పెంపకం 2.0…(కథ)

 

                                                                        పెంపకం 2.0                                                                                                                                                                                      (కథ)

కొన్ని ఇళ్ళల్లో మెట్టింటికి వెలుతున్న ఆడపిల్లకువెళ్ళిన వెంటనే భర్తను బాగా చూసుకో! అతనే నీకు అన్నీ...అతన్ని నీ గుప్పిట్లో ఉంచుకోఅని బోధిస్తారని వినుంటారు. ఇంట్లో వాళ్ళు చెప్పింది విని భర్తను తమ గిప్పిట్లో అంటేభార్యా దాసుడుగా మార్చేస్తారు. దీనితో అత్తా కోడళ్ల గొడవ, పోటీ మొదలై ఈల్లు నరకంగా మారుతుంది. "మగవాళ్ళందరూ, పెళ్ళి తరువాత కలవర పడటానికి కారణం ఇదే"

దానికి బిన్నంగా మెట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల తన అత్తగారితో మనసు విప్పి మాట్లాడిఅత్తయ్యా...ఇక మీదట మీరే నాకు అంతా! మీరేం చెబితే...అదే చేస్తాను. ఇక మీదట మీరే నాకు అమ్మ”" అంటే అత్త కోడల్ని కౌగలించుకుని అభయమిస్తుంది. ఇల్లు స్వర్గం అవుతుంది.

పాఠాలను ప్రతి తల్లి, కూతురికి నేర్పించాలి. అదే పెంపకం. కథలో ఏం జరిగిందో చూడండి.

*****************************************************************************************************

పెళ్ళై మూడు నెలలు గడిచింది. తల్లి చెప్పినట్టే నడుచుకుంది సుజాత! అమ్మ ఎందుకు అలా చెప్పింది?’ అని మొదట్లో ఆలొచించిన ఆమె, రోజులు గడిచే కొద్దీ అర్ధం చేసుకోవటం మొదలుపెట్టింది. కన్న తల్లి మీద గౌరవ మర్యాదలు ఎక్కువైనై.

కొన్ని ఇళ్ళల్లో మెట్టింటికి వెలుతున్న ఆడపిల్లకు వెళ్ళిన వెంటనే భర్తను బాగా చూసుకో! అతనే నీకు అన్నీ...అతన్ని నీ గుప్పిట్లో ఉంచుకో అని బోధిస్తారని విన్నాను.

అంత దూరం వెళ్ళటం దేనికి...? వాళ్ళింట్లోనే ఆమె వదిన జానకి అలాగే ఉన్నది. అన్నయ్య కృష్ణ మోహన్ భార్యా దాసుడు గానే మారిపోయాడు. వదిన ఏం చెబితే అది వేద వాక్కుగా తీసుకుంటాడు!

సుజాత తల్లి చాలా ఓర్పుగల ఆవిడ. చూసీ చూడనట్లు వెళ్ళిపోయేది.

సుజాతకి కోపం కోపంగా వస్తుంది. కానీ, పళ్ళు కొరుక్కుంటూ మౌనంగా ఉండిపోతుంది. కోపం అంతా అన్నయ్య మీద మారుతుంది. ప్రేమ...విరక్తిగా మారటం మొదలయ్యింది.

విజయలక్ష్మి తన కూతుర్ని సమాధానపరుస్తుంది.

వదిలేయ్...సుజాతా ఆడపిల్ల అయినా సరే పుట్టినింటి నుండి మెట్టినింటికి వచ్చినప్పుడు మొదట్లో బాగా చూసుకునేది కట్టుకున్న మొగుడ్నే! 'మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో?' అనే భయంతో భర్తను అతుక్కునే ఉంటారు. భార్య యొక్క తీవ్రమైన ప్రేమను తెలుసుకోగలిగిన భర్త, ఆమె భయాన్ని పోగొట్టాలి. చాలా మంది అది చేయటం లేదు.

భార్య యొక్క భయం ఏర్పరిచిన తీవ్రమైన ప్రేమలో మునిగిపోయి వాళ్ళు చెప్పేదే వింటారు భర్తలు. నేను కూడా అలాగే ఉండేదానిని. కానీ, మీ నాన్న బాగా తెలివిగలవారు...నా భయాన్ని పోగొట్టారు. అదొక్కటే కాదు. మీ బామ్మ కూడా నన్ను కూతురులాగానే చూసుకునేది

సుజాత శాంతంగా మారిపోతుంది.

పెళ్ళై వచ్చిన వెంటనే అత్తగారు, మామగార్ల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తరువాత చేసిన మొదటి పని...వంట గదిలోకి వెళ్ళి అత్తగారితో మనసు విప్పి మాట్లాడింది.

అత్తయ్యా...ఇక మీదట మీరే నాకు అంతా! మీరేం చెబితే...అదే చేస్తాను. నా వంట సుమారుగా ఉంటుంది. మీరు ఏమేమి వంటలు చేయమంటారో...అలాగే వంట చేస్తాను. రెండు, మూడు రోజులు పక్కనున్నారంటే...మీ చేతి వంట రుచిని నేర్చుకుంటాను. ఇక మీదట మీరే నాకు అమ్మ

పుష్పవల్లి మనసు ఆనంద పడింది. కోడల్ని కౌగలించుకుని అభయమిచ్చింది.

నువ్వు దేనికీ బాధ పడకు సుజాతా...నీకు తోడుగా ఉంటూ అన్నీ నేను చూసుకుంటా అని నవ్వుతూ చెప్పింది.

కొత్త కోడలు తన దగ్గర అతుక్కుపోవటం చూసి మహా సంతోష పడింది.

పర్వాలేదు...వియ్యపురాలు కూతుర్ని బాగానే పెంచింది! ఎంత అనుకువ...పెద్దవాళ్ళ దగ్గర ఎంత మర్యాద?’

మనసులోనే మెచ్చుకుంది.

కోడలు భర్తకు కావలసినవి కూడా అత్తగారిని అడిగి చేస్తోంది.

ఇలా ప్రతి ఒక్క విషయాన్నీ అడిగి, అడిగి చేస్తుంటే ఏమిటి... అమ్మాయికి ఏమీ తెలియటం లేదే? అని నిర్ణయానికి వచ్చేస్తారో!

సూర్యా భార్యను సినిమాకు రమ్మని పిలిస్తే, అత్తయ్యను అడిగే వెడుతుంది. గుడికి పిలిస్తే అత్తయ్యా-మామగార్లను ఇద్దర్నీ రమ్మని బలవంతం చేస్తుంది.

వాళ్ళూ సంతోషంగా బయలుదేరుతారు.

పుష్పవల్లికి చుట్టుపక్కలున్న వాళ్ళతో తన కోడలి అణుకువనూ, ఓర్పునూ గురించి చెప్పి చెప్పి ఆనందపడుతుంది.

సుజాత గురించి మాట్లాడేటప్పుడు ముఖమంతా పువ్వులాగా వికసిస్తుంది.

సూర్యా తన భార్య సామర్ధ్యాన్ని మెచ్చుకున్నాడు. పరవాలేదు...మనకు తల నొప్పీ లేదు!

మొదటి నెల జీతాన్ని భార్య దగ్గర ఇచ్చినప్పుడు, ఆమె తీసుకోవటానికి ఒప్పుకోలేదు.

ఇదేమిటండీ కొత్త అలవాటు? ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఇచ్చేవారు?”.........

అమ్మ దగ్గరే!

ఆమె దగ్గరే ఇవ్వండి. నేను వచ్చినందు వలన ఆవిడ్ని మర్చిపోతారా? అత్తయ్య దగ్గరే ఇవ్వండి...ఆమే కదా పెద్దది?”

సూర్యా ఆశ్చర్యపోయాడు.

స్నేహితుల కథలను విన్నప్పుడు,

హోయ్...ఇంటింటి రామాయణం. మన కథ కూడా ఇలాగే అవుతుంది’' అని పెళ్ళికి ముందు అనుకున్న అతనికి ఇప్పుడు ఆనంద ఆందోళన. ఇంత మంచి బంగారమా నా భార్య?' అని పూరంచిపోయాడు.

అమ్మ దగ్గరకు వెళ్ళాడు. డబ్బులు అందించాడు.

ఏమిట్రా ఇది...సుజాత దగ్గర ఇవ్వచ్చు కదా. ఆమేరా ఇక మీదట యజమాని

నువ్వొక దానివమ్మా! దాని దగ్గరే ఇచ్చాను. వెంటనే అరిచింది. అత్తయ్యే కదా పెద్దది. ఆమె ఉన్నప్పుడు నా దగ్గర ఎలా ఇస్తున్నారు? ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఇచ్చారు అని అడిగింది.

మనసంతా రోజా పువ్వులా వాసన వేసింది. కోడల్ని పిలిచింది.

సుజాతా, నువ్వే ఆ డబ్బును తీసుకుని దాచిపెట్టమ్మా అన్నది.

లేదత్తయ్యా...మీ చేతుల్లోనే తీసుకోవాలి

సరే...నేను తీసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర నుండి నువ్వు తీసుకో. తీసుకు వెళ్ళి పూజ రూములో పెట్టి...దేవుడ్ని వేడుకుని బీరువాలో పెట్టు

సరే అత్తయ్యా

దేవుడా...మంచి కోడల్ని ఇచ్చి ఆశీర్వదించావయ్యా. అలాగే నా కొడుకు, కోడలు పిల్లా పాపాలతో దీర్ఘ ఆయుష్షుతో ఉండేటట్టు ఆశీర్వదించు స్వామీ అని చెప్పు కుంటూ అక్కడ్నుంచి కదిలింది.

తెలివైన భార్యే...నన్ను పిడికలిలో బిగించుకోకుండా, అమ్మని బిగించుకుంది! ఓకే, ఓకే...సమస్యలు లేకుండా ఉంటే చాలుసూర్యా చాలా ఆనంద పడ్డాడు.

ఆ రోజు సాయంత్రం హఠాత్తుగా సుజాత కళ్ళు తిరిగి పడిపోయింది. పుష్పవల్లి కలవరపడింది.

భర్తను 'ఆటో' పిలుచుకు రమ్మని, సుజాతను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళింది. డాక్టర్ పరొశోధించి చెప్పాడు.

"ఏమిటి పుష్పవల్లీ. నేను మగాడిని. దాని గురించి తెలియదు. నీకూనా...? ఇలా అందర్నీ హడావిడి పెట్టేశేవే!"

"క్షమించండి! హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతే, నేను బెదిరిపోయాను. దీని గురించి ఆలొచించలేదు"

సుజాత కడుపుతో ఉంది.

పుష్పవల్లి సంతోషానికి అవధుల్లేవు.

ఆ రోజు ఆదివారం.

భర్తను ఇంట్లో ఉంచేసి కోడల్ని, కొడుకుని తీసుకుని బయలుదేరింది.

నగల కొట్టుకు వెళ్ళింది.

"సుజాతా...నీకు ఏ డిజైన్ నచ్చిందో అది తీసుకో. సూర్యా, సుజాతకు సహాయం చెయ్యి"

"సరేనమ్మా"

వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, సుజాతను కన్నవాళ్ళు వచ్చున్నారు. పుష్పవల్లి ప్రేమగా కుశలం విచారించింది...గర్వంగా చెప్పింది.

"నా కోడలకు ఇప్పుడే కొనుకొస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. మీ అమ్మాయే సెలెక్ట్ చేసిన నెక్లస్..."

విజయలక్ష్మికి చాలా సంతోషంగా ఉన్నది.

"నా కూతురు పాడైపోలేదు!" అని చెప్పి కూతుర్ని దగ్గరకు తీసుకుంది.

కొడలు గర్భంగా ఉన్నదని తెలిసినప్పుడు అత్తగారి మనసు సంతోషంతో నిండిపోయింది.

"సుజాత ఏమేమి తినాలి...ఎలా ఉండాలి? అన్నీ నేర్పించండి"

"వదిన గారూ. ఇందులో నేను చెప్పాల్సింది ఏముంది? కని పెంచి మీ దగ్గర అప్ప జెప్పాను. ఇక అన్నీ మీరే"

"అలా చెబితే ఎలా? కన్న వాళ్ళకే తెలుసు పిల్ల గొప్పతనం"

"లేదండీ! నా కన్నా మీరే బాగా దాన్ని చూసుకుంటున్నారు. ఇందులో నేను వేరుగా చెప్పనవసరంలేదు.  మేము విషయం విని చూసి వెడదామని వచ్చాము"

పుష్పవల్లి నవ్వుతూ....

"ప్రశవానికి కూడా తీసుకు వెళ్లరా?"

"అదెలా తీసుకు వెడతాం? అప్పుడు కూడా మీ ఆదరణ ముఖ్యం. బిడ్డని కని...ఇక్కడికే కదా రావాలి. ఇదే కదా దాని ఇల్లు"

"చాలా సంతోషంగా ఉంది వదినగారూ! మీరు కన్న కూతుర్ని నాకు అప్పగించేశారు"

"పెద్ద మాటలు ఎందుకండి? అలా చూస్తే నా కూతురికి అత్తగారిగా లేకుండా...అమ్మలాగా ఉంటున్న మీకే నేను ధన్యవాదాలు చెప్పాలి"

ఈ సంభాషణంతా విన్న సూర్యా, సుజాతను చూశాడు. ఆమె ముఖం సిగ్గును కవచం చేసుకుంది.

ఆమె చెవుల దగ్గరకు వచ్చి గుసగుస లాడాడు.

"మీ అమ్మలాగా ఒక్కొక్కరూ తమ కూతుర్లను పెంచితే...మగవాళ్ళందరూ, పెళ్ళి తరువాత కలవర పడకుండా ఉంటారు"

సుజాత తన తల్లిని గర్వంగా చూసింది.

***************************************************సమప్తం*******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)