పోస్ట్‌లు

ఏప్రిల్ 30, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

జెంటిల్ మ్యాన్...(కథ)

                                                                                      జెంటిల్ మ్యాన్                                                                                                                                                             (కథ) నందిని ఆ రోజు చాలా అదుర్దాగా ఉంది. కారణం. ఆ రోజు ఆమె పనిచేస్తున్న ఆఫీసు బాధ్యతను స్వీకరించడానికి కొత్త ఎం.డి రాబోతున్నారు. ఆమె ఆదుర్దాకు అదొక్కటే కారణం కాదు. ఆ కొత్తగా వస్తున్న ఏం.డి పేరు సత్య ప్రకాష్   అని ఉండటం కూడా ఒక కారణం. " వచ్చేది...అతనై ఉంటాడా ?" అని అనుకున్న వెంటనే ఆమెలో వణుకు పుట్టింది. నందినికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ వ్యాపార సంస్థలో "మేనేజర్" ఉద్యోగం.   మామగారూ , అత్తగారూ అనే ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్న జీతాలతో ఆ ఇల్లు హాయిగానే గడుస్తోంది. సరిగ్గా సమయం ఉదయం 10.30. తలుపు వేగంగా తెరుచుకుంది. లోపలకు వచ్చాడు కొత్త ఎం. డి. అతను అదే సత్య ప్రకాష్! నందిని గుండే వేగంగా కొట్టుకుంటోంది. ఆఫీసులో అందరినీ పరిచయం చేస్తున్నాడు మెనేజర్. “

జీవిత సత్యం...(కథ)

                                                                                జీవిత సత్యం                                                                                                                                                                       (కథ) తన స్నేహితుని కారు మెకానిక్ షెడ్డులోకి వెళ్ళాడు ఆనంద్ . అక్కడ చాలాకార్లు రిపేర్ల కోసం నిలబడున్నాయి . కారు ముందు భాగాన్ని తెరిచి , కారుకు కింద పడుకుని పనివాళ్ళు పని చేస్తున్నారు ... వాళ్ళను దాటుకుంటూ లోపలున్న ఆఫీసు గదిలోకి వెళ్ళాడు . " రా రా ఆనంద్ ... ఏమిటి మావైపు గాలి తిరిగింది ? ఆశ్చర్యంగా ఉందే ?" " ఇక్కడ మాధాపూర్ లో మా మావయ్య ఇంట్లో విశేషానికి వచ్చాను .  అప్పుడు నువ్వు జ్ఞాపకం వచ్చావు . సరే నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాను . ఎలా ఉన్నావు ? బిజినస్ బాగా జరుగుతోందనుకుంటా " " అవునురా . పని పూర్తి చేసి చెప్పిన టైములో ' డెలివరీ ’ ఇవ్వలేకపోతున్నా . అందుకని కొత్తగా చాలా మందిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను ... తరువాత ఇంకేమిటి విషయాలు " ఆనంద్