నాకని ఒక చిరునామా…(కథ)
నాకని ఒక చిరునామా (కథ)
నేను
ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను. కానీ, ఈ రోజు రాత్రిలాగా నన్ను కష్ట పరచిన రాత్రి
ఇంకేదీ లేదు. నన్ను ముట్టుకోకుండానే -- నన్ను ఎక్కువగా గాయపరిచిన మగాడివి
నువ్వుగానే ఉంటావు.
ఆడదాని
వాసనే పడకుండా నువ్వు కాలం గడిపావు! ఏమయ్యా...మనిద్దరం కలిసి ఎందుకు ఒకటిగా జీవించ
కూడదు...?
ఇలా
అడుగుతున్నానని నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు! నిన్ను లేబుల్ గా ఉంచుకుని
నేను మళ్ళీ మురికి ఊబిలోకి, వీధిలోకి వెళ్ళిపోతే ఎం చేయను అని అనుమానపడొద్దు.
నాకని ఒక చిరునామానే నాకు ఇప్పుడు కావాలి. ఉత్త బెడ్ రూం సుఖం కాదు!...దీని
గురించి తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.
*********************************
ఆమెను తల ఎత్తి చూసినప్పుడు
నేను ఆశ్చర్యపోయాను.
“ఈమా...?”--
నేను నమ్మలేకపోయాను.
బద్రత కోసం వచ్చున్న పోలీసుల దగ్గర అనుమతి తీసుకుని ఆమె దగ్గరకు చేరుకున్నాను.
“నువ్వు...నువ్వు... మానసానే
కదా...?”
ఆమె తలెత్తి నన్ను
చూసింది.
“ఏయ్ మనోహర్...నువ్వెలా
ఇక్కడ...?” ఆమె మామూలుగా నన్ను విచారించింది.
“నేను
ఈ న్యాయస్థానంలోనే రైటర్ గా ఉన్నాను! నువ్వు...” ప్రశ్న
అడగడానికే సంకోచించాను.
“నువ్వెలా
ఈ గుంపులో చిక్కుకున్నావు అని అడుగుతున్నావా...?
ఎందుకు
సంకోచపడుతున్నావు...? ప్రాస్టిట్యూషనే...ఈ రోజు పట్టేశారు! ఏముంది మూడు నెలలో లేక
ఆరు నెలలో...? అంతా అలవాటైపోయింది!” ఆమె చాలా సహజమైన రీతిలో చెప్పింది.
“నువ్వు
జైలుకా...?”-- నేను షాకైయ్యాను.
“మరి...చేసిన
తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే కదా? అరే...నువ్వెందుకు బాధపడుతున్నావు! నేనే చెప్పాను
కదా...నాకు అలవాటైపోయిందని! బయట ఉంటే నేను ఏం చేస్తాను...?
మళ్ళీ ఇదే
పనే...ఇలాంటి పరిస్థితే!”--చెప్పి నవ్వింది.
ఆమె నవ్వులో ఉన్నది
విరక్తా? లేక నిరుత్సాహమా?
నాకు ఆమెను చూస్తే ‘అయ్యో పాపం’ అనిపించింది. కాలేజీలో చదువుకునేటప్పుడు ఎంత చలాకీగానూ,
ఉత్సాహంగానూ
ఉండేది...ఈ రోజు ఇలా నాశనం అయిపోయిందే...? ఆమె అనుమతి లేకుండానే ఒక అడ్వకేట్ ను కలిసాను. ఆమె విడుదలకు
ఎటువంటి ఏర్పాట్లు చెయ్యాలో...అన్నిటినీ చేశాను.
నా ఉద్యోగ టైము
ముగిసిన వెంటనే ఆమె దగ్గరకు వచ్చాను.
“నీ
ఇల్లు ఎక్కడా?”
“ఊర్లో ఉండే సగం ఇళ్ళు నావే. ఏ ఇల్లు అడుగుతున్నావు?”
నాలో కోపం మెల్లగా
తల ఎత్తింది.
“మానసా,
ఒకటి చెబుతాను
వింటావా?”
“ఏమిటది?”
“మొదట ఇలా మాట్లాడడం ఆపుతావా?”
ఆమె కాసేపు మౌనంగా
ఉన్నది. గబుక్కున మొహం వాడిపోయింది. కళ్ల చివర్లో కన్నీటి చుక్కలు.
“నన్ను
ఏం చెప్పమంటావు మనోహర్...? కాలేజీలో చదువు కుంటున్నప్పుడు -- నిన్ను లెక్క చేయకుండా
పొగరుతో తిరుగుతూ ఉన్నాను. కానీ ఆకలికి తిండి లేకపోవటం లాంటి పేదరికం,
బద్రతలేని యౌవన వయసు
ఒకమ్మాయికి వచ్చి చేరితే...ఇలా నాలాగానే అయిపోతుంది! నీకు తెలుసా?
ఇలాంటి ఒక పరిస్థితి
నాకు వచ్చినప్పుడు -- నా యొక్క పొగరో--ధైర్యమో--నా చదువో...ఏదీ నన్ను కాపాడేంత
శక్తి కలిగిందిగా లేకుండా పోయింది!
వేరే దారి లేక అన్నీ
ఒకటిగా కలిసి నన్ను ఈ మురికి ఊబిలోకి తోసింది! అప్పట్నుంచి ఇప్పటికీ నావల్ల ఆ
మురికి ఊబిలో నుండి బయటకు రాలేకపోతున్నాను...దీని కొసం ఎవరి దగ్గరకు వెళ్ళి
ప్రాధేయపడేది...?”
ఆమె మాట్లాడేసి
కళ్ళు తుడుచుకుంది.
నేను మౌనంగా
ఉన్నాను. ఆమె కూడా మౌనంగానే ఉన్నది.
“భోజనం
చేశావా?"
మాట మార్చాలని అడిగాడు.
“లేదు
మనోహర్!”
“సరి
రా...వెళదాం!” లేచి నడిచాను.
ఆమె నా వెనుకే
నడిచింది. ఇద్దరం ఒక రెస్టారెంటుకు వెళ్ళి తిన్నాము. ఆ తరువాత ఆమెను పిలుచుకుని మా
ఇంటికి వచ్చాను.
“ఏమిటి
మనోహర్...నీ ఇంట్లో ఎవరూ కనిపించటం లేదు...?”
అప్పుడు నా దగ్గర
మౌనం.
“ఊరికి
వెళ్ళారా...?” ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనబడింది.
“.........................”
“దాని
కోసమే నన్ను తీసుకు వచ్చావా...? చెప్పు...నీకు నేను కావాలా...?”
“ఛీ ఛీ...నోరు ముయ్యి...” -- నేను కోపగించుకున్నాను.
నన్ను అర్ధం చేసుకోలేక
ఆమె తడబడింది.
“నేను
నువ్వనుకునే మనిషిని కాదు! నాకు...ఇంకా పెళ్ళి కాలేదు...”
ఆమె దగ్గర చిన్నదిగా
ఒక షాక్ ఏర్పడింది.
“కాలేజీ
చదువు ముగించిన తరువాత నేను ఎక్కువగా ఉద్యోగం కొసం తిరగలేదు! త్వరగానే ఈ ఉద్యోగం
దొరికింది. కానీ...” నేను సంకోచించాను.
“చెప్పు
మనోహర్...ఏదైనా ప్రేమ ఓటమా?”
“నా తలకాయ...” -- పెద్ద నిట్టూర్పు విడిచాను.
“అనుకోకుండా
ఒక యాక్సిడెంటులో చిక్కుకున్నా...అందులో ఒక మగాడు దేనినైతే కోల్పో కూడదో -- అది
కోల్పోయాను. ఒక అమ్మాయికి భర్తగా ఉండే అర్హత నాకు లేదు మానసా. అందువలనే నేను ఇంతవరకు
పెళ్ళి చేసుకోలేదు!”
ఆమె నన్ను జాలిగా
చూసింది.
“సారీ
మనోహర్...నిన్ను పోయి తప్పుగా అనుకున్నాను...”
“పరవాలేదు
మానసా...! నువ్వెళ్ళి పడుకో! రేపు నీకు ఉద్యోగానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఆ మురికి ఊబి జీవితం నీకొద్దు...ఏమంటావ్?”
అంటూ,
ఆమెను గదిలో
పడుకోమని నేను బయట వరాండాలో పడుకున్నాను.
తెల్లవారు జామున.
అలారం మోగుతున్న
శబ్ధం విని లేచాను.
అలారం నా తలకు దగ్గర
పెట్టుంది. దాని కింద ఒక లెటర్.
“హాయ్
మనోహర్
గుడ్ మార్నింగ్!
నేను ఎన్నో రాత్రులు
నిద్రపోకుండా గడిపాను. కానీ, ఈ రోజు రాత్రిలాగా నన్ను కష్ట పరచిన రాత్రి ఇంకేదీ లేదు..
నన్ను
ముట్టుకోకుండానే -- నన్ను ఎక్కువగా గాయపరిచిన మగాడివి నువ్వుగానే ఉంటావు...ఛీ...చాలా
పాపం నువ్వు!
ఆడదాని వాసనే
పడకుండా నువ్వు కాలం గడిపావు! ఏమయ్యా...మనిద్దరం కలిసి ఎందుకు ఒకటిగా జీవించ
కూడదు...?
మనోహర్...ఇలా
అడుగుతున్నానని నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు! నిన్ను లేబుల్ గా ఉంచుకుని
నేను మళ్ళీ మురికి ఊబిలోకి, వీధిలోకి వెళ్ళిపోతే ఎం చేయను అని అనుమానపడొద్దు.
నాకని ఒక చిరునామానే
ఇప్పుడు నాకు కావాలి. ఉత్త బెడ్ రూం సుఖం
కాదు! అది నాకు ఆల్రెడీ విరక్తి పుట్టేసింది...!
నన్ను మళ్ళీ ఆ
మురికి కాలవలో పడకుండా కాపాడాలని నువ్వు తలుచుకుంటే మాత్రమే ఇది జరుగుతుంది.
దానికి సరైన దారి ఇదొక్కటే అని నేను అనుకుంటున్నా.
స్త్రీ అంటే
నంచుకోవటానికీ, పడుకోవటానికీ మాత్రమేనా?
లేదయ్యా...ఒక్కొక్క మగాడికీ స్త్రీ తోడు అనేది తప్పక కావలసిందే!
స్త్రీ అనేది ఉత్త భొగానికి మాత్రమేనా? లేదయ్యా...ఆమె అంతకంటే గొప్పది. స్త్రీ అనేది ఒక దీపారాధన
కుందె లాంటిది. ఇంట్లో అదుంటే ఆ ఇంటికి ఒక గౌరవం వస్తుంది. ఆమెకూ అదే న్యాయమైన
గౌరవం.
నాలాగా ఇంట్లో
లేకుండా వీధిలో నిలబడే అమ్మాయికే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంది. ఎలాగంతా ఒక
స్త్రీ జీవించకూడదో, అలాగంతా జీవించాను.
ఏమిట్రా ఇది పెద్ద
గోలగా తయారైయ్యింది! వూరికే పోతున్న పామును తీసి జేబులో వేసుకున్నామే అని అనుకోకు.
నీకు ఇష్టం లేకపోతే వద్దు. నిన్ను ట్రబుల్ చెయ్యాలనో,
నీకు భారంగా
ఉండటానికో నాకు ఇష్టం లేదు. నా ఆశను చెప్పాను.
నన్ను నువ్వు
నమ్మితే.
నన్ను నీ తోడుగా
అంగీకరిస్తే...
ఒక్క పిలుపు పిలు.
బెడ్ కాఫీ తీసుకుని వస్తాను. నేను వద్దనో, నీకు ఇందులో ఇష్టం లేదనో నిర్ణయించుకుంటే...నువ్వే లేచి
వెళ్ళి నీ ప్రొద్దుటి వంట మొదలు పెట్టుకో!
మానసా.
లెటర్ను చదివేసి
కొద్ది సేపు భ్రమ పట్టిన వాడిలాగా కూర్చుండి పోయాను.
నేను సంబంధం
పెట్టుకోలేని వాడిని.
ఆమె సంబంధం అనే
దాంట్లో విసుగెత్తి పోయిన మనిషి.
మేము ఇక ఒకరికొకరు
తోడా...? అనుకుంటేనే
నవ్వు వస్తోంది.
జీవితంలో జరిగిపోయిన
కాలాన్ని పారేసుకున్న వారు, భవిష్యత్తు గురించిన కలలు,
జరుగుతున్న కాలంలో
ఒకటి అవటమా...?
ఏం?
చేరితే ఏమిటి?
ఒక్క క్షణం ఆలస్యం
చేశాను.
“మానసా...?”
మనసారా పిలిచాను.
ఆమెనా...? కాదు కాదు...నా జీవితాన్ని పిలిచాను.
*********************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి