బంధుత్వాలు...(కథ)

 

                                                                      బంధుత్వాలు                                                                                                                                                                   (కథ)

వివాహం ద్వారా లేదా ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధమే బంధుత్వం.

ఊహ తెలిసిన దగ్గరనుండి డబ్బు చుట్టూ ఆలోచనలు చేయడం ప్రారంభమైంది. 8 లేక 10 ఏళ్ళ పిల్లని కానీ పిల్లాడిని కానీ పెద్దయ్యాక ఏం చేస్తావు? అని అడిగితే దాదాపుగా అందరూ చెప్పే సమాధానం “బాగా డబ్బు సంపాదిస్తాను.” అనే ఉంటోంది. ఇంకొక పెను మార్పు ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యష్థి కుటుంబాలు వచ్చాయి. అన్నదమ్ముల కుటుంబాలు,అమ్మ నాన్నలతో కలిసి ఉండడం పోయి ఎవరి కుటుంబాలు విరివిగా తయారయ్యాయి. ఆ బాధ కూడా దాటిపోయి నేడు భార్యా భర్తలు కూడా వ్యక్తిగత అభివృద్ధి కోసం దూరప్రాంతాలలో బ్రతకాల్సి వస్తోంది.బంధాల విలువ అంతగా దిగజారిపోయి డబ్బు, పేరు ప్రఖ్యాతులు ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి.

ఒంటరితనం చాలా నరకం. ఒంటరిగా ఉండబోతామనే భావనే నరకం. ఆ భావం వచ్చిన వెంటనే బంధం కోసం,బంధుత్వం కోసం వెతుకులాట ప్రారంభంవుతుంది. నిన్నటి దాకా తన ప్రవర్తన కూడా ఒంటరితనం గురించి ఆలోచించలేదు అనేది గుర్తుకు వస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి. అదే ఈ కథ.

**************************************************************************************************

ఏయ్... ప్రభావతీ! ఇటురావే...మన జగపతి అమెరికాలో కొనుక్కున్న కొత్త ఇంటిని ఫోటో తీసి పంపాడు... హాలులోని సోఫాలో కూర్చోనున్న వెంకట్రావ్ గర్వంగా స్వరం పెంచి చెప్పాడు.

ఆమె వంటగది నుండి వేగంగా బయటకు వచ్చింది!

మెల్లగా...మెల్లగా...రా! నువ్వేమన్నా చిన్నపిల్లవా? వయసు అరవై దాటేసింది...!అన్న ఆయన తన చేతిలో ఉన్న సెల్ ఫోనును భార్య దగ్గర ఇవ్వగా, ‘వాట్స్ అప్ద్వారా ఫోటోలను ఆశగా చూసింది!

నా కొడుకు సాధించాడే...! అమెరికాలో ఒక ఇల్లు కొనేసాడు...! అందరికీ అదృష్టం వస్తుందా...? అక్కడ సంపాదించి, మనకి హైదరాబాదులో ఇంతపెద్ద ఇల్లు, విలాశమైన కారు కొనిపెట్టాడు...రాజ జీవితం అనేది ఇదేనే... నేను నిజంగానే పెట్టి పుట్టాను !

వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే ఇంకొక ఫోనులో పిలుపు రావడంతో, “చెప్పు ప్రియా... ఫోను ఎత్తిన ప్రభావతీ మన అమ్మాయే నండీ... అన్నది!.

మాట్లాడి ముగించగానే, “ఏమండీ ఒక వారం రోజుల లీవులో ఇండియా వస్తోందట...అందువలన వాళ్ల ఇష్టదైవం గుడికి వెళ్ళి, అలాగే మామగారి ఇంట్లో ఉండి, అట్నుంచి దుబాయికి వెళ్ళిపోతుందట. వచ్చే సంవత్సరం సెలవులకు మన ఇంటికి వస్తుందట...! సోకంగా చెప్పింది.

దీనికెందుకు బాధపడతావు...? అల్లుడికి దుబాయి గవర్నమెంటులో ఉద్యోగం. ఆయనకు లీవు దొరకటం కష్టం...! వెంకట్రావ్ తన అల్లుడి గురించి గర్వంగా మాట్లాడారు.

దానికి కాదు...మనవుడ్ని చూడలేమే... ఆశాభంగంతో చెప్పింది.

ఇలా చూడు...మన పక్కింటి కుమారస్వామి గారి అల్లుడు ఈ ఊర్లోనే పనిచేస్తున్నాడు. ఒక కారు కూడా లేదు. టూ వీలర్ లో వచ్చి దిగుతున్నాడు. అదంతా ఒక జీవితమా...? మనవుడ్ని వచ్చే సంవత్సరం చూస్తే పోతుంది...! ఆమెను సమాధానపరుస్తూ మాట్లాడారు.

మీరు చెప్పేదీ కరెక్టే...! ఆమె తలూపింది.

మన అబ్బాయి సరే...కూతురూ సరే...డబ్బులో తేలి ఆడుతున్నారు. ఇంతకంటే మనకి ఇంకేం సంతోషం కావాలి...?”

మీరు చెప్పేది సరే నండీ. కానీ, నాకిప్పుడే అమెరికా ఇల్లు చూడాలని ఆశగా ఉంది...

ఖచ్చితంగా వెళ్ళి చూద్దాం...రెండు సంవత్సరాలకు ఒకసారి మనల్ని పిలుచుకు వెళ్ళి ఒక మూడు నెలలు ఉంచుకుంటున్నాడే...ఇదేలాగా విదేశాలకు వెళ్ళి వచ్చే యోగం అందరికీ దొరుకుతుందా...?”

అవునండి...మన అబ్బాయి మంచి కుర్రాడు...! ఆమె కూడా అంగీకరించింది.

సరి...సరి...నాకు బ్యాంకులో ఒక పనుంది...వెళ్ళొస్తాను! వెంకట్రావ్ బయలుదేరాడు.

                                                                           ********************

బ్యాంకు వాకిట్లో కారును ఆపినప్పుడు, లోపలి నుండి పంచె కట్టుకుని పెద్దాయన ఒకరు బయటకు రాగా, ‘నాతో పాటూ కాలేజీలో చదువుకున్న సాంబశివం లాగా ఉన్నారే?’ అని అనుమానంతో చూసారు.

దగ్గరకు వెళ్ళి, “మీ...మీరు సాంబశివం కదా...?”

బిడియంగా అడిగాడు.

ఒక్క క్షణమే...ఆశ్చర్యంతో చూసిన ఆయన, “నువ్వు వెంకట్రావ్...?” అని అడగ.

వాళ్ళిద్దరూ రారా...పోరా...!అంటూ ఆనందంతో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

నలభై ఏళ్ళ తరువాత కలుసుకుంటున్నాము కదా... వెంకట్రావ్ అడగ, “అవునురా... అన్న సాంబశివం, “నేను రైల్వేలో సర్వీస్ చేసి  ముగించాను...నువ్వు?” అన్నాడు.

నేను పోస్టల్ డిపార్ట్ మెంటులో పని చేసి రిటైర్ అయ్యాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరూ విదేశాలలో సెటిల్ అయ్యారు... గొప్పగా చెప్పుకున్నాడు.

బ్రహ్మాండం! నాకు ఇద్దరు అబ్బాయలు. ఇద్దరూ హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇంటికి రారా...చాలా మాట్లాడుకుందాం...

ఖచ్చితంగా...! చెప్పిన వెంకట్రావ్, ఆయన దగ్గర నుండి సెల్ ఫోను నెంబర్, అడ్రస్సు తీసుకుని, “సరే...ఎలా వచ్చావు...?” అని అడిగారు.

నడిచే వచ్చాను...! నవ్వుతూ చెప్పారు సాంబశివం.

నేను కారులో వచ్చాను...కొంచం వెయిట్ చేస్తావా...? నేను నిన్ను డ్రాప్ చేస్తాను

పరవాలేదురా...నేను వెళ్తాను. నువ్వు మాత్రం ఖచ్చితంగా ఇంటికి రా...! సాంబశివం వెళ్ళిపోయారు.

                                                                                    ********************

ఇంట్లోకి వెళ్ళిన వెంకట్రావ్, స్నేహితుడు సాంబశివంను కలుసుకున్నది భార్యతో చెప్పాడు.  

మీరు ఆయన్ని గుర్తుపట్టగలిగారా...?” ఆశ్చర్యంగా అడిగింది.

ఊ...నేనే మొదట గుర్తు పట్టాను...! కానీ అతని పరిస్థితి చూస్తే పాపంగా ఉంది!  బాధతో చెప్పాడు.

ఏమండీ...?”

ఒక పంచ కట్టుకుని, ఇస్త్రీ చేయని చొక్కా ఒకటి వేసుకుని... చూడటానికే జాలిగా ఉన్నాడు...! ఇద్దరు అబ్బాయలట. ఇద్దరూ హైదరాబాద్ లో ఏదో ఒక కంపెనీలో పని చేస్తున్నారట. హు...ఏం చేయగలం? అందరికీ సుఖమైన...ప్రశాంతమైన జీవితం దొరకటం లేదు...! గర్వంగా చెప్పారు.

కరెక్టుగా చెప్పారు... అమోదించింది భార్య.

వచ్చే వారం వాళ్ళింటికి వస్తానని చెప్పను...వెళ్ళి కొంచం సేపు పాతవన్నీ మాట్లాడుకుని వస్తే టైము పాస్ అవుతుంది...! నవ్వుతూ చెప్పాడు.

వెళ్ళి రండి

                                                                                 ********************

ఆదివారం...!

కారులో నుండి దిగిన వెంకట్రావ్, సాంబశివం ఇంటిని కిందా పైకీ చూస్తూ పరిశీలించాడు.

చిన్న ఇల్లు!

సున్నం కొట్టి పలు సంవత్సరాలు అయ్యింది లాగుంది!అని మనసులో అనుకుంటూ కాంపౌండ్ గేటు తెరిచాడు.

గేటు తెరిచే శబ్ధం విని, ఎనిమిదేళ్ళ పిల్ల వాకిటికి పరిగెత్తుకు వచ్చింది!

మనవరాలుగా ఉంటుందో...?’ అని అనుకున్న ఆయన, “తాతగారు ఉన్నారా...?” అని అడుగ తా...తా...నిన్ను వెతుక్కుని ఎవరో వచ్చారు...! అని ఆ పిల్ల లోపలకు వెళ్ళీ చెప్ప, “రేయ్...రవీ! నా కాలేజీ ఫ్రెండు వెంకట్రావ్ వచ్చినట్టున్నాడు, వెళ్ళి లోపలకు తీసుకురాఅని కొడుకు దగ్గర చెప్ప, రవీ వాకిటికి వెళ్ళి ఆయన్ని స్వాగతించి లోపలకు పిలుచుకు వచ్చాడు!

కూర్చోటానికి ప్లాస్టిక్ కుర్చీ ఒకటి తీసుకు వచ్చి వేసాడు.

వంట గదిలో నుండి సాంబశివం భార్య బయటకు వచ్చి నవ్వుతూ స్వాగతించింది!

వెంకట్రావ్...! నువ్వు మారలేదురా...అలాగే ఉన్నావు... సాంబశివం చెప్ప, వెంకట్రావ్ కి సంతోషంగా ఉన్నది.

మరోగది నుండి పెద్ద కోడలు కూడా బయటకు వచ్చి, నమస్కరించి  ఆహ్వానించింది!

వెంకట్రావ్...!

చెప్పరా...

ఈమె నా పెద్దకోడలు...! వీళ్ళకు ఒక అమ్మాయి....అదే, నాకొక మనవరాలు...! ఇంకొక కొడుకు అంబత్తూర్ లో పని చేస్తున్నాడు...లోను వేసుకుని అక్కడే ఒక అపార్ట్ మెంట్ కొనుకున్నాడు. ఆ కోడలు ఉద్యోగానికి వెళుతోంది. వాడికి ఒక అబ్బాయి. ఐదేళ్ళ వయసు...!

ఓ...! అన్న వెంకట్రావ్, తాను తీసుకు వచ్చిన విదేశీ చాక్లెట్లను మనవరాలుని పిలిచి ఇచ్చాడు.

అవును...నీపేరేమిటి?”

ఆర్తి!”

ఓ...సూపర్... జవాబు చెప్పిన ఆ పిల్ల బుగ్గలను ప్రేమతో బుజ్జగించాడు.

ఊ...చాక్లెట్ తిను...!

ఊహూ...కాసేపట్లో తమ్ముడు వస్తాడు...తరువాత మేమందరం కలిసి తింటాం...

ఆ పిల్ల మాటలు విని వెంకట్రావ్  ఆశ్చర్యపోయాడు.

అంకుల్! కాఫీనా...టీనా? ఏం తాగుతారు?” కోడలు అడిగింది.

టీ అమ్మా...

పదో నిమిషం టీ కప్పుతో వచ్చింది ఆమె!

ఊ...చెప్పరా...నీ పిల్లల గురించి! సాంబశివం అడిగారు.

ఒకబ్బాయి అమెరికాలో సెటిలయ్యాడు...అక్కడే పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. అమ్మాయి దుబాయిలో ఉంది. అల్లుడికి ఆ గవర్న మెంట్లో పెద్ద పోస్టు. నా జీవితంలో ఏ సమస్యా లేదురా. సంతోషంగా జీవిస్తున్నాను! గర్వంగా చెప్పాడు.

వెరీగుడ్...వెరీగుడ్...చాలా సంతోషం రా

వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, కొడుకు రవి, ఒక చిన్న టీపా తీసుకు వచ్చి వెంకట్రావ్ దగ్గర వేసి, “అంకుల్! చాలా సేపు కాలు కిందకు వేలాడితే  కాలునొప్పి పుడుతుంది...! దీనిపై పెట్టుకోండి...సౌకర్యంగా ఉంటుంది! అన్నాడు.

ఆ అభిమానంలో వెంకట్రావ్ కరిగిపోయాడు.

సాంబశివం మాటలు కంటిన్యూ చేసాడు.

నాకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బును ఇద్దరి పిల్లలకూ చెరి సగం ఇచ్చేసాను. నాకూ అంటూ ఏం అవసరం చెప్పు? కొడుకు, కోడళ్ళూ, మనవరాలూ, మనవడు నాతోటి ఉన్నారు...అదే నాకు ఆస్తి. నేను ఇంకేమీ పెద్దగా చేర్చిపెట్టలేదు. ఈ ఇల్లు కూడా ఆఫీసు లోను పెట్టి కట్టింది! సమయం దొరికినప్పుడు నన్ను గుళ్ళూ గోపురాలూ  అని తీసుకు వెడతారు...అదే నా జీవితం...!

అది విన్న వెంకట్రావ్ దేన్నో పోగొట్టుకున్నట్టు విరక్తిగా నవ్వారు.

పోయిన సంవత్సరం గుండెనొప్పి వచ్చి కష్టపడ్డాను. హృదయంలో నాలుగు బ్లాకులు ఉన్నాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆపరేషన్ చేయించుకున్నా...! పిల్లలే లీవు పెట్టి మార్చి మార్చి చూసుకున్నారు. వీళ్ళంతా లేకపోతే నేను లేను. మనవడూ, మనవరాలూ తాతయ్యా అంటూ అభిమానంగా ఉన్నారు. కాలునొప్పిగా ఉంది అని చెబితే చాలు. చక్కగా నొక్కి పెడతారు. ఆపరేషన్ తరువాత ఎక్కువగా బయటకు వెళ్లటం లేదు...కానీ, చిన్న తిరుపతి మాత్రం వదలలేకపోయాను...శ్రమపడి వెళ్ళి వస్తున్నా!

సాంబశివం దగ్గర నుండి వస్తున్న ఒక్కొక్క మాటనూ వెంకట్రావ్ ఆలోచనతో వింటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే సాంబశివం రెండో కొడుకు, అతని భార్య బిడ్డతో లోపలకురాగా, సాంబశివం వాళ్ళను వెంకట్రావ్ కి పరిచయం చేసాడు.

తాతయ్యా...! మనవుడు పరిగెత్తుకు వచ్చి తాతయ్యను కావలించుకున్నాడు.

ప్రతి ఆదివారమూ, తరువాత పండుగలూ అవీ వచ్చినప్పుడు చిన్నాడు కుటుంబంతో ఇక్కడకు వచ్చేస్తాడు...అందరం కలిసి భోజనం చేస్తాం. ఈ రోజు నువ్వు వచ్చావు. నీకు నచ్చిన వెజిటబుల్ బిరియాని చెయ్యమని చెప్పాను...!

అదివిన్న వెంకట్రావ్ ఆశ్చర్యంతో తన స్నేహుతున్ని చూసారు.

నాకు నచ్చిందా...? నీకెలా తెలుసు?” -- మరింత ఆశ్చర్యంతో అడిగారు.

కాలేజీ క్యాంటీన్లో నువ్వు ఎప్పుడూ అదేకదా కొనుక్కుతింటావు...?” నవ్వుతూ చెప్పగా,

ఓ...ఓ...! నువ్వు పాతవి మర్చిపోలేదు... వెంకట్రావ్ నవ్వాడు.

అంకుల్! వంట రెడీ. భోజనం చేద్దమా...?” పెద్దకోడలు అడగ, “ఓ...చేతులు కడుక్కుని వచ్చేస్తా... వెంకట్రావ్ లేచాడు.

                                                                               ********************

అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చోగా...ఇద్దరు కోడళ్ళూ బిరియానీ, గులాబ్ జామూన్, చిప్స్, పూరీ మసాలా, పెరుగు అన్నం అని వడ్డించటంతో వెంకట్రావ్ కి మనసూ నిండింది!

వెంకట్రావ్...

ఊ...చెప్పు సాంబశివం...!

వయసైందా...కొన్ని సమయాల్లో ఈ భూమిమీద ఉండటమే భారమని అనిపిస్తోంది...

ఆయన అలా చెప్పగానే రవి హడావిడిగా అడ్డుపడ్డాడు.

ఏమిటి నాన్నా...ఏం మాటలు ఇవి? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనే ధైర్యంతో మేమంతా బొంగరంలా పనిచేస్తున్నాం...!

మీరు ఈ ఇంటికి భారం కాదు నాన్నా...ఈ ఇంటి వేరు...

రవీ...నువ్వు...కరెక్టుగా చెప్పావు...!  వెంకట్రావ్ అభినందన తెలిపారు.

రేయ్... సాంబశివం! ఒకరోజు విందుకు మా ఇంటికి రా... అభిమానంతో పిలిచారు.

ఖచ్చితంగా వస్తాను. కానీ, నువ్వు నీ భార్యను పిలుచుకు రాలేదు...కానీ, నేను వస్తే, మొత్తం ఎనిమిది టికెట్లతో వస్తాను. పరవాలేదా...?” నవ్వుతూ అడిగారు.

రారా...రా...మీరందరూ కలిసి రావాలి. అందులోనే సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని నేనిప్పుడు మనస్పూర్తిగా అనుభవిస్తున్నాను

చెప్పిన వెంటనే వెంకట్రావ్ కళ్ళల్లో నీరు చేరింది! ఎవరికీ కనబడకుండా  తుడుచుకున్నారు.

భోజనం చేసి ముగించిన వెంటనే సెలవు తీసుకున్నారు.

దారిలో సెల్ ఫోను మోగింది!

తీసి మాట్లాడాడు!

నాన్నా...!

ఊ...చెప్పరా...!

నాకు ఇప్పుడు వేరే కంపెనీలో ఉద్యోగం దొరికింది. అందువల్ల ఈ సంవత్సరం మీరు అమెరికా వస్తే సరిరాదు. కొత్త కంపెనీ వేరే! అందుకని ఇంకో రెండు  సంవత్సరాలు ఓర్పుగా ఉండండి...నేను మిమ్మల్ని పిలుచుకు వెడతాను...!

సరేరా...మనవుడ్ని చూడాలని ఉంది! చెప్పిన ఆయన గొంతుక అడ్డుపడింది.

అందుకేగా వాట్స్ అప్, స్కైపు ఉన్నదే. అందులో చూస్తే సరిపోతుంది...!

సరేరా...! బరువైన హృదయంతో ఫోను పెట్టేసారు.

తన స్నేహితుడు సాంబశివం జ్ఞాపకం వచ్చింది.

రేయ్...నిజానికి నువ్వేరా పెట్టి పుట్టావు! కొడుకులూ, కోడళ్ళు, మనవడూ, మనవరాలు అంటూ సంతోషంగా ఒకే కుటుంబంగా జీవిస్తున్నావు...!

ఆ సంతోషాన్ని ఎంత డబ్బు ఇచ్చినా కొనుక్కోలేము.

నాకు ఆ బాగ్యం లేదు. డబ్బు మాత్రమే జీవితం కాదు కన్నీరు పొంగింది.

కారులో నుండి దిగారు.

తన కొడుకు కట్టించి ఇచ్చిన బ్రహ్మాండమైన ఇంటిని ఒకసారి చూసారు! ఆయన కాళ్ళు తడబడ్డాయి.

వృద్దాశ్రమంలోకి వెళుతున్నట్టు అనిపించింది.

************************************************సమాప్తం*********************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్పష్టత...(కథ)

ఏల్నాటి శని...(కథ)

సంస్కారం...(కథ)