నన్నుకాదు-నిన్ను/తలవంపు...(2 మినీ కథలు)

 

                                                                  నన్నుకాదు-నిన్ను/తలవంపు                                                                                                                                              (2 మినీ కథలు)

                                                                   నన్నుకాదు,  నిన్ను!...(మినీ కథ)

మధ్య ఆడపిల్లలను తల్లి-తండ్రులు అతిగారాబంతో , అల్లారుముద్దు పేరుతో ఆడపిల్లలు జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య పాఠాలైన వంటా వార్పు, పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇంటి పనులు చేయటం లాంటివి నేర్పకుండా ఉండటం వలన, వారు మెట్టినింటికి వెళ్ళినప్పుడు, లేక వాళ్ళు సొంతంగా కాపురం పెట్టినప్పుడు కష్టపడుతున్నారు. కుటుంబంలోని మిగిలినవారిని కూడా కష్టపె

డుతున్నారు. దీనివలన పూర్తిగా ఆనందంగా గడపవలసిన దాంపత్య జీవితాన్ని కష్టంగా గడుపుతున్నారు. కథలో అలాంటి ఒక తల్లికి, కూతురే పాఠం నేర్పుతుంది.

****************************************************************************************************

పలు సంవత్సరాలు అయిన తరువాత ఈశ్వరీని చూడటానికి ఆమె మామయ్యా, అత్తయ్య వచ్చారు. వాళ్ళ ముందు తన కూతురు స్వాతీ తలచూపకుండా ఉండాలే' అన్నదే ఈశ్వరీకి బాధగా ఉంది. ఇంట్లో ఒక పని చేయటమో,  పెద్దవాళ్ళకు గౌరవ మర్యాదలు ఇవ్వటమో స్వాతీకు తెలియదు. అంత అల్లారు ముద్దు.

వచ్చినవాళ్ళకు ఈశ్వరీనే టిఫిను, కాఫీ ఇస్తున్నప్పుడు స్వాతీ వచ్చింది. ఆశ్చర్యకరంగా స్వాతీ వచ్చిన పెద్దవాళ్ళకు నమస్కరించి, వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకుంది. ఈశ్వరీకి అతిపెద్ద షాక్. అది మాత్రమేనా? భోజనాలు  అయిన  తరువాత కంచాలు తీసి, చోటునంతా శుభ్రం చేసి, సుద్ది చేసింది. తరువాత అన్నీ పనులనూ తానుగా ముందుకొచ్చి చేసింది!?.

ఏమిటే సడన్ గా చేంజ్? వాళ్ళు నిన్ను పొగడాలనా ఇలా పనిచేస్తున్నావు?” సన్నని స్వరంతో అడిగింది జానకి. నిత్యా అప్పుడు సమాధానం చెప్పలేదు.

అత్తయ్య బయలుదేరే ముందు.

కూతుర్ని బాగా పెంచావే ఈశ్వరీ, కాలంలో చిన్న వాళ్ళను ముద్దు చేసి, బద్దకస్తులను చేస్తున్న తల్లుల మధ్యలో...నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉందే!" అని పొగడి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన తరువాత నిత్యా మాట్లాడింది.

ఇప్పుడు అర్ధమయ్యిందా? వాళ్ళు నన్ను పొగడాలని నేను పనులు చేయలేదు.  నిన్ను పొగడాలని, అభినందించాలనే పనులు చేసేను. ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడుకు వెళ్ళినా ఇలాగే బాధ్యతతో నడుచుకుంటాను. అందువలన నా గురించిన బాధ నీకు అనవసరం

ఇంకో విషయం చెప్పనా! కూతుర్లను బద్దకస్తులను చేసేది కాలం తల్లులే. మేమూ మీలాంటి ఆడవాళ్ళమే నన్న గుర్తు మీకు ఉండటం లేదు. మేము మీరు చేస్తున్న పనులలో సహాయం చేద్దామని ముందుకు వచ్చినా మమ్మల్ని మీ అర్ధంలేని అభిమానంతో అడ్డుకుంటున్నారు. ఇలా ఎవరైనా ఇళ్ళకు వచ్చినప్పుడు మీరు చేసిన తప్పును కప్పి పుచ్చి, నెపాన్ని మా మీదకు తోస్తున్నారు. మా అమ్మాయి ఒక్క పనీ చేయదు. అంతా నేనే చూసుకుంటానుఅని ఒక డైలాగు వేరే చెప్తారు...వద్దమ్మా మమ్మల్ని కూడా ఇంట్లో పనిచేయనివ్వండి, మీ భారాన్ని తగ్గించుకోండి, మా గురించి అనవసరమైన బాధ పడకండి అంటూ వెళ్ళిపోయింది.

నిత్యా చెప్పిన మాటలతో పూర్తిగా ప్రశాంతత చెందిన జానకి, తన కూతుర్ను చూసి సంతోష పడటమే కాకుండా, సిగ్గుపడటమూ, అవమానపడటమూ చెందింది.

****************************************************సమాప్తం*****************************************

                                                                           తలవంపు...(మినీ కథ)

కొందరు పెద్దలు తాము ఆస్తిపరులమనే అహంకారంతో, తమ కంటే తక్కువ అంతస్తు ఉన్న కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు తమ లేకితనాన్ని వారికే తెలియకుండా బయటపెడుతూ ఉంటారు. తలవంపుకు గురి అవుతూ ఉంటారు. కథలో అదెలా జరిగిందో తెలుసుకోండి.

*****************************************************************************************************

వర్షాని చూడటానికి పెళ్ళి చూపులకు వచ్చారు వరున్ కుటుంబీకులు. వర్షా తండ్రి శివరాం వాళ్ళను స్వాగతించి, కూర్చోమని చెప్పి ఉపచరణ చేసాడు.

ఎక్కువ అలంకారం లేకుండా దేవతలాగా వచ్చి నిలబడింది వర్షా.

పెళ్ళి చూపులు పూర్తి అయిన తరువాత, వచ్చిన వాళ్ళకు టిఫిన్ పెట్టారు.

తినడం పూర్తి అయిన తరువాత, మాట్లాడటం మొదలుపెట్టాడు ఆడపిల్ల తండ్రి.

మీ అంతస్తుకు నేను సరితూగే అంతస్తు లేనివాడిని. మాట ఇదివరకే చెప్పి పంపాను. అందువలన ఎక్కువగా నగలు, కట్నం, సారె, కానుకలు చెయ్యలేను.  కానీ, పెళ్ళి మాత్రం లోటూ లేకుండా బ్రహ్మాండంగా జరిపి పెడతాను. ఇల్లు నాకున్న ఒకే ఆస్తి. నా తదనంతరం ఇల్లు వర్షాకే సొంతం అన్నారు.

అయ్యా...మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మాకని సమాజంలో ఒక గౌరవం  ఉంది. నా కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. సొంత ఇల్లు, కారు ఉంది.

మా బంధువులు, నా కొడుకు స్నేహితులూ అంటూ చాలా మంది పెళ్ళికి వస్తారు.  పెద్ద కల్యాణ మండపంలో ఆడంబరంగా పెళ్ళి జరగాలనేది నా కొడుకు ఆశ. అతను ఎదురు చూసేది ఇక్కడ లేదు. క్షమించండి...మీ అమ్మాయికి వేరే మంచి వరుడు దొరకాలని విష్ చేస్తున్నాను అంటూనే లేచాడు వరున్ తండ్రి.

అంకుల్ ఒక్క నిమిషం అన్నది వర్షా.

క్షమించమ్మా...మా అబ్బాయిని చూసిన వెంటనే నీకు నచ్చుంటుంది. కానీ, నీకు మా ఇంటికి వచ్చి జీవించాలనే అదృష్టం లేదు. నీకొక మంచి భర్త దొరుకుతాడు. మనసును ధైర్యంగా పెట్టుకో

మీరు కూడా నన్ను క్షమించాలి అంకుల్’. నాకు నిరాశ లేదు. మీకంటే తక్కువ అంతస్తు కలిగిన వాళ్లతో సంబంధం కలుపుకుంటే మీ గౌరవానికి భంగం వస్తుందని చెబుతున్నారు. మీ అబ్బాయి లక్షల్లో సంపాదిస్తున్నాడని చెబుతున్నారు. మేము పేదవారిమే. కానీ, మీరు వచ్చిన కారుకు కూడా అద్దె డబ్బులు ఇవ్వటానికి మీకు మనసులేదు. మా నాన్నే ఇచ్చారు. అది తిరిగి ఇచ్చేరంటే బాగుంటుంది. టిఫిన్ కు డబ్బులు ఇవ్వక్కర్లేదు.

మీలాంటి అత్యాశను, అనవసర ఆడంబరాన్నీ ఇష్టపడే అల్పమైన మనుషులు నివసిస్తున్న ఇంటికి వచ్చి జీవించటం నాకూ ఇష్టం లేదు. మీరెప్పుడైతే  మీరొచ్చిన కారుకు అద్దె డబ్బుల్ను మా నాన్నను కట్టమన్నారో, అప్పుడే మీ సంబంధాన్ని వద్దనుకున్నాను. మాట నేను చెబుదామనుకునే లోపు మీరు మాట ఎత్తారు. ఇక మీరు బయలుదేరవచ్చు" అని చేతులెత్తి నమస్కరించి బయటకు వెళ్ళమన్నట్టు వాకిలివైపుకు చెయ్యి చూపింది వర్ష.

తలవంచుకుని ప్యాంటు జేబులో నుండి ఆరువందల రూపాయలు తీసి అక్కడున్న టీపా మీద పెట్టి ఎవరి మొహాలూ చూడలేక కుటుంబీకులతో కలిసి బయటకు వెళ్లారు వరున్ వాళ్ళు.

తలవంచుకుని బయటకు వెళ్ళింది వరున్ ఇంటి మనుష్యులు మాత్రమే కాదు. వారి గౌరవం కూడా!

****************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దిక్కు మార్చుకున్న గాలి...(కథ)

జాబిల్లీ నువ్వే కావాలి …(కథ)

ఉత్తమ భర్త...(కథ)