మలుపు…(కథ)
మలుపు (కథ)
“రాజేష్ ఏం చెబుతున్నావు...నిజంగానా?”--ఆశ్చర్యపడుతూ అడిగింది భువనా.
“నిజంగానే చెబుతున్నా. మనం స్నేహితులుగా విడిపోదాం. నువ్వు నన్ను మర్చిపోయి, మీ పెద్దలు చూసి నిర్ణయించిన అతన్నే మనసారా భర్తగా అంగీకరించి అతనితో జీవించు. నేనూ నిన్ను మర్చిపోయి నన్ను నమ్మి వచ్చే అమ్మాయిని మనస్ఫూర్తిగా అంగీకరించి జీవిస్తాను”....ఖచ్చితంగా చెప్పాడు రాజేష్.
“అంటే మన ప్రేమ ఓటమి అయ్యిందని చెబుతున్నావు. అంతే కదా...? మనం నవ్వుతూ హాయిగా మాట్లాడుకున్నవి, ఇద్దరం కలిసి ఊరంతా తిరిగింది అంతా మర్చిపోగలమా? రాబోవు జీవితం, పిల్లల గురించి మాట్లాడుకున్నదంతా కలగా మిగిలి పోవలసిందేనా?” -- కోపంగా అడిగింది భువనా.
రాజేష్ ప్రేమికురాలు భువనాతో ఎందుకలా చెప్పాడు? ఎవరైనా ప్రేమించుకునేది కలిసి జీవించటానికే కాదా? ఇంతలో ఏమైంది? ప్రేమికురాలు భువనా ఎలా రియాక్ట్ అయ్యింది?----తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
*****************************************************************************************************
“రాజేష్
ఏం
చెబుతున్నావు...నిజంగానా?” -- ఆశ్చర్యపడుతూ
అడిగింది
భువనా.
“మొదట నేను
చెప్పేది
అర్ధం
చేసుకో.
మనిద్దరం
మనసారా
మాత్రమే ఒకటాయ్యాం.
శరీరకంగా
కాదు.
పెళ్ళి
అనేది
ఇద్దరు
శరీరాలతో
ఒకటవబోతున్నారనేది
నలుగురికీ
తెలపటానికి
జరిగే
ఒప్పంద
కార్యక్రమం”
"మనసారా
ఒకటవ్వటం
అంటే
కూడా
పెళ్ళి
చేసుకున్నట్లే…దీన్ని ఖాయం చేయటమే పెళ్ళి అనే కార్యక్రమం"
"ఎంతో
గొప్ప
చదువు
చదువుకున్నావు...పెళ్ళి
అనే
కార్యక్రమం
గురించి
నీకున్న
అవగాహన
ఇంతేనా? మనసారా
ఒకటవ్వటం
అంటే
కూడా
పెళ్ళి
చేసుకున్నట్లే
అంటున్నావే, మనసారా
ఒకటైన
వాళ్ళల్లో
ఎంతమంది
పెళ్ళి
పీటలు
ఎక్కుతున్నారు? అలా
పెళ్ళి
పీటల
మీదకు
ఎక్కలేని
ప్రేమికులు
ఏం
చేస్తున్నారు? ఏది
దొరికితే
అదే
చాలని
అడ్జస్ట్
చేసుకుని
బ్రతకటం
లేదా? పెళ్ళి
అనేది
సమాజం
ఒక
ఆడ,మగ
కలిసి
బ్రతకటానికి
ఇచ్చే
లైసన్స్.
ప్రేమించుకున్న
వాళ్ళు
పెళ్ళి
చేసుకునే
తీరాలి
అంటే, మన
దేశంలో
శ్మశానాలకు
చోటు
ఉండదు"
"రాజేష్, నీ
మాటలు
వింటుంటే
నువ్వు
ప్రేమను
సీరియస్
గా
తీసుకో
లేదని
అర్ధమవుతోంది.
అలాంటప్పుడు
నువ్వు
ఎందుకు
నన్ను
ప్రేమించావు? ఎన్నోసార్లు
మనిద్దరం
మన
పెళ్ళి
గురించి
మాట్లాడుకున్నాం.
ఆ
మాటలకు
అర్ధం
ఏమిటి? మగవారు
ప్రేమను
టైం
పాస్
కోసం
వాడుకుంటున్నారనా? మేమలా
ప్రవర్తించం.
ప్రేమించటం
మొదలుపెడితే, సిన్సియర్
గా
ప్రేమిస్తాం, ప్రేమించినవాడినే
పెళ్ళి
చేసుకుంటాం.
మనసులో
ఒకర్ని
పెట్టుకుని, ఇంకొకరిచేత
తాలి
కట్టించుకోలేము"
"ఇవన్నీ
సినిమా
డైలాగులు
భువనా
"
"ఇక
నీతో
ఆర్గ్యూ
చేసి
లాభం
లేదు.
నా
ఈ
ప్రశ్నకు
మాత్రం
సమాధానం
చెప్పు.
ఇప్పుడు
నన్ను
ఎందుకు
వద్దనుకుంటున్నావు?"
"మన పెళ్ళి
జరుగుతుందనే
నమ్మకం
నాకు
లేదు.
గొడవులు
పడి, బంధుత్వాలాను
వదులుకుని
పారిపోయి
పెళ్ళి
చేసుకోవటం
నాకు
ఇష్టం
లేదు.
దాని
వలన
మనిద్దరం
ప్రశాంతంగా
జీవించలేము.
అందుకే
చెబుతున్నా
మనం
విడిపోదామని"
“ఈ కథలన్నీ
వద్దు.
చెప్పాలనుకున్నది
మాత్రం
సూటిగా చెప్పు”
“మనం స్నేహితులుగా
విడిపోదాం.
నువ్వు
నన్ను
మర్చిపోయి, మీ
పెద్దలు
చూసి
నిర్ణయించిన
అతన్నే
మనసారా
భర్తగా
అంగీకరించి
అతనితో
జీవించు.
నేనూ
నిన్ను
మర్చిపోయి
నన్ను
నమ్మి
వచ్చే
అమ్మాయిని
మనస్ఫూర్తిగా
అంగీకరించి
జీవిస్తాను”
“అంటే మన
ప్రేమ
ఓటమి
అయ్యిందని
చెబుతున్నావు.
అంతే
కదా...? మనం
నవ్వుతూ
హాయిగా
మాట్లాడుకున్నవి, ఇద్దరం
కలిసి
ఊరంతా
తిరిగింది
అంతా
మర్చిపోగలమా? రాబోవు
జీవితం, పిల్లల
గురించి
మాట్లాడుకున్నదంతా
కలా?” -- కోపంగా
అడిగింది.
“కోపగించుకోకు భువనా.
మొదట్లో
కొంచం
కష్టంగానే
ఉంటుంది.
పోను, పోనూ
కుటుంబంతో
కలిసిపోయి
పాత
ప్రేమంతా
కనుమరుగవుతుంది”
“నీ వల్ల
అవుతుందా...అవుతుందని
నమ్ముతున్నావా?”
“నేను చిన్న
వయసులోనే
నాన్నను
పోగొట్టుకున్నాను.
నాన్న
లేని
లోటును అమ్మ
ప్రేమ, అభిమానంతో
నాన్నను
మర్చిపోయేలా చేసింది. ఆమె
నన్ను
పెంచటానికి
చాలా
కష్టపడింది.
ఇప్పుడు
ఆమె
తాను
చూసిన
అమ్మాయినే
నేను
పెళ్ళి
చేసుకోవాలని
ఆశపడుతోంది.
తన
కోరికను
నెరవేర్చమని
వేడుకుంటోంది.
అమ్మకు నేను
ఎంతో
రుణపడి
ఉన్నాను.
నా
తల్లి
నాకోసం
చేసిన
త్యాగాన్ని నేను
మర్చిపోలేకపోతున్నాను.
ఇది
తప్పా? మనం
విడిపోవటం
తప్ప
ఇంకేమీ
తోచటం
లేదు.
నన్ను
మన్నించి
మరిచిపో
భూవనా”....అన్నాడు రాజేష్.
“చాలు...ఆపు.
ఈ
చెట్టు
కింద
జ్ఞానోదయం
నన్ను
ప్రేమించటానికి
ముందు
రాలేదా? ఇలాంటి
మగవాళ్ళకు
ఆడపిల్లలు
ఒక
ఆడుకునే
బొమ్మలయిపోయారు.
ప్రేమించటం...తరువాత
ఆమెకంటే
డబ్బుగల
ఇంకొక
అమ్మాయి
దొరికితే
ప్రేమను
దూరంగా
పారేయడం.
ఛీఛీ...నువ్వొక
స్వార్ధ
పరుడివి.
నీకు
ఎవరైనా
డబ్బుగల
అమ్మాయి
దొరికుంటుంది.
అదే
నిజం.
నిన్ను అర్ధం
చేసుకోకుండా
ఇన్నాళ్ళూ
నిన్ను
ప్రేమించిన
నేను
ఒక
మూర్ఖురాలిని. నాన్న
చూసిన
మంచి
సంబంధాలను
కాదన్న
దానికి
నాకు మంచి
శిక్ష
దొరికింది"
-- కోపంగా వెళ్ళిపోయింది
భువనా.
ఇంట్లో మనోభారంతో
కూర్చోనున్నది
భువనా.
‘ప్రేమించి
మొసం
చేసేడే
పాపాత్ముడు’
-- మనసు కుమిలిపోయింది.
“భువనా, ఒక
కొత్త
సంబంధం
వచ్చింది.
మంచి
కుటుంబం.
పెళ్ళి
చూపులకు
రమ్మని
చెప్పనా?” -- తడబడుతూ
అడిగాడు
తండ్రి.
“సరే నాన్నా.
మీరు
ఇష్టపడినట్లే
చేయండి”
ఇంటి ముందు
కారు
వచ్చి
ఆగింది.
భువనా
తల్లి-తండ్రులు ఇంటి వాకిటికి
వెళ్ళి
వచ్చిన
వారిని
స్వాగతించారు.
“అమ్మాయిని రమ్మని
చెప్పండి” అన్నారు పెళ్ళికొడుకు
తండ్రి.
భువనా
హాలులోకి
వచ్చింది.
వచ్చిన
వాళ్ళను
ఒకసారి
చూసింది.
"చూడమ్మాయ్ నేను
పెళ్ళికొడుకు
తండ్రిని, ఈమె
తల్లి, ఆయన
బాబాయి, ఆవిడ
పిన్ని...మా
అందరిలోకి
చిన్నవాడే
మా అబ్బాయి,పెళ్ళికొడుకు. బాగా
చూసుకో"
పెళ్ళికొడుకు
తండ్రి
అందరినీ
పరిచయం
చేసాడు.
అబ్బాయికి
చాలా
సంతోషం.
అందరికీ నమస్కరించి
ఒక
పక్కగా
వెళ్ళి
నిలబడింది
భువనా.
“మాకు అమ్మాయి
నచ్చింది...మిగిలిన
విషయాలు
మాట్లాడుకుందామా?”
“ఒక్క నిమిషం
నేను
మాట్లాడొచ్చా?” -- అడిగింది
భువనా.
“సరేనమ్మా...అబ్బాయితో
మనసు
విప్పి
మాట్లాడటం
ఈ
కాలంలో
సహజం. దారాళంగా
మాట్లాడు.
తరువాత
మేము
మాట్లాడుకుంటాం” -- అన్నారు
అబ్బాయి
తండ్రి.
“నేను మాట్లాడాలని
చెప్పింది
మీ
అబ్బాయితో కాదు.
మీ అందరితోనూ.
ఎందుకంటే
మీ
అందరికీ
ఒక
విషయం
చెప్పాలి.
అది
విన్న
తరువాత
ఈ
పెళ్ళి
గురించి
డిసైడ్
చేయండి”
ఆశ్చర్యంగా చూశారు
అందరూ.
“నేను ఒకతన్ని
రెండు
సంవత్సరాల నుండి ప్రాణానికి ప్రాణంగా
ప్రేమిస్తున్నాను.
ఇద్దరం
పిచ్చుకల్లాగా
చెట్టాపట్టా
లేసుకుంటూ
ఊరు
ఊరంతా
తిరిగాము.
హఠాత్తుగా
ఒక
రోజు
'నాకు
నాన్న
లేరు.
చిన్నప్పుడే
చనిపోయారు.
అమ్మ
నన్ను
కష్టపడి
పెంచింది.
నా
తల్లి
ఆశకు
విరుద్ధంగా
నేను
నడుచుకోలేను
అంటూ
మొసలికన్నీరు
వదిలి
మనం విడిపోదాం అని నా నెత్తిన ఒక బాంబు పడేసాడు. మంచికాలం...నేను
హద్దు
మీరలేదు.
కానీ, వాడికి
నాన్న
ఉన్నారు.
అబద్ధం
చెప్పి
నన్ను
మొసం
చేసాడు.
మీరే
చెప్పండి...ప్రేమిస్తున్నాను
అని
చెప్పి
మోసం
చేసిన
పాపాత్ముడి
పైన
పగ
తీర్చుకోవాలనే
పరిస్థితిలో
నేను
ఉన్నాను.
మనసంతా
పగ
నిండిన
నన్ను
మీ
అబ్బాయి
పెళ్ళి
చేసుకుంటాడా? అతనితో
నేను
ప్రశాంతంగా
జీవించగలనా?”
అందరూ మరో
మారు
ఆశ్చర్యపోయారు.
కొడుకును చూసాడు
తండ్రి.
కోపం
ఎక్కువవటంతో
ఉద్రేకంగా
కూర్చున్నాడు
అతను.
మెల్లగా
అందరూ
లేచారు.
“ఒక నిమిషం
ఆగండి.
నన్ను
ప్రేమించిన
ఆ
అబ్బాయిని
మీరందరూ
చూడద్దా? కష్టపడి
వెతకక్కర్లేదు.
ఇదిగో
ఈ
రోజు
నన్ను
పెళ్ళిచూపులు
చూడటానికి
వచ్చిన
మీ
అబ్బాయే
నేను
ప్రేమించిన
అతను.
బ్రతికున్న
తండ్రిని
చనిపోయాడని నాటక
మాడిన
ఈ
అతి
తెలివి
రాక్షసుడే, ఈ
రోజు
నన్ను
చూడటానికి
వస్తున్నట్టు
బయట
పెట్టకుండా
మిమ్మల్ని
ఎలా
మొసపుచ్చాడో
చూడండి?
హలో మిస్టర్
రాజేష్.
నీ
గోపికాలీలలను
ఆపి, ఇకమీదటైనా
మంచి
వాడుగా
మారు” అని చెప్పి
లోపలకు
వెళ్ళింది
భూవనా.
************************************************సమాప్తం*********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి