జయం నిశ్చయం...(కథ)

 

                                                                జయం నిశ్చయం                                                                                                                                                              (కథ)

మనందరం విజయం సాధించాలంటే మనకు కావలసిన జీవిత లక్ష్యం ఒకటి నిర్ణయించుకుని, దానికొసం ప్లాను వేసుకోవటం. ప్లాను వేసుకున్నాక విజయం సాధించటానికి తీవ్రంగా కష్టపడటం...తెలివి తేటలతో శ్రమించటమే!

ఈ రోజు ఎవరు ఏం చేస్తున్నారో అదే రేపు వారి భవిష్యత్తు. ఈ రోజు ఎవరైతే తీవ్రమైన కష్టంతో పనిచేస్తున్నారో...అదే వారికి లాభంగా తిరిగి వస్తుంది. కష్టపడి చదువుకునే మానవుడికి, అదే పరీక్ష అనే భవిష్యత్తును తీసుకు వస్తుంది.

అలాగంటే, ఈ రోజు మనం చేసింది, చేస్తున్నదే రేపు మన జీవితాన్ని తీర్మానిస్తుంది.

మరి ఈ కథలో ఎవరు ఏం చేశారు? ఏం సాధించారు?.....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

                                                               ***********************************

 

ఒక నగరానికి ప్రత్యేక చట్టం ఉండేది. దాని ప్రకారం ఎవరైనా సరే నగరానికి రాజుగా రావచ్చు. కానీ, పదవి ఐదు సంవత్సరాలు మాత్రమే! ఐదు సంవత్సరాలు పూర్తి అయిన మరుసటి రోజే, రాజును నదీ తీరానికి మరుపక్క నున్న అడవిలో వదిలి పెడతారు.

అడవిలో మనుష్యులు ఉండరు. కృర మృగాలు మాత్రమే ఉంటాయి! రాజు అడవి లోపలకు వెలితే చాలు కృర మృగాలు అతన్ని చంపి తినేస్తాయి.

చట్టాన్ని ఎవరూ మార్చలేరు. నిబంధనకు ఒప్పుకున్న అతను మాత్రమే రాజుగారి కుర్చీలో కూర్చోటానికి తగిన వ్యక్తి. కాబట్టి రాజుగా పట్టాభిషేకం చేసుకున్న వారి తలరాత, ఐదు సంవత్సరాల తరువాత ఖచ్చిత మరణం.

కఠినమైన చట్టానికి భయపడే ఎవరూ పదవికి ఆశపడకుండా ఉన్నందువలన రాజు గారి కుర్చీ చాలా వారకు ఖాలీగానే ఉండేది. అయినా కానీ, ఒకరిద్దరు, 'ఎలాగైనా చచ్చే కదా పోతాము, ఉన్నంత వరకు రాజు గారి హోదాతో, అధికారంతో, వైభవంతో బ్రతుకుదాం; రాజుగానే చనిపోదామే!' అని పదవి ఎక్కిన వాళ్ళూ ఉన్నారు.

అందులో సగం రాజులు, మధ్యలోనే గుండె పోటుతో చనిపోవటం మామూలుగా జరిగేది. అలాంటి ఒక రాజుకు ఐదు సంవత్సరాల పదవి కాలం ముగిసింది. రోజు నదీ తీరాన్ని దాటి, అడవి లోపలకు వెళ్ళాలి.

ఆయన్ని సాగనంపటానికి నగరమే అక్కడ కూడింది. రాజు వచ్చాడు. అతను విషేశమైన దుస్తులు, ఖరీదైన నగలూ వేసుకుని --కిరీటం పెట్టుకుని, బంగారు ఖడ్గం నడుముకు పెట్టుకుని, వజ్రాలు తలతలమని మెరువ--ప్రజల ముందు నిలబడ్డాడు.

ప్రజలు ఆశ్చర్యంతో నోరు తెరుచుకున్నారు.

ఇంకో అరగంటలో చనిపోయే అతనికి: ఎందుకింత అలంకారం? ఆరాటం?

తాను వెళ్ళబోయే పడవను చూసిన రాజు రాజు గారు వెళ్ళవలసిన పడవేనా ఇది! పెద్ద పడవను తీసుకు రండి. నేను నిలబడా ప్రయాణం చేసేది? సింహాసనాన్ని తీసుకు రండి!--ఆదేశించాడు. వెంటనే పనులు మొదలు అయ్యాయి.

కొద్ది సేపట్లో అలంకరించబడ్డ అందమైన పడవ, నది నీటిని వేరు చేసుకుంటూ అవతలి ఒడ్డుకు ప్రయాణించింది.

ప్రజలు శోకంగా నిలబడ, రాజు అందరికీ వీడ్కోలు ఇస్తూ నవ్వుతూ చేతులు ఊపాడు...ఎక్కువ శోకంలో ఉన్నా, మరింత ఎక్కువగా ఆశ్చర్యపోయింది పడవ నడిపే వాడు! కారణం, ఇంతవరకు అతను అవతలి ఒడ్డుకు తీసుకు వెళ్ళిన రాజూ సంతోషంగా ఉన్నది చూడలేదు. ఏడ్చి, సనిగి, దొర్లి, వెక్కివెక్కి వెళ్ళేవారు. కానీ రాజు ఆమిత ఆనందంతో ఉండటం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.

పడవ నడిపే ఆసామి ఓర్చుకోలేక అడిగాడు.

రాజా! ఎక్కడికి వెడుతున్నారో తెలుసా?”

తెలుసు...అవతలి ఒడ్డుకు వెడుతున్నా!

అక్కడికి వెళ్ళిన వాళ్ళేవరూ తిరిగి ప్రాణాలతో నగరానికి వచ్చిన ధాఖాలు లేవు?”

తెలుసు...నేనూ తిరిగి నగరానికి రాబోయేది లేదు!

అలాంటప్పుడు మీరు ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు?”

అదేంటంటే! నేనేం చేసేనో తెలుసా? రాజు గారి పదవికి వచ్చిన  ఒక సంవత్సరం ముగిసినప్పుడు, వెయ్యి మంది వేటగాళ్లను అడవికి పంపించాను. వాళ్ళు అత్యంత కృర మృగాలను వేటాడి చంపేసారు! రెండవ సంవత్సరం చివర్లో వెయ్యి మంది రైతులను పంపాను. అడవిని మార్చి పొలాలుగా చేశారు. రోజు పొలాలలొ వరి-కూరగాయలు అక్కడ దొరుకుతున్నాయి. మూడో సంవత్సరం చివర్లో భవనాలూ, ఇళ్ళు కట్టే నిపుణులను వెయ్యిమందిని - కార్మీకులను తీసుకు వెళ్లారు.

రోజు ఇల్లూ, వాకిలి, రాజ భవనం, అంతఃపురం, రోడ్లు అన్నీ రెడీ! నాలగవ సంవత్సరం చివర్లో వెయ్యి మంది ప్రభుత్వ అధికారులను పంపాను. నిర్వాహం చక్కగా సమకూరింది. నాలుగు వేల మందీ, తమ భార్యా, పిల్లలతో వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు.

ఇప్పుడు నేను అడవికి వెళ్ళటం లేదు. నా దేశానికి వెడుతున్నాను! మరణించటానికి వెళ్ళటం లేదు, జీవించడానికి వెడుతున్నాను! అదీనూ రాజుగా పరిపాలించబోతున్నాను! నీకు ఒక వేల రాజ భవన పడవ నడిపే పని కావాలంటే పడవతో ఇలాగే ఉద్యోగానికి వ్చ్చేయి! అన్నాడు రాజు.

పడవ నడిపే ఆసామి ఆశ్చర్యంతో రాజును అలాగే చూస్తూ ఉండిపోయాడు.

ఏమిటి అలా చూస్తున్నావు? నా గురువు నేర్పిన పాఠాలలో ముఖ్యమైన పాఠాన్ని అమలు పరిచాను? విజయం సాధించాను అన్నాడు రాజు.

.......................”

ఏమిటా పాఠం? అనుకుంటున్నావు కదూ? చెబుతా విను....ఒకే ఒక ప్రశ్నను మాత్రం తీసుకో? రాజు గారి విజయానికి ఎటువంటి పాఠం కారణమయ్యుంటుంది?

చాలా పాఠాలు ఉన్నా, ఉదాహరణకు రెండు మాత్రం చెబుతాను.

ఒకటి: ఐదు సంవత్సరాల తరువాత కూడా నేను బ్రతికుండాలి ; అది కూడా రాజులాగా బ్రతకాలి అనే నిర్ణయం తీసుకోవటం.

రెండోది: నిర్ణయానికి తగినట్టు ప్రణాళిక వేసి శ్రమించాలి.

నా విజయానికి మాత్రమే కాదు; మనందరం విజయం సాధించాలంటే మనకు కావలసిన జీవిత లక్ష్యం ఒకటి నిర్ణయించుకునిదానికొసం ప్రణాళిక వేసుకోవటంప్రణాళిక వేసుకున్నాక విజయం సాధించటానికి తీవ్రంగా కష్టపడటం...తెలివి తేటలతో శ్రమించటమే!

రోజు ఎవరు ఏం చేస్తున్నారో అదే రేపు వారి భవిష్యత్తు. రోజు ఎవరైతే తీవ్రమైన కష్టంతో పనిచేస్తున్నారో...అదే వారికి లాభంగా తిరిగి వస్తుంది. కష్టపడి చదువుకునే మానవుడికి, అదే పరీక్ష అనే భవిష్యత్తును తీసుకు వస్తుంది.

అలాగంటే, రోజు మనం చేసింది, చేస్తున్నదే రేపు మన జీవితాన్ని తీర్మానిస్తుంది.

వాటిని ఒక్కొకటిగా ప్రణాళికగా చెసుకుని, శ్రద్దతోనూ, శ్రమతోనూ కష్టపడి అమలుపరిస్తే, మన జీవితం ఎంతో హాయిగా ఉంటుంది! కార్యం చేయాలనుకున్నా దానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. దానిని ఆచరణలో పెట్టే ముందు పలుసార్లు ఆలొచించాలి.

బాగానే ఉంటుందిఅని అనుకున్న తరువాత...ఆచరణలో పెట్టలి.

ఇదే నా గురువు నాకు నేర్పిన పాఠం . అదే నేను చేసింది.

అలా చేసిన ప్రతి మనిషికీ జయం నిశ్చయం’!----నాలాగా!

అంతే....పడవ నడిపే ఆసామి రాజుగారి కాళ్ల మీద పడిపోయాడు.

************************************************సమాప్తం*************************************

కామెంట్‌లు

 1. Kadha chala bavundi.kani okay vishayam rasina vallu maricharu. Rajula kaalam lo kadha lo PLAN ane maata ni vaadaru

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వసుధిర్ గారికి,
   థ్యాంక్స్ అండి. నిజమే. ప్లాన్ అనే మాట రాజులకాలంలో వాడరు. ఎన్నిసార్లు తిరిగి తిరిగి చెక్ చేసుకున్నా కొన్నిసార్లు ఇలాగే కొన్ని పదాలు ఉండిపోతాయి. ప్లాన్ పదాన్ని...ప్రణాళిక గా మార్చాను.

   సి.ఎస్.నారాయణ.

   తొలగించు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పువ్వులో ఒక తుఫాన...(కథ)

పేగు తెగినా ప్రేమ తెగదు…(కథ)

ఈ ధోరణి వద్దు...! (కథ)