మేస్టారి మాట...(కథ)

 

                                                                             మేస్టారి మాట                                                                                                                                                                    (కథ)

‘చదువుకోకపోతే జీవితంలో ఎదగటం కష్టం

చదువుకున్న వారు కష్టపడి పనిచేస్తే ఇట్టే పైకెదిగిపోతారు. అలాంటివారిని అద్రుష్టం వెతుకుతూనే ఉంటుంది. అదే చదువుకు ఉన్న గొప్పతనం...అందుకే ఆడా, మొగా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాలి అని చెబుతారు. …. చదువు ప్రతి ఒక్కరినీ మేధావుల్ని చేస్తుంది.

పైన చెప్పిన మాటలు అక్షరాలా నిజం...ఈ విషయం ఈ కథ చదితే చాలా వరకు అర్ధమవుతుంది.

*****************************************************************************************************

హాలులో కూర్చుని  ఒక కాగితం ముక్కలో రాసుకున్న లెక్కల్ను చూసుకుంటున్నాడు శేషు.

ఇంటిముందు కార్లు ఆగిన శబ్ధం వినబడింది.

ఆ శబ్ధానికి లెక్కలు చూసుకుంటున్న శేషు లెక్కలు చూడటం ఆపి ఇంత ప్రొద్దున్నే ఎవరొచ్చారా అని గేటు వైపు చూశాడు.

గేటు తెరుచుకుని ఐదారుగురు వ్యక్తులు లోపలకు వస్తున్నారు. అందరూ టై కట్టుకుని, షూస్ వేసుకుని ఉన్నారు. మనసులో ఏదో అనిపించటంతో  చేతిలోని కాగితం ముక్కను ఉండాగా చుట్టి అవతలకు విసిరేశాడు శేషు.

ఇంట్లోకి ఆడుగుపెట్టిన ఆరుగురిలో ఒకరు "మిస్టర్. శేషావతారం...వుయ్ ఆర్ ఫ్రం ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్...మీ ఇళ్ళు సోధా చేయటానికి వచ్చాము. మీరు మాకు సహకరిస్తే ఎటువంటి ఫోర్స్ ఉపయోగించకుండా మా పని మేము చేసుకుపోతాము"

"అలాగే సార్...నా పూర్తి సహకారం మీకుంటుంది...ఆయినా ఇన్ కం టాక్స్ రైడ్ జరపవలసినంత గొప్ప బిజినస్ మాన్  కాదు నేను. మీరేదో తప్పుడు అడ్రస్సుకు వచ్చారు"

మాకు గొప్ప బిజినస్ మాన్-చిన్న బిజినస్ మాన్ అనే డివిజన్ ఉండదు. ఐదువేల రూపాయలు ఇల్లీగల్ అకౌంట్స్ రాసినవారూ, కోటి రూపాయలు ఇల్లీగల్ అకౌంట్స్ రాసినవారు ఇద్దరూ మా పరిధిలో ధోషులే. ప్రభుత్వాన్ని మొసగించిన దోషులే.... ఈ మాటలన్నీ తరువాత ఇప్పుడు మీరు మీ అకౌంట్ పుస్తకాలూ, సెల్ ఫోన్లు మాకు అప్పగించండి"

" అలాగేఅని ఆఫీసర్ కు చెప్పిగురువయ్యా... ఆఫీసు రూములో ఉన్న పుస్తకాలన్నీ ఇక్కడకు పట్టుకురా" పనివాడితో చెప్పాడు శేషు.

"ఆగవయ్యా"  పనివాడిని ఆపుతూ మీకు ఆఫీసు రూము కూడా ఉన్నదా? అయితే మేము అక్కడి నుండే మా పని ప్రారంభిస్తాము" అన్నాడు ఆ ఆఫీసర్.

"నేను ఇందాకే చెప్పాను కదండి. నాదేమీ పెద్ద వ్యాపార సంస్థ కాదని. ఆఫీసు రూము అని ప్రత్యాకంగా ఏదీ లేదండి. నా ఇంట్లోని లివింగ్ రూమునే ఆఫీసు రూముగా వాడుకుంటున్నా. క్లైంట్స్, కస్టమర్స్, సప్ప్లయర్స్ వచ్చినప్పుడు ఆ గదిలో కూర్చుని మాట్లాడుకుంటాము" చెప్పాడు శేషు.

"మళ్ళీ అక్కడ్నుంచి పుస్తాకాలను ఇక్కడికి తేవటం దేనికి...అక్కడకే వెడదాంఅని శేషుతో చెప్పి బై-ద-బై మిస్టర్. గౌరిసంకర్, లాండ్ లైన్ కట్ చేసారా, సెర్చ్ కోసం అన్ని రూమలకూ మన వాళ్ళను పంపారా?" తనతో వచ్చిన అధికారిని అడిగాడు.

"ఆల్ రెడీ పంపాను సార్"

"సరే..మీరు నాతో రండి" అంటూ లివింగ్ రూముకు వెళ్ళారు అందరూ.

ఈ లోపు పనివాడు గురువయ్య టేబుల్ మీద నాలుగు అకౌంట్ పుస్తకాలు పెట్టి వెళ్ళిపోయాడు. అవి చూసి "ఇదేమిటి నాలుగు పుస్తకాలే ఇచ్చాడు...ఇంకేమీ లేవా?"

"ఇందాకే చెప్పాను కదాసార్ నాదేమీ పెద్ద బిజినస్ కాదని...నా బిజినెస్సుకు నాలుగు పుస్తకాలే ఎక్కువ" అన్నాడు శేషు.

"మమ్మల్ని చూస్తే వేళాకోలంగా ఉందా?" శేషు వంక కోపంగా చూస్తూ అడిగాడు ఆఫీసర్.

"అయ్యో...ఎందుకండి అంత పెద్ద మాట...నా అకౌంట్స్ మొత్తం అందులోనే ఉన్నాయి"

"సరే...ఇక మేము చూసుకుంటాము గానీ...గత ఐదు సంవత్సరాల మీ ఇన్ కంటాక్స్ రిటర్న్ ఫైల్స్, అకౌంట్ పుస్తకాలూ, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వండి" అని చెప్పి అకౌంట్స్ పుస్తకం తిరగేసాడు ఆఫీసర్.

శేషు పది ఫైల్లను, పది అకౌంట్ పుస్తకాలను తీసి టేబుల్ మీద పెట్టాడు.

"ఇక మీరు వెళ్ళి హాలులో కూర్చొండి. మాకు డౌట్ వచినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను" అని చెప్పాడు ఆఫీసర్. 

శేషు మెల్లగా నడుచుకుంటూ హాలులోకి వచ్చాడు. అక్కడొక ఆఫీసర్ శేషు సెల్ ఫోన్ లో ఉన్న డీటైల్స్ చూస్తున్నాడు. శేషు రావడం చూసిన ఆ ఆఫీసర్ "ఇంట్లో ఇంకెవరూ లేరా?" అని అడిగాడు.

"నా భార్యా, పిల్లడూ వాళ్ల ఊరు వెళ్ళారు ...ప్రస్థుతం నేను, గురువయ్యా మాత్రమే ఉంటున్నాము" చెప్పాడు శేషు.

"సరే...మీ బీరువా కీస్ ఎక్కడున్నాయి?"

"బీరువా డోర్ కే ఉన్నాయి"

"ఓ.కే" అని చెప్పి బెడ్ రూములోకి వెళ్ళాడు ఆ ఆఫీసర్.

ఎనిమిది గంటల తరువాత లివింగ్ రూములో నుండి బయటకు వచ్చాడు ఆఫీసర్. అప్పటికే హాలులో మిగిలిన ఆఫీసర్స్ గుమికూడి ఉన్నారు. వాళ్ళను చూసి "ఎనీ చార్జస్" అని అడిగాడు. అందరూ "నో సార్" అని జవాబు ఇచ్చారు.

"మిస్టర్. శేషావతారం.. మీ అకౌంట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. మాకెవరో రాంగ్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు. వుయ్ ఆర్ వెరీ సారి ఫర్ ద ఇన్ కన్ వీనియన్స్….కానీ మీ క్రెడిట్స్ లో ఒక అమౌంట్ తేడా వస్తోంది. కాన్ యు ఎక్స్ ప్లైన్"

"ఆడగండి సార్"

"సుదర్సన్ అనే అతని దగ్గర నుండి మూడు లక్షల రూపాయలు చెక్ పేమెంట్ వచ్చింది. ఆ అమౌంట్ కి ఎక్స్ పెన్సస్ టాలీ అవలేదు"

"ఆ అమౌంట్ని నేను ఒకరికి డొనేషన్ గా ఇచ్చాను"

"చాలా గొప్ప పని చేశారు. అదెందుకు అకౌంట్స్ లోకి రాలేదు? మీ ఇన్ కంటాక్స్ రిటర్న్ లో కూడా చూపించలేదు"

"అది...నేనేవరికి డొనేషన్ ఇచ్చానో తెలియకూడదని"

"మీ జవాబు చాలా విచిత్రంగా ఉందే....డొనేషన్ ఇచ్చిన వారి దగ్గర నుండి ఒక రసీదు తీసుకుని ఇన్ కం టాక్స్ ఎక్షెంప్షన్  క్లైం చేసుకోవాలని మీకు తెలియదా?"

"అలా చేస్తే నేను డొనేషన్ ఇచ్చిన వాళ్ళ ఐడెంటిటీ తెలిసిపోతుందని అలా చేయలేదు".

నో...మీ జవాబు కన్విన్సింగ్ గా లేదు...మీ మీద లేనిపోని అనుమానాలను కలిగిస్తోంది...మీ అకౌంట్స్ చాలా క్లియర్ గా ఉంది. అనవసరంగా మీకు మీరే కష్టాలు తెచ్చుకోకండి....ఆ డొనేషన్ బెనిఫిసరీ ఎవరు?"

"సారీ సర్...అది మాత్రం నేను చెప్పను...కావాలంటే మీకు జరిమానా కడతాను"

"చూడండి మిస్టర్ శేషావతారం, జరిమానా గురించి మీరు మాకు చెప్పక్కర్లేదు...మీరు చెప్పవలసింది మాత్రం చెప్పండి. ఆ డబ్బును మీరు ఖచ్చితంగ అకౌంట్స్ లో చూపించాల్సిందే...అయినా మీరు ఎవరికి డొనేషన్ ఇచ్చింది మీ అకౌంట్స్ లో రాస్తే బయటవాల్లకు ఎలా తెలుస్తుంది" "

"సారీ సార్ నేను చెప్పలేను"

అరె...ఒక మంచి పనిచేసి, అది ఎవరికి చేశారో చెప్పడానికి ఎందుకు సంసయిస్తున్నారు...మీరు గనుక చెప్పకపోతే, మీరు ఎవరికి ఇచ్చారో తెలుసుకోవటానికి నేను పోలీసుల సహాయం తీసుకోవలసి వస్తుంది"

".................." శేషు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.

కోపం తెచ్చుకున్న ఆఫీసర్ "ఓ.కె మిస్టర్ శేషావతారం...మీకు రేపు ప్రొద్దుటి దాకా టైం ఇస్తున్నాను. రేపు పదింటికల్లా మా ఆఫీసుకు వచ్చి, డొనెషన్ కు సంబంధించిన వివరాలు ఇచ్చి వెళ్ళాలి....లేకపోతే మీ మీద చార్జ్ వేయవలసి వస్తుంది" అని చెప్పేసి "ఈ కాయితం మీద సంతకం పెట్టండి" సీజ్ చేసిన అకౌంట్ పుస్తకాల లిస్టును శేషు అందించి బయటకు నడిచాడు ఆఫీసర్.

                                                               ******************

ఇన్ కం టాక్స్ ఆఫీసులో కరెక్టుగా పది గంటలకు ఆఫీసర్ను కలిసాను.

"ఏస్...మీరెవరు? నాతో మీకేంపని?" అడిగాడు ఆఫీసర్.

