అందమైన మనసు...(కథ)
అందమైన మనసు (కథ)
'పెళ్ళికి ఒక
అబ్బాయో/అమ్మాయో నచ్చడమంటే ఏమిటీ? శారీరక ఆకర్షణకీ.. ప్రేమకీ
తేడా ఉందా? కేవలం శారీరక ఆకర్షణలో తప్పుందా?
దాదాపు 150 ఏళ్లుగా పాశ్చాత్య ప్రపంచం వీటికి జవాబు వెతుకుతూనే
ఉంది. ఆ వెతుకులాట పూర్తికాలేదు.. కాదేమో కూడా! అది అలా పూర్తికాకుండానే మన సమాజం
ఎప్పటికప్పుడు కొన్ని ప్రమాణాలని నిర్దేశించింది. 'పెళ్లికి
మనసు కలవడమే ముఖ్యం… వ్యక్తిత్వాలు నచ్చడం… కుటుంబాలు ఒకటికావడం….. ఇవే ప్రధానం… వీటన్నింటి తర్వాతే శారీరక ఆకర్షణ!' అనే
భావన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది.
అందంగా ఉంటే చాలదా?
చాలదు. అందం ఆకర్షణకి ప్రధానం
కావొచ్చు కానీ.. ఒక్కోసారి అది కూడా ఆకట్టుకోలేకపోవచ్చు. ఎంత అందంగా ఉన్నా..
ఎదుటివాళ్లు మనకో, మనం వాళ్లకో
నచ్చకపోవచ్చు. ఇది ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ వేర్వేరుగానే ఉంటుంది.
వ్యక్తిని కన్నా
వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం, ఆనందం ఉన్నాయి.
*****************************************************************************************************
ఆ కళ్యాణ మండపమే
కోలాహలంతో
నిండిపోయింది.
బంధువుల
గుంపు, బాణా
సంచా, డాన్స్
మరియు
పాటలు
అంటూ
చూసిన
వైపంతా
గోలగోలగా
ఉంది.
అందులో
అతని
మనసు
ఐక్యమవలేదు.
అతని పెళ్ళి
ఆగిపోయిన
దగ్గర
నుంచి
ఏ
విశేషానికీ
అతని
తల్లి-తండ్రులు
వెళ్ళటం
లేదు.
తెలిసిన
వాళ్ళూ, స్నేహితులూ, బంధువులూ
ఆగిపోయిన
కొడుకు
పెళ్ళి
గురించే
మాట్లాడతారు.
అది
విని
మరింత
బాధ
పడవలసి
వస్తుందని
గత
మూడు
నెలలుగా
ఏ
విశేషానికీ
వెళ్ళకూడదని
నిర్ణయించుకుని, ఆ
శుభకార్యం
ఆగిపొవటానికి
కారణమైన
అతన్నే
మిగిలిన
ఫంక్షన్లకు
పంపించారు.
ఈ రోజు...అతని
బంధువు
కొడుకు, అతని
స్నేహితుడూ
అయిన
సుందర్
పెళ్ళికి
వచ్చాడు.
మంచికాలంగా
పెళ్ళి
మండపంలో
ఏదో
సంబరం
జరుగుతున్నందు
వలన
ఎవరూ
ఇతన్ని
సరిగ్గా
గమనించలేదు.
అతనూ
“హమ్మయ్య...” అంటూ నిట్టూర్పు
విడిచి
అక్కడున్న
కుర్చీలో
కూర్చున్నాడు.
అప్పుడు...ముందు
వరుసలో
కూర్చోనున్న
కొత్త
దంపతులు
అతని
చూపుల్లో
పడ్డారు.
“ఏమిటండీ మీరు...కొంచం
సేపు
అణుకువగా
ఉండండి.
ఇదేమిటి
ఇలాంటి
పబ్లిక్
చోటులో
ఇలా
చేస్తున్నారు?”
“ఏయ్...నేనేం
చేసేనే? చూసే
వాళ్ళు
నన్ను
తప్పుగా
అనుకోబోతారు.
