నొప్పి…(కథ)

 

                                                                                        నొప్పి                                                                                                                                                                           (కథ)

మనసుకు బాధ కలిగినప్పుడు గుండెకు కలిగిన గాయం నొప్పి అనుబవించే మనసుకు తప్ప మరేవరికి అర్థం కాదు.

"వాడికి నువ్వంటే ఇప్పటికీ ఇష్టమే. నాకూ నిన్ను కోడలుగా చేసుకోవాలనే ఆశ వచ్చిందమ్మా. ఇంతకాలం మీరిద్దరూ విడిపోయి కష్ట పడినదంతా చాలమ్మా. ఇక మీదటైనా మీరిద్దరూ ఒకటిగా కలిసి జీవించాలమ్మా. నీకు ఇందులో .కే.నే కదా?”--పూర్తి నమ్మకంతో భువనాను అడిగింది పారిజాతం.

అమ్మా నన్ను క్షమించండి. మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవటం నాకు ఇష్టం లేదు” -- భువనా చెప్పగానే తల్లీ-కొడుకు లిద్దరూ ఆశ్చర్యపోయారు.

నువ్వు నన్ను ప్రేమించింది అబద్దమేనా భువనా?” -- ఆకాష్ అడిగాడు.

లేదు ఆకాష్. నా ప్రేమ అబద్దం కాదు. అందువలనే నేను మిమ్మల్ని పెళ్ళి  చేసుకోవటం కుదరలేదు. నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. భావన నా మనసు విడిచి పోలేదు. కానీ..."---అంటూ భువనా వాళ్ళకు ఏం చెప్పింది, ఎందుకు చెప్పింది, తరువాత ఏం జరిగింది? తెలుసుకోవటానికి కథను చదవండి.

****************************************************************************************************

భువనా...--చాలా రోజుల తరువాత విన్న స్వరంతో చటుక్కున వెనక్కి తిరిగింది, ఆమె.

పిలిచింది -- ఆకాష్, భువనా యొక్క మాజీ ప్రేమికుడు.

ఎలా ఉన్నవు భువనా?” -- ఆకాష్ అడగ -- ఆమె సమాధానం చెప్పకుండా తలను ఊపింది.

ఏమిటి భువనా, జవబే చెప్పనంటున్నావు?”

నా గురించి ఇతరులు మాట్లాడింది విని చాలా గాయపడ్డాను. అందుకనే ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదు -- భువనా చెప్పింది విని ఒక్క క్షణం మనసులో బాధ పడ్డాడు.

నేనూ నీ పరిస్థితిలోనే ఉన్నాను, భువనా. నిన్ను ఎలాగైనా కలుసుకోవాలని రెండు సంవత్సరాలూ ఎంత తపించేనో తెలుసా? నీ పాత అడ్రెస్సుకు వెళ్ళి విచారించినప్పుడు, నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయేవని చెప్పారు. నీతో మనసు విప్పి మాట్లాడాలి భువనా-- ఆకాష్ చెప్పగా -- ఆమె విసుగ్గా అడిగింది. 

నా దగ్గర మాట్లాడటానికి ఏముంది?”

అన్నీ మర్చిపోయావా భువనా?”

మరిచిపోవటమా? ఎలా మరిచిపోయేది ఆకాష్. మన మిద్దరం ప్రేమించుకోవటం, మీరే  లోకమనుకుని మీ కొసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్దపడింది, మీ అమ్మ నన్ను అనాధ అని చెప్పి అవమాన పరిచింది -- నన్ను కోడలుగా నిరాకరించటమూ, మీరు నన్ను, నా ప్రేమనూ ఈజీగా తీసుకుని, డబ్బు గల అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం ఇవన్నీ మర్చిపోగలనా , మరిచిపోలేదు. గడిచిపోయిన కాలం యొక్క చేదు అనుభవాలు నా మనసులో ఏర్పరచిన గాయాలు ఇప్పుడు కూడా నొప్పి పెడుతూనే ఉన్నాయి -- భువనా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

నీకు నేను చేసిన ద్రోహానికే దేవుడు నన్ను సరైన రీతిలో శిక్చించాడు, భువనా. నాకు  పెళ్ళి జరిగిందనే వరకే నీకు తెలుసు. తరువాత ఏమిటేమిటో జరిగిపోయింది, భువనా.  నా భార్యకూ, మా అమ్మకూ మాటి మాటికీ గొడవ వచ్చింది. సరే అది వదిలేయ్. అత్తా-కోడళ్ల గొడవ ఇంట్లో లేదు చెప్పు. సరేనని సరిపుచ్చుకున్నాను. కానీ, మా నాన్నతో  కూడా గొడవ పడటం మొదలు పెట్టింది. మా నాన్నను రోజూ అవమాన పరిచేది. దాని వలన నాకూ, నా భార్యకూ రోజూ గొడవే. ఇద్దరం కలిసి జీవించలేము అనే పరిస్థితుల్లో మేము విడాకులు తీసుకున్నాం. ఇదంతా మాకు పెళ్లైన మూడు నెలలకే జరిగింది -- ఆకాష్ చెప్పగా, అతనికొసం జాలి పడిన భువనా వెను తిరిగి వెళ్ళిపోయింది.

లోపలకు రావచ్చా అమ్మా?” -- వాకిట్లో గొంతు వినబడ, లోపల నుండి వచ్చిన భువనా ఒక్క క్షణం తటపటాయించి, తరువాత మామూలుగా వాళ్ళను ఆహ్వానించింది.

రండమ్మా...రండి ఆకాష్ -- భువనా స్వాగతించ -- ఇద్దరూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు.

నువ్వూ కూర్చోమ్మా -- ఆకాష్ తల్లి పారిజాతం, భువనా చెయ్యి పుచ్చుకుని తన పక్కన  కూర్చోబెట్టుకుంది.

భువనా...నేను గుణం కంటే, డబ్బే ముఖ్యమనుకుని రమ్యాను నా కొడుక్కు ఇచ్చి పెళ్ళి చేశాను. అది ఎంత పెద్ద తప్పో నాకు తరువాత అర్ధమయ్యిందమ్మా...జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే ఎవరికి లాభం? నేను ఇప్పుడు వచ్చిందే నీ దగ్గర ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికే.

నా కొడుక్కి రెండో పెళ్ళి చెయ్యాలనే నిర్ణయంలో ఉన్నాను. వాడికి నువ్వంటే ఇప్పటికీ ఇష్టమే. నాకూ నిన్ను కోడలుగా చేసుకోవాలనే ఆశ వచ్చిందమ్మా. ఇంతకాలం మీరిద్దరూ విడిపోయి కష్ట పడినదంతా చాలమ్మా. ఇక మీదటైనా మీరిద్దరూ ఒకటిగా కలిసి జీవించాలమ్మా. నీకు ఇందులో .కే.నే కదా?”--పూర్తి నమ్మకంతో అడిగింది పారిజాతం.

అమ్మా నన్ను క్షమించండి. మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవటం నాకు ఇష్టం లేదు -- భువనా చెప్పగానే తల్లీ-కొడుకు లిద్దరూ ఆశ్చర్యపోయారు.

భువనా...నేను రోజు కోపంతో మాట్లాడిందాన్ని మనసులో పెట్టుకునే కదా పెళ్ళికి  ఒప్పుకోనంటున్నావు?” పారిజాతం ఏడవలేదు గాని, ఏడ్చినంత గా బ్రతిమిలాడింది.

రోజు మీరు నన్ను కోడలుగా అంగీకరించపోవటానికి కారణం నేను అనాధఅనేగా? ఇప్పుడు కూడా నేను ఇంకా అదే స్థితిలోనే ఉన్నాను. ఇప్పుడు కూడా నాకు మీ ఇంటి కోడలు అయ్యే అర్హత లేదే... -- భువనా చెప్పగా పారిజాతం జవాబు చెప్పలేక తడుముకుంది.

అయితే నువ్వు నన్ను ప్రేమించింది అబద్దమేనా భువనా?” -- ఆకాష్ అడిగాడు.

లేదు ఆకాష్. నా ప్రేమ అబద్దం కాదు. అందువలనే నేను మిమ్మల్ని పెళ్ళి  చేసుకోవటం కుదరలేదు. నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. భావన నా మనసు విడిచి పోలేదు. కానీ, మీరు ఆస్తిగల అమ్మాయి వచ్చిన వెంటనే మన ప్రేమను దూరంగా పారేశారు. మీ ప్రేమే అబద్దమైనది. రోజు మీ భార్య విడాకులు తీసుకుని వెళ్ళిపోవటం వలన మీకు మళ్ళీ నా జ్ఞాపకం వచ్చింది.

ప్రేమను ఒకరి మీద నుండి మరొకరి మీదకు మార్చుకోగలిగే మీ ఊసరవెల్లి గుణం, నేను మీ మీద పెట్టుకున్న మర్యాదను తగ్గించేసింది. మీరు నాకు చేసిన ద్రోహం నా మనసు నుండి పోలేదు. మదిలో అది ఏర్పరచిన గాయం, నొప్పి నన్ను వేధిస్తూనే ఉంది. నేనెలా మిమ్మల్ని పెళ్ళిచేసుకుని, వేధిస్తున్న, నొప్పి పుడుతున్న మనసుతో సహజంగా కాపురం చేయగలను? దాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని నేను పెళ్ళిచేసుకుంటే, అదే అబద్దమైన జీవితంగా ఉంటుంది -- భువనా ఖచ్చితంగా చెప్పటంతో, ఇద్దరూ బయటకు వచ్చారు.

ఆకాష్... భువనా ఇలా చెబుతుందని నేను ఎదురు చూడలేదురా... -- పారిజాతం ఆవేధనతో చెప్పింది.

నేను కూడా ఎదురుచూడలేదమ్మా? కానీ అమ్మా, ఆమె చెప్పేదీ న్యాయమే కదమ్మా. ఆమెకు ద్రొహం చేసిన నాతో ఆమె ఎలా సంతోషంగా జీవించగలదు? ఇక నా జీవితంలో పెళ్ళి అనే మాటకు చోటు లేదమ్మా. ఒక మంచి మనసును గాయపరచిన పాపానికి -- జీవితాంతం ఒంటరిగా నిలబడటమే నాకు శిక్ష అమ్మా. లేకపోతే నొప్పి నన్ను వదలి వెళ్లనే వెళ్లదమ్మా. ప్రేమించిన పిల్లను ఎన్ని కష్టాలొచ్చినా విడిచిపెట్టకూడదని నన్ను చూసి మిగతా వారు పాఠం నేర్చుకోవాలమ్మా---- ఆకాష్ చెప్పగా, పారిజాతం మనసు  కూడా నొప్పి పుట్టటం మొదలుపెట్టింది. చేతులారా నా కొడుకు జీవితమే కాకుండా ఒక అమాయక అనాధ పిల్ల జీవితం కూడా పాడుచేసేనే --అని.  

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)