాద్యత కాదా? నేను వెళ్ళిపోయిన తరువాత నిన్ను ఎవరు చూసుకుంటారే?” ఆంటూ కోపంగా కూతుర్ను కొట్టబోయాడు.

క్రిష్ణశాస్త్రి గారూ. వదిలేయండి. మీ అమ్మాయి మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చి కేసు వాపస్ చేయమని కోరుతూ, ఒక లెటర్ రాసివ్వాలి. ఇంకోసారి ఇలాజరిగితే కఠిన చర్య తీసుకుంటాం, జాగ్రత్త! అని చెప్పి లేచారు.

నా కూతుర్ని మన్నించండి! అని ఏడుస్తూ చేతులెత్తి నమస్కరించారు క్రిష్ణశాస్త్రి పూజారి.   

****************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)