నిజాయతీ పెళ్ళాం…(కథ)


                                                                        నిజాయతీ పెళ్ళాం                                                                                                                                                               (కథ)

హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు--వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. 

ఈ మధ్య కాలంలో ఈ తొలిఘట్టం లోనే వధువు -- వరుడు వేరుగా వెళ్ళి, మాట్లాడుకుని వాళ్ళిద్దరి అభిప్రాయలు పంచుకుంటారు. ఈ పెళ్ళి చూపుల తొలిఘట్టం తరువాత 

వధువు ఇంట్లో నిశ్చితార్దం పెట్టుకుంటారు. ఆ తరువాత హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని గాఢంగ నమ్ముతారు........

కానీ ఈ మధ్య ఎవరూ ఈ సాంప్రదాయాన్ని పట్టిచుకోవటం లేదు. నిశ్చితార్ధానికీ-పెళ్ళికీ మధ్య ఉన్న కాలంలో వదువు-వరులు సెల్ ఫోన్లలో మాట్లాడుకోవటం, ఇంకొంచం పైకెడితే పెళ్ళికి ముందే ఇద్దరూ బయట తిరగటం జరుగుతోంది. 

దీనిని పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పెళ్ళికి ముందే బయట తిరిగే వధువు-వరులలో కొంతమందికి అభిప్రాయ భేదాలు ఏర్పడి, నిశ్చితార్ధాం చేసుకున్న తరువాత కూడా కుదుర్చుకున్న పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. 

ఇది అందరూ ఆలొచించవలసిన విషయం.......అలాంటిదే ఈ కథలో కూడా ఒక విషయం జరుగుతుంది. అంటే పెళ్ళి చూపులు, నిశ్చితార్ధాం అయిన తరువాత. పెళ్ళి కొడుకు తాను చేసుకోబోయే వధువుకు పరీక్ష పెడెతాడు.  

ఆ పరీక్ష ఏమిటీ? ఆ పరీక్షలో వధువు పాస్ అయ్యిందా? ఎలా పాస్ అయ్యింది?  ఆమె ఏం చేసింది?.......తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.   

                                                                      **********************************

మురళి తన పెళ్ళి పత్రిక ఇస్తుంటే అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు.

ఉండదా మరి...?

నాలుగైదు చోట్ల పెళ్ళి చూపులకు వెళ్ళోచ్చి...అందులో కొంతమందిని ఓకే చేసిన తరువాత సడన్ గా ఓకే చేసిన వారందరినీ వద్దని నిరాకరించాడు మురళి.

ఒకమ్మాయితో పెళ్ళి కుదుర్చుకుని, ముహూర్తం కూడా ఖాయం చేసుకున్న తరువాత, అమ్మాయిని కూడా చేసుకోనని చెప్పి పెళ్ళి క్యాన్సల్ చేశాడు. ఇది చాలా తప్పురా అని ఎంతమంది చెప్పినా ఒప్పుకోలేదు.

అలా ఎందరో అమ్మాయలను చూసి, మొదట ఓకే చేసి తరువాత వద్దు అనడానికి కారణమేమిటని అందరూ అడిగారు. ఎవరికీ కారణం చెప్పని మురళి తన ప్రాణ స్నేహితుడు కిరణ్ కి మాత్రం రోజు కారణం చెప్పాడు.

"పోయిన వారం పెళ్ళి చూపులకు వెళ్ళానే... అమ్మాయి బాగుంది. నాకు అన్ని విదాలా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. తరువాత ఒక రోజు వాళ్ళ ఆఫీసుకు వెళ్ళాను. నన్ను గుర్తుపట్టి పలకరింపుగా నవ్వింది. మాట్లాడాను. సినిమాకు వెడదాం రమ్మని అడిగాను....వెంటనే వస్తానని ఒప్పెసుకుంది..."

"ఇంకేరా...నీ మాటకు గౌరవం ఇచ్చింది కదా...మరి అలాంటి అమ్మాయిని ఎందుకు వద్దన్నావు?"

ఎంత పెళ్ళి చేసుకోబోతున్న వాడినైనా, అలా పిలిచిన వెంటనే వచ్చే అమ్మాయి....ఇదేలాగా ఇంకొకడితో ఊరు తిరిగుండదని ఏమిటి నమ్మకం. అందుకే అమ్మాయిని చేసుకోనని చెప్పాను"

ఇంతకు ముందు ఓకే చెప్పి తరువాత వద్దన్నావే ...వాళ్లను కూడా ఇలాంటి కారణానికేనా"

"ఇంచుమించు"

"రేయ్ అయితే జన్మలో నీకు పెళ్ళి కుదరదురా"

"అందరూ ఇలాంటి అమ్మాయిలే ఉంటారా ఏమిటి"

"నేను చెప్పింది అమ్మాయల గురించి కాదునీ అనుమాన స్వభావం గురించి"

"ప్రాణ స్నేహితుడివైన నువ్వు కూడా నన్నే శపిస్తున్నావా?' అంటూ స్నేహితుడు కిరణ్ పై కోపగించుకుని వెళ్ళిపోయాడు మురళి.

అలాంటి మురళి సారి చూసిన అమ్మాయి బాగా నచ్చిందని, పెళ్ళి పత్రికతొ పిలవటానికి రావటం మరి అందరినీ ఆశ్చర్యంలోకి తోయదా?

" సారి పెళ్ళికి ఓకే చెప్పటమే కాకుండా, పెళ్ళి పత్రిక వరకు వచ్చావు...ఎలా" అని ప్రాణ స్నేహితుడు కిరణ్ అడిగినప్పుడు "నేను పెట్టిన పరీక్షలో అమ్మాయి గెలిచింది" అన్నాడు మురళి.

                                                                    ***********************************

పెళ్ళి జరిగింది... రోజు మురళికి ఫస్ట్ నైట్.

నర్మదా, మన దాంపత్య ప్రయాణాన్ని మొదలు పెట్టటానికి ముందు నీ నుండి నాకు ఒక విషయం తెలియాలి...అఫ్ కోర్స్, అది నీ మంచి గుణం గురించేననుకో...పెళ్ళికి ముందు నేను ఎంత బలవంతం చేసినా నాతో సినిమాకు రానంటే రానన్నావు... ఎందుకు అలా చెప్పావో నాకు తెలుసుకోవాలనుంది

"పెళ్ళి చూపులకు వచ్చి, మేము నచ్చామని చెప్పి, పెళ్ళి కాయం చేసుకుని, ముహూర్తాలు పెట్టుకున్న తరువాత కొందరు మొగవారు ఏవో కారణాలు చెప్పి పెళ్ళి క్యాన్సిల్ అని చెబుతున్నారు" చెప్పింది నర్మద.

"నేనడిగిందేమిటి...నువ్వు చెప్పేదేమిటి" అన్నాడు మురళి

"మీకు అర్ధమయ్యేటట్టు చెబుతా వినండి. మధ్య నా స్నేహుతురాలికి పెళ్ళి నిశ్చయమయ్యింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. అనుకోకుండా ఒకరోజు ఆమెను పెళ్ళి చేసుకోబోతున్న పెళ్ళికొడుకు ఆమెను సినిమాకు పిలిచాడు. రానని చెబితే ఎక్కడ కోపగించుకుని పెళ్ళి కాన్సిల్ అంటాడేమోనని భయపడి అతనితో సినిమాకు వెళ్ళింది. దాన్ని తప్పుగా చెప్పి పెళ్ళి ఆపేశాడు"

"అవునా?!" ఆశ్చర్యం నటించాడు మురళి.

అవునండి. నాకు కూడా అదేలాగనే జరిగింది. నన్ను పెళ్ళి చూపుల్లోనే ఓకే చెప్పేసి, ముహూర్తాలు కూడా పెట్టుకున్న తరువాత...ఒక రోజు అతను ఫోన్ చేసి బీచ్ కి వెడదాం రమ్మన్నాడు. పెళ్ళికాబోయే వాడితోనేగా వెళ్లేది అనుకుంటూ నేనూ వెళ్లాను. అది తప్పుట. పెళ్ళి కాన్సిల్ చేశాడు...అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. పెళ్ళి కుదిరినా, ముహూర్తం పెట్టినా...పెళ్ళి చేసుకోబోతున్న మొగాడితో పెళ్ళికి ముందు ఎక్కడికీ వెళ్ళ కూడదు. అసలు మాట్లాడనే కూడదు...అందరు మొగవాళ్ళూ అల్లగే ఉంటారని నేనడం లేదు. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. అందుకే రోజు మీరొచ్చి ఎంత బ్రతిమిలాడినా రానని చెప్పాను" అన్నది నర్మద.

మురళి ముఖం వాడిపోయింది. తన చేష్టలకు సిగ్గుపడ్డాడు. తప్పు తెలుసుకున్నాడు.

***********************************************సమాప్తం******************************************                                                                                  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పువ్వులో ఒక తుఫాన...(కథ)

పేగు తెగినా ప్రేమ తెగదు…(కథ)

ఈ ధోరణి వద్దు...! (కథ)