నేనేదో
రొమాన్స్
చేస్తున్నట్టు
ఎగతాలి
చేస్తారు.
మొదట
ఈ
‘జూస్’ తాగేసి
గ్లాసు
నాకిచ్చేయి.
ఈ
చోటు
ఖాలీ
చేస్తాను.
పాపం కాదా
నా
భార్య.
నెలల
గర్భిణి
అని
కూడా
చూడకుండా
పెళ్ళింట్లో
అనవసరమైన
పనులు
చేయిస్తున్నారే!
దానికి
తోడు
కొడుకు వేరే
ప్రాణం
తీస్తడే? అన్ని
పనుల
వలన
నీరసపడిపోతేందే
అన్న
మంచి
ఉద్దేశంతో
అందర్నీ
బెదిరించి
నిన్ను
ఒకచోట
కూర్చోబెట్టాను
చూడు...నన్ను
చెప్పాలే.
గబగబా తాగేసి
పరిగెత్తు.
పెళ్ళి
కూతురు
నీకు
స్నేహితురాలు
కూడా.
ఇక
ఎప్పుడు
నా
నాకంటికి
దొరకబోతావో” అంటూ తన
భార్య
తలని
ప్రేమగా
రాస్తూ
ఆమెకు
పళ్ళరసం
ఇస్తూ
ప్రేమగా
మందలించి
కసురుకున్నాడు
గోపాలం.
“ఉండండి--ఉండండి...ఇప్పుడు
నేనేం
చెప్పానని? మీరెందుకు
ఇంత
పొడవైన
‘డైలాగ్’ వదుల్తున్నారు? ఇలా
చెప్పి
చెప్పే
నన్ను
పని
చేయించటం
లేదు.
‘ఏదైనా
పని
చేస్తాను!’ అని
అడిగినా, మీకు
భయపడి
అందరూ
నన్ను
తరిమేస్తున్నారు.
మీరనుకున్నట్టే
జరిగింది
కదా!
ఆ
తరువాత
ఎందుకు
ఇంత
గోల...?” అంటూ
భర్తను
చూసి
పెదాలు
తిప్పింది
భార్య
జానకి.
ఆమె ముఖ
భావాలను
చూసి
కొంచం
గట్టిగానే
నవ్వాడు.
“ఇదే
గనుక
మన
ఇల్లు
అయ్యుండాలి...అప్పుడు
తెలిసేది
నా
ఆలొచన
గురించి!
కొంచం
రెస్టు
తీసుకుని
పని
చెయ్యరా.
మధ్యాహ్నం
మీ
స్నేహితురాలు
అడిగింది
రాత్రికి
ఇక్కడే
ఉండిపొమ్మని.
నేనూ
ఓకే
చెప్పాను!
తరువాత
ఎందుకు
శ్రమ
పడతావు?”
“అదంతా ఏమీ
వద్దు.
మనింటికే
వెళ్ళిపోదాం.
నాకు
తల
భారంగా
ఉంది.
నందిని
దగ్గర
ఇందాకే
చెప్పాను.
అది
కూడా
‘సరే’ నని
చెప్పింది.
ఇద్దరం
బయలుదేరదాం.
పొద్దున
పది
గంటలకే
కదా
ముహూర్తం? మనం
ఎనిమిదింటికి
వస్తే
సరిపోతుంది.
ఏమంటారు?”
“నువ్వు చెబితే
అప్పీలే
లేదు.
ఈ
లైట్ల
వెలుతురు, పాటల
శబ్ధమే
తలనొప్పికి
కారణం.
ఇంటికెళ్ళి
ప్రొద్దున్నే
కొంచం
తొందరగా
వచ్చేద్దాం.
అదే
మంచిది.
సరే
రా...నీ
స్నేహితురాలి
దగ్గర
చెప్పేసి
బయలుదేరదాం” అంటూ లేచినతను
భార్యకు
చెయ్యి
అందిచ్చి
తనతో
తీసుకు
వెళ్లాడు.
వెనుక కూర్చున్నతని
మనసో
వాళ్లను
తలచుకుని
నవ్వుతున్నా, కొంచం
ఈర్ష్య
కూడా
పడింది.
