నాటకం...(మినీ కథ)
నాటకం (మినీ కథ)
జీవితమే ఒక నాటకం అని తెలిసినా, ఎవరూ ఈ నాటకాన్ని పెద్దగా గుర్తుంచుకోరు మరియు పట్టించుకోరు. వారు చేయాల్సింది చేసే తీరుతారు. విజయమో, నష్టమో దాన్ని అనుభవిస్తారు. అలాంటిది జీవిత నాటకంలోనే, నాటకమాడాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అదికూడా జీవితనాటకంలో ఒక భాగమా?
****************************************************************************************************
సాధనాకూ, శ్రీనివాస్
కూ పెళ్ళి
నిశ్చయం చేయబడ్డది.
కూతురు పెళ్ళి
ఆడంబరంగా జరపాలని
సాధనా తండ్రి
నాగభూషణం ఆశపడ్డారు.
దానికోసం అతిపెద్ద
కల్యాణ మండపం
బుక్ చేసారు.
పెళ్ళి పత్రిక
కూడా ఆడంబరంగా
ప్రింటు చేయించి
బంధువులకూ, స్నేహితులకూ
ఇచ్చారు.
పెళ్ళి రోజు
వచ్చింది. పెళ్ళి
కొడుకు తరఫు
బంధువులందరూ కల్యాణ
మండపంలో ఒకటిగా
కలుసుకున్నారు.
అలంకారం చేయబడ్డ
పెళ్ళి కూతురు
సాధనా పెళ్ళి
పీటల మీద
దేవతలా దర్శనమిచ్చింది.
“ముహూర్త
సమయం దగ్గర
పడుతోంది...పెళ్ళి
కొడుకు రావటానికి
ఎందుకింత ఆలశ్యం
అవుతోంది, అతనే
కదా ముందు
రావాలి. కానీ
పెళ్ళి కూతురు
కూడా వచ్చేసినా
పెళ్ళి కొడుకు
ఇంకా రాలేదేమిటి.
త్వరగా రమ్మని
చెప్పండి..” పురోహితుడు
హడావిడి పెట్టాడు.
‘పెళ్ళి
కొడుకు కనబడటం
లేదు. పెళ్ళి
కొడుకు కుటుంబం
కోసం ఇచ్చిన
విడిది గదిలో
కూడా అతను
కనిపించటం లేదు’
ఎవరో పరిగెత్తుకు
వచ్చి కల్యాణ
మండపం మధ్యలో
నిలబడి అరిచారు.
కల్యాణ మండపమే
హడావిడిలో పడింది.
‘ఈ
పెళ్ళి ఇష్టంలేక
పెళ్ళి కొడుకు
పారిపోయాడు’
అనే వార్త
మండపం మొత్తం
అగ్నిలా పాకింది.
బంధువులు అక్కడక్కడ
గుంపుగా చేరి
మాట్లాడుకుంటున్నారు.
సాధనాతో కలిసి
ఆలోచించారు. విజిటర్స్
కుర్చీల వరుసలో
కూర్చోనున్న ప్రభాకర్
వాళ్ళ కన్నవారితోనూ
మాట్లాడారు. చివరగా
పెళ్ళి పీటల
మీద కూర్చుని
ప్రభాకర్, సాధనా
మెడలో తాలి
కట్టాడు.
సాధనా తల్లి-తండ్రులు
ఆనందపడ్డారు. కూతురు
పెళ్ళి అనుకున్నట్లు
అనుకున్న రోజు, అనుకున్న
ముహూర్తానికే జరిగిందని.
విందు భోజనం
అప్పుడు శ్రీనివాస్
కు ఫోన్
చేసింది సాధనా.
“నేను
ప్రేమించిన ప్రభాకర్
నే పెళ్ళి
చేసుకోవటానికి
నడిపిన నాటకంలో
‘పారిపోయిన
వరుడు’ అనే
చెడ్డపేరు తెచుకున్న
మీకు చాలా
థ్యాంక్స్ అండి!”
ప్రభాకర్ తో
తనకు పెళ్ళి
జరగకపోతే ఆత్మహత్య
చేసుకుంటానని శ్రీనివాస్
పెళ్ళి చూపులకు
వచ్చిన రోజునే
సాధనా, శ్రీనివాస్
దగ్గర చెప్పింది.
శ్రీనివాస్ ఆత్మహత్యను
ఆపటానికి ముగ్గురూ
కలిసి చేసిన
రాజతంత్రాన్ని
తెలుసుకోలేక, మండపంలో
ఉన్న అందరూ
పెళ్ళి కూతుర్నిఆశీర్వదించారు.
‘నాన్నా...నా
మనసుకు నచ్చిన
వాడే నీకిప్పుడు
అల్లుడు’ మనసులోనే
అనుకుని తండ్రి
కాళ్ళకు నమస్కరించింది
సాధనా.
***************************************************సమాప్తం***************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి