వేరు కాపురం!...(కథ)

 

                                                                           వేరు కాపురం!                                                                                                                                                                     (కథ)

ఇదిగో చూడండి...నేను తీర్మానంగా చెబుతున్నా. ఇక మీదట మీ అమ్మ ఉన్న ఇంట్లో, నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడే మా అమ్మగారింటికి వెలుతున్నాపద్మజ ఖరారుగా చెప్పేసి పెట్టెతో బయలుదేర...ఆమెను ఆపటానికి ప్రయత్నించి ఓడిపోయాడు ఆమె భర్త బాలు.

చాలా ఇళ్ళల్లోసుప్రబాతంలేకపోతే వేరే ఏదైనా భక్తి శ్లోకాలు...అది కూడా లేకపోతే, ఒక సహజమైన ప్రశాంత వాతావరణంతో పొద్దు ప్రారంభమవుతుంది.

కానీ తనింట్లో మాత్రం ప్రతి రోజూ అత్తగారూ--కోడలూ వేసే పోట్లాడుకునే అరుపులతోనే ప్రతి రోజూ తెల్లారుతుంది. అది తలుచుకున్నప్పుడల్లా ఒక నిట్టూర్పు వస్తుంది బాలూకి. సారి భార్య 'అల్టిమేటం' ఇచ్చి వెళ్ళిపోయింది. భార్యా-తల్లా?

గొడవను ఎలా పరిష్కరించాడు బాలూ? ఎవరికి న్యాయం చేసాడు? ఎందుకు చేసాడు? ఏం చేసాడు?....తెలుసుకోవటానికి ఎమోషనల్ కథ చదవండి. 

*****************************************************************************************************

గిన్నెలు దొర్లుతున్న శబ్ధంతో కళ్ళు తెరిచాడు బాలమురళి అనే బాలూ. శబ్ధంతో పాటు అతని తల్లి యొక్క చిన్న స్వరం, భార్య పద్మజ యొక్క అరుపులు వినబడినై.

చాలా ఇళ్ళల్లో సుప్రబాతంలేకపోతే వేరే ఏదైనా భక్తి శ్లోకాలు...అది కూడా లేకపోతే, ఒక సహజమైన ప్రశాంత వాతావరణంతో పొద్దు ప్రారంభమవుతుంది.

కానీ తనింట్లో మాత్రం ప్రతి రోజూ అతాగారూ--కోడలూ వేసే పోట్లాడుకునే అరుపులతోనే ప్రతి రోజూ తెల్లారుతుంది. అది తలుచుకున్నప్పుడల్లా ఒక నిట్టూర్పు వస్తుంది.

ఇంతలో గిన్నెల శబ్ధం ఎక్కువ అవగా, ఇంతకు మించి ఇంకా పడుకోనుంటే, గిన్నెలన్నీ తన వైపుకు దూసుకుంటూ వస్తాయనే భయంతో గబుక్కున లేచి వంట గది వైపుకు వెళ్ళాడు.

అలా వంట గదిలోకి వెడితే అమ్మకు కోపం వస్తుందనేది గుర్తుకు వచ్చి, వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి, వేగంగా పళ్ళు తోముకుని, మొహం కడుక్కుని వెళ్ళాడు.

వచ్చారా... మీరే న్యాయాన్ని అడగండి. నిన్న రాత్రి అన్నం మిగిలిపోయింది! దాంట్లో నీళ్ళు పోసి పెట్టటం మరిచిపోయాను. అలాగే గిన్నెను అరుగు మీద పెట్టేశాను. అది ఇప్పుడు తినలేని పరిస్థితిలో గుజ్జు గుజ్జుగా అయిపోయింది.

దానికి నేనేం చేయగలను? మీ అమ్మ ఏమో వండిన వంటకాలన్నిటినీ నేను వేస్టు చేస్తున్నానని నా మీద అపవాదు వేస్తున్నారు. ఏం...ఆవిడే నీళ్ళు పోసి పెట్టుండచ్చే?”--- పద్మజ కోపంగా అడిగింది.

అతని తల్లి ఒక గిన్నెను తీసి కొడుక్కి చూపించింది.

ఇదిగో చూడు బాలూ...ఎంత అన్నం వేస్టు అయిపోయిందో? ఇప్పుడు బియ్యం అమ్ముతున్న రేటుకు ఇలా వేస్టు చేయటం తప్పు కాదా? రోజుల్లో చేతి నిండా డబ్బు తీసుకు వెడితే, సంచి నిండుగా వంట సామాన్లు కొనగలిగే వాళ్ళం.

కానీ, కాలంలో సంచి నిండుగా డబ్బు తీసుకు వెళ్ళినా కూడా, చేతి నిండుగా వంట సామాన్లు కొనలేకపోతున్నాము. అలా ఉన్నప్పుడు...మిగిలిపోయిన వంటలను జాగ్రత్తగా ఉంచుకోవద్దూ? అది చెప్పినందుకు నీ భార్య నాతో గొడవ పడుతోంది --- అన్నది తల్లి శ్యామల.

ఏమిటీ... నేనా గొడవపడుతున్నాను. ప్రొద్దున నుంచి రాత్రి పడుకోపోయేంతవరకు మీరే కదా ఏదో ఒక దానికొసం నన్ను పోట్లాటకి లాగుతున్నారు! ఇందులో కాలంలో...అంటూ మాటకి ఒకసారి ప్రారంభిస్తారు. పాత కథలన్నీ మాట్లాడి మాట్లాడి చంపుతున్నారు -- ఉరిమింది పద్మజ.

కోడలు ఇలా ఏదో ఒకటి విసుగ్గా చెప్పగా, అత్తగారు ఏదో ఒకటి అనగా...వీటికి మధ్య ఏమీ మాట్లాడకుండా నిలబడున్నాడే అని ఇద్దరూ అతన్ని పోట్లాటలోకి ఈడ్చేరు.

ఇదిగో చూడండి...నేను తీర్మానంగా చెబుతున్నా. ఇక మీదట మీ అమ్మ ఉన్న ఇంట్లో, నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడే మా అమ్మగారింటికి వెలుతున్నా పద్మజ ఖరారుగా చెప్పేసి పెట్టెతో బయలుదేర...ఆమెను ఆపటానికి ప్రయత్నించి ఓడిపోయాడు బాలు.

ఆమె వెళ్ళిన తరువాత ఇల్లు ప్రశాంతంగా ఉన్నది. కానీ, బాలూ మనసులో తుఫాన బలంగా వీయడం ప్రారంభమయ్యింది. అతని వలన కడుపు నిండా తినటమో, ప్రశాంతంగా నిద్ర పోవటమో కుదరలేదు.

బాలూ...ఎందుకు ఇలా పిచ్చి వాడిలాగా ఉన్నావు? నువ్విలా శోఖంగా ఉండటం నేను చూడలేకపోతున్నానురా!

నన్ను ఇంకెలా ఉండమంటావు అమ్మా! బాలు అనే పేరుకు తగినట్టు అమ్మానూ, భార్యానూ బాలు ఆడితే...కాలుతో తన్ని ఆటాడితే నేనెలా సహజంగా ఉండగలను?”

ఇద్దరూ నన్ను చెరో పక్కకూ లాగితే ఎలా? ఒకరైనా సర్దుకు పోవాలి కదా...ఛఛ---అతని స్వరంలో తెలిసిన విసుగుతో ఆమె బాధ పడింది. తరువాత అమె ఖచ్చితమైన స్వరంతో తన డిషేషన్ చెప్పగా...ఆ తల్లి చెప్పిన డిషేషన్ విని కొడుకు పెద్ద షాకుకు గురయ్యాడు!

                                                                     ******************************

పద్మజా... ఇల్లు నచ్చిందా?”--బాలు అడుగ, ఆమె పళ్లంతా చూబిస్తూ నవ్వు మొహంతో తల ఊపింది.

హమ్మయ్య! ఇప్పటికైనా మీకు బుద్ది వచ్చిందే? మీ అమ్మగారు లేని చోటు నరకంగా ఉన్నా అది నా వరకు స్వర్గమే! రేపు మంచి రోజే. మనం వచ్చి పాలు కాచి వెల్దాం

హు....నీ ఈష్టం! ఇక మీదట నువ్వు ఇష్టపడినట్లే అన్నీ  జరుగుతాయి. నువ్వు వేరు కాపురం వెళ్ళే తీరాలని ఆశపడ్డావే! ఇక మీదట ఒకత్తి గానే కాపురం చెయొచ్చు. మా అమ్మ మాత్రమే కాదు...నేను కూడా నీతో ఉండబోయేది లేదు -- అతను చెప్పింది విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే...తొందరగా అడ్డుపడ్డాడు.

మాట్లాడమోకే! నువ్వు ఇందాక అన్నావే నాకు ఇప్పుడైనా బుద్ది వచ్చిందని. అది నిజమేనే. నాకు ఇప్పుడు నిజంగానే బుద్ది వచ్చిందే. ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు చివరిసారిగా...నేను చెప్పేది నువ్వు విను. ఏమన్నావు? మా అమ్మగారు లేని చోటు నీకు స్వర్గమా? ఏమే... నువ్వేమో మీ నాన్నా-అమ్మా, వాళ్ళిద్దరూ చాలరని నీ మేనమామ అంటూ బంధువులతోనే కదా జీవించే దానివి?

మీ అమ్మ...పెళ్ళి కానుకగా, తన తమ్ముడ్ని తనతో పాటు తీసుకు వెళ్ళి తన అత్తగారింట్లో పెట్టుకోవచ్చు. కానీ, అల్లుడ్ని నేను మాత్రం నా తల్లిని నాతో పాటు ఉంచుకోకూడదా? నిన్ను వేరే కాపురం వెళ్ళవే అంటోంది! ఆమే ఒక తల్లేనా?

మా అమ్మ అంత పెద్ద తప్పు ఏం చేసింది? కంటికి రెప్పలాగా నాపై ప్రేమ చూపిస్తోందే...అదే ఆమె తప్పా? తాను కష్టపడ్డా పరవాలేదు, భార్యా భర్తలం మనిద్దరం ఆనందంగా ఉండాలని ఆమెను వృద్దాశ్రంలో చేర్చేయమని చెప్పిందే! అలా చెప్పేటప్పుడు ఆమె మనసు ఎంత కష్ట పడుంటుంది?

నా మీద కూడా తప్పుంది! భార్యే శరణం అని ఉండిపోయాను. అదే నన్ను తల్లి ప్రేమకు దూరం చేసింది. నేను ఎంతగా ఆమెను ఉదాసీన పరిచినా, నా బాగోగుల మీద శ్రద్ద చూపిస్తూ, తనని మాడ్చుకుంటోందే... తల్లి ప్రేమకు సరిసమంగా ఏదీ ఉండదని ఇప్పుడే అర్ధం చేసుకున్నాను.

నీకూ బంధుత్వం గొప్పతనం తెలియాలి! నీ వల్ల కూడా ఒంటరిగా ఉండటం కుదరదు. వెంటనే అమ్మగారింటికి పరిగెత్తుతావు. అప్పుడైనా నీకు మిగిలిన వారి బంధుత్వాన్ని గౌరవించాలి అనేది అర్ధమవుతుందా చూద్దాం?

నీ భర్తకు అతని యొక్క తల్లి ముఖ్యం అనే నిజాన్ని గ్రహిస్తావా అని చూస్తాను. అంతవరకు మనం విడిపోయే ఉంటాం. ఎప్పుడు నా మనసు మారుతుందో...అప్పుడు మనం ఒకటవుదాం. అంతవరకు 'గుడ్ బై' ! ” --- అతను దృఢమైన స్వరంతో చెప్పేసి వెళ్ళిపోగా, షాక్ లో కరిగిపోయింది ఆమె.

**************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)