వాళ్ల
అన్యోన్యం...చాలా
రోజుల
నుంచి
దాంపత్య
జీవితంలో
ఉన్నవారిలాగానూ, ప్రేమించి
పెళ్ళి
చేసుకున్న
వారిలాగానూ
ఉన్నది.
‘ఆ రోజు
నేను
నా
పెళ్ళిని ఆపకుండా
ఉండుంటే...నేనూ
ఈ
పాటికి
నా
భార్యతో
ఈ
విశేషానికి
వచ్చుంటాను’ అని
అనుకున్నాడు.
తనకు ముందు
వరుసలో
కూర్చున్న
వాళ్ల
మొహాలు
అతనికి
సరిగ్గా
కనబడలేదు.
‘బయటకు
వెళ్ళటానికి
ఇటే
రావాలి.
అప్పుడు
చూసుకుందాం’ అనుకుంటూ
వాళ్ళు
వెళ్ళిన
వైపే
చూస్తున్నట్టు
కూర్చున్నాడు.
‘ఇంత ప్రేమ
చూపించే
భర్తను
పొందిన
ఆ
అమ్మాయి ఎవరనేది
చూసి
తీరాలి!’ అనే
ఆశ
ఎక్కువైయ్యింది.
ఆ
సమయం...లోపలకు
వెళ్ళిన
ఇద్దరూ
బయటకు
రాగా... గోపాలంతో నడిచి వస్తున్న
జానకిని
చూసిన
అతని
కాళ్ళు
అతనికి
తెలియకుండానే
పైకి
లేచినై.
‘జానకియా...?’ అంటూ
పెదాలు
ఉచ్చరించినై.
‘ఈమేనా...ఈమేనా? నేను
‘వద్దు’ అని
ఉదాసీనం
చేసిన
ఆమె!’
ఎందులోనో ఓడిపోయిన భావన...అతనికి.
వాళ్ళు
దగ్గరకు
వచ్చేంతవరకు
కళ్ళార్పకుండా
చూస్తూనే
ఉన్నాడు.
తలెత్తి వాళ్ళను
చూడలేని
వాడుగా, తలవంచుకుని
నిలబడ్డాడు.
మూడు
నెలలకు
ముందు
సంభవించిన
సంఘటన...మనసు
తెర
మీద
సినిమాలాగా
కనబడుతోంది.
ఈ
జానకినే
అతనికి
చూసి
నిశ్చయం
చేసిన
అమ్మాయి.
ఆమె
కొంచం
నలుపు
ఛాయ
ఉన్న
అమ్మాయి.
అందులో
అతనికి
కొంచం
తడబాటు
మొదలవటం
ప్రారంభమైయ్యింది.
‘కొంచం ‘రంగు’గా
ఉండే
అమ్మాయిని
చూసుండచ్చే
ఈ
అమ్మ?’ అనే
భావం
అతనిలో
తలెత్తటాన్ని
అతను
అడ్డుకోలేకపోయాడు.
అమ్మకు జానకి
బాగా
నచ్చింది.
నలుపు
ఛాయ
తప్పితే
ఆమె
దగ్గర
ఇంకే
కొరత
ఉన్నట్లు
చెప్పలేదు.
కట్న
కానుకలు
అడిగినదానికంటే
ఎక్కువే
ఇస్తామన్నారు.
అందులోనూ
జానకిని
అతని
తల్లి
మహేశ్వరికి
ఎక్కువగా
నచ్చేయటంతో...ఆ
తరువాత
పెళ్ళి
పనులు
వేగంగా
జరగటం
మొదలయ్యింది.
ఈ లోపు
కొడుకు
దగ్గర
ఉన్న
ఉత్సాహం
తగ్గిపోయింది.
‘ఏదో
ఒక
సుడిగుండంలోకి
నన్ను
లాగటానికి
చూస్తున్నారు.
ఇందులో
నుండి
ఎలా
తప్పించుకోవటం?’ అనే
ఆలొచనతోనే
తిరుగుతున్నాడు.
నిశ్చయం
చేసిన
అమ్మాయితో
నైనా
మాట్లాడాలనే
ఆలొచన
కూడా
రాకుండా
పోయింది.
జానకి ఫోన్
చేసినప్పుడు...ఆమె
నెంబరే
అనేది
తెలుసుకోకుండా
‘రాంగ్
నెంబర్’ అని
చెప్పి
సెల్
ఫోన్
అవతల
పారాసాడు.
దీని వలన
జానకికి
కొంచం
అనుమానం
వచ్చింది.
కానీ, తనని
కన్నవారి
మీద
నమ్మకం
ఉన్నందువలన
మౌనంగా
ఉన్నది.
పెళ్ళి
రోజుకు, రోజులు
దగ్గర
పడుతున్నప్పుడు...హఠాత్తుగా
అతని
బుద్ది
మారింది.
“అమ్మా...ఈ
పెళ్ళి
ఆపేయండి!” అన్నాడు ఖచ్చితంగా.
ఆమెకు కోపం
ఎగిసిపడింది.
“అదెందుకురా
ఇప్పుడు
చెబుతున్నావు? అమ్మాయిని
చూడటానికి
నువ్వు
కూడా
వచ్చావు
కదా!
అప్పుడే
అడిగానే? అది
కూడా
వదిలేయ్...తాంబూలాలకు విధి
వీధంతా
వెళ్లామే? అప్పుడైనా
చెప్పుండచ్చు
కదా.
ఇప్పుడొచ్చి
ఒక
బాంబు
విసిరేస్తే
ఎలరా?
వాళ్ళకు మనం
ఏం
సమాధానం
చెప్పగలం? మన
కుటుంబం
గురించి
వాళ్ళు
ఏమనుకుంటారు? ఊళ్ళో
అందరూ
మన
గురించి
తప్పుగా
మాట్లాడుతారు
రా!
ఇవన్నీ
కూడా
వదిలేసేయ్.
చివరి
నిమిషంలో
పెళ్ళి
ఆగిపోతే, ఆ
అమ్మాయి
పరిస్థితి
ఆలొచించి
చూడు.
ఆడపిల్ల
శాపం
చాలా
శక్తివంతమైనది” అంటూ ఆ
తల్లి మనసు వేదనతో
కృంగిపోయింది.
“మీ ఇష్టం
కోసం
సగం
మనసుతో
ఒప్పుకున్నాను.
కానీ
పెళ్ళికి
రోజులు
దగ్గర
పడుతున్న
కొద్దీ
కన్
ఫ్యూజన్
ఎక్కువయ్యింది.
ఇప్పుడు
నాకు
నచ్చలేదు.
నేను
చేసేది
తప్పే...ఒప్పుకుంటా.
అందుకోసం
జీవితాంతం
మనసు
కష్టంతో
జీవించగలనా? ఏదో
ఒక
సాకు, కారణం
చెప్పి
ఈ
పెళ్ళి
ఆపేయ్.
నాన్న
దగ్గర
ఏం
చెప్పాలో
చెప్పు.
లేదంటే
కొన్ని
రోజులు
నేను
కనబడకుండా
పోతాను.
అప్పుడు
ఈ
పెళ్ళి
తానుగా
ఆగిపోతుంది
కదా?” అన్నాడు
విసుగ్గా.
“ఆ అమ్మాయ్
నలుపు
ఛాయలో
ఉన్నదనేగా
నీ
సమస్య? ఆ
అమ్మాయి
చాలా
మంచి
అమ్మాయిరా!
అటు
నిన్నూ, ఇటు
మమ్మల్ని
బాగా
చూసుకుంటుందిరా. మనలో
బాగా
కలిసిపోతుందిరా.
ఆ
అమ్మాయి
గురించి
తెలిసినందువలనే...నీకు
ఆమెతో
పెళ్ళి
చేయటానికి
నిర్ణయించుకున్నాను.
రంగు, అందం కంటే మనసే గొప్పదిరా. ఈ రంగూ,
అందాలు శాస్వతమైనవి కావురా. కానీ మనసు మాత్రం శాస్వతమైనదిరా. నా మాట
వినరా"
“అమ్మా...నెను
చెప్పేది
ఫైనల్.
ఈ
పెళ్ళి
కాన్సిల్
చేయండి.
అంతే”
“అమ్మాయి నలుపనేగా
వద్దంటున్నావు...రంగులు
కాదురా
కావలసింది.
గుణాలు.
అమ్మాయి
చాలా
గుణవంతురాలురా”
“నేను చెప్పింది
చెప్పిందే” అని చెప్పి
లేచి
వెళ్ళిపోయాడు.
‘ఒకడే కొడుకు
అని
చనువు
ఇచ్చి
పెంచింది
తప్పు
అయిపోయింది.
ఇలా
మా
తల
మీద
బండరాయి
ఎగరేసేవే’ అంటూ
మహేశ్వరి
ఏడుస్తూ
గోల
చేసింది.
ఇంట్లో వాళ్ళతో
ఇక
మాట్లాడి
ప్రయోజనం
లేదని
అనుకున్న
అతను
తిన్నగా
జానకికే
‘ఫోన్’
చేసి, “ఈ
పెళ్ళి
నాకు
ఇష్టం
లేదు.
మా
అమ్మగారి
ఇష్టం
కోసం
‘ఓకే’ అని
చెప్పాను...నన్ను
క్షమించు” అని ముగించాడు.
ఆ తరువాత.
జానకికి ఇంకో వరుడ్ని
చూసి
-- ముహూర్తం పెట్టిన
అదే
రోజునే
పెళ్ళి
జరిగినట్లు
ఎవరి
మూలంగానో
తెలుసుకున్నాడు.
ఇంట్లోనూ, ఊర్లోనూ
ఎవరూ
అతనితో
మాట్లాడటం
లేదు.
బాగా
డిప్రెషన్
లోకి
వెళ్ళిపోయాడు.
అప్పుడే స్నేహితుడు
సుందర్
వచ్చి
పెళ్ళి
పత్రిక
ఇచ్చి... ‘ఖచ్చితంగా
రావాలి!’ అని
ఆదేశించి
వెళ్ళిపోయాడు.
ఇతనూ
ఒక
మార్పు
కోసం
వచ్చాడు.
వచ్చిన చోట
ఇలా
జానకిని, ఆమె
భర్తతో
కలిసి
చూస్తాడని
అతను ఎదురుచూడలేదు.
ఇప్పుడు
అతనికి
కొంత
నేరభావన
కొంచం
తగ్గింది.
ఆయినా
కానీ
ఆమె
దగ్గర
క్షమాపన
అడగాలని
అనుకుని
దగ్గరకు
వెళ్లాడు.
వాళ్ళు పట్టించుకోకుండా
ముందుకు
వెళ్ళగా...వేగంగా
వాళ్ళను
దాటి...వాళ్ళ
ఎదురుగా
నిలబడ్డాడు.
“జానకీ” అని పిలిచాడు.
అప్పుడే
వాళ్ళిద్దరూ
అతన్ని
చూసారు.
స్నేహంగా
నవ్వారు.
అదే
వంద
కొరడా
దెబ్బలు
తిన్న
ఫీలింగ్
ఇచ్చింది
అతనికి.
ఎందుకంటే...ఎలాగూ
తన
మీద
కోపం
ఉంటుంది.
పబ్లిక్
చోటు
అని
కూడా
చూడకుండా
ఏదైనా
అనరాని
మాటలు
అంటుందని
అనుకున్నాడు...వాళ్ళ
నవ్వు
పూర్తిగా
వేరుగా
ఉంది.
“ఎలా ఉన్నారు
వెంకట్...నన్ను
గుర్తుపట్టారా?” అన్నది
జానకి.
“హు...” అంటూ తల
ఊపిన
అతను
“నన్ను
క్షమించండి
జానకి.
నేనలా
చేసుండకూడదు.
ముందే
మీ
దగ్గర
మాట్లాడి
ఉండాలి.
తప్పంతా
నాదే!
ఆ
నేరభావనే
నన్ను
చంపుతోంది.
ఎవరూ
నా
దగ్గర
మాట్లాడటం
లేదు.
పెద్ద
పాపం
చేసిన
ఫీలింగ్
కలుగుతోంది.
దయచేసి
నన్ను
క్షమించండి”
“లేదు...మీరు
నాకు
సహాయమే
చేసారు.
దానికి
నేనే
మీకు
ధన్యవాదాలు
చెప్పాలి.
మీరు
గనుకు
ఆ
నిర్ణయం
తీసుకోకపోతే
మనిద్దరం
పెళ్ళి
అనే
పేరుతో
జీవితాంతం
అబద్దపు
జీవితం
గడుపుతూ
ఉండే
వాళ్ళం.
ఆ కష్టాన్ని
ఇవ్వకుండా, పెళ్ళికి
ముందే
చెప్పినందుకు
చాలా
ధ్యాంక్స్.
మీరు
అలా
చెప్పుండకపోతే...నాకు, నన్ను
ఇంత
అభిమానించే
భర్త
దొరికుండరు.
దానికి
నేనే
మీకు
ఎంతో
రుణపడి
ఉన్నాను.
ఈయనే
మా
ఆయన.
ఊర్లో
వ్యవసాయం
చేస్తున్నారు.
చాలా
సంతోషంగా
ఉన్నాను” అంటూ పక్కన
నిలబడున్న
భర్త
గోపాలం
భుజాల
మీద
వాలిపోగా, అతనూ
ఆమెను
ప్రేమగా
దగ్గరకు
చేర్చుకున్నాడు.
“మీరు చేసిన
సహాయమే
వెంకట్.
నాకు
ప్రాణానికి
ప్రాణమైన
భార్య
దొరికింది.
ఆమె
కోసం
ఏదైనా
చేయచ్చు
అని
అనిపించేంత
ఎక్కువ
ప్రేమ
ఆమెపై
నాకుంది.
అంత
ప్రేమగా
నా
దగ్గర
నడుచుకుంటుంది.
దీనికంతా
మీకు
ధన్యవాదాలు
చెప్పే
తీరాలి.
నిజంగా
మనస్ఫూర్తిగా
చెబుతున్నా...” అన్నాడు.
వెంకట్ కు
ఏం
మాట్లాడాలో
తెలియలేదు.
కొంతసేపు
ఆ
చోట
మౌనం
చోటు
చేసుకుంది...మళ్ళీ
గోపాలమే
మొదలు
పెట్టాడు.
“శరీర
అందం
కంటే, మనసు
అందమే
ముఖ్యం.
అది
అర్ధం
చేసుకుంటే
జీవితమే
కలర్
ఫుల్
గా
మారిపోతుంది.మా
జీవితం
లాగా!
ఇక
మీ
జీవితమూ
అదే
లాగా
మార్చుకునే
పక్వం
మీకు
వచ్చుంటుందని
అనుకుంటాను.
త్వరగా
మీ
పెళ్ళి
పత్రిక
కోసం
ఎదురు
చూస్తాము...?” అని
ఆపాడు.
చాలా రోజులు
ఆలొచనలో
ఉన్న
వెంకట్
కు
ఈ
ఆలొచన
కూడా
వచ్చింది.
అది
ఈ
రోజు
గోపాలాన్ని, జానకిని
చూసిన
తరువాత
బలపడింది.
అతని
మొహంలో
స్పష్టత
పుట్టగా...”ఖచ్చితంగా
సార్!
మ్యారేజ్
పత్రికతో
మిమ్మల్ని
కలుస్తాను.
మీరు
వస్తారుగా?” అనగానే,
“ఖచ్చితంగా మేము
లేకుండానా?” అని
గోపాలం
కంటే
ముందు
జానకి
సమాధానం
ఇవ్వగా...వాళ్ళు
నవ్వటం
ప్రారంభించారు.
అక్కడ
బాధ, నేర
భావన
మాయమయ్యింది...ఒక
అందమైన
స్నేహం
చిగురించింది.
*************************************************సమాప్తం********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి