తల్లి మనసు...(కథ)

 

                                                                         తల్లి మనసు                                                                                                                                                                    (కథ)

ఇంటి వాకిలి ముందు ఆటో ఒకటి ఆగుంది.

...త్వరగా బయలుదేరండి. మంచి సమయం ముగిసేలోపు వెళ్ళి చేరాలి కదా?”

మనసారా నవ్వుతూ చెప్పిన కోడలు మాట వినబడగానే, టెబుల్ మీదున్న గుడ్డల మూటను తీసుకుని నడుం మీద పెట్టుకుని నేను రెడీ, వెళ్దామా?’ అనే లాగా తన కొడుకు నరేంద్రను చూసింది 60 ఏళ్ళ అన్నపూర్ణమ్మ.

ఏమండీ...మీకు కొంచం కూడా బుద్ది లేదా? వయసైన ఆవిడ బరువు మోస్తున్నది, మీరు వేడుక చూస్తూ నిలబడ్డారే...ఆవిడ దగ్గర్నించి మూటను తీసుకుని ఆటోలో పెట్టచ్చు కదా?”

కేతన దొంగ కోపంతో భర్త మీద కేకలు వేయగా, “మూటను నా దగ్గర ఈయమ్మా అన్న నరేంద్ర, దాన్ని తీసుకుని, వాకిలి వైపుకు నడిచాడు.

మెల్లగా నడిస్తే కోడలు తనని కూడా తిడుతుందనే భయంతో ఆయసపడుతూ వేగ వేగంగా కొడుకును అనుసరించింది అన్నపూర్ణమ్మ.

అమ్మా...నువ్వు ఉండబోయే చోటు ఎలాంటిదో, నీతో పాటూ ఉండబోయే వాళ్ళు ఎలాంటి వారు ఉంటారో మనకెవరికీ తెలియదు. మీ రెండు పేటల గొలుసు, చెవి పోగులు తీసి నా దగ్గర ఇచ్చేయమ్మా

నరేంద్ర తన తల్లిని ఎక్కడికి తీసుకు వెడుతున్నాడు?

*****************************************************************************************************

ఇంటి వాకిలి ముందు ఆటో ఒకటి ఆగుంది.

...త్వరగా బయలుదేరండి. మంచి సమయం ముగిసేలోపు వెళ్ళి చేరాలి కదా?”

మనసారా నవ్వుతూ చెప్పిన కోడలు మాట వినబడగానే, టెబుల్ మీదున్న గుడ్డల మూటను తీసుకుని నడుం మీద పెట్టుకుని నేను రెడీ, వెళ్దామా?’ అనే లాగా తన కొడుకు నరేంద్రను చూసింది 60 ఏళ్ళ అన్నపూర్ణమ్మ.

ఏమండీ...మీకు కొంచం కూడా బుద్ది లేదా? వయసైన ఆవిడ బరువు మోస్తున్నది, మీరు వేడుక చూస్తూ నిలబడ్డారే...ఆవిడ దగ్గర్నించి మూటను తీసుకుని ఆటోలో పెట్టచ్చు కదా?”

కేతన దొంగ కోపంతో భర్త మీద కేకలు వేయగా, “మూటను నా దగ్గర ఈయమ్మా అన్న నరేంద్ర, దాన్ని తీసుకుని, వాకిలి వైపుకు నడిచాడు.

మెల్లగా నడిస్తే కోడలు తనని కూడా తిడుతుందనే భయంతో ఆయసపడుతూ వేగ వేగంగా కొడుకును అనుసరించింది అన్నపూర్ణమ్మ.

ఏమండీ, మూటను మీ దగ్గర పెట్టుకోండి. అత్తయ్యను బాగా కూర్చోనివ్వండి. తరువాత డ్రైవర్ దగ్గర చెప్పి, ఆటోను మెల్లగా నడపమని చెప్పండి. పాపం ఆమె ఒంటికి కుదుపుడు పడదు అన్నది కేతన.

అన్నపూర్ణమ్మ, నరేంద్ర ఆటోలో కూర్చున్నారు. ఆటో డ్రైవర్ తాతారావు బండిని కదిపాడు.

అమ్మా, గుమ్మంలో నిలబడి కేతన మీకు చేతులు ఊపుతోంది చూడండి. సమాధానంగా నువ్వు కూడా టాటా చూపించమ్మా’” కొడుకు నరేంద్ర చెప్పింది చెవిలో వినిపించుకోకుండా అన్నపూర్ణమ్మ విరక్తితో మొహాన్ని వేరు వైపుకు తిప్పుకున్నది. 

ఆటో బయలుదేరింది.

ఎక్కడికి సార్ వెళ్ళాలి!

సుల్తాన్ పూర్...అని చెప్పి, కొంచం నెమ్మదిగానే వెళ్ళండి అన్నాడు నరేంద్ర.

కంగారు పడకండి సార్. నేను జాగ్రత్తగానూ, నెమ్మదిగానూ తోల్తాను. వయసైన తల్లి ఉందే" అన్నాడు, తాతారావు.

పది నిమిషాల ప్రయాణం తరువాత నరేంద్ర సెల్ ఫోన్ మోగింది. తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతలి వైపు అతని భార్య మాట్లాడింది.

ఏమిటి కేతన?”

“........................”

, ...సరే. అడుగుతాను. నేను చూసుకుంటాను

..........................”

...సరే...అడుగుతాను. నేను చూసుకుంటాను

............................”

అదంతా ఏమీ ఉండదు. ఇచ్చేస్తుంది. నేను అడిగి తీసుకుని జాగ్రత్తగా తీసుకు వస్తాను

...........................”

సరే, పెట్టేయి

భార్యతో మాట్లాడి ముగించి, సెల్ ఫోనును చొక్కా జేబులో పడేసుకుని, పక్కకు తిరిగి, తన తల్లిని చూసాడు.

అమ్మా...నువ్వు ఉండబోయే చోటు ఎలాంటిదో, నీతో పాటూ ఉండబోయే వాళ్ళు ఎలాంటి వారు ఉంటారో మనకెవరికీ తెలియదు. ఎందుకైనా మంచిది మనం హెచ్చరికగానూ...జాగ్రత్తగానూ ఉండటం మంచిదే కదా!

అంతే కాదు. మీరు నగలు వేసుకుంటే, నెలకు కట్టించుకునే ఫీజు ఎక్కువ అడగటానికి ఛాన్స్ ఉంది. అందువలన నీ కోడలు కేతననే తెలివితేటలతో సలహా ఇచ్చింది. మీ రెండు పేటల గొలుసు, చెవి పోగులు తీసి నా దగ్గర ఇచ్చేయమ్మా

నరేంద్ర చెబుతున్నప్పుడే, అన్నపూర్ణమ్మ చెవికున్న పోగులను తీయడం మొదలుపెట్టింది.

తల్లి నగలను ఇచ్చేంత వరకూ నరేంద్ర ఎక్కడో చూస్తున్నట్టు ఆటోలో నుండి బయటకు చూస్తున్నాడు.

ఇదిగో నాయనా...వీటిని జాగ్రత్తగా ఉంచుకుని, నీ ఉత్తమ భార్య దగ్గర ఇచ్చేయి

నరేంద్ర నగలను తీసుకున్న వెంటనే, “అంతా నీ మంచికేనమ్మా!అన్నాడు.

ఆటో శ్రీనివాస్ మహాల్ సినిమా హాలు రోడ్డులో నుండి గాంధీ బొమ్మ దాటింది. అక్కడ కుడిచేతి వైపు తిరగాల్సిన ఆటో అటు తిరగకుండా తిన్నగా వెడుతుంటే నరేంద్ర కంగారు పడ్డాడు.

ఏమయ్యా డ్రైవరూ, సుల్తాన్ పూర్ కి కుడివైపు కదా వెళ్లాలి. తిన్నగా ఎక్కడికి వెళుతున్నావు...?”

కోపగించుకోకండి సార్. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంది. అక్కడ నాకు రెండు నిమిషాల పనుంది. అందుకే...

ఏమిటీ...మీ ఇంట్లో పనుందా...ఇది ముందే చెప్పుండచ్చు కదా...కొంచం కూడా మర్యాద తెలియని మనిషిలాగా ఉన్నావే...

తప్పే సార్. ఇదిగో వీధే అన్న తాతారావు, రోడ్డు నుండి ఎడమవైపుకు తిరిగి ఒక వీధిలోకి వెళ్లాడు. అదే వీధిలో కొంచం దూరం వెళ్ళి రేకుల వేసున్న ఒక చిన్న ఇంటి ముందు ఆగాడు.

సార్...ఆటోలోనే కూర్చోండి. ఇప్పుడే వచ్చేస్తాను

వేగ వేగంగా దిగి ఇంటి తలుపులను తోసి లోపలకు వెళ్ళాడు.

అతను వెళ్ళటాన్ని విసుగుతో చూసిన నరేంద్ర అసలు నాగరీకమే తెలియని వ్యక్తిఅంటూ మనసులోనే తిట్టుకున్నాడు.

ఒంటరిగా తనతో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని తల్లి ఏదైనా మాట్లాడుతుందేమో నని ఎదురు చూసాడు నరేంద్ర. కానీ అతనికి నిరాశే మిగిలింది. ఏమీ మాట్లాడ కుండా, విరక్తితో ఎక్కడో చూస్తున్నట్టు చూస్తూ మౌనంగానే కూర్చోనుంది అన్నపూర్ణమ్మ.

ఒంటరితనం ఇప్పుడు నరేంద్రను ఆలోచింప చేసింది.

తల్లా...పెళ్ళామా అని కుటుంబంలో సమస్య తల ఎత్తితే అందరూ ఇలాగే కదా నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కన్న వారిని వృద్దాశ్రమంలో చేర్చే అలవాటు సహజంగా అయిపోయిన సమాజంలో నేనూ అదే కదా చేస్తున్నాను? ఇది తప్ప ఇంకేం చేయగలను?’

నరేంద్ర తనకు తానే ఆలోచించి, తను చేస్తున్న పనిని న్యాయపరుచుకున్నాడు.

ఎదురింటి తలుపులు తెరుచుకుంటున్న శబ్ధం వినబడింది.

డ్రైవర్ తాతారావు ముందు రాగా, అతని వెనుక అతని భార్య, తరువాత అతని ఇద్దరు ఆడపిల్లలూ అంటూ కుటుంబమే అతని వెనుక వచ్చింది.

దగ్గరకు వచ్చిన వెంటనే సార్...నేను మీతోనూ, మీ అమ్మ దగ్గర కొంచం మాట్లాడాలి అన్నాడు తాతారావు.

ఏమిటీ మాతో మాట్లాడాలా...ఎందుకు?” అర్ధం కాక అడిగాడు నరేంద్ర.

అన్నపూర్ణమ్మ కూడా ఆశ్చర్యపడి చూపులనూ, ఏకాగ్రతనూ తాతారావు వైపు తిప్పింది. 

ఆటోలో నుండి దిగి మా ఇంటికి వస్తే కొంచం సేపు అందరం కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవచ్చు! భవ్యంగా చెప్పాడు తాతారావు.

ఏమిటీ...నీ ఇంట్లోకా? ఏమిటయ్యా నువ్వు గొడవ చేసే మనిషిలాగా ఉన్నావు. అలాగంతా కుదరదు. నీలో ఏదో ఒక సమస్య ఉందని తెలుస్తోంది. రాగలిగితే రా. లేకపోతే చెప్పు, వేరే ఆటో మాట్లాడుకుని వెళ్తాం కోపంగా చెప్పాడు నరేంద్ర.

సరే నండీ...సార్. కోపగించుకోకండి. నేను తిన్నగా విషయానికే వస్తాను.   సార్...మీరు చదువుకున్న వారు. ఏదైనా సులభంగా అర్ధం చేసుకుంటారు. అందువల్ల చెబుతున్నాను. నా దురదృష్టం, నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళ తోడు అవసరమని మా కుటుంబమే ఆశపడుతోంది సార్. నేను తల్లి ప్రేమను పొందనే లేదు. అందువలన  మీరు మమ్మల్ని అర్ధం చేసుకుని, మీరు వృద్దాశ్రమంలో చేర్చాలనుకుంటున్న మీ అమ్మగారిని మా దగ్గరే వదిలి వెళ్ళండి సార్. మేము ఆమెకు లోటూ లేకుండా దేవతలాగా ఉంచుకుని చూసుకుంటాము

నరేంద్ర కు షాక్కొట్టినట్టు అయ్యింది. అతన్నే చూసాడు.

ఈమె కొసం మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. దేవుడి దయవలన నాకు  డబ్బు కొరత లేదు. సొంతంగా మూడు ఆటోలు ఉన్నాయి. రెండు ఆటోలను అద్దెకు తిప్పుతున్నాను. ఎండలో ఉండే వాడికే నీడ యొక్క గొప్పతనం తెలుస్తుందని చెబుతారు. తల్లి ప్రేమే లేకుండా పెరిగిన నాకు మీరు పెద్ద  మనసుతో...

ఆపవయ్యా. వదిల్తే మాట్లాడుతూ వెళుతున్నావు...నువ్వు, నీ కుటుంబమూ ఆశపడితే నేను మా అమ్మను నీ దగ్గర వదిలి వెళ్ళాలనే నిర్భంధం లేదు. తెలుసా...?

నీకు అవసరమైతే ఎక్కడైనా ఆనాధ ఆశ్రమంలోనో...వృద్దాశ్రమంలోనో ఉన్నవాళ్ళను పిలుచుకు వచ్చి, ఇంట్లో కూర్చోబెట్టుకో. ప్రయాణానికి వచ్చిన వాళ్ల దగ్గర ఇలా అనాగరీకంగా నడుచుకోవటం నీకు తప్పు అనిపించటం లేదా? అమ్మా...దిగమ్మా. వీడూ వద్దూ, వీడి ఆటోనూ వద్దు

చెప్పిన వేగంతోనే కిందకు దిగిన నరేంద్ర. అమ్మకు చేయూతనిచ్చి దింపాడు.

గుడ్డలు మూటను తీసి అమ్మ చేతికి ఇచ్చి, “రామ్మా, వేరే ఆటోలో వెళ్దాం అంటూ తొందర తొందరగా నడిచాడు.

గుడ్డల మూటను నడుం మీద పెట్టుకుని అతని వెనుక నడిచింది అన్నపూర్ణమ్మ. కానీ, కొడుకు కోపంతో నడుస్తున్న వేగానికి ఈమె పోటీ పడలేక దూరంలో వెనుక  పడింది.

తాతారావు కుటుంబం పిచ్చి పట్టినట్టు రోడ్డు మీద నిలబడ్డారు.

హు...న్యాయంగా ఆశపడ్డాము. అదృష్టంలేదు. ఏం చేయగలం బాధ పడుతూ చెప్పాడు తాతారావు.

నాన్నా...అక్కడ చూడు. ఆటోలో వచ్చిన బామ్మగారు నిన్ను పిలుస్తున్నారు

తాతారావు పెద్ద కూతురు కవిత చెప్పగా...అందరూ ఆమె చూపిన వైపు చూడ... అన్నపూర్ణమ్మ గారు తాతారావుని రమ్మని చెప్పి రా...రాఅని చెయ్యి ఊపి పిలుస్తున్నారు.

కొడుకు చూడకూడదనే భయంలో...తిరిగి, తిరిగి ముందు నరేంద్ర వెళ్ళటాన్ని చూస్తోంది.

తాతారావు వేగంగా పరిగెత్తుకు వెళ్ళి ఆవిడ ముందు నిలబడ్డాడు.

ఆతురతతో ...ఏంటమ్మా చెప్పండి?” అన్నాడు.

సుల్తాన్ పూర్ లోని కస్తూరీభాయ్ వృద్దాశ్రమం తెలుసుకదా? అక్కడే నన్ను చేర్చబోతాడు నా కొడుకు. నీకు సమయం దొరికినప్పుడల్లా నీ కుటుంబంతో కలిసొచ్చి నన్ను చూసెళ్ళు. నీకు తల్లి ప్రేమ దొరుకుతుంది. వెళ్ళిరానా బాబూ. నా కొడుకు చాలా కోపిష్టి. చూస్తే అరుస్తాడు నేను వస్తాను...”  

తొందర తొందరగా మాటలనూ, దాంతోపాటూ మనసును పారపోసి ఆయసపడుతూ పరిగెత్తినట్టు నడిచింది అన్నపూర్ణమ్మ.  

*****************************************************సమాప్తం*************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)

వెన్నెల…కథ