"నేను శేషావతారం స్నేహితుడ్ని"

"ఆయనెక్కడ?"

"ఆయన గురించి చెప్పటానికే వచ్చాను"

"ఆయన గురించి మాకు ఏమీ తెలియక్కర్లేదు...ఆయనే రావాలి"

" "శేషు ఆ డబ్బు ఎవరికిచ్చింది నాకు తెలుసు"...అది చెప్పడానికే వచ్చాను"

"మళ్ళీ ఇదొక నాటకమా?"

"కోపగించుకోకండి సార్...అసలు విషయం మీకు చెప్పటానికే నేను ఇక్కడకు వచ్చాను. దయచేసి వినండి సార్. విన్న తరువాత మీరు ఎలా చెయ్యమంటే అలాచేస్తాను.

ఆఫీసర్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు.

"ప్లీజ్ సార్".....బ్రతిమిలాడాను.

నన్ను ఒకసారి కిందామీదకు చూసి సరే చెప్పండి. ఆ డబ్బు ఆయన ఎవరికిచ్చేడు?"

                                                                         ******************

 నేను స్కూలు చదువుకునేటప్పుడు నాకు పాఠాలు చెప్పిన మాస్టారు, తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బులేక చాలా కష్టపడుతున్నారని తెలిసింది.

ఆయన దగ్గర చదువుకుని,గవర్నమేంట్ ఉద్యోగం సంపాదించి, ఇప్పుడు రైల్వేలో క్లర్క్ గా పనిచేస్తున్న నేను ఆయనకు సహాయ పడలేకపోతున్నానే అన్న బాధ నన్ను వేదించింది. చేతిలో ఉన్నది యాభై వేల రూపాయలు. నెల జీతగాడిని అంతకంటే ఎక్కువ సద్దలేను. కానీ ఆ డబ్బు మాస్టారికి సరిపోదు. ఏం చేయాలో ఆలొచిస్తున్న నాకు గేటు తెరుచుకుని శేషు రావటం కనిపించింది.

"రా..రా.. శేషు.....ఎన్ని సంవత్సరాలయ్యిందిరా నిన్ను చూసి. నువ్వు బిల్డింగ్ కాంట్రాక్టర్ గా, సొంతంగా పనులు చేస్తున్నావని విన్నాను.  చాలా సంతోషంగా ఉందిరా. నీ పనులు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలా ఉన్నావు?" అడిగాను.

"బాగున్నానురా...ఒక ముఖ్యం విషయం గురించి నీ దగ్గరకు వచ్చాను"

"చెప్పరా?"

"మన రామారావ్ మాస్టారు తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బులేక కష్టపడుతున్నారని విన్నాను. ఇందా, ఇందులో మూడు లక్షలు ఉన్నాయి. మాస్టారుకి డబ్బును నీ డబ్బుగా చెప్పి ఇవ్వాలిరా " అంటూ నాకొక కవరు అందించాడు.

నా డబ్బులని చెప్పి ఇవ్వాలా....ఎందుకు?

 లేదురా...స్కూల్లో చదువుకునేటప్పుడు, నేను సరిగ్గా చదివే వాడిని కాదు. మాస్టారు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్  ఇచ్చినప్పుడల్లా చదువుకోకపోతే జీవితంలో ఎదగటం కష్టం అని చెప్పేవారు.  ఎనిమిదో క్లాసుతో చదువు ఆపాశాను...కూలీగా ఒక ఇళ్ళ మేస్త్రీ దగ్గర పనికి చేరాను. కొన్నేళ్ళ తరువాత మేస్త్రీ అయ్యాను. మూడేళ్ళ నుండి నేనే స్వయంగా కాంట్రక్ట్ తీసుకుని బిల్దింగులు కట్టిస్తున్నాను. ఇప్పుడు నేను డబ్బులు తీసుకు వెళ్ళి ఇస్తే ఆయన చెప్పిన మాట అబద్దమౌతుంది"

ఆయన చెప్పిన మాటలు అబద్దమైనట్లే కదరా. దానికి డైరెక్ట్ ఉదాహరణ నువ్వే. నువ్వు చదువుకోకపోయినా బిల్డింగ్ కాంట్రాక్టర్ అయ్యి, బాగా డబ్బు సంపాదిస్తున్నావు  . ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకు వెళ్ళి ఇస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు" అన్నాను.

అలాగే బాధ పడతారు కూడా.  ఎందుకంటే...బాగా సంపాదించుకుంటున్న వీడిని చూసి ఎన్నిసార్లు చదువులేకపోతే జీవితంలో నువ్వు ఎదగలేవు  అని తిట్టుంటాను అని చెప్పాను అనుకుంటూ బాధపడతారు.ఆయన బాధపడకూడదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజం రా"

"ఏమిట్రా నువ్వు చెప్పేది?"  

"‘చదువు లేకపోతే జీవితంలో పైకి రాలేమురా రోజు నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ గా ఎదిగి, రెండుచేతులా సంపాదిస్తున్నాను. కానీ ఎదుగుదల జీవితంలో నిజమైన ఎదుగుదల కాదురా.

"నూవ్వేం మాట్లాడుతున్నావో అర్ధం కావటం లేదు"

"ఎందుకురా అలా మాట్లాడుతున్నావు?"

నీకు అర్ధమయ్యేటట్లు చెబుతా విను. ప్రతి బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక, బిల్డింగ్ ప్లానుకు చదువుకున్న ఒక ఆర్కెటెక్ట్ ను కలుస్తున్నాను. కొన్ని పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు చదువుకున్న సివిల్ ఇంజనీరును కలిసి బిల్డింగ్ కరెక్టుగా కడుతున్నానా లేదా అని చూసి వెళ్ళమంటాను. కాంట్రక్టుకు తీసుకున్న డబ్బుల్లో నలభై శాతం వాళ్ళకి ఇస్తున్నాను... మధ్య చిన్న చిన్న కాంట్రాక్టులు ఇచ్చే వాళ్ళు కూడా నేరుగా సివిల్ ఇంజనీర్లను వెతుక్కుంటూ  వెడుతున్నారు. ఒకప్పుడు నేను స్వయంగా సంవత్సరానికి కనీసం మూడు కాంట్రాక్టులు తెచ్చుకో గలిగాను. ఇప్పుడు కాంట్రాక్టులు తగ్గి, సివిల్ ఇంజనీర్లు ఇచ్చే చిన్న చిన్న పనులు ఒప్పుకుంటున్నాను

ఒకప్పుడు అనుభవం ఉన్న మేస్త్రీ అనే చూపుతో ఆర్కిటెక్ట్ లూ, సివిల్ ఇంజనీర్లు పనులు ఇచ్చేవారు. ఇప్పుడు అవికూడా తగ్గుతూ వస్తున్నాయి. ఏదో ఒక నెపం చెప్పి కొత్తవాళ్ళను పెట్టుకుంటున్నారు"

ఇప్పుడు నా సంపాదన తక్కువగానే ఉన్నది. ఏదో ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బు దాచుకున్నాను కాబట్టి జీవితంలో గౌరవంగా బ్రతుకుతున్నాను. కానీ దాచుకున్న డబ్బు ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. అవి కరిగిపోయిన రోజు నేను మామూలు కూలీ మేస్త్రీనే. అందుకే ఇందాకా మాట చెప్పాను"

"ఎందుకురా అలా మాట్లాడుతున్నావు?"

నిజం చెబుతున్నానురాఇందులో నా కృషి యొక్క తప్పేమి లేదు...తప్పంతా నా చదువే. ఎంతో కష్టపడి ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ తెచ్చుకున్నా ప్లాను కోసం చదువుకున్న ఒక ఆర్కెటెక్ట్ దగ్గరుకు తప్పక వెళ్ళాలి , కొన్ని సార్లు సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళ దగ్గరుకు వెళ్ళాలి. అంటే చదువులేనిదే జీవితంలో ఎదగలేము అనేదే కదా నిజము. కాబట్టి మాస్టారు చెప్పింది నిజం"

"ఆరోజే నేను శ్రద్దతో చదువుకోనుంటే నేనూ ఒక సివిల్ ఇంజనీర్ అయ్యుండేవాడిని

 "ఎందుకురా అంత బాధపడతావు...చదువులు లేని ఎంతో మంది, పెద్ద వ్యాపరస్తులుగా ఉంటూ, చదువుకున్న వారికి ఉద్యాగాలు ఇస్తున్నారు కదా? నువ్వు ఇంకా కొంచం కష్టపడితే అంతస్తుకు ఎదిగిపోతావు. తరువాత నీ జివితం గౌరవంగానే ఉంటుందిరా" అన్నాను.

"స్నేహుతుడ్ని కదా అని నువ్వు నాకు పాజిటివ్ మాటలు చెబుతున్నావు....కానీ అది నిజం కాదు. చదువులు లేకపోయినా అద్రుష్టంతో పైకొచ్చినవారి సంఖ్యాశాతం ఒకట్లలో ఉంటుంది. వాళ్ళుకూడా పెద్ద చదువులు చదువుకున్న వారిని సహాయంగా ఉద్యోగం అనే పేరుతో తమతో ఉంచుకుంటారు

దీనికి కష్టపడటం మాత్రమే చాలదు. అద్రుష్టం వరిస్తేనే అలాంటి వారౌతారు. అదే చదువుకున్న వారు కష్టపడి పనిచేస్తే ఇట్టే పైకెదిగిపోతారు. అలాంటివారిని అద్రుష్టం వెతుకుతూనే ఉంటుంది. అదేరా చదువుకు ఉన్న గొప్పతనం...అందుకేరా ఆడా, మొగా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాలి అని చెబుతారు. …. చదువు ప్రతి ఒక్కరినీ మేధావుల్ని చేస్తుంది"

"ఇప్పుడు చెప్పరా...నేను వెళ్ళి నా డబ్బులు అని చెప్పి ఇస్తే మాస్టారి మాట అబద్దం అయిపోదూ...అందుకే, నీ డబ్బుగా చెప్పి ఇవ్వమంటున్నాను"

చదువుకోవటానికి నిర్వచనం ఎంత బాగా చెప్పావురా...ఇంతగా జీవితం గురించి ఆలొచించే నువ్వు చాలా తెలివగలవాడివి. నీ భవిష్యత్తు గురించి ఇంతగా ఆలొచిస్తున్న నువ్వు, నువ్వు దాచుకున్న డబ్బుల్లో మూడు లక్షలు గురువుకు దానంగా ఇస్తున్నావంటే నీది చాలా గొప్ప మనసురా...నీ గొప్ప మనసుకీ,తెలివితేటలకూ నువ్వు తప్పక జీవితంలో ఎదుగుతావురా...ఇది ఖచ్చితం" అంటూ శేషు ఇచ్చిన డబ్బును తీసుకున్నాను.  

అప్పుడు శేషు ముఖంలో కనబడ్డ ఆనందం, తృప్తి….నా కళ్ళలొ నీళ్ళు తెప్పించాయి.

                                                                        ********************

"ఇప్పుడు చెప్పండి సార్...నేనేం చేయాలి?" ఆఫీసర్ను అడిగాను.

"మీరు చెప్పండి" ఆఫీసర్ కంఠంలో కొంత మెత్తదనం.

" డబ్బులు శేషు నాకిచ్చాడు సార్. దానికి రసీదు ఇదిగో" అంటూ రసీదు కాగితం ఆఫీసర్ కు అందించాను.

రసీదును పూర్తిగా చదివిన ఆఫీసర్ ఓకే. కానీ   డబ్బును  మిస్టర్ శేషావతారం ఒరిజినల్ లెక్కల్లో చూపించనందుకు ఆయన జరిమానా కట్టాలి" రసీదును తన టేబుల్ మీద పెడుతూ చెప్పాడు.

"థాంక్యూ సార్" అని చెప్పి బయటపడ్డ నాకు శేషుకి విధంగానైనా సపొర్ట్  చేశాను అనే తృప్తి తో ఆనందంగా ఇంటిదారి పట్టాను.

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)