ప్రాయిశ్చిత్తం...(కథ)
ప్రాయిశ్చిత్తం (కథ)
తల్లి-తండ్రులు ఒక లక్ష్యం కోసం, సాగుబడి చేసుకుంటున్న పొలాలను అమ్మి అతన్ని విదేశలకు పంపి చదివించారు...కానీ అతను తల్లి-తండ్రుల లక్ష్యాన్ని కాదని, సంపాదనకోసం, ప్రేమ కొసం విదేశలలోనే ఉండిపోవాలనుకుని తల్లి-తండ్రులను కాదని, వారి లక్ష్యాన్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు......కానీ, అతను వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. వచ్చిన తరువాత తల్లి-తండ్రుల గొప్ప లక్ష్యాన్ని అర్ధం చేసుకున్నాడు. చేసిన తప్పుకు ప్రాయిశ్చిత్తంగా ఎవరూ ఊహించని పని చేసాడు.
అతని తల్లి-తండ్రుల లక్ష్యం ఏమిటి? వారిని కాదని విదేశాలకు వెళ్ళి పోయిన అతను ఎందుకు తిరిగి వచ్చాడు? అతను తన తప్పుకు చేసిన ప్రాయిశ్చిత్తం ఏమిటి?.....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి:
****************************************************************************************************
గన్నవరం విమానాశ్రయం
మామూలు హడావిడిలో
ఉంది. చాలా
రోజుల తరువాత
తను బంధువులను, రక్త
సంబంధకులనూ కలుసుకునే
దృశ్యం ఏమోషనల్
సంఘటనలతో అరగేట్రం
అవుతున్నది.
వాళ్ళ లాగానే
లండన్ లో
మెడిసిన్ చదువు
పూర్తి చేసుకుని
తిరిగి వస్తున్న
తమ కొడుకు
ప్రదీప్ కుమార్ కోసం, నట్రాజ్
మూర్తి, విజయమ్మ
కాచుకోనున్నారు.
“ఏమండీ
మన అబ్బాయి
ఇంకా కనబడలేదు” తల్లి
మొహంలో ఆరాటం
విస్తరించి ఉన్నది.
“ఈ
‘ఫ్లైటు’ లోనే
వస్తున్నట్టు ‘ఫోన్’ చేసాడే” నట్రాజ్ మూర్తి
చెప్పిన వెంటనే.
“అమ్మా...నేను
మీ పక్కనే
నిలబడున్నాను. గుర్తు
పట్టలేదా” నవ్వుతూ హాజరయ్యాడు
ప్రదీప్ కుమార్.
“ఏమిట్రా
ఇంత ఘోరంగా
చిక్కిపోయావు…” కళ్ళు తడిసినై
తల్లికి.
ఆమె చెప్పేది
నిజమే. ఇక్కడ
చదువుకునే రోజుల్లో
‘బబ్లి
మాస్’ అని
గేలి చేసేంత
లావుగా ఉండేది
అతని ఒళ్ళు.
ఇప్పుడు వెదురు
బద్దలా ఉన్న
అతన్ని చూస్తున్నప్పుడు
కన్న మనసు
గిలగిలా కొట్టుకోకుండా
ఉంటుందా. ఈ
తల్లి ప్రేమకు
ఈడుగా ప్రపంచంలో
వేరే ఏదీ
లేదు. కరిగిపోయాడు
ప్రదీప్ కుమార్.
“నువ్వు
చేసిపెట్టే భోజనంలాగా
అక్కడ దొరకలేదమ్మా...చదువు
ముగించాలని ఏదో
దొరికింది తింటూ, పళ్ళు
కొరుక్కుంటూ ఉండిపోయాను”
కొడుకు పరిస్థితిని
తల్లి ఊహించుకో
గలిగింది.
ఇంటికి వచ్చిన
తరువాత తల్లి
పెట్టిన భోజనాన్ని
లొట్టలేసుకుంటూ
రుచిని అనుభవిస్తూ
తిన్నాడు అతను.
“ప్రదీప్
నీకు విషయం
తెలుసా? నీ
మావయ్య కూతురు
విద్యాకి బ్యాంకులో
పని దొరికింది.
నీ మావయ్య
మాటి మాటికీ
ఫోను చేస్తూనే
ఉన్నారు”
“అమ్మా!
తరువాత నువ్వు
ఏం చెప్పబోతావో
నాకు తెలుసు.
మరో నాలుగేళ్ళ
వరకు నాకు
పెళ్ళి చేసుకునే
ఉద్దేశ్యమే లేదు!”
“ఏమిట్రా
చెబుతున్నావు...” షాకైన తల్లి
విజయమ్మ అడిగింది.
“సింగపూరులో
ప్రసిద్ది చెందిన
ఆసుపత్రిలో ఉద్యోగం
చేసే అదృష్టం
దొరికింది. ఇంకో
వారం రోజుల్లో
అక్కడికి వెళ్తానమ్మా”
“ఏమిట్రా
ఇలా చెబుతున్నావు.
నాన్నకు తెలిస్తే
మనసు విరిగిపోతారు.
మన ఏరియాలోనే
ఒక ‘క్లీనిక్’ కట్టి
పేదలకు తక్కువ
ఖర్చులో వైద్యం
చేయించాలని చెబుతూ
ఉన్నారు. ఈ
చుట్టు పక్కల
ఒక్క ఆసుపత్రి
కూడా లేదు.
పాము కరిచినా, అగ్ని
ప్రమాదం జరిగినా
యాభై కిలోమీటర్ల
దూరం వెళ్ళాల్సి
ఉంది”
“అమ్మా
ఇక్కడ దొరికే
ఐదూ, పదికా
నేను లండన్
వెళ్ళి మెడిసన్
చదువుకు వచ్చింది.
విదేశాలలో పలు
రెట్లు జీతం
ఎక్కువ. క్లీనిక్, ఆసుపత్రి
పెడితే కొంత
కాలంలోనే కోటీశ్వరులమైపోతాము.
నా నిర్ణయం
నుండి నేను
వెనుకడుగు వేయదలుచుకోలేదు.
నాన్న దగ్గర
నువ్వే చెప్పు...” తన నిర్ణయాన్ని
గట్టిగా చెప్పాడు
అతను.
ఆ రోజు
రాత్రి నిద్రపోవటానికి
అతను కళ్ళు
మూసుకున్నప్పుడల్లా
సాధనా నవ్వుతూ
‘టాటా’ చూపిస్తున్నది.
సింగపూర్
విమానాశ్రయంలో
ప్రదీప్ కుమార్ ను
నవ్వు మొహంతో
స్వాగతించింది
సాధనా. ఆ
దేశ జాతీయులుగా
గ్రీన్ కార్డు
పొందిన తల్లి-తండ్రులతో
జీవిస్తోంది ఆమె.
లండన్ లో
మెడిసిన్ చదువుతున్నప్పుడు
ఇద్దరికీ స్నేహం
మొదలయ్యింది.
“ఏమిటి
ప్రదీప్ మౌనంగా
వస్తున్నావు” ఆంగ్ల భాషలో
మాట్లాడింది సాధనా.
“మనసే
బాగుండలేదు సాధనా.
మా ఊరిని
వదిలి, తల్లి-తండ్రులను
వదిలేసి రావటానికి
నాకు కొంచం
కూడా ఇష్టంలేదు.
నేను ఇక్కడకు
వచ్చిందే నీకోసమే” బొంగురు స్వరంతో
చెప్పాడు.
రోజులు గడిచినై.
ఒకరోజు తండ్రి
దగ్గర నుండి
ఫోను వచ్చింది.
“ప్రదీప్
అమ్మ మనల్ని
వదిలేసి వెళ్ళిపోయింది...” తండ్రి ఏడుపు
మాత్రమే తరువాత
వినిపించింది. ప్రదీప్
కుమార్ కు
కరెంటు షాక్
కొట్టినట్టు ఉన్నది.
“ఏమైంది
నాన్నా...?”
“తోటకు
వెళ్ళినప్పుడు
పాము కరిచిందిరా.
దగ్గరలో ఎక్కడ
వైద్యం చేసే
వసతులు లేవు.
విజయవాడకు తీసుకు
వెడుతున్నప్పుడు
సగం దారిలోనే
ప్రాణం పోయిందిరా...అమ్మ
చివరి కార్యంలోనైనా
పాల్గొనటానికి
నీవల్ల రావటం
కుదురుతుందా?”
“నెక్స్ట్
ఫ్లైట్ లోనే
బయలుదేరి ఊరికి
వస్తా నాన్నా.
నా కొసం
‘వెయిట్’ చేయండి”
బంధువులు, స్నేహితుల
మొహాలను చూడటానికే
సిగ్గేసింది ప్రదీప్
కుమార్ కు.
ఛామన ఛాయగా
ఉండే అమ్మ
రంగు నీలి
రంగులోకి మారిపోయి
ఉంది.
“సాగుబడి
చేసే పొలాలన్నీ
అమ్మి నిన్ను
లండన్ లో
చదివించాను. ఎందుకోతెలుసా? మంచి
ఆసుపత్రి వసతి
లేని ఈ
ఏరియాలో చాలా
మంది ప్రాణాలను
కాపాడగలమనే నమ్మకంతో.
చివరికి కన్నతల్లిని
కాపాడుకోలేక పోయేమే.
కోట్లకొలది డబ్బు
సంపాదించినా నీ
తల్లి ప్రాణానికి
అది సరిసమం
అవుతుందా?”
“నాన్నా
నన్ను క్షమించు
నాన్నా, సంపాదన
ఆశ నా
మనసును చెడిపింది.
ఈ పాపానికి
నాకు క్షమాపణలే
దొరకవు...అందుకని
ప్రాయిశ్చిత్తం
చెయ్యబోతాను” అన్న ప్రదీప్
కుమార్ కాలుతున్న
తల్లి చితి
మంటలోకి తన
‘పాస్
పోర్ట్’ విసిరేసాడు.
అతని విదేశీ వ్యామోహం, ప్రేమ దానితో కలిసి మసిగా మారుతున్నాయి!
**************************************************సమాప్తం****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి