మారండి సార్!...(కథ)
మారండి సార్! (కథ)
ఈ మధ్య పాఠాలు నేర్పించవలసిన
గురువులే తమ దగ్గర చదువుతున్న ఆడపిల్లలపై నీచమైన చేష్టలకు దిగుతున్నారు. ఆడపిల్లను
కన్నవారు పరితపించి పోతున్నారు. ఎక్కడో మారుమూల ఒక ఆడపిల్లపై ఆకతాయి గుంపు
అగాయిత్యం చేసిందని తెలుసుకున్న ఆడపిల్లల తల్లి-తండ్రులు కన్నీరు విడిచారు.
కానీ, ఈ మధ్య స్కూలులో పాఠాలు చెప్పే గురువులే, తమ
క్లాసులలో చదువుతున్న చిన్న చిన్న విధ్యార్ధినులపై అగాయిత్యాలకు పాల్పడ్డారని
తెలుసుకుని, బోరున ఏడ్చారు. ఇంతకంటే ఆడపిల్లలను కన్నవారు ఏం
చేయగలరు.
కంచే చేనును మేస్తే, ఆ కంచెకు(గురువులకు)పాఠాలు ఎవరు నేర్పాలి?.......ఈ సమాజాన్ని కాపాడటానికి, మానవ సంస్కృతిని
కాపాడటానికి, గురువులకే పాఠాలు నేర్పటానికీ...విధ్యార్ధినులే
తిరగబడాలి.
ఎవరికీ భయపడకుండా నీచమైన
గురువులను సంఘానికి చూపాలి. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటూ ఈ కథ రాయబడింది.
ఈ కథలో ఒక విధ్యార్ధిని, తనపై నీచమైన చేష్టకు ప్రయత్నించిన తన గురువుకు ఎలా పాఠం నేర్పిందో చదవండి. అందుకని ఇలాగే నేర్పాలని కాదు...ఎలా నేర్పినా అది సంఘం అమోదిస్తుంది.
***********************************
ఇంటర్ రెండవ
సంవత్సరం
చదువుతున్న
విధ్యార్ధిని
ప్రణవికి, కెమిస్ట్రీ
టీచర్
సర్వానంద్
ను తలుచుకుంటేనే ఒళ్ళంతా
మండిపోతోంది.
అందమైన భార్య, ఎప్పుడూ
చలాకీగా
ఉండే
ఇద్దరు
ఆడపిల్లలు.
పెద్దమ్మాయి
సుభాషిని...పదో
తరగతి.
చిన్నది
సుహాసిని...ఏడో
క్లాసు
చదువుతోంది.
అయినా, మనసు
నిండా
ఆయనకు
వక్రబుద్ది.
ప్రణవితో
స్కూల్
క్లాసు
గదిలో
అనాగరీకంగా
నడుచుకున్న
విధం, నీచానికే
దరిద్రం.
ఆ రోజు
స్కూలు
ఆవరణ
మామూలుకు
వేరుగా
నిశ్శబ్ధంగా
ఉన్నట్టు
అనిపించింది
సర్వానంద్
మాస్టారుకు!
ఏమీ జరగనట్లుగా
క్లాసులో
ముమ్మరంగా
పాఠం
చెప్పటం
మొదలుపెట్టాడు.
ప్రణవి
వైపుకు
చూడనే
లేదు.
“ఎక్స్ క్యూజ్
మి
సార్...”
స్వరం వినబడి
తిరిగి
చూశారు.
అక్కడ
అటెండర్
బాలూ!
“ఏమిటి బాలూ?”
“సార్ ప్రణవిని
‘ప్రిన్సిపల్’ తీసుకు
రమ్మని
చెప్పారు”
“ఎందుకు?”
“తెలియదు సార్?”
ప్రణవి నిదానంగా
లేచి
వచ్చింది.
“నేను వెళ్ళిరానా
సార్?”
“ఊ...” -- మాటలు రాక
ఆమె
ముఖాన్ని
జాలిగా
చూశారు
సర్వానంద్ మాస్టారు. ఆయన
చూపుల్లో
వెయ్యి
బ్రతిమిలాటలు!
పాఠం
చెప్పలేక
దడేల్
మని
కుర్చీలో
కూర్చున్నారు.
పెద్ద కాంతితో
ఆయనలో
ఒక
మెరుపు!
‘ప్రిన్సిపాల్’ రూముకు
పక్కనే
‘స్టోర్’ రూము
ఉంది.
అందులోకి
వెడితే
ప్రినిసిపాల్
రూములో
జరిగేదంతా
వినవచ్చు.
విద్యార్ధులకు రాసే
పని
ఇచ్చేసి, మెల్లగా
'
స్టోర్’ రూము
గదిలోకి
దూరారు.
చెవికి
సాన
పెట్టి
వినడం
మొదలు
పెట్టారు.
ఆయన అనుకున్నది
నిజమే!
ఆయన
గురించే
విచారణ.
“ప్రణవీ...నువ్వు
ఇప్పుడు
చెప్పబోయేదంతా
నేను
రహస్యంగా
ఉంచుతాను.
కానీ, ధైర్యంగా...భయపడకుండా
నిజం
చెప్పాలి...ఏమ్మా!”
“సరే సార్”
“నీ దగ్గర
మగ
టీచర్లు
ఎవరైనా
తప్పుగా
నడుచుకుంటున్నారా?”
“...................”
“భయపడకుండా చెప్పమ్మా...నీ
దగ్గర
ఎవరైనా
హద్దు
మీరి
నడుచుకుంటున్నారా?”
“ఏమిటి సార్, ఇలా
అడుగుతున్నారు? అందులోనూ
నా
దగ్గర
మాత్రం!”
ప్రణవి స్వరంలో
చిన్నగా
ఆదుర్దా.
“ఓ.కే.
ప్రణవి!
నేను
తిన్నగా
విషయానికి
వచ్చేస్తాను.
నాకు
ఈ
స్కూల్
యొక్క
గౌరవం
ముఖ్యం.
దాని
కంటే
విద్యార్ధినుల
బాగోగులు
ముఖ్యం! ఎందుకంటే...ఇది
ఆడపిల్లల
స్కూలు.
ఒక్కొక్క
తల్లి-తండ్రి
మమ్మల్ని
నమ్ముకునే
వాళ్ళ
అమ్మాయలను
పంపిస్తున్నారు.
ఏదైనా
తప్పు
జరిగితే...దానికి
నేనే
ముఖ్య
బాధ్యతుడ్ని!
నిన్న సాయంత్రం
క్లాసు
రూములో
నుండి
నువ్వు
చాలా
అదుర్ధా
పడుతూ
బయటకు
రావడం
మన
‘ప్యూన్’ చూశాడు.
ఏదైనా
సమస్యా...?”
“............”
“ఆ సమయంలో
సర్వానంద్
మాస్టారు క్లాసులో ఉన్నారని
విన్నాను.
ఆయన
ఏదైనా
నీ
దగ్గర
తప్పుగా...?”
‘స్టోర్’ రూము
గదిలో
ఉన్న
సర్వానంద్
మాస్టారు యొక్క
హృదయం
బయటకు
దూకుతున్నట్టు
ఎగిరి
ఎగిరి
పడుతోంది.
“సార్...నిన్న
నేను
నా
మనీ
పర్సును
మర్చిపోయి
పెట్టేసి
వచ్చాసాను...
సర్వానంద్ మాస్టారే
క్లాసు
రూము
తలుపు
తెరిచి
తీసి
ఇచ్చారు.
ఇంటికి
వెళ్ళే
బస్సు
వదిలేస్తానేమో
నన్న
భయంతో
వేగంగా
పరిగెత్తుకు
వచ్చాను.
అంతే
గానీ
ఇంకేం
తప్పు
జరగలేదు
సార్.
సర్వానంద్
మాస్టారును
పోయి
మీరు
అనుమానిస్తున్నారా!
ఆయన...”
“చెప్పమ్మా...ఆయన...?”
“ఆయన...మాకు
తండ్రిలాంటి
ఆయన
సార్...”
అప్పుడే ‘స్టోర్’ రూము
గదిలో
ఉన్న
సర్వానంద్
మాస్టారు “హమ్మయ్యా...” అనుకుంటూ పెద్ద
నిట్టూర్పు
విడిచి
నిటారుగా
నిలబడ్డాడు.
“సారీ అమ్మా...మేము
తప్పుగా
ఊహించుకున్నాం.
ఒక
మంచి
టీచర్ను
అనుమానించాము.
నువ్వు
వెళ్ళొచ్చు”
ప్రణవి మొహాన్ని
తుడుచుకుంటూ
బయటకు
వచ్చింది.
ఎవరూ
లేని
ఆ
వరాండాలో
ఒక
చివరగా
దాక్కుని
నిలబడి, సర్వానంద్
మాస్టారు ప్రణవిని
పిలిచాడు.
“ప్రణవీ...”
“సార్...ఏమిటి
ఇక్కడున్నారు!”
“చాలా ద్యాంక్స్
ప్రణవీ.
నిన్న
ఏం
జరిగిందో
నువ్వు
నిజం
చెప్పుంటే, నా
ఉద్యోగం
పోయేది.
ఆ
తరువాత
నాకు
ఎవరూ
ఉద్యోగమే
ఇవ్వరు. నా
పరువు
కాపాడావు.
నా
కుటుంబాన్ని
కాపాడావు.
దీనికి
నేను
నీ
రుణం
ఎలా
తీర్చుకుంటానో
తెలియటం
లేదు....నేను
నీకు
ఇంటర్నల్లో...”
“ఆపండి...” అంటూ చెయెత్తి
చూపి, గబుక్కున
తలెత్తి
చూసిన
ఆమె
చూపులోని
తీవ్రతలో
ఆయన
మాటలు
ఆగిపోయినై.
ఆమె
కళ్ళలోపల
ఏం
చెప్పాలో
తెలియని
తపన.
“టీచర్ గా
చదువు
చెప్పటం
మీ
కర్తవ్యం, చదువుకునేది
మా
కర్తవ్యం.
చదువుకున్నది
రాసినదానికి
టీచరుగా
మీరు
మార్కులు
వేయటం
మీ
కర్తవ్యం.
కర్తవ్యాలు
పక్కన
పెట్టి
నాకు
మీరు
ఒకే
ఒక
సహాయం
చేయండి
సార్!”
“చెప్పమ్మా...నీకు
ఏం
సహాయం
కావాలో.
ఏదైనా
సరే
చేయటానికి
రెడీగా
ఉన్నాను.
చెప్పు
ప్రణవీ...” -- సర్వానంద్ మాస్టారు కొంత
ఆవేశపడ్డారు.
ప్రణవి ఆయన కళ్ళల్లోకి
తిన్నగా
చూసి
మెల్లగా
-- అదే సమయం
కఠినమైన
స్వరంతో
చెప్పింది.
“ మిమ్మల్ని ఎందుకు మేనేజ్మెంటుకు చూపించలేదో తెలుసా? మీకు భయపడి కాదు. మీకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి జీవితం పాడైపోకూడదనే ఒకే ఒక ఆలొచనతో నేను మీరు నా దగ్గర నడుచుకున్న తీరు గురించి చెప్పలేదు. చెప్పుంటే, మీ ఉద్యోగం పోయే సంగతి గురించి అవతల పెట్టండి. మిమ్మల్ని పోక్సో చట్టం క్రింద ఖైదుచేసి, జైలుకు పంపిస్తారు. అప్పుడు మీ కూతుర్ల పరిస్థితి ఏమిటో ఆలొచించండి. ఏ తప్పు చేయని వాళ్లను ఈ సంఘం ఎలా చూస్తుంది. చీదరించుకుంటుంది. ఆ పరిస్తితి వాళ్ళకు రానివ్వకుడదనే ఉద్దేశంతోనే నేను ప్రిన్సిపల్ దగ్గర అలా చెప్పాను.ఇక మీదటైనా మీరు తండ్రిలాగా నడుచుకోవాలి సార్! నాకు మాత్రమే కాదు...ఇక్కడ చదువుకోవడాని వచ్చే ప్రతి ఆడపిల్లకూ! చేస్తారా సార్...? ప్రామిస్ చేయండి...మీ పిల్లల మీద ప్రామిస్ చేయండి”
పెద్ద లావుపాటి
కర్రతో
ఎవరో
తల
మీద
కొట్టిన
ఒక
నొప్పి
ఆయన
తల
నుండి
శరీరమంతా
పాకింది.
గర్వ పడకుండా
నిలబడి
చెయ్యి
జాపిన
ప్రణవి
చేతిలో
చెయ్యి
వేసి
ప్రామిస్
చేశారు
సర్వానంద్ మాస్టారు.
గంభీరంగా నడిచి వెడుతున్న ప్రణవిని చూసి చలనం కోల్పోయి నిలబడున్నారు 'కెమిస్ట్రీ హీరో' సర్వానంద్ మాస్టారు!
**************************************************సమాప్తం***